Update 104

సునీత : నాకు బాగానే ఉన్నది రాము….ఏం ఫరవాలేదు…మీ ఇద్దరే చాలా అలసిపోయారు….ఇద్దరూ వెనక కూర్చుని రెస్ట్ తీసుకోండి…నేను డ్రైవ్ చేస్తాను….
దాంతో రాము ఇక కాదనలేక డ్రైవింగ్ సీట్ లోనుండి లేచి వెనక సీట్లో కూర్చున్నాడు.
రేణుక కూడా వెనక్కు వెళ్ళి కూర్చోబోయి సునీత వైపు చూసి వెళ్లనా అన్నట్టు ఆగిపోయింది.
అది చూసి సునీత నవ్వుతూ, “నీ మొగుడి దగ్గరకు వెళ్ళడానికి నా పర్మిషన్ ఎందుకు….వెళ్ళు,” అన్నది.
దాంతో రేణుక ఆనందంగా, “చాలా థాంక్స్ సునీత….నువ్వు ఎంత మంచిదానివో,” అంటూ వెనక సీట్లో రాము పక్కనే కూర్చుని బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టి భుజం మీద తల పెట్టి పడుకున్నది.

సునీత వెనక్కు తిరిగి వాళ్ళిద్దరి వైపు చూసి, “కాని పెళ్ళి అయ్యేంతవరకు మొన్న తొందరపడ్డట్టు తొందరపడకండి….సరెనా,” అన్నది.
సునీత అలా అనగానే రాము, రేణుక ఇద్దరూ సిగ్గుతో తల దించుకున్నారు.
సునీత వాళ్ళిద్దరి వైపు చూసి చిన్నగా నవ్వి కారు స్టార్ట్ చేసి వాళ్ళ ఒబరాయ్ విల్లా వైపు పోనిచ్చింది.
అలా వాళ్ళు సాయంత్రానికి ఒబెరాయ్ విల్లాకు చెరుకున్నారు.
సునీత కారు దిగి డ్రైవర్ ని పిలిచి సూట్ కేస్ లు లోపల పెట్టమని రేణుక వైపు తిరిగి, “రేణుక….నేను కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాను,” అని డ్రైవర్ రాగానే అతని వైపు చూసి, “రేణుక వాళ్ళ నాన్నకు తొందరగా తిరిగి రమ్మని టెలిగ్రామ్ ఇవ్వు,” అని లోపలికి వెళ్ళింది.

దాంతో డ్రైవర్ సరె అని తల ఊపి పోస్టాఫీస్ కి వెళ్ళిపోయాడు.
రేణుక కారు దిగి లోపలికి వెళ్తూ రాము ఇంకా కారు దిగకపోవడంతో వెనక్కు తిరిగి అతని వైపు చూస్తూ…
రేణుక : ఏంటి రాము….లోపలికి రా….
రాము : లోపలికా….ఎందుకు….
రేణుక రాము దగ్గరకు వచ్చి అతని పక్కనే కూర్చుంటూ….
రేణుక : మరి ఎక్కడకు వెళ్తావు….మళ్ళీ హోటల్ లో ఉంటావా….
రాము : అంతే కదా….మరి పెళ్ళి అవకుండా నేను నీతో ఒంటరిగా ఒకే ఇంట్లో ఉండొచ్చా….
అంతలో డ్రైవర్ వచ్చి కారులో ఉన్న సూట్ కేస్ లు తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు.

రేణుక : అంత పద్దతులు ఆలోచించేవాడివి….మరి పెళ్ళికి ముందే శోభనం జరిగిపోయింది కదా….
రాము : ఏదో బలహీనమైన క్షణంలో జరిగిపోయింది….అయినా ఇంత అందంగా ఉండి….నాలాంటి బలహీనమైన వాడిని రెచ్చగొడితే ఎలా అనుకున్నావు….
రేణుక : నేను అంత అందంగా ఏమీ ఉండను…..నువ్వు ఊరకే పొగడకు….
రాము : నువ్వు అందంగా ఉండవా….ఎవరు చెప్పారు…ఇంత అందంగా ఉన్నావు కాబట్టే ఆ సుందర్ గాడు చచ్చినా వదలకుండా నిన్ను పట్టుకున్నాడు…..​
Next page: Update 105
Previous page: Update 103