Update 109

ఈశ్వర్ కుమార్ : రాము…..నా కూతురుని రక్షించాడు….కాని…అతను ఈ కాలం నాటి వాడైతే ఆనందంగా నా కూతురు రేణుకని ఇచ్చి పెళ్ళి చేసేవాడిని….కాని మీరు చెప్పిన దాని ప్రకారం రాము ఈ కాలం నాటి వాడు కాదంటున్నారు… మరి నా కూతురిని ఎలా అతనికి ఇచ్చి పెళ్ళి చేయాలి…..
సునీత : మీరు చెప్పింది కరెక్టే….కాని…..
ఈశ్వర్ కుమార్ : కాని….ఏంటి….మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సునీతా….
సునీత : కాని….పరిస్థితి మన చేయి దాటి పోయింది సార్…..
ఈశ్వర్ కుమార్ : ఏమయింది….వివరంగా చెప్పండి……
సునీత : అదీ….అదీ….వాళ్ళిద్దరూ పెళ్ళికి ముందే తొందరపడ్డారు…..
ఆమాట వినగానే రేణుక వాళ్ల నాన్న తన కూతురి వైపు ఏం చేసావో తెలుసా అన్నట్టు చూసాడు.

తన తండ్రి చూపులను తట్టుకోలేక రేణుక తల వంచుకుని ఆయన ఏమంటాడా అన్నట్టు టెన్షన్ తో చూస్తున్నది.
సునీత : అవును సార్….నేను విషయం తెలుసుకునేలోపే తప్పు జరిగిపోయింది….ఇప్పుడు రేణుకని రాముకి ఇచ్చి పెళ్ళి చేయాల్సిందే…..
ఈశ్వర్ కుమార్ : కాని….రాము ఈ కాలంలో ఎంత వరకు ఉంటాడో తెలియదు కదా…..అలాంటప్పుడు….ఎలా….
అంటుండగా ఆయన నోటి నుండి ఇక మాట రావడం లేదు.
ఆయన ఆ మాట అనగానే సునీతకు కూడా ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు.
దాంతో సునీత కూడా ఏమీ మాట్లాడకుండా మెదలకుండా నిల్చున్నది.
తన తండ్రి బాధ పడటం చూసి రేణుక చిన్నగా సోఫాలో నుంది లేచి ఆయన పక్కనే కూర్చుని ఆయన చేతులను పట్టుకున్నది.

ఈశ్వర్ కుమార్ తల తిప్పి తన కూతురు మొహం లోకి చూసాడు.
ఆయన మొహంలో ఎందుకిలా చేసావన్న భావం రేణుకకు కొట్టొచ్చినట్టు కనిపించింది.
రేణుక : నాన్నా….రామునే లేకపోతే ఇప్పటికి నేను చనిపోయి ఉండేదాన్ని నాన్నా…
ఈశ్వర్ కుమార్ : అంటె….రాము నిన్ను రక్షించాడని పెళ్ళి చేసుకుంటున్నావా….
రేణుక : లేదు నాన్నా….ఇంతకు ముందే రాము అంటే ఇష్టపడ్డాను….కాకపోతే అంతలో ఈ సుందర్ ప్రాబ్లం వచ్చింది…
ఈశ్వర్ కుమార్ : కాని…..రాము ఈ కాలం వాడు కాదని నువ్వే చెప్పావు కదా….ఎంతకాలం ఉంటాడో….ఎప్పుడు ఎలా తన కాలంలోకి వెళ్తాడో తెలియని వాడితో నీ పెళ్ళి అంటే…..
రేణుక : నాకు ఒక్క రోజు రాము భార్యగా ఉన్నా చాలు నాన్నా…..
ఈశ్వర్ కుమార్ : చూస్తూ….చూస్తూ….ఏ తండ్రీ…తన కూతురిని కష్టాల్లోకి వెళ్తానంటే చూస్తూ ఊరుకోడమ్మా….
రేణుక : నన్ను క్షమించండి నాన్నా….రాము లేకుండా నేను బ్రతకలేను….
ఆ మాట వినేసరికి ఈశ్వర్ కుమార్ ఏమీ మాట్లాడలేక ఇక రేణుక ఏం చెప్పినా వినదని అర్ధమయింది.
దాంతో ఆయనికి ఇక రాముతో తన కూతురి పెళ్ళికి ఒప్పుకోక తప్పలేదు.​
Next page: Update 110
Previous page: Update 108