Chapter 13

ఈ హఠాత్ పరిణామాన్ని ఊహించని ఆమె కళ్ళు మూసుకోక పోవడం వల్ల వసంతం కళ్లల్లో పడి మండింది. అయితే మంట కళ్ళల్లోనో, గుండెల్లోనో ఆమె తెలుసుకోలేకపోయింది. పంతులమ్మ మీద గోపాలకృష్ణ అలా వసంతాలు పోయడంతో జనం మొదట నిశ్చేష్టులై, ఆ తరువాత తేరుకుని చప్పట్లు చరిచారు. ఈ శబ్దాలకు ధాన్య కళ్ళు తెరిచింది. తనమీద వసంతం పోయాలేదని గ్రహింపుకొచ్చి చుట్టూ చూసింది.

పచ్చగా, పసుపు కొమ్ములా మెరిసిపోతున్న వర్షను చూడగానే జరిగింది ఆమెకు తెలిసిపోయింది.

చుట్టూ చేరి చప్పట్లు చరుస్తున్న జనాన్నంతా ఓసారి చూసి వర్ష పైటకొంగును నోటికి అడ్డం పెట్టుకుని అక్కడనుంచి పరుగెత్తింది. జీవితంలో మొదటిసారి ఆమె తన ప్రవృత్తికి విరుద్ధంగా అక్కడి నుంచి పారిపోయింది.

తను వసంతం పోయడంతో సిగ్గు ముంచుకొచ్చి ఆమె వెళ్ళి పోయిందనుకుని జీవితంలో మొదటిసారిగా అతనూ తప్పు చేశాడు. మరి ఈ పరిణామాల పర్యవసానం ఏమిటో కాలమే నిర్ణయించాలి.

అమ్మాయిలు ఒక్కొక్కరే వచ్చి గోపాలకృష్ణ మీద వసంతాలు పోస్తున్నారు నరుడు ఉత్సాహంగా గురువుగారికి జరుగుతున్న వసంతా భిషేకాన్ని చూస్తున్నాడు. అంతలో గోపాలకృష్ణకు ఓ కొంటె ఆలోచన వచ్చింది. దాన్ని తలుచుకుంటుంటే తెలియని ఉత్సాహం రక్తాన్ని ఊపేస్తోంది. అనాది ప్రేమికులంతా అతన్ని ముందుకు నెడుతున్నారు. అజ్ఞాత శక్తులు అతన్ని ప్రేరేపిస్తున్నాయి. ధైర్యం, అంతకంటే మించిన తెగువ మున్ముందుకు తోస్తున్నాయి. ఏదో ఉద్రేకం విచక్షణాజ్ఞానాన్ని మింగేసింది.

అంతే….. తనమీద వసంతం పోసి ఎదురుగా నిల్చుని నవ్వుతున్న అమ్మాయి చేతిలోని వెండి చెంబును లాక్కున్నాడు.

అలా నిలబడి బుద్ధిగా వసంతాలు పోసుకోవడమే తప్ప, ఎన్నడూ వసంతాలు ఎవరిమీదా పోయాని గోపాలకృష్ణ మొదటిసారి చెంబు చేతుల్లోకి తీసుకోవడంలో జనం ఉత్కంఠతో నిలుచుండి పోయారు. ఆ తరువాత అతను ఏం చేయబోతాడోనని రెప్పలు వాల్చకుండా చూస్తున్నారు. గోపాలకృష్ణ నెమ్మదిగా నడిచి చెంబు ముంచాడు. ఎర్రటి వసంతం చెంబు నుంచి జారుతుండగా పైకి లాగాడు.

తల పైకెత్తాడు తనమీద పోయడానికే వసంతం నింపుకున్నాడని అంతకు ముందు అతని మీద వసంతాలు పోసిన స్త్రీలంతా ఎవరికి వారే అనుకుంటూ టెన్షన్ గా నిలబడి చూస్తున్నారు.

అయితే గోపాలకృష్ణ చూపులు ధాన్యవైపు ప్రసరించగానే జనం కీ ఇచ్చిన బొమ్మల్లాగా అటువైపు తలలు తిప్పారు.

ధాన్య అయితే చిన్నపిల్లలా కేరింతలు కొడుతోంది.

అతను నెమ్మదిగా అడుగులేస్తున్నాడు. ధాన్య మరికొంత ముందుకు వచ్చి నిలబడాలని అనుకుంది గానీ కాళ్ళు కదలడం లేదు.

అతను మరింత దగ్గరయ్యాడు.

వసంతం పోసుకోవడానికి ప్రిపేర్ అయిపోయిన ఆమె కళ్ళు మూసుకుంది. జనం బిర్రబిగుసుపోయి చూస్తున్నారు.

గోపాలకృష్ణ దాన్యను సమీపించి, పక్కకు ఓ అడుగువేసి చెంబు ఎత్తి వర్శపై కుమ్మరించాడు. |

ఈ హఠాత్ పరిణామాన్ని ఊహించని ఆమె కళ్ళు మూసుకోక పోవడం వల్ల వసంతం కళ్లల్లో పడి మండింది. అయితే మంట కళ్ళల్లోనో, గుండెల్లోనో ఆమె తెలుసుకోలేకపోయింది.

పంతులమ్మమీద గోపాలకృష్ణ అలా వసంతాలు పోయడంతో జనం మొదట నిశ్చేష్టులై, ఆ తరువాత తేరుకుని చప్పట్లు చరిచారు.

ఈ శబ్దాలకు ధాన్య కళ్ళు తెరిచింది. తనమీద వసంతం పోయాలేదని గ్రహింపుకొచ్చి చుట్టూ చూసింది.

పచ్చగా, పసుపు కొమ్ములా మెరిసిపోతున్న వర్షను చూడగానే జరిగింది ఆమెకు తెలిసిపోయింది.

చుట్టూ చేరి చప్పట్లు చరుస్తున్న జనాన్నంతా ఓసారి చూసి వర్ష పైటకొంగును నోటికి అడ్డం పెట్టుకుని అక్కడనుంచి పరుగెత్తింది.

జీవితంలో మొదటిసారి ఆమె తన ప్రవృత్తికి విరుద్ధంగా అక్కడి నుంచి పారిపోయింది.

తను వసంతం పోయడంతో సిగ్గు ముంచుకొచ్చి ఆమె వెళ్ళి పోయిందనుకుని జీవితంలో మొదటిసారిగా అతనూ తప్పు చేశాడు. మరి ఈ పరిణామాల పర్యవసానం ఏమిటో కాలమే నిర్ణయించాలి.

గోపాలకృష్ణ నుంచి పిలుపు రావడంతో ధాన్యకన్నా ఆమె తండ్రి సంబర పడిపోయాడు. ఇక తనింట్లో ధనధాన్యాలకు లోటుండదని ఉప్పొంగి పోయాడు. కాలంతోపాటు జారిపోయిన సిరిసంపదలను తిరిగి పొందుతామన్న ఆనందం ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

ఇక ధాన్య అయితే ఒక్క క్షణం నింపాదిగా వుండలేకపోయింది. ఏ పని ముందు చేయాలో, ఏది వెనక చేయాలో తెలియనంత కన్ ప్యూజన్ లో పడిపోయింది. ఎప్పుడు రాత్రవుతుందా, గోపాలకృష్ణ కౌగిలిలో తన ఇరవై రెండేళ్ళ యవ్వనాన్ని ఆరపెడదామా అన్న ఆతృత ఆమెలో.

ఆ పౌర్ణమిరోజున శివరామయ్య ఇంట్లో జరుగుతున్న హడావుడినంతా వర్ష ఆశ్చర్యంతో గమనిస్తోంది.

కేవలం ఓ మూఢనమ్మకంతో తమకు సిరిసంపదలు కలిసొస్తాయని పెళ్ళికాని తన కూతుర్ని పరపురుషుడితో రాత్రి గడపమని పంపిస్తున్న శివ రామయ్యను చూస్తుంటే ఆమెకు జాలి కలిగింది. ఈ దురాచారాన్ని ఎలా రూపుమాపాలో తెలియడంలేదు. ఏదో పెద్ద ఉద్యమమో, దీర్ఘకాలిక ప్రణాళికో, లేక ఏదో జరగరానిది జరిగితేనో తప్ప దీనికి పుల్ స్టాప్ పెట్టడం కుదరదని కూడా ఆమెకు అర్థమైంది.

అప్పటికీ ఉండబట్టలేక శివరామయ్యను పిలిచి ఇదంతా మూఢాచారం తప్ప మరేమీ కాడని చెప్పబోయింది. ఆమె నోరు తెరిచి చెప్ప బోయేంతలో ఆయన అడ్డు తగిలి- “నువ్వేమీ చెప్పకమ్మా! ఈరోజు వినే మూడ్ లేదు. రేపటినుంచి ఈ ఇంట్లో శ్రీలక్ష్మి కాలిగజ్జెల రవళి వినిపించబోతోంది. సిరిసంపదలు పొంది మమ్మల్ని ముంచెత్తబోతున్నాయి” అంటూ ట్రాన్స్ లో వున్నట్టు మాట్లాడాడు.

ఇక తనేమీ చేయలేననిపించి స్కూలు కెళ్ళింది.

సాయంకాలం తిరిగొచ్చేసరికి ధాన్య పెళ్ళికూతురిలా ముస్తాబై వుంది.

ఆకుపచ్చ రంగు పట్టుపావడా, ఓణీలో ఆమె అచ్చు పంటచెలులూ పచ్చ పచ్చగా వుంది. తలమీద పెట్టుకున్న సూర్యవంక, చంద్రవంక ఆభరణాలు ఆ చేలమీద వాలిన బంగారు గువ్వల్లా వున్నాయి. జడ కుచ్చులున్న జడ నీటికాలువలా అద్భుతంగా వుంది. నడుముకున్న వడ్డాణం బంగారు తీగలతో పంటచేల చుట్టూ వేసిన కంచెలా వుంది. పాపిట మీద నుంచి సాగి ముఖంమీదకి జారిన పాపిటబిళ్ళ, బావినుంచి నీళ్ళు తోడడానికి వేసిన బంగారు ఏతాంలా వుంది. కాళ్ళకున్న వెండిగజ్జెలు చేస్తున్న శబ్దాలు, పొలాల్లో అలసటను మరిచిపోవడానికి కూలీలు పాడుతున్న జానపద గీతాల్లా విన్పిస్తున్నాయి.

వర్షను చూస్తూనే ఆమె “వర్షా! రా!” అంటూ ఆహ్వానించింది.

ఏమీ మాట్లాడకుండా తన గదిలోని వచ్చింది వర్ష. అచ్చు పెళ్ళి కూతురిలా తయారైన దాన్యను చోడగానే ఏదో బాధ మనసును పిండు తూంటే అలానే తన బెడ్ మీద వాలిపోయింది. అమ్మవారికి బలి ఇవ్వడానికి మేకను అలంకరించిన దృశ్యం కళ్ళముందు కదలాడింది. మేకకు, ధాన్యకు ఏమీ బేధం కనబడడం లేదు. ఒకటి ప్రాణం పోగొట్టుకుంటే, ఇంకొకటి మానం కోల్పోతుంది తేడా అంతే.

చీకట్లు చిక్కబ్దే కొద్దీ చంద్రుడు అదే నిష్పత్తిలో వెలుగులు విరజిమ్ము తున్నాడు. లోకమంతా మల్లెపూలను పరిచినట్టుంది వెన్నెల.

భోజనం చేశాక, కాసేపు రెస్ట్ తీసుకుని బయల్దేరింది ధాన్య.

కొండ దగ్గరికి వచ్చేసరికి కాళ్ళు తడబడ్డాయి. గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది.

కొండ ఎక్కడం ప్రారంభించింది. రెండు అడుగులు వేసిందో లేదో తన ఓణీ దేనికో తగిలి వెనక్కి లాగినట్లు అనిపించడంతో ఠక్కున ఆగింది.

వెనక్కి తిరిగి చూస్తే ఎదురుగ్గా గోపాలకృష్ణ.

చప్పున సిగ్గు ముంచుకొచ్చి తల వాల్చిందిగానీ, కళ్ళు మాత్రం కిందకు చూడడం లేదు. వెన్నెల్లో మెరిసిపోతున్న అతన్ని చూడాలన్న తహతహ కళ్ళను వాలనివ్వడంలేదు.

“దండకం గొప్పతనం ఏమిటో తెలుస్తోంది. దేవత ప్రత్యక్షమవగానే భక్తుడు దండకం ప్రారంభిస్తాడు. ఆ పదాలు చక్కటి సమాసాలు- అందులోని లయ- ఆ ఒడుపు చాలా వుంటాయి. భావోద్వేగాన్ని ప్రకటించేందుకు దండకం మంచి ప్రక్రియ. అందుకే నాకిప్పుడు దండకం చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే అచ్చు దేవతలా కనిపిస్తున్నావు కాబట్టి” అతను ఆమె చుబుకాన్ని పైకి లేపి చెప్పాడు.

ఆ చిన్న పొగడ్త ఆమెలో పెద్ద సంచలనాన్నే కలిగిస్తోంది. అంతే కాకుండా అతని స్పర్శ ఆమె యవ్వనాన్ని మొదటిసారిగా నిద్ర లేపింది. ఏవో ప్రకంపనలు అలల్లా రక్తంలో కదులుతున్న భావన.

ఆమె అలంకరణను కింద నుంచి పైవరకు ఓసారి పరిశీలించాక “ఈ అలంకరణలో నువ్వు దేవతలా వున్నా- ఇంత అలంకరణ ముందు ముందు ఇబ్బంది పెడుతుంది. శృంగారంలో మనమీద ఎంత తక్కువ బట్టలుంటే అంత ఎక్కువ సుఖం లభిస్తుంది” అని చిన్నగా నవ్వాడు.

ఆమె ఏమీ మాట్లాడలేదు.

“వస్తనంటే పడి ఛస్తాను కాళ్ళకాడ- అని ఆత్రేయ నీలాంటి పిల్లను చూసే రాసుంటాడని నాకనిపిస్తోంది”

ఆమె పెదవుల మధ్య చిర్నవ్వు పాల నురగలా పొంగింది.

“రా” అని చేయి పట్టుకున్నాడు.

ఇద్దరూ కొండ ఎక్కారు.

భవనానికి పక్కగా ఆరుబయల్లో వాళ్ళిద్దరికీ పడక ఏర్పాటు చేశాడు నరుడు. అతను అప్పటికే లోపల గుర్రుపెట్టి నిద్రపోతున్నాడు.

ఇద్దరూ వెళ్ళి పడకమీద కూర్చున్నారు.

“అవునూ! ఇంతకీ మీ టీచర్ ఏముంటుంది?” అని అడిగాడు.

అప్పుడు మరో స్త్రీ ప్రస్తావన రావడం ఇబ్బంది అనిపించలేదు ధాన్యకు. వర్ష గురించి డీటైల్స్ అనీ విన్నాక తను ఇంతవరకు ఎవరికీ చెప్పని సంఘటన గురించి అడిగాడు.

ఇది కాస్త చెప్పేస్తే ఇక ఆలస్యం వుండదన్న ఆత్రుతతో ఆమె చెప్పడం ప్రారంభించింది.

“ఈ సంఘటన మరొకరికి చెప్పాల్సి వస్తుందని నేను అనుకోలేదు. అందుకే ఎక్కడ నుంచి ఎలా ప్రారంభించాలో తెలియడం లేదు” అని ఓ క్షణం ఆగి తిరిగి కొనసాగించింది.

“అప్పుడు నేను మద్రాసులో వుండేదాన్ని. డిగ్రీ చదవడానికి అక్కడికి వెళ్ళాను. కోడంబాకంలో మా మేనత్త వుండేది. ఆమెకు ఎవరూ లేరు. ఒక్కత్తే వుండేది. ఆమెతోపాటు వుండి చదువుకోవడనికి నిర్ణయం జరిగింది రోజూ కాలేజీకి వెళ్లడం, తిరిగి రావడం ఇలా జరుగుతున్నాయి రోజులు.

ఓరోజు మా మేనత్త ఎవరో బంధువు చనిపోయాడంటే ఊరెళ్ళింది. నేనొక్కదాన్నే ఇంట్లో.

సాయంకాలం కాలేజీ నుంచి ఇంటికి వచ్చాక బోర్ గా అనిపించడంతో సాలెగ్రామ్ కు వెళ్ళాలనుకున్నాను. అక్కడ మా ఫ్రెండ్ వుంది. దాంతో పిచ్చాపాటీ వేసి ఏడుగంటలకల్లా తిరిగి ఇల్లు చేరుదామని నిర్ణయించుకుని బయల్దేరాను.

సిటీబస్సులు మారి దానిల్లు పట్టుకునేటప్పటికి వీధిదీపాలు వెలిగాయి. ఆకాశం బాగా మబ్బు పట్టడం వాళ్ల అప్పుడే చీకట్లు ముసురుకున్నాయి.

ఇంత కష్టపడి అక్కడికి వెళితే నా ఫ్రెండ్ లేదు. సినిమాకెళ్ళిందని చెప్పారు. ఉసూరుమంటూ తిరిగి బయల్దేరాను. వీధిలోకొచ్చేటప్పటికి ఓ వాన చుక్క నా ముక్కమీద పడి బ్రద్దలైంది.

నాలుగు అడుగులు వేశానో లేదో చినుకులు ప్రారంభమయ్యాయి. వడివడిగా నడుస్తూ బస్సు టెర్మినల్ దగ్గరకొచ్చాను. మా కాలనీ బస్సు కోసం వెయిట్ చేస్తూ నిలబడ్డాను.

నాకు అటుగా వున్న ఓ యువకుడు నన్ను అదేపనిగా చూస్తున్నాడు. నేను గమనించినా అతను చూపులను మరల్చుకోవడంలేదు. సిటీలో ఇలాంటివి మామూలే గనక నేను పట్టించుకోలేదు. కానీ అతను మాత్రం నన్ను తినేసేలా చూస్తుండటం క్రీగంట గమనిస్తూనే వున్నాను. అతని చూపులు ఎక్కడెక్కడ తగుల్తున్నాయో తలెత్తి చూడకపోయినా తెలుస్తూనే వుంది.

చినుకులు ఎక్కువయ్యాయి. జల్లు మీద పడుతుండడంతో నేను మరి కాస్త వెనక్కి జరిగాను.

వర్షానికి అక్కడ చాలామంది గుమికూడడం ప్రారంభించారు. బాగా రష్ గా వుంది.

“ఛీ….. ఛీ….. వెధవ వాన” అని నాలో నేనే విసుక్కున్నాను. నా పెదవుల కదలికలను కనిపెట్టి కాబోలు “మీరు తెలుగా?” అని అడిగాడు అతను.

దూరంగా నిలుచున్నా అతను నా పక్కకు ఎప్పుడు చేరాడో నేను గమనించలేదు. నా పక్కన నిలబడడమే గాకుండా ఎంతో చనువుగా మేనత్త కూతుర్ని పలకరించినంత సునాయాసంగా మాట్లాడుతున్న అతన్ని చూసి నిజంగానే ఒక్కక్షణం భయమేసింది. అదే క్షణంలో కోపం కూడా వచ్చింది.

నాలోని మార్పులను అతను గమనించినట్టు లేడు. “ఏ ఊరు?” అతనే మళ్ళీ అడిగాడు.

నేను అతనివైపు పరిశీలించి చూశాను. దాదాపు ఇరవై అయిదేళ్ళ వయసుంటుంది. తెల్లటి ఫ్యాంటుమీద గళ్ళ షర్టు టక్ చేసుకున్నాడు. లేత ముఖంలో ఏదో క్రూరత్వం తోడేలుపిల్ల పచ్చగడ్డిలో కదలాడుతున్నట్టు కనిపిస్తోంది.

నేను సమాధానం చెప్పలేదు.

నా చేతిలోని నవలను చూసి “అయ్యయ్యో! పుస్తకం తడిసిపోతోంది. ఇంతకీ ఏం నవల?” అంటూ నా ముఖం మీదకి వంగాడు.

వ్యవహారం శ్రుతిమించుతూ వుందని నాకు అర్థమైంది.

“నవల పేరు చెప్పకపోతే పోనీలెండి- ఇంతకీ రేటెంత?” అని ప్రశ్నించాడు.

“పాతిక” అన్నాను అతన్నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ.

“పుస్తకం రేటు కాదు నీ రేటు?”

ఒక్కసారిగా అతనిమీద పడి గొంతు కొరికేద్దామన్న ఆవేశం వచ్చింది. ఎలానో తమాయించుకున్నాను.

“నువ్వు ఎంత పాతివ్రత్యం నటించినా అసలు విషయం నాకు తెలిసిపోయింది. నువ్వు రేతున్న మనిషివని నా సిక్తుసెన్స్ చెప్పింది.”

కోపంతో నేనెక్కడ పగిలిపోతానేమో ననిపించింది. ఆ సిక్తుసెన్స్ అనేపదం అంతే నాకు ఎలర్జీ. ఈ మధ్య చాలా నవలల్లో ఈ పదం దొర్లుతుండడం దానికి కారణం. వాడు అలాంటి చీప్ నవలలు చదివే ఆ పదం నేర్చుకుని వుంటాడని నా నమ్మకం.

“ఎంతయినా ఫరవాలేదు. రాత్రికి అయిదు వందలయినా సిద్ధమే” అన్నాడు గొంతు తగ్గించి.

వాడు జీవితంలో స్త్రీవైపు చూడకుండా గట్టిగా బుద్ధి చెప్పాలనుకున్నాను.

“నేనలా అనిపిస్తున్నానా?” అని అడిగాను నవ్వును ముఖంలో పులుముకుంటూ.

“ఖచ్చితంగా అలా కాదుగానీ ఫ్యామిలీ టైప్ అనుకున్నాను.”

“భలే కరెక్టుగా చెప్పారే.”

“అదే మరి ఈ చిట్టిబాబు స్పెషాలిటీ. అర కిలోమీటరు దూరం నుంచి చూసైనా ఏ పిల్ల ఎలాంటిదో చెప్పగలను” కాలర్ ఎగరేశాడు.

“మీ రేటుకు ఓ.కే. కానీ చిన్న రిక్వెస్టు. హోటల్ కు గానీ, మరెక్కడికిగానీ వద్దు. మా ప్లాట్ సేఫెస్ట్ ఫ్లేస్ ఓకేగదా” అన్నాడు.

“అలానే”

“అయితే అదిగోండి బస్సు” అంటూ కిందకు ఉరికాను.

నా వెనకే వాడు చొంగకార్చుకుంటూ కుక్కలా వెనకపడ్డాడు.

బస్సులో నాపక్కనే కూర్చోబోతే “వద్దు ఎవరైనా చూస్తే బాగోదు. అటెళ్ళి కూర్చో” అన్నాను.

వాడు ఇబ్బందిగానే పక్క సీటు దగ్గరికి కదిలాడు.

మా కాలనీ రాగానే ఇద్దరం దిగాం.

వాడి వివరాలడుగుతూ మా వీధిలోకి వచ్చాం. మరో పదడుగుల దూరంలో మా ఇల్లు వుందనగా వాడిని ఆపి “అదిగో ఆ ఎల్లో పెయింట్ వేసిన అపార్టుమెంటులోనే మా ఇల్లు నెంబర్ ఫైవ్. ఫస్ట్ ఫ్లోర్ రైట్ లో వేసిన అపార్టుమెంటులోనే మా ఇల్లు నెంబర్ ఫైవ్. ఫస్ట్ ఫ్లోర్ రైట్ లో ఉంటుంది. నేను వెళ్ళిన పావుగంటకు వచ్చేయి. నీకోసం తలుపులు తెరిచే వుంచుతాను” అని చెప్పాను.

నా ప్లాట్ ను చేరుకొని వాడు వచ్చేలోపు చేయాల్సిన కొన్ని పనులు పూర్తి చేశాను. స్నానం చేసి బట్టలు మార్చుకుని హాల్లోని సోఫాలో కూర్చున్నాను.

ఖచ్చితంగా పావుగంట తరువాత వచ్చాడు.

లోపలంతా చీకటిగా వుండడంతో వాడు తాత్కాలికంగా అంధుడై పోయాడు.

“బాబూ” స్వీట్ గా పిలిచాను.

“ఇదేమిటి ఏమీ కనిపించడం లేదు. కరెంట్ లేదా?”

“ఆఁ మా ప్లాట్ లోనే కరెంట్ పోయినట్లుంది. మరేం ఫర్వాలేదు గానీ నేను చెప్పినట్లు అడుగులు వెయ్ నేరుగా హాల్లోకి వచ్చేస్తావు.”

వాడు ద్వారం దగ్గరే కదులుతున్నట్లు మసగ్గా కనిపిస్తున్నాడు.

“అలానే ఒకడుగు ముందుకు వెయ్- ద్వారం దాటేస్తావు. ఆఁ అట్లాగే ముందుకు వెరీ నైస్ బాయ్. ఆఁ ఆగు- పక్కకి తిరిగి జస్ట్ టూ స్టెప్స్.”

వాడు నేను చెప్పినట్లే అడుగులు వేశాడు.

“అక్కడ చేత్తో తడుము కుర్చీ తగుల్తుంది. సిక్తుసెన్స్ ఉందన్నావు కదా నువ్వు ఈజీగానే ప్రొసీడ్ కాగలవు.”

వాడు గుడ్డివాడిలా చేతులతో తడిమి కుర్చీలో కూర్చున్నాడు.

“ఇక్కడెందుకు మళ్ళీ? నువ్వెక్కడున్నావో చెబితే అక్కడికే వచ్చేస్తాను” అసహనంగా అన్నాడు.

మళ్ళీ వర్షం మొదలయినట్లు చప్పుడు. ప్రపంచమే పెద్ద కాటుక దబ్బీలా వుంది.

“అంత తొందరయితే ఎలా? శృంగారంలో స్పీడ్ పనికిరాదు. బొత్తిగా అనుభవం లేనివాడే తొందరపడేది. నువ్వు చాలా ఎక్స్ పీరియన్స్ వున్నవాడివి కదా. అందునా నువ్వు ఆడపిల్లను దూరం నుంచి చూసే ఫ్యామిలీ గర్లో, బిచ్చో చెప్పగలిగిన ప్రతిభావంతుడివి. నువ్వు నా మాట వినకుండా ముందుకు వచ్చావంటే అంతే సంగతులు. కిందంతా గాజు ముక్కలున్నాయి. అవి గుచ్చుకుంటే అంతా రసాభాసవుతుంది.”

“గాజుముక్కలా?”

“ఆఁ ప్లవర్ వేజ్ ఇప్పుడే పగిలిపోయింది. భూదేవి అద్దాల చీర కట్టుకున్నట్లు అవి పరుచుకున్నాయి.”

“పెద్ద చిక్కే.”

“అవును. అందుకే నేను లేవమన్నప్పుడు లేచి వచ్చేయి.”

వాడు ఏమీ మాట్లాడలేదు. అదోరకమైన యిబ్బందివల్లే వాడికి నోట మాట రావడం లేదని తెలుసు.
“మరి స్టార్ట్ చేద్దామా?”

ఆ మాటకు ఠక్కున లేచాడు వాడు. శబ్దాలనుబట్టి వాడు లేవడాన్ని గుర్తించాను.

“లేవకు చెప్పానుగదా. నువ్వు లేచి అడుగులు వేస్తే గాజుముక్కలు శత్రువుల్లా నీ పాదాల్ని చీరేస్తాయని.”

అతను అయిష్టంగానే తిరిగి కూర్చున్నాడు. నేను ఎందుకలా ప్రవర్తిస్తున్నానన్న పజిల్ వాడి ముఖాన్ని వికారంగా ఉబ్బిస్తోందని నాకు తెలుసు.

“నువ్వక్కడే- నేను ఇక్కడే- నువ్వు నేను చెప్పింది వినాలి తప్ప మరేం చేయకూడదు. రామా ఈజ్ ఏ గుడ్ బోయ్ అన్నట్లు నువ్వు కూర్చోవాలి. మరి స్టార్టు చేయనా?”

అతను వూపిరి బిగపట్టాడు.

“ఇదంతా ఎందుకో నీకు అర్థం కావడంలేదు. పోగా పోగా అర్థమవుతోంది. ఒకరికి ఒకరు కనిపించని ఈ చీకట్లో ఇద్దరం చాలా దూరంలో వుండి జరిపే ఈ కొత్తరకం రొమాన్స్ ఎలా వుందో చివర్లో నువ్వే చెప్పాలి.

ఇందులో భాగంగా మొదట జుట్టుముడి విప్పుతున్నాను. ఇప్పుడు పైనున్న క్లిప్ తీశాను, నా జుట్టు బంధనాలన్నీ తెంచుకొని చల్లగాలికి కదిలిన మేఘంలా పరుచుకుంది. కానీ పాపం నీకేమీ కనిపించడంలేదు అవునా?”

అతను కుర్చీలో ఇబ్బందిగా అటూ ఇటూ కదిలాడు.

నేను కొనసాగించాను- “ఇదిగో నా రెండు చేతులూ నా విశాలమైన కళ్ళను తాకుతూ కిందకు దిగుతున్నాయి. నా కళ్ళు ఎంత బావున్నాయో గమనించావా? కనుపాపల్లో శృంగారాన్నంతా కూరినట్లు మత్తుగా, డ్రీమీగా వుంటాయి. కళ్ళెత్తితే చాలు కనకాభిషేకాలు అవి నా కళ్ళులాంటి కళ్ళను చూసే అని వుంటాడు నండూరి.

ఇక నా ముక్కు- నువ్వు గ్రహించావో లేదో గానీ మన్మధుని విల్లులా వుంటుంది. నా పెదవులను చూసి దొండపండులేమో అన్న భ్రమలో చిలకలు వాలినా ఆశ్చర్యం లేదన్నట్లు వుంటాయి. అలానే కిందికి దిగితే నా కంఠం- పొడవుగా చీలి నరలాను నగ్నంగా ప్రదర్శిస్తూ మనోహరంగా వుంటుంది. కానీ నీకు ఏమీ కనిపించడం లేదు. ఐ పిటీ ఫర్ యూ.”

తనను ఇబ్బంది పెట్టడానికి ఇక్కడకు తీసుకొచ్చానని అర్థమైంది అతనికి. దాంతో కోపంతో మనిషి ఊగిపోతున్నాడు. లేచి ఎటైనా అడుగు లేస్తే గాజు పెంకులు గుచ్చుకుంటాయన్న భయం అతన్ని బలవంతంగా కుర్చీలో కూర్చోబెడుతోంది.

నేనేమీ అతన్ని పట్టించుకోనట్లు సాగించాను. “ఇప్పుడు నా ఎడమీద పైట తీసేస్తున్నాను. వెలుతురు వుంటే పైట తీసిన మరుక్షణం సౌందర్యం బరువుకి నీ కళ్ళు పేలిపోయి వుండేవి. కానీ నీకా ఛాన్స్ లేదు. కళ్ళు వున్నా చూడలేని గుడ్డివాడివి” పైట తీశాను.

“నా ఎత్తు గుండెలు గుండ్రంగా, ఎదుటి మనిషిలో తుఫాను రేపుతున్నట్లు వున్నాయి. ఈ లోనెక్ జాకెట్ లోంచి బయటికి దుమకడానికి అవి చేస్తున్న ప్రయత్నం జాకెట్ వంపు తిరిగిన దగ్గర అద్భుతంగా కనిపిస్తోంది. వాటి నునుపుకి నీ చూపులు కూడా జారిపోతాయి, కానీ నీకు ఏమీ కనిపించడంలేదు.

ఈ జాకెట్టుకి మొత్తం అయిదు హుక్ లున్నాయి. నాలుగు చాలు. కానీ మదపుటేనుగును బంధించడానికి ఎక్కువ సంకెళ్ళు ఉపయోగించినట్లు ఎక్ స్ట్రాగా ఒక హుక్ పెట్టుకున్నాను. అప్పటికి ఒక్కొక్కప్పుడు హుక్ లు తెగిపోతాయేమోనన్నట్లు వయసు పొంగుతుంటుంది. అయితే నీలాంటి నీచుల్ని చూసినప్పుడు వయసు పొంగదులే. కాబట్టి ఇప్పుడా సమస్య లేదు” అంటూ ఆగాను.

అతని కోపం, బాధ అతను ఊపిరి వదలడంతో తెలుస్తోంది.

“ఇప్పుడు మొదటి హుక్ విప్పుతున్నాను. అంత అందాల్ని వదలి పెట్టడం ఇష్టంలేనట్లు హుక్ రావడం లేదు. కానీ తంటాలుపడుతున్నాను. హమ్మయ్య- వచ్చేసింది” అన్నాను నేను. హుక్ వూడిన శబ్దం అతని చెవుల్లో విస్ఫోటనంగా అనిపించి వుంటుంది.

“ఇక రెండో హుక్- మూడో హుక్- నాలుగో హుక్. జాకెట్టు ఇప్పుడు సీతాకోక చిలుక రెక్కల్లా విడిపోయింది. చివరి హుక్ విప్పుతున్నాను. ఆఁ వచ్చేసింది. ఇప్పుడు నా పైభాగంలో బ్రా తప్ప ఏ ఆచ్ఛాదనా లేదు.

బ్లాక్ బ్రా అమృత భాండాలను పెట్టుకోవడానికి అల్లిన చిక్కంలా వుంది. మొన్ననే దీన్ని బజారులో కొన్నాను. సెవెంటీ ఫైవ్ రూపీన్ బావుందా? సారీ నీకు మీ కనిపించడంలేదుగా- బావుందో లేదో చెప్పలేవు. దీనికి వెనక హుక్- ఎలాస్టిక్ సాగబెరికి తప్పించాను.”

ఫట్ మన్న చప్పుడు.

“ఇదిగో జాకెట్ తీసి ఒడిలో వేసుకున్నాను. తెల్లటి జాకెట్ నా ఒడిలో పెంపుడు కుందేలు పిల్లలా వుంది. బ్రా కూడా తీసి ఒడిలో వేసుకున్నాను. ఇప్పుడు నా టాప్ అంతా నగ్నంగా వుంది. నా హృదయసంపద గుడిమీద బంగారు కలశాల్లా- వద్దులే మొత్తం వాటి అందం, బింకం వర్ణిస్తే నువ్వు గుండాగి ఛస్తావ్.”

“వాటీజ్ దిస్? నేను వెళుతున్నాను” అతను స్ప్రింగ్ లా లేచాడు.

“సారీ మిస్టర్ బాబు! కూర్చో! నువ్వు ఇప్పుడు లేచావో నేను అరుస్తాను. ఈ అపార్టుమెంట్ లో మొత్తం పన్నెండు ప్లాట్ లున్నాయి. ప్లాట్ కి అయిదుమంది చొప్పున వేసుకున్నా మొత్తం అరవై మంది వచ్చేస్తారు. నువ్వు నన్ను బలవంతం చేశాని చెప్పాననుకో- వాళ్ళు నిన్ను ఊరికే వదలరు. దేహశుద్ధి చేసి సెక్యూరిటీ ఆఫీసర్లకి అప్పగిస్తారు. కాబట్టి కూర్చో.”

సెక్యూరిటీ ఆఫీసర్లు అన్న మాటలు వినగానే అతను నీరసంగా కూర్చుండి పోయాడు.

“నువ్వు కూర్చున్నావు గనుక కంటిన్యూ చేస్తున్నాను. ఇక నా ఎద నుంచి కిందికి దిగితే నా నడుము ఎవరో చక్కటి రాజకుమారుడు వచ్చి నా పాణి గ్రహించాలని కోరుతూ అహోరాత్రులు తపస్సు చేసి చిక్కిపోయినట్లు నా నడుం మరింత సన్నగా కనిపిస్తుంది. బొడ్డు- మానస సరోవరం అనేది ఒకటుంటే అందులో విచ్చుకున్న ఒంటరి తామరపువ్వులా వుంటుంది. ఈ విచిత్రాన్ని నువ్వు చూడలేవు. బికాస్ నో కరెంట్.”

అతను వూపిరి బిగపట్టడం తెలుస్తూనే వుంది. మరికాస్త ఇరిటేట్ చేయాలని- “చేయిచాస్తే అందేంత దూరంలో వున్న అందమైన ఆడపిల్ల అర్థనగ్నంగా వున్నా ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో వున్నావు. చీప్ పేపర్ మీద తపాలా బిళ్ళ సైజులో వున్న ఆడపిల్ల బొమ్మ చూసి ఆవేశపడే మగాడికి ఇలాంటి పరిస్థితి ఎదురవడం నరకం కదూ?” అన్నాను.

అతను ఏమీ మాట్లాడలేదు.

“ఇక నెక్ట్సు చీర- యవ్వన సామ్రాజ్యం చుట్టూ బిగుడుకున్న గోడలా చీర. మొత్తం పదహారు కుచ్చిళ్ళతో కిందికి దిగి అందం ఒత్తిడికి విచ్చుకున్న పువ్వులా వుంది.
Next page: Chapter 14
Previous page: Chapter 12