Episode 01


అది జూబిలీ హిల్స్ రోడ్ నెంబర్ 36 .. అత్యంత ఖరీదైన షాపులు ఉండే ఏరియా .. అక్కడ ఒక బోటిక్ షాప్ ముందు దిగాడు వెంకట్ .. కార్ లోంచి కాదు .. బైక్ మీద నుంచి . లోపలికెళ్ళేక అక్కడ ఒక అమ్మాయి పలకరించి , "ఎం కావాలి సర్ " , అని అడుగుద్ది. "డిజైనర్ సారి " , అని మొహమాటంగా చెబుతాడు . ఎందుకంటే అక్కడ ఉండేయి అన్ని లేడీస్ కి సంభందించిన ఐటమ్స్ . వచ్చేది లేడీ కస్టమర్స్ .. అందులో బాగా బలిసిన ఆంటీలు . ఆ సంగతి వెంకట్ కి తెలుసు . అందుకే మొహమాటం .. పైగా ట్రాఫిక్ లో , బైక్ లో రావడం .. టెన్షన్ టెన్షన్ గా ఉన్నాడు

అక్కడున్న సేల్స్ గర్ల్ తన కౌంటర్ కి తీసుకెళ్లి "వాటర్ తాగుతారా సర్ " , అని అడుగుద్ది మర్యాదగా .. పర్లేదు అని .. అక్కడున్న చీరలు చూపించమంటాడు

సేల్స్ గల్ : ఎంతలో కావాలి సర్ ?

వెంకట్ : 20000 రూపాయల్లో ..

సేల్స్ గల్ : సర్ , మా దగ్గర స్టార్టింగ్ 30000 కి తక్కువ ఉండవు

వెంకట్ : పర్లేదు 30 , 40 వేల రేంజ్ లోనే చూపించండి

సేల్స్ గల్ : సర్ , ఆలోచించుకోండి .. బడ్జెట్ ఎక్కువవుద్దేమో ?

వెంకట్ : మేడం , మీకెందుకండి బడ్జెట్ సంగతి ? అడిగింది చూపించండి

సేల్స్ గల్ : సారీ సర్ .. ఒక సారి కొంటె , తిరిగి ఇవ్వడం కుదరదు ... ఆలోచించుకోండి

వెంకట్ : నాకు తెలుసు .. ఈ రేంజ్ లో సారి కావాలి కాబట్టే మీ షాప్ కి వచ్చా .. లేదంటే నేనుండే అమీర్ పెట్ లోనే బోలెడు షాపులు

సేల్స్ గల్ : సరే సర్ .. ఇంతకీ ఎవరికీ సర్ ? మీ ఆవిడకా ?

వెంకట్ కళ్ళల్లో నలక పడితే , కర్చీఫ్ తో తుడుసుకుంటాడు ..

సేల్స్ గల్ : సారీ సర్ .. నా ఉద్దేశ్యం ఈ చీర కొనేది ఎవరకని ? ఎంత వయసు ఉంటది ?

వెంకట్ తేరుకుని .. నీ వయసు అమ్మాయి ..

సేల్స్ గల్ : సారీ సర్ .. నా వయసులో ఉండే అమ్మాయిలు ఇలాంటి డిజైనర్ చీరలు వేసుకోరేమో ?

వెంకట్ : ఏవండీ .. మీకెందుకు అవన్నీ ? కొనేది నేను .. చూపించండి ..

సేల్స్ గల్ : అమ్మాయి ఏ కలర్ లో ఉంటది సర్ ?

వెంకట్ : ఇంచు మించు నీ కలర్ .. నీ హైట్ .. నీ పర్సనాలిటీ

సేల్స్ గల్ కొన్ని చీరలు టేబిల్ మీద పరుస్తుంది .. అన్ని చూసేదానికి చాల బాగున్నాయి

సేల్స్ గల్ : సర్ .. ఇంత కాస్టలీ చీర కొనేటప్పుడు ఆ అమ్మాయి కి చూపిస్తే బాగుంటది కదా ? కొన్నాక నచ్చక పోతే ?

వెంకట్ : నాకు తెలుసు తనకు ఎలాంటివి ఇష్టమో ..

ఇంతలో పక్క కౌంటర్ కి ఒక సూపర్ ఆంటీ వస్తది .. మంచి హైట్ .. బాగా బలిసిన వొళ్ళు .. మేని రంగు . స్టైల్ గా గాగుల్స్ .. వెంకట్ చూడకూదనుకుంటూనే ఒక చూపు చూస్తాడు .. ఒక సారి చూస్తే ఆపుకునే టైపు కాదు .. అంటే వెంకట్ ఎంత ట్రై చేసినా .. ఆమె అందం కట్టిపడేసింది .. అందుకే చీరల మీద కన్నా ధ్యాస ఆమె మీద ఉంది

సేల్స్ గల్ : (దగ్గుతూ) సర్ .. చీరలు ఇక్కడ ..

వెంకట్ : (తడబాటుతో) సారీ .. నాకు అర్ధం కావడం లేదు ... నువ్వే ఏదోకటి సెలెక్ట్ చెయ్యి ..

సేల్స్ గల్ : సర్ .. కొనేది మీరు .. నా సెలక్షన్ ఎందుకండీ ? పోనీ , ఆ ఆంటీ ని పిలవనా ? హెల్ప్ చేస్తది ?

వెంకట్ : నో .. నో .. ప్లీజ్ .. ఈ మూడిట్లో నీకు ఏది నచ్చిందో చెప్పండి ..

సేల్స్ గల్ : సర్ .. ఆమెకే వీడియో కాల్ చేయొచ్చుగా ?

వెంకట్ : అదొక రాక్షసి .. ఒక పట్టాన తేల్చదు .. అయినా సర్ప్రైజ్ గిఫ్ట్ కదా .. అందుకే

సేల్స్ గల్ : సర్ , ఒకసారి కొంటె తిరిగి ఇవ్వడం కుదరదు . సరే .. ఇది నచ్చింది నాకు .. ఇదే సెలెక్ట్ చేసుకోండి

నీలం రంగు చీర , ఎల్లో బోర్డర్ ... చాల క్లాస్ గా ఉంది .. దాంతో పాటె బ్లౌజ్ కూడా .. వెంకట్ కి కూడా బాగా నచ్చింది

వెంకట్ : నాక్కూడా ఇదే నచ్చింది .. మరి దీనికి .. మ్యాచింగ్ .. (గొణుగుతుంటాడు)

సేల్స్ గల్ : సర్ .. మ్యాచింగ్ బ్లౌజ్ కూడా ఇందులోనే ఉంది ..

వెంకట్ : థాంక్స్ అండి .. ఒక్కసారి మీరు వేసుకుంటే సెట్ అవుద్దో లేదో కంఫర్మ్ చేసుకోవచ్చు

సేల్స్ గల్ : (కోపంగా) సారీ సర్ .. ఇది అమీర్ పెట్ కాదు .. మీద వేసుకుని చూపించే దానికి

వెంకట్ : (డిసప్పోయింట్ అయ్యి) పర్లేదు లే .. బిల్ ఇవ్వండి .. (మల్లి ఆ ఆంటీ వైపే చూస్తాడు కొంచెం సేపు)

అది గమనించిన సేల్స్ గాళ్ .. "సర్ .. బిల్లింగ్ కౌంటర్ అక్కడ " , అని అనేసరికి .. సర్దుకుని .. బిల్ పే చేసి .. బైక్ మీద ఇంటికెళ్తాడు

ఇంటికొచ్చేసరికి రాత్రి 7 అవుతుంది .. కుర్చీలో రిలాక్స్ అవుతూ టీవీ చూస్తుంటే .. డోర్ బెల్ మొగుద్ది ..

చిరాకుగా వెళ్లి తీస్తే .. నలుగురు కాలేజ్ అమ్మాయలు .. ముద్దు ముద్దు గా మెలికలు తిరుగుతూ "అంకుల్ .. మా కాలేజ్ లో ఫంక్షన్ కి ఫండ్ రైజ్ చేస్తున్నాం .. మీరేమన్నా హెల్ప్ చేస్తారని .. " , అందులో యాక్టీవ్ గా ఉన్న ఒక అమ్మాయి అడుగుద్ది ..

వాడు సరే అని .. "ఇంతకీ ఏ ఫంక్షన్ ?" , అని అడిగితే .. ఆ అమ్మాయి "అంకుల్ .. కాలేజ్ anniversary సందర్బంగా .. అనాధ పిల్లలకు బుక్స్ కొని ఇస్తాం .. మనకంటే తల్లి , తండ్రి ఉన్నారు కదా .. మరి వాళ్ళకి ఎవరు లేరు కదా .. "

ఆ మాటలకి వెంకట్ కళ్ళల్లో నీళ్లు .. వెంటనే తేరుకుని .. లోపలికెళ్ళి 5000 రూపాయలు చందా గా ఇస్తాడు .. అసలు ఎక్సపెక్ట్ చేయలేదు వాళ్ళు .. వెంటనే ఆ అమ్మాయి ఆనందంగా వాడికి బుగ్గ మీద ముద్దు పెట్టి .. "చాల థాంక్స్ అంకుల్ .. మీరు పిసినారి అని ఈ బిల్డింగ్ లో చాల మంది అనుకుంటున్నారు .. మీరు 5000 ఇచ్చారు .. బాగా డబ్బున్నోళ్ళు కూడా 500 మించి ఇవ్వలేదు . మీరు గ్రేట్ సర్ .. " , అని చలాకీ గా వెళ్ళిపోతారు .. కింద ఫ్లోర్ కి

డోర్ వేసి .. కళ్ళు తుడుసుకుంటూ .. మల్లి టీవీ ప్రోగ్రాం లో మునిగిపోతాడు

ఒక అరగంట కి మల్లి డోర్ బెల్. ఓపెన్ చేస్తే సంధ్య .. రుస రుస లాడుతూ లోపలకొచ్చి .. టీవీ ఆఫ్ చేసి .. "ఎందుకో అంత ఖరీదైన చీర ? డబ్బులు చెట్టుకు కాస్తున్నాయా ?" , చాల కోపంగా ఉంది .. వాడికి సంధ్య ని ఎలా మచ్చిక చేసుకోవాలో తెలుసు .. సంధ్య కోపం ఎక్కువ సేపు ఉండదు .. ఎప్పుడైనా .. ఆ విషయం వెంకట్ కి తెలుసు .. "అది కాదురా బుజ్జి .. డబ్బులు శాశ్వతం కాదు కదా .. మన ఆనందాలే మనకు ముఖ్యం .. నీకు తెలిసిందే కదా .. వచ్చే వారం పెళ్లి రోజు .. ఏదో నా సంతృప్తి కోసం .. " , అని నసుగుతుంటే ..

సంధ్య ఇంకా కోపంగా "అయితే అంత రేట్ పెట్టి కొనాలా వెంకట్ ? చేసేది ముక్కి ముక్కి బ్యాంకు ఉద్యోగం .. ఎదుగు బొదుగూ లేని సంపాదన .. " , రుస రుస లాడుతూనే .. టవల్ తీసుకుని బాత్రూం లోకి వెళ్తుంది స్నానానికి ..

వాడు ఆలోచనలో పడతాడు .. రేట్ ఎక్కువే .. కాకపోతే చీర సూపర్ .. ఎప్పుడో ఒకసారి కొనేదానికి ఇంతలా ఆలోచించాలా ? సంధ్య సైడ్ నుంచి ఆలోచిస్తే కరెక్ట్ .. కానీ తను ఇట్టే కన్విన్స్ అవ్వగలదు ..

సంధ్య ఫ్రెష్ గా స్నానం చేసి నైటీ లో వస్తది .. అద్దం ముందు ఒక ఐదు నిముషాలు .. కిచెన్ లోకి వెళ్తే .. వంట చేస్తున్న వెంకట్ .. వెనక నుంచి వాటేసుకున్నా సంధ్య .. "ఎందుకు డాడీ .. మీకీ కష్టాలు .. నేను చేస్తా కదా వంట .. మీరు వెళ్లి రెస్ట్ తీసుకోండి " , అని అనేసరికి .. వాడు తల తిప్పి .. కోపం పోయి ప్రశాంతంగా ఉన్న సంధ్య ముఖాన్నే చూస్తూ ..

"బుజ్జి .. నువ్వు ఒక పక్క కాలేజీ కెళ్తూ .. ఇంకో పక్క పార్ట్ టైం అని ఆ సేల్స్ గల్ ఉద్యోగం చేస్తున్నావ్ . క్షణం తీరిక లేని నీకు , మల్లి ఈ వంట పని ఎందుకురా ? నేనెటు 5 కల్లా వచ్చేస్తా ఇంటికి .. బ్యాంకు మేనేజర్ అంటే అంత కన్నా పనేముంటది . నువ్వు వెళ్లి కొంచెం రెస్ట్ తీసుకో " అని అనేసరికి .. రెస్ట్ అనే పదానికి అర్ధం తెలియని సంధ్య .. రైస్ కడిగి కుక్కర్ ఆన్ చేస్తది .

ఇంకో పావు గంటకి .. మల్లి డోర్ బెల్ .. ఆనందంగా లోపలికొస్తూనే డాడీ ని వాటేసుకుని బుగ్గ మీద ముద్దు పెడుతున్న రెండో కూతురు వర్షా .. ఎంతో సంతోషంగా ఉన్న చెల్లెల్ని చూస్తూ సంధ్య "ఏంటే .. అంత హ్యాపీ గా ఉన్నావ్ ? ఏమయ్యింది ?" , అని అడిగితే అది "అక్కా .. మేము కాలేజ్ ఫండ్ రైజర్ ప్రోగ్రాం కి చందాలు వసూలు చేస్తుంటే .. డాడీ 5000 రూపాయలు ఇచ్చారు .. మా ఫ్రెండ్స్ అంతా చాల హ్యాపీ గా ఉన్నారు . అన్ని టీమ్స్ లోకల్లా మేమె ఎక్కువ డొనేషన్స్ కలెక్ట్ చేస్తాం .. " , అని డాడీ ని వాటేసుకుంటది ..

"ఇంతకీ , పర్పస్ ఏంటే " , అని సంధ్య అడిగితే .. కొంచెం దిగులు మొఖం తో .. "అనాధ పిల్లలకు బుక్స్ కొని ఇవ్వడం .. తల్లి , తండ్రి లేని అనాధ పిల్లలకి " , అని వర్షా చెబుతుంటే .. సంధ్య కళ్ళల్లో తడి .. వెంటనే తను కూడా డాడీ ని ఇంకో పక్క వాటేసుకుంటూ .. "థాంక్స్ డాడీ " , అని అంటది

అది థాంక్స్ చెప్పింది 5000 రూపాయలు డొనేషన్ ఇచ్చినందుకు కాదు .. తల్లి లేని పిల్లల్ని .. తల్లి , తండ్రి అన్ని నేనే అయ్యి చూసుకోవడం .. తల్లి లేని లోటు లేకుండా ...

వెంకట్ కి ఇప్పుడు 45 ఏళ్ళు . పెళ్లయిన ఐదేళ్లకే ఇద్దరు పండంటి ఆడపిల్లల్ని చేతిలో పెట్టి కన్ను మూసింది .. కార్ ప్రమాదంలో ..
సంధ్య , వర్ష .. బంగారం లాంటి పిల్లలు . వాళ్ళకి ఏ లోటు రాకూడదని మల్లి పెళ్లి చేసుకోలేదు .. ఎంతో మంది బలవంత పెట్టినా .. ఇప్పుడు సంధ్య డిగ్రీ ఫైనల్ ఇయర్ . వర్ష ఇంటర్ సెకండ్ ఇయర్ . డాడీ అంటే ప్రాణం ఇద్దరికీ .. కాకపోతే చిన్నది అల్లరి పిడుగు .. గారాబం ఎక్కువ . సంధ్య ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ తీసుకుని డాడీ కి చేదోడు వాదోడు గా ఉంటది . ఉండేది 2 బెడ్ రూమ్ ఫ్లాట్ .. చేసేది బ్యాంకు మేనేజర్ ఉద్యోగం ..

బ్యాంకు అలవాట్లు బాగా వచ్చాయి . ఖర్చులు తక్కువ . పొదుపు ఎక్కువ . పైసా పైసా కూడబెట్టి ఈ స్థాయి కి వచ్చాడు . పిల్లల చదువులో ఎక్కడ కంప్రమైజ్ కాడు . తనకేమి చెడు అలవాట్లు లేవు .. అందుకే అందరూ హ్యాపీ .. కానీ సంధ్య లో మాత్రం ఎక్కడో ఏదో వెలితి ..

"చిట్టి తల్లీ , నువ్వు చదివేది ఇంటర్ కదా .. మరి టెన్త్ క్లాస్ కాలేజ్ డొనేషన్స్ కి నువ్వెందుకు వెళ్ళావ్ ?" , వర్షా ని దగ్గరకి తీస్తూ అడుగుతాడు

"డాడీ .. నీకు తెలుసుగా .. ఈ బిల్డింగ్ లో ఉండే వాళ్లలో నా బెస్ట్ ఫ్రెండ్ అమల . అది చదివేది టెన్త్ . అది వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి కష్టపడి కలెక్ట్ చేస్తున్నా , ఎక్కువ రాలేదు డబ్బులు . నాతో చెప్పింది ఆ విషయం .. పర్పస్ అడిగా .. చెప్పింది .. అంతే ఆలోచించకుండా నేను కూడా జాయిన్ అయ్యా .. అనాధ పిల్లలకి నా వంతుగా హెల్ప్ చేయాలని " , గుక్క తిప్పుకోకుండా చెబుతున్న వర్ష మొఖంలో ఎనలేని సంతోషం .. అదంతా చూస్తున్న వెంకట్ .. ప్రేమగా వర్ష ని నుదుటి మీద ముద్దు పెడుతూ .. "నువ్వు బంగారం రా .. ఇంత చిన్న వయసులోనే ఎంత గొప్ప ఆలోచనలు " , అని అంటుంటే ..

ఇంకో పక్కనున్న సంధ్య .. "ఊహుం ఊహుం .. నీకెప్పుడూ చిన్న కూతురంటేనే ప్రాణం .. అది బంగారం అయితే , మరి నేను ?" , అని తండ్రి భుజాల మీద వాలిపోతుంది

వెంకట్ సంధ్య వైపే చూస్తూ .. "శాండీ .. అది బంగారం అయితే .. నువ్వు వజ్రం రా .. ఈ కుటుంబాన్ని మీదేసుకుని మోస్తున్నావ్ .. మీరిద్దరూ నాకు సరి సమానమేర .. ఒకరు తక్కువ ఇంకొకరు ఎక్కువ కాదు .. ", అని అంటాడు .. మరీ ప్రేమ ఎక్కువైతే సంధ్య ని శాండీ అనడం అలవాటు

డాడీ నే చూస్తూ .. "నిజం చెప్పండి డాడీ .. అంత ఖరీదు పెట్టి ఎందుకు కొన్నారు చీర ? ఒకవేళ నేను వేసుకోపోతే ?" , అని అంటే .. వాడు నవ్వుతూ "అందుకేరా .. మీ షాప్ లో .. నీ కౌంటర్ లో కొన్నా .. నీకు నచ్చేలా .. " , అని అంటాడు . సంధ్య నవ్వుతూ "డాడీ మీ ఐడియా సూపర్ .. కానీ ఈ రోజుల్లో అమ్మాయిలు చీరలు కట్టేదే తక్కువ .. అందులో ఇంత కాస్టలీ చీర అంటే .. ఏదన్న గ్రాండ్ పార్టీ ఉంటె తప్ప .. "

"బుజ్జి .. వచ్చే వారం మా పెళ్లి రోజు . మీ మమ్మీ లేకపోయినా , అదొక మధురానుభూతి నాకు . దాని వల్లే కదా .. బంగారం లాంటి మీరిద్దరు నాకు దొరికారు . మమ్మీ లేకపోయినా .. ప్రతి సంవత్సరం మీకు బట్టలు కొనిస్తా కదా .. నువ్వెటు పెద్ద దానివి అయ్యావు . చీర అయితే బాగుంటది . అంతే కాకా మీ కాలేజ్ anniversary వస్తుంది కదా .. ఆ ఫంక్షన్ లో నువ్వే హైలైట్ కావాలి " , అని అనేసరికి సంధ్య పూర్తిగా కన్విన్స్ అయ్యి , డాడీ కి బుగ్గ మీద ముద్దు పెట్టి .. "పదండి .. రైస్ రెడీ అయ్యింది . వేడి వేడి గా తిందాం " , అని వెళ్లి డిన్నర్ టేబిల్ సెట్ చేస్తుంటే .. ఈ లోగ వర్ష కూడా వెళ్లి స్నానం చేసి నైట్ డ్రెస్ వేసుకుంటది . త్రి ఫోర్త్ , షర్ట్ .. పూల డిజైన్ ..

అందరు కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ చేసేక .. అలసి పోయి ఉన్నారు కదా .. రెస్ట్ కోసం ఎవరి రూమ్ లోకి వాళ్ళు వెళ్తారు. సంధ్య , వర్ష కు డబల్ బెడ్ .. ఇద్దరు ఆడపిల్లలే కదా .. సంధ్య కాలేజ్ బుక్స్ ముందేసుకుని వర్క్ చేసుకుంటుంటే .. వర్షా ఫోన్ లో మునిగిపోద్ది

పక్క రూమ్ లో వెంకట్ నవల చదువుతుంటాడు.
Next page: Episode 02