Update 108

రాము : కాని మా ఇద్దరికీ ఇంత వరకు పెళ్ళి కాలేదు కదా…..
రేణుక : అయినా….ఇదంతా నీ ఆస్థి రాము….నీకు నచ్చినట్టు చెయ్యి….అందుకు నా పర్మిషన్ అక్కర్లేదు.
రేణుక ఒప్పుకోవడంతో రాము ఆనందంగా సాయంత్రానికి మనుషుల్ని పిలిపించి గుడి బాగు చేయడానికి తమ మేనేజర్ కి కావలసిన డబ్బులు ఇచ్చి పంపించాడు.
అంతలో రేణుక వాళ్ళ నాన్న ట్రంకాల్ చేసి మాట్లాడటంతో సునీత విషయం చెప్పి వీలైనంత తొందరగా రమ్మని చెప్పింది.
వాళ్ళు కూడా వెంటనే బయలుదేరుతామని చెప్పి ఫోన్ పెట్టేసారు.

రాము : రేణూ….నేను కూడా వెళ్ళి దగ్గరుండి పని చేయిస్తాను….
రేణుక : నువ్వు ఎందుకు రాము….మన మేనేజర్ దగ్గర ఉండి చేయిస్తాడు కదా….మొత్తం పని పూర్తి అయిన తరువాత మనందరం షాపూర్ వెళ్ళి పూజ చేయించుకుని వద్దాం….
రాము : అది కాదు రేణు….ఇప్పటికే మనం పెళ్ళికి ముందే తప్పు చేసాం…అందుకని పెళ్ళి అయ్యేంత వరకు మళ్ళీ ఆ తప్పు జరక్కుండా ఉండాలి…..నువ్వు ఎదురుగా ఉంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను….
సునీత : నువ్వు చెప్పించి నిజమే రాము….కాని రెండు రోజుల్లో రేణుక వాళ్ల అమ్మా, నాన్న వస్తారు....వాళ్ళకి కూడా తమకు కాబోయే అల్లుడిని చూడాలని ఉంటుంది కదా….అందుకని వాళ్ళు వచ్చిన తరువాత పెళ్ళి డేట్ ఫిక్స్ చేసిన తరువాత దాన్ని బట్టి వెళ్దువు గాని….
సునీత చెప్పింది కూడా బాగుండటంతో రాము కూడా అలాగే అన్నట్టు తల ఊపాడు.

రాము ఉండటానికి ఒప్పుకోవడంతో రేణుక ఆనందపడిపోయింది.
అలా చూస్తుండగానే రెండు రోజులు గడిచిపోయాయి.
రేణుక వాళ్ళ అమ్మా నాన్న ఢిల్లో నుండి వచ్చారు….రేణుక ఆనందగా వాళ్లకు ఎదురువెళ్ళి వాళ్ళ అమ్మను, నాన్నను ప్రేమతో కౌగిలించుకుని పలకరించింది.
తరువాత అందరు ఫ్రెష్ అయ్యాక రేణుక అమ్మా, నాన్నని కూర్చోబెట్టి సునీత అంతకు ముందు జరిగింది మొత్తం ప్రొఫెసర్ సుందర్ గురించి, అతను చనిపోయిన తరువాత ప్రేతాత్మ అయ్యి రేణుకని ఎంత హింసించింది, రాము తన ప్రాణాలకు తెగించి ఎలా కాపాడిందీ మొత్తం వివరంగా చెప్పింది.

అంతా విన్న వాళ్ళిద్దరూ రాము తమ కూతురికి అంత హెల్ప్ చేసినందుకు చాలా సంతోషపడ్డారు.
కాని వాళ్ళు మొత్తం చెప్పింది విన్న తరువాత రేణుక వాళ్ళ నాన్న ఈశ్వర్ కుమార్ ఆలోచనలో పడ్డారు.
ఆయన ఆలోచిస్తుండటం చూసి సునీత అతని వైపు చూసి….
సునీత : ఏంటి….ఆలోచిస్తున్నారు….
ఈశ్వర్ కుమార్ : అది కాదు సునీత….మీరు ఇద్దరూ రాము ఈ కాలం వాడు కాడని అన్నారు….ఇదెలా సాధ్యం…
సునీత : మేము మొదట నమ్మలేదు….కాని పరిస్థితులు….అన్ని ఫేస్ చేసిన దాన్ని బట్టి నమ్మక తప్పలేదు…​
Next page: Update 109
Previous page: Update 107