Update 12
ఇంటికి చేరుకునేసరికి రాత్రి 10 గంటలు అయ్యింది . షాపింగ్ బ్యాగ్స్ మొత్తం తీసుకుని ముందుగా బిల్డింగ్ టాప్ చేరుకుని కన్నార్పకుండా చూసి ఆనందించి , చివరి దశకు చేరుకున్న డెకరేషన్ ను చూసి మేనేజర్ గారికి థాంక్స్ చెప్పాను .
మేనేజర్ : ఇక్కడే కాదు మహేష్ ..........
సర్ ........ ష్ ........ అని ప్రక్కనే ఉన్న అన్నయ్య అనడంతో , అక్కడితో ఆగిపోయారు.
మేనేజర్ : మహేష్ ........... ఇప్పుడేమి చూశావు మరొక్క గంట ఆగి వచ్చెయ్యి అప్పుడు చూసి థాంక్స్ చెప్పమని చెప్పారు . లగేజీ ఉన్నట్లుంది వెళ్లు వెళ్లు మేము చూసుకుంటాము అన్నారు .
థాంక్యూ soooo మచ్ సర్ అని 8th ఫ్లోర్ చేరుకుని డోర్ తాకగానే తెరుచుకుంది .
నెమ్మదిగా లోపలికివెళ్ళాను . బుజ్జాయిలను తమ గుండెలపై హత్తుకుని జోకొడుతూ నా దేవతలిద్దరూ సోఫాలో కూర్చుని సంతోషంతో మాట్లాడుకుంటున్నారు .
దేవత నన్నుచూసి , హమ్మయ్యా ........ మహేష్ గారూ వచ్చారా ......... నిద్రపోయినా మిమ్మల్నే కలవరిస్తూనే ఉంది అని కీర్తిని నాకు అందించి గుడ్ నైట్ - పెద్దమ్మా గుడ్ నైట్ అనిచెప్పి కీర్తి బుగ్గపై చేతితో ముద్దుపెట్టి , సంతోషంతో వెళ్లిపోయారు .
మే .......... అని పిలబోయి ఆగిపోయి ఫీల్ అవుతున్నాను .
పెద్దమ్మ : మహేష్ .......... మేడం అని కాదు ఏకంగా దేవత అని ప్రేమతో పిలిచే క్షణం అతిదగ్గరలోనే ఉంది . ఫీల్ అవ్వకు ......... వచ్చి ముందు భోజనం చెయ్యి అని ఏమాత్రం నొప్పిలేనట్లు బాగా నడుస్తున్నారు . ఒక్క కట్టు కూడా లేదు . స్నానం చేసి హాస్పిటల్లో కట్టుకున్న చీరనే కట్టుకున్నారు . కన్నార్పకుండా పెద్దమ్మనే చూస్తుంటే నావైపు చూసి ముసిముసినవ్వులు నవ్వుకుని , నేను ఎక్కడికీ వెళ్ళను ముందు భోజనం చెయ్యి ఎప్పుడు తిన్నావో ఏమిటో ...........
అలాంటిదేమీ లే.......దు పెద్ద.........మ్మా అని తడబడి తలదించుకుని , బుజ్జితల్లిని ఎత్తుకునే సోఫాలో కూర్చుని తలెత్తకుండా తింటుంటే పెద్దమ్మ నవ్వుతూనే ఉన్నారు .
పెద్దమ్మా ............ మ్మ్మ్ మ్మ్మ్........ వంట అద్భుతం అని వేళ్ళను జుర్రేస్తూ కుమ్మేస్తున్నాము .
పెద్దమ్మ : ఆనందించి , ఈ మాటను స్వయంగా నీ తొలి దేవతకు చెబుధువులే మహేష్ అని చిలిదనంతో నవ్వుకున్నారు .
పెద్దమ్మతో మళ్లీ మళ్లీ వడ్డించుకుని తృప్తిగా తిన్నాను . షాపింగ్ బ్యాగ్స్ అందుకుని పెద్దమ్మా ........ ఇవి పిల్లలకు ........
పెద్దమ్మ : ఓపెన్ చేసి చూసి వీటిలో బుజ్జాయిలు బుజ్జిదేవతల్లా ఉంటారు అని ఆనందించారు .
పెద్దమ్మా .......... ఇవి మీకు మరియు దేవతకు అని తలదించుకుని అందించాను .
పెద్దమ్మ : చూసి పట్టుచీరలు అని గుండెలపై హత్తుకుని థాంక్స్ ...........
నిద్రలోనే బుజ్జితల్లి చెయ్యి పెద్దమ్మ చెంపతాకింది .
పెద్దమ్మ : మూడవ దెబ్బ నాకే అన్నమాట అని నేను నవ్వుతుంటే రుద్దుకుని లవ్ యు మహేష్ ........... , wow మ్యాచింగ్ జాకెట్ లంగా ఇంకా ఏవో ఉన్నాయోనని చూసి సిగ్గుపడి , చేతితో నా తలెత్తి కంగారుపడుతున్న నా కళ్ళల్లోకి చూసి , ok ok ........ నర్సును తోడుగా తీసుకెళ్లి ఊ ఊ .......... అర్థమైంది అర్థమైంది చాలా చాలా బాగున్నాయి మహేష్ .
నా చెంపలు వాచిపోతాయేమో అనుకున్నాను పెద్దమ్మా ...........
లవ్ యు నాకు నచ్చింది - నాకు నచ్చింది అంటే నీ దేవతకు కూడా నచ్చినట్లే ........., చీరలు ఏ మగాడైనా తెస్తాడు - వీటిని తేవాలంటే మనసు ఆ మనసులో ప్రేమ ఉండాలి లవ్ యు మహేష్ ............ అని సిగ్గుపడ్డారు .
పెద్దమ్మ మాటలకు సిగ్గులకీ నా ఒళ్ళు తియ్యదనంతో జలదరించిపోయింది . పెదాలపై మాధుర్యంతో పెద్దమ్మా ........... మరికొంత పని ఉంది వెళ్ళాలి .
పెద్దమ్మ : ఆ ఆ తెలుస్తోంది . బుజ్జాయిలు సెలబ్రేట్ చేసుకోబోతున్న తొలి పుట్టినరోజుకోసం 15 అంతస్థుల పైన ఏకంగా స్వర్గాన్నే కిందకు దించుతున్నావుగా వెళ్లు వెళ్లు అని బుజ్జాయిని అందుకోబోతే , నన్ను మరింత గట్టిగా పట్టేసుకుంది . మహేష్ ......... పోనీ తీసుకెళ్లు .
అధికాదు పెద్దమ్మా .......... పైన సౌండ్స్ వలన మన బుజ్జితల్లి నిద్ర డిస్టర్బ్ అవుతుంది అందుకే అని ముద్దులుపెడుతూ ఎలాగోలా కష్టపడి పెద్దమ్మ ఒడిలో పడుకోబెట్టి , ఇంకా గంటన్నర ఉంది కదా పెద్దమ్మా మీరు కూడా పడుకోండి అర గంట ముందువచ్చి లేపుతాను అని సోఫాను బెడ్ గా మార్చి గిఫ్ట్స్ ను మాత్రం అందుకుని డోర్ క్లోజ్ చేసి పైకివెళ్లి నావంతు సహాయం చేసాను .
మేనేజర్ గారు మాటిచ్చినట్లుగానే 11 :10 కల్లా ........... పూర్తిచేసి రిమోట్ నాచేతిలో ఉంచారు .
మేనేజర్ : మహేష్ .......... దీని గురించి నీకు వివరించాల్సిన అవసరం లేదనుకుంటాను . This is 5 స్టార్ రేంజ్ birthday ఈవెంట్స్ రిమోట్ ....... one by one సర్ప్రైజ్ లు ........... అవసరం లేదు అని మళ్ళీ చెప్పబోతున్నాను బై , ఇంకా టైం ఉందికాబట్టి లైటింగ్ డెకరేషన్ మాత్రమే ఒకసారి ఆన్ చేసి చూసుకో , బాయ్స్ ............
బాయ్స్ : గుడ్ నైట్ గుడ్ నైట్ మహేష్ సర్ .......... అనిచెప్పి వెళ్లిపోయారు .
గుడ్ నైట్ ఫ్రెండ్స్ థాంక్యూ soooooo మచ్ .
సంతోషంతో రిమోట్ కు ముద్దుపెట్టి , ఫోకస్ లైట్ బటన్ నొక్కాను - నాలుగువైపులా పదికిపైనే లైట్స్ వెలిగి చీకటిని మొత్తం తరిమేసింది . Wow ........... అని పెదాలపై చిరునవ్వుతో వెలిగిపోతున్న ముఖంతో కన్నార్పకుండా ఒక రౌండ్ వేసి చూసి థాంక్యూ థాంక్యూ sooooo మచ్ సర్ అని మెసేజెస్ పెట్టి మొత్తం ఆఫ్ చేసేసి , ఇక 40 మినిట్స్ మాత్రమే ఉంది దేవతలు లేచి రెడీ అయ్యి బుజ్జాయిలను రెడీ చేసేటప్పటికి సమయం అవుతుందని పరుగునవెళ్లి డోర్ నెమ్మదిగా తెరిచాను .
లైట్స్ ఆఫ్ చెయ్యకుండానే బుజ్జాయిలను ......... పెద్దమ్మ తన గుండెలపై పడుకోబెట్టుకొని నిద్రపోతుండటం చూసి ఆనందించి దగ్గరకువెళ్ళాను . పెద్దమ్మ బుజ్జాయిలను జోకొడుతూ జోకొడుతూ నిద్రపోయినట్లు అందమైన ముఖం లో ఫీల్ ప్రస్ఫూటంగా కనిపిస్తోంది . ఆ నోరూరుస్తున్న పెదాలను చూసి తియ్యని జలదరింపుతో నాకు తెలియకుండానే సోఫా ప్రక్కన మోకాళ్లపై కూర్చుని అలా చూస్తుండిపోయాను . ఒక సౌందర్యరాశిని అంత దగ్గరగా చూడటం అదే తొలిసారి . నా పెదాలు పెద్దమ్మ పెదాల దగ్గరికి అయస్కాంతం ఆకర్షణ కంటే బలంగా ఆకర్షితమవుతున్నట్లు దగ్గరకు వెళ్లిపోతున్నాయి . నాకళ్ళు మూతలుపడ్డాయి .
ముసిముసినవ్వులు వినిపించడంతో కళ్ళుతెరిచి పెద్దమ్మవైపు చూస్తే ఘాడమైన నిద్రలో ఉన్నారు - చుట్టూ చూస్తే ఎవరూ లేరు .
రేయ్ ఏమిచేస్తున్నావురా తప్పు తప్పు ............ మరీ ఇంత కకృత్తి ఏంటి రా ......... నిన్నటి వరకూ దేవత - ఇప్పుడు పెద్దమ్మ రాగానే ఇద్దరూ అందంతో ఒకరికొకరు పోటీపడుతున్నారని ......... అసలు దేవత మాయలో ఉన్నవాణ్ణి ఒక్కసారిగా పెద్దమ్మ మాయలో పడిపోయాను ఏమిటో అంతా మాయలా ఉంది - అవును పెద్దమ్మను ఎప్పుడైతే రెండుచేతులతో ఎత్తుకున్నానో ఆ క్షణం నుండే చాలా మార్పులు ......... పెద్దమ్మ - దేవత .......... ఉఫ్ఫ్ ......... ఇప్పుడవన్నీ అనవసరం ...........
అవును అనవసరమే అంటూ పెద్దమ్మ బుజ్జాయిలను హత్తుకుని లేచి కూర్చున్నారు .
పెద్దమ్మా ........ అదీ అదీ .........
పెద్దమ్మ : సమయం అయ్యింది అంటావు కదా మహేష్ .......... అవును ఇక అర గంట మాత్రమే ఉంది . 11:55 కల్లా సెలబ్రేషన్ స్పాట్ లో ఉంటాము నువ్వేమీ కంగారుపడకు . నీ దేవతలు మరియు బుజ్జిదేవతల కోసం పూలదారి మరిచిపోయావు చూసుకున్నావా .............
అయ్యో ........... పూలబుట్టలు ఉన్నాయి కానీ మరిచిపోయాను - గుర్తుచేసినందుకు th .......... లేదు లేదు బుజ్జితల్లీ నువ్వు చెయ్యి ఎత్తకు .......... లవ్ యు పెద్దమ్మా అని బుజ్జాయిలిద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టి లేచి వెళ్లిపోబోయి ఆగి , పెద్దమ్మా ......... ఆ ఫేస్ రీడింగ్ నాకు కూడా నేర్పిస్తారా ? అందరి మనసులో ఉన్నవన్నీ చెప్పేస్తున్నారు. మీతో మాట్లాడిన ప్రతీసారీ షాక్ అవుతూనే ఉన్నాను .
పెద్దమ్మ నవ్వడంతో , పెద్దమ్మ నాకూ నేర్పిస్తారు నాకూ నేర్పిస్తారు ........... అని కేకలువేస్తూ పైకివెళ్లి , ఇంతకుముందు ఒకే బుట్ట ఉంది ఇప్పుడేంటి చాలా ఉన్నాయి - నేనే సరిగ్గా చూసుకోలేదులే అని లిఫ్ట్ దగ్గర నుండి సెలబ్రేషన్ స్థలం మొత్తం పరిచి , దేవతలు - బుజ్జిదేవతల పాదాలకు చిన్న రేణువు కూడా గుచ్చుకోదు అని మురిసిపోయాను .
10 నిమిషాల ముందు గులాబీ పూలతో డెకరేట్ చేసిన స్పాట్ మధ్యలో టేబుల్ ఉంచి , టేబుల్ మొత్తాన్ని ఆక్రమించే కూల్ కేక్ ను చుట్టూ పూలతో అందంగా అలంకరించి , బుజ్జాయిలు జరుపుకోబోతున్న తొలి పుట్టినరోజు కాబట్టి కాస్త దూరం దూరంలో ఒక్కొక్క మ్యూజిక్ క్యాండిల్ ఉంచాను . వెనక్కు జరిగి పర్ఫెక్ట్ అనుకుని చీకటిలోనే కెమెరాలో చకచకా కొన్నిఫోటోలు తీసుకున్నాను .
12 గంటలకు ఒక నిమిషం ముందు రిమోట్ చేతిలోకి తీసుకుని కేక్ స్పాట్ దగ్గర నుండే లిఫ్ట్ వైపు తిరిగాను . సెకను సెకనుకూ ........... కరెక్ట్ సమయానికి వస్తారో లేదో వస్తారో లేదో .......... అమ్మా అని కళ్ళుమూసుకుని ప్రార్థించాను .
సరిగ్గా 11:55 - 59th సెకనుకు లిఫ్ట్ డోర్ తెరుచుకోవడం చీకటిలోనుండే మా బంగారు బుజ్జాయిలకు పుట్టినరోజు శుభాకాంక్షలు అని అపర్ట్మెంట్స్లోని ప్రతి ఇంటికీ వినిపించేలా అంతులేని ఆనందంతో కేకవేసి , తొలి బటన్ ప్రెస్ చేసాను - బిల్డింగ్ టాప్ మొత్తం విద్యుత్ కాంతులతో వెలిగిపోయింది ఇక మా బుజ్జాయిల జీవితాలలో చీకటన్నది లేనట్లు - birthday మ్యూజిక్ స్టార్ట్ అయ్యింది .
లిఫ్ట్ నుండి టాప్ మీద పూలపై అడుగుపెట్టగానే పూలవర్షంతోపాటు ఆకాశంలోకి తారాజువ్వలు ఆపకుండా సుయ్ సుయ్ సుయ్ మంటూ వెళ్లి స్పార్కిల్స్ వదులుతూ ఆకాశంలో బుజ్జాయిల పుట్టినరోజు కానుకగా అద్భుతాన్ని సృష్టిస్తున్నాయి .
బుజ్జాయిలు చుట్టూ - ఆకాశంలోకి చూసి అంతులేని ఆనందం ఆశ్చర్యంతో అన్నయ్యా - అన్నయ్యా ............ అని ప్రాణంలా పిలిచారు .
కీర్తి తల్లీ - బిస్వాస్ .......... ఉమ్మా ఉమ్మా .......... many many Happy returns of the day - లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ . ముందుగా మీ అమ్మ గారు - పెద్దమ్మ చెప్పాక చెబుదామనుకున్నాను - లవ్ యు లవ్ యు కంట్రోల్ చేసుకోవడం నావల్ల కాలేదు ఉమ్మా ఉమ్మా .....
పెద్దమ్మ : ఎత్తుకున్న కీర్తి తల్లిని ప్రాణంలా హత్తుకుని పుట్టినరోజు శుభాకాంక్షలు తల్లీ బంగారూ అని ముద్దుచేసి , బిస్వాస్ లవ్లీ happy birthday అని దేవత ఎత్తుకున్న బిస్వాస్ కు ఫ్లైయింగ్ కిస్ వదిలారు .
ఆకాశంలోకి ఈసారి తారాజువ్వులతోపాటు పెద్దపెద్దమొత్తంలో బలూన్స్ గాలిలోకి బిల్డింగ్ చుట్టూ ఆకాశంలోకి ఎగిరాయి .
పెద్దమ్మ : wow మహేష్ లవ్ యు ......... నా వల్ల కూడా కంట్రోల్ చేసుకోవడం కాలేదు లవ్ యు లవ్ యు . ఇప్పుడు మీ ప్రాణం కంటే ఎక్కువైన మీ అమ్మ విష్ చేస్తుంది . ఆనందబాస్పాలతో శోకలో ఉన్న దేవతను చూసి నవ్వుకుని కావ్య తల్లీ కావ్య తల్లీ ......... ఇక మిగిలింది నువ్వే విష్ చెయ్యి .
దేవత : పెద్దమ్మా పెద్దమ్మా .......... మ...... హే........ష్ ......... గారూ మాటలు రావడం లేదు అని రెండుచేతులతో నోటికి చేతులను అడ్డుపెట్టుకుని గుండెలపై హత్తుకున్న బిస్వాస్ బుగ్గపై ముద్దులుపెట్టి , మా బంగారు తల్లి మా అమ్మ కీర్తి - నాన్నా బిస్వాస్ పుట్టినరోజు శుభాకాంక్షలు అని బాస్పాలను తుడుచుకుంటూ చెప్పి ఇద్దరినీ ముద్దులతో ముంచెత్తుతుంటే ,
మొదట పూల వర్షం - నెక్స్ట్ తారాజువ్వలు బలూన్స్ - ఆ వెంటనే ఫ్లైయింగ్ క్యాండీల్స్ ఆకాశంలోకి వందల్లో వేలల్లో లేచి స్వర్గం భువికి దాగిందా అన్నట్లు ఆకాశం మొత్తం తారాజువ్వలు ఫ్లైయింగ్ క్యాండీల్స్ తో వెలిగిపోతోంది .
స్వర్గం నుండీ దేవతలు విష్ చేసినట్లుగా కొన్నంటే కొన్ని వర్షపు చుక్కలు రాలడం చూసి ,
పెద్దమ్మ : బుజ్జాయిలూ మేము ముగ్గురం మాత్రమే కాదు చూడు చూడు స్వర్గంలోని దేవతలు కూడా మా బుజ్జాయిలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు అని ముద్దులుపెట్టారు .
బుజ్జాయిలు మాటల్లో వర్ణించలేనంత సంతోషంతో తల పైకెత్తగానే రెండు రెండు చుక్కలు బుగ్గలపై పడటంతో మరింత సంతోషంతో పలకరించి , దేవతలకు రెండుచేతులతో మొక్కి , అన్నయ్యా అన్నయ్యా ........... అంటూ దేవతలిద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టి పరుగునవచ్చి నా గుండెలపై చేరి ముద్దులతో ముంచెత్తారు .
ఆఅహ్హ్హ్ ........ తల్లీ కీర్తి - బిస్వాస్ .......... లవ్లీ లవ్లీ happy birthday ఉమ్మా ఉమ్మా ........ అని గట్టిగా ముద్దులుపెట్టాను . Wow .......... ఈ డ్రెస్ లలో బుజ్జి బుజ్జి ఏంజెల్స్ లా ఉన్నారు .
లవ్ యు అన్నయ్యా ........... ఒకసారి అమ్మలవైపు చూడమని చూయించారు . రెడ్ పింక్ పట్టుచీరలలో దివి నుండి దిగివచ్చిన దేవతల్లా ఉండటం ఎవరిని చూసి ఎవరిని చూడకూడదో తెలియక ఇద్దరినీ గుండెల్లో దాచుకోవాలని కళ్ళను వేగంగా ఇద్దరివైపూ తిప్పుతూ కన్నసర్పకుండా ఆశతో చూస్తుండటం చూసి , దేవత సిగ్గుతో తలదించుకున్నారు - పెద్దమ్మ నా కళ్ళల్లోకే చూస్తూ ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు .
ఇక అన్నయ్య మమ్మల్ని పట్టించుకోడు .
లేదు లేదు తల్లీ ........... అని బటన్ నొక్కాను .
మా అందరిపై పూలవర్షం కురిసింది . బుజ్జాయిలిద్దరూ సంతోషం పట్టలేక ఉబ్బితబ్బిబ్బవుతూ లవ్ యు లవ్ యు అన్నయ్యా అన్నయ్యా ......... అని పూలను అందుకుని నాపై దేవతలిద్దరిపై చల్లి ఎంజాయ్ చేస్తున్నారు .
అధిచూసి దేవత కళ్ళల్లో చెమ్మ చేరి నావైపు ఆరాధనతో చూస్తోంది .
పెద్దమ్మ : తల్లీ ...... కావ్య , నీ కళ్ళల్లో కన్నీళ్లు చూడటానికా నీ దేవుడు ఇంత అద్భుతాన్ని భువిపైకి తీసుకొచ్చింది , అమ్మమ్మా ........... అని కన్నీళ్లను తుడిచారు .
దేవత : పెద్దమ్మా ........... అని అమాంతం గుండెలపై చేరి , ఈ ఆరేళ్లలో నా బుజ్జి కవలల పుట్టినరోజు నాడు కనీసం చిన్న కేక్ కూడా కట్ చేయించలేకపోయాను - నా కాదు కాదు మన బుజ్జాయిలు కూడా తోటి పిల్లలు అపర్ట్మెంట్లో కాలేజ్స్ లి birthday లు గ్రాండ్ గా జరుపుకుంటున్నా ........... అమ్మా మాకు అని ఎప్పుడూ అడగలేదు . అమ్మా ........... నువ్వు బాధపడకు అని ఇలాగే బుజ్జిచేతులతో నా కన్నీళ్లను తుడిచి ముద్దులతో నవ్వించేవారు - ఒకేసారి ఇప్పటివరకూ ఎవ్వరూ జరుపుకోలేనంత సంబరంలా మహేష్ గారు జరుపుతుండటం ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో దేవుడే స్వయంగా మన బుజ్జాయిలకు అన్నయ్య రూపంలో వచ్చారు అని నావైపు ఆరాధనతో ప్రాణంలా చూస్తూ ఏకంగా నాకు దండం పెట్టబోయారు.
ఆహా ...........
పెద్దమ్మ : తల్లీ కావ్యా ........... ఈ రోజుతో మీ కష్టాలన్నీ బాధలన్నీ ఇలా చీకటిని తరిమిన వెలుగులా వికసిస్తుంది అని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టారు .
వెంటనే పూల వర్షం - ఆకాశంలో వెలుగులు విరజిమ్మడంతో కన్నీళ్లను తుడుచుకుని చిరునవ్వులు చిందిస్తూ పూలు దోసిళ్ళతో అందుకొని ముందు మా ముగ్గురిపై తరువాత పెద్దమ్మపై చల్లారు .
పెద్దమ్మ : బుజ్జాయిలూ - కావ్యా ......... మీరు మాత్రమేనా అని పెద్దమ్మ కూడా పూలు జల్లారు . అలా నలుగురూ ఒకరికొకరు లవ్ యూ లవ్ యులవ్ వైపు పూలు జల్లుకుని చిరునవ్వులు చిందిస్తూ పులకించిపోయారు .
పెద్దమ్మా ........... మీరు నాకిస్తానన్న సర్ప్రైజ్ ఇచ్చేస్తే కేక్ కట్ చేసి మా బుజ్జాయిల ముఖం మొత్తం పూసేసి ఎంజాయ్ చెయ్యాలి .
బుజ్జాయిలు : మేము కూడా మా అన్నయ్య అమ్మలకు పూసేసి నాలుకతో నాకుతూ మొత్తం తినేయ్యాలి .
అందరమూ సంతోషంతో నవ్వుకున్నాము .
నేను నా బుజ్జాయిల ముఖం మొత్తం కొరుక్కుని తినేస్తాము .
బుజ్జాయిలు : మేము మా అన్నయ్య కోసం ఎప్పుడో రెడీ ........
లవ్ యు లవ్ యు soooooo మచ్ అని ఘాడమైన ముద్దులుపెట్టి , పెద్దమ్మా పెద్దమ్మ ......... తొందరగా తొందరగా చెప్పండి ఆ సర్ప్రైజ్ ఏంటో ........
పెద్దమ్మ : బుజ్జాయిలూ .......... మీరు చెబుతారా ? - నన్ను చెప్పమంటారా ? అని దేవతవైపు సైగ చేశారు .
బుజ్జాయిలు : పెద్దమ్మా ......... అదేనా , లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ మేమే చెబుతాము మేమే చెబుతాము - మా అన్నయ్య ఇచ్చిన సర్ప్రైజ్ వలన మరిచిపోయాము లవ్ యు లవ్ యు లవ్ యు అమ్మా ......... అని చెవులను పట్టుకున్నారు .
దేవత : బుజ్జాయిలూ .......... అని సిగ్గుపడి పెద్దమ్మ వెనుక దాక్కున్నారు .
బుజ్జాయిలూ ......... మీకు కూడా తెలుసా ?
బుజ్జాయిలు : తెలుసు అన్నయ్యా ......... అని చెరొకవైపు చెవిలో గుసగుసలాడి నా బుగ్గలపై ముద్దులుపెట్టి , నేను సంతోషపు సర్ప్రైజ్ లో ఉండటం చూసి నవ్వుకుని , అన్నయ్యా .......... ముందు మేము చెప్పేస్తాము అని పెద్దమ్మతోపాటు ........ పుట్టినరోజు శుభాకాంక్షలు - అమ్మా హ్యాపీ birthday అమ్మా - పుట్టినరోజు శుభాకాంక్షలు కావ్య తల్లీ ............ అని ముందుకు తీసుకొచ్చారు .
పెద్దమ్మ : అవును మహేష్ .......... కావ్య పుట్టినరోజు నాడే మన ....... నీబుజ్జాయిలు కూడా ఈ భూమిపై అడుగుపెట్టారు .
దేవత : లవ్ యు తల్లీ - లవ్ యు బిస్వాస్ - లవ్ యు పెద్దమ్మా .......... అని పరవశించిపోతున్నారు .
వెంటనే క్రీమ్ కోన్ అందుకుని పుట్టినరోజు శుభాకాంక్షలు బుజ్జాయిలూ అన్న దానికింద మేడం అని రాసి , సంతోషంతో మాటలు తడబడుతున్నట్లు పు పు పుట్టిన పుట్టినరోజు శుభాకాంక్షలు మేడం అని బుజ్జితల్లి చేత బటన్ నొక్కించాను .
పూలవర్షం - తారాజువ్వల సందళ్ళు - బలూన్స్ తోపాటు ఫ్లైయింగ్ క్యాండీల్స్ ఆకాశంలోకి ఎగరడం చీకటిని తరిమెయ్యడం చూసి దేవత పరవశించిపోతోంటే బుజ్జాయిలు happy birthday అమ్మా అమ్మా ......... అని నామీద నుండే ముద్దులుపెట్టి చప్పట్లు కొట్టారు .
దేవత : థాంక్ ............
అమ్మా .......... పుట్టినరోజు కాబట్టి .........
దేవత : ముసిముసినవ్వులతో చెవులను అందుకుని , లవ్ యు soooooo మచ్ మహేష్ మిస్ వైజాగ్ సంబరాలు కూడా ఇలా ఇంత సంతోషంతో చేసుకోలేదు . లవ్ యు లవ్ యు అని ఆనందబాస్పాలతో తలదించుకుని ఎంజాయ్ చేస్తున్నారు .
బుజ్జాయిలూ , మేడం ......... ఈ సంతోషాలను కేక్ కట్ చేసి మరింత సంబరంలా జరుపుకోవడానికి రెడీనా ..........
బుజ్జాయిలు : అన్నయ్యా అన్నయ్యా .......... అప్పుడేనా , మీకు ఎలా సర్ప్రైజ్ ఇచ్చారో - మాకూ ఒక సర్ప్రైజ్ ఇస్తాను అన్నారు పెద్దమ్మ . పెద్దమ్మా ..........
పెద్దమ్మ : మీరు మా గుండెలపైకి వస్తే చెబుతాము . సర్ప్రైజ్ చెప్పాక ఎలాగో మీ అన్నయ్యను వదలరు మీరు ............
బుజ్జాయిలు : అన్నయ్య గురించి సర్ప్రైజ్ అయితే ok , అన్నయ్యా అన్నయ్యా ........ సర్ప్రైజ్ విని క్షణంలో ఇటువచ్చేస్తాము అని నా బుగ్గలపై ముద్దులుపెట్టి , దేవతల గుండెలపైకి చేరారు .
పెద్దమ్మ ....... దేవతవైపు సైగచేసి కొన్ని అడుగుల దూరం వెళ్లి చెవులలో గుసగుసలాడారు . దేవత నావైపు తియ్యని నవ్వుతో చూస్తున్నారు .
బుజ్జాయిలు : నిజమేనా పెద్దమ్మా .......... యాహూ యాహూ ......... అని అపార్ట్మెంట్స్ మొత్తం వినిపించేలా కేకలువేసి , లవ్ యు లవ్ యు అని ముద్దులతో ముంచెత్తి , కిందకు జారి పరుగునవచ్చి అన్నయ్యా అన్నయ్యా ......... అంటూ నా ముఖమంతా ముద్దులవర్షం కురిపించి , కేక్ వైపు తిరిగి నా గుండెలపైనుండే మేడం పేరు ప్రక్కనే నా పేరు రాసి ,
Happy birthday అన్నయ్యా - పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్యా.......... అని దిక్కులుపెక్కటిల్లేలా సంతోషంతో విష్ చేసి ఉమ్మా ఉమ్మా ......... అంటూ ముద్దులుపెట్టారు .
బుజ్జితల్లీ - బిస్వాస్ .......... నా పుట్టినరోజు నాకు కూడా తెలియదు .
బుజ్జాయిలు : మన పెద్దమ్మ ......... పేదరాసిపెద్దమ్మ అన్నయ్యా .......... మనగురించి మొత్తం చదివేశారు .
పుట్టినరోజు శుభాకాంక్షలు మహేష్ - పుట్టినరోజు శుభాకాంక్షలు మహేష్ గారూ ........ అని పెద్దమ్మ - దేవత విష్ చేసి , అవునని పెద్దమ్మ కళ్లతో సైగ చేశారు .
బుజ్జాయిలు యే యే యే .......... అని రిమోట్ అందుకుని బటన్ నొక్కడంతో పూలవర్షం మొదలుకుని ఫ్లైయింగ్ క్యాండీల్స్ వరకూ ఎగరడం చూసి , కళ్ళల్లో చెమ్మతో లవ్ యు లవ్ యు soooooo మచ్ బుజ్జాయిలూ ......... అని బుగ్గలపై ముద్దులుపెట్టి , చెమ్మను తుడుచుకుని లవ్ యు పెద్దమ్మా - ల ...... వ్ ..... యు మేడం .......... అని సిగ్గుపడుతూ చెప్పాను .
అన్నయ్యా ...........
బుజ్జాయిలూ ........... అని చెవులలో గుసగుసలాడాను .
లవ్ యు అన్నయ్యా .......... మీరు ఎప్పుడూ సూపరే అని సంతోషం పట్టలేక బుగ్గను కొరికేసి పెద్దమ్మ ఒడిలోకి చేరింది కీర్తి .
కీర్తి : పెద్దమ్మా .......... మీ పుట్టినరోజు ఎప్పుడు . Please please ........ పెద్దమ్మకు కూడా అన్నయ్యలనే తెలియకూడదు తెలియకూడదు అని ప్రార్థించారు .
పెద్దమ్మ నవ్వుకుని , నేనూ అనాధనే కదా మీ అన్నయ్యలానే నాకూ తెలియదు అయితే ఏంటి బుజ్జితల్లీ ........ అని ముద్దుపెట్టారు .
కీర్తి : అవునుకదా .......... ఉమ్మా ఉమ్మాఉమ్మా అని ముద్దులతో ముంచెత్తి , అన్నయ్యా సక్సెస్ అని బుజ్జిచేతితో హైఫై కొట్టి , పెద్దమ్మా .......... రండి అని పిలుచుకొనివెళ్లి నా ప్రక్కనే పెద్దమ్మ అని క్రీమ్ కోన్ తో రాసి ,
దేవతోపాటు నలుగురమూ బటన్ ప్రెస్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు పెద్దమ్మా పెద్దమ్మా పెద్దమ్మా పెద్దమ్మా అని వైజాగ్ మొత్తం వినిపించేలా కేకలువేశాము . ఆ కేకలతోపాటు పూలవర్షం - తారాజువ్వలు - ఫ్లైయింగ్ క్యాండీల్స్ సందడిని చూసి పెద్దమ్మ ఆనందబాస్పాలతో పులకించిపోయాయి నా వైపు ఆరాధనతో చూసి లవ్ యు బుజ్జాయిలూ - కావ్య తల్లీ .......... అని ప్రాణంలా కౌగిలించుకోవడం చూసి చాలా చాలా ఆనందించాను .