Episode 24
సుమారు తెల్లవారు జామున మూడింటికి తలుపు తెరుచుకుంది.. సారిక వెంటనే తలుపు తోసేసరికి రాధిక వెనక్కి పడిపోయింది.. సారిక వెళ్లి రాధికని లేపుకుంది.. రాధిక ఒంట్లో సత్తువ లేదు.. తన కూతురి భుజం మీద పడిపోయింది.. వంశీ అక్క వందన ఇంకో చెయ్యి వేసి రాధికని పట్టుకుంది.. సారిక వెనక్కి తిరిగి చూస్తే వంశీ పడుకుని ఉన్నాడు వాడి మీద దుప్పటి కప్పి ఉంది. వంశీని చూసి తన అమ్మ మొహం చూసింది.. పెదం నుంచి రక్తం కారుతుంది.. కుంటుతూ నడుస్తుంది.. తూలి పడిపోబోతే ఇద్దరు గట్టిగా పట్టుకున్నారు.
లోపల నుంచి ఇద్దరు రాధికని బైటికి తీసుకొస్తుంటే వంశీ అమ్మ చందన, రాధిక స్థితి చూసి బాధపడింది.. రాధిక ఒళ్ళు మొత్తం పచ్చి పుండులా ఎర్రగా అయిపోయింది.. తను చీర కప్పుకుంది.. ఒక చేత్తో చీర జారిపోకుండా పట్టుకుందంతే.. ఒంటి నిండా గాట్లు.. ఎర్రగా కమిలిపోయిన మచ్చలు.. చందన వెంటనే రూం చూపించింది కానీ సారిక చిన్నగా బైటికి నడిపించుకెళ్లి కారులో కూర్చోపెట్టి ఇంటికి తీసుకెళ్ళింది.. నానీ వెంటనే డాక్టర్స్ కి ఫోన్ చేసి వెనుకే తన అమ్మని తీసుకుని ఇంకో కారులో బైలుదేరాడు.. వందన తన తమ్ముడి దెగ్గరికి వెళ్ళిపోయి వాడిని చూసి ఏడ్చేసింది.. దేవుడికి దణ్ణం పెట్టుకుంది.. చందన మాత్రం ఏడుస్తూ కూర్చుంది. వంశీ పెద్దమ్మ సమీర వెళ్లి చందన పక్కన కూర్చుంది.
సమీర : వాడికేం కాదులే.. ఆ మత్తు దిగిపోయి ఉంటుంది
చందన : నా కొడుకు కోసం నేను ఉండాల్సిన స్థానంలో తను వచ్చింది.. నేను భరించాల్సిన బాధని తను అనుభవిస్తుంటే నేను చూస్తూ కూర్చున్నాను.. వాడు చెప్పింది నిజమే నేను తల్లిగా వాడికి అర్హురాలిని కాదు.. అంటూ లేచి తన కొడుకు దెగ్గరికి వెళ్ళింది.. సొయ లేకుండా పడిపోయి ఉన్నాడు.
సమీర ఏం మాట్లాడలేదు
చందన : వీడికి అంతకంటే మంచి అమ్మాయిని నేను తీసుకురాలేను, అమ్మ లాంటి అత్తని కూడా నేను తీసుకురాలేను అంటూ వంశీ నుదుటన ముద్దు పెట్టుకుని లేచింది.
సమీర : నా మనసులో ఉందే నువ్వు చెప్పావు.. నీకు ఇష్టం లేదని ఇంతసేపు మౌనంగా ఉన్నాను.. ఆ పసిది ఎంత విలవిలలాడిపోయింది.
చందన : ముందు వెళ్లి తనకి నేను క్షమాపణలు చెప్పాలి అని లేచింది.. వెంటనే వంశీ నాన్నతో కలిసి కారు తీసుకుని సారిక ఇంటికి వెళ్ళిపోయింది.
చందన నాని బైటే ఉండటం చూసి తన భర్తని బైటే ఉండమని చెప్పి లోపలికి వెళ్ళింది.. లత మరియు సారిక ఇద్దరు రాధిక బట్టలు తీసేసి ఒంటికి తడిగుడ్డ పెడుతుంటే చందన ఒక పక్కన కూర్చుంది. సారిక వంక చూసింది.. తన అమ్మ స్థితిని చూసి కన్నీళ్లు ఆగడంలేదు.. సారిక చేతిమీద చెయ్యి వెయ్యబోతే తన చెయ్యి వెనక్కి తీసేసుకుంది కోపంగా.. చందన చేతి మీద ఇంకో చెయ్యి పడగానే తల తిప్పి చూసింది.. అది రాధిక చెయ్యి
రాధిక : వాడికెలా ఉంది..
చందన : నన్ను క్షమించగలరా..
రాధిక చందన చెయ్యి గట్టిగా పట్టుకుని చిన్నగా నవ్వింది..
చందన : ఎలా ఉంది..
రాధిక : మీ కొడుకు నా ఒళ్ళు హునం చేశాడు.. చూస్తున్నారుగా అని నవ్వింది.. చాలా మంటగా ఉంది.. తట్టుకోలేకపోతున్నాను.. బుజ్జి.. పెయిన్ కిల్లర్ ఇంకోటి ఇవ్వు
చందన : డాక్టర్స్
లత : చూసారు.. మీరు వచ్చే ముందే వెళ్లారు.. మాములు అవ్వడానికి ఒక నాలుగు రోజులు పడుతుందాన్నారు.
సారిక : మీరిక్కడ ఉండటం నాకు ఇష్టం లేదు
రాధిక : బుజ్జీ..
చందన : నేను వెళతాను.. ఐయామ్ సారీ సారికా.. అని వెళ్ళిపోయింది.
రాధిక : తప్పు కదా..
సారిక : నువ్వు పడుకో.. అస్సలు నేను వెళ్ళాల్సింది.. నాకు ఆ ఆలోచన రాలేదు
లత : అక్కడున్న ఎవరికి రాలేదు
రాధిక : నువ్వు తట్టుకోలేవు బుజ్జి.. నాకే నరకంగా ఉంది.. ఎటు కదల్లేక పోతున్నాను.. ఒప్పుకున్నాను.. నీ మొగుడు పోటుగాడే.. అబ్బా.. అని పిడికిలి బిగించింది నొప్పికి.. లత వెంటనే నడుము మీద నుంచి చెయ్యి తీసేసింది.. రాధిక నొప్పికి అటు ఇటు మెసులుతూ అప్పుడప్పుడు నొప్పికి తట్టుకోలేక తన కంట్లో నుంచి నీరు కారుతుంటే సారిక తల్లడిల్లిపోయింది.
నాలుగు రోజులు గడిచిపోయాయి.. వంశీకి జరిగింది మొత్తం తన అక్క చెప్పాక ఆ రూం నుంచి బైటికి రాలేకపొయ్యాడు.. మిత్రని కూడా లోపలికి రానివ్వలేదు.. ఎవరికి ఎదురు పడేంత ధైర్యం చెయ్యలేకపోయాడు.. ఎవరు చెప్పినా వినిపించుకోలేదు.. చందన వచ్చి సారీ చెప్పి సారికని కోడలిగా ఒప్పుకుని పెళ్లి జరిపిస్తానని మాటిచ్చింది.. వంశీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు.. సారిక నుంచి వంశీకి ఒక్క ఫోన్ కూడా రాలేదు.
రాత్రి ఏడు అవుతుండగా వంశీ ఫోన్ నుంచి నానికి ఒక ఫోన్ వెళ్ళింది, ఆ తెల్లారే వంశీ క్రికెట్ నుంచి తప్పుకున్నాడని బిసిసిఐ నుంచి అఫీషియల్ గా
అనౌన్స్మెంట్ వచ్చింది.. నానీ కొన్ని డాకుమెంట్స్ తీసుకుని లాయర్ తో పాటు ఇంటికి వచ్చాడు. వంశీ తన అక్కని పిలిచి అందులో తనతో పాటు తన అక్క సంతకాలు కూడా చేపించి అవి తన అక్కకి ఇచ్చేసాడు.
వందన : ఏంటివి
వంశీ : నాకు సంబంధించిన ఆస్తులు మొత్తం
వందన : ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావ్
వంశీ : నేను కొన్ని రోజులు బైటికి వెళుతున్నా
వందన : ఎక్కడికి
వంశీ లేచి బాత్రూంకి వెళ్ళిపోయాడు.. వందన నాని వంక చూసింది నానీ నాకేం తెలీదన్నట్టు మొహం పెట్టాడు... స్నానం చేసి బైటికి వచ్చి బట్టలు వేసుకుంటూనే నాని వంక చూసాడు.. నాని బైటికి వెళ్ళిపోయాడు.
వంశీ : అన్నిటికి నానీ హెల్ప్ చేస్తాడు.. ఇంకో సాయం కావాలి
వందన : హ్మ్..
వంశీ : నేనొచ్చే వరకు నా టీచర్ ని.. మిత్ర అత్తని జాగ్రత్తగా చూసుకో.. ఇద్దరికీ నేనే దిక్కు.. నేనలా బైటికి వెళ్ళొస్తా అప్పుడే ఇంట్లో చెప్పేయ్యకు అని బైటికి వెళ్ళిపోయాడు.
వంశీ నేరుగా సారిక ఇంటికి వెళ్ళాడు.. లోపల రాధిక మాట్లాడుతుంటే సారిక వింటుంది.. వంశీ రావడంతో రాధిక మాట్లాడటం ఆపేయ్యగానే సారిక తల ఎత్తి చూసింది.. వెంటనే లేచి వంశీ ఎదురు వెళ్లి చెంప చెళ్ళుమనిపించింది.. వంశీ ఏం మాట్లాడలేదు మౌనంగా నిలుచున్నాడు.. రాధిక వంకే ఉంది వాడి చూపు.. సారిక గట్టిగా వంశీని వాటేసుకుని ఏడ్చేసింది.. సారికని జరిపి వెళ్లి రాధిక కాళ్ళ దెగ్గర కూర్చున్నాడు.. కాళ్లు పట్టుకుని ఇంతకంటే ఇక దిగజారలేనని.. క్షమించమని దీనంగా చూసాడు.
రాధిక : నీ తప్పు లేదు.. ముందు లే
వంశీ లేచి సారిక చెయ్యి పట్టుకున్నాడు.. రాధిక అనుమానంగా చూసింది..
రాధిక : ఏం ఆలోచించావ్ నువ్వు.. ఏం చేస్తున్నావ్
వంశీ : మళ్ళీ వస్తాం అని సారిక భుజం మీద చెయ్యి వేసాడు.
సారిక : అమ్మని వదిలిపెట్టి నేను రాను బావా అనగానే వంశీ సారిక చెయ్యి వదిలేసాడు.. వంశీ వెనక్కి తిరిగి వెళ్లిపోతుంటే రాధిక వంశీని పిలుస్తూనే సారికని రమ్మంది.
రాధిక : నాకేం భయం లేదు.. ఇప్పుడు నువ్వు వాడి పక్కనే ఉండాలి
సారిక : నాకు తెలుసు.. కానీ నిన్ను ఒంటరిగా..
రాధిక : వెళ్ళు
సారిక : జాగ్రత్త.. అని ముద్దు పెట్టుకుని బైటికి పరిగెత్తింది తన బావ కోసం.
వంశీ రోడ్డు ఎమ్మట నడుస్తుంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడి పక్కన నడుస్తుంది.
సారిక : రాననుకున్నావా
వంశీ : వస్తావని నాకు తెలుసు..
సారిక : ఎక్కడికి.. బట్టలు కూడా తెచ్చుకోవట్లేదు
వంశీ : నీ ఫోన్ ఇవ్వు..
సారిక : ఇదిగో.. ఎందుకు.. అని అడుగుతుండగానే వంశీ కాలవలో దాన్ని విరిగిపోయేలా విసిరేసాడు.. సారిక వంశీ భుజం మీద చెయ్యి వేసి ఆపింది.
వంశీ : ఇన్ని రోజులు నేను నీతో గడపట్లేదని నీలో నువ్వే బాధ పడేదానివి కదా.. ఇక అనుక్షణం నీతోనే ఉంటాను.. అని తన చేతిలో ఉన్న ఫోన్ దానితో పాటు డబ్బులు తీసుకుని పర్స్ కూడా విసిరేసాడు.. ఎటిఎం కార్డులు కాలవలో తెలాయి.
సారిక : అమ్మ..
వంశీ : అక్కకి అప్పగించాను.. ఏ భయం లేదు.. నన్ను నమ్ము బుజ్జి
సారిక వంశీ చెయ్యి పట్టుకుని తన భుజం మీద తల పెట్టుకుంది.. వంశీ ఆటో ఆపాడు ఇద్దరు ఎక్కి రైల్వే స్టేషన్ కి వెళ్లిపోయారు. ఇద్దరు మౌనంగా కూర్చున్నారు.. వంశీ పక్కనే బుక్ స్టాల్లో విపుల మరియు చతుర రెండు పుస్తకాలు కొని ఒకటి సారిక చేతికి ఇచ్చాడు.. పావుగంటకి ట్రైన్ రాగానే ఎక్కి కూర్చున్నారు.
సారిక : ఎక్కడికి వెళుతున్నాం
వంశీ : నువ్వే చూడు.. అని ఎవ్వరు గుర్తు పట్టకుండా మొహానికి కర్చీఫ్ కట్టుకుని కూర్చున్నాడు.
సరిగ్గా ట్రైన్ కదిలి వేగం అందుకోగానే పెద్దగా కేకలు వినిపించాయి.. చూస్తే అందరూ కిటికీ లోనుంచి బైటికి చూస్తున్నారు.. వంశీ లేచి చూసాడు.. లత వేగంగా పరిగెడుతూ ట్రైన్ డోర్ పట్టుకుంది.. ఒక కుర్రవాడు మరియు టీసీ పైకి లాగడానికి చూస్తున్నారు.. వంశీ వెంటనే వెళ్లి పిల్లవాడిని వెనక్కి నెట్టి లత ఇంకో చెయ్యి పట్టుకుని పైకి లాగాడు.. ఆ వెనుకే పరిగెడుతున్న నానీని కూడా టీసితో కలిసి ఇద్దరు లోపలికి లాగేసారు. టీసి తిట్టిన తిట్లు తిట్టకుండా తిట్టాడు.
టీసి : ఇద్దరికీ టికెట్లు లేవుగా
నానీ : లేవు
టీసి : కట్టండి ఫైన్ తో పాటు టికెట్స్ కూడా
నాని వంశీ వంక చూసాడు
వంశీ అమ్మా కొడుకులని కోపంగా చూస్తూ డబ్బులు తీసి టీసి చేతిలో పెట్టాడు. కోపంగా వెళ్లి సారిక పక్కన కూర్చుంటే ఇద్దరు వచ్చి నిలుచున్నారు.
నానీ : నేను డబ్బులు తీసుకురాలేదు.. సమోసాలు కొనుక్కోవాలి
సారిక : రేయి నానీ.. ఆంటీ.. మీరేంటి ఇక్కడా
నానీ : డబ్బులు
వంశీ : ఎందుకు తెచ్చుకోలేదు
నానీ : నువ్వేగా పర్స్ ఫోన్ అన్ని విసిరేసావ్.. నేను చూసాను.. అందుకే మావి కూడా విసిరేసా కానీ డబ్బులు తీసుకోవడం మర్చిపోయా
లత మొహంలోకి నవ్వొచ్చి ష్.. అని కొడుకుని సైగ చేసింది.. అది చూసి సారిక నవ్వింది.. వంశీ కూడా పెదాలు నవ్వినట్టు పెట్టాడు.. అది చూసిన నానీ వెంటనే హమ్మయ్య నవ్వాడు అని వెళ్లి కింద వంశీ కాళ్ళ మధ్యలో కూర్చున్నాడు.
వంశీ : ఎందుకు వచ్చావ్
నానీ : ఏదో రాముడికి లక్ష్మణుడు లాగా.. నీకు నేనూ.. నన్ను వదిలించుకోవడం నీవల్ల కాదు.. ఈ జన్మకి ఇంతే.. నీ దెగ్గరే ఉంటాను..
లత : వంశీ.. నువ్వంటే ప్రాణం వాడికి.. నాకు కూడా.. మమ్మల్ని నీ కుటుంబంలో చేర్చుకో అని సారిక వంక దీనంగా చూసింది
సారిక వంశీ భుజం మీద చెయ్యి వేసి.. ఇంకో చెయ్యి నానీ తల మీద వేసింది ప్రేమగా..
సారిక : రేయి.. అస్సలు నీకు ఎలా తెలుసు.. బావ నాకే చెప్పలేదు
నానీ : ఇన్నేళ్లుగా ఉంటున్నాను.. మీ ఇద్దరి గురించి నాకు తెలీదా.. పేరుకే అన్నా వదినలు.. కాని మీరు నాకు అమ్మా నాన్న
వంశీ పుసుక్కున నవ్వి.. నువ్వు దాన్ని అమ్మా అనకు రరేయి.. నాకెక్కడో కొడుతుంది అనగానే లత నవ్వుతూ వంశీ తల మీద మొట్టింది.. సారిక కూడా కొట్టింది
నానీ : అమ్మా.. ఇంకోటి తగిలించవే
లత : దూర్మార్గుడా
నానీ : నన్ను అనుమానిస్తే.. కళ్ళు పోతాయి.. వదినా.. ఒక్కసారైనా నిన్ను తప్పుడు దృష్టితో చూసానా.. నానీ ఏడ్చేసాడు
వంశీ : రేయి సరదాగా అన్నాను.. లే ఏడవకు
నానీ : మా అమ్మ విషయం వేరు..
సారిక వంగి నానీ కళ్ళు తుడిచి లేపి పక్కన కూర్చోబెట్టింది.. వంశీని డొక్కలో పొడుస్తూ కోప్పడింది..
వంశీ : సరేలేరా బాబు నువ్వు లక్ష్మణుడివి ఇదిగో ఇది సీత సరేనా..
సారిక : నువ్వు మాత్రం రాముడివి ఎప్పటికి కాలేవు
సారిక, లత ఇద్దరు తల మీద చెయ్యి వేసి నిమురుతుంటే నానీ నవ్వాడు.
నానీ : అన్నా ఇంతకీ ఎక్కడికి వెళుతున్నాం
వంశీ : ఢిల్లీలో నాకు పరిచయం అయిన ఒక క్రికెటర్ ఉన్నాడు.. మన తెలుగువాడే.. ఈ మధ్య ఫోన్ చేసినప్పుడు డబ్బు కావాలని దానికి పొలం అమ్ముతున్నానని చెప్తే.. నా బుజ్జి జాబ్ చేసి సంపాదించిన డబ్బులతో ఆయన పొలం కొన్నాను.. మూడు ఎకరాల పొలం.. చిన్నప్పటి నుంచి వ్యవసాయం చెయ్యాలని ఒక కోరిక ఉండేది అది ఇప్పుడు తీర్చుకుందాం అని వెళుతున్నా
సారిక : హో.. అయితే నేనూ చేస్తా వ్యవసాయం
లత : నేను కూడా..
వంశీ : చెప్పడం ఈజీనే.. బర్రెల పేడ ఎత్తాలి.. వాటికి స్నానం చేపించాలి.. పాలు పితకాలి.. ఆవులని మేతకి తీసుకెళ్లాలి..
సారిక : పేడ ఎత్తాలా.. అబ్బా ఛీ..
వంశీ : ఛీ.. నా.. గోమూత్రం తాగుతారు తెలుసా.. ఫిల్టర్ చేసి లీటర్ బాటిల్స్ లెక్కన అమ్ముతారు.. మన సిటీలో
సారిక : ఒరేయి బావా.. చీ.. అలాంటివి చెప్పకు నాకు
వంశీ : అన్ని నిజాలే.. మీ అమ్మ చెప్పలేదా.. చిన్నప్పుడు కళ్ళాపజల్లెదిగా.. కావాలంటే లతని అడుగు
లత : అవును
సారిక : మా అమ్మ చేస్తే.. నేనూ చెయ్యాలా ఏంటి.. యాక్.. వామ్మో.. నా వల్ల కాదు.. తలుచుకుంటేనే వాంతుకొస్తుంది
వంశీ : చూద్దాం.. అని నవ్వుకున్నాను
ట్రైన్ వేగం పుంజుకుంది.