Update 10


కీర్తి : అన్నయ్యా .......... ఎవరో పెద్దమ్మ అని కిందకుదిగి , పెద్దమ్మా పెద్దమ్మా ......... అని ఆప్యాయంగా బుగ్గను స్పృశించి , అన్నయ్యా ......... కదులుతున్నారు అని కెకెయ్యడంతో ,
థాంక్ గాడ్ ......... అనుకుని ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా దగ్గరకువెళ్లి రెండుచేతులతో ఎత్తుకున్నాను . ఒక్కసారిగా మాటలకు అందని ఏదో దివ్యమైన - స్వచ్ఛమైన ఫీల్ - భగవంతుణ్ణి ప్రార్థించేటప్పుడు మనం అనుభవించే దైవ సంబంధమైన అనుభూతి కలిగి వొళ్ళంతా జలదరించినట్లు అలా కదలకుండా నిలబడిపోయాను .
బుజ్జాయిలు : అన్నయ్యా అన్నయ్యా రక్తం ......... పెద్దమ్మ నుండి కారుతూనే ఉంది అని ఏడుస్తూ చెప్పడంతో ,
కింద మొత్తం నేల ఎరుగురంగులోకి మారిపోవడం చూసి హృదయం చలించిపోయింది . కంగారుపడుతూ బుజ్జాయిలూ ........... వెనుక డోర్ తెరవండి అని పరుగువెళ్లి లోపల పడుకోబెట్టి , బుజ్జాయిలూ కదలకుండా పట్టుకోండి అని సీట్లలో కూర్చొబెట్టి , డోర్ వేసి ముందుకువెళ్లి కూర్చుని హార్న్ సౌండ్ చేస్తూ వేగంగా హాస్పిటల్ వైపు పోనిచ్చాను .
బుజ్జాయిలు : కళ్ళల్లో కన్నీళ్ళతో ......... పెద్దమ్మా పెద్దమ్మా ......... మీకేమీ కాదు - మా అన్నయ్య హాస్పిటల్ కు తీసుకెళుతున్నారు అని ప్రేమతో స్పృశిస్తున్నారు ..............

పెద్దమ్మకు ఏమౌతుందోనని నా గుండేవేగం అంతకంతకూ పెరుగుతూనే ఉంది - బుజ్జాయిలకు అలానే అనిపిస్తున్నట్లు అన్నయ్యా అన్నయ్యా ఫాస్ట్ ఫాస్ట్ అనడంతో మరింతవేగంతో దగ్గరలోని హాస్పిటల్ కు చేరుకున్నాము .
కిందకుదిగి డోర్ తెరిచి బుజ్జాయిలూ ........... నా వెనుకే రండి , ఎందుకో తెలియదు పెద్దమ్మ ఎవరో తెలియకపోయినా ధారగా కారుతున్న కన్నీటితోనే ఎత్తుకుని పరుగున లోపలికివెళ్లి డాక్టర్ డాక్టర్ అని కేకలువేశాను.
డాక్టర్ గారు రక్తం చూసి పరుగునవచ్చారు .
సర్ ఆక్సిడెంట్ రోడ్ మొత్తం రక్తమే ............. అని కన్నీళ్ళతోనే చెప్పాను .
డాక్టర్ గారు : వెరీ సీరియస్ నర్స్ ICU లో ఆపరేషన్ కు రెడీ చెయ్యండి . బాయ్స్ స్ట్రెచర్ ఎక్కడ అందరూ ఏమిచేస్తున్నారు .
డాక్టర్ గారు ఎటువైపు నేను ఎత్తుకునే వస్తాను అని ఆయన వెనుకే పరుగుపెట్టి ICU లో పడుకోబెట్టి , నర్సు చెప్పడంతో బయటకువచ్చాము . బుజ్జాయిలు కూడా కన్నీళ్లు పెడుతుండటం చూసి పెద్దమ్మకు ఏమీకాదు బుజ్జితల్లీ - బిస్వాస్ అని ఇద్దరి కన్నీళ్లను తుడుచి గుండెలపై ఎత్తుకున్నాను .
బుజ్జాయిలు : మీ కళ్ళల్లో కూడా కన్నీళ్లు అన్నయ్యా అన్నయ్యా ......... అని బుజ్జి బుజ్జి చేతులతో తుడిచారు . అన్నయ్యా .........పెద్దమ్మకు ఏమీ కాదు కదా ..........పెద్దమ్మను తాకగానే అమ్మను స్పృశించినట్లుగానే అనిపించింది . పెద్దమ్మకు ఏమైనా అయితే తట్టుకోలేము అని కన్నీళ్ళతో చెప్పి నన్ను గట్టిగా హత్తుకున్నారు .
ఇద్దరినీ ప్రాణంలా హత్తుకుని ఏమీకాదు బుజ్జాయిలూ ఏమీ కాదు డాక్టర్ గారు ఉన్నారుకదా అని కన్నీళ్లను తుడిచి , డోర్ కున్న చిన్న మిర్రర్ నుండి లోపలికి చూస్తున్నాను . 5 .......... 10 .......... 15 నిమిషాలైనా దెబ్బలను మాత్రమే శుభ్రం చేసి లోపల డాక్టర్ గారు - నర్సులు బయటకూ లోపలకూ కంగారుపడుతూ తిరుగుతున్నారు తప్ప ట్రీట్మెంట్ చెయ్యడం లేదు .

డాక్టర్ గారు కోప్పడటంతో కంగారుపడుతూ బయటకువచ్చిన నర్సుని ఆపి బాధతోనే పెద్దమ్మకు ఏమీకాలేదు కదా అని అడిగాను .
నర్స్ : టూ సీరియస్ సర్ బ్లడ్ చాలా పోయింది ప్రాణాలకే ప్రమాదం , అర్జెంట్ గా బ్లడ్ కావాలి - రేర్ గ్రూప్ అవ్వడం వలన ఇప్పటికిప్పుడు ఏహాస్పిటల్లోనూ దొరకడం లేదు . గంటలో బ్లడ్ ఎక్కించకపోతే ప్రాణాలకే ప్రమాదం - హాస్పిటల్ సిబ్బంది మొత్తం ప్రయత్నిస్తున్నాము we are trying everything - మీరు కంగారుపడకండి .

మేడం మేడం ........... నేను విశ్వధాతను నా నుండి తీసుకోండి .
చెప్పాను కదా సర్ చాలా చాలా రక్తం పోయింది . కనీసం 3 - 4 బ్లడ్ ప్యాకేట్స్ కావాలి ఒక్కరి నుండి అన్నీ తీసుకోవడం కుదరదు అని రిసెప్షన్ వైపు పరుగుతీశారు .
అన్నయ్యా అన్నయ్యా .......... పెద్దమ్మ పెద్దమ్మ అని ఏడవటం మొదలెట్టారు .
లేదు లేదు నేనున్నాగా బుజ్జాయిలూ అని హత్తుకుని , నేరుగా లోపలికివెళ్లి పెద్దమ్మను వెంటిలేటర్ పై జాగ్రత్తగా చూసుకుంటూ టెన్షన్ పడుతుండటం చూసి , డాక్టర్ గారూ ఎన్ని ప్యాకెట్స్ బ్లడ్ కావాలంటే అన్నీ నా నుండి తీసుకోండి .
డాక్టర్ గారు : రూల్స్ ఒప్పుకోవు మిస్టర్ ..........
బుజ్జాయిల ఏడుపుని చూసి తట్టుకోలేక , ఫక్ ద రూల్స్ డాక్టర్ గారూ ......... sorry sorry .......... మా పెద్దమ్మకు ఏమైనా అయితే బుజ్జాయిలు తట్టుకోలేరు . నా ప్రాణాలు పోయినా పర్లేదు నేను చేసిన అతిపెద్ద తప్పుకు ఇదే శిక్ష అవుతుంది . please please డాక్టర్ గారూ .......... నా వొంట్లోని రక్తం మొత్తం తీసుకునైనా మా పెద్దమ్మను బ్రతికించండి . బుజ్జాయిలు కోరిన కోరికనైనా తీర్చి హాయిగా కన్నుమూస్తాను .
బుజ్జాయిలు : అన్నయ్యా అన్నయ్యా ........... అని గట్టిగా హత్తుకుని , డాక్టర్ సర్ డాక్టర్ సర్ ........... మా అన్నయ్య నుండి కాదు మా నుండి తీసుకోండి అని చేతులు చాపారు .
బుజ్జాయిలూ అంటూ ప్రాణంలా హత్తుకున్నాను .

డాక్టర్ గారు ఏమాత్రం ఒప్పుకోవడం లేదు .
ఇంతలో పెద్దమ్మ బెడ్ పై నొప్పితో కదలడంతో , భయపు జలదరింపుతో పెద్దమ్మా పెద్దమ్మా ............ please please డాక్టర్ గారూ నాకేమైనా పర్లేదు - ఎక్కడ సంతకం పెట్టమన్నా పెడతాను నాలోని మొత్తం రక్తం తీసుకుని పెద్దమ్మను కాపాడండి. ( సంతోషంతో ప్రాణాలొదిలి నేనే మీ కూతురు మనవళ్ళ కష్టాలకు కారణం - నా కోరికలు శాపాల వల్లనే వాళ్ళు అంతటి కష్టాలను అనుభవిస్తున్నారు నన్ను క్షమించండి కాదు కాదు శిక్షించండి అని దేవత తల్లిదండ్రుల పాదాలపై పడి శరణు కోరతాను అని బుజ్జాయిలను బెడ్ పై కూర్చోబెట్టి నుదుటిపై చెరొకముద్దుపెట్టి , please please డాక్టర్ గారూ ఏమీ ఆలోచించకండి మీకు ఎటువంటి సమస్యా రాదు అని చేతిని చాపి కుర్చీలో కూర్చున్నాను .
అంతలో నర్స్ కంగారుపడుతూ ఆయాసంతో వచ్చి డాక్టర్ .......... ఎంత ప్రయత్నించినా ఎక్కడా దొరకలేదు అని బాధతో చెప్పింది .
బెడ్ పై పెద్దమ్మ మరొక జర్క్ ఇవ్వడంతో , డాక్టర్ గారు కూడా చలించినట్లు వెంటనే కళ్ళల్లో చెమ్మను తుడుచుకుని తప్పని పరిస్థితుల్లో నర్స్ అని అందుకుని వారే స్వయంగా సూదిని చేతికి గుచ్చి రక్తం తీసుకున్నారు .

ఒక ప్యాకెట్ పూర్తవగానే పెద్దమ్మకు ఎక్కించి , మరొక ప్యాకెట్ తీసుకోగానే నీరసం వచ్చేస్తుంది మీరు బెడ్ పై పడుకోవడం మంచిది అనిచెప్పడంతో ,
అలాగే డాక్టర్ గారూ అని బుజ్జాయిలు చివరలకు జరుగడంతో ముద్దులుపెట్టి మధ్యలో వాలాను . బుజ్జాయిలిద్దరూ .......... అన్నయ్యా అన్నయ్యా ......... అంటూ కన్నీళ్ళతోనే నా ఛాతీపై వాలారు .
ఇంకేమీ పర్లేదు బుజ్జాయిలూ మన పెద్దమ్మ ఉదయానికల్లా తనను రక్షించిన మిమ్మల్ని ప్రేమతో కౌగిలించుకుంటారు - నేను చేసిన పాపానికి కొద్దిగానైనా ప్రాయశ్చిత్తం లభిస్తుంది అని ప్రాణం కంటే ఎక్కువైన ముద్దులుపెట్టి ఒకచేతితో జోకొట్టాను .

నానుండి మూడవ ప్యాకెట్ తీసుకుంటూ రెండవ బ్లడ్ ప్యాకెట్ పెద్దమ్మకు ఎక్కించగానే ట్రీట్మెంట్ కు రెస్పాన్స్ అవ్వడంతో డాక్టర్ గారు సంతోషంతో వేలుని చూయించడం వరకే నాకు జ్ఞాపకం - పెదాలపై చిరునవ్వుతో బుజ్జాయిలూ.......... నెక్స్ట్ జన్మలోనైనా మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగాచూసుకుని దేవత పెదాలపై చిరునవ్వుని చూస్తాను అని నాకు తెలియకుండానే కళ్ళు మూతలుపడ్డాయి .
డాక్టర్ గారు : నర్స్ నర్స్ .......... గ్లూకోజ్ బాటిల్ అని కేకవేశారు .
*************

బ్లాడర్ నిండిపోయినట్లు పాస్ అర్జెంట్ అవ్వడంతో ఇబ్బందిపడుతూ కళ్ళుతెరిచాను . నా గుండెలపై బుజ్జాయిలు హాయిగా నిద్రపోతుండటం - ప్రక్క బెడ్ పై పెద్దమ్మ ఆక్సిజన్ లేకుండా ఊపిరి తీసుకుంటుండటం చూసి , నర్స్ .......... ఎలా ఉంది అని అడిగాను .
మీ పెద్దమ్మ గారు perfectly ఆల్రైట్ ......... మీరు మీరు డాక్టర్ డాక్టర్ అంటూ పరుగుతీసింది .
సంతోషంతో హాయిగా నిద్రపోతున్న బుజ్జాయిల కురులపై ముద్దులుపెట్టి , గ్లూకోజ్ సూదిని నా చేతి నుండి తీసేసి , బుజ్జాయిలను నెమ్మదిగా బెడ్ పైకి జార్చి , బుజ్జాయిలూ అర్జెంట్ లేకపోతే పగిలిపోయేలా ఉంది అని చిరునవ్వుతో ICU టాయిలెట్ లోకి వెళ్ళాను .

జిప్ ఓపెన్ చేసేలోపు జలదరింపుతో రెండు మూడు చుక్కలు లోపలే ఉబికింది . కంట్రోల్ కంట్రోల్ .......... ఇంతసేపు ఆగవు రెండు క్షణాలు ఆగలేవా బుజ్జికన్నా అని జిప్ ఓపెన్ చేసి చేతిలో పట్టుకుంటే పిడికిలి కూడా సరిపోవడం లేదు . చూస్తే షాక్ నా బుజ్జిగాడేనా ........... రేయ్ రేయ్ ముందు బ్లాడర్ ఎంప్టీ చేసుకోవాలి అని స్స్స్ ....... అంటూ ఆపకుండా రెండు నిమిషాలపాటు టాయిలెట్ బేసిన్ లో డ్రాయింగ్స్ వేసాను . పూర్తిగా ఖాళీ అయినా నా బుజ్జిగాడు కూల్ అవ్వడం లేదు . ఇంతకుముందు పిడికిలిలో సరిపోయేవాడు - ఇప్పుడు ఇంకా చాలా గ్యాప్ ఉంది పొడవు కూడా అమ్మో అమ్మో ......... కలలోనేమైనా ఉన్నానా అని హ్యాండ్ వాష్ దగ్గరకువచ్చి మిర్రర్ లో చూసుకుని చెంపపై కొట్టుకున్నాను . చెళ్లుమనడంతో స్స్స్ ......... అమ్మా నొప్పి అని రుద్దుకున్నాను .

అద్దం లో చాలా మార్పు కనిపించింది . ముఖం చేతులూ ......... wow చేతి కండలు మరింత దృఢత్వాన్ని పొందాయి . ఛాతీలో కూడా మార్పు కనిపించడంతో బటన్స్ విప్పి ఆశ్చర్యపోయాను . నేనా మరెవరినైనానా .......... 1 2 3 ........ 6 7 8 ........ 6 ప్యాక్స్ 8 ప్యాక్స్ అయ్యాయి . " V షేప్ " తో నాకే ముచ్చటేస్తుండటం చూసి నవ్వుకున్నాను .
డాక్టర్ గారు చెప్పినట్లు ప్రాణాలు పోవాలి లేదా పూర్తి నీరసంగా మారిపోవాలి , దానికి పూర్తి వ్యతిరేకంగా వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లు మరింత ఉత్సాహం వస్తోంది . దేనినైనా వొంటిచేతితో ఎత్తెయ్యగలను అని అనిపిస్తోంది అని చుట్టూ చూసి వంద లీటర్ల పైనే పట్టే నీటితో పూర్తిగా నిండిన పెద్ద నీటి తొట్టెదగ్గరకువెళ్లి అవలీలగా ఎత్తేసి కిందకుదించి ఆశ్చర్యపోయాను .

కిటికీలలోనుండి వెలుతురు పడుతుండటంతో అప్పుడే తెల్లవారిందని జేబులోని మొబైల్ తీసి చూస్తే ఉదయం 6 గంటలు . బుజ్జాయిలు గుర్తుకురావడంతో చేతులు ముఖం శుభ్రం చేసుకుని కర్చీఫ్ తో తుడుచుకుంటూ బయటకువచ్చాను .
డాక్టర్ గారు : ఆశ్చర్యంతో నావైపే చూస్తున్నారు .
డాక్టర్ గారూ డాక్టర్ గారూ ........... పెద్దమ్మకు ఎలా ఉంది అని అడిగాను .
ఆయన తేరుకుని మీ పెద్దమ్మ గారు రాత్రే ఆల్రైట్ అయిపోయారు . మీరు మీరు ........... మీరు ఇంత ఉత్సాహంతో ఎలా అని చెక్ చేసి నిన్న కంటే ఎనర్జీ తో ఉన్నారు - అన్ని ప్యాకేట్స్ తీసుకున్నాము అయినా కూడా మీ వొంటిలో బ్లడ్ సరైనంత మోతాదు కంటే ఎక్కువనే ఉంది . సులభంగా రెండు మూడు మళ్లీ ఇచ్చేయ్యొచ్చు .
అవును డాక్టర్ గారూ .......... నాకూ అలానే అనిపిస్తోంది . అని చేతులూ కాళ్ళను మరింత ఎనిర్జీతో ఊపాను .
డాక్టర్ గారు : ఇట్స్ మిరాకిల్ .......... ఏది ఏమైనా నువ్వు perfectly ఆల్రైట్ - నీకు ఏమైనా అవుతుందేమోనని మేమంతా రాత్రన్తా భయపడుతూనే ఉన్నాము . గ్లూకోజ్ బానే పనిచేసినట్లుంది మరీ ఇంత తక్కువ సమయంలో అన్నదే నాకు అంతుపట్టడం లేదు . Anyway గుడ్ న్యూస్ ...........
మహేష్ ......... డాక్టర్ గారూ ...........
డాక్టర్ గారు : మహేష్ ........... అని చేతులు కలిపి , ఆవ్ .......... అంటూ చేతిని వెనక్కు తీసుకుని ఉఫ్ఫ్ ఉఫ్ఫ్ ......... అని ఊదుకున్నారు .
Sir సర్ .......... ఏమైంది అంటూ ఆశ్చర్యంతో నా చేతిని చూసుకుని లోలోపలే నవ్వుకుని sorry సర్ sorry సర్ .......... అని మళ్ళీ చెయ్యి అందుకోబోతే ,
డాక్టర్ గారు : నో నో నో .......... మళ్లీ అంత స్ట్రాంగ్ .......... నో హ్యాండ్ షేక్ ఓన్లీ డిస్టెన్స్ , చేతులే ఇంత స్ట్రాంగ్ అయితే.......... ఇక నిన్న నేను నీ నుండి బ్లడ్ తీసుకోవడానికి ఒప్పుకోకపోతే ఒక్క గుద్దు గుద్ది ఉంటే నేను ICU లో పేషెంట్ అయిపోయేవాన్ని అని నవ్వుకుని , మీ పెద్దమ్మ .......... perfectly ఆల్రైట్ కానీ సాయంత్రం వరకూ కేర్ అవసరం , కొద్దిసేపట్లో జనరల్ వార్డ్ కు షిఫ్ట్ చేస్తాము సాయంత్రం వరకూ ఉంటే చాలు , తరువాత ప్రిస్క్రిప్షన్ రాసిస్తాను అనిచెప్పి చేతులుకలపబోయి నో నో నో .......... నర్స్ టేక్ కేర్ అనిచెప్పి నవ్వుకుంటూ వెళ్లిపోయారు .

నా చెయ్యి అంత స్ట్రాంగ్ ఎలా మారిపోయిందబ్బా ఏకంగా డాక్టర్ గారే భయపడిపోయారు అని ఆలోచిస్తూ రెస్ట్ తీసుకుంటున్న పెద్దమ్మను చూస్తూనే బుజ్జాయిలను జోకొడుతూ కూర్చున్నాను .
నా చేతి స్పర్శ తాకగానే , అన్నయ్యా అన్నయ్యా ........... మేము మీ గుండెలపైననే ఉన్నాముకదా అని కలవరించడం విని మురిసిపోయి , వెంటనే ఇద్దరినీ అవలీలగా చిటికెన వేలితో ఎత్తుకునేలా ఎత్తుకుని గుండెలపై హత్తుకుని , అవును తల్లులూ ......... మీకు అతి ఇష్టమైన చోటు నా గుండెలపైనే కదా అని బుగ్గలపై ముద్దులుపెట్టి జోకొట్టాను .

ఒక గంట తరువాత డాక్టర్ గారు వచ్చి పెద్దమ్మను చెక్ చేసి వార్డ్ కు మార్చండి అనిచెప్పి , మహేష్ ............ సాయంత్రం వచ్చి చూసి డిశ్చార్జ్ చేస్తాను అని చేతిని కలపబోయి వెంటనే గుర్తుకువచ్చినట్లు జేబులో పెట్టుకుని వెనక్కు తిరిగిచూడకుండా వెళ్లిపోయారు .
తలపై - చేతులపై - కాళ్లపై కట్లతో రెస్ట్ తీసుకుంటున్న పెద్దమ్మను మూవింగ్ బెడ్ తో సహా తీసుకెళ్లారు . బుజ్జాయిలను ఎత్తుకుని జోకొడుతూనే జనరల్ వార్డ్ కు వెళ్లి బెడ్ ప్రక్కనే కూర్చున్నాను .

నర్స్ : మహేష్ సర్ .......... ఎంతసేపని మీ పైనే పడుకోబెట్టుకుంటారు ప్రక్కనే బెడ్ ఖాళీ కదా పడుకోబెట్టండి . మీ పెద్దమ్మ గారు మధ్యాహ్నానికి గానీ స్పృహలోకి రారు . హాయిగా నిద్రపోవడానికి డాక్టర్ గారు ఇంజక్షన్ వేశారు . నాకు ఇవ్వండి పడుకోబెడతాను .
వద్దు వద్దు పర్లేదు మేడం ........... బుజ్జాయిలు నిద్రలేవగానే ఒకవేళ నా గుండెలపై లేకపోతే నన్ను కొట్టేస్తారు - బుగ్గలను కొరికేస్తారు .
నర్స్ : అలా అయితే వద్దు వద్దు .......... పిల్లలు ముద్దొచ్చేస్తున్నారు అని నవ్వుకుని , నేను వార్డ్ లో అందరినీ చెక్ చెయ్యడానికి వెళుతున్నాను అవసరం అయితే పిలవండి అని ప్రక్కన పేషెంట్స్ ను చూస్తూ వెళ్లారు .

మరొక గంటకు బుజ్జాయిలు కొద్ది గ్యాప్లో వొళ్ళువిరుస్తూ లేచి నన్ను చూసి గుడ్ మార్నింగ్ అన్నయ్యా ......... అని బుగ్గలపై ముద్దులుపెట్టి , పెద్దమ్మ పెద్దమ్మ ఎలా ఉన్నారు అని కంగారుపడుతూ అడిగారు .
రక్షించినది ఎవరు నా బుజ్జిదేవతలు మనం ICU నుండి వార్డ్ కు వచ్చేసాము అంటే పెద్దమ్మ పూర్తి సేఫ్ అన్నమాట అని బుగ్గలపై ముద్దులుపెట్టి , బెడ్ పై కూర్చోబెట్టాను .

బుజ్జాయిలు : లేవగానే గుడ్ న్యూస్ చెప్పారు లవ్ యు అన్నయ్యా ........... అని బుజ్జాయిలిద్దరూ ప్రేమతో పెద్దమ్మ బుగ్గలను స్పృశించగానే కన్నీళ్లు కారడం చూసి అన్నయ్యా ........... అన్నారు .
బుజ్జితల్లీ ........... అవి ఆనందబాస్పాలు - మీ టచ్ ను పెద్దమ్మ ఫీల్ అవుతున్నారు - ఒక చెరొక ముద్దు పెట్టారంటే మరింత త్వరగా కోలుకుంటారు అనిచెప్పాను .
బుజ్జాయిలు : అయితే ఒక్కొక్క ముద్దుకాదు బోలెడన్ని ముద్దులుపెడతాము . మన పెద్దమ్మ మరింత మరింత త్వరగా కోలుకోవాలి అని బాస్పాలను తుడిచి నుదుటిపై ఉన్న కట్టుపై - బుగ్గలపై - చేతులపై ఆప్యాయంగా ముద్దులుపెట్టారు . ముద్దులుపెట్టిన ప్రతిసారీ చలనంతో మూలగడం విని బుజ్జాయిల ఆనందానికి అవధులే లేవు .

బుజ్జాయిలూ ............ ఆకలేస్తోందా ...........
లేదు అన్నయ్యా ........ ఊ ఊ ......... అన్నారు .
లవ్ యు అని ముద్దులుపెట్టి , అయ్యో ............ మీ అమ్మ గారు మీకోసం ఎంత కంగారుపడుతుంటారో , ఈ కంగారులో కాల్ కూడా చేయలేదు బుజ్జాయిలూ , మీకు కంగారు లేదా ? .

బుజ్జాయిలు నవ్వుకుని అన్నయ్యా అన్నయ్యా ............ మేము అమ్మతో ఆ ఇంట్లో ఉండటం కంటే మీతో ఒక్కరాత్రి కాదు రోజుల తరబడి ఉన్నా ఏమాత్రం కంగారుపడరు - అంత నమ్మకం అమ్మకు మీపైన , అక్కడ ఉంటే అమ్మ బాధపడటం చూసి మేమూ బాధపడతామని - వాడిని మేము చూడాల్సివస్తుందని అమ్మ భయం . మేము మీదగ్గర ఉన్నామనుకోండి ప్రతిక్షణం వాళ్ళ ప్రాణమైన అన్నయ్యతో నన్ను కూడా మరిచిపోయేంత ఎంజాయ్ చేస్తుంటారని అమ్మకూడా పరవశించిపోతుంటారు.

బుజ్జాయిల బుజ్జి బుజ్జి మాటలకు అమితమైన ఆనందం కలిగింది . ఏమో అవన్నీ నాకు తెలియదు కాల్ చేసిస్తాను మాట్లాడండి అని మొబైల్ అందించాను .
బుజ్జితల్లి : అన్నయ్యా .......... మేము చెబితే వినరు కదా , స్పీకర్ ఆన్ చెయ్యండి మీకే తెలుస్తుంది అన్నారు . అలానే చేసాను .

దేవత : మహేష్ గారూ ......... మన బుజ్జాయిలు రాత్రంతా ఎంజాయ్ చేసిన ఫోటోలు వీడియోలు తీశారు కదా - తీసే ఉంటారు లేండి . నన్నే మరిచిపోయేంత ఎంజాయ్ చేసి ఉంటారు - నాకైతే రాత్రంతా సంతోషమే సంతోషం - ప్రతి నిమిషానికీ ఒక ఫోటో తీసుకున్నా బోలెడన్ని లవ్లీ జ్ఞాపకాలు - హాయిగా నిద్రపట్టింది . ఈరోజు వస్తారా ? రేపు వస్తారా ? లేక వారం రోజుల తరువాత వస్తారా ? మీ ఇష్టం . వాళ్ళు మీ బుజ్జాయిలు వాళ్ళ సంతోషమే నాకు ఆనందం అని మురిసిపోతున్నారు .
బుజ్జాయిలు : ok నా అని కళ్ళతోనే తెలియజేసారు .

నాపై అంత నమ్మకం ఉంచినందుకు థాంక్యూ soooooo మచ్ మేడం .........
అంతే బుజ్జాయిలిద్దరూ బుజ్జిబుజ్జిచేతులతో నా రెండు చేపలూ చెళ్లుమనిపించారు .
దేవత : పడ్డాయా పడ్డాయా .......... ఒకటి కాదు ఏకంగా రెండు చెంపదెబ్బలు నాకు వినిపించాయి అని ఆపకుండా నవ్వుతూనే ఉన్నారు .
బుజ్జితల్లీ - బిస్వాస్ ............ ఎందుకు కొట్టారో తెలుసుకోవచ్చా అని దీనంగా ముఖం పెట్టి రుద్దుకుంటున్నాను .
దేవత : మొదట నాకు పడతాయేమో అనుకున్నాను - మీకు పడ్డాయి అని మళ్ళీ నవ్వు .
బుజ్జాయిలు : మీ ఇద్దరికీ అప్పుడే ఒక్కొక్క వార్నింగ్ ఇచ్చాముకదా ........... మనమధ్యన ............
థాంక్స్ చెప్పానా ............ లవ్ యు లవ్ యు లవ్ యు బుజ్జాయిలూ అని బుగ్గలపై ముద్దులుపెట్టాను .
బుజ్జాయిలు : మాకు కాదు అన్నయ్యా .......... అమ్మకు చెప్పండి .
అమ్మ ఫీల్ అవతారేమో బుజ్జాయిలూ .......... మీకు చెప్పానుకదా ..........
బుజ్జాయిలు : వెంటనే లవ్ యు sooooooo మచ్ అని చెబుతారా లేక మళ్లీ దెబ్బలు పడాలా అన్నయ్యా ............
Ok ok ok ........... దెబ్బలా వద్దే వద్దు , బుజ్జిబుజ్జిచేతులైనా ఎంత చుర్రుమందో తెలుసా ..............
అటువైపు ముసిముసినవ్వులు వినిపించాయి .
బుజ్జాయిలు : ఊ ఊ ...........
మేడం మేడం ........... నాపై అంత నమ్మకం ఉన్నందుకు థాంక్ ............. ok ok ok ల ......... వ్ ........ soooo మచ్ అని తలదించుకున్నాను .
దేవత : లవ్ యు టూ ............ అని ముసిముసినవ్వులతో , బుజ్జాయిలూ ........... పాపం భయపడుతున్నారు ఈరోజుకు చాలు అని మళ్ళీ నవ్వుకున్నారు .

కీర్తి : అమ్మా ........... రాత్రంతా మేము ఎంజాయ్ చెయ్యలేదు . నేను పూర్తిగా చెప్పేంతవరకూ మీరు కంగారుపడి మమ్మల్ని కంగారుపెట్టకండి సరేనా ........... , రాత్రంతా మేము హాస్పిటల్లో ఉన్నాము .
దేవత : హాస్పిటల్ లోనా ........... , మీ అన్నయ్యకు ఏమీ అవ్వలేదు కదా తల్లీ ......... అని కంగారు కంగారుగా అడిగారు .
కీర్తి : అమ్మా .......... చెప్పానా పూర్తిగా వినమని ,
దేవత : ok లవ్ యు లవ్ యు ......... తొందరగా చెప్పు తల్లీ మీ అన్నయ్యకు ఏమీ కాలేదు కదా .............
కీర్తి : అంటే మాకేమైందని ఒక్కసారీ అడగరే , అన్నయ్య అన్నయ్య .......... అని నావైపు చూసి నవ్వుకుని , మీ ప్రాణమైన దేవుడికి ఏమీ కాలేదు మరొక్క మాటకూడా మాట్లాడకుండా నోటికి తాళం వెయ్యండి .
హమ్మయ్యా .......... ఏమీ కాలేదా అని అమ్మవారిని ప్రార్థించిన గుసగుసలు వినిపించాయి . తల్లీ నాన్నా ......... మీకు ఏమీ కాలేదు కదా ...........
కీర్తి : అన్నయ్య గురించి బోలెడన్ని సార్లు అడిగిన తరువాతనా అమ్మా అడిగేది - లవ్ యు sooooooo మచ్ - we like it - అయినా ప్రక్కనే మీ దేవుడు ఉండగా మాకేమి అవుతుందమ్మా ............. , అసలు ఏమి జరిగిందంటే మిమ్మల్ని నిన్న సాయంత్రం వాడు కొట్టడం సెక్యూరిటీ పంపిన వీడియోలో చూసి ఇంటికి వస్తుంటే దారిలో అని జరిగింది మొత్తం వివరించింది .
దేవత : మీ అన్నయ్యకు తోడుగా పెద్దమ్మ ప్రాణాలు కాపాడారన్నమాట . ఉమ్మా ఉమ్మా ఉమ్మా .............. లవ్ యు లవ్ యు sooooooo మచ్ బుజ్జాయిలూ ......... నేను చాలా చాలా గర్వపడుతున్నాను . మీ అన్నయ్యతో ఉండే ప్రతిక్షణం మీరు జీవితం అంటే ఏమిటో తెలుసుకుంటున్నారు అన్నమాట . లవ్ యు లవ్ యు soooooo మచ్ .
బుజ్జాయిలు : అమ్మా చేసిందంతా ......... పెద్దమ్మ ప్రాణాలను వొంట్లోని రక్తం మొత్తం ఇచ్చేసి సేవ్ చేసినది అన్నయ్య అయితే మాకు మాత్రమే లవ్ యు చెబుతారేంటి అన్నయ్యకు అదే అదే మీ దేవుడికి కూడా చెప్పండి .
అటువైపు మేడం సిగ్గుపడినట్లు లవ్ యు మహేష్ గారూ ........... అని తియ్యని మాటలు వినిపించడంతో ,
నా వొళ్ళంతా వెయ్యి వీణలు మీటినట్లు తియ్యని జలదరింపుతో గాల్లో తెలిపోయాను.
నన్నుచూసి నవ్వుకుంటున్న బుజ్జాయిలను చూసి వెంటనే తప్పు తప్పు అని లెంపలేసుకున్నాను .

దేవత : బుజ్జితల్లీ మళ్లీ ఎందుకు కొట్టారు .
కీర్తి : మేము కాదమ్మా .......... ఎందుకో అన్నయ్యనే కొట్టుకున్నారు . ఎందుకు కొట్టుకున్నారో మాకూ తెలియదు .
దేవత : ఎందుకో నాకు తెలుసు నా బంగారు తల్లీ .......... అని ముసిముసినవ్వులు వినిపించాయి .
కీర్తి : అమ్మా ........ మీకు అర్థమైతే మాకు ok ok . పెద్దమ్మ స్పృహలోకి వచ్చాక కాల్ చేస్తాము - మేము సాయంత్రం వరకూ ఇక్కడే ఉండాలి .
దేవత : లవ్ యు తల్లీ ........... సాయంత్రం వరకూ కాదు , ఎప్పుడైనా రండి మీరు మీ అన్నయ్యతో ఉండటమే నాకు ఆనందం . ఉంటాను మహేష్ గారూ ......... లవ్ యు ......... నేను ఆశతో తలెత్తాను ....... లవ్ యు తల్లీ అనడంతో కాస్త నిరాశ చెందటం చూసి కీర్తి నవ్వుకుని బై అమ్మా ..........ఆకలేస్తోంది తినాలి మళ్లీ కాల్ చేస్తాము అని కట్ చేసి , హ్యాపీనా అన్నయ్యా .........అని లేచి నన్ను హత్తుకుని బుగ్గలపై ముద్దులుపెట్టారు .

బుజ్జాయిలూ ............ ఫేస్ వాష్ చేసుకుందామా అన్నాను .
ఊ ఊ .......... అంటూ ఉత్సాహంతో తలలు ఊపారు . అన్నయ్యా అన్నయ్యా ........ పెద్దమ్మ దగ్గర ఒకరు ఉండాలి కాబట్టి , మొదట నేను ఇక్కడే ఉంటాను అన్నయ్యను తీసుకెళ్లండి .
మా బుజ్జితల్లి బంగారం , జాగ్రత్త తల్లీ అని నుదుటిపై ముద్దుపెట్టాను . బిస్వాస్ ను బాత్రూమ్లోకి తీసుకెళ్లి నోటిలో నీళ్లు పుకిలించేలా చేసి ముఖం కాళ్ళు చేతులూ నీటితో కడిగి కర్చీఫ్ తో తుడుస్తూ వచ్చాము . నెక్స్ట్ మీ అక్కయ్య బిస్వాస్ ఎక్కడకూ వెళ్లకూడదు అని పెద్దమ్మ ప్రక్కనే కూర్చోబెట్టి , కీర్తిని ఎత్తుకెళ్ళి మొదట టాయిలెట్లో వదిలి తరువాత ఫేస్ వాష్ చేసి తీసుకొచ్చాను . తల్లీ - బిస్వాస్ మీరు పెద్దమ్మను చూస్తూ ఉండండి ఇంతకీ ఏమి తింటారు ఆని అడిగాను .
బుజ్జాయిలు : మా అన్నయ్య ఏది తెచ్చినా మాకు ఇష్టమే అని బుగ్గలపై ముద్దులుపెట్టి , జనరల్ వార్డ్ లో పేషెంట్ కు తోడుగా ఉన్నవాళ్లు ఫుడ్ తీసుకొచ్చినట్లు వాళ్ళు తింటూ - ఒంటరిగా ఉన్నవాళ్లు ఆశతో వాళ్ళవైపు చూస్తుండటం , బుజ్జాయిలు గమనించి ఫీల్ అవ్వడం చూసాను .
నర్స్ కు బుజ్జాయిలను చూసుకోండి అవసరమైతే వెంటనే ఈ నెంబర్ కు కాల్ చెయ్యండి పేపర్లో రాసిచ్చాను . జాగ్రత్త జాగ్రత్త అని బుజ్జాయిలవైపే చూస్తూ పరుగునవెళ్లి మాంచి టిఫిన్ హోటల్లో బుజ్జాయిలతోపాటు ఒంటరిగా ఉన్నవాళ్లకు కూడా టిఫిన్ పార్సిల్స్ మరియు fruits తీసుకొచ్చాను .

భుజాలపై - చేతులతో బోలెడన్ని పట్టుకురావడం చూసి , అన్నయ్యా ......... అన్ని పార్సిల్స్ అని ఆశ్చర్యపోయారు .
వాళ్లకోసం మా బుజ్జాయిలు ఫీల్ అయ్యారుకదా వాళ్లకోసం టిఫిన్ పళ్ళు కూడా తీసుకొచ్చాను - వెళ్లి మీరే ఇవ్వండి అన్నాను .
లవ్ యు లవ్ యు లవ్ యు sooooooooo మచ్ అన్నయ్యా .......... అని నన్ను బెడ్ పైనుండే గట్టిగా హత్తుకుని ముద్దులతో ముంచెత్తారు .
చాలు చాలు బుజ్జాయిలూ ........... ఇక్కడ మీరు తిన్నారని తెలిస్తేనే మీ అమ్మగారు అక్కడ తినేది , వెంటనే వెళ్లి ఇచ్చేసి రండి అనిచెప్పాను .
లవ్ యు అన్నయ్యా .......... అని కిందకుదిగి రెండు రెండు పార్సిల్స్ తీసుకుని బుజ్జిబుజ్జిపరుగులతో వెళ్లి అందించడమే కాకుండా త్వరగా నయమైపోతుంది అని ఆప్యాయంగా పలకరించారు .
చాలా సంతోషం పిల్లలూ ........... మీరు నిండు నూరేళ్లూ చల్లగా ఉండాలి ఉంటారు అని దీవించి అందుకున్నారు .

నర్సులు మరియు తోడుగా వచ్చినవాళ్ళు సంతోషంతో చప్పట్లు కొడుతుంటే , మరింత ఉత్సాహంతో పరుగుపరుగున రావడం పరుగుపరుగున వెళ్లి ఇవ్వడం , చివరికి మేడం మీకు కూడా అని నర్సులకు కూడా అందించి వాళ్ళ నుండి ముద్దులను స్వీకరించివచ్చి అన్నయ్యా .......... అందరికీ ఇచ్చాము . అందరూ చాలా హ్యాపీ మాకు లేకపోయినా పర్లేదు . అవసరమైన వాళ్ల అవసరం తీరిస్తే కలిగే ఆనందం ఏంటో తెలిసింది కిక్కు ఉంది అన్నయ్యా .......... లవ్ యు లవ్ యు soooooo మచ్.
అందుకే ఈ ఆనందాన్ని మీ అమ్మకు చూయించాలని ఫోటోలు తీసాను అని హత్తుకుని , మీరు తినకపోతే వాళ్లంతా ఫీల్ అవుతారు .
అవును అన్నారు అంతా ..........
అయితే తింటాము అన్నారు . ప్రక్కనే ఉన్న బెడ్ పై కూర్చోబెట్టి ఇడ్లీ తినిపించాను .
అన్నయ్యా .......... మీరు కూడా అనడంతో , లవ్ యు అని ముద్దులుపెట్టి తినిపించి తిన్నాను .

నీళ్లు తాగి అన్నయ్యా అన్నయ్యా .......... మా బుజ్జి బొజ్జలు నిండిపోయాయి అని చూయించడంతో దగ్గర ఉన్నవాళ్లు నవ్వుకున్నారు .
అన్నయ్యా అన్నయ్యా .......... అంటూ ముఖాన్ని దాచేసుకొని నా గుండెలపైకి చేరిపోయారు .
మా బుజ్జాయిలకు సిగ్గు వచ్చేసింది అని గిలిగింతలు పెట్టి వాళ్ళ చిరునవ్వులను చూసి వార్డ్ మొత్తం పులకించిపోయింది .
నా బంగారు బుజ్జాయిలు ఎక్కడ ఉంటే అక్కడ చిరునవ్వులు సంతోషాలే లవ్ యు లవ్ యు sooooo మచ్ అని ముద్దులుపెట్టి పెద్దమ్మ ప్రక్కనే కూర్చోబెట్టాను .

పెద్దమ్మకు ఇరువైపులా కూర్చుని బుగ్గలపై ముద్దులుపెట్టి , హాయిగా రెస్ట్ తీసుకోండి పెద్దమ్మా ......... అని ఏదో చూసినట్లు , అన్నయ్యా ......... కొత్త గుడ్డ మరియు వెచ్చని నీళ్లు కావాలి , నర్స్ మేడం ను అడగనా ..........
గో తల్లీ.......... అని కిందకు దించాను . ఇద్దరూ వెళ్లి కీర్తి తల్లి చేతిలో గుడ్డ - బిస్వాస్ మగ్ లో వెచ్చని నీళ్లు తీసుకొచ్చి , అన్నయ్యా ......... అక్కడక్కడా పెద్దమ్మకు రక్తం ఇంకా అంటుకునే ఉంది అని సున్నితంగా తుడిచి ముఖాన్ని కాళ్ళూ చేతులను కూడా తుడిచారు . పెద్దమ్మ కళ్ళల్లోనుండి భాస్పాలు కారడం చూసి పెద్దమ్మా ........ మీరు పూర్తిగా కోలుకుని లేచి కూర్చునేంతవరకూ సంతోషంగా మీ సేవ చేసుకుంటాము మీరేమీ బాధపడకండి , అన్నయ్య తన రక్తం మొత్తాన్ని ఇచ్చి మిమ్మల్ని రక్షించారు అని కన్నీళ్లను తుడిచి కళ్లపై ప్రాణమైన ముద్దులుపెట్టారు .
లవ్ యు soooooo మచ్ బుజ్జాయిలూ ........... అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి పొంగిపోయాను . నర్స్ కు కొంత డబ్బు ఇచ్చి పెద్దమ్మకు మార్చుకోవడానికి బట్టలు ........ అన్నాను .
నర్స్ : అలాగే సర్ ......... అని పెద్దమ్మను తదేకంగా కొన్ని క్షణాలపాటు చూస్తున్నారు.
ఏమిటా అని చూస్తే కొలతలు ........... నో నో నో తప్పు అని తలదించుకున్నాను .

మధ్యాహ్నం ఒంటి గంటకు డాక్టర్ గారువచ్చి పెద్దమ్మను చెక్ చేసి ఇంజక్షన్ వేసి గ్లూకోజ్ ఎక్కించి ఏ క్షణమైనా స్పృహలోకి రావచ్చు మహేష్ ..........
థాంక్యూ sooooo మచ్ డాక్టర్ గారు అని ముగ్గురమూ సంతోషంతో చెప్పాము .
డాక్టర్ గారు : నర్స్ ........... వీరు స్పృహలోకి రాగానే ఇంఫార్మ్ చెయ్యండి అనిచెప్పి మిగితా పేషెంట్స్ ను చెక్ చేసి వెళ్లారు .

బుజ్జాయిలూ .......... లంచ్ టైం అయ్యింది ఏమి తింటారు అని అడిగాను .
అంతే వార్డ్ లోని పేషెంట్స్ బంధువులు వాళ్ళు తీసుకొచ్చిన ఫుడ్ ను మొదటగా పిల్లల ముందు ఉంచారు . పిల్లలూ ......... మీరు తిన్నాకే మేము తింటాము . రోజులుగా నవ్వని మా వాళ్ళు మీవల్ల ఉదయం నుండీ సంతోషంతో ఉన్నారు అని సంతోషాన్ని వ్యక్తం చేశారు .

బుజ్జాయిలు : అమ్మో ......... బోలెడన్ని ఐటమ్స్ అని నావైపు చూసి నవ్వుకుని , ఒక ప్లేట్ అందుకొని అన్నీ క్యారెజ్ లలో నుండి గరిటే తో కొద్దికొద్దిగా వడ్డించుకుని , చాలు అమ్మలూ ........... తీసుకెళ్లండి .
పిల్లలూ .......... అంతేనా .........
అమ్మలూ .......... ఒకసారి ప్లేట్ చూడండి అని బుజ్జాయిలిద్దరూ చూయించారు . అందరి వంటలూ కొద్దికొద్దిగా తీసుకున్నా ఓకేదగ్గర చూస్తే ప్లేట్ మొత్తం నిండిపోయి ఉండటం చూసి నవ్వుకుని వారి వారివి తీసుకెళ్లి , కాలేజ్లోలా పంచుకుని చిరునవ్వులు చిందిస్తూ తిన్నారు .
పేషెంట్స్ ను చెక్ చెయ్యడానికి బయట అటూ ఇటూ వెళ్తున్న డాక్టర్లు లోపలికివచ్చి విషయం తెలుసుకుని తింటున్న బుజ్జాయిలను అభినందించి సంతోషంతో వెళ్లారు .
Next page: Update 11
Previous page: Update 09