Update 102
“అప్పుడే డౌట్ వచ్చింది బాబా…కాని రేణుకని ఎలాగైనా ఈ బాధ నుండి బయట పడేయాలన్న ఆత్రంతో…మీరు ఏది చెబితే అది చేసుకుంటూ వెళ్ళాను…ఇప్పుడు ప్రాబ్లమ్స్ తీరిపోయాయి కదా…మనసు ప్రశాంతంగా ఉన్నది,” అన్నాడు రాము.
“ఇందులో పెద్ద రహస్యం ఏమీ లేదు రాము….మోహిని రాజుల కాలం నాటి ఆత్మ….తరువాత తరాల వారు ఈ సమస్య మోహిని వల్ల వస్తుందని గమనించి ఒక దైవ భక్తుడి సహాయంతో ఆ మోహినిని బంధించి ఒక చోట పాతిపెట్టారు…. సాధారణంగా ఒక మనిషి పిలిస్తే ఎలా మనకు వినిపిస్తుందో….ఒక ప్రేతాత్మ కేకలు ఇంకో ప్రేతాత్మకు వినిపిస్తాయి… దాంతో సుందర్ చనిపోయిన తరువాత గాల్లో తిరుగుతుండగా ఈ మోహిని అరుపులు వినిపించడంతో….సుందర్ ఒక మనిషిని ఆవహించి మోహినిని బంధవిముక్తి కలిగించాడు….దాంతో మొహిని సుందర్ కి హెల్ప్ చేసి అతన్ని ఇంకా శక్తి వంతుడుని చేసింది….తరువాత నీ చేతుల్లో అంతమైపోయింది…మనసులో ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయా,” అనడిగాడు బాబా.
“బాబా…నేను ఇక నా కాలానికి వెళ్లలేనా….మా అమ్మా, నాన్నా…..ఎలా….” అంటున్న రాముకి మాట్లాడటానికి మాటలు రావడం లేదు.
రాము పడుతున్న బాధ చూసి బాబా అతని దగ్గరకు వచ్చి చిన్నగా భుజం మీద తడుతూ, “బాధ పడకు రాము….నువ్వు నీ కాలానికి తప్పకుండా వెళ్తావు….కాని అది ఎప్పుడు, ఎలా అనేది కాలమే నిర్ణయిస్తుంది….నువ్వు ఈ కాలంలోకి వస్తావని నువ్వు అనుకోలేదు కదా….అలాగే నువ్వు టైం వచ్చినప్పుడు నీ కాలానికి వెళ్ళి అందరినీ కలుస్తావు….అప్పటి దాకా రేణుకను పెళ్ళి చేసుకుని సంతోషంగా ఉండు,” అన్నాడు.
దాంతో రాము సరె అన్నట్టు తల ఊపాడు.
రేణుక రాము దగ్గరకు వచ్చి అతని చేతిని గట్టిగా పట్టుకుని భుజం మీద తల పెట్టి హాయిగా కళ్ళు మూసుకున్నది.
ఇప్పుడు రేణుక మొహంలో భయం కాని, ఆందోళన కాని లేవు….ఆమె మొహం చాలా ప్రశాంతంగా, సంతోషంగా ఉన్నది.
రాము తనకు తోడుగా ఉన్నాడన్న ధ్యైర్యం రేణుక మొహంలో కనిపిస్తున్నది.
రాము రేణుక వైపు చూసి ఆమె నుదురు మీద ముద్దు పెట్టుకున్నాడు.
దాంతో రేణుక కళ్ళు తెరిచి రాము వైపు చూసి నవ్వింది.
“ఇక ఇంటికి వెళ్దామా,” అన్నాడు రాము.
రేణుక సరె అన్నట్టు తల ఊపింది…..ఇద్దరూ కలిసి సూఫీ బాబా కాళ్లకు ప్రణామం చేసి అతని ఆశీస్సులు అందుకుని అక్కడ నుండి బయలుదేరబోయారు.
కానీ సూఫీ బాబా, “రాము….ఒక్క విషయం….” అంటూ వాళ్లను ఆపాడు.
దాంతో వాళ్ళిద్దరూ వెనక్కు తిరిగి సూఫీ బాబా వైపు ఏంటి అన్నట్టు చూసారు.
సూఫీ బాబా చిన్నగా నవ్వుతూ రాము దగ్గరకు వచ్చి, “మీ ఇద్దరికీ ఇంతలా సహాయం చేసిన ఆమెను తీసుకెళ్లకుండా వెళ్తున్నారేంటి,” అన్నాడు.