Update 092

“అంటే….నేను బాగుండాలని ఎందుకనుకుంటున్నావు….రాత్రి నేను సంతోషంగా ఉండాలని నా కోరిక ఎందుకు తీర్చావు….మా కాలంలో అంటె అబ్బాయి అమ్మాయిల మధ్య పెళ్ళికి ముందు సెక్స్ చాలా సహజంగా జరుగుతుంది….కానీ మీ కాలంలో పెళ్ళికి ముందే సెక్స్ చేయడం చాలా పెద్ద తప్పుగా భావిస్తారు….అలాంటిది నా గురించి అంత పెద్ద స్టెప్ తీసుకుని నన్నెందుకు హ్యాపీగా ఉంచావు,” అనడిగాడు రాము.
“నేను నిన్ను భర్తగా మనసారా అనుకుంటున్నాను….ఉన్న ఒక్కరోజైనా నీ భార్యగా గడపాలనుకున్నాను…అందుకే తప్పని తెలిసినా రాత్రి నీతో పడుకుని నీ కోరిక తీర్చాను….ఇప్పుడు నాకు ఏమైనా ఫరవాలేదు….కాని నీకు మాత్రం ఏం కాకూడని అనుకుంటున్నాను…” అన్నది రేణుక.
“మరి నువ్వు నన్ను భర్త అనుకుంటున్నప్పుడు….ఏ భర్త అయినా తన భార్య చిత్రహింసలు పడటం….ఇంకొ మగాడి చేతిలో రేప్ కాబడటం చూస్తూ ఊరుకుంటాడా,” అనడిగాడు రాము.

రాము అలా అడిగే సరికి రేణుకకి ఏం చెప్పాలో తెలియక రాము కళ్లల్లో కనిపిస్తున్న తన మీద ప్రేమ చూసేసరికి తన కళ్ళల్లో కూడా నీళ్ళు తిరుగుతుండగా లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపింది.
రాము వెంటనే రేణుకని గట్టిగా కౌగిలించుకుని ఆమె భుజం మీద తల పెట్టి, “ఇంకెప్పుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళకు….బ్రతికితే ఇద్దరం కలిసి బ్రతుకుదాం….లేకపోతే ఇద్దరం కలిసే ఆ ప్రెతాత్మ చేతిలో చనిపోదాం….సరెనా,” అన్నాడు.
రేణుక కూడా రాముని గట్టిగా వాటేసుకుని అతని వీపు మీద నిమురుతూ, “అలాగే రాము….ఇక నుండి నీకు చెప్పకుండా ఎక్కడికీ వెళ్ళను…..ఏ పనీ చేయను….I Love You Ramu,” అన్నది.
రాము వెంటనే తల ఎత్తి రేణుక కళ్ళల్లోకి చూస్తూ, “ఈ మాట నీకు ఎప్పుడో చెబుదామనుకున్నాను…కాని నాకన్నా యాబై ఏళ్ళ పెద్దావిడకి చెబితే బాగుండదేమో అని ఆలోచిస్తున్నాను,” అంటూ ఆమె వైపు చూసి నవ్వాడు.

రాము అలా తనను యాభై ఏళ్ళ పెద్దావిడ అనేసరికి తన మొహంలో లేని కోపాన్ని తెచ్చుకుని, “రాము….నిన్ను….ఇలా కాదు…” అంటూ చుట్టు చూసి కింద ఉన్న చిన్న కర్ర తీసుకుని రాముని కొట్టడానికి పరిగెత్తింది.
రాము కూడా రేణుక వైపు చిలిపిగా నవ్వుతూ ఆమెకు అందకుండా పరిగెత్తుతూ ఆటపట్టిస్తున్నాడు.
అలా కొద్దిసేపు పరిగెత్తిన తరువాత రేణుక అలిసిపోయి నిల్చుండి పోయింది.
అది చూసి రాము ఆమె దగ్గరకు వచ్చి కౌగిలించుకుని, “I Love You Too Renu….కాలం మనల్ని విడదీసే దాకా నేను నిన్ను వదిలిపెట్టే పోను….నువ్వు ఇలా సరదాగా….సంతోషంగా ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది….దాంతో నాకు వెంటనే ఏం చెయ్యాలా అన్న ఆలోచనలు వస్తాయి,” అన్నాడు.
దాంతో ఇద్దరూ మాట్లాడుకుంటూ కారు దగ్గరకు వెళ్ళారు.
రాము కారు దగ్గరకు వెళ్ళి డోర్ తీసి, “రాణి గారు కూర్చుంటె ఇక బయలుదేరుదాము,” అంటూ వినయంగా నిలబడ్డాడు.​
Next page: Update 093
Previous page: Update 091