Update 129

మేడం ...... ఫస్ట్ పీరియడ్ కూడా అయిపోయింది అంటూ అటెండర్ వచ్చారు .
ప్చ్ ప్చ్ ...... అప్పుడే అయిపోయిందా ? అంటూ అంటీ గుండెలపైకి చేయింది బుజ్జిజానకి ......
హెడ్ మిస్ట్రెస్ : తల్లీబుజ్జిజానకీ ...... రెండు నెలల్లో exams , సిలబస్ పూర్తికాలేదని మీరేకదా కంప్లైంట్ చేస్తూ వస్తున్నారు , ఇప్పటికే ఒక క్లాస్ మిస్ అయ్యింది ...... , నా తల్లికదూ ...... , స్టూడెంట్స్ ....... ఐస్ క్రీమ్స్ తినడం పూర్తయ్యిందా ? మీ పేరెంట్స్ కూడా వెళ్లిపోయారు కదా ......
పిల్లలు : వెహికల్లో బోలెడన్ని ఐస్ క్రీమ్స్ ఇంకా మిగిలిపోయి ఉన్నాయి హెడ్ మిస్ట్రెస్ ......
హెడ్ మిస్ట్రెస్ : మరి మీ బుజ్జి పొట్టలలో ......
స్టూడెంట్స్ : ఖాళీలేదు హెడ్ మిస్ట్రెస్ ......
హెడ్ మిస్ట్రెస్ : ఖాళీగా ఉండి ఉంటే రోజంతా తింటూనే ఉండేవారన్నమాట అంటూ బుజ్జిజానకితోపాటు నవ్వుకున్నారు , మహేష్ ..... వెహికల్స్ వెళ్లిపోతాయా ? .
ఊహూ ....... , చీకటిపడేంతవరకూ ఇక్కడే ఉంటాయి .
హెడ్ మిస్ట్రెస్ : గుడ్ ...... , ఇదిగో మీ అన్నయ్య - ఆక్కయ్యలు చెబుతున్నారు ...... కాలేజ్ వదిలేంతవరకూ ఇక్కడే ఉంటాయని , ఒక పీరియడ్ తరువాత ఇంటర్వెల్ లో తినొచ్చు మరియు ఇంటికి వెళ్ళేటప్పుడు తింటూనే ఎన్నికావాలంటే అన్ని ఇంటికి తీసుకువెళ్లవచ్చు ...... కాబట్టి ఇప్పుడైతే క్లాసులకు వెళ్ళండి ......
అలాగే మేడం , థాంక్యూ అన్నయ్యా - అక్కయ్యా ..... అంటూ ఉత్సాహంతో క్లాసులవైపుకు పరుగులుతీశారు .
హెడ్ మిస్ట్రెస్ : తల్లీ బుజ్జిజానకీ ..... బెల్ కొట్టించనా ? లవ్ యు అంటూ ముద్దుపెట్టారు , అటెండర్ గారూ ......
అటెండర్ : అలాగే మేడం అంటూ వెళ్లి బెల్ కొట్టేటప్పటికి అందరూ బుద్ధిగా క్లాస్సెస్ కు వెళ్లినట్లు గ్రౌండ్ మొత్తం పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయింది .
హెడ్ మిస్ట్రెస్ : ఆశ్చర్యం ...... , వచ్చి 6 నెలలు అయ్యింది - ఇలా ఎప్పుడూ చూడనేలేదు , అంతా నీవల్లనే మహేష్ ....... , మరింత ఆశ్చర్యం ..... టీచర్స్ అందరూ క్లాస్సెస్ కు వెళుతున్నారు .
జానకి : అవునవును మహేష్ వల్లనే ......
నావల్లనే కదా ...... , అయితే నా చిన్న కోరిక తీర్చండి అంటూ కిందపడిన కర్రను అందించాను .

అదేమీ పట్టించుకోకుండా ...... , తల్లీ బుజ్జిజానకీ ..... నువ్వు క్లాసుకు వెళ్లు , నాకు - మహేష్ కు లిస్ట్ లో మరొక ప్రాబ్లమ్ క్లియర్ చేసే పని ఉంది .
జానకి : నేను నేనుకూడా మీతోపాటే ఉంటాను .
హెడ్ మిస్ట్రెస్ : మరి క్లాస్ ...... చూడు అప్పుడే మీ మాథ్స్ సర్ మీ క్లాసులోకి వెళ్ళిపోయాడు .
జానకి : అంటీ ...... నా మాథ్స్ స్కోర్ ఎంత ? .
హెడ్ మిస్ట్రెస్ : 100 ఔట్ ఆఫ్ 100 .......
సూపర్ సూపర్ బుజ్జిజానకీ అంటూ విజిల్ వెయ్యబోయి క్లాస్సెస్ క్లాస్సెస్ అంటూ లెంపలేసుకుని , కంగ్రాట్స్ చెప్పాను .
జానకి : థాంక్యూ మహేష్ ....... , అంటీ ..... క్లాస్సెస్ కంటే నేను చాలా చాలా ముందు ఉన్నానని తెలుసుకదా ....... , కావాలంటే ఇంటికివెళ్లాక మరొక గంట ఎక్కువ ప్రిపేర్ అవుతాను కావాలంటే అమ్మమ్మకు కాల్ చెయ్యండి .
హెడ్ మిస్ట్రెస్ : నా తల్లి గురించి నాకు నమ్మకం ఉందిలే అంటూ ప్రేమతో కౌగిలించుకున్నారు .
జానకి : లవ్ యు అంటీ ...... , అంటీ ...... ఈరోజే జాయిన్ అయిన మహేష్ క్లాస్సెస్ ? అంటూ ముసిముసినవ్వులు నవ్వుతోంది .
హెడ్ మిస్ట్రెస్ : అవునుకదా ..... , మహేష్ క్లాసుకువెళ్లు ......
మీకు ఏది సంతోషం అయితే నాకూ అదే సంతోషం ...... అంటూ వాటర్ బాటిల్ అందుకుని కదిలి నవ్వుకుంటున్నాను .
జానకి : అంటీ .......
హెడ్ మిస్ట్రెస్ : మహేష్ మహేష్ మహేష్ .......
What మేడం ......
హెడ్ మిస్ట్రెస్ : నువ్వులేకుండా మేము ఏమిచెయ్యగలం , నువ్వు క్లాస్ అటెండ్ అవ్వడమూ కావాలి - మాతోపాటు ఉండాలి .
నాకైతే బుజ్జిజానకి రాసుకున్న లిస్ట్ లోని అన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయి , అమ్మ తిరిగిన ఈ కాలేజ్ ఒక ఆదర్శపాఠశాలగా మారిపోయాక బుజ్జిజానకి పెదాలపై సంతోషాన్ని చూడటం , ఇక క్లాస్సెస్ అంటారా ..... ఇన్నిరోజులు మిస్ అయ్యాను మరొక క్లాస్ మిస్ అయితే ఏమీకాదు , మిస్ అయిన క్లాస్సెస్ మీరు - జానకి టీచ్ చేయరా ఏమిటి ? .
హ్యాపీగా హ్యాపీగా ...... , మహేష్ ..... అమ్మకోసం అన్నావుకాదూ అంటూ సంతోషంతో నా హృదయంపై చేతితో ముద్దుపెట్టింది .
హమ్మయ్యా ...... పట్టుకున్నాను , ఇకనుండీ మరింత జాగ్రత్తగా ఉండాలి రండి ఆఫీస్ రూమ్ కు వెళదాము అన్నారు మేడం ......
వన్ మినిట్ మేడం అంటూ పరుగునవెళ్లి మోడీ కోన్ ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చి అందించాను .
థాంక్యూ థాంక్యూ ....... మ్మ్మ్ మ్మ్మ్ యమ్మీ ........

హెడ్ మిస్ట్రెస్ : బుజ్జిజానకి మేడం ...... హెడ్ మిస్ట్రెస్ సీట్లో కూర్చోండి .
జానకి : అమ్మ అడుగుజాడల్లో నడిచిన మీరు కూర్చోవడమే అమ్మకు - నాకు ఇష్టం , నాకూ ..... అమ్మ మరియు మీలా ఇక్కడే టీచర్ - హెడ్ మిస్ట్రెస్ లా పనిచేయడం ఇష్టం కానీ అమ్మకు ..... నన్ను టాప్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా చూడాలన్నది కోరిక అని నేను కడుపులో ఉన్నప్పుడు అమ్మమ్మతో చెప్పారట , అమ్మ కోరిక తీర్చి అమ్మ కాలేజ్ కు నావంతు సహాయం చేస్తాను .
బ్రేవో బ్రేవో ....... బుజ్జిజానకీ అంటూ చప్పట్లుకొట్టాను .
హెడ్ మిస్ట్రెస్ : బుజ్జిజానకి బుగ్గలను అందుకుని నుదుటిపై ముద్దుపెట్టి ఆనందించారు , మహేష్ ...... లిస్ట్ లో థర్డ్ ప్రాబ్లమ్ ఏమిటి ? .
జానకి : కాలేజ్ ఆవరణ మార్పు అంటీ .......
లిస్ట్ తయారుచేసిన బుజ్జిఅమ్మనే ఇక్కడ ఉన్నారు .......
జానకి : " బుజ్జిఅమ్మ " ...... అంటూ పరవశించిపోతోంది .

హెడ్ మిస్ట్రెస్ : మార్పు ఎలా మహేష్ - జానకీ ..... , DEO ఆఫీస్ కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ప్రయోజనం లేదు , దాదాపు 5 సంవత్సరాల కాలేజ్ ఫండ్స్ ...... కాలేజ్ నే చేరలేదు .
ఆ ఫండ్స్ అన్నింటినీ ఆఫీసర్స్ ..... పందికొక్కుల్లా తినేసిఉంటారు మేడం ...... , కాల్ చేయండి మేడం - ఈసారి కాల్ చేసి కలెక్టర్ ను కలవబోతున్నాము అని ఒక అపద్దo చెప్పండి ........
హెడ్ మిస్ట్రెస్ : ఇలా ఎప్పుడో చేయాల్సింది సూపర్ మహేష్ ....... , కాలేజ్ మారడం కోసం ఎన్ని అపద్దాలు చెప్పినా తప్పులేదు అంటూ సీట్లో కూర్చున్నారు .
జానకి : లవ్ యు అంటూ అంటూ మేడం బుగ్గపై చేతితో ముద్దుపెట్టి , సూపర్ అంటూ నావైపు సైగచేసి నవ్వుతోంది .

హెడ్ మిస్ట్రెస్ : ఏమాత్రం ఆలోచించకుండా కాలేజ్ ల్యాండ్ లైన్ నుండి స్ట్రెయిట్ గా DEO ఆఫీస్ కు కాల్ చేసి స్పీకర్ ఆన్ చేశారు .
హలో ఎవరు ? .
హెడ్ మిస్ట్రెస్ : నేను ************ govt high college నుండి హెడ్ మిస్ట్రెస్ ను మాట్లాడుతున్నాను .
చెప్పండి మేడం .......
హెడ్ మిస్ట్రెస్ : మా కాలేజ్ డెవలప్మెంట్ కోసం వెచ్చించిన ఫండ్స్ ను గత 5 సంవత్సరాలుగా ఇచ్చామని చెప్పి మధ్యలోనే మీరు తినేస్తున్నారని తెలుసు - ఇక్కడ కాలేజ్ లో ఎటువంటి మార్పు లేదు - రేపు ఉదయం కాలేజ్ ప్రేయర్ మొదలయ్యేలోపు ఎక్కడ నుండి తీసుకొస్తారో తెలియదు ఫండ్స్ దేనికోసమైతే అలాట్ అయ్యాయో ఆ పనులన్నీ మొదలవ్వాలి ....... , ప్రేయర్ పూర్తయ్యేలోపు మీరు వర్క్ లో లేకపోతే ఈ ఫైల్ తీసుకుని టోటల్ స్టూడెంట్స్ అందరితోపాటు నేరుగా కలెక్టర్ ఆఫీస్ కు వెళ్లిపోతాము - కలెక్టర్ గారిని కలిస్తే ఏమౌతుందో మీకు చెప్పక్కర్లేదు అనుకుంటాను అంటూ వాళ్ళ రిప్లై కూడా వినకుండా కాల్ కట్ చేసేసారు . వెంటనే కాల్ వచ్చినా రిసీవ్ చేసుకోలేదు ........
స్టూడెంట్స్ తోపాటు కలెక్టర్ ఆఫీస్ కు wow అంటూ బుజ్జిజానకి వైపు హైఫై కోసం చెయ్యి ఎత్తి sorry అంటూ వెనక్కుతీసుకున్నాను .
జానకి : Sorry దేనికి ఒక హైఫై కాదు నీకు ఇష్టమైనన్ని కొట్టుకో అంటూ నా చేతిని అందుకునిమరీ కొట్టి చేతిని దించనేలేదు .
నేనుకూడా అంటూ హెడ్ మిస్ట్రెస్ కూడా ట్రై చెయ్యడంతో ఆనందించాము .

హెడ్ మిస్ట్రెస్ : నెక్స్ట్ వచ్చేసి రేపు పేరెంట్స్ మీటింగ్ గురించి ...... , ఏ ఏ విషయాలు చర్చించాలి అంటూ మరొక లిస్ట్ రెడీ చేసుకున్నారు .
అంతలో ఇంటర్వెల్ బెల్ మ్రోగింది .......
హెడ్ మిస్ట్రెస్ : తల్లీ బుజ్జిజానకీ - మహేష్ ...... 15 మినిట్స్ రెస్ట్ తీసుకుని ఫైనల్ పీరియడ్ కు మీ మీ క్లాస్సెస్ కు అటెండ్ అవ్వండి .
అలాగే అంటీ అంటూ కౌగిలించుకుంది జానకి ....... , మహేష్ ...... నాకు - అంటీకి మరొక ఐస్ క్రీమ్ కావాలి .
అదీ అలా ఆర్డర్ వెయ్యండి చిటికెలో తీసుకొస్తాను అనిచెప్పి బయటకు నడిచాను , అంటీలు గుర్తుకువచ్చి కాన్ఫరెన్స్ కాల్ కలిపాను .
" మళ్లీ చేశావా ..... ? , హలో ఎవరు మీరు ? , కాల్ చేసి మాట్లాడరే ? , మాకు కోపం వస్తోంది కట్ చేసేస్తున్నాము "
ముసిముసినవ్వులు నవ్వుకున్నాను - What ...... ? లంచ్ టైం లో అక్కయ్యల నుండి 10 - 10 - 10 కాల్స్ చేసినట్లు అలర్ట్స్ ....... , రీ డయల్ ఆప్షన్ లో ఉంచేసాముకదా అప్పుడు చేసి ఉంటారు అనుకుని మొబైల్ జేబులో ఉంచుకున్నాను , మూడు స్పెషల్ ఐస్ క్రీమ్స్ తీసుకుని ఆఫీస్ రూమ్ చేరుకున్నాను.
జానకి : మహేష్ చిటికెలో వచ్చేస్తాను అని ఎప్పుడూ చెప్పకు - మరొక నిమిషంలో రాకపోయుంటే నేనే వచ్చేసేదానిని అంటూ రెండు ఐస్ క్రీమ్స్ అందుకుని మేడం కు ఇచ్చింది చిరుకోపంతో .......
హెడ్ మిస్ట్రెస్ : మహేష్ ...... ఈ 10 మినిట్స్ లో 10 సార్లైనా డోర్ దగ్గరకువెళ్లి చూసింది .
నిజమా బుజ్జిజానకీ ...... ఆఅహ్హ్ ......
హెడ్ మిస్ట్రెస్ : నో నో నో హమ్మయ్యా ...... డోర్ కు ఆనుకున్నావా అంటూ నవ్వుకున్నారు .
జానకి : లేదులే అంటూ నవ్వుకుని తింటోంది .
లేదంటే ఔననిలే ...... అంటూ మురిసిపోతున్నాను .
మహేష్ - మహేష్ ...... వెరీ వెరీ టేస్టీ ......
మీకోసం స్పెషల్ ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చాను - అవును సూపర్ ......
తినడం పూర్తవడం ఆలస్యం బెల్ కొట్టేశారు .

జానకి : బెల్ కొట్టారుకదా పదమరి మన మన క్లాస్సెస్ కు ...... , నువ్వు కదిలితేనే నేనూ కదిలేది .......
అలాగే అంటూ నవ్వుకుంటూ క్లాస్సెస్ చేరుకున్నాము . ప్చ్ ప్చ్ ..... వెళ్లు క్లాస్ ముఖ్యం అంటూ నా బుజ్జి హృదయంపై చేతితో ముద్దుపెట్టి , లోపలికి తుర్రుమంది .
అంత ఇష్టంతో ముద్దుపెట్టాక ఇక నా క్లాస్ కు ఎలా వెళతాను - తను ఫీల్ అవ్వకూడదని లోపలికివెళుతున్న స్టూడెంట్స్ మధ్యలో దాబెట్టుకునివెళ్లి తన చిరునవ్వులు కనిపించేలా ప్రక్కన కూర్చున్నాను .
టీచర్ లోపలికివచ్చి సోషల్ స్టడీస్ లోని టాపిక్ ను బోర్డ్ పై రాసి టీచ్ చేస్తున్నారు .
టూ ఈజీ అన్నట్లు , కిటికీ వైపే చూస్తోంది .
ఆఅహ్హ్ ...... నాకోసమే నాకోసమే ఖచ్చితంగా నాకోసమే అంటూ సంతోషంతో గాలిలో తేలిపోతున్నాను .
ఒకసారి కాదు రెండుసార్లు కాదు నిమిషానికి ఒకసారి అలా 40 సార్లకు పైగానే కిటికీ వైపు పదేపదే చూస్తూ నిరాశ చెందుతుండటం చూసి ఎంత ఆనందం కలిగిందో మాటల్లో వర్ణించలేను .
సమయమే తెలియనట్లు లాంగ్ బెల్ కొట్టేశారు ......

పెదాలపై చిరునవ్వులతో మొదట లేచింది బుజ్జిజానకి - ఆత్రంలో బ్యాగు సరిగ్గా లాక్ చేయకపోవడం వలన జామెట్రీ బాక్స్ కిందపడిపోవడంతో లోపల ఐటమ్స్ అన్నీ చెల్లాచెదురుగా చెరొకవైపుకు వెళ్లాయి . అయ్యో ..... అంటూ కిందకు వొంగి ఒక్కొక్కటే వెతుకుతూనే కిటికీవైపు చూస్తోంది .
హెల్ప్ చెయ్యబోయి అలా చూడటం మరింత కిక్కివ్వడంతో ఆగిపోయి అపురూపంగా కన్నార్పకుండా చూస్తున్నాను .
అన్నింటినీ తీసుకుని బాక్స్ లో ఉంచి బ్యాగ్ లాక్ చేసి పైకి లేచేసరికి స్టూడెంట్స్ ఒక్కరూ లేరు - సైలెంట్ ...... , అంటీ - మహేష్ ...... అంటూ భయపడుతోంది .
తన ఆత్రం చూసి ఎక్కడ తగిలించుకుంటుందోనని ఉఫ్ఫ్ ...... అంటూ చిన్నగా విజిల్ వేసాను .
జానకి : మహేష్ ...... ఇక్కడే ఉన్నావా ? హమ్మయ్యా అంటూ తన కళ్ళల్లో మెరుపు ......
అలా స్నేహంతో ముద్దుపెట్టి లోపలికివచ్చేస్తే నా క్లాస్ కు ఎలా వెళ్లగలను - నా స్నేహితురాలి సేఫ్టీ చూసుకోవాలికదా - ఇప్పుడుచూడు ఎవ్వరూ లేకపోవడంతో భయపడేదానివి ......
జానకి : నిజంగా భయమేసింది , ముందే చెప్పొచ్చుకదా ...... నిన్నూ ......
నాకు కావాల్సింది కూడా అదే అంటూ లేచి కళ్ళుమూసుకుని చేతులను విశాలంగా చాపాను .
క్షణాలు ..... నిమిషమైనా దెబ్బలు లేవు , నవ్వులు వినిపించడంతో కళ్ళు తెరిచిచూస్తే ఎదురుగా బుజ్జిజానకితోపాటు మేడం ...... , ఆ ఒక్కటీ అడక్కు మహేష్ అంటూ సంతోషంతో నవ్వుకుంటున్నారు .
బుజ్జిజానకి : అంటీ ..... ఏమిజరిగిందో తెలుసా ? , ఎంత భయం వేసిందో - మహేష్ క్లాసులోనే ఉన్నాడు కాబట్టి సరిపోయింది అంటూ మేడం గుండెలపైకి చేరింది .
హెడ్ మిస్ట్రెస్ : అందరూ వెళ్ళాక ఆఫీస్ రూమ్ లాక్ చెయ్యాలికదా అప్పుడప్పుడూ నాకూ భయమేస్తుంది .
నేనొచ్చేసానుకదా ఇక భయమేల ......
థాంక్యూ - థాంక్యూ ....... , రియల్ బుజ్జిహీరో అంటూ ఇద్దరూ ఒకేసారి దిష్టితీశారు.

తల్లీ ...... తల్లీ మహీ ......
జానకి : అమ్మమ్మ వచ్చింది , మహేష్ ...... మా అమ్మమ్మ వచ్చింది అంటూ బ్యాగుని అక్కడే వదిలేసి బయటకు పరుగులుతీసింది .
మేడంతోపాటు నవ్వుకుని బ్యాగుని తీసుకుని వెనుకే వెళ్ళాము .
జానకి : అమ్మమ్మా అమ్మమ్మా ...... అంటూ పరుగునవెళ్లి స్కూటీ దిగిన తన అమ్మమ్మ గుండెలపైకి చేరింది .
తల్లీ ..... తల్లీ మహీ ...... నేను చూస్తున్నది నిజమేనా ? అంటూ ఆనందబాస్పాలతో ప్రాణం కంటే ఎక్కువగా కౌగిలించుకుని ముద్దులుకురిపిస్తున్నారు , తల్లీ ...... నిన్ను ఇలా మళ్లీ చూస్తాననుకోలేదు - మీ తాతయ్య చూస్తే ఎంత ఆనందిస్తారో ...... నా తల్లీ నా బంగారుకొండ నా ప్రాణం ....... అంటూ ముద్దులు ఆపడంలేదు .
హెడ్ మిస్ట్రెస్ : మీ జానకినే అంటీ .......
అమ్మమ్మ : కూతురి పేరు వినగానే ఉద్వేగానికి లోనైనట్లు ..... జానకినా ? అంటూ బుజ్జిజానకి బుగ్గలను అందుకుని ఆశ్చర్యపు సంతోషంతో చూస్తున్నారు .
హెడ్ మిస్ట్రెస్ : బుజ్జిజానకి అంటీ ......
జానకి : అవును అమ్మమ్మా ...... , ఈ ఆనందాలకు కారణం మహేష్ అంటూ జరిగింది మొత్తం వివరించింది .
అమ్మమ్మ : బాబూ మహేష్ అంటూ దగ్గరికివచ్చి చల్లగా ఉండు నాయనా అంటూ దీవించారు .
అమ్మమ్మా ...... ఇకనుండీ బుజ్జిజానకి హ్యాపీగా ఉంటుంది - మీరుకూడా బుజ్జిజానకి అనిపిలిస్తే ఫుల్ హ్యాపీ .....
అమ్మమ్మ : చాలా సంతోషం మహేష్ ...... , బుజ్జిజానకీ ......
జానకి : అమ్మమ్మా ...... అంటూ సంతోషంతో చుట్టేసింది .
అమ్మమ్మ : ఈసంతోషం చూడాలని మీ తాతయ్య నేను మొక్కని దేవుడంటూ లేరు - బుజ్జిదేవుడి రూపంలో వచ్చి మా కోరిక తీర్చారన్నమాట ...... , మీ తాతయ్య వేచిచూస్తున్నారు వెళదామా ? .
జానకి - మేడం : బుజ్జిదేవుడన్నమాట అంటూ ఆనందిస్తున్నారు .
అమ్మమ్మ : మహేష్ ..... నీరుణం తీర్చుకోలేనిది .
తీర్చుకోవచ్చు అమ్మమ్మా ....... అంటూ బుజ్జిజానకి బ్యాగును స్కూటీలో ఉంచాను .
జానకి : అమ్మమ్మా ...... వెళదాము పదా .....
అమ్మమ్మా అమ్మమ్మా ......
మేడం నవ్వులు ఆగడం లేదు
జానకి : వినకు అమ్మమ్మా ...... , ఏమిటో నేను చెబుతాను పదా ......
నాకోరిక తీర్చారన్నమాట సరే ...... , బుజ్జిజానకీ ...... " HAPPY NEW YEAR " .
బుజ్జిజానకి : ఈ ఆనందంలో ఆ సంగతే మరిచిపోయాను అంటూ దగ్గరికివచ్చి happy new year మహేష్ - happy new year అంటీ ...... విష్ చేసింది .
హెడ్ మిస్ట్రెస్ : Happy new year బుజ్జిజానకీ - Happy new year మహేష్ ......
Happy new year మేడం ......
బుజ్జిజానకి : తాతయ్య ఎదురుచూస్తూ ఉంటారు రేపు ఉదయం కలుద్దాము మహేష్ ...... , తొందరగా వచ్చెయ్యి ...... , అంటీ బై .....
హెడ్ మిస్ట్రెస్ : బై తల్లీ ...... ఉమ్మా .

అమ్మమ్మ : తల్లీ జానకీ..... ఎప్పుడు వీలుకుదిరితే అప్పుడు మహేష్ ను ఇంటికి పిలుచుకునిరా ...... , ఇష్టమైనవన్నీ చేసిపెడతాను .
జానకి : నాకు తెలియదా అమ్మమ్మా ...... , మహేష్ బై .......
రేపు కలుద్దాము బుజ్జిజానకీ ..... అంటూ ఒక చేతిని బుజ్జిహృదయంపై వేసుకుని మరొకచేతితో టాటా చెప్పాను , wait wait బుజ్జిజానకీ వన్ మినిట్ అంటూ పరుగునవెళ్లి మూడు ఐస్ క్రీమ్స్ తీసుకుని ఒకటి దాచుకుని వచ్చాను - అమ్మమ్మా ...... మీకు తాతయ్యగారికి ......
జానకి : మరి నాకు ..... ఈ ఈ ఈ .
నవ్వుకుని దాచుకున్నదానిని అందించాను .
జానకి : నా మహేష్ గురించి నాకు బాగా తెలుసు - Once again Happy new year అంటూ నా బుజ్జిహృదయంపై ముద్దుపెట్టి చిరునవ్వులు చిందిస్తూ వెళ్ళిపోయింది .
ఆఅహ్హ్హ్ .......

హెడ్ మిస్ట్రెస్ : పట్టుకున్నానులే ఇక నువ్వూ వెళ్లు మహేష్ - బై అంటూ ఆఫీస్ రూమ్ వైపు నడిచారు .
మీదెబ్బ టేస్ట్ చెయ్యకుండా ఎలా బై చెప్పగలను అంటూ నా క్లాస్రూంలోకివెళ్లి బ్యాగు భుజాలపై వేసుకుని నేరుగా ఆఫీస్ రూమ్ దగ్గరకువెళ్లి May i come in మేడం .......
హెడ్ మిస్ట్రెస్ : దెబ్బలుపడతాయి ఇంకొకసారి లోపలికిరావడానికి పర్మిషన్ ఆడిగావంటే , నేను ఉన్నా లేకపోయినా నువ్వు - జానకి ఎప్పుడైనా నేరుగా లోపలికివచ్చేయ్యొచ్చు అంటూ కోపంతో చూస్తున్నారు .
ఆ దెబ్బలే కదా మేడం నాకు కావాల్సింది - నేను రెడీ ......
హెడ్ మిస్ట్రెస్ : అమ్మో కేర్ఫుల్ గా ఉండాలి లేకపోతే జానకి బాధపడుతుంది .
ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ మేడం ........
హెడ్ మిస్ట్రెస్ : నో నో నో మహేష్ అంటూ నవ్వుకుంటూనే ఆఫీస్ రూమ్ కీస్ తీసుకుని హ్యాండ్ బ్యాగు సర్దుకుంటున్నారు .
అంతేనా మేడం ......
హెడ్ మిస్ట్రెస్ : అంతే మహేష్ ....... అనిచెప్పి అటువైపుకు తిరిగారు .
ఫైనల్ గా బ్రతిమాలుకుంటున్నాను ......
హెడ్ మిస్ట్రెస్ : ఫైనల్ గా బదులిస్తున్నాను - దెబ్బలు తప్ప ఏమైనా అడుగు ......
దెబ్బనే కావాలి ఇలాకాదు అంటూ సైడ్ కు వెళ్లి మేడం బుగ్గపై ముద్దుపెట్టాను .
అంతే చెంప చెళ్ళుమంది దెబ్బ కాస్త గట్టిగానే ...... - మహేష్ మహేష్ ...... sorry sorry - నా చెంప ఎర్రగా కందిపోవడం చూసి మేడం కళ్ళల్లో చెమ్మ ......
థాంక్యూ థాంక్యూ థాంక్యూ సో సో sooooo మచ్ మేడం - ఇప్పుడు మనసుకు ప్రశాంతంగా ఉంది అంటూ చిరునవ్వులు చిందిస్తూ బయటకువచ్చాను .

నిమిషం తరువాత మేడం బాధపడుతూనే బయటకువచ్చారు .
మేడం ...... నేను లాక్ చేస్తాను అంటూ అందుకుని డోర్స్ వేసి లాక్ చేసి కీస్ అందించాను .
హెడ్ మిస్ట్రెస్ : మహేష్ ...... ఇంకా వెళ్లలేదా ? .
మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి అదికూడా అప్పుడప్పుడూ భయంవేస్తుంది అని చెప్పాక ఎలా వెళ్లగలను మేడం .......
హెడ్ మిస్ట్రెస్ : ఇంత మంచివాడిని కొట్టాను - ఇంకా నా వేలి గుర్తులు అలానే ఉన్నాయి అంటూ బాధపడుతూ చెప్పారు .
మేడం ...... మీరు దేనిగురించి మాట్లాడుతున్నారు - ఈ దెబ్బే కదా రేపు ఉదయం వరకూ మిమ్మల్ని గుర్తుచేస్తూ ఉండేది .
హెడ్ మిస్ట్రెస్ : మహేష్ ...... నొప్పివేస్తోందా ? .
మేడం మేడం ...... ఇంత సంతోషంతో నవ్వుతుంటే నొప్పివేస్తోందా అని అడుగుతారేమిటి ? , ఒకేఒక స్కూటీ ఉందంటే అది మీదే అన్నమాట ....... ఇప్పటికే ఆలస్యం అయ్యింది అంటూ స్కూటీవరకూ వదిలాను , మేడం ...... I am happy అంటూ గుండెలపై చేతినివేసుకున్నాను - నేను ఆడిగినవెంటనే కొట్టి ఉంటే ఇంతవరకూ వచ్చేదే కాదు ....... ఏమాత్రం ఆలోచించకుండా జాగ్రత్తగా వెళ్ళండి .
హెడ్ మిస్ట్రెస్ : అవును తప్పంతా నాదే ......
అదిగో మళ్లీ ...... , ముందు మీరు వెళ్ళండి .
హెడ్ మిస్ట్రెస్ : నువ్వు ఎక్కడికి వెళ్ళాలి .......? .
చాలాదూరం మేడం ..... , బస్ స్టాప్ ఇక్కడే కదా నెనువెళతాను మీరువెళ్లండి ఒక్క నిమిషం అంటూ పరుగునవెళ్లి మేడం ఇంటిలో ఎంతమంది ఉన్నారో తెలియక బోలెడన్ని ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చి అందించాను .
హెడ్ మిస్ట్రెస్ : నవ్వేశారు ...... , మహేష్ ..... మాఇంట్లో మా బుజ్జి బాబు - అత్తయ్యా మావయ్య .......
బుజ్జిబాబు ...... , మీ అంత క్యూట్ గా ఉంటాడు .
హెడ్ మిస్ట్రెస్ : థాంక్యూ ...... 3rd ఇయర్ , నెక్స్ట్ ఇయర్ ఈ కాలేజ్లోనే జాయిన్ చేస్తాను .
మరి సర్ ...... ? .
మేడం కళ్ళల్లో చెమ్మ - ఇక్కడ లేడు అంటూ కాస్త కోపంగానే బదులిచ్చారు , సరే అయితే నవ్వించేశావు జాగ్రత్తగా ఇంటికివెళ్లు అంటూ నా బుగ్గను స్పృశించారు .
ఇష్టమైనదే కదా మేడం ..... టాటా అంటూ పంపించాను , అలా వెనుకకు చూడకండి మేడం బై ...... , ఆఅహ్హ్ తియ్యనైన నొప్పి ...... అంటూ స్పృశించుకుంటూ బయటకు నడిచాను - అంటీలకు కాల్ చేసాను - అంటీల కోపపు వాయిస్ విని నవ్వుకున్నాను , అంటీలను ఐస్ క్రీమ్స్ రా అంటూ మళ్లీ వెహికల్ దగ్గరకువెళ్ళాను . అన్నా ...... స్టూడెంట్స్ అందరికీ సరిపోయాయా ? .
అన్న : ఏంటి మహేష్ తెలియనట్లు అడుగుతున్నావు - ఇది స్వర్గపు ఐస్ క్రీమ్ వెహికల్ అంటూ ఒక ఐస్ అందుకున్నారు మారుక్షణంలో ఆ ప్లేస్ లో రెండు ఐస్ క్రీమ్స్ ప్రత్యక్షం అయ్యాయి - స్టూడెంట్స్ అందరూ ఇష్టమైనన్ని ఇంటికి తీసుకెళ్లారు .
Wow ..... లవ్ యు లవ్ యు పెద్దమ్మా ...... , అన్నా ....... మూడు కోన్ ఐస్ క్రీమ్స్ ఇవ్వండి మా అంటీ వాళ్లకు ...... థాంక్యూ , సేఫ్టీ కి మరొక మూడు ఇవ్వండి అంటూ వాటిని బ్యాగులోఉంచుకుని బై చెప్పడంతో ఒక్కసారిగా మాయం అయిపోయాయి .
అటెండర్ ...... క్లారూమ్స్ అన్నింటికీ తాళాలు వేస్తుండటం చూసి చేతులలో ఐస్ క్రీమ్స్ తో అంటీలను గుర్తుచేసుకుని వచ్చేస్తున్నాను అంటూ బయటకునడిచాను .

షాక్ ....... ముగ్గురు ఆక్కయ్యలు ఏకంగా స్కూటీలలో స్టైల్ గా గ్లాస్సెస్ పెట్టుకునిమరీ మహేష్ మహేష్ మహేష్ ...... అంటూ సంతోషంతో పిలుస్తూ నాదగ్గరికి వచ్చి చుట్టూ రౌండ్స్ వేస్తున్నారు .
అక్కయ్యలూ అక్కయ్యలూ ...... ఇది మెయిన్ రోడ్ సైడ్ కు రండి సైడ్ కు రండి ........
ముగ్గురూ సైడ్ కు వెళ్లి స్కూటీలను ఆపి గ్లాస్సెస్ ను మెడ కింద డ్రెస్ పై ఉంచుకున్నారు - ఇందుకుకాదూ నువ్వంటే ఇష్టం అంటూ నాదగ్గరికివచ్చి బుగ్గలను గిల్లేస్తున్నారు .
స్స్స్ స్స్స్ స్స్స్ ...... , అక్కయ్యలూ ...... కొత్త స్కూటీలు ? .
ఆక్కయ్యలు : అవును మనవే , అక్కయ్యలూ ..... అందరూ స్కూటీలలో వస్తున్నారు మీరుమాత్రం బస్సులో వస్తున్నారు అని అలా అన్నావోలేదో ....... ఏమిజరిగిందో తెలుసా ? ......
ఆక్కయ్యలు చెప్పకముందే కళ్ళముందు మెదిలింది , Wow ...... మా ఆక్కయ్యలు టాపర్స్ అన్నమాట , అక్కయ్యలూ అక్కయ్యలూ ....... మీ సంతోషాలను నాదగ్గరకాదు అంటీలదగ్గర పంచుకోండి ....... అదే నాకూ సంతోషం .
ఆక్కయ్యలు : అంటీలూ అంటీలూ అంటీలూ ....... అంటూ మళ్లీ బుగ్గలను గిల్లేసారు .
స్స్స్ స్స్స్ స్స్స్ ......
ఆక్కయ్యలు : అయినా మేము టాపర్స్ అని నీకెలా తెలుసు ? .
అది ఒకరు చెప్పాలా అక్కయ్యలూ ....... , మా అక్కయ్యల గురించి నాకు తెలియదా ? .
ఆక్కయ్యలు : థాంక్యూ థాంక్యూ థాంక్యూ మహేష్ అంటూ బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టారు - మహేష్ ...... నొప్పివేస్తోందా ? .
అవునుమరి ....... అదే అంటీలు గిల్లి ఉంటే హాయిగా ఉండేది అంటూ డ్రీమ్స్ లోకి వెళ్ళిపోయాను .
ఆక్కయ్యలు : నువ్వంటేనే మండిపడే అమ్మలు అంటే ఎందుకంత ఇష్టం అంటూ తియ్యనైనకోపాలతో మళ్లీ గిల్లేసారు .
స్స్స్ స్స్స్ స్స్స్ ....... , ఇప్పుడు ఎంత కోప్పడితే తరువాత అంత ప్రేమ ...... అది మీకు అర్థం కాదులే అక్కయ్యలూ ...... మీకింకా అంత అనుభవం లేదు .
ఆక్కయ్యలు : మెడికల్ చదువుతున్నాము మాకు తెలియదు అంటావా ..... ఆయ్ ఆయ్ ఆయ్ ఐస్ క్రీమ్స్ ఐస్ క్రీమ్స్ మాకోసమే కదా .......
నో నో నో అంటీలకోసం ఇష్టంతో తీసుకొచ్చాను .
ఆక్కయ్యలు : నడుములపై చేతులను వేసుకుని పెద్దపెద్దకళ్ళ కోపంతో చూస్తూనే లాక్కున్నారు - ప్రక్కనే ఉన్న మాకు కాకుండా దూరంగా ఉన్న అమ్మలకు ఇస్తాడట అంటూ మళ్లీ గిల్లేసి టేస్ట్ చేశారు - మ్మ్మ్ మ్మ్మ్ మ్మ్మ్ ...... ఇదేంటే ఇంత బాగుంది - మన కాలేజ్ క్యాంటీన్ లో మరియు అమ్మలతో షాపింగ్ వెళ్ళినప్పుడు ఎన్ని ఐస్ క్రీమ్ లు తిన్నాము ...... this is wow మ్మ్మ్ మ్మ్మ్ మ్మ్మ్ ...... The best ఐస్ క్రీమ్ ఎవర్ మహేష్ థాంక్యూ థాంక్యూ థాంక్యూ ......
ప్చ్ ప్చ్ ....... అంటీలకోసం తీసుకొచ్చాను - ఐస్ క్రీమ్ వెహికల్ కూడా మాయమైపోయింది అదే అదే వెళ్ళిపోయింది ........
ఆక్కయ్యలు : ఐస్ క్రీమ్ వెహికల్ ఏమిటి - మాయమవ్వడం ఏమిటి ? , నోటిలో కరిగిపోతోంది మ్మ్మ్ మ్మ్మ్ మ్మ్మ్ ......
అక్కయ్యలూ ...... తినండి త్వరగా తినండి , అక్కడ అంటీవాళ్ళు ఎదురుచూస్తూ ఉంటారు .
ఆక్కయ్యలు : అవునవును కాస్త ఆలస్యం అయితే చాలు కంగారుపడిపోతారు ఏకంగా బస్ స్టాప్ దగ్గరకు వచ్చేస్తారు . అవును మహేష్ ...... మధ్యాహ్నం భోజనం ఎక్కడ చేసావు అంటూ ప్రేమతో అడిగారు .
అక్కయ్యలూ ...... కాలేజ్లో మధ్యాహ్న భోజనం పెడతారుకదా .....
ఆక్కయ్యలు : అంతగా బాగోదు కదా మహేష్ అంటూ బాధపడ్డారు .
ఈ ఒక్కరోజుకే అక్కయ్యలూ ..... రేపటినుండి మొత్తం మార్పించేస్తున్నారు మా హెడ్ మిస్ట్రెస్ అంటూ జరిగింది జరగబోయేది వివరించాను .
ఆక్కయ్యలు : విన్నాము విన్నాము కాలేజ్ హెడ్ మిస్ట్రెస్ చాలా మంచివారని విన్నాము - అంటే కాలేజ్ పూర్తిగా మారిపోబోతుందన్నమాట గుడ్ గుడ్ , మా మహేష్ కోరుకున్నాడు మాకు స్కూటీలు వచ్చాయి - కాలేజ్లో అడుగుపెట్టాడు కాలేజ్ చేంజ్ అవుతోంది ...... అంటూ ఆనందిస్తున్నారు , అవునూ ..... మధ్యాహ్నం లంచ్ కోసమని ముగ్గురమూ ఎన్నిసార్లు కాల్ చేసినా బిజీ వచ్చింది ఏమిటీ ? .
ఓహ్ ఆదా ..... అంటీలకు కాల్ చేస్తుంటిని అంటూ సిగ్గుపడుతూ బదులిచ్చాను .
ఆక్కయ్యలు : అమ్మలు నీతో మాట్లాడారా ...... , ఇంత సంతోషమైన విషయాన్ని ఇంత ఆలస్యంగా చెబుతావే అంటూ మురిసిపోతున్నారు .
అక్కయ్యలూ ......
ఆక్కయ్యలు : అంటే మాట్లాడలేదా ? , మరి గంటసేపు ....... ? .
కాన్ఫరెన్స్ రీ డయల్ చేస్తూ అంటీల స్వీట్ వాయిసస్ ఎంజాయ్ చేసాను అంటూ జరిగింది వివరించాను .
ఆక్కయ్యలు : ఏమిటీ ...... ఆగంటసేపూ ......
అవునవును అంటూ మరింత సిగ్గుపడ్డాను - ఆ గంటసేపే కాదు అక్కయ్యలూ ...... నా బుజ్జి మనసుకు అనిపించిన ప్రతీసారీ ......
ఆక్కయ్యలు : అంటే రోజంతా నీ బుజ్జిమనసులో ఉన్నది అమ్మలేకదా - రోజంతా చేస్తూనే ఉన్నావన్నమాట .......
అవునవును అంటూ చిరునవ్వులు చిందిస్తూ తలఊపాను .
ఆక్కయ్యలు : అమ్మలు కోప్పడలేదా ? .
చాలా చాలా ...... , అంటీల ఆప్యాయతతోపాటు ఆ కోపం కూడా నాకు ఇష్టమేకదా ...... అంటూ హృదయంపై చేతినివేసుకుని ఫీల్ అవుతున్నాను .
ఆక్కయ్యలు : మేమేమో అక్కడ నువ్వు తిన్నావోలేదోనని కంగారుపడుతూ కాల్స్ మీద కాల్స్ చేస్తుంటే నువ్వేమో అమ్మల కోపాన్ని ఎంజాయ్ చేస్తున్నావన్నమాట , కనీసం ఆ తరువాతైనా అలర్ట్స్ వచ్చి ఉంటాయి కదా ......
ఆ ఆ వచ్చాయి చూసాను అక్కయ్యలూ .......
ఆక్కయ్యలు : చూశాక కాల్ చెయ్యొచ్చుకదా ......
మీకు కాల్ చేసే ఆ కొద్దిసమయంలోకూడా అంటీల వాయిసస్ .......
ఆక్కయ్యలు : ఏమిటీ అంటూ చుట్టుముట్టి దెబ్బలవర్షం కురిపించారు .
అక్కయ్యలూ అక్కయ్యలూ ...... అంటీ అంటీ ......
ఆక్కయ్యలు : కొడితే ఎవరైనా ...... అమ్మా హబ్బా అంటారు నువ్వెంటి అమ్మలను కలవరిస్తున్నావు .
ఇకనుండీ నాకు అన్నీ వారే కదా ...... , వారి సంతోషమే నా సంతోషం .
అక్కయ్యలు : టచ్ చేసావు మహేష్ అంటూ కళ్ళల్లో ఆనందపు చెమ్మతో నా బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టారు . మరి మేము ...... ? .
గప్ చుప్ అయిపోయి తలదించుకున్నాను .
ఆక్కయ్యలు : కోపంతో గిల్లేసారు .
స్స్స్ స్స్స్ స్స్స్ ...... అంటీ అంటీ ......

ఆక్కయ్యలు నవ్వేసి , అప్పచ్చిలు వేస్తున్నారు ......
దేనికోసం అక్కయ్యలూ ...... , నిన్ను ఎవరి స్కూటీలో ఎక్కించుకోవాలని కాలేజ్ వదిలినప్పటినుండీ ముగ్గురిలో భయంకరమైన పోటీ అంటూ నవ్వుకున్నారు - ఫైనల్ గా ఈ నిర్ణయానికి వచ్చాము , యే యే ...... కార్తీక గెలిచింది అంటూ మిగతా ఇద్దరూ కార్తీక అక్కయ్య బుగ్గలపై ముద్దులుపెట్టి స్కూటీలు ఎక్కారు .
అక్కయ్యలూ ...... నడుపుకుంటూ వచ్చిన స్కూటీలలో కాకుండా వేరువేరు స్కూటీలలో ఎక్కారు , మీ ఫ్రెండ్షిప్ - మీ మధ్యన ప్రేమను చూస్తే ముచ్చటేస్తోంది , అయినా ఈ క్రెడిట్ మొత్తం అంటీలకే చెందుతుంది .
ఆక్కయ్యలు : ఎలా మహేష్ ? అంటూ కాస్త కోపంతోనే అడిగారు .
ముందు అంటీలు ఫ్రెండ్స్ అవ్వడం వల్లనే కదా మీరు వారిని చూసి అలాగే ఉండాలని అనుకున్నది .
ఆక్కయ్యలు : అవును నిజమే , వాళ్ళ మధ్యన గల స్వచ్ఛమైన ప్రేమను చూస్తే మాకు చాలా చాలా ఆనందం , sorry కోప్పడ్డాము ...... , ప్రతీసారీ అమ్మలు అమ్మలు అని విని ప్రతీదానికీ కోపం వచ్చేస్తోంది అంటూ నవ్వుకున్నారు , కార్తీక అక్కయ్య ...... నా బ్యాగు అందుకుని స్కూటీ ముందు ఉంచి ఎక్కి ఎక్కమన్నారు , గట్టిగా పట్టుకో మహేష్ ......
పట్టుకున్నాను అక్కయ్యా .......
కార్తీక అక్కయ్య : నన్ను ఎక్కడ పట్టుకున్నావు అనిచూస్తే వెనుక రాడ్ ను పట్టుకోవడం చూసి ప్చ్ ప్చ్ నిరాశతో సున్నితంగా మొట్టికాయవేశారు .
వాగ్దేవి అక్కయ్య : మనల్ని పట్టుకోమంటే పట్టుకోడు , అదే అమ్మలు అడగకముందే పట్టేసుకుంటాడు అంటూ చిరుకోపంతో చూస్తున్నారు .
అంతేగా అంతేగా ...... ఆ అదృష్టం ఎప్పుడో ఏమో ......
ముగ్గురు అక్కయ్యలూ నవ్వేస్తున్నారు .
అక్కయ్యలూ ...... మీకు స్కూటీ నడపడం వచ్చా ? , నాకు భయమేస్తోంది .
ఆక్కయ్యలు : మాకు వచ్చు రోజూ క్లాసెస్ మధ్య గ్యాప్ వచ్చినప్పుడు - లంచ్ బ్రేక్ లో ఫ్రెండ్స్ స్కూటీలను క్యాంపస్ మొత్తం చుట్టేసేవాళ్ళము - ఇక ఈరోజైతే క్లాసులలో కంటే స్కూటీలమీదనే ఎక్కువ సమయం గడిపాము , మీ అంటీలకే నడపడం రాదు ముందు అది ఆలోచించు ......
ఏంటి అంటీలకు స్కూటీ నడపాడ్ రాదా ? .
ఆక్కయ్యలు : రానే రాదు అంటూ ముసిముసినవ్వులు నవ్వుకుంటూ పోనిచ్చారు - నువ్వే నేర్పించాలి మరి ......
ఆఅహ్హ్ ...... హృదయం ఉప్పొంగే మాట చెప్పారు అక్కయ్యలూ , యాహూ యాహూ ...... అంటూ ఎంజాయ్ చేస్తున్నాను .
ఆక్కయ్యలు : చూసి సంతోషంతో నవ్వుకుంటున్నారు - మహేష్ మహేష్ ...... బానే డ్రైవ్ చేస్తున్నామా ? .
బహు చక్కగా అక్కయ్యలూ ...... తెలిసిపోతోంది - ఇక భయపడాల్సిన అవసరమేలేదు , ఫాస్ట్ ఫాస్ట్ గా పోనివ్వండి అక్కయ్యలూ ...... ఉదయం అనగా చూసాను ..... నాపై కోపం మరింత పెరగాలని ప్రార్థిస్తున్నాను .
ఏమిటీ అంటూ మరింత నవ్వుతూ పోనిచ్చారు .

అక్కయ్యలూ ...... అంటీలకు ఏమిటంటే ఇష్టం ? .
ఆక్కయ్యలు : వారికి మేముతప్ప వేరే ప్రపంచం లేదు మహేష్ .......
అంటే మీరు హ్యాపీ అయితే అంటీలు డబల్ హ్యాపీ అన్నమాట ......
ఆక్కయ్యలు : అవును మహేష్ ...... , ప్చ్ ప్చ్ ప్చ్ ...... కోపంలో నువ్వు అమ్మలకోసం తీసుకొచ్చిన ఐస్ క్రీమ్స్ కుమ్మేసాము .
హ్యాపీగా తినేసి ఇప్పుడు ఫీల్ అవుతున్నారా ? ......
ఆక్కయ్యలు : షాప్ నుండి అమ్మలకు తీసుకువెళదామా ? .
ఆ టేస్ట్ ఉంటాయా ? .
ఆక్కయ్యలు : నెవర్ నెవర్ నెవర్ .......
మీరే చెప్పారుగా ...... , ముందూ వెనుకా ఆలోచించకుండా తినేశారు .
ఆక్కయ్యలు : Sorry చెప్పాముకదా మహేష్ .......
చేసేదంతా చేసి Sorry చెబితే సరిపోతుందా .......
ఆక్కయ్యలు : ప్రతీ govt కాలేజ్ కు ఆ వెహికల్స్ వస్తాయని చెప్పావుకదా , మాదీ govt కాలేజే కదా పైగా ప్రక్కనే ఉంది రేపు మా కాలేజ్ కు వస్తాయా ...... ? .
అంతేకదా మరి ..... , రేపు లంచ్ సమయానికి మీ ముందు వెహికల్స్ ఉంటాయి అక్కయ్యలూ ....... , రేపైనా అంటీలకు ......
ఆక్కయ్యలు : Sure sure డబల్ sure మహేష్ ....... , ఐస్ క్రీమ్ వెహికల్ కానీ మా క్యాంపస్ కు వస్తే మెడికల్ స్టూడెంట్స్ అయినాకూడా ఎలా తింటారో తెలుసా ...... , ఊహకే అందదు మహేష్ అంటూ నవ్వుకుంటున్నారు .
మా కాలేజ్ స్టూడెంట్స్ కంటేనా ...... అక్కయ్యలూ ......
అంతకు అంతకుమించి మహేష్ ...... , కావాలంటే నువ్వే స్వయంగా వచ్చి చూడు వీలుకాకపోతే వీడియో తీస్తాములే చూద్దువుకానీ ...... , వీడియో అంటే గుర్తుకువచ్చింది నీకొక సర్ప్రైజ్ ...... నువ్వు చెప్పినదే జరిగింది .
తెలుసులే అక్కయ్యలూ .....
ఆక్కయ్యలు : తెలుసా ...... ? .
లేదే లేదే అంటూ నవ్వుకున్నాను . అక్కయ్యలూ అక్కయ్యలూ ...... ఆపండి ఆపండి ..... సైడ్ కు ఆపండి .

కార్తీక అక్కయ్య మిగతా ఇద్దరు ఆక్కయ్యలకు మరియు వెనుక వచ్చే వాహనాలకు సిగ్నల్ ఇస్తూ ప్రక్కకువెళ్లి ఆపారు - ఏమైంది మహేష్ .......
కిందకుదిగి ఏమైందా ...... , హెల్మెట్స్ ఇచ్చినది ఇలా స్కూటీపై వ్రేలాడదీయడం కోసం కాదు అంటూ వరుసగా పెట్టుకున్న గ్లాస్సెస్ తీసేసి ముగ్గురి తలలపై హెల్మెట్స్ ఉంచాను .
ఆక్కయ్యలు : సో సో సో స్వీట్ ఆఫ్ యు మహేష్ ...... , ఇంత కేరింగ్ తీసుకునే తమ్ముడు దొరకడం మాఅదృష్టం అంటూ బుగ్గలపై చేతితో ముద్దులుపెట్టారు .
అక్కయ్యలూ ...... ఇలా ప్రతీసారీ ముద్దులుపెట్టనవసరం లేదు .
ఆక్కయ్యలు : అదే అమ్మలు అయితే .......
ఎన్నిసార్లైనా ...... అంటూ ఊహల్లోకి వెళ్ళిపోయాను .
ఆక్కయ్యలు : నిన్నూ అంటూ బుగ్గలపై గిల్లేసారు - మా ఇష్టం మేముకూడా ఎన్నిసార్లైనా ముద్దులుపెడతాము - గిల్లేస్తాము ...... , ఎక్కడ ఎక్కడ ఎక్కడ అదిగో అక్కడ అంటూ ముగ్గురు అక్కయ్యలూ కూడా స్కూటీలు దిగివెళ్లి బుజ్జి హెల్మెట్ కొనుక్కుని నా తలపై ఉంచారు , డ్రైవ్ చేసేవారే కాదు వెనుక కూర్చున్నవారూ హెల్మెట్ తప్పక ధరించాలి - కూర్చుని గట్టిగా పెట్టుకో మహేష్ ......
కూర్చుని పట్టుకున్నాను అక్కయ్యా పోనివ్వండి అన్నాను .
ఆక్కయ్యలు నవ్వుతుంటే కార్తీక అక్కయ్య నిరాశతో పోనిచ్చారు .
అక్కయ్యలూ ...... ఎక్కడికి వెళ్లినా హెల్మెట్స్ ధరించే వెళ్ళాలి సరేనా ......
ఆక్కయ్యలు : సరే మహేష్ ...... , థాంక్యూ ....... , బీచ్ రోడ్డుమీదుగా ఇంటికి వెళదాము వ్యూ బాగుంటుంది .
ఇప్పడు వద్దులే అక్కయ్యలూ .......
ఆక్కయ్యలు : ఇప్పుడు వద్దా ..... ? - మాతో వద్దా ...... ? , అదే అమ్మలతోనైతే హ్యాపీగా వెళతావు కదూ .......
సిగ్గుపడుతూ నవ్వుతున్నాను .
ఆక్కయ్యలు : అంటే నిజమేనన్నమాట , డ్రైవ్ చేస్తున్నాను కాబట్టి సరిపోయింది లేకపోతే దెబ్బలే దెబ్బలు ......
ఆ దెబ్బలుకూడా అంటీలవైతే ఎంత బాగుంటుంది ......
ఆక్కయ్యలు : అయ్యో ....... , నిన్నూ ....... ఇంటికి వెళ్లనీ నీసంగతి చెబుతాము .
ఆ సంగతేదో అంటీలతో చేయించండి అక్కయ్యలూ ప్లీజ్ ప్లీజ్ ......
ఆక్కయ్యలు : చేయిస్తాము చేయిస్తాము అమ్మలతోనే చేయిస్తాము అంటూ కోపాలతో బదులిచ్చారు .
యాహూ యాహూ ...... మీరు కోపాలతో చెప్పినా అదే నిజం అయితే ఎంత బాగుంటుందో .......
ఆక్కయ్యలు : బీచ్ రోడ్డులోని బీచ్ అందాలను చూసి ఆనందిస్తూ పోనిచ్చారు .
సునీత అక్కయ్య : ఒసేయ్ కార్తీకా ...... కళ్ళు గట్టిగా మూసుకున్నాడే అంటూ నవ్వుకుంటున్నారు .
కార్తీక అక్కయ్య : అంటీలూ అంటీలూ ...... , నిన్ను కొట్టలేను కదా నన్ను నేనే మొట్టికాయవేసుకుంటాను - స్స్స్ .......
హెల్మెట్ కు కొట్టుకున్నారా అంటూ మిగతా అక్కయ్యలిద్దరితోపాటు నవ్వుకుంటూ మావీధికి చేరుకున్నాము .

అంటీలు అంటీలు అట్లాస్ట్ ఆఅహ్హ్హ్ ..... అంటూ స్కూటీపై నిలబడి రెండుచేతులనూ బుజ్జిహృదయంపై వేసుకుని ప్రేమతో చూస్తున్నాను .
ఆక్కయ్యలు : మహేష్ మహేష్ ...... జాగ్రత్త పడిపోతావు నన్ను పెట్టుకో ......
అంటీలను చూస్తూ పడటమా ...... , ఇప్పుడు పడటం ఏమిటి అంటీల మాయలో ఎప్పుడో పడిపోయాను .......
నా చిలిపి మాటలకు ఆక్కయ్యలు ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు . ఆక్కయ్యలు ఇంటిదగ్గరికి చేరుకున్నప్పటికీ అంటీలు బస్ స్టాండ్ వైపునే చూస్తుండటం చూసి అంటీలను దాటుకుని వెళ్లి ఇంటిముందు ఆపి నవ్వుకుంటున్నారు - అమ్మలూ అమ్మలూ అమ్మలూ ....... అంటూ హెల్మెట్స్ తీసి హైఫై కొట్టుకున్నారు సంతోషంతో ....... , స్టైల్ గా గ్లాస్సెస్ పెట్టుకున్నారు .

తల్లులూ ..... స్కూటీలలో వచ్చింది మీరేనా ? , కొత్త స్కూటీలలా ఉన్నాయే ......
Hi hi hi అంటీలూ Good evening ....... , స్కూటీ దిగి హెల్మెట్ తీసాను , నన్ను ఏమాత్రం పట్టించుకోకపవడం చూసి నవ్వుకున్నాను - థాంక్యూ అంటీలూ ..... విష్ చేసినందుకు ..... అంటూ అపురూపంగా కనులారా చూసి ఆనందిస్తున్నాను .
అంటీలు : మేమెక్కడ Good evening అని విష్ చేసాము ....... అంటూ చిరుకోపం.
ఆక్కయ్యలు : ఇదిగో ఇప్పుడు విష్ చేశారు కదా అమ్మలూ ...... , కాస్త ముందుగా థాంక్స్ చెప్పాడు అంతే .......
అంటీలు : మీరంతా ఒక్కటైపోయారన్నమాట .......
ఆక్కయ్యలు : మా కాలేజ్ - మహేష్ కాలేజ్ ...... ప్రక్కప్రక్కనే అమ్మలూ అంటూనా బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టారు .
తల్లులూ తల్లులూ తల్లులూ ....... అంటూ నానుండి వారి వెనుకకు తీసుకున్నారు అంటీలు .
అమ్మలూ అమ్మలూ అమ్మలూ .......
అక్కయ్యలూ ....... చెబితే మీరే వినలేదు - అంటీలకు ఈర్ష్య అంటూ నవ్వుకున్నాను .
ఆక్కయ్యలు : ఓ ఓ ఓహ్ ...... ఆదావిషయం అయితే ok అంటూ అంటీల బుగ్గలపై ముద్దులుపెట్టి వెనకనుండి హత్తుకుని నవ్వుకుంటున్నారు .
అంటీలు : ఏ విషయం ? - ఈర్ష్య ఎందుకు ? , తల్లులూ ...... మహే .... ఈ పిల్లాడిని మీరెందుకు పిలుచుకునివచ్చారు ? .
ఆక్కయ్యలు : మూడు స్కూటీలు ఉన్నాయి కదా అమ్మలూ ....... , మంచి పిల్లాడు అంటూ నవ్వుకుంటున్నారు .

అంటీలు : పిల్లాడి గురించి వదిలెయ్యండి , స్కూటీల గురించి చెప్పండి తల్లులూ ...... ఇప్పుడే షోరూం నుండి తీసుకొచ్చినట్లుగా ఉన్నాయి .
ఆక్కయ్యలు : అవును అమ్మలూ కొత్తవి - బస్సులో కాలేజ్ కు వెళ్ళామా ...... మా కాలేజ్ స్టూడెంట్స్ అందరూ స్కూటీలలో రావడం చూసి అక్కయ్యలూ ...... త్వరలోనే మీరూ స్కూటీలలో కాలేజ్ కు రాబోతున్నారు అనిచెప్పాడు - అప్పుడు మేము నమ్మలేదు , ఆశ్చర్యం అలా కాలేజ్ లోపలికి వెళ్ళామా ....... " PM " అనే సంస్థ govt కాలేజస్ లో చదువుతూ ప్రతీ సంవత్సరం టాప్ సాధించిన ఫస్ట్ 10 స్టూడెంట్స్ కు స్కూటీ డిస్ట్రిబ్యూషన్ చేశారు .
అంటీలు : మా తల్లులు అల్వేస్ టాప్ 5 లోనే ఉంటారు కాబట్టి ముగ్గురికీ మూడు స్కూటీలు అన్నమాట , చాలా చాలా సంతోషం తల్లులూ అంటూ గుండెలపైకి తీసుకుని మురిసిపోతున్నారు , అయినా ఈ క్రెడిట్ మహే ..... ఈ అల్లరి పిల్లాడికి ఎలా ఇస్తారు ? , మీరు బాగా చదువుకున్నారు కాబట్టి సాధించారు .......
కరెక్ట్ కరెక్ట్ అంటీలూ ...... మీరు చెప్పినదే కరెక్ట్ ......
అంటీలు : నువ్వు చెప్పాల్సిన అవసరం లేదులే ...... , ఇక ఇంటికివెళ్లు ......
ఆక్కయ్యలు : Wait wait wait మహేష్ ....... , అమ్మలూ ..... ముందు మేమూ అలానే అనుకున్నాము కానీ ...... ఉదయం బస్సులో వెళుతూ నిన్న పగలగొట్టిన ఐఫోన్ ఎక్స్చేంజి తీసుకురావడంతో ఆశ్చర్యపోయి చేతుల్లోకి తీసుకున్నామా ......
ఆశ్చర్యపోయి కాదు అంటీలూ ...... నెంబర్స్ ......
ఆక్కయ్యలు : ష్ ష్ ష్ మహేష్ ...... , అధిచెబితే అయిపోతాము అంటూ నానోటిని చేతులతో మూసేసారు .
అంటీలు : తల్లులూ ...... మళ్లీ ఆ పిల్లాడిని ఎందుకు తాకుతారు ? .
అక్కయ్యలూ ...... చెప్పానా మళ్లీ అసూయ ......
ఆక్కయ్యలు నవ్వుకున్నారు - అమ్మలూ ...... ఐఫోన్ ఇష్టంతో చేతుల్లోకి తీసుకోగానే ఏమన్నాడో తెలుసా ..... ? , అతిత్వరలో ఐఫోన్స్ కూడా మాఅక్కయ్యల చేతుల్లోకి చేరుతాయి అన్నాడు రియల్లీ షాకింగ్ తెలుసా ...... స్కూటీలతోపాటు లేటెస్ట్ ఐఫోన్స్ గిఫ్ట్ గా ఇచ్చారు టాప్ 10 స్టూడెంట్స్ కు ..... అంటూ స్కూటీ డిక్కీలోనుండి ఐఫోన్స్ తీసి చూయించారు - మహేష్ ...... సర్ప్రైజ్ ఎలా ఉంది థాంక్యూ థాంక్యూ .......
అంటీలు : సంతోషం తల్లులూ ...... , బాగా చదువుకుంటే కోరుకున్నవన్నీ మనదగ్గరికే వస్తాయి అంటే ఇదే కాబోలు ......
ఆక్కయ్యలు : మహేష్ వల్లనే అమ్మలూ ......
అంటీలు: మళ్లీ వాడికెందుకు క్రెడిట్ ఇస్తారు ...... , మీరు కష్టపడ్డారు ప్రతిఫలం దక్కింది , అయినా నీ ఆక్కయ్యలు ఏమిటి ...... మా తల్లులు మాత్రమే ......
అవునవును అంటీలు మాత్రమే నా అంటీలు అంటూ గుసగుసలాడి నవ్వుకుంటున్నాను .
ఆక్కయ్యలు : అమ్మలూ ....... , పాపమే మంచి పిల్లాడే ......
అంటీలు : నిన్న చూసాముకదా ఎంతమంచిపిళ్ళాడో ....... , చూశారుకదా కాలనీ అంతా సుదర్శని అంటీ బ్యానర్ల సంబరం , ఎన్ని ఏళ్ల నుండి ఈ సంబరాలకోసం ఎదురుచూస్తున్నామో మీకు తెలుసుకదా ....... , అంతచేసి తప్పుచేసాను అంటూ ఒక్క sorry చెప్పాడా ..... ? .
ఆక్కయ్యలు : తప్పు చెయ్యలేదే అమ్మలూ .......
అంటీలూ ...... మీస్థాయికి ఈ చిన్న పదవి జుజుబీ ...... , పెద్ద పెద్ద పదవులు మీకోసం .......
అంటీలు : ఇలానే పైకెత్తి కిందకు తోసేసావు ......
అంటీలూ ...... దెబ్బలేమైనా తగిలాయా ? - మీకు నొప్పివేస్తే ఈ బుజ్జిహృదయం విలవిలలాడిపోతుంది .
అక్కయ్యల నవ్వులు ఆగడం లేదు ....... , కూల్ కూల్ అమ్మలూ జోక్ జోక్ గానే తీసుకోవాలి అంటూ సైడ్ నుండి హత్తుకుని ముద్దులుపెడుతున్నారు .
అంటీలు : కోపంతో చూస్తున్నారు .
Next page: Update 130
Previous page: Update 128