Update 11


మధ్యాహ్నం 4 గంటల సమయంలో మ్మ్మ్ .......మ్మ్మ్........ బుజ్జాయిలూ బుజ్జాయిలూ ........... అని కలవరించారు .
అన్నయ్యా అన్నయ్యా ........... పెద్దమ్మ మాట్లాడుతున్నారు .
మేడం మేడం అని నర్స్ ను పిలుచుకునివచ్చాను .
కలవరించడం చూసి , పిల్లలూ ......... మిమ్మల్నే కలవరిస్తున్నారు మాట్లాడండి నేను డాక్టర్ గారిని పిలుచుకునివస్తాను అని పరిగెత్తారు .

బుజ్జాయిలు : అన్నయ్యా అన్నయ్యా ........... మేమా .........
అవును కీర్తి తల్లీ - బిస్వాస్ .......... మీరు చేసిన సేవలన్నీ పెద్దమ్మ మనసుతో చూసినట్లున్నారు . ప్రేమతో పెద్దమ్మా అని పిలిచి ముద్దులుపెట్టండి తప్పకుండా కళ్ళుతెరుస్తారు అనిచెప్పాను .
బుజ్జాయిలిద్దరూ పెదాలపై చిరునవ్వుతో పెద్దమ్మా పెద్దమ్మా .......... అని ఆప్యాయంగా పిలిచి బుగ్గలపై చెరొక ముద్దుపెట్టారు .

బుజ్జాయిలూ ............ అని కళ్ళుతెరిచి మొదటగా ఇద్దరినీ చూసి , లవ్ యు కీర్తి తల్లీ - లవ్ యు బిస్వాస్ అని నొప్పిగా ఉన్నా నవ్వుతూ చేతులతో బుజ్జిచేతులను అందుకుని ముద్దులుపెట్టారు .
లవ్ యు పెద్దమ్మా .......... మీరు లేచి నవ్వారు చాలా సంతోషం అని మళ్ళీ బుగ్గలపై ప్రేమతో ముద్దులుపెట్టి , లేచి కూర్చోవాలని ఉందా అని అడిగారు .
పెద్దమ్మ బుజ్జిచేతులపై ముద్దులతో అవునని బదులివ్వడంతో ,
అన్నయ్యా .......... అని ఆర్డర్ వెయ్యడంతో , ఆటోమేటిక్ బెడ్ ప్రెస్ చెయ్యడంతో నెమ్మదిగా సగం పైకి లేవడం చూసి బుజ్జాయిలు భలే భలే అని చప్పట్లు కొట్టారు .

పెద్దమ్మా పెద్దమ్మా .......... అన్నయ్య ...........
మీ అన్నయ్య మహేష్ కదా బుజ్జాయిలూ ......... మీ కు మీ అన్నయ్య అంటే - మీ అన్నయ్యకు మీరంటే ప్రాణం అని నవ్వారు .
బుజ్జాయిలు : పెద్దమ్మా .......... మీరు నవ్వుతుంటే చాలా చాలా బాగుంది . మా అమ్మ అంత అందంగా కూడా ఉన్నారు .
పెద్దమ్మ : మురిసిపోయి , బుజ్జాయిలూ ........ ఇంకా ఇప్పుడే కదా స్పృహలోకి వచ్చినది అప్పుడే ఇంతలా నవ్వించాలా అని ఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టి సిగ్గుపడ్డారు .
అవును బుజ్జాయిలు చెప్పినది నిజమే అందంలో దేవతతో పోటీపడుతున్నారు . రేయ్ రేయ్ ........... కొద్దిగా గ్యాప్ ఇస్తే కిలోమీటర్ దూసుకుపోతావు ఆ కా ........ చూపును కంట్రోల్ చేసుకో , అమ్మాయిలపై కోపం వలన ఇప్పటివరకూ చూసినది తక్కువే ok ok కానీ పరిస్థితులు ఏంటి ఎక్కడ ఉన్నాము అధిచూసుకో , రేయ్ ఇంత చెబుతున్నా ఆ చూపేంట్రా .............
పెద్దమ్మ సడెన్ గా నావైపు చూడటంతో , కళ్ళల్లో రేణువు పడ్డట్లు ఆక్ట్ చేస్తూ వెనక్కు తిరిగాను .
కాస్త గట్టిగానే ముసిముసినవ్వులు వినిపించడంతో వెనక్కు తిరిగిచూస్తే , నా కంటే సెకండ్ ముందుగానే పెద్దమ్మ బుజ్జాయిలవైపు తిరిగి ముద్దుచేస్తూ నవ్వుతున్నారు .

ఇంతలో డాక్టర్ గారువచ్చి , అనుకున్నాను పిల్లలు ఈపాటికి నవ్వించేసి ఉంటారని అని చెక్ చేసి , wow .......... గాయాలు ఇంత త్వరగా మానడం మిరాకిల్ మే బీ మీ అన్నయ్య ఇచ్చిన బ్లడ్ వలనే అనుకుంటాను పిల్లలూ , 6 గంటలకు డిశ్చార్జ్ అని పేపర్స్ పై సంతకం చేసి బుజ్జాయిలకు షేక్ హ్యాండ్ ఇచ్చారు .
థాంక్యూ sooooo మచ్ డాక్టర్ సర్ .......... మా పెద్దమ్మను మా అన్నయ్య ఇంటికి తీసుకెళ్లిపోతాము . యాహూ .......... అని సంతోషంతో కేకలువేసి , వెంటనే సైలెంట్ అయిపోయి పెద్దమ్మ చేతులను చుట్టేసారు .
పెద్దమ్మ : మనసులో రెండు ప్రశ్నలు అడగండి . ఒకటి నేనే అడగకముందే సమాధానం చెప్పేస్తాను , ఉదయం నుండీ మీరిద్దరూ మీ అన్నయ్యతో మాట్లాడిన మాటలూ - నన్ను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకోవడం అన్నీ నాకు తెలుసు - నా హృదయం అన్నీ చూసింది అని బుగ్గలపై తియ్యని నవ్వుతో ముద్దులుపెట్టారు . ఎవరో తెలియకపోయినా ఈ పెద్దమ్మ అంటే ఎందుకు అంత ఇష్టం .
బుజ్జాయిలు : మీరు చెప్పినట్లు మీ హృదయం ఎలా చూసిందో - అలా మా బుజ్జి హృదయం మిమ్మల్ని చూడగానే ఎందుకో తెలియదు టపటపా కొట్టేసుకుంది కళ్ళల్లో కన్నీళ్లు వచ్చేసాయి మా అన్నయ్యతోపాటు ముగ్గురికీ .......... లవ్ యు పెద్దమ్మా లవ్ యు పెద్దమ్మా .......... అని మరింత గట్టిగా చుట్టేశారు .

పెద్దమ్మ : బుజ్జాయిల మాటలకు చలించి లవ్ యు sooooooo మచ్ బుజ్జాయిలూ............ , కమాన్ సెకండ్ ప్రశ్న అడుగుతారా లేక దానికి కూడా నేనే .......
బుజ్జాయిలకు నవ్వు రాలేదు . పెద్దమ్మా పెద్దమ్మా ........... మీ వాళ్ళు ఎక్కడ , చెబితే అన్నయ్య పిలుచుకునివస్తారు అని గుండెలపై వాలిపోయి అడిగారు .
పెద్దమ్మ : బుజ్జాయిల మాటలలోని ఆంతర్యం అర్థమయ్యి నవ్వుకుని , బుజ్జాయిలూ .......... నాకు ఎవ్వరూ లేరు - నేను ఒక అనాధని - మా లోకం ........ మా ఊరిలో మీ పెద్దమ్మను ఆప్యాయంగా పేదరాసిపెద్దమ్మ అని పిలుచుకుంటారు .

అంతే ఒక్కసారిగా బుజ్జాయిల పెదాలపై చిరునవ్వులు చిగురించి పెద్దమ్మా పెద్దమ్మా .......... నిజమా మీరు అనాధనా అని అంతులేని ఆనందంతో పరవశించిపోయి ఏకంగా కేకలు వేశారు . పెద్దమ్మా పెద్దమ్మా .......... మీరు తప్పుగా అనుకోవద్దు .
పెద్దమ్మ : లేదు లేదు లేదు .......... మీ ముద్దుమాటలలో మీకు నేనంటే ఎంత ఇష్టమో ప్రేమో ప్రాణమో తెలిసింది అని చేతులపై బుగ్గలపై ముద్దులవర్షం కురిపించి , అవును బుజ్జాయిలూ మీ పెద్దమ్మ అనాధ ముందూ వెనుకా ఎవ్వరూ లేరు - మీరు దయతలిచి ఆశ్రయమిస్తే ఏదో ఒక మూలన ఉంటాను . వంట చేస్తాను - బట్టలు ఉతుకుతాను - మిమ్మల్ని రెడీ చేస్తాను - ప్రాణంలా చూసుకుంటాను - మీ అన్నయ్య చెప్పినవన్నీ చేస్తాను .

పెద్దమ్మా ........... అవేవీ చెయ్యక్కర లేదు మిమ్మల్ని మా ఇంట్లో అన్నయ్య దేవతలా చూసుకుంటారు .
దేవతలానా ............
బుజ్జాయిలూ ........... మీ అన్నయ్య ఫేస్ చూస్తుంటే తన మనసులో ఇంతకుముందే దేవత ఉన్నట్లుంది .
బుజ్జాయిలు : అవునవును మా అమ్మ అన్నయ్యను దేవుడిలా ఆరాధిస్తోంది కాబట్టి మా అన్నయ్య దేవత మా అమ్మ . అయినా మీకెలా తెలిసింది పెద్దమ్మా..........
బుజ్జాయిలు తెలిసి అన్నారో తెలియక అన్నారో తెలియదు కానీ నాకు వెక్కిళ్ళు పట్టేసాయి .
పెద్దమ్మ నవ్వుకుని కీర్తి తల్లీ ........... నాకు ఫేస్ రీడింగ్ తెలుసు . మీ అన్నయ్య మనసులో ఏమనుకుంటున్నారో మొత్తం తెలుసు నాకు .
నాకు వెక్కిళ్ళ వేగం పెరిగింది .
పెద్దమ్మ : తల్లీ .......... ముందు మీ ప్రియమైన అన్నయ్యకు నీళ్లు ఇచ్చి నెత్తిపై కొట్టండి అని ముసిముసినవ్వులతో పంపించారు .

అన్నయ్యా ............ ఏమైంది అని నీళ్లు అందించి నెత్తిపై సుతిమెత్తగా తట్టి , వెక్కిళ్ళు ఆగిపోయాక బుగ్గలపై ముద్దులుపెట్టి , పెద్దమ్మ ప్రక్కన చేరి , పెద్దమ్మా .......... అనాధ అని మీరేమీ బాధపడకండి మా అన్నయ్య కూడా అనాధనే ............
బుజ్జాయిలూ.......... టుక్కు అని బుంగమూతిపెట్టుకుని అలకతో వెళ్లి బెడ్ పై కూర్చున్నాను .
బుజ్జాయిలు : అయ్యో ........... మేంఉన్నాము కదా , పెద్దమ్మా .......... ఒక్కనిమిషం అని పెద్దమ్మ బుగ్గలపై ముద్దులుపెట్టి , అన్నయ్యా అన్నయ్యా ........ అంటూ బెడ్ ఎక్కి నా గుండెలపై చేరి నా పెదాలపై చిరునవ్వు పరిమలించేంతవరకూ లవ్ యు లవ్ యు లవ్ యు అని ముద్దులుపెట్టి , నేను నవ్వగానే యాహూ యాహూ ......... మా అన్నయ్య నవ్వారు అని బుగ్గలపై కొరికేసి లవ్ యు అన్నయ్యా .........అని పరుగున వెళ్లి పెద్దమ్మ ప్రక్కన చేరారు .

మిమ్మల్ని చూస్తే ముచ్చటేస్తోంది బుజ్జాయిలూ .......... నేను మీతో ఉండటానికి మీ అన్నయ్య ok అన్నట్లేనా ............
మా ఇష్టమే మా అన్నయ్య ఇష్టం .............
పెద్దమ్మ : మహేష్ ...........
పెద్దమ్మా ........... మిమ్మల్ని సేవించుకునే భాగ్యాన్ని మాకు ప్రసాధించండి ఇది అడగడం కాదు బ్రతిమిలాడుకుంటున్నాము . దేవతలా ..............
పెద్దమ్మ : రెండవ దేవతలా అంటే బుజ్జాయిలకూ నాకూ నీకూ ఒక క్లారిటీ ఉంటుంది . అంతేకదా అని నేను సిగ్గుపడటం చూసి నవ్వుకున్నారు . బుజ్జాయిలూ ......... మీ అన్నయ్య కోరికను తీర్చడానికైనా వస్తాను .
బుజ్జాయిలు : లవ్ యు లవ్ యు soooooo మచ్ పెద్దామ్మా .......... , పిల్లలకు బుజ్జాయిలకు మీరు చెప్పిన కథలను మేము ఇంత ఉన్నప్పటి నుండీ అమ్మ చెబుతూ నిద్రపుచ్చేవారు . ఇక ఈరోజు నుండీ ఏకంగా పెదరాసిపెద్దమ్మనే మాకు కథలు చెప్పడానికి మా అన్నయ్య ఇంటికి మా ఇంటికి వస్తున్నారు . ఇంతకంటే ఆనందం మరొకటి లేదు అని పెద్దమ్మను చుట్టేశారు .

పెద్దమ్మ : అది నా అదృష్టం . బుజ్జాయిలూ .......... డాక్టర్ చెప్పినట్లు గాయాలు మానడమే కాదు నొప్పికూడా లేదు . ఇంతకీ మీ అన్నయ్య ఎంత బ్లడ్ ఇచ్చారు .
బుజ్జాయిలు : మేము కూడా నిద్రపోయాము పెద్దమ్మా ...........
నర్స్ : మేడం .......... ఇప్పుడు మీ ఒంట్లో ఉన్న ప్రతీ రక్తపు బొట్టూ మహేష్ సర్ ఇచ్చినదే - అంత రక్తం పోయింది . నా ప్రాణాలు పోయినా పర్లేదు మా పెద్దమ్మను ............
మేడం ............ please అనడంతో ,
నర్స్ : sorry సర్ అని వెళ్లిపోయారు .

బుజ్జాయిలు : పెద్దమ్మ నావైపే ఆరాధనతో చూస్తుండటం చూసి , పెద్దమ్మా ......... థాంక్స్ మాత్రం చెప్పకండి . ఇక ఈ క్షణం నుండీ థాంక్స్ లు sorry లు మన మధ్యన ఉండకూడదు .
బాగా గుర్తుపెట్టుకోండి పెద్దమ్మా ........... పొరపాటున చెప్పారనుకోండి బుగ్గలను కొరికేస్తారు అని అందరమూ నవ్వుకున్నాము .
పెద్దమ్మ : మీ అన్నయ్య రుణం ఎప్పుడు ఏ సమయంలో తీర్చుకోవాలో నాకు తెలుసు బుజ్జాయిలూ ............ అని నావైపు చూసి తియ్యదనంతో నవ్వుకున్నారు .

సాయంత్రం 6 గంటలవరకూ జనరల్ వార్డ్ లో నవ్వులే నవ్వులు . బుజ్జాయిల చిరునవ్వులను సంతోషాన్ని మరియు పెద్దమ్మ ఆనందాన్ని indirect గా అందాన్ని చూస్తూ , పెద్దమ్మ చూసినప్పుడల్లా కమల్ హాసన్ యాక్టింగ్ లు చేస్తూ , పెద్దమ్మ ముసిముసినవ్వులకు పులకించిపోతున్నాను .

6 గంటలకు డాక్టర్ గారు వచ్చి పెద్దమ్మను చెక్ చేసి , మహేష్ ......... ఇక మళ్లీ హాస్పిటల్ కు కూడా రానవసరం లేదు - నీ బ్లడ్ లో ఏదో మ్యాజిక్ ఉంది . మూడు నాలుగురోజులు ఈ టాబ్లెట్స్ ఒక్కటే వాడండి . మనం మళ్లీ ఇక్కడ కలవనేకూడదు బై బై అనిచెప్పి , కానీ మా పిల్లలను మాత్రం బాగా మిస్ అవుతామేమో అయినా తప్పదు అని కోట్ లోనుండి చాక్లెట్ లు తీసిచ్చి నర్స్ చూసుకోండి అని వెళ్లిపోయారు .
నర్స్ : సర్ ఇవి మేడం కోసం బట్టలు - ఇది ఫీజ్ అని అందించారు .
మేడం మీరే ...........
నర్స్ : ok సర్ , మేడం - పిల్లలూ రండి అని వీల్ చైర్ తీసుకొచ్చారు .
అన్నయ్యా ..............
బుజ్జాయిలూ .......... మీరు మీ పెద్దమ్మతో ఉండండి నేను బిల్ పే చేసివస్తాను అని వెళ్లిపోబోతుంటే ,
నర్స్ : హలో హలో సర్ ......... కాస్త హెల్ప్ చెయ్యండి .
నేనా ............ i can't మేడం అని వణుకుతున్నాను .
నర్స్ : ఏంటి సర్ అలా అయిపోయారు . ఇంతవరకూ ఏ స్త్రీ నీ ముట్టుకోలేదా ?
పెద్దమ్మ : నవ్వుకుని , నువ్వు చెప్పినది నిజమే తల్లీ ........... ఇప్పటివరకూ అమ్మాయి మహిళ ......... ఎవ్వరినీ తాకనైనా తాకని అమాయకుడు మంచి బాలుడు అంటే నిన్న నన్ను ఎత్తుకున్నదే తొలి ఫీల్ అప్పుడు ఒక్కటే ఆలోచన నాకు ఏమీ కాకూడదు అని ముసిముసినవ్వులు నవ్వుతూ ఆఅహ్హ్ ......... అని పడిపోబోతే ,
పెద్దమ్మా ......... అంటూ అమాంతం రెండుచేతులతో ఎత్తుకుని గజగజగజ వణుకుతుంటే , పెద్దమ్మతోపాటు నర్స్ కూడా నవ్వుతూ ఉంది .
నర్స్ : డాక్టర్ గారి చేతినే నలిపేసిన హీరోకి మేమంటే ఇంత భయమా అని నవ్వుతుంటే ,
పెద్దమ్మా - బుజ్జాయిలూ జాగ్రత్త తొందరగా వచ్చేస్తాను అని వీల్ చైర్లో కూర్చోబెట్టి తుర్రుమన్నాను .
నలుగురూ నవ్వుకున్నారు . బుజ్జాయిల చేతులను అందుకుని నర్స్ ఛేంజింగ్ రూమ్ కు వెళ్లారు .
క్యూ ఉండటంతో అమౌంట్ పే చెయ్యడానికి 15 నిమిషాలకు పైనే పట్టింది . నేరుగా డాక్టర్ రూమ్ కు వెళ్లి థాంక్స్ చెప్పడానికి చేతులు కలపబోతే , నవ్వుతూ నమస్కారం చెయ్యడంతో నవ్వుకుని sorry చెప్పి నమస్కరించి వార్డ్ కు వెళ్ళాను .

కొత్త చీరలో వీల్ చైర్లో వస్తున్న పెద్దమ్మను అలా కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాను .
బుజ్జాయిలు : అన్నయ్యా ......... కొత్తచీరలో పెద్దమ్మ అందమైన రెండవ దేవతలా ఉన్నారు కదా ............
నన్ను నేను మరిచిపోయి , అవునవును soooooo బ్యూటిఫుల్ .......... వెంటనే తేరుకుని ఏమన్నాను ఏమన్నాను ఏమీ లేదు అని పెద్దమ్మతోపాటు ముసిముసినవ్వులు నవ్వుతున్న బుజ్జాయిలను ఎత్తుకుని బయటవరకూ వచ్చాము .
బుజ్జాయిలూ .......... మీ మన పెద్దమ్మను బాగా చూసుకున్నందుకు మీ మేడం కు ఇవ్వండి అని పర్స్ లో మిగిలిన డబ్బంతా కీర్తికి అందించాను .
నర్స్ వద్దన్నా ......... మా పెద్దమ్మ మాకు ప్రాణం అని కీర్తి నర్స్ డ్రెస్ జేబులో ఉంచి బై చెప్పారు .

బుజ్జాయిలూ ........... మీ పెద్దమ్మతోపాటు మీరూ వెనుక కూర్చుంటారా ? .
బుజ్జాయిలు : పెద్దమ్మ ఇష్టం అన్నయ్యా ..........., మాకైతే అని ఆగిపోయారు .
బుజ్జాయిలను వెనుక కూర్చోబెట్టి , పెద్దమ్మా .......... లేవగలరా .........
పెద్దమ్మ : తియ్యని కోపంతో , లోపల చూసికూడా అలా ఎలా అడుగుతావు మహేష్ ............
Sor ........... ok ok పెద్దమ్మా ........... అని తలదించుకుని రెండుచేతులతో ఎత్తుకుని , వొళ్ళంతా వెచ్చని వైబ్రేషన్స్ సర్రుసర్రున అణువణువుకీ చేరిపోతుంటే పెదాలను తడిచేసుకుని , రేయ్ రేయ్ కంట్రోల్ అని మనసులో అనుకుని వెనుక కూర్చోబెట్టబోతే ,
మహేష్ నేనేమైనా మహారాణినా - నువ్వేమైనా నా రథసారతివా ..............
Ok ok పెద్దమ్మా జాగ్రత్త తల తగులుతుంది అని నెమ్మదిగా ముందుకువచ్చి లోపలకూర్చోబెట్టాను . ముసిముసినవ్వులు నవ్వుకుంటున్న పెద్దమ్మ వంక చూడకుండా పెద్దమ్మా ......... సీట్ బెల్ట్ అన్నాను .

పెద్దమ్మ : బెల్ట్ మెమెందుకు పెట్టుకుంటాము - మాకు చీర జారిపోకుండా కుచ్చిళ్ళు ఉంటాయిలే , బెల్ట్స్ మీకు అవసరం అని ఏకంగా నా షర్ట్ ఎత్తి ఇదిగో బెల్ట్ ఉంది . మహేష్ 123 ......678 ........ 8 ప్యాక్స్ స్ట్రాంగ్ ........ సూపర్ అని వేలితో చూయించి సిగ్గుపడ్డారు.
నేనూ సిగ్గుపడి పెద్దమ్మా కార్ సీట్ బెల్ట్ పెట్టుకోండి .
పెద్దమ్మ : ఫస్ట్ టైం కారు ఎక్కడం మహేష్ , అవన్నీ నాకు తెలియదు . పెట్టుకోవడం ముఖ్యమయితే నువ్వే పెట్టొచ్చుకదా ...........
బుజ్జాయిలు : పెట్టొచ్చుకదా అనిచెప్పి నవ్వుకున్నారు .
నాకు డబల్ మీనింగ్ అర్థమై వెంటనే చెంపపై లెంపలేసుకుని , సీట్ బెల్ట్ పెట్టబోయి పెద్దమ్మ మెత్తటి వెచ్చని నడుమును వేళ్ళు స్పృశించాయి .
ఇద్దరమూ ఒకేసారి స్స్స్ .....స్స్స్ ....... అని జలదరించాము . వెంటనే చేతిని తీసేసి వణుకుతూ అటువైపు వచ్చి పెద్దమ్మ వైపు కనీసం కన్నెత్తికూడా చూడకుండా డ్రైవింగ్ సీట్లో కూర్చుని , బుజ్జితల్లీ ...........
కీర్తి : పిలిచి బ్రతికిపోయారు అన్నయ్యా ......... లేకపోతే దెబ్బలు పడేవి అని ఒక్క జంప్ తో నా గుండెలపైకి చేరిపోయింది .
నా బంగారుతల్లి అని రెండుచేతులతో ప్రాణంలా చుట్టేసి నా గుండెలపై లేకపోతే నేను - మన బండి కదలను కూడా కదలదు అని బుగ్గపై ఘాడమైన ముద్దుపెట్టి , అమ్మ దగ్గరికి వెళదామా అన్నాను .
కీర్తి : రైట్ రైట్ అన్నయ్యా .......... అని ముద్దులుపెట్టి , అన్నయ్యా .......... నిన్ననో మొన్ననో చూసాను కౌంట్ చేసాను , 6 ప్యాక్స్ మాత్రమే కదా ......... పెద్దమ్మ ఏంటి 8 ప్యాక్స్ అంటున్నారు మళ్లీ లెక్కించాలి అని నా షర్ట్ బటన్స్ విప్పుతోంది .
బుజ్జితల్లీ ......... ఇప్పుడా ?
కీర్తి : ఇప్పుడే రైట్ నౌ , మీరు మీ డ్రైవింగ్ చూసుకోండి . నేనో - పెద్దమ్మనో తెలిపోవాలి అని మొత్తం బటన్స్ విప్పేసి షర్ట్ అటూ ఇటూ తోసేసి , 1 2 3 ........ అని లెక్కపెడుతుంటే ,
పెద్దమ్మ ఓర కంటితో చూస్తూ నవ్వుతూనే ఉన్నారు .
కీర్తి : 5 6 7 8 ........... 8 ప్యాక్స్ . పెద్దమ్మా ......... మీరే గెలిచారు . ఒక్కరోజులో 2 ప్యాక్స్ ఎలా పెంచారు అన్నయ్యా ............ బాడీ బిల్డర్స్ కే అసాధ్యం అని బటన్స్ పెడుతూ అడిగింది .
ఏమో బుజ్జితల్లీ .......... ఉదయం పాస్ కోసం వెళ్ళిచూస్తే 6 ప్యాక్స్ ....... 8 ప్యాక్స్ లోకి మారిపోయాయి - ఈ కార్ ఎత్తేంత బలం కూడా వచ్చినట్లుంది అంతా మాయలా ఉంది .

పెద్దమ్మ : ఎలానో నాకు తెలుసు మహేష్ ........... చెప్పానుకదా నాకు ఫేస్ రీడింగ్ తెలుసునని .
ఎలా పెద్దమ్మా , ఎలా పెద్దమ్మా .......... అని ఇద్దరమూ ఆతృతతో ఆడిగాము .
పెద్దమ్మ : ఇప్పుడుకాదు సమయం వచ్చినప్పుడు నేనే చెబుతాను మహేష్ - బుజ్జితల్లీ ........... అని నా చెంపపై తాకబోయి , నేను చూడగానే బుజ్జితల్లి బుగ్గను స్పృశించి లవ్ యు అని ముద్దుపెట్టి నవ్వుకున్నారు .

పెద్దమ్మకోసం కాస్త నెమ్మదిగానే పోనిచ్చాను . అపార్ట్మెంట్ చేరుకునేసరికి 7 గంటలు అయ్యింది .
కీర్తి : అన్నయ్యా ......... వీల్ చైర్ లేదు ఇప్పుడెలా ..........
అవునుకదా .......... పెద్దమ్మా 8th ఫ్లోర్ లిఫ్ట్ ఉందనుకోండి నడవగలరా అన్నాను .
కీర్తి : అన్యాయం - పాపం అన్నయ్యా ........... చూడండి పెద్దమ్మ కాలికి కూడా కట్లు వేశారు . కారుని అయినా ఎత్తేస్తాను అన్నారు . పెద్దమ్మను ఎత్తుకుని రాలేరా ? . రెండవ దేవతలా చూసుకుంటానని అక్కడ మాటఇచ్చి ఇక్కడ తప్పుతారా ? , పెద్దమ్మ చూడండి ఏడుస్తున్నారు అనగానే అప్పటివరకూ ముసిముసినవ్వులు నవ్వుతున్న పెద్దమ్మ ఒక్కసారిగా ఏడుస్తున్నట్లు కన్నీళ్లను తుడుచుకున్నారు .
పెద్దమ్మా .......... మీకు ఇబ్బంది లేదు అంటే 8th ఫ్లోర్ ఏంటి 15 ఫ్లోర్స్ సంతోషంతో ఎత్తుకునివెళతాను - ( నాకు కావాల్సింది కూడా అదే కదా అని మనసులో అనుకున్నాను ) .
పెద్దమ్మ : అంత ఆశ ఉంటే ముందే ఎత్తుకునివెళ్ళొచ్చు కదా మహేష్ ......... , నన్ను బుజ్జితల్లినీ ఏడిపించడానికి కాకపోతే ............ నాకు ఫేస్ రీడింగ్ తెలుసులే ,
బుజ్జితల్లి : పెద్దమ్మా ......... ఇప్పుడు నేనుకూడా ఏడవాలి కదా మరిచిపోయాను అని ఏడుస్తున్నట్లు యాక్టింగ్ చేసింది .
బుజ్జితల్లీ .......... నిన్నూ అని బుగ్గపై ప్రేమతో కొరికేసి , మరి మీరు .
మా ప్రియమైన పెద్దమ్మ కోసం ఈ ఒక్కరోజు నడుస్తాములే అన్నయ్యా ........... , కష్టమే కానీ పెద్దమ్మ కోసం ............
పెద్దమ్మ : తల్లీ .......... కొండనే ఎత్తేస్తాను అన్నాడు . మన ముగ్గురినీ ఎత్తుకుని వెళ్లలేడా ? , నాకోసం మీరు త్యాగం చెయ్యడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు . నా కోరిక అయితే ముగ్గురినీ ఎత్తుకునివెళ్లాలి లేకపోతే నన్ను అనాధాశ్రమంలో వదిలెయ్యమను.
కీర్తి : అన్నయ్యా .......... ఇది మన ప్రెస్టేజ్ ఇష్యూ ..........
అంతే అంటావా తల్లీ రండి అని పెద్దమ్మ సీట్ బెల్ట్ ను కావాలనే నడుముకు తాకించి చిలిపినవ్వుతో తీసేసి కిందకు దిగి ఇద్దరినీ భుజాలపై ఎదుఎదురు కూర్చోబెట్టుకొని , బుజ్జాయిలూ నా తలను గట్టిగా పట్టుకోండి అని తియ్యని కోపంతో చూస్తున్న పెద్దమ్మను రెండుచేతులతో ఎత్తుకున్నాను . బుజ్జాయిలూ ok నా అవసరమైతే వెంట్రుకలను పట్టేసుకోండి .
బుజ్జాయిలు : సూపర్ అన్నయ్యా .......... ఇలా ఒక్క ఫోటో తీసుకుని ఉంటే ఎంత బాగుండేది ప్చ్ ..........

బుజ్జాయిలూ ........... ఏమాత్రం బరువులేరు చెప్పానుకదా కారునే ఎత్తేస్తాను అని మా బిల్డింగ్ లోపలకు వెళితే సర్వీస్ కోసమని ఒకేసారి 5 లిఫ్ట్ లు క్లోజ్ చేసి ఉండటం చూసి , పెద్దమ్మ బుజ్జాయిలు ముసిముసినవ్వులు నవ్వుకున్నారు .
అయిపోయాను .........
కీర్తి : అన్నయ్యా మేమిద్దరమూ దిగుతాములే .............
నో నో నో ........... బుజ్జితల్లీ , పెద్దమ్మ కోరిక తీర్చాల్సిందే అని స్టెప్స్ దగ్గరకువెళ్లి , జై పాతాలభైరవి అమ్మా .......... మీరే తోడుగా ఉండాలి అని మొదటి స్టెప్ ఉత్సాహంతో ఎక్కాను . రెండు ఫ్లోర్లు ఎక్కేసరికి చెమటలు పట్టేసాయి . జయమ్ము నిశ్చయమ్మురా .......... పాట పాడుకుంటూ మరొక రెండు ఫ్లోర్లు ఎక్కాను .
బుజ్జాయిలు : అన్నయ్యా అన్నయ్యా .......... మీకు ఎనర్జీ ఇస్తాము అని బుగ్గలపై ముద్దులుపెట్టారు .
బుజ్జాయిలూ ........... లవ్ యు అని మరొక రెండు ఫ్లోర్లు అవలీలగా ఎక్కేసాను .
పెద్దమ్మ : ఇప్పుడు నావంతు అంటూ చేతితో నా రెండు బుగ్గలపై ఉమ్మా ఉమ్మా మహేష్ .......... అనగానే 6 ఫ్లోర్లు ఎక్కిన ఉత్సాహం కంటే రెట్టించిన ఉత్సాహంతో పరుగుపెట్టాను .
కీర్తి : వచ్చేసాము ........... పెద్దమ్మా ఈ ముద్దులేవో మొదటి స్టెప్ దగ్గరే పెట్టి ఉంటే మరింత త్వరగా వచ్చేవాళ్ళము అని ముగ్గురూ నవ్వుకున్నారు . నేను సిగ్గుపడ్డాను .
మా వింగ్ వైపు నడిచాను .
పెద్దమ్మా ............ అదిగో ఎదురుగా ఉన్న ఇల్లులే మనవి , అమ్మా అమ్మా ........ అని కేకలువేశారు .

దేవత డోర్ తెరుచుకుని వచ్చి చూసి అయ్యో ........... అని ఆశ్చర్యపోయి చిరునవ్వులతో పరుగున వస్తున్నారు .
పెద్దమ్మ : మహేష్ ........... దేవత దేవతనే , all the best .
లేదు పెద్దమ్మా .......... నేను ఆ అర్హతకు అదృష్టానికి నోచుకోలేదు . దేవత సంతోషం మాత్రమే నాకు ముఖ్యం .
దేవత : బుజ్జితల్లీ - బిస్వాస్ ........... నడుచుకుంటూ రావచ్చుకదా అని కిందకు దించుతూ , పెద్దమ్మ పరిస్థితికాబట్టి ok .......... sorry మహే ..........అనేంతలో,
దేవత చెంపలపై బుజ్జిచేతులు చుర్రుమన్నాయి .
దేవత : సెకండ్ నాకే అన్నమాట లవ్ యు లవ్ యు అని బుగ్గలను రుద్దుకుంటున్నారు .

పెద్దమ్మ నెమ్మదిగా కిందకుదిగి తల్లీ kaavya ............ అని కౌగిలిలోకి ఆహ్వానించింది.
దేవత కళ్ళల్లో కన్నీళ్లు - ఆనందబాస్పాలు - జలదరింపు - తియ్యదనం - బాధ - సంతోషం ........... ఇలా అన్నీ భావాలు కలుగుతున్నాయి . పెద్దమ్మా .......... అని కౌగిలిలోకి చేరిపోయి , ఒకరు ఇంత ప్రేమతో పలకరించి ఎన్ని నెలలు అయ్యిందో కూడా తెలియదు . నాకు ఇలానే ఉండిపోవాలని ఉంది పెద్దమ్మా అని వెక్కి వెక్కి ఏడుస్తోంది .
నాకైతే కన్నీళ్లు ఆగడం లేదు . హృదయం చలించిపోయింది .
పెద్దమ్మ : తల్లీ kaavya ........... లోపల ఉన్న మొత్తం బాధను బయటకు వదిలెయ్యి తల్లీ ........... , మహేష్ నీ కాదు కాదు మన బుజ్జాయిలకు మాటిచ్చినట్లు నిన్న మహేష్ - ఈరోజు మహేష్ తోపాటు నేను - రేపు మహేష్ తోపాటు అందరూ .......... నీ దగ్గరకే వస్తారు తల్లీ ........... అని ప్రేమతో కురులపై వీపుపై స్పృశించి ఓదార్చారు . బాధ స్థానంలో సంతోషం - కన్నీళ్ల స్థానంలో ఆనందబాస్పాలు వస్తున్నాయి .

ఆ క్షణం నమ్మాను పెద్దమ్మకు ఫేస్ రీడింగ్ వచ్చునని , కన్నీళ్లను తుడుచుకుని సంతోషం బాధను ఒకేసారి ఫీల్ అవుతున్న బుజ్జాయిలను ఎత్తుకుని ముద్దుల వర్షం కురిపించాను .
బుజ్జాయిలు : 10 15 20 ........... నిమిషాలైనా ఇద్దరూ అలానే ఉండటం చూసి సంతోషించి , అన్నయ్యా ........... అమ్మా - పెద్దమ్మ ఇప్పట్లో కూల్ అవ్వరు . నిన్నటి నుండీ మా ఫ్రెండ్స్ బుజ్జి చేపలకు ఫుడ్ వెయ్యనేలేదు .
అయ్యో మరిచేపోయాను నిన్న మధ్యాహ్నం వేసిందే బుజ్జాయిలూ అని ముద్దులుపెట్టి వెళ్లి కీస్ తీసి అక్వేరియం దగ్గరికివెళ్లాము .
బుజ్జాయిలు : బుజ్జాయిల మాటలు వినిపించగానే ఉత్సాహంతో కదులుతూ ఎగురుతున్న చేపలను చూసి , లవ్ యు లవ్ యు .......... ఫ్రెండ్స్ అని చెవులను పట్టుకుని sorry చెప్పి ఫుడ్ వేశారు .

సుమారు 45 నిమిషాల తరువాత దేవతలిద్దరూ చిరునవ్వులు చిందిస్తూ నెమ్మదిగా లోపలికివచ్చారు .
బుజ్జాయిలు : అమ్మలూ .......... చాలా తొందరగా వచ్చారే . మరొక గంట ఉండాల్సింది అని బుజ్జిబుజ్జినవ్వులతో చెప్పారు .
దేవత : బుజ్జాయిలూ ........... , మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా గుండెలపై హత్తుకోవడానికి మీ అన్నయ్య ఉన్నాడు - మీరైతే రోజంతా మీ అన్నయ్య గుండెలపైనే ఉండలేదా ......... , సంవత్సరం తరువాత పెద్దమ్మ వలన మధురాతి మధురమైన కౌగిలింత .......... అందుకే ,
బుజ్జాయిలు : లవ్ యు లవ్ యు అమ్మా .......... , గంట ఏమిటి రోజంతా పెద్దమ్మను కౌగిలించుకునే ఉండండి మాకేమీ అభ్యంతరం లేదు . కానీ పెద్దమ్మ నిన్నటి నుండీ ఏమీ తినలేదు . మా అమ్మ సూపర్ గా చేస్తారని హోటల్లో కూడా తినకుండా పిలుచుకునివచ్చాము .
దేవత : లవ్ యు లవ్ యు బుజ్జాయిలూ ............ నిమిషాల్లో వండేస్తాను .
పెద్దమ్మ : తల్లీ కావ్యా ......... నేనూ హెల్ప్ చేస్తాను .
దేవత : పెద్దమ్మా ........... ఇప్పుడు మాత్రం కాదు . మీరు హాయిగా రెస్ట్ తీసుకోండి మా పెద్దమ్మ కోసం - బుజ్జాయిల కోసం - మన ........... కోసం ......... ప్రాణం పెట్టి వండేస్తాను అని పెద్దమ్మను సోఫాలో కూర్చోబెట్టి , బుజ్జాయిలూ ........... పెద్దమ్మను జాగ్రత్తగా చూసుకోండి అనిచెప్పి వడివడిగా వెళ్లిపోయారు .

పెద్దమ్మ : బుజ్జాయిలూ ........... నిన్నటి నుండీ హాస్పిటల్లోనే ఉన్నారు వెళ్లి ఫ్రెష్ అవ్వండి అని ముద్దుచేస్తూ చెప్పారు .
బుజ్జాయిలు : పెద్దమ్మా .......... మాకంటే ముందు మీరు ఫ్రెష్ అవ్వాలి - మీరు ok అంటే మీతోనే స్నానం చేస్తాము .
పెద్దమ్మ : అంతులేని ఆనందంతో అంతకన్నా అదృష్టమా తల్లీ ........... తొందరగా వెళ్లి డ్రెస్సెస్ తీసుకురండి మరీ అని చెప్పడం ఆలస్యం ,
లవ్ యు soooooo మచ్ పెద్దమ్మ అని బుగ్గలపై మరియు నన్ను వొంగమని నా బుగ్గలపై ముద్దులుపెట్టి , అమ్మా అమ్మా ........... మా బట్టలు ఇవ్వు అని పరిగెత్తారు .

పెద్దమ్మ : మహేష్ ........... నీకోక బిగ్గెస్ట్ గుడ్ న్యూస్ చెప్పనా ...........,
బుజ్జాయిల సంతోషం - దేవత పెదాలపై చిరునవ్వు తప్ప నాకు మిగతావన్నీ చిన్న న్యూస్ లు మాత్రమే పెద్దమ్మా .......... అని కళ్ళల్లో చెమ్మను తుడుచుకున్నాను .
పెద్దమ్మ : నా చేతిని అందుకుని తనముందు మోకాళ్లపై కూర్చోబెట్టుకొని , నాకు తెలియదా మహేష్ ............ రేపు నీ కాదు కాదు మన బంగారు బుజ్జాయిలు పుట్టినరోజు . నీ దేవత కళ్ళల్లోకి చూసినప్పుడు దాని గురించే బాధపడుతున్నారు . బుజ్జాయిలు పుట్టినప్పటి నుండీ ఇప్పటివరకూ ఒక్క పుట్టినరోజు కూడా జరుపుకోలేదు - ఈ సంవత్సరం కూడా అలానే అవుతుందేమోనని మనసులోనే బాధపడుతున్నారు .
నా కళ్ళు ఆనందంతో పెద్దవైపోయాయి ముఖం వెలిగిపోయింది అంతులేని ఆనందంతో నన్ను నేను మరిచిపోయి లవ్ యు లవ్ యు soooooooo మచ్ పెద్దమ్మా ........... ఇది బిగ్గెస్ట్ కాదు అంతకుమించిన బిగ్ బిగ్ బిగ్ బిగ్ ............ బిగ్గెస్ట్ గుడ్ న్యూస్ అని పెద్దమ్మ బుగ్గపై ముద్దుపెట్టేసి వెంటనే తలదించుకుని sorry చెప్పాను .
అంతే నా చెంపపై దెబ్బ ............
ముద్దుపెట్టినందుకా .......... sorry చెప్పినందుకా ............
ముసిముసినవ్వులతో మరొక తియ్యని దెబ్బ ........... sorry చెప్పినందుకే అని పెదాలపై చిరునవ్వుతో పెద్దమ్మ వైపు చూడకుండా పైకిలేచి వెనక్కుతిరిగాను . పెద్దమ్మా ............ నేను రావడానికి ఆలస్యం అవుతుంది బుజ్జాయిలతో డోర్ క్లోజ్ చేయించి ఫ్రెష్ అయ్యి జాగ్రత్తగా ఉండండి అనిచెప్పాను .
పెద్దమ్మ : మహేష్ ........... ఏమేమి చెయ్యబోతున్నావో నీ కళ్ళల్లోనే కనిపించించిందిలే , బుజ్జాయిల పుట్టినరోజుతోపాటు మరొక బిగ్ బిగ్ బిగ్ బిగ్గెస్ట్ సర్ప్రైజ్ కూడా ఉంది కేక్ తో పాటు ఒక క్రీమ్ కోన్ కూడా తీసుకురా అవసరమౌతుంది అనిచెప్పారు .
అలాగే పెద్దమ్మా ............. అని తల ఊపాను .
పెద్దమ్మ : మహేష్ ........... నువ్వుకూడా హాస్పిటల్లోనే ఉన్నావు ఫ్రెష్ అయ్యివెళ్ళొచ్చుకదా ............ ,
నా కాదు కాదు లవ్ యు మన బుజ్జాయిలకోసం వాళ్ళు అంతులేని ఆనందంతో సంభ్రమాశ్చర్యాలకు అన్నీ ఏర్పాట్లు పూర్తిచేసేంతవరకూ నాకు మరొకటి వినిపించదు పెద్దమ్మా ............ ,
అంతలో పెద్దమ్మా .......... వచ్చేసాము అంటూ పరుగునవచ్చిన బుజ్జాయిలను అమాంతం ఎత్తుకుని ప్రాణంలా గుండెలపై హత్తుకుని లవ్ యు లవ్ యు ప్చ్ లవ్ యు ప్చ్ లవ్ యు ప్చ్ లవ్ యు ప్చ్ లవ్ యూ ప్చ్ లవ్ యు ప్చ్ లవ్ యు ప్చ్ లవ్ యు ప్చ్ ............ అని ఆపకుండా ముద్దులుపెడుతూనే ఉన్నాను ..........
బుజ్జాయిలు : తియ్యని నవ్వులతో మురిసిపుతూనే ఏమిటన్నయ్యా ........... ఇంత ఆనందం ఇన్ని లవ్ యు లు , ఇన్ని ముద్దులు ...........
సర్ప్రైజ్ బుజ్జాయిలూ సర్ప్రైజ్ .......... లవ్ యు లవ్ యు soooooo మచ్ ఏమిటో ఇలా రోజంతా ముద్దులుపెడుతూనే ఉండాలని ఉంది .
బుజ్జాయిలు : మరింత మురిసి , మేము కాదన్నామా అన్నయ్యా ........... రోజంతా కాదు మీకిష్టమైనన్ని రోజులు ముద్దులుపెడుతూనే ఉండండి మాకిష్టమైన కోరిక కూడా అదే , wow wow wow .......... we love సర్ప్రైజ్ ............ అని నా బుగ్గలపై గట్టిగా ముద్దులుపెట్టారు .
లవ్ యు soooooo బుజ్జాయిలూ ........... ఆ సర్ప్రైజ్ కోసం బయటకువెళుతున్నాను పెద్దమ్మను కంటికిరెప్పలా చూసుకోండి , నా గురించి వేచిచూడకుండా భోజనం చేసేయ్యండి ...........
బుజ్జాయిలు : అన్నయ్యా అన్నయ్యా .......... అక్కడ అమ్మ మీకోసం పెద్దమ్మ కోసం అని హుషారుగా ఘుమఘుమలతో వంట చేస్తున్నారు అని నా గుండెలపై తియ్యని కోపంతో కొడుతున్నారు .
లవ్ యు లవ్ యు ........... ఈ ఒక్కపూట బుజ్జాయిలూ ........... పెద్దమ్మ ఉన్నారుకదా మీ బుజ్జిబుజ్జిచేతులతో తినిపించండి . బయట ఎక్కడా తినను ,వచ్చి చల్లారిపోయినా సంతోషంతో తింటాను సరేనా సరేనా ........... నేను తప్పకుండా వెళ్ళాలి .
బుజ్జాయిలు : గట్టిగా హత్తుకుని , పని పూర్తవగానే తొందరగా వచ్చేయ్యాలి .
అలాగే బుజ్జాయిలూ .......... లైవ్ యు అని ముద్దులుపెట్టి , ఇద్దరినీ పెద్దమ్మ ప్రక్కనే కూర్చోబెట్టి , పెద్దమ్మ వైపు చూసి సిగ్గుపడ్డాను .

పెద్దమ్మ : ముసిముసినవ్వులు నవ్వుకుని , బుజ్జాయిలూ ........... మీరూ మీ అన్నయ్యకు ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు .
బుజ్జాయిలు : అవునా పెద్దమ్మా .......... ఏమిటి ఏమిటి ఏమిటి ..........
పెద్దమ్మ : మీ అన్నయ్య మీకు సర్ప్రైజ్ ఇవ్వగానే మీ చెవిలో చెబుతాను .
లవ్ యు పెద్దమ్మా ......... అని లేచి బుగ్గలపై ప్రాణమైన ముద్దులుపెట్టారు .
పెద్దమ్మవైపు ఏమిటని కళ్ళతోనే అడిగాను .
పెద్దమ్మ : నో నో నో ........... మహేష్ సమయం లేదు వెళ్లు ముందు అని కొంటె సైగ చేసి బుజ్జాయిలను హత్తుకుని నవ్వుకున్నారు .
పెద్దమ్మా - బుజ్జాయిలూ ....... జాగ్రత్త అనిచెప్పి , బుజ్జాయిలకు ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి డోర్ క్లోజ్ చేసి సమయం చూసుకుని స్టెప్స్ దగ్గరకు పరుగుతీసాను . లిఫ్ట్ నుండి ఒకరు రావడం చూసి అంతలోనే అని లిఫ్ట్ లో కిందకువెళ్ళిచూస్తే ఆశ్చర్యం లిఫ్ట్ సర్వీస్ లో ఉందని ఎలాంటి నోటీస్ లేదు . ఉదయం నుండీ అంతా మాయలా ఉంది - రేయ్ సమయం లేదు అని మనసు గుర్తుచేయ్యడంతో పరుగున కారులోకి చేరాను . సర్ పర్మిషన్ తీసుకుందామని మొబైల్ తీసి ఇంతకీ సెలెబ్రేషన్స్ ఎక్కడ చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తూ సైడ్ మిర్రర్ లో చూస్తే బిల్డింగ్ టాప్ కనిపించడంతో , కారు దిగిపరుగున లిఫ్ట్ లోకి దూరి టాప్ చేరుకుని మొబైల్ టార్చ్ లో చూసి పర్ఫెక్ట్ అనుకున్నాను . సర్ కు కాల్ చేసి విషయం చెప్పాను .
సర్ : మహేష్ .......... రేపు బుజ్జాయిలను ఆఫీస్ కు తీసుకొస్తేనే ,
Sure సర్ ........... ఆ అదృష్టం బుజ్జాయిలది .
సర్ : థాంక్యూ థాంక్యూ soooooo మచ్ మహేష్ ............ , ఆ అదృష్టం మాది , అయినా నువ్వూ బోర్డ్ మెంబర్ వే నా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు . మేనేజర్ ను కాల్లోకి తీసుకుని మహేష్ ఏమిచెబితే అది చెయ్యండి - మహేష్ కూడా స్టన్ అయిపోవాలి బై మహేష్ ఎంజాయ్ సెలెబ్రేషన్స్ అధిరిపోవాలి అని విష్ చేశారు .
థాంక్యూ sooooo మచ్ సర్ అని మేనేజర్ గారికి మొత్తం వివరించాను .
మేనేజర్ : మహేష్ మరికిద్దిసేపట్లో నేనే స్వయంగావచ్చి మన బాయ్స్ తో నువ్వు చెప్పినట్లుగా టాప్ ను మార్చేస్తాను . పిల్లల birthday అంటే సెలెబ్రేషన్స్ అంబరాన్ని దాటాలి 11 గంటలకల్లా ......... పూర్తిచేసేస్తాము బాయ్స్ are you రెడీ అన్నారు . Yes సర్ అని నాకు వినిపించేలా ఉత్సాహంతో చెప్పడం విని సంతోషించాను.

కిందకువచ్చి సెక్యూరిటీకి చాలామంది వస్తారు బిల్డింగ్ టాప్ కు తీసుకెళ్లమని చెప్పాను . కారులో కూర్చుని ముందుగా కేక్ పాయింట్ చేరుకుని బుగ్గెస్ట్ కూల్ కేక్ ఆర్డర్ చేసి ఏమిరాయాలో రాసిచ్చాను . నెక్స్ట్ బుజ్జాయిలకు మరియు దేవతలకు కొత్త బట్టలు .......... బుజ్జాయిలకు నేను కొనేస్తాను - దేవతలకోసం పట్టుచీరలూ ok - చీరలకు మ్యాచింగ్ జాకెట్లు ............ హాస్పిటల్లో కొలతలు స్కాన్ చేసిన నర్స్ గుర్తుకురావడంతో పెదాలపై తియ్యని నవ్వుతో హాస్పిటల్ చేరుకున్నాను .
ఈ సంతోషమైన సమయంలో అదృష్టం బాగుండి డ్యూటీ ముగించుకుని నర్స్ బయటకు రావడం చూసాను . వెళ్లి విషయం చెప్పాను .
నర్స్ : చూసేసావన్నమాట ........... సర్ మిమ్మల్ని అమాయకుడు అనుకున్నాను అసాధ్యులే , పదండి వెళదాము .
థాంక్యూ sooooooo మచ్ మేడం అని వెనుక డోర్ తెరిచాను .
నర్స్ : మహేష్ సర్ నేనేమీ అంతరానిదాన్ని కాదు లేండి అని నవ్వుకుని ముందు డోర్ తీసుకుని కూర్చున్నారు .
Sorry మేడం అని చిరునవ్వుతో కూర్చుని కళామందిర్ కు పోనిచ్చాను .

పట్టుచీరల సెక్షన్ కు వెళ్ళాము .
నర్స్ : సర్ ......... చీరలు మీ సెలక్షన్ అన్నారుకదా ఎంజాయ్ - నేను మిగతావి తీసుకొస్తాను . సర్ నాకొక డౌట్ ఓన్లీ బయట వేసుకునేవి మాత్రమేనా ......... లోపల వేసుకునేవి కూడానా ...........
మేడం అవసరమైనవన్నీ ........... అనిచెప్పి సిగ్గుతో మెలికలుతిరిగిపోవడం చూసి ,
మీరెలా అంటే అలా సర్ , మంచి పట్టుచీరలు చూయించండి అని సేల్స్ గర్ల్స్ కు చెప్పి ముసిముసినవ్వులతో వెళ్లారు .

నర్స్ వచ్చేలోపు సుమారు ఆరు గంటపాటు చీరలన్నీ చూసి మనసుకు నచ్చినవి మూడింటిని సెలెక్ట్ చేసాను .
నర్స్ : మహేష్ సర్ ........... మీరు వీటి కోసమైతే మెలికలు తిరిగారో వాటితో సహా నా షాపింగ్ మొత్తం అయ్యింది మరి మీరు .
మేడం .......... అని సిగ్గుపడి మూడు చీరలను తనవైపుకు తోసాను .
మూడింటినీ చూసి మహేష్ సర్ ఏమో అనుకున్నాను చీరల సెలక్షన్ లోకూడా మంచి టేస్ట్ ఉంది సూపర్ గా ఉన్నాయి . అయినా రెండే అన్నారు మూడు తీసుకున్నారు .
ఏదో నా సంతోషం కోసం చెబుతున్నారు .
నర్స్ : నో నో నో ............ మహేష్ , గాడ్ ప్రామిస్ చాలా అంటే చాలా బావున్నాయి . నాకు గనుక అయితే ఇక్కడికిక్కడే ఎగిరి గెంతులేసేదాన్ని బ్యూటిఫుల్ లవ్లీ కలర్స్ ........
థాంక్యూ sooooo మచ్ మేడం అని బుజ్జాయిల డ్రెస్సెస్ కోసం మరొక అరగంట కేటాయించి ఏంజెల్స్ లాంటి డ్రెస్సెస్ సెలెక్ట్ చేసి పరవశించిపోయి , కౌంటర్ కు చేరుకున్నప్పుడు కానీ తెలియలేదు అకౌంట్ బాలన్స్ కంటే షాపింగ్ బిల్ ఎక్కువ ఉందని - చెమటలు పట్టేసాయి . ఎంత తక్కువ ఉందో చూద్దామని మొబైల్లో బ్యాలన్స్ చెక్ చేసుకున్నాను . ఫ్రెండ్స్ ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్ లో ఫీజ్ మరియు రెండు రోజుల బుజ్జాయిలకోసం చేసిన లగ్జరీ ఖర్చులకు పోనూ 30 వేలు ఉండాలి కానీ చూస్తే 2 లక్షలా 30 వేలు ఉంది . ఫ్రెండ్స్ ......... పెదాలపై చిరునవ్వుతో లవ్ యు sooooo మచ్ రా అని మనసులో అనుకున్నాను .
నర్స్ : మహేష్ ......... ఏమైంది ఇంత AC లో కూడా చెమటలు పట్టాయి అని కర్చీఫ్ అందించారు .
నథింగ్ నథింగ్ మేడం థాంక్యూ sooooo మచ్ అని తుడుచుకుని , కార్డ్ ద్వారా స్వైప్ చేసి అన్నింటినీ తీసుకుని బయటకువచ్చి కారులో వెనుక ఉంచి , మేడం ........ మరొక సహాయం బుజ్జాయిలకు గిఫ్ట్స్ కూడా ..........
నర్స్ : పిల్లల కోసం ఏమైనా చేస్తాను . ఇంటికి రావడం ఆలస్యం అవుతుందని మెసేజ్ పెట్టేసాను పదండి అని గిఫ్ట్ షాప్ చేరుకుని బుజ్జాయిలతోపాటు దేవతలిద్దరికీ మరియు నర్స్ కు నచ్చిన మరొక గిఫ్ట్ తీసుకుని బ్యూటిఫుల్ గా ప్యాక్ చేయించాను .

మేడం అడ్రస్ చెప్పండి ఇంటి దగ్గరకు డ్రాప్ చేస్తాను అని తన ఇంటికి చేరుకుని పరుగున అటువైపుకువెళ్లి డోర్ తెరిచాను .
పెదాలపై తియ్యని నవ్వుతో థాంక్స్ సర్ అని కిందకు దిగారు .
మేడం .......... మీరు లేకపోతే చాలా చాలా ఇబ్బందులు పడేవాడిని , అన్నింటికీ బిగ్ బిగ్ బిగ్ థాంక్స్ చెప్పి , మేడం .......... నేను తీసుకున్న చీరలలో మీకు నచ్చిన కలర్ చెప్పండి .
నర్స్ : సిగ్గుపడుతూ none other than పర్పుల్ మహేష్ సర్ అని ఫీల్ అవుతూ ఆ చీరలో ఉన్నట్లు డ్రీమ్ లోకి వెళ్లిపోయినట్లు కళ్ళుమూసుకుని పులకించిపోతున్నారు .

నవ్వుకుని వెనుక డోర్ తెరిచి మూడు చీరలలో పర్పుల్ చీరను మరియు తనకిష్టమైన చీరను తన ముందు ఉంచాను .
కొన్ని క్షణాలకు కళ్ళుతెరిచి చూసారు .
మూడో చీర ఎవరికి అన్నారుకదా మంచి మనసు అందం కలగలిసిన మీకోసమే అని అందించాను .
ముందు సంతోషంతో ఎగిరి గెంతులేసి , సర్ .......... నాకూ ఇంత costly గిఫ్ట్స్ అని తలదించుకున్నారు .
ఒక చిన్న స్వార్థంతో ఇస్తున్నాను మేడం . రేపు మీరు మీ కుటుంబంతో కలిసి మాఇంటికివచ్చి నా బుజ్జాయిలకు విషెస్ తెలుపుతారని ఆశ ...........
నర్స్ : తప్పకుండా తప్పకుండా మహేష్ ........... దానికి గిఫ్ట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు , సంతోషంతో వస్తాము .
బుజ్జాయిల సంతోషపు కానుక కాదనకండి అని అందించి అపార్ట్మెంట్ అడ్రస్ చెప్పి గుడ్ నైట్ చెప్పి బయలుదేరాను .
Next page: Update 12
Previous page: Update 10