Update 096

సునీత (సుందర్ ప్రేతాత్మ) తన చేతిలో ఉన్న రేణుకని వదిలి ఆ దైవ శక్తిని ఎదిరించలేక గట్టిగా కేకలు పెడుతూ అక్కడ నుండి ఎవరో గట్టిగా విసిరేసినట్టు దూరంగా ఉన్న చెట్టుకు వెళ్ళి గుద్దుకుని అలాగే కిందపడి పోయింది.
అది చూసిన రాము, రేణుక సునీత (సుందర్ ప్రేతాత్మ) ని విసిరేసిన వైపు అలాగే చూస్తుండిపోయారు.
వాళ్ళిద్దరి గుండెలు ఇంకా భయంతో వేగంగా కొట్టుకుంటూనే ఉన్నాయి.
అంతలో వాళ్ళిద్దరికీ దర్గాలో నుండి, “లోపలికి రండి,” అని తమను పిలవడంతో లోపలికి తిరిగి చూసారు.
రాము, రేణుక ఇద్దరూ దర్గాలోపలికి వెళ్ళి తమను ఎవరు పిలిచారా అని వెళ్ళి అక్కడ కూర్చున్న అతని వైపు చూసారు.

అతను తల తిప్పి రాము వైపు చూసి నవ్వుతూ, “నేను చెప్పా కదా….ఇది నీ వల్లే అవుతుందని…..ఇప్పుడు చూసావా….నేను చెప్పినట్టు జరిగింది,” అన్నాడు.
అతన్ని చూసిన రాము ఒక్కసారిగా కొయ్యబారిపోయాడు….ఒక్క క్షణం అసలు ఏం జరుగుతుందో రాముకి అర్ధం కాలేదు.
తన కళ్లముందు కనిపించిన సూఫీ బాబాను అలాగే చూస్తుండిపోయాడు.
ఆ సూఫీ బాబా ఎవరో కాదు తను దాబా దగ్గర డబ్బులు ఇవ్వాలనుకున్నాయనే, తాను విల్లాలో ఉన్నప్పుడు అగ్గిపెట్టె నెపంతో బయటకు తీసుకుకొచ్చి దెయ్యం ఉన్నది అని చెప్పిన అతను…..అంతే కాక తను ఈ కాలంలోకి రావడానికి కారణం అయిన తన కాలంలో తనను కలిసిన బాబా…..ఇప్పుడూ ఈ కాలంలో తనకెదురుగా కనిపించేసరికి అలాగే నోట మాట రాక చూస్తుండిపోయాడు.
రాము అలా తన వైపు ఆశ్చర్యంతో చూస్తుండిపోయే సరికి ఆ సూఫీ బాగా నవ్వుతూ రాము దగ్గరకు వచ్చి చిన్నగా కదిపాడు.
రాము వెంటనే తేరుకుని ఆ సూఫీ బాబా వైపు చూసి, “మీరా….మీరా ఈ దర్గాలొ ఉండే సూఫీ బాబా,” అనడిగాడు.
ఆ మాట వినగానే సూఫీ బాబా చిన్నగా నవ్వుతూ రాము వైపు చూసి, “ఇక్కడ జనాలు అందరూ నన్ను సూఫీ బాబా అంటారు,” అంటూ తన ఎత్తి పైకి ఆకాశంలోకి చూస్తూ, “కానీ నేను మాత్రం ఆ పైవాడి బానిసను,” అన్నాడు.

రాము సూఫీ బాబా వైపు చూసి అతను బాగా తెలిసున్నట్టు అడగడంతో రేణుక రాము వైపు వైపు చూసి, “నీకు ఈ బాబా ముందే తెలుసా….” అనడిగింది.
సూఫీ బాబా తను కూర్చున్న చోట నుండి లేస్తూ, “తెలుసా కాదు….మా ఇద్దరికి ఇంతకు ముందే పరిచయం ఉన్నది…రాము నన్ను యాభై ఏళ్ళకు ముందు కలిసాడు….అతను నీ బాధను అనుభవిస్తూ….నిన్ను ఈ ప్రేతాత్మ బారినుండి రక్షించడానికి ఆ కాలం నుండి ఈ కాలానికి వచ్చాడు,” అంటూ తన చేతిలో ఉన్న చీపురుతో అక్కడ నేల మీద ఉన్న ఆకులను మట్టిని చిమ్ముతున్నాడు.
అంతకు ముందు రాము తనకు ఈ విషయం చాలా సార్లు చెప్పినా నమ్మలేదు….ఇప్పుడు సూఫీ బాబా కూడా చెప్పడంతో ఆశ్చర్యంతో రాము వైపు చూసింది.
సూఫీ బాబా చిమ్ముతూ, “ఆ పైవాడు నాకు జరుగుతున్న, జరగబోతున్న కాలాన్ని చూసే శక్తి ఇచ్చాడు….కాని ఆయన నాకు తను కర్తవ్య నిర్వహణలో వేలు పెట్టొద్దని నన్ను ఆదేశించారు…కాకపోతే ఆయన ఒక్క విషయం మనకు మేలు చేసారు…అదేంటంటే ఆయన ఈ అమ్మాయి వేస్తున్న కేకల్లో బాధని గమనించాడు…అందుకనే ఆయన నన్ను నీతో కలిసేలా చేసాడు….ఆయనే నిన్ను ఈమెకు రక్షకుడిగా ఈ కాలానికి వచ్చేలా చేసాడు….” అన్నాడు.

రాము, రేణుక ఇద్దరూ ఆ సూఫీ బాబా చెప్పే మాటలు వింటూ ఆయన దగ్గరకు మెల్లగా నడుచుకుంటూ వచ్చారు.
రేణుక సూఫీ బాబా వైపు చూసి, “కాని….మనం జరగబోయేది ఆపగలిగే శక్తి మన దగ్గర ఉన్నదా….భవిష్యత్తుని మార్చగలమా,” అనడిగింది.
ఆ మాటకు సూఫీ బాబా చిన్నగా నవ్వుతూ, “ఆ పైవాడు తలుచుకుంటే ప్రతి ఒక్కటీ సాధ్యమే…ఆయన చేయాలని సంకల్పించుకుంటే ఆయనకు ఏదీ అడ్డు కాదు….కాని యుధ్ధం జరగకుండా ఏదీ మనకు దక్కదు….ప్రొఫెసర్ ప్రేతాత్మని తప్పకుండా నాశనం చేయాల్సిందే, “ అంటూ వాళ్ళ దగ్గరకు వచ్చి ఇద్దరిని చూస్తూ, “ఆ ప్రేతాత్మ రేణుకతో కలిసిపోయింది….” అంటూ రేణుక వైపు చూస్తూ, “ఇప్పటికీ రేణుక ప్రొఫెసర్ సుందర్ రక్తాన్ని మెళ్ళో వేసుకుని తిరుగుతున్నది…” అన్నాడు.
రేణుక అర్ధం కానట్టు సూఫీ బాబా వైపు చూసి, “ఏం మీరు చెప్పేది….నాకు అర్ధం కాలేదు….” అన్నది.
దాంతో సూఫీ బాబా తన బొటన వేలిని రేణుక నుదురు మీద పెట్టి ఆమెకు ప్రొఫెసర్ తనని రేప్ చేయడానికి ట్రై చేసినట్టుడు సంఘటనను కళ్ళ ముందు కదిలేలా చేసాడు.

అప్పుడు రేణుక క్యాండిల్ స్టాండ్ తీసుకుని ప్రొఫెసర్ తల మీద కొట్టినప్పుడు రక్తం కారుతున్న తలతో తన మీద పడినప్పుడు అతన్ని భయంతో కిందకు తోసేసింది.
ప్రొఫెసర్ రక్త రేణుక మెడమీద, ఆమె మెళ్ళో ఉన్న లాకెట్ మీద పడిపోయింది.
ఒంటి మీద పడిన రక్తం మరకలను రేణుక స్నానం చేసి పోగొట్టుకున్నది….కాని లాకెట్ మీద పడిన రక్తం మరకలను రేణుక పట్టించుకోలేదు.
సూఫీ బాబా రేణుక మెళ్ళోని ఆ లాకెట్ తీసుకుని దాని మీద ఉన్న రక్తం మరకలను చూపిస్తూ, “అతని రక్తం ఇప్పుడు కూడా నీ లాకెట్ మీద అలాగే ఉన్నది….దాంతో ఈ లాకెట్ కారణంగానే ఆ ప్రేతాత్మ నీతో కలిసిఉన్నాడు….” అన్నాడు.
“ఒక వేళ మనం ఈ లాకెట్ ని పారేస్తే….” లాకెట్ వైపు చూస్తూ అడిగాడు రాము.

“దాని వల్ల ఏమీ ఉపయోగం లేదు…..ఈ లాకెట్ రేణుక, దాని మీద ఉన్న రక్తం సుందర్…..దాంతో ఇద్దరూ ఒకరితో ఒకరు కలిసిపోయి ఉన్నారు….మనం వాళ్ళిద్దరిని విడదీయాలి,” అన్నాడు సూఫీ బాబా.
“కాని ఎలా…..” అనడిగింది రేణుక.
సూఫీ బాబా తన చేతిలో ఉన్న లాకెట్ రేణుక చేతిలో పెడుతూ, “ఇక్కడ నుండి ఒక మైలు దూరంలో ఒక ఊరు ఉన్నది…కొన్ని ఏళ్ళ క్రితం జనాలు అందరూ అక్కడ నుండి వెళ్ళిపోవడంతో ఖాళీగా ఉన్నది….ఆ ఊరి చివరలో ఒక గుడిలో బావి ఉన్నది…దాన్ని ఎన్నో వందల ఏళ్ళ క్రితం ఒక మహా ముని ఆ బావిని నిర్మించాడు….ఇప్పటి వరకు చాలా మంది ఆ బావి లోతుని కనుక్కోవడానికి చాలా ప్రయత్నించారు….కాని ఒక్కళ్ళు కూడా ఆ బావి లోతుని కనుక్కోలేకపోయారు….దాని మహత్యం ఏంటంటే…ఏదైనా సరే ఆ బావిలో పడిందంటే…అది చేరవలసిన చోటకు చేరిపోతుంది….ఈ ప్రొఫెసర్ ప్రేతాత్మని కూడా అది చేరవలసిన చోటకు పంపించాల్సిందే….” అన్నాడు.
అంతా విన్న రాము, “కానీ బాబా….ఇదంతా ఎలా జరుగుతుంది….” అన్నాడు.​
Next page: Update 097
Previous page: Update 095