Chapter 53
సమయం ఉదయం 10 , అందరూ బద్దకంగా లేసి స్నానం చేసి టిఫిన్ దగ్గర కూర్చున్నారు..
సరిగ్గా అప్పుడే కాంతయ్య ఫోన్ మోగింది
"అయ్యగారూ.. ఇక్కడో కార్ వరద నీటిలో కొట్టుకుపోతుంది .. మీరు అర్జెంట్ గా రావాలి "
స్పీకర్ లో ఉన్న ఫోన్.. అది విన్న కాంతయ్య ఠక్కున లేసి బులెట్ స్టార్ట్ చేసేలోగా , రాము, సోము కూడా బండెక్కుతారు .. రయ్ మంటూ టాప్ గేర్ లో రైజ్ చేసి గాల్లోకి లేపుతాడు .. "తాతయ్యా .. జాగ్రత్త !!!" , వెనక నుంచి గంగ అరుపు ..
రెండు నిముషాల్లో స్పాట్ లో ఉంటారు .. విపరీతమైన వర్షాలు , కొట్టుకుపోయిన వాగులు , హై వే మీదకి కూడా నీళ్లు .. బై పాస్ తీసుకున్న కార్ అక్కడ పొంచి ఉన్న ప్రమాదం గ్రహించలేదు .. ఇసుకలో కూరాకపోయింది .. నీళ్లు పైనుండి ఉధృతంగా రావడంతో .. ఇంజిన్ సహకరించడం లేదు .. ముప్పాతిక పైగా మునిగిన కార్ .. లోపల ఇద్దరు ప్రయాణీకులు .. 44 ఏళ్ళ దీప , 19 ఏళ్ళ వర్ష ..
అప్పటికే ఊరి జనాలు అక్కడ చేరి కాపాడే ప్రయత్నం చేస్తున్నా ఎవరూ సాహసం చేయడం లేదు .. ఎందుకంటే వరద నీరు కిందకి ప్రవహిస్తుంది .. ఇంకో 10 గజాల్లో పెద్ద లోయ .. అందులో పడితే అంతే .. ఇప్పటికే రోడ్ నుంచి తోసేసి పడ్డట్టు ఉన్న కార్ , వెనక నుంచి తోసుకొస్తున్న నీరు .. లోపల నుంచి ఆర్త నాదాలు .. డోర్ లాక్ అయింది .. లోపలకి నీరు చేరుతున్నాయి .. నడుం దాక మునిగి ఉన్న ప్రయాణికులు ..
వెంటనే సోము అక్కుడున్న వాళ్ళ వైపు చూసి .. "ట్రాన్స్ఫార్మర్ స్విచ్ ఆఫ్ చేయమనండి " , అని అక్కడున్న పొడవాటి రాడ్ ని కార్ ముందు వైపుకి పోనిచ్చి , టక్కున కొంచెం ఎదురుగ ఉన్న ట్రాన్స్ఫార్మర్ మీద ఎక్కి .. కార్ ని రాడ్ తో నొక్కిపెట్టి "తాతా .. నువ్వు అటు నుంచి తాడు విసిరేయ్ .. రామూ .. నువ్వు కార్ దగ్గరకెళ్ళి తాడుతో కార్ రాడ్డుని కట్టేయ్ .. " , అని అరిసేసరికి .. సోము రాడ్డుతో అడ్డుకోవడం తో కార్ ముందుకి కొట్టుకుపోవడం ఆగింది ..
కాంతయ్య అక్కడున్న పొడవాటి స్టీల్ చైన్ ని బలంగా విసిరేసాడు .. అప్పటికి కార్ వెనక్కి చేరిన రాము , ఆ చైన్ హుక్ తీసుకుని కార్ వెనక ఉన్న రాడ్డుకి తగిలించి .. తాత కి సైగ చేస్తూ .. బైక్ తో లాగా మంటాడు .. ఒకపక్క సోము రాడ్డుతో ముందుకు పోకుండా కార్ ని అవుతుంటే ఇంకో పక్క రాము చైన్ ని పట్టుకుని కార్ ని గుంజుతున్నాడు .. అదే సమయానికి కాంతయ్య చైన్ అవతలి పక్క హుక్ ని బులెట్ కి తగిలించి జుమ్ జుమ్ మని ఆక్సిలేటర్ రైజ్ చేస్తాడు .. ఇసుకలో కూరకపోయిన బులెట్ కదలడం లేదు .. వెంటనే దిగి .. అక్కడున్న పెద్ద రాయి ని వెనక టైర్ ముందు పెట్టి .. ఆక్సిలేటర్ నొక్కుతూ టైర్ కి రాయి కి మధ్య ఇసక పోయామంటే .. తాతకేమవుద్దో అని అక్కడకొచ్చిన గంగ ఆపని చేస్తుంది
అంతే .. ఒక్క ఉదుటున గాల్లోకి లేసిన బులెట్ .. కార్ బరువు ని గుంజడం .. అదీ ఎదురీతుతున్న వరద ప్రవాహానికి తట్టుకుని .. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా బులెట్ వెనక్కి పడిపోయేదే .. బులెట్ తో పాటు కాంతయ్య కూడా కొట్టుకుపోవచ్చు .. అప్పుడే ..రాము బలంగా కార్ ని చైన్ తో గుంజితే .. కార్ కొంచెం వెనక్కి కదిలింది .. తాత సైడ్ చైన్ ని కొంచెం లూస్ చేస్తాడు రాము .. అదే టైం లో సోము ట్రాన్స్ఫార్మర్ నుంచి రాడ్డు తో తోస్తున్నాడు .. కార్ కదలడంతో బులెట్ మీద ఫోర్స్ తగ్గేసరికి వెనక్కి పడాల్సిన బులెట్ ముందుకు సాగి కొంచెం కొంచెం గా కార్ ని గుంజుతుంది .. గంగ బులెట్ కి ఈజీ గా ఉండేలా మట్టిని , ఇసకని పోస్తూనే ఉంది .. బండి ఆగకూడదు .. ఆగితే మల్లి మొదటికొస్తది .. కాంతయ్య రైజ్ చేస్తూనే .. వెనక్కి చూస్తూ ఎంతవరకు కదులుతుందో చూసుకుంటూ గంగ కి సైగ చేస్తున్నాడు ఇసక పోయామని ..
మూడు నిముషాలకి కార్ సగం దూరం వెనక్కి వచ్చింది .. బైక్ కూడా తారు రోడ్ మీద రావడంతో గ్రిప్ దొరికేసరికి ఇబ్బంది లేకుండా ముందుకు సాగుతుంది .. ఇక సోము ట్రాన్స్ఫార్మర్ నుంచి దూకి .. కార్ డ్రైవర్ సైడ్ చేరి .. అద్దాలు పగలకొట్టి .. లోపల నుంచి డోర్ ఓపెన్ చేసి .. అపస్మారక స్థితిలోకి వెళ్ళబోతున్న దీప ని లాగేస్తాడు బయటకి .. అప్పటికే అక్కడకి చేరిన గంగ ఆమెను గ్రామస్థుల సాయంతో బయటకి తెచ్చి రోడ్ మీద పడుకోబెట్టుద్ది .. ఈ లోగ సోము కార్ పైనుంచి అవతలకి జంప్ చేసి .. అటు వైపు నుంచి వర్ష ని రక్షిస్తాడు ..
ఇద్దరూ సేఫ్ గా వచ్చేసరికి . కాంతయ్య బులెట్ కి ఉన్న చైన్ ని తీసెయ్యాలి అని గంగ కి సైగ చేస్తాడు .. కానీ ఇక్కడో తిరకాటం ఉంది .. బండి రైజ్ లో ఉండగా చైన్ తీసేయలేం.. దాని బలానికి కష్టం ఎందుకంటే కార్ లో మనుషులు లేకపోయినాకార్ బరువుకు .. వరద నీటి ఫోర్స్ కి బండి ని గుంజేస్తూనే ఉంది .. అలాగని బండిని ఆపేస్తే .. ఆ ఫోర్స్ కి కార్ తో పాటు , బండి కూడా కొట్టుకుపోతుంది .. పైగా రాము కూడా సేఫ్ గా బయటికి రావాలి కదా .. అక్కడున్న చెట్టు మొదళ్ళ చుట్టూ పోనివ్వమని గంగ చెప్పేసరికి .. కాంతయ్య బండిని డైరెక్షన్ తిప్పి చెట్టు చుట్టూ పోనిచ్చి .. రాము ని చైన్ వదిలేసి బయటకు రమ్మంటాడు .. ఈ లోగ సోము కూడా ఎదురెళ్లి తమ్ముడికి సాయం చేసి బయటకి తెస్తాడు .. ఇద్దరూ సేఫ్ గా బయటకి వచ్చేసరికి .. చెట్టు కొంచెం ఫోర్స్ ని కాసేసరికి .. సోము , కాంతయ్య ఇద్దరూ సింక్ లో బండిని కంట్రోల్ చేస్తూ .. సోము చైన్ లాగేయడం .. కాంతయ్య బండి మీద నుంచి దూకడం .. రాము తాతని పట్టుకోవడం .. ధడేలున కార్ ముందుకి కొట్టుకుంటూ .. దొర్లుకుంటూ లోయలో పడడం ... అన్నీ క్షణాల్లో జరుగుతాయ్ ..
మనుషులు క్షేమం .. కార్ పోయినా.. బులెట్ సేఫ్ ..
గంగ కిందపడ్డ బులెట్ ని లేపి రయ్ మంటూ రైజ్ చేసి .. ఇంటికెళ్లి .. బెంజ్ కార్ .. లక్ష్మి ని తీసుకొస్తది .. దీప , వర్ష ని కార్ లో ఎక్కించేక .. గంగ లక్ష్మిని తోలుకుంటూ ఇంటికి తీసుకెళ్ళుద్ది దీప , వర్ష ని
కాంతయ్య .. సోము .. రాము నడుసుకుంటూ వస్తుంటే .. ఒక ముసలాయన వాళ్ళని చూసి ..
"ఎవరు బాబూ మీరు ", అని అడిగితే .. సోము, రాము గర్వముగా "కాంతయ్య తాత గారి మనవళ్లం " , అని అంటే .. ఆయన "పులి లాంటి బిడ్డలు పుట్టారు .. పులి వంశం లో పులులే పుడతాయి " , అని గట్టిగ అరుస్తాడు !!! వెనక్కి తిరిగిన కాంతయ్య తాత కళ్ళల్లో అమితమైన ఆనందం .. గర్వంగా వాళ్ళిద్దరిని హత్తుకుని ముందుకు సాగుతాడు .. ఫోన్ లో కలెక్టర్ ఆఫీస్ కి ఫోన్ చేసి ... వూరు ముందు ఉన్న అడ్డదారిని మూసేయమని చెబుతాడు .. అరడజన్ లైఫ్ జాకెట్స్ , రోప్స్ , బోట్ పంపమని చెబుతాడు
మన స్థాయిని చూసి గౌరవించేవారికంటే .. మనం చేసే మంచిని చూసి ప్రేమించే వారే మనకు నిజమైన ఆప్తులు !!!