Episode 14


హా... ఇప్పుడైనా చెప్తారా లేదా అని మొహం తుడుచుకుని టవల్ పక్కన పెట్టేసి అక్క పక్కన కూర్చున్నాను.

సుదీప్ : నీకొక విషయం చెప్పాలిరా

వంశీ : అదేదో చెపుతావనే కదా, ఇంత దూరం వచ్చింది.. చెప్పు చెప్పు

చందన : చెప్పేదాకా వినవా ఏది.. అని విసుక్కుంది

వంశీ అక్క వందన మాత్రం తల కిందకి వేసి మౌనంగా కూర్చుంది.

సుదీప్ : అమ్మా నేనసలు విడిపోలేదు.. అని వంశీని చూసాడు, వంశీ అమ్మ చందన, అక్క వందన ముగ్గురు వంశీ వంక చూసారు.

వంశీ : ఆ.. తరవాత ఏంటో చెప్పు

చందన : అదేంట్రా నీకు..

వంశీ : ముందు చెప్పండి.

సుదీప్ : అమ్మా నేను ఒక కారణం వల్ల విడిపోవాల్సి వచ్చింది.

వందన : మీరాగండి.. పండు.. నాతోరా అని వంశీ చెయ్యి పట్టుకుని మేడ మీదకి లాక్కెళ్ళింది.

వంశీ : ఏంటే.. ఇదీ

వందన : అమ్మా నాన్న నా వల్లే విడిపోయారు.. ఎందుకంటే ఎందుకంటే.. నేను.. నేను.. నేనొక షిమేల్ ని అని తల దించుకుంది.. చిన్నగా తల పైకి ఎత్తి వంశీ ని చూసింది.. వాడు స్థంభంలా నిలబడేసరికి కదిలిచ్చింది.. రెండు నిమిషాలకి కానీ వంశీ నోరు తెరవలేదు

వంశీ : ఏం మాట్లాడుతున్నావే.. నువ్వు.. నువ్వు..

వందన : అవును..

వంశీ : నమ్మబుద్ధి కావట్లేదు.. అస్సలు..

వందన తమ్ముడు.. అని పిలిచింది వస్తున్న దుఃఖం గొంతు దెగ్గరే ఆపేసి.. ఆ గొంతు వినగానే వంశీ తన అక్కభుజం మీద చెయ్యి వేసాడు.. నా గురించి నీకు ఎలా చెప్పాలా ఎప్పుడు చెప్పాలా అని నేను మదన పడని రోజు లేదు.. ఇన్నేళ్లు అమ్మతో ఉన్నాననే కానీ నా బాధలు ఎవ్వరికి చెప్పుకోలేదు.. నువ్వు వింటావా

వంశీ : అక్కా.. ఏడవకు.. లైఫ్ లో ఏదైనా ఏమైనా నేను నీ పక్కన కాదు నీ ముందు నిలబడతాను.. నాకింకా తెరుకోవడానికి టైం పడుతుంది.. చెప్పు ఇన్నేళ్లు నేను చూసిన అక్కకి నాకు నువ్వు పరిచయం చేస్తున్న నా ఇంకో అక్క గురించి నాకు చెప్పు అని కింద కూర్చున్నాడు.

వందన వంశీ పక్కనే కూర్చుని వాడి భుజం మీద తన తల పెట్టుకుంది, కానీ ఓదార్పుగా వంశీ చెయ్యి తన తల మీద కానీ భుజం మీద కానీ పడలేదు అందుకు బాధపడినా వంశీ స్థితిని అర్ధంచేసుకుని తనే దూరంగా కూర్చుంది.

వందన : నేను పుట్టగానే డాక్టర్ చెప్పేసిందట నేనొక షిమేల్ అని, నాన్న నన్ను వదిలించుకోవాలని చూసినా అమ్మ అందుకు ఒప్పుకోలేదట కావాలంటే దానికి బదులు నాన్నని వదిలేయడానికి కూడా సిద్దమని తెగేసి చెప్పిందట.. అమ్మమ్మ వాళ్లకి తెలిసినా బైట పడనివ్వలేదు.. నానమ్మ ఆడపిల్ల పుట్టిందని గొడవ చెయ్యడంతో అదే అదునుగా అమ్మమ్మ తెలివిగా నానమ్మ వాళ్ళతో గొడవ పెట్టుకుని దాన్ని పెద్దది చేసి ఆ ఇంటికి ఈ ఇంటికి రాకపోకలు లేకుండా చేసి నా విషయం గురించి ఎవ్వరికి తెలియకుండా బైటికి పొక్కకుండా జాగ్రత్త పడ్డారు.. అలా నేను మొదటే నానమ్మ వాళ్ళకి దూరం అయిపోయాను.. ఆ తరువాత నాన్న కూడా అమ్మని అర్ధం చేసుకుని తెలివిగా సంవత్సరం తరువాత అమ్మని ఇంటికి తీసుకొచ్చి వేరు కాపురం పెట్టాడు.. అది ఎవ్వరికి నచ్చలేదు.. కొంత కాలం ఎదురు చూసారు ఆ తరువాత నానమ్మ వేరు కాపురానికి ఒప్పుకోకపోవడంతో తప్పక అమ్మా నాన్న ఒప్పందం చేసుకుని దాని ప్రకారంగా ఇద్దరు విడిపోయారు.. అమ్మ నన్ను తీసుకుని ఇక్కడికి వచ్చేసింది.. నిన్ను తీసుకెళ్లడానికి నానమ్మ వాళ్ళు ఒప్పుకోలేదు అందుకే ఇన్నేళ్లు నువ్వు మాకు దూరంగా ఉండాల్సి వచ్చింది.

నీకు ఈ విషయం చిన్నప్పుడే చెపుదామని నేను గొడవ చేసాను, కానీ నువ్వు చిన్నపిల్లాడివని.. నా గురించి అందరికీ తెలుస్తుందని అమ్మ ఒప్పుకోలేదు.

చిన్నప్పటి నుంచి అని వందన తన కధ చేపితుంటే వంశీ లేచి నిలబడి ఏం మాట్లాడకుండా కిందకి వెళ్ళిపోయాడు, వంశీ వెంటనే వందన కూడా వచ్చింది, తన తమ్ముడు ఏం ఆలోచిస్తున్నాడో తన గురించి ఏం అనుకుంటున్నాడో ఏం అర్ధం కాలేదు.

చందన : ఏరా

వంశీ : ఏంటి.. ఏం లేదు.. అక్క చెప్పింది

సుదీప్ : అంత ఈజీగా తీసేసావ్ ఏంట్రా

చందన : వందనా వీడికి నువ్వు ఏం చెప్పావ్

వంశీ : అదే చెప్పింది.. సరే.. ఇప్పుడేంటి ఆశ్చర్యపోయినట్టు నటించాలా.. నువ్వు నీ కూతురుని తీసుకుని వెళ్లిపోయావ్.. ఆయనేమో నెలకోసారి ట్రిప్ అని వారం రోజులు ఇక్కడికే కదా వచ్చేది.. అంతే కదా అని నాన్నని చూసాను అవును అని తల ఊపాడు.. హ్మ్మ్.. మీరు ముగ్గురు బానే ఉన్నారు ఇంకేంటి మీరు హ్యాపీయే కదా.. ఓకే

వందన వచ్చి తన తమ్ముడి పక్కన నిలుచుని వాడి భుజం మీద చెయ్యి వేసింది, వంశీ తీసేసాడు. నాకింకేమైనా చెప్పాలా

భార్య భర్తలిద్దరికి వంశీ మాటలు అర్ధం కాలేదు ఇద్దరు అలానే నిలుచుని ఉన్నారు, వందన మాత్రం తన తమ్ముడి కళ్ళలోకి చూసింది తన బాధని పసిగట్టింది.

వంశీ : సరే మరి.. నేను ఇంటికి వెళుతున్నాను.. నాన్నా.. నువ్వో వారం ఆగి వస్తావా

సుదీప్ : లేదు మనం ఇక్కడే ఉంటున్నాం, నేను అక్కడంతా అందరికీ సెట్ చేసాను, తాతయ్యకి కూడా చెప్పాను.. మేము మాట్లాడుకున్నాం.

వంశీ : మనం అంటే ఎవరు.. మీరు ముగ్గురా

చందన : అదేంట్రా అలా మాట్లాడతావ్.. నువ్వు వేరేనా

వంశీ : మరి అంతే కదా.. ఇందులో నేనెక్కడున్నాను.. అయినా నేను మీతో ఉండలేను.. ఉండడం కుదరదు.. కుదిరినా కష్టమే

అక్క మధ్యలో కదిలించబోతే తన చెయ్యి పట్టుకున్నాను..

చందన : అమ్మా నాన్న కంటే ఎక్కువా

వంశీ : అది నువ్వు అనుకోవాలి.. అయినా నాకిప్పుడు నీతో డిస్కషన్ పెట్టేంత ఇంట్రెస్ట్ లేదు.. నీకు నాకు మధ్య అంత చనువు కూడా లేదు నువ్వేరోజు నాకు అమ్మగా ఉండలేదు నా గురించి పట్టించుకోలేదు ఇక నాన్న విషయానికి వస్తే నెలలో వారం రోజులు ఇక్కడా మిగతా రోజుల్లో ఆయన పనులు, గొడవల, పిన్నితో సరసాలు ఆయన జీవితం ఆయనది. నువ్వు అంతే అక్కా ఫోన్ చేసినప్పుడల్లా సాయంత్రం చేస్తా అంటావ్ ఎన్నో మాటలు చెపుతావ్ తరవాత ఒక మాట కూడా ఉండదు.. ప్రతీసారి నేనే మిమ్మల్ని గుర్తు పెట్టుకుని ఫోన్ చెయ్యాలి.. నేనేదైనా అడిగితేనే చెపుతారు లేకపోతే తిన్నావా పన్నావా ఉంటా బై ఈ నాలుగు ముక్కలు అంతే.. నీకు ప్రాబ్లెమ్ ఉండొచ్చు నేను కాదనట్లేదు.. కానీ.. ఎందుకులే.. మాట మాట అనుకుంటే దాని వల్ల లాభమేముంది..

ఇక అక్కడ పిన్ని ఉంది, పేరుకే నేను పిన్ని అని పిలుస్తున్నాను కానీ తనే నాకు అమ్మ.. ఆ తరువాత నా టీచర్.. తనని వదులుకుని నేను రాలేను.. నన్నే నమ్ముకుని ఉంది.. దానికి నేనే దిక్కు.. నన్ను నమ్ముకుని ఇంకో అమ్మాయి ఉంది.. అదీ కాక ఈ సారి క్రికెట్ నేషనల్స్ ఆడతానని అక్కడ వాళ్ళకి మాటిచ్చాను.. నేను వెళ్ళాలి.. నాతో ఇంకేమైనా మాట్లాడాలా

అమ్మ కొంగు అడ్డం పెట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంది, నాన్న కూడా ఇంచుమించు అలానే ఉన్నాడు ఏడవటానికి.. కానీ నాక్కావాల్సింది ఇది కాదు.. ఎందుకో నేను పడ్డ బాధ కూడా వాళ్ళకి తెలియాలి అనిపించింది.

చందన : పిన్ని నిన్ను బాగా చూసుకుంది ఒప్పుకుంటాను కానీ ఆ టీచర్.. వాళ్ళేక్కడా మనం ఎక్కడా.. మనం డబ్బున్నవాళ్ళమని నీతో చనువుగా ఉంది అంతే.. కోపంగా అనేసింది.

వంశీ : ఏంటి వాళ్ళేక్కడా మనం ఎక్కడా.. అంటే కులం గురించి మాట్లాడుతున్నావా.. అవును నా టీచర్ నన్నే నమ్ముకుని ఉంది.. నేను రమ్మంటే మన ఇంటి పక్కన కాపురం పెట్టింది.. తనకి గవర్నమెంట్ టీచర్ గా జాబ్ వచ్చి వేరే ఊర్లో పోస్టింగ్ వస్తే నన్ను వదిలి ఉండలేక ఎవరు ఎన్ని చెప్పినా వినకుండా జాబ్ వదిలేసుకుంది. ఇదిగో పొద్దున నుంచి పదిసార్లు కాల్ చేసింది.. నేను వెళ్ళింది నా అమ్మ దెగ్గరికే అని తనకి తెలీదా వెళ్ళింది నా నాన్నతో అని తనకి తెలీదా.. ఒకసారి ఫోన్ చేస్తాను విను అని ఫోన్ చేసి స్పీకర్ లో పెట్టాను.

రాధిక : ఏరా.. ఎన్ని సార్లు ఫోన్ చేసాను.. ఎత్తవే.. తిన్నావా.. టైంకి తిను.. అమ్మా అక్కని చూసిన ఆనందంలో అన్ని మర్చిపోతావ్.. ఏం మాట్లాడవే.. అమ్మా అక్కా ఎలా ఉన్నారు..

వంశీ : నేను మళ్ళీ చేస్తా.. అని ఫోన్ పెట్టేసాను.. అమ్మ తల దించేసింది.. నాన్న మౌనంగా నిలుచున్నాడు.. నాకు ఎవ్వరి మీదా కోపం లేదు, ఎవ్వరి మీదా నమ్మకం లేదు.. నా కన్నీళ్లు నేనే తుడుచుకున్నాను.. నా జీవితం నా పరిస్థితులు.. నేనింకా నా పరిస్థితి మాత్రమే చెప్పాను.. నేను ఎంత బాధ పడ్డానో మీకు ఎప్పుడైనా తెలియనిచ్చానా

వందన : పండు..

వంశీ : ముందు ఆకలేస్తుంది.. ఏమైనా పెట్టు అని బైటికి వెళ్లి టీచర్ తో ఫోన్ మాట్లాడి వచ్చాను.. వెంటనే సారికకి ఫోన్ చేసాను..

సారిక : చెప్పరా ఇందాకే అమ్మా నేను వెళ్లి హారం తీసుకొచ్చాం.. నా మెడలోకి బాగుంది

వంశీ : చెప్పింది..

సారిక : ఏంటి మా బాబుగారి గొంతు అలా ఉంది.. ఏం జరిగిందీ..

వంశీ : ఏం లేదు.. తరువాత చెప్తాలే..

సారిక : ఎప్పుడు వస్తున్నావ్

వంశీ : కొంచెం ఆగి బైలుదేరతా.. నాకిక్కడ ఉండబుద్ధి కావట్లేదు..

సారిక : ఏం జరిగిందిరా..

వంశీ : ....

వంశీ : నాకు అక్క పడ్డ బాధలు వినాలని లేదు, అందుకే ఎవ్వరిని మాట్లాడనివ్వలేదు

సారిక : నీ వల్ల ఎవ్వరు బాధ పడకుండా ఉండేలా చూసుకో అదే టైంలో ఇంకొకళ్ళ కోసం నిన్ను నువ్వు బాధ పెట్టుకొనవసరం లేదు.. అది గుర్తుంచుకో.. వచ్చేస్తావా

వంశీ : ఉమ్..

సారిక : ఎదురు చూస్తుంటాను..

ఇంట్లోకెళ్లి చూస్తే అమ్మ ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంది.. వెళ్లి తన పక్కన కూర్చున్నాను.. నా మొహమంతా ముద్దులు పెడుతూ ఏడుస్తుంటే ఆపాను.

చందన : నేను..

వంశీ : నేను మిమ్మల్ని అర్ధం చేసుకున్నాను కాబట్టే ఇంత కాలమైనా మిమ్మల్ని చూడాలని నా మనసు ఉవ్విళ్ళురుతుంటుంది.. సారీ.. అని బుగ్గ మీద ముద్దు పెట్టి పదా అన్నం తినిపించు నీ చేత్తో.. అక్కా నువ్వు కూడా.. లే.. పదా ఇద్దరం కలిసి తిందాం అని లేపేసరికి ఇద్దరు కిచెన్ లోకి వెళ్లారు.. వెళ్లి నాన్న పక్కన కూర్చున్నాను.

సుదీప్ : అస్సలు మమ్మల్ని మాట్లాడనివ్వవా.. అంతా నీదేనా

వంశీ : సారీ.. ఇక అయిపోయిన విషయాలు ఎందుకులే.. అక్క తన జీవితంలో ఎంత ఇబ్బంది పడి ఉంటుందో ఎంత ఏడ్చి ఉంటుందో నేను ఊహించగలను ఇప్పుడు అవి మళ్ళీ గుర్తు చేయకండి.. కానీ నేను ఇక్కడ ఉండలేను ఎందుకో చెప్పాను

సుదీప్ : ఆ అమ్మాయి ఎవరు...?

అమ్మా అక్కా అన్నం ప్లేట్ తో వచ్చి నా పక్కన కూర్చున్నారు.

వంశీ : ఉందిలే.. తరవాత చెప్తా

వందన : కనీసం ఫోటో అయినా చూపించు..

వంశీ : లేదక్కా తీయలేదు

చందన : ఏది నీ ఫోన్ ఇవ్వు.. అనగానే అక్క నా ఫోన్ లాగింది..

వంశీ : అక్కా.. ఏయి.. వద్దు..

చందన : ఏ..

వంశీ : దాని ఒంటి మీద బట్టలు లేవు..

చందన : ఏం కాదు మేము ఆడోళ్ళమే కదా

వంశీ : పక్కనే నేను కూడా ఉన్నానే.. నా ఒంటి మీద కూడా బట్టలు లేవు అని అక్క చేతిలో ఫోన్ లాక్కున్నాను.. అక్క నోటి మీద చెయ్యేసుకుంది అవ్వా.. అంటూ

చందన : ఏవండీ.. విన్నారా..

సుదీప్ : నిజమే మనం వాడిని పట్టించుకుని ఉంటే బాగుండేది.. వాడెప్పుడు ఆనందంగానే ఉన్నాడని మొహం చూసి వాడిని పట్టించుకోలేదు.. లేకపోతే ఇంకెవరి దెగ్గరో అమ్మతనం వెతుక్కోవాల్సి వచ్చేది కాదు అని కళ్ళు తుడుచుకున్నాడు..

ముగ్గురం నాన్న పక్కన చేరాము, అమ్మ కూడా ఏడ్చింది.. వారిని ఓదార్చి, నవ్వించి ఆ రోజు ఉండి తెల్లారి సాయంత్రం ఇక బైలుదేరతానని చెప్పాను.. అక్క వాళ్ళు ఎంత నచ్చచెప్పినా నాకెందుకో ఉండబుద్ది కాలేదు.. స్టేషన్ కి వచ్చి ట్రైన్ ఎక్కి కూర్చున్నాను.. ముగ్గురు వచ్చారు.

అమ్మకి నాన్నకి చెప్పి ట్రైన్ ఎక్కి కూర్చున్నాను, అక్కని పిలిచాను లోపలికి వచ్చింది.. అక్కా.. నువ్వు షిమేలో హిమేలో నాకు అవన్నీ అనవసరం నువ్వు నా అక్కవి అంతే.. అని ముద్దు పెట్టుకున్నాను.. త్వరలోనే నువ్వు నాదెగ్గరికి వచ్చేస్తావ్.. నువ్వు అనుకున్నట్టే మనం ఇద్దరం కలిసే ఉంటాం.. ఇంకొన్ని రోజులు ఓపిక పట్టు.. నిన్ను నేను తీసుకెళతాను.. అమ్మా నాన్నని ఒక దెగ్గరికి మన ఫ్యామిలీలో చేర్చి నిన్ను నాతో పాటు తీసుకెళతాను.. నీకు ఏ లోటు రానివ్వకుండా చూసుకుంటాను..ఇంకోటి.. నిన్న నువ్వు నీగురించి చెపుతుంటే మధ్యలో లేచి వెళ్లిపోయానని తప్పుగా అనుకుంటావేమో.. నీ బాధలు, ఇబ్బందులు విని నేను తట్టుకోలేను.. అవి నీకు కూడా గుర్తు చేయడం నాకు ఇష్టంలేక లేచాను.. అంతే కానీ నేను నిన్ను దూరం పెట్టానని అసహ్యం అని అనుకోకు.. నువ్వంటే నాకు ప్రాణం

అక్క ఏడుస్తూ నన్ను వాటేసుకుని నిజంగా నన్ను నీతో ఉంచుకుంటావా అంటే నా జీవితంలో పెళ్లి ఉండదు నీకు..

వంశీ : నీకా భయం అక్కర్లేదు, నీ మరదలు నా కంటే నిన్ను బాగా చూసుకుంటది..

వందన : నాకు నీతో ఉండాలని ఉంది వంశీ ఐ లవ్ యు రా.. నాకు ప్రామిస్ చెయి అని చెయ్యి చూపించింది..

వంశీ : పిచ్చిదాన.. మాటిస్తే తప్పను.. అదిగో హారన్ వేసాడు.. ట్రైన్ కదిలిద్ది..

వందన : ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను.. అని నా బుగ్గన ముద్దు పెట్టింది.. తనని కౌగిలించుకుని వదల్లేదు.. ఏంట్రా అంది

వంశీ : బాడీ మొత్తం అమ్మాయి లానే ఉంది, అంటే అన్ని మెత్తగా ఉన్నాయి కానీ మరి అక్కడ..

వందన : పోరా.. అని తల మీద మొట్టి కిందకి దిగింది సిగ్గుగా

ట్రైన్ కదులుతుంటే చెయ్యి ఊపి లోపల కూర్చున్నాను.. ఎవరో పక్కన ఆయన ఏంటి బాబు అంత దీర్గంగా ఆలోచిస్తున్నావ్ ఏదైనా సమస్యా అని అడిగాడు.. లేదని నవ్వి మాములుగా కూర్చున్నాను.. పిన్ని హారం కోసం నా జీవితంలో ఒక నిర్ణయం తీసుకున్నాను మంచో చెడో ఇప్పుడు అదే నాకు ఉపయోగపడుతుంది.. ఇప్పుడు ఆడతాను క్రికెట్.. ఎవ్వరు నా మాట కాదనేంత డబ్బు, పవర్ సంపాదించాలి.. వస్తున్నా.. నేనేంటో నా స్టామినా ఎంతో తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది.. సమోసా అన్న అరుపుతో ఆలోచనల్లో నుంచి బైటికి వచ్చి సమోసా కొని తింటూ కిటికీ నుంచి చూస్తూ ఉన్నాను.
Next page: Episode 15
Previous page: Episode 13