Update 137
గుడి లోనుండి బయటకు వచ్చేంత వరకు రేణుక రాము చేతిని పట్టుకునే ఉన్నది.
పూజ అయిపోయిన తరువాత అందరూ బయటకు వచ్చారు.
(ఫ్లాష్ బ్యాక్ అయిపోయింది)
మొత్తం చెప్పడం పూర్తయిన తరువాత రాము తన వాళ్ళందరి వైపు చూసి, “ఇదిరా జరిగింది…..” అన్నాడు.
రాము జరిగింది చెప్పడం పూర్తి అయిన తరువాత అందరూ అక్కడే ప్రశాంతంగా నిద్ర పోయారు.
ఆ తరువాత వారం రోజులు రాముకి తన కొడుకులు, కోడళ్ళు, మనమలు, మనమరాళ్ళతో ఆనందంగా గడిపాడు.
ఆ వారం రోజులు ఎంత తొందరగా గడిచిపోయాయో రాముకే అర్ధం కాలేదు.
ఎప్పుడు ఫ్యాక్టరీకి సెలవు పెట్టని శివరామ్ కూడా ఆ వారం రోజులు రాముతో పాటే ఉన్నాడు.
ఒక రకంగా చెప్పాలంటే ఒబరాయ్ ఫ్యామిలీ మొత్తం వారం రోజుల పాటు వెకేషన్ లో ఉన్నారనే అనుకోవాలి.
ఆ వారం రోజులు అందరు తమకు నచ్చింది చేస్తూ….రాముతో జోకులు వేస్తూ….ఆడుకుంటూ చాలా ఆనందంగా గడిపారు.
తరువాత రోజు రాము ఫోన్ లో మెయిల్స్ చెక్ చేసుకుంటుండగా సివిల్స్ రిజల్ట్ రావడం….తాను IPS కి సెలక్ట్ అవడం చూసి చాలా ఆనందపడిపోయాడు.
తను IPS కి సెలక్ట్ అయిన విషయం ఇంట్లో అందరికి చాలా ఆనందంగా చెప్పాడు.
దాంతో ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఆనందపడిపోయారు.
విశ్వ అందరికీ స్వీట్లు పంచాడు…..కంపెనీలో అందరికీ ఒక నెల జీతం బోనస్ అనౌన్స్ చేసాడు.
కంపెనీలో ఎంప్లాయిస్ కూడా చాలా ఆనందపడిపోయారు…..విశ్వ తన కంపెనీల్లో, మీడియాకు రాముని తన కొడుకుగా శివరామ్, రాము ఇద్దరూ కవలపిల్లలని….చిన్నప్పుడే అనుకోకుండా తప్పిపోయి…ఇప్పుడు కలిసాడని అందరికీ పరిచయం చేసాడు.
అంతా హడావిడి అయిపోయిన తరువాత రాము తన గది లోకి వెళ్ళి ట్రైనింగ్ కి కావలసిన ఫార్మాలిటీస్ అన్నీ నెట్ లో పూర్తి చేసి…తన సర్టిఫికేట్లు స్కాన్ కాపీలు మొత్తం అప్ లోడ్ చేసాడు.
మొత్తం పని పూర్తి అయిన తరువాత రాము తన తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పాడు.
ఈ న్యూస్ విన్న ఆయన కూడా చాలా ఆనందపడిపోయాడు.
రాము అలా రిలాక్స్ కాగానె విశ్వ, శివరామ్ ఇద్దరూ రూమ్ లోకి వచ్చి….
విశ్వ : ఏంటి నాన్నా….చాలా హుషారుగా ఉన్నారు….
రాము : అవునురా విశ్వ…..నాకు చాలా ఆనందంగా ఉన్నది….IPS అవ్వాలన్న కల ఇన్నాళ్లకు తీరుతున్నది.
విశ్వ : నాన్నా…..శివ మీతో ఏదో చెప్పాలనుకుంటున్నాడు….
ఆ మాట వినగానే రాము శివ వైపు తిరిగి…..
రాము : ఏంటిరా…నా దగ్గర నీకు దాపరికం ఏమున్నది…..చెప్పు…..
శివరామ్ : తాతయ్యా….మిమ్మల్ని అలా పిలవడం నాకు చాలా ఇబ్బందిగా ఉన్నది….పెదనాన్న ఎలాగూ మిమ్మల్ని నా అన్నగా పరిచయం చేసారు కాబట్టి మిమ్మల్ని అన్నయ్యా అని పిలుస్తాను…..
రాము : అలాగే…..నీకు నచ్చినట్టు పిలువు….అయినా ఇది అడగటానికి నీ పెదనాన్నను వెంట బెట్టుకుని వచ్చావు….
శివరామ్ : లేదు అన్నయ్యా….విషయం వేరే ఉన్నది….అది మీకు ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను.
రాము : ఏంటి అంత సీరియస్ మ్యాటరా……
శివరామ్ : సీరియస్ ఏం లేదు అన్నయ్యా….(అని చిన్నగా నవ్వుతూ) ఇంట్లో అందరం మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వచ్చాము….ఆ విషయం మీకు చెబుదామని వచ్చాను….
రాము : ఏంటిరా…అది….నీకు పెళ్ళి ఏమైనా ఫిక్స్ చేసారా…..లేక ఎవరినైనా లవ్ చేసావా….
రాము అలా అనగానే విశ్వ పెద్దగా నవ్వుతూ శివ వైపు చూసి….
విశ్వ : వీడు ఫ్యాక్టరీకి వెళ్తేనే అన్నం తినాలన్న సంగతే మర్చిపోతాడు….ఇక వీడికి లవ్ కూడానా…..
రాము : అయితే ఇంతకు విషయం ఏంటి…..
శివరామ్ : ఏం లేదు అన్నయ్యా….మనకు చాలా కంపెనీలు ఉన్నాయి కదా….మీరు ఇక జాబ్ చేయాల్సిన అవసరం ఏంటి… అది కూడా ఒకరికింద పని చేయడం మాకు ఇష్టం లేదు….అందుకని మీరు కూడా మాతో పాటు మన కంపెనీ వ్యవహారాలు చూసుకుంటే మంచిదని అనుకుంటున్నాము…..
రాము : నువ్వు చెప్పింది బాగానే ఉన్నది శివ….కాని నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి IPS అవ్వాలన్నది నా కల….
శివరామ్ : అది కాదు అన్నయ్యా…..
అని శివరామ్ ఏదో చెప్పబోతుండగా రాము అతని మాటలను మధ్యలోనే తుంచేస్తూ…..
రాము : అరేయ్ శివా….నా మాట విను….నేను మీతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు….చాలా ఆనందంగా ఉన్నది….నువ్వు చెప్పినట్టు నేను కూడా కంపెనీ వ్యవహారాలు చూసుకుంటాను….(ఆ మాట వినగానే విశ్వ, శివరామ్ ఇద్దరూ ఆనంద పడ్డారు….) కాని నాదో చిన్న షరతు….(అనగానే వాళ్ళిద్దరూ ఏంటి అన్నట్టు రాము వైపు చూసారు) నా కల నేను కూడా ఎంజాయ్ చేయాలి కదా…..అందుకని కొద్దికాలం జాబ్ చేసిన తరువాత మీతో పాటు జాయిన్ అవుతాను…..
శివరామ్ : అది కాదు అన్నయ్యా…..
రాము : ప్లీజ్ రా….ఇంకేం మాట్లాడొద్దు….కొద్దికాలం నేను యూనిఫామ్ వేసుకుని డ్యూటి చేయాలి….ఆ సరదా తీర్చుకోనివ్వండి…..
రాము అంత గట్టిగా అనడంతో విశ్వ కాని, శివరామ్ కాని ఏం మాట్లాడలేకపోయారు.
కాని శివరామ్ ఏదో ఆలోచించిన వాడిలా రాము వైపు చూసి….
శివరామ్ : కాని మీరు కూడా మా మాట ఒకటి వినాలి…..
రాము : ఏంటో చెప్పు…..
శివరామ్ : డ్యూటీలో జాయిన్ అయిన తరువాత కూడా మీరు మాతో పాటే….ఇక్కడే ఉండాలి….
రాము : అది ఎలా కుదురుతుందిరా…..నాకు ఎక్కడ పోస్టింగ్ వస్తుందో నాకే తెలియదు….అలాంటప్పుడు నేను ఇక్కడ ఎలా ఉంటాను….
శివరామ్ : అదంతా నేను చూసుకుంటాను అన్నయ్యా….మీరు ట్రైనింగ్ అయిపోయిన తరువాత మీకు ఇక్కడే పోస్టంగ్ వచ్చేలా అంతా నేను చూసుకుంటాను…..
రాము : అరేయ్….ఇది IPS రా…..ఎలా మ్యానేజ్ చేస్తావు…..
శివరామ్ : నాకు చాలా మంది మంత్రులు తెలుసు అన్నయ్యా…నేను పార్టీ ఫండ్స్ కూడా చాలా ఇస్తుంటాను….అయినా ఆ విషయం నాకు వదిలేయండి….
దాంతో రాము కూడా ఇక చేసేది లేక సరె అని తల ఊపాడు.
శివరామ్ : ఇంతకు ట్రైనింగ్ ఎక్కడ….
రాము : డెహ్రాడూన్……