Update 093

రాము అలా నిలబడటం చూసి రేణుక నవ్వుతూ అతని దగ్గరకు వచ్చి కౌగిలించుకుని ముద్దు పెట్టుకుని కారులో కూర్చున్నది.
రాము కూడా డ్రైవింగ్ సీట్లో కూర్చుని కారు స్టార్ చేసి షాపూర్ దర్గా వైపు పోనిచ్చాడు.
కాని అప్పటిదాకా ఫాదర్ ప్రేయర్ చేస్తుండటంతో ఏమాత్రం ఇబ్బంది లేకుండా జరిగిన వాళ్ళ ప్రయాణం….ఫాదర్ మరణించాడని, తమ కోసం సునీత (సుందర్ ప్రేతాత్మ) వస్తుందని తెలియని వాళ్ళు నవ్వుకుంటూ ప్రయాణం కొనసాగిస్తున్నారు.
***********
అలా ఒక గంట అడవిలో ప్రయాణం చేసిన తరువాత రోడ్డు పక్కన ఒక రాయి మీద షాపుర్ దర్గా 1 K.M అని రాసి కింద ఎటు వైపు వెళ్లాలో బాణం గుర్తు ఉండటం రాము గమనించి కారు ఆపాడు.
ఆ బాణం గుర్తు ప్రకారం మెయిన్ రోడ్డు మీద నుండి కిలో మీటర్ లోపలికి వెళ్ళాలి.

దాంతో రాము కారు లాక్ చేసి, “రేణూ….ఇక్కడ నుండి కారు లోపలికి వెళ్ళదు….కాబట్టి మనం ఒక కిలో మీటరు దాకా నడుచుకుంటూ దర్గాకు వెళ్ళాలి…” అన్నాడు.
రేణుక కూడా కారు దిగి రాము దగ్గరకు వచ్చి అతని చేయి పట్టుకుని నడుస్తున్నది.
రాము కూడా రేణుక చేయి పట్టుకుని అడవిలో దర్గా వైపు నడుస్తున్నాడు.
కాని అప్పటికే వాళ్ళకంటే ముందే సునీత (సుందర్ ప్రేతాత్మ) చేరుకుని చెట్టు పైనుండి రాము, రేణుక రావడం చూసి చెట్టు పైనుండి కిందకు నడుస్తూ దిగింది.
వాళ్ళిద్దరూ దర్గా వైపు వెళ్తుండటం చూసి సునీత (సుందర్ ప్రేతాత్మ) ఒక చెట్టు మీద నుండి ఇంకో చెట్టు మీదకు ఎగురుతూ రాము, రేణుకని ఫాలో చేస్తున్నది.
అలా కొద్దిదూరం వెళ్లగానే సునీత (సుందర్ ప్రేతాత్మ) ఒక చెట్టుని పట్టుకుని వాళ్ళిద్దరి వైపు కోపంగా చూస్తున్నది.

రాము, రేణుక అడవిలో కొద్దిదూరం నడిచిన తరువాత చెట్ల మధ్యలో కొంచెం దూరంలో ఒక దర్గా కనిపించడంతో ఆనందంతో ఒక్క క్షణం ఆగారు.
దర్గాను చూడగానే వాళ్ళిద్దరి మొహాలు ఆనందంతో వెలిగిపోయాయి.
వాళ్ళిద్దరి మొహాల్లో ఆనందం చూడగానే సునీత (సుందర్ ప్రేతాత్మ) కోపంతో వాళ్ళు చూస్తున్న వైపు చూసింది.
అక్కడ కొద్ది దూరంలో సునీత (సుందర్ ప్రేతాత్మ) కి దర్గా కనిపించడంతో వాళ్ళ ఆలోచన అర్ధమై ఇంకా రెట్టించిన కోపంతో తన పక్కనే ఉన్న చెట్టు వైపు చూసింది.
ఆ చెట్టుకు ఉన్న కొమ్మ ఒకటి విరిగి రాము వైపు గాల్లొ తేలుతూ వేగంగా వాళ్ల వైపుకి వస్తున్నది.
అప్పటికే రాము ఏదో శబ్దం అవుతుందని గ్రహించి వెనక్కి తిరిగి చూసే సరికి ఒక చెట్టు కొమ్మ తన మీదకు రావడం గమనించి వెంటనే రేణుకను దూరంగా తోసి ఆ కొమ్మ నుండి తప్పించుకోవడానికి పక్కకు దూకాడు.
ఆ చెట్టు కొమ్మ అలాగే ఎగురుకుంటూ వెళ్ళి కొద్దిదూరంలో కింద పడిపోయింది.​
Next page: Update 094
Previous page: Update 092