Episode 19
సెమీ ఫైనల్స్ లాస్ట్ మ్యాచ్ అది ఢిల్లీతో మాకు అర్ధమైపోయింది, అనుకున్నట్టే ఓడిపోయాం. అస్సలు ఇంత దూరం రావడమే చాలా గొప్ప అనుకున్నారు మిగతా వాళ్ళు. తిరిగి ప్రయాణం అయ్యాము. రాత్రి ట్రైన్ లో అందరూ సొల్లు పెట్టుకుంటుంటే వింటున్నాను. రోహిత్ అన్న వచ్చి నా పక్కన కూర్చున్నాడు.
రోహిత్ : వంశీ.. బాధగా ఉందా
వంశీ : లేదన్నా.. మన ప్రయత్నం మనం చేసాం, గెలుపు ఓటములు మన చేతిలో లేవు కదా
రోహిత్ : ఇంత స్ట్రాంగ్ గా ఉంటారని అస్సలు ఎక్సపెక్ట్ చెయ్యలేదు, నెక్స్ట్ టైం ఇంకా బాగా ఆడాలి
వంశీ : పడుకుంటాను
రోహిత్ : గుడ్ నైట్
సారిక గురించి ఆలోచిస్తూ పడుకున్నాను, ఎప్పుడెప్పుడు దాన్ని చూస్తానా అని చాలా ఆరాటంగా ఉంది. కళ్ళు మూసుకుని తెరిచేలోగా తెల్లారింది. సారికకి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది, ట్రైన్ దిగి నేరుగా టీచర్ ఇంటికే వెళ్లాను.. తలుపు తెరిచింది టీచర్
వంశీ : జరగవే అని తోసుకుంటూ లోపలికి వెళ్లాను. సారిక రూం వంక చూసుకుంటూ టీచర్ రూంలోకి వెళ్ళాను. సారికకి మళ్ళీ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్.
రాధిక : ఏంట్రా వచ్చిన దెగ్గర నుంచి ఓ తెగ వెతికేస్తున్నావ్.. ఏం కావాలేంటి
వంశీ : ఏంటి ఒక్కదానివే ఉన్నావా ఇంట్లో
రాధిక : అవును యే.. సారికతో ఏమైనా పనా
వంశీ : నాకేం పని.. ఊరికే అడిగాను.. నువ్వు కాళిగా ఉంటే ఒక పట్టుపడదామనీ..
రాధిక మంచం మీద కూర్చున్న వంశీ దెగ్గరికి వచ్చి అయితే పట్టు అని వాడి ఒడిలో కూర్చుంది, అయినా కూడా వాడు పాపం సారిక కోసం ఎదురు చూస్తుంటే కొంత ఈర్ష్యతో పాటు ప్రేమ కూడా కలిగి కొంత జాలి కూడా వేసింది.. అయితే మాత్రం తనని ఏడిపించలా అందుకే సారికని పక్క రూంలో దాచి వంశీతో ఆడుకుంటుంది.
రాధిక వంశీ ఒడిలో కూర్చుని సారిక కోసం వాడు చూసే చూపులకి ముచ్చటేసి వాడి పెదాలు అందుకుంది. కొంత సహకరించాడు కానీ అందులో కొంత అసహనం కనిపించేసరికి రాధిక వెనక్కి తగ్గింది. రాధిక ఒళ్ళో నుంచి లేచి ముందు వెళ్లి స్నానం చేసి రాపో అనేసరికి లేచి వెళ్ళాడు.. వాడి కళ్ళలో ఎదురు చూపులు కనిపించాయి, రాధిక పక్క రూంలోకి వెళ్ళింది.
సారిక : అమ్మా.. వాడు పాపం ఎదురు చూస్తున్నాడే
రాధిక : హా.. ఎదురు చూపులు మాములుగా లేవు.. ఏం పర్లేదు.. ఉండు
సారిక : అబ్బా..
రాధిక : ఉండేవే.. చూద్దాం.. ఎంతసేపు ఆగుతాడో
సారిక : నలభై రోజులయ్యింది నన్ను చూసి
రాధిక : ఆగాగు అని మళ్ళీ తన రూంకి వెళ్ళింది. వెళ్లేసరికి వంశీ టవల్ కట్టుకుని ఫోన్ చేస్తూ ఛ అనుకుంటూ మళ్ళీ కాల్ చేస్తుంటే వెళ్లి ఫోన్ లాక్కుంది. వంశీ కోపంగా చూసాడు.. ముప్పై రెండు కాల్స్.. బుజ్జి.. అని మళ్ళీ చేసి స్పీకర్ లో పెట్టింది స్విచ్ ఆఫ్.. ఎవరీ బుజ్జి
వంశీ : ఉందిలే.. ఇటివ్వు.. అని కోపంగా లాక్కున్నాడు
రాధిక : ఎందుకంత కోపం..
వంశీ : వెళుతున్నా అని బైటికి నడిచాడు లగ్గేజ్ పట్టుకుని
రాధిక : ఒరేయి.. ఆగు.. ఇదిగో నీ బుజ్జి.. బుజ్జీ.. అని కేక వేయగానే సారిక పరిగెత్తుకుంటూ వచ్చింది, వంశీని కౌగిలించుకుంటూ ముద్దులు పెట్టేసింది.. వంశీ ఆశ్చర్యంగా చూసేసరికి సారిక అమ్మకి తెలిసిపోయిందంటూ తల ఊపింది.. ఇంకా గట్టిగా కౌగిలించుకుని మొహం అంతా ముద్దులు పెట్టేసాడు. రాధిక ఇద్దరినీ ప్రేమగా చుట్టేసి తన దెగ్గరికి తీసుకుంది.. ఇద్దరు కలిసి రాధిక చెరొక బుగ్గ మీద ముద్దు పెట్టగానే మురిసిపోయింది.
వంశీ : ఎప్పుడు చెప్పావే.. ఎలా తెలిసింది
సారిక జరిగింది మొత్తం చెప్పగానే ఒకసారి రాధిక వంక కోపంగా చూసాడు, దానికి రాధిక నువ్వనుకోలేదురా నేను, అందుకే కొట్టా.. అయినా కాని ఇద్దరు కలిసి ఎన్ని దొంగ నాటకాలు ఆడార్రా.. అనగానే ఇద్దరు నవ్వారు.
రాధిక : ముందు ఇంటికెళ్లి కనిపించిరాపో.. నీ బుజ్జి ఎక్కడికి పోదు కానీ అనగానే వంశీ లేచి వేగంగా ఇంటికి వెళ్ళిపోయాడు సిగ్గు పడుతూ.. రాధిక నవ్వుకుంది.
ఇంటికి వెళ్లి అందరినీ పలకరించాను, ఓడిపోయినందుకు అందరూ ఓదార్చారు. పిన్ని, మిత్ర అత్త మాత్రం ఏమి అడగలేదు ఏమి చర్చించలేదు సారిక, రాధిక లాగే.. రెండు మూడు రోజులు ఇంట్లోనే సరిపోయింది లత ఆంటీ పలకరించింది, ఏదో మాట్లాడాలంది వీలైతే ఒకసారి ఇంటికి రమ్మని చెప్పి వెళ్ళింది.
ఈ మధ్య అమ్మ కూడా రోజుకి రెండు సార్లు నాకు కచ్చితంగా ఫోన్ చేస్తుంది, అత్తయ్య కూడా ఈ మధ్య తెగ వాయించేస్తుంది ఎక్కడున్నావ్, తిన్నావా ఇంకా ఇంటికెందుకు రాలేదు అని, ఇక పిన్ని గురించి అయితే చెప్పనవసరం లేదు. అందరూ నా గురించి ఆలోచిస్తూ నన్ను పట్టించుకుంటున్నారు.. బాగుంది కానీ అప్పుడప్పుడు మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. పాపం సారికకి నాతో టైం దొరకట్లేదు.. కాలేజీకి రెగ్యులర్ గా వెళ్ళమని కొంచెం సీరియస్ గా చెప్పాక రోజూ వెళుతుంది. ఒకరోజు ఫోన్ చేసింది.
సారిక : బావా
వంశీ : చెప్పవే..
సారిక : పబ్ కి వెళదాం
వంశీ : దేనికి.. అది ఎంత దూరం ఉందొ తెలుసా
సారిక : మా ఫ్రెండ్స్ కి నిన్ను పరిచయం చేస్తాను
వంశీ : ఎందుకే, ఇప్పుడవన్నీ
సారిక : అబ్బా వెళదాం
వంశీ : సరే సరే వస్తున్నా.. హా నేను అమ్మకి చెప్తా అని పెట్టేసింది.
చాలా రోజులయ్యింది సారికతో ప్రశాంతంగా గడిపి, ఆల్రెడీ చీకటి పడుతుందని లేచి రెడీ అయ్యాను. సారిక నుంచి మళ్ళీ ఫోన్
సారిక : రెడీ అయ్యావా
వంశీ : ఎప్పుడో
సారిక : వచ్చేయి మరి వెళదాం, నాది అయిపోయింది.
ఇంటి ముందే ఉన్నా వచ్చేయి అనగానే తలుపు తీసి నన్ను చూసి మొహం మాడ్చింది. చీర కట్టుకుంది అదీ మొదట సారి.. పింక్ జాకెట్ తెల్ల చీర.. తల్లో మల్లెపూలు పెట్టుకుని ఓ చేతి నిండా గాజులు ఇంకో చేతికి వాచ్ పెట్టుకుని, నుదిటిన చిన్న బొట్టు, కళ్ళకి కాటుక పెట్టుకుంది అంతే ఇంకేం మేకప్ వేసుకోలేదు.. వేసుకుంటే దెగ్గరుండి ఒళ్ళు రుద్ధుతానని దాని భయం.. నాకు మేకప్ లంటే పడవు మరి
సారిక : మోకాళ్ళు వంచి మరి మెలికలు తిరుగుతూ ఏడుస్తూ.. అమ్మా.. ఇలా రా.. చూడు వాడు ఎలా వచ్చాడో.. టీ షర్ట్ షార్ట్ వేసుకుని ఆ డొక్కు బండి తీసుకుని వచ్చాడు.
వంశీ : ఈ చీకటిలో ఎవడు చూస్తాడే నన్ను..
రాధిక పక్కన నిలబడి నవ్వుతుంది.
సారిక : అలా నవ్వకపోతే చెప్పు వాడికి.. ఒరేయి.. ఇంట్లో కార్ ఉందిగా.. మీ ఇంట్లో వాళ్ళకి మాత్రం డ్రైవర్ గా రోజంతా తిరుగుతావ్.
వంశీ : హలో మేడం.. నా దెగ్గర ఇదొక్కటే ఉంది, ఇది కూడా నాది కాదు బంగారం. నాకుగా నా దెగ్గర సైకిల్ కూడా లేదు నిన్ను నడిపించట్లేదు సంతోషించు
సారిక : వీటికేం తక్కువ లేదు, ఎన్నైనా చెప్తావ్.. నేను రాను అని అలిగి లోపలికి వెళ్ళిపోయింది.
ఇక తప్పక ఇంటికి వెళ్లి బట్టలు మార్చుకుని కార్ తీసి ఇంటి ముందు పెట్టి హారన్ కొడితే అప్పుడు వచ్చింది బైటికి
వంశీ : రమ్మా.. రా... అప్సరస
సారిక : పోరా.. ఇక పదా అని ఎక్కి కూర్చుంది.
వంశీ : సాగుతుంది నీకలాగా.. అంటూ ముందుకు పోనిచ్చాను
కార్ పార్కింగ్ చేసి లోపలికి వెళుతుంటే చెయ్యి ఇచ్చింది, ఇవన్నీ మనకి తెలీవు అర్ధం కావు కానీ దాని సంతోషం కోసం సంకలో చెయ్యి దూర్చాను. లోపలికి వెళ్ళేకొద్దీ సౌండ్ ఎక్కువవుతుంది.
సారిక : అదిగో అక్కడున్నారు.. రా అని నా చెయ్యి పట్టుకు లాక్కెళుతుంటే వెనకాలే వెళ్లాను. అప్పటికే మా ఇద్దరినీ చూసిన సారిక ఫ్రెండ్స్ ఆశ్చర్యంగా లేచి నిలబడ్డారు.. వాళ్ళ ముందుకు నన్ను తీసుకెళ్లి.. ఇదిగో నా లవర్ అంది నవ్వుతూ
హరి, కిరణ్, వెంకీ అలా చూస్తూనే ఉన్నారు, అమ్మాయిలు మాత్రం కొంచెం అటుఇటుగా చూసి కన్విన్స్ అయినట్టున్నారు.
సారిక : పదండే డ్రింక్స్ తెచ్చుకుందాం అని వెళ్లారు.
హరి : ఎలా బ్రో
కిరణ్ : ఆ రోజు వెంకీ ప్రొపోజ్ చేస్తే పగలబడి నవ్వావ్ ఇందుకేనా
వెంకీ ఏం మాట్లాడలేదు
వంశీ : లేదు, నాకు సారిక గురించి బాగా తెలుసు, లవ్ అన్నా పరాయి మగాడితో మాట్లాడలన్నా తను ఇబ్బంది పడుతుంది, దాని అర్ధం భయపడుతుందని కాదు.. వాళ్ళ అమ్మ ఎక్కడ ఇబ్బంది పడుతుందో అని.. ఇంతకముందైతే అస్సలు పరాయి వాళ్ళతో ఎలా మాట్లాడాలో కూడా తనకి తెలీదు, అందుకే ఆ రోజు నవ్వుకున్నాను.. ఇక నా విషయానికి వస్తే తనకి తండ్రి లేడు, చిన్నతనం నుంచి ఇప్పటి వరకు తన జీవితంలో ఉన్న ఏకైక మగాడిని నేనే.. ఎప్పటికైనా తను నాదే అన్న విషయం నాకు తెలుసు.. సారిక రియలైజ్ అయ్యే వరకు వెయిట్ చేసాను అంతే.. ఆ రోజు వెంకీ ప్రొపోజ్ చేసిన తరవాత అనిపించిందట నేను కూడా వేరే వాళ్ళని లవ్ చేస్తున్నానెమోనని ఇక క్షణం ఆగకుండా వచ్చి నాకు చెప్పేసింది.. మీరంటే తనకి చాలా స్పెషల్.. మీది చాలా మంచి గ్యాంగ్ అందుకే మీకిదంతా చెపుతున్నాను.
హరి : మేము హ్యాపీ బాస్, తన గురించి నీకు తెలిసినంతగా ఎవరికి తెలీదు వాళ్ళ అమ్మని తీసేస్తే
వంశీ : ఎందుకు వాళ్ళ అమ్మని కూడా కలిపేయి.. సారిక గురించి నాకు తెలిసినంతగా వాళ్ళ అమ్మకి కూడా తెలీదు.. తను ప్రొపోజ్ చేశాకే నేను సారికలో ఇంకో కోణం చూసింది.. తన అస్సలు వ్యక్తిత్వం
కిరణ్ : అందుకేనా ఇవ్వాళ పార్టీ బిల్ మొత్తం తనే పే చేస్తా అంది
వంశీ : అవునా.. ఇది నాకు తెలీదే
వెంకీ : సారికని బాగా చుసుకో బ్రో.. అయినా నీకు చెప్పాల్సిన అవసరం లేదులే
వంశీ : నువ్వు చాలా మంచివాడివని చెప్పింది వెంకీ, నిజమే అది
అందరం మాట్లాడుకుంటుంటే సారిక వాళ్ళు కూడా వచ్చారు, గంటన్నర తరవాత బైటికి వచ్చేసి పక్కనే ఉన్న హోటల్ కి వెళ్లి ఫుల్ గా తినేసాం.. బిల్ మొత్తం సారికే కట్టింది.
అందరూ వెళ్ళిపోయాక వచ్చి నా భుజం మీద వాలింది, అప్పుడే అనుకోకుండా పబ్ వైపు చూసాను అఖిల అత్త తన ఫ్రెండ్స్ తో లోపలికి వెళుతుంది, దాని డ్రెస్ చూడగానే ముందు కోపం వచ్చినా తమాయించుకున్నాను తొడల వరకే ఉండే సింగల్ పీస్ డ్రెస్.. ఫోన్ తీసి ఫోటో తీసాను.
సారిక : ఎవరు అని అటు వైపు చూసింది కానీ అక్కడ ఎవ్వరు లేరు
వంశీ : ఫోన్ లోపల పెడుతూ అయినా అంత బిల్ కట్టడానికి నీ డబ్బులు ఎక్కడివి
సారిక : మనవే.. హారం తెచ్చాంగా.. అందులో మిగిలినవి నా అకౌంట్లోనే ఉన్నాయి
వంశీ : అలా ఎలా ఖర్చుపెడతావ్ నువ్వు.. అవి నీవా
భుజం మీద నుంచి చెయ్యి తీసి పక్కన నిలబడింది మౌనంగా
వంశీ : అవి నేను అప్పుగా తీసుకున్న డబ్బులు
సారిక : మనవే కదా.. అమ్మ దెగ్గర తీసుకున్నవే కదా అని.. నిన్ను అడగలేదు.. మన డబ్బులే కదా
వంశీ : తప్పు చేసావ్ బుజ్జి నువ్వు.. నాకు నచ్చలేదు
సారిక కన్నీళ్లు పెట్టుకుంది..
సారిక : సారీ..
వంశీ : పదా వెళదాం, అని కారు తీసాను. సారికని ఇంటి దెగ్గర దింపేసి మళ్ళీ పబ్ కి వెళ్లాను.
సారిక ఏడ్చుకుంటూ వెళ్లి తన అమ్మ ముందు కూర్చుంది. ఏమైందని అడగ్గా సారిక మొత్తం చెప్పింది.
రాధిక : ఎందుకలా చేసావ్, తప్పు కదా.. వాడు నీ దెగ్గర ఎందుకు ఉంచాడు డబ్బులు.. నీ మీద నమ్మకంతో కదా.. అలా ఎలా వాడేస్తావ్ అదీ వాడికి చెప్పకుండా
సారిక : అవి నీవే కదా
రాధిక : కాదు, అవి వాడివి.. నేను వాడికి అప్పుగా ఇచ్చాను. అన్నీ మనవే.. నేను కాదనట్లేదు.. నేను వాడికి డబ్బులు ఇచ్చింది నాకు మళ్ళీ తిరిగి ఇస్తాడని కాదు ఊరికే ఇచ్చేసాను, కానీ వాడు అలా అనుకోలేదు కదా.. నాకు మళ్ళీ ఇస్తానని మాట ఇచ్చాడు. అస్సలు నీకో విషయం చెప్పనా అవన్నీ వాడి డబ్బులే..
సారిక : అర్ధం కాలేదు.. కళ్ళు తుడుచుకుంది
రాధిక : నాలుగేళ్ళ క్రితం నేను ట్యూషన్స్ పెట్టాను గుర్తుందా
సారిక : ఉమ్..
రాధిక : అటు రోజంతా కాలేజ్ కి వెళ్లొచ్చి మళ్ళీ ట్యూషన్స్ చెపుతుంటే నా కష్టం చూడలేక అడిగాడు, అప్పుడు చెప్పాను నీ కోసం నీ భవిష్యత్తు కోసం డబ్బులు దాస్తున్నానని.. అప్పటి నుంచే వాడు క్రికెట్ మాములుగా ఆడటం మానేసి జీతానికి ఆడటం మొదలు పెట్టాడు.. వారం దాటగానే నా చేతిలో వాడు సంపాదించినవి తీసుకోచ్చి పెట్టేవాడు, నన్ను ట్యూషన్స్ బలవంతంగా మానిపించేసాడు. వాళ్ళింట్లో సామానులకి వెళ్ళినప్పుడల్లా ఎక్కువ ఎక్కువ తీసుకుని కొన్ని సైడ్ చేసి మన ఇంటికి తెచ్చేవాడు మొదట్లో నేను ఒప్పుకోలేదు కానీ ఆ మొండోడు వినడు కదా.. కూరగాయలు తెచ్చినా చికెన్, మటన్ ఏం తెచ్చినా ముందు వాళ్ళ ఇంటికి వెళ్లకుండా ఇక్కడ మనకి కవర్ ఇచ్చాకే అక్కడికి వెళతాడు.
అలా వాడికి ఎంత వీలైతే అంత నాకు భారం తగ్గించడానికి ప్రయత్నించేవాడు, ఉన్నవి లేని తెలివితేటలు అన్ని వాడేవాడు. ఇలాంటివి ఒకటి రెండు కాదు వాడు మనకోసం చాలా చేశాడు, మనం కష్టపడకుండా ఉండటానికి ఏమైనా చేస్తాడు.. అస్సలు క్రికెట్ ఊరికే డబ్బులు కోసం వాడి టైం పాస్ కోసం ఆడేవాడు కానీ వాళ్ళ పిన్ని కోసం వాళ్లెవరికో ఫ్రీగా నేషనల్స్ ఆడి వచ్చాడు ఇప్పుడు ఇంకా చాలా కష్టపడుతున్నాడు..
చిన్నప్పటి నుంచి అందరూ వాడిని బతిమిలాడారు క్రికెట్ ప్లేయర్ అవ్వమని కాని ఎప్పుడు ఎవ్వరి మాట వినలేదు కానీ ఉన్నట్టుండి ఎందుకో వాడు బాగా మారిపోయాడు వాళ్ళ అమ్మ దెగ్గరికి వెళ్లి వచ్చాక ఎవ్వరితో ఎక్కువగా మాట్లాడట్లేదు ఎప్పుడు గ్రౌండ్ లోనే ఉంటున్నాడు. ఏదో జరిగింది.. బాగా సీరియస్ గా ఉంటున్నాడు.. అలాంటిది నువ్వలా చేసేసరికి బాగా కోపం వచ్చినట్టుంది.
సారిక వెంటనే వంశీ ఫోన్ కి వందకి పైగా సారీలు పెట్టింది, వంశీ దెగ్గర నుంచి స్మైలి వచ్చింది, వంశీనే ఫోన్ చేసి మాములుగా మాట్లాడాడే తప్పితే కోపం చూపించలేదు. మనసులోనే దణ్ణం పెట్టుకుంది ఇంత మంచివాడు తనకి దక్కినందుకు.
రాధిక : మాట్లాడాడా
సారిక : ఉమ్.. అంటూ తన ఒళ్ళో వాలిపోయి, వాడికి నా కంటే నువ్వే ఎక్కువ ఇష్టం.. నీ కోసం ఏమైనా చేస్తాడు.
రాధిక : లేదు, వాడికి నువ్వుంటేనే ఎక్కువ ఇష్టం.. పొద్దున చూడలేదా నీకోసం ఎంత తపించిపోయాడో.