Update 097
సూఫీ బాబా వాళ్ళిద్దరి వైపు చూసి, “ఈ లోకంలో ఒక శరీరం ఐదు తత్వాలతో తయారయి ఉంటుంది…అవి మట్టి, అగ్ని, వాయువు, నీళ్ళు, ఆత్మతో నిండి ఉంటుంది….” అన్నాడు.
ఆయన చెప్పింది వినగానే రాముకి అర్ధం అయినట్టు, “అవును….వీటిని పంచభూతాలు అంటారు,” అన్నాడు.
“నీళ్ళు అనేవి మీకు ఆ బావిలో దొరుకుతాయి,” అంటూ సూఫీ బాబా ఒక చిన్న సంచిని రాము చేతికి ఇచ్చి, “ఇది దర్గా యొక్క పవిత్రమైన మట్టి,” అంటూ ఒక దీపాన్ని కూడా రాముకి ఇస్తూ, “ఇక ఇది అగ్ని….దీన్ని వెలిగించండి….వీటన్నింటిని బావిలో వేసిన తరువాత రేణుక మెళ్ళోని లాకెట్ ని కూడా బావిలో పడేయండి…దాంతో ఆ ప్రేతాత్మ చేరవలసిన చోటకు వెళ్ళిపోతుంది….ఇక తరువాత మీకు ఇబ్బంది అనేది ఉండదు….ఆ ప్రేతాత్మ ఈ లోకాన్ని వదిలి శాశ్వతంగా పైలోకాలకు వెళ్లిపోతుంది….ఇప్పుడు ఆ ప్రేతాత్మ ఈ దర్గా లోకి మాత్రం రాలేదు….” అంటూ రేణుక దగ్గరకు వచ్చి ఆమెతో, “కాని మీ ఇద్దరూ ఎప్పుడైతే ఈ దర్గా నుండి బయట కాలు పెడతారో అది రేణుకను ఇబ్బంది పెట్టడానికి తప్పకుండా ప్రయత్నిస్తుంది….ఆ ప్రేతాత్మకి నిన్ను అంత సులభంగా వదిలివెళ్ళదు….నువ్వు కూడా అంత తేలిగ్గా ఆ ప్రేతాత్మను వదిలించుకోలేవు…” అంటూ తన జేబు లోనుండి ఒక చిన్న గాజు సీసాని తీసి అందులో ఉన్న నీళ్లను మంత్రించి రేణుక చేతికి ఇస్తూ, “ఈ సీసా తీసుకో….ఇందులో ఉన్న దర్గా లో ఉన్న బావిలో ఉండే పవిత్ర జలం….ఈ జలం ఆ ప్రేతాత్మ మీద చల్లితే దాన్ని నాశనం చేయలేదు….కాని కొద్దిసేపటి వరకు ఆ ప్రేతాత్మ మీ జోలికి రాకుండా మాత్రం ఆపుతుంది…ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ ఇద్దరూ ఇక్కడ నుండి బయలుదేరి ఆ బావి దగ్గరకు వెళ్ళండి,” అన్నాడు.
వాళ్ళిద్దరూ సూఫీ బాబా ఇచ్చిన వస్తువులను జాగ్రత్తగా ఒక సంచిలో పెట్టుకుని ఆయనకు నమస్కారం చేసి దర్గా నుండి బయలుదేరారు.
అలా కొద్దిసేపు నడిచిన తరువాత వాళ్ళకు ఒక ఊరు కనిపించింది.
ఇద్దరూ ఆ ఊర్లోకి వెళ్ళి ఊరి చివరన ఉన్న గుడిలోకి వెళ్ళారు….ఎన్నో ఏళ్ళ నుండి ఎవరూ అక్కడ పూజలు చేయకపోవడంతో ఆ గుడి పాడుబడిపోయి అంతా చీకటిగా ఉన్నది.
ఆ చీకటిలో రాము అక్కడ మూలగా పడి ఉన్న లాంతరు తీసుకుని వెలిగించి దాని వెలుగులో ఇద్దరూ గుడి లోపలికి వెళ్ళి చిన్నగా బావి దగ్గరకు వెళ్తున్నారు.
అంతా నిశబ్దంగా ఉండటంతో చుట్టూ కీచురాళ్ళు అరుపులు వినిపిస్తున్నాయి…..సూది మొన కింద పడినా పెద్దగా శబ్దం అయ్యేంత నిశబ్దంగా ఉన్నది.
అలా ఆ లాంతరు వెలుగులో నడుచుకుంటూ వెళ్ళిన వాళ్ళకు కొద్దిదూరంలో బావి కనబడింది.
చూడటానికి అది కూడా ఎవరూ వాడకపోవడంతో పాడుబడిపోయి, చుట్టూ చెట్ల ఆకులతో, చాలా భయం కలిగించేలా ఉన్నది.
రేణుక తన చేత్తో రాము చేతిని గట్టిగా పట్టుకుని చుట్టూ భయంగా చూస్తూ అతన్ని వదలకుండా రాముతో బాటే నడుస్తున్నది.
రాముకి కూడా ఒక వైపు భయంగా ఉన్నా కూడా ధైర్యాన్ని కూడగట్టుకుని రేణుక చేయి పట్టుకుని లాంతరు వెలుగులో ఎదురుగా కనిపిస్తున్న బావి వైపు నడుస్తున్నాడు.
వాళ్ళకు మనసులో ఎటువైపు నుండి సుందర్ ప్రేతాత్మ దాడి చేస్తుందో అని ఒక్కో అడుగు జాగ్రత్తగా వేస్తున్నారు.
కాని సుందర్ ప్రేతాత్మ జాడ కనిపించకపోవడంతో ఇద్దరూ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటూ బావి దగ్గరకు చేరుకున్నారు.
రాము తన చేతిలో ఉన్న లాంతరను బావి గట్టు మీద పెట్టి లోపలికి తొంగి చూసాడు.
లోపల నీళ్ళలో ఆకాశంలో చందమామ స్పష్టంగా కనిపిస్తున్నది.
రేణుక ఏం చేద్దామన్నట్టు రాము వైపు చూసింది.
రాము సూఫీ బాబా ఇచ్చిన దర్గా మట్టి ఉన్న సంచి, గాజు దీపాన్ని తన కోటు జేబుల్లో నుండి తీసి బావి గట్టు మీద పెట్టాడు.
రేణుక మాత్రం ఏ చిన్న శబ్దం అయినా ఉలిక్కిపడుతూ ఆ శబ్దం అయిన వైపు భయంగా చూస్తున్నది.
రాము రేణుక చేతికి దర్గా మట్టి ఉన్న సంచి ఇచ్చి, “దీనిలో ఉన్న మట్టిని బావిలో కలుపు,” అన్నాడు.
రేణుక సరే అంటూ ఆ సంచిని తన చేతిలోకి తీసుకుని దానికి ఉన్న ముడిని విప్పి అందులో ఉన్న మట్టిని తన చేతిలోకి పోసుకుని బావిలో పోసేసింది.
తరువాత రాము పక్కనే ఉన్న గాజు దీపాన్ని తీసుకుని లాంతరులో వెలుగుతున్న మంటలో దాన్ని వెలిగించి ఆ దీపాన్ని కూడా బావిలో వెయ్యమన్నట్టు రేణుకకి ఇచ్చాడు.
రేణుక దాన్ని చేతిలోకి తీసుకుని ఆ గాజు దీపాన్ని కూడా బావిలో వదిలేసింది.
రాము : ఇక ఆ లాకెట్ ని కూడా బావిలో వేసెయ్ రేణు….ఇక ఆ సుందర్ ప్రేతాత్మ ప్రాబ్లం తీరిపోయిద్ది….
రేణుక ఇక తన మెళ్ళో ఉన్న లాకెట్ తీసి బావిలో వేయడానికి తన చేతులను మెడ వెనుక వేసి లాకెట్ ఉన్న చైన్ హుక్ ని తీస్తున్నది.
అలా రేణుక తన మెళ్ళో ఉన్న లాకెట్ చైన్ హుక్ తీస్తుండగా వాళ్ళిద్దరూ ఊహించని విధంగా సుందర్ ప్రేతాత్మ బావిలోనుండి పైకి లేచి వాళ్ళీద్దరి ఎదురుగా గాల్లో నిల్చుని గట్టిగా అరిచింది.
దాంతో వాళ్ళిద్దరూ భయంతో నాలుగడుగులు వెనక్కు వేసి కింద పడ్డారు…..ఇద్దరి మొహాల్లో భయం చాలా స్పష్టంగా కనిపిస్తున్నది.
సుందర్ ప్రేతాత్మ గాల్లో ఎగురుకుంటూ బావి లోనుండి బయటకు వచ్చి కింద పడిన రేణుకను గాల్లోకి లేపి ఆమె కాలు పట్టుకున్నది.
కింద పడిన రాముకి రేణుక గాల్లోకి లేచినట్టు కనిపిస్తున్నది….కాని సుందర్ ప్రేతాత్మ మాత్రం కనిపించడం లేదు.
రేణుక తన కాలుని సుందర్ ప్రేతాత్మ పట్టుకున్నట్టు తెలియడంతో రెండో కాలుతో సుందర్ ప్రేతాత్మ తనకు కనిపించకపోయినా తన కాలుని పట్టుకున్నాడు అనిపించిన చోట కొడుతున్నది.
కాని సుందర్ ప్రేతాత్మకి రేణుక కొట్టే దెబ్బలు ఏమీ తగలడం లేదు.