Update 135

“కరెక్ట్ గా తెలియదు సార్…కాని ప్రతి సంత్సరం ఈరోజు పెద్ద పండగలా చేస్తారు…ఎందుకు ఏంటి అని తెలియదు సార్,” అన్నాడు డ్రైవర్.
డ్రైవర్ చెప్పింది విని రాము మనసు సంతోషంతో నిండిపోయింది….తన వాళ్ళు తనను మర్చిపోలేదన్న విషయం తెలిసిన తరువాత రాముకి వాళ్ళను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కలవాలని మనసు తెగ ఆరాటపడిపోతున్నది.
డ్రైవర్ వెనక్కి తిరిగి రాము మొహంలో సంతోషం చూసి ఎందుకంత ఆనందంగా ఉన్నాడో అర్ధంకాక కారు స్టార్ట్ చేసి గుడి ముందుకు వెళ్ళిన తరువాత లోపలికి తీసుకెళ్ళడానికి పార్కింగ్ వైపు తిప్పాడు.
కాని అక్కడ ఉన్న సెక్యూరిటీ అధికారి కానిస్టేబుల్ క్యాబ్ ని ఆపి, “ఇటు వైపు ఎంట్రీ లేదు…..అటు వైపు వెళ్ళు,” అంటూ రాము కూర్చున్న విండో దగ్గరకు వచ్చి, “నువ్వు గుళ్ళోకి వెళ్ళాలనుకుంటే ఇక్కడ నుండి నడిచి వెళ్ళాలి,” అంటూ డోర్ తీస్తున్నాడు.
అంతలో అప్పుడే గుడి లోపల నుండి వాకీటాకీలో మాట్లాడుతూ వస్తున్న ACP వస్తూ తన కానిస్టేబుల్ ఆపిన రాముని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు.
ACP ఒక్కసారి గుడి లోపలికి చూసి మళ్ళీ తల తిప్పి రాము వైపు చూసి తాను చూస్తున్నది కలా నిజమా అన్నట్టు బిత్తరపోయి చూస్తున్నాడు.
అప్పటి దాకా తాను చూసిన వ్యక్తి స్వభావానికి తన ఎదురుగా కనిపిస్తున్న రాము స్వభావం వేరని అతని పోలిస్ బుధ్ధి వెంటనే గ్రహించింది.

కాని ఇదెలా సాద్యం….అయినా ఒకవేళ తన అంచనా తప్పయితే రాముని ఆపిన కానిస్టేబుల్ పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూ, “ఏయ్….” అని గట్టిగా కానిస్టేబుల్ ని అరుస్తూ, “ఎవరిని ఆపుతున్నావో అర్ధమవుతుందా….ప్రశాంతంగా జాబ్ చేసుకోవాలని లేదా,” అని అరుస్తూ….రాము వైపు తిరిగి, “సార్….సారీ సార్….మా కానిస్టేబుల్ మిమ్మల్ని ఇంతవరకు చూడలేదు కదా….అతనికి మీరెవరో తెలియదు….వాడి తరుపున నేను సారి చెబుతున్నాను….” అన్నాడు.
ACP అలా అనగానే ఆయన తనను ఎవరు అని అనుకుంటున్నాడో అర్ధం అయ్యి రాము తన మనసులో నవ్వుకుంటూ అక్కడ నుండి నడుచుకుంటూ గుడిలోకి వెళ్ళబోయాడు.
కాని ACP అతన్ని ఆపుతూ, “సార్…మీరు నడుచుకుంటూ వెళ్ళడం ఏంటి…” అంటూ ఇంతకు ముందు రాము ఎక్కి వచ్చిన క్యాబ్ అక్కడే ఉండటంతో వెనక డోర్ తీసి పట్టుకుని, “సార్….మీరు కారులో వెళ్ళండి…..డైరెక్ట్ గా VIP ఎంట్రన్స్ దగ్గర దింగండి,” అంటూ డ్రైవర్ తో వెళ్ళమని చెప్పి….తన చేతిలో ఉన్న వాకీటాకీలో రాము ఎక్కిన క్యాబ్ నెంబర్ చెప్పి తన కింద వాళ్ళకు ఆ క్యాబ్ ని ఎక్కడా ఎవరు ఆపొద్ది అని instructions ఇచ్చి, కానిస్టేబుల్ తో, “నువ్వు కూడా సార్ తో పాటు వెళ్ళి VIP ఎంట్రన్స్ దగ్గర దింపు,” అన్నాడు.
దాంతో కానిస్టేబుల్ రాముని ఆపినందుకు ఏమంటాడో అని భయపడుతూ క్యాబ్ ఫ్రంట్ డోర్ తీసుకుని డ్రైవర్ పక్కనే కూర్చున్నాడు.
ACP కారు విండో లోనుండి రాము వైపు చూసి, “సార్….ఇక మిమ్మల్ని ఎవరూ ఆపరు….అయినా మీరు క్యాబ్ లో రావడం ఏంటి సార్,” అన్నాడు.
రాము చిన్నగా నవ్వుతూ డ్రైవర్ ని పోనివ్వమన్నాడు.

డ్రైవర్ కార్ మళ్ళీ స్టార్ట్ చేసాడు….అతనికి కూడా అంతా అయోమయంగా ఉన్నది…. ACP అంతటి అతను రాముని చూస్తి సార్ అని పిలుస్తున్నాడంటే…అతను మామూలోడు కాదనుకుని కారుని ముందుకు పోనిచ్చాడు.
లోపల కూర్చున్నా కానిస్టేబుల్ వెనక్కు తిరిగి రాము వైపు భయంగా చూస్తూ, “సార్….మీరెవరో తెలియక మిమ్మల్ని అపాను… నన్ను క్షమించండి సార్…..” అన్నాడు.
“పర్లేదు….జరిగింది మర్చిపో,” అన్నాడు రాము.
రాము అలా అనడంతో కానిస్టేబుల్ మనసు తేలిక పడింది….ముందుకు తిరిగి డ్రైవర్ కి ఎలా వెళ్ళాలో చెబుతున్నాడు.
అంతకు ముందే ACP అందరికి instructions ఇచ్చి ఉండటంతో రాము వస్తున్న క్యాబ్ ని ఎవరూ ఆపలేదు.
దాంతో డ్రైవర్ తన క్యాబ్ ని నేరుగా VIP ఎంట్రన్స్ దగ్గరకు తీసుకెళ్ళి ఆపాడు.
కానిస్టేబుల్ వెంటనే డోర్ తీసుకుని కార్ దిగి వెనక్కు వచ్చి రాము కూర్చున్న డోర్ తీసి పట్టుకున్నాడు.
రాము తన వాలెట్ లోనుండి డ్రైవర్ కి అడిగిన దానికన్నా డబల్ అమౌంట్ ఇచ్చాడు.
దాంతో డ్రైవర్ సంతోషంగా రాముకి నమస్కారం చేసి క్యాబ్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు.

రాము కారు దిగగానే అక్కడ ఉన్న మార్షల్స్ (పర్సనల్ బాడీగార్డ్స్) ఐదుగురు అతన్ని చూసి హడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చారు.
వాళ్ళు రాముని చుట్టూ నిల్చుని అతని దగ్గరకు ఎవరూ రాకుండా, గుడిలోకి వెళ్ళడానికి జనాన్ని పక్కకు జరుపుతూ రాముని గుడి లోకి తీసుకెళ్తున్నారు.
అక్కడ గుళ్ళో వినాయకుడికి ఒబెరాయ్ ఫ్యామిలో వారసులు ముగ్గురూ హారతి ఇస్తున్నారు.
చాలా వైభవంగా పూజారులు శంఖాలు ఊదుతుండగా, భక్తులు గంటలు కొడుతూ వినాయకుడిని ప్రార్దిస్తూ ఉంటే….గుడి మొత్తం చాలా కోలాహలంగా ఉన్నది.
వాళ్ళ పక్కనే రేణుక, ఆమె ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడళ్ళు, కూతురు, అల్లుడు, మనవరాలు అందరూ నిల్చుని హారతి చూస్తున్నారు.
ఇక్కడ మార్షల్స్ మధ్యలో గుడిలోకి వస్తున్న రాము ఆనందంగా ఉన్నాడు.
వాళ్ళల్లో ఒకతను ధైర్యం చేసి, “సార్….లోపల హారతి జరుగుతుంటే….మీరు ఇక్కడ ఉన్నారేంటి….మీరు ఇక్కడ లేటుగా వచ్చారని తెలిస్తే సార్ కోప్పడతారు….అయినా మీరు ఇక్కడ ఉంటే అక్కడ హారతి ఎవరు ఇస్తున్నారు….” అనడిగాడు.
రాము ఏదో సమాధానం చెప్పేలోపు అక్కడ గుడి ముందు ఒక్కసారిగా కలకలం మొదలయింది.
ఏంటా అని అందరు ఒక్కసారిగా అటు వైపు చూసారు.
అక్కడ జనం మొత్తం గట్టిగా అరుస్తూ దూరంగా పరిగెత్తుతున్నారు.​
Next page: Update 136
Previous page: Update 134