Update 134

కానిస్టేబుల్స్ 10 నిమిషాలలో లాక్కొచ్చారు .
కానిస్టేబుల్స్ చెప్పినది నిజమే అన్నమాట బాత్ సూట్ లో ఉన్నారంటే ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు , అంకుల్ వాళ్ళను మోసం చేశారుకదా ఇకనుండీ చిప్పకూడు తిందురుగానీ ...... , అవును పార్ట్నర్స్ మోసం చేస్తే మా అంకుల్ వాళ్ళ కష్ట ఫలితాన్ని పొందుతారు కానీ నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యావు సేట్ ..... , చెప్పవా ...... ఏంటి CI గారూ సైలెంట్ గా నిలబడిపోయారు .
CI ..... కానిస్టేబుల్స్ వైపు సైగచేశారు .
నో నో నో మీరే స్వయంగా శిక్షించాలి .
CI లాఠీ అందుకుని రెండు దెబ్బలు వేశాడో లేదో తట్టుకోలేక చెబుతాను చెబుతాను అన్నాడు .
సేట్ : వారి ఇంటి ఆస్తి విలువ ఒక్కసారిగా పదింతలు అయ్యింది , ఆ ఇళ్లను కూల్చి మాల్ నిర్మించడానికి అడ్వాన్స్ కూడా తీసుకున్నాను .
ఏమిటీ నాదేవతలు - అక్కయ్యలు ఉంటున్న ఇల్లు దేవాలయంతో సమానం - ఆ దేవాలయాన్నే కూల్చాలనుకున్నారా అంటూ CI చేతిలోని లాఠీ అందుకుని కోపం తగ్గేవరకూ కొట్టాను , మరి నగలు ......
సేట్ : దెబ్బలకు కేకలతో చిందులువేస్తూనే నేను తాకట్టు పెట్టుకున్నప్పటికీ ఇప్పటికీ మూడింతలు పెరిగింది .
ఆ నగలు జాగ్రత్తగా ఉన్నాయికదా ...... , అమ్మేసాను అన్నావో నువ్వు చచ్చావే .
సేట్ : లేదు లేదు నా లాకార్లో జాగ్రత్తగా ఉన్నాయి .
హమ్మయ్యా ...... అంటూ సంతోషంగా గుండెలపై చేతినివేసుకున్నాను .
సేట్ : లాభాల్లో 50% CI గారే తీసుకున్నారు , మమ్మల్ని మాత్రమే శిక్షించడం అదికూడా CI తోనే , సగం తప్పు అతడితే బాబూ ......
CI గారూ తప్పుకదా , విశ్వ సర్ ఏమిచేద్దాము .
విశ్వ సర్ : నిన్ను చూస్తుంటే నాకే షాకింగ్ గా ఉంది , నీ ఇష్టం బాబూ .....
విశ్వ సర్ ...... నా పేరు మహేష్ .
విశ్వ సర్ : రియల్ హీరో అన్నమాట .....

సేట్ - పార్టనర్స్ ...... మీ మాటల్లో న్యాయం ఉంది అదిగో అక్కడ లాఠీలు ఉన్నాయి మిమ్మల్ని ఎవ్వరూ ఆపరు .
దెబ్బల నొప్పి రుచిచూసినట్లు తిక్కరేగి లాఠీలు అందుకుని CI తోపాటు సహాయం చేసిన కానిస్టేబుళ్లకు లాఠీ దెబ్బల రుచి చూయించారు .
అంకుల్ వాళ్ళ పెదాలపై నవ్వులు ......

అలసిపోయి ఆగిపోయారు .
CI సర్ ..... మీడియాను .....
CI : బాబూ బాబూ వద్దు వద్దు అంటూ వేడుకుంటున్నారు .
మీవలన మీ భార్యాబిడ్డలు అవమానం చెందడం నాకిష్టం లేదు - మరొక్కసారి ఇలా జరిగితే ఊరుకోను - ఇప్పటివరకూ మీరు మోసం చేసిన వారందరికీ క్షమాపణ చెప్పి న్యాయం చెయ్యాలి , నిజాయితీగా ఉండే విశ్వ సర్ కు రెస్పెక్ట్ ఇవ్వాలి .
CI : తప్పకుండా బాబూ ......
పార్ట్నర్స్ ....... అంకుల్ వాళ్ళు ఈరోజు బెంగళూరులో ఏదైతే వారి కష్టానికి ప్రతిఫలాన్ని పొందేవారో అది రేపు ఉదయానికల్లా వారి చెంతకే చేరాలి , మీరు చేసిన మోసాన్ని అక్కడ తెలియజేసి వారి స్థాయిని వారికి ఇవ్వాలి , లేదంటే తెలుసుగా ....... మీ హిస్టరీ అంతా మాదగ్గర ఉంది .
పార్ట్నర్స్ : నువ్వు చెప్పినట్లుగానే చేస్తాము బాబూ ..... అబ్బా అయ్యా నొప్పి .
ఇక సేట్ నువ్వు ...... నీకు రావాల్సిన డబ్బు వడ్డీతోసహా నీ అకౌంట్ లోకి పడిపోయింది , ఏమిచెయ్యాలో తెలుసుకదా ......
సేట్ : రేపటి లోపు ఆస్తిపత్రాలు - నగలు ......
రేపటి లోపు కాదు నిమిషాలలో ఇంటికి తీసుకెళ్లి క్షమాపణ చెప్పి అందివ్వాలి .
సేట్ : నిమిషాలలో అంటే కుదరదు బాబూ ...... బ్యాంకు లాకార్లో ఉన్నాయి అందుకే ....
సరే వీలైనంత తొందరగా ఈరోజే , నీ చేతులు తాకి మలినం అయి ఉంటాయి కాబట్టి కొత్త నగలలా క్లీన్ చేసి జ్యూవెలరీ బాక్సస్ లో ఉంచి తీసుకురావాలి .
సేట్ : తప్పకుండా తప్పకుండా బాబూ .....
ఇంకా ఇక్కడే ఉన్నారే , మరొక కోటింగ్ ఏమైనా కావాలా ...... ? .
PT ఉషలా బయటకు పరుగులుతీశారు దెబ్బలను రుద్దుకుంటూ .......

అంకుల్ వాళ్లకు వారి లగేజీ - మొబైల్ - పర్సులను ఇచ్చారు సెక్యూరిటీ ఆఫీసర్లు , మీపై ఎటువంటి కేసులూ లేవు మీరు వెళ్ళవచ్చు అనిచెప్పారు .
అంకుల్ కళ్ళల్లో ఒక్కసారిగా కన్నీళ్లు ...... , ముగ్గురూ నాదగ్గరకు చేరుకుని బాబూ ...... నువ్వు ఎవరోకూడా తెలియదు కానీ సమయానికి దేవుడిలా వచ్చి పెద్ద గండం నుండి కాపాడావు - మా కుటుంబాల గురించి ఆలోచిస్తేనే చెమటలు పట్టేస్తున్నాయి - మాకోసం వారు అన్నీ వదులుకున్నారు - మాతప్పు కూడా ఉంది కుటుంబం గురించి పట్టించుకోకుండా బిజినెస్ బిజినెస్ అంటూ సంవత్సరం మొత్తం ఇలా తిరుగుతూనే వాళ్ళనూ బాధపెట్టాము - మా బిజినెస్ ఆశల వలన వాళ్లకు చిన్న చిన్న సంతోషాలను కూడా దూరం చేసాము - ఇక జైలు పాలయ్యాము అని తెలిస్తే ....... , ఇదిగో ఉదయం నుండీ చాలాసార్లు కాల్స్ చేశారు .
నో నో నో అంకుల్స్ ఈ విషయం ఎప్పటికీ అంటీ వాళ్లకు తెలియకూడదు - వాళ్ళు బాధపడితే అక్కయ్యలు ( నేను ) తట్టుకోలేను , అనాధగా ఉన్న నాకు అంటీ వాళ్లే కదా కుటుంబం ఉందనేలా చేశారు .
అంకుల్స్ : మా బిడ్డలు కూడా తెలుసా ..... ? .
తెలుసా అంటారు ఏంటి అంకుల్స్ ...... అక్కయ్యలే కదా రోజూ కాలేజ్ వరకూ వదిలేది , ( నాకు ...... అంటీలు అంటే ఎంతప్రాణమో - అక్కయ్యలకు ..... నేనంటే అంత ఇష్టం అంటూ నవ్వుకున్నాను ) .
అంకుల్స్ : సంతోషించి , నీ ఎలా రుణం తీర్చుకోవాలో కూడా తెలియదు బాబూ .......
అదిగో మళ్లీ ...... , నేనే ..... అంటీవాళ్లకు ఋణపడిపోయాను , మీరు మాత్రం ఈ విషయం అంటీ వాళ్లకు తెలియనివ్వకూడదు , ఎవరికి కాల్ చేస్తున్నారు ? అంటీ వాళ్లకేనా ....... నో నో నో సరే సరే చెయ్యండి కానీ బెంగళూరు నుండి మాట్లాడుతున్నట్లు మాట్లాడండి , ఈ బాధపెట్టే విషయం అంటీ వాళ్లకు ఎప్పటికీ తెలియకూడదు అంటే - నారుణం తీర్చుకోవాలి అంటే మీరు వెంటనే బెంగళూరుకువెళ్లి మీ బిజినెస్ స్టార్టప్ ప్రయత్నాలు మొదలుపెట్టండి - బయట కారు రెడీగా ఉంది కారులో ఫ్లైట్ టికెట్స్ ఉన్నాయి నెక్స్ట్ ఫ్లైట్ కు బెంగళూరు వెళ్లిపోండి .
అంకుల్స్ : మళ్లీ మాగురించే ఆలోచిస్తున్నావు నిజంగా మాకోసం వచ్చిన దేవుడివి బాబూ ..... , దాదాపు కోటికిపైగా అప్పు చేసాము .....
తీర్చేసాము అంకుల్స్ ......
అంకుల్స్ : ఇప్పట్లో తిరిగి ఇవ్వగలమో లేదో మళ్లీ ఇప్పుడు ఫ్లైట్ టికెట్స్ అమౌంట్ .......
బిజినెస్ స్టార్టప్ సక్సస్ అయ్యింది కదా అంకుల్స్ తీర్చడం ఎంతసేపు .....
అంకుల్స్ : ఖచ్చితంగా ఖచ్చితంగా బాబూ ..... ప్రతీ రూపాయీ తీర్చేస్తాము .
మళ్లీ ఆ టెన్షన్ పెట్టుకోకండి - మీ ఆరోగ్యాలు జాగ్రత్త ......
అంకుల్స్ : బాబూ బాబూ బాబూ ...... అంటూ రెండుచేతులూ జోడించారు .
అంకుల్స్ ఆపండి ఆపండి , మిమ్మల్ని వైజాగ్ లో ఎవరైనా గమనించకముందే వెళ్లిపోవాలి , అంటీ వాళ్ళ గురించి ఏమీ కంగారుపడకండి , ఎదురింటిలోనే నేనుంటాను .
అంకుల్స్ : దేవుడే తోడు ఉన్నాడు అంటూ సంతోషాన్ని వ్యక్తం చేసి లగేజీ అందుకున్నారు .
అంకుల్స్ ...... వస్తున్నప్పుడు చూసాను దగ్గరలోనే క్లినిక్ ఉంది ట్రీట్మెంట్ తీసుకుని బయలుదేరండి , అంటీ వాళ్లకు విషయం తెలియకూడదు మరొక ముఖ్య విషయం దెబ్బలు మానిపోయేంతవరకూ వీడియో కాల్ మాత్రం చేయకండి .
అంకుల్స్ : మా కుటుంబాలు అంటే అంత ఇష్టమా మహేష్ .....
ఇష్టం అన్నది చాలా చాలా చాలా చిన్నది అంకుల్స్ ...... అంటూ హృదయంపై చేతినివేసుకున్నాను , వారి సంతోషం కోసం ఏమైనా చేస్తాను ఎంతదూరం అయినా వెళతాను , హ్యాపీ జర్నీ అంకుల్స్ ......
అంకుల్స్ : థాంక్యూ మహేష్ అనిచెప్పి సంతోషంగా బయలుదేరారు .

విశ్వ సర్ వైపుకు తిరిగి సెల్యూట్ చేసాను .
విశ్వ సర్ : నో నో నో ..... నేనే నీకు సెల్యూట్ చెయ్యాలి మహేష్ , CI గారినే గడగడలాడించావు , ఇంతవరకూ షాక్ లో ఉన్నానంటే నమ్ము , ఇంతచిన్న వయసులో ..... నీ ధైర్యం నీ కాన్ఫిడెన్స్ ...... సెల్యూట్ మహేష్ .
సర్ సర్ ..... నన్ను నమ్మి నాప్రక్కన నిలబడ్డారు , మీలాంటి సెక్యూరిటీ ఆఫీసర్లు ఉన్నంతకాలం న్యాయం ధర్మం బ్రతికే ఉంటాయి .
విశ్వ సర్ : నా డ్యూటీ నేను చేసాను , నువ్వు ఉన్నావుకాబట్టి చెయ్యగలిగాను లేకపోతే తప్పుడు కేసులు పెట్టారని తెలిసినా ఏమీచెయ్యలేకపోయేవాడిని ......
సంతోషించాను , సర్ ..... అతి ముఖ్యమైన పనిమీద వెళుతున్నాను got to go .......
విశ్వ సర్ : మహేష్ ..... ఎలాగైనా మళ్లీ కలుస్తాను , వెళ్లు వెళ్లు ......
సర్ కు బై చెప్పేసి పరుగునవెళ్లి కారులో కూర్చుని , సిస్టర్ 2:30 త్వరగా పోనివ్వండి పోనివ్వండి .

ట్రాఫిక్ దాటుకుని ఇంటికి చేరుకునేసరికి అర గంట పట్టింది , అంటీ ఇంటిముందు రోడ్డుపై పెద్దమొత్తంలో జనాలు గుమికూడి ఉండటం - JCB లు కూడా ఉండటం చూసి , సిస్టర్ సిస్టర్ స్టాప్ స్టాప్ అంటూ ఆగకముందే డోర్ తీసుకుని దిగి పరుగునవెళ్ళాను .
జనాలను దాటుకునివెళ్ళిచూస్తే ఇంట్లోని సామానులన్నీ బయటపడేశారు - JCB ఏక్షణమైనా కాంపౌండ్ గోడను కూల్చడానికి రెడీగా ఉంది .
అంటీ అంటీలు అంటీలు ఎక్కడ అని చుట్టూ చూస్తే , మెయిన్ డోర్ దగ్గర లేడీ కానిస్టేబుళ్లు ...... మేడమ్ మేడమ్ డోర్ తెరిచి బయటకు రండి లేకపోతే మీరు ఉండగానే కూల్చేస్తారు .
సరిగ్గా చెప్పారు కానిస్టేబుల్స్ .... , ప్రజలారా ...... మాతప్పేమీ లేదు - ఈ ఇంటి యజమానులు అడ్వాన్స్ తీసుకుని మా పేరున రాశారు - కోర్ట్ ఆర్డర్ ప్రకారం ఈ బిల్డింగ్ కూల్చివేసి మాల్ నిర్మించబోతున్నాము , మీరే చూశారుకదా ఇంతవరకూ ఎంతో రిక్వెస్ట్ చేసుకున్నాము , ఇక wait చేయలేము , కానిస్టేబుల్స్ ..... డోర్ బద్ధలుకొట్టి బయటకు లాగేయ్యండి రాకపోతే వాళ్ళుండగానే కూల్చేయడం తప్ప మరొక మార్గం లేదు అంటూ JCB వైపు సైగచేశాడు .

అంటీ వాళ్ళ గురించి అలా మాట్లాడగానే కోపం కట్టలు తెంచుకుంది - అంటీలు ఉండగానే కూల్చేస్తావా అంటూ వాడిని అక్కడికక్కడే పాతేయాలని అనిపించినా కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాను , JCB కు అడ్డంగా వెళ్లి ఆపమని సైగచేసాను .
ఆపకుండా నామీదకు దూసుకురావడంతో రాయి అందుకుని JCB అద్దం పగిలేలా విసిరాను - జేసీబీ ఆగింది .
ఇంతమంది ఊరికే నిలబడి చూస్తుంటే నువ్వేవాడివిరా బచ్చా అంటూ ఒకడు వచ్చి కాలర్ పట్టుకున్నాడు .
ఈ సామానులు బయటపారేసింది ......
మేమే ...... , మామూలుగా అయితే డ్యామేజ్ కాకుండా బయట ఉంచాలి కానీ కావాలనే సామానులన్నింటినీ పైనుండి విసిరేసాము అంటూ నవ్వుకుంటున్నారు .
ఇక కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం నావల్ల కాలేదు , జై పెద్దమ్మ అంటూ నా షర్ట్ పై ఉన్న చేతిని పట్టి తిప్పేసి నొప్పితో కేకలువేస్తున్న వాడి చేతిని విరిచేసాను - ఇవే చేతులతో కదా సామానులు పగిలిపోయేలా విసిరినది .
వాడి అరుపులకు అక్కడున్నవాళ్ళంతా బెదిరిపోయారు .

చూస్తారే ఆ బచ్చా గాడిని కొట్టి ఈడ్చి పడేయ్యండి .
చెరొకవైపునుండి ఇద్దరు వచ్చారు - ఆగండి ఆగండి మిమ్మల్ని కొట్టడం చాలా అంటే చాలా ఈజీ - బచ్చా గాడే అనుకున్నారో మీకంటే దున్నపోతులా ఉన్నవాడి ఒకచేతిని మాత్రమే విరిచేసాను మీరెండు చేతులూ విరిచేస్తాను మీఇష్టం ......
చెయ్యి విరిగినవాడు నొప్పితో విలవిలలాడిపోతూనే వచ్చి వద్దురా వద్దురా అంటూ ఇద్దరినీ ఆపాడు .
రేయ్ బచ్చాగాడికి భయపడుతారేంటి ......
ఎప్పుడూ పనివాళ్లే దెబ్బలు తినాలా ..... ఈసారికి నువ్వు వచ్చెయ్యి ......
అంత పోటుగాడివా ..... ? .
పోటుగాడే సర్ అంటూ చెయ్యి విరిగినవాడు చెప్పాడు .
మనగురించి మనం కాకుండా వేరేవాడు భయపడుతూ చెబితే కలిగే కిక్కే వేరబ్బా ....... నవ్వుకున్నాను .
ఏంటి బెదిరిస్తున్నావా ...... ? , ఈ ఇల్లు ....... నాది నాకు రాసిచ్చారు - కోర్ట్ కూడా కూల్చడానికి అనుమతి ఇచ్చింది - చూశావుకదా స్వయంగా సెక్యూరిటీ ఆఫీసర్లే వచ్చారు .
ఏదీ చూయించు ......
ఏమి చూయించాలి ? .
రాసిచ్చిన పత్రాలు మరియు కోర్ట్ ఆర్డర్ .......
అవీ అవీ అంటూ నసుగుతున్నాడు , నావెనుక రౌడీలే కాదు CI ఉన్నాడు , ఒక్క కాల్ చేశానంటే ......
చెయ్యి చూస్తాను ......
ఒక్క కాల్ తో పిల్లల జైల్లో పడతావు అంటూ మొబైల్ తీసి కాల్ చేసాడు .

అవసరం లేదు ఇక్కడే ఉన్నాను అంటూ ఏకంగా సేట్ తోపాటు వచ్చాడు CI .....
సర్ సర్ చూడండి మనకే అడ్డువస్తున్నాడు .
CI : మనకు ఏంటి మనకు అంటూ చెంప చెల్లుమనిపించాడు , మేము న్యాయం వైపు అంటూ నా వెనుకకు చేరారు , సేట్ ఈ విషయం కాల్ చేసి చెప్పగానే పరుగున విచ్చేసాము బాబూ ...... , నువ్వు అన్నట్లుగా నా ఫ్యామిలీ గురించి ఆలోచిస్తేనే నేనెంత పెద్ద తప్పుచేసానో తెలిసొచ్చింది , నావలన వారు ...... తలుచుకుంటేనే భయం వేసింది నన్ను మన్నించు బాబూ , కానిస్టేబుల్స్ వచ్చెయ్యండి అంటూ పిలిచాడు .
సేట్ ..... అడ్వాన్స్ తీసుకున్నావు కదా .....
సేట్ : వడ్డీతోసహా అడ్వాన్స్ అమౌంట్ ను కొద్దిసేపు ముందే నీ అకౌంట్ లోకి వేసేసాను , ఈ బిల్డింగ్ ఎప్పటికీ నీకు దక్కదు ఇక వెళ్లిపో , బాబూ ..... ఆస్తిపత్రాలు .
మరి నగలు ...... ? .
సేట్ : నా బెస్ట్ వర్కర్స్ చేత కొత్తగా మారిపోతున్నాయి బాబూ - క్లీనింగ్ పూర్తవగానే నేనే స్వయంగా తీసుకొస్తాను - ఈ విషయం గుర్తుకురాగానే సర్ ను వెంటబెట్టుకుని వచ్చేసాను .
మంచిది సేట్ జీ ......

CI సర్ జేసీబీ లతోపాటు అందరినీ పంపించేస్తున్నాడు .
CI సర్ ..... సామానులు ? .
CI : వీరిచేతనే లోపల పెట్టిస్తాను బాబూ ......
డ్యామేజీ అయ్యాయే ఎలా ..... ? .
CI : వాడికి పనిష్మెంట్ ఇద్దాము బాబూ ..... చీకటిపడేలోపు వీటి స్థానంలో కొత్తవి తెప్పించి నేనే దగ్గరుండి చక్కగా సర్ధిస్తాను .
థాంక్యూ సర్ ....... , ఇలాంటి ఒకటి జరిగింది అనే ఆనవాళ్లు కూడా ఉండకూడదు .
CI : నేను చూసుకుంటాను , ఇలా అయినా చేసిన పాపాల నుండి విముక్తి పొందుతానేమో , నీకే చాలా చాలా థాంక్స్ , నా పిల్లలు ..... నన్ను ఇలానే చూడాలన్న ఆశను బ్రతికించావు అంటూ సెల్యూట్ చేశారు .

సేట్ గారూ ...... మీరు కొద్దిసేపటి ముందే మారిపోయారు కానీ ఈ అపరాధం మీవల్లనే జరిగిపోయింది మరి .......
సేట్ : ఎలా సరిదిద్దాలో నాకర్థమైపోయింది బాబూ ...... , CI సర్ రండి .
సేట్ గారూ ..... అంకుల్ వాళ్ళ వల్లనే , బెంగళూరు నుండే అమౌంట్ పంపించారు అనే నమ్మించి మన్నింపు కోరుకోవాలి .
సేట్ : మీరెలా అంటే అలా బాబూ .....
CI : ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యిందని మేడమ్ వాళ్లకు తెలియజేయ్యండి అంటూ లేడీ కానిస్టేబుల్స్ కు ఆర్డర్ వేశారు .

కానిస్టేబుల్స్ : మేడమ్ మేడమ్ ...... ఇక ఇంటి జోలికి ఎవ్వరూ రారు , జేసీబీ లు వెళ్లిపోయాయి , దయచేసి డోర్ తెరవండి , మీరే గెలిచారు .
అంటీవాళ్ళు కిటికీ దగ్గరకువచ్చి బయట మొత్తం చూసి , మమ్మల్ని బయటకు రప్పించడానికి వేసిన ప్లాన్ ......
కానిస్టేబుల్స్ : నో నో నో మేడమ్ - అంటే ఇప్పటివరకూ జరిగినది చూడలేదా మేడమ్ , రౌడీలంతా గజగజవణికిపోతుంటే ఇంకెక్కడి ప్లాన్ , మీకు క్షమాపణ చెప్పడానికి సేట్ మరియు మా CI సర్ వచ్చారు .
సేట్ : అవునండీ ...... , మీ వారు .... నాకివ్వాల్సిన అమౌంట్ ఇచ్చేసారు ఇదిగోండి ఇంటి పత్రాలు తిరిగివ్వడానికి వచ్చాను , తలుపు తెరవండి .

భయపడుతూనే డోర్ తెరిచారు అంటీవాళ్ళు ......
మమ్మల్ని మన్నించండి , ఆలస్యం అయ్యుంటే దేవాలయం లాంటి ఇంటిని పడగొట్టేసేవాళ్ళం , దేవుడి దయవలన అంటూ నావైపుకు తిరిగిచూసి అలాంటిదేదీ జరగలేదు .
ఊహూ అంటూ సైగచేసాను .
సేట్ : నాతప్పును మన్నించి దేవాలయం లాంటి ఇంటిపత్రాలను తీసుకోండి అంటూ అంటీవాళ్ళ పాదాల ముందు ఉంచి తలదించి చేతులుకట్టుకుని నిలబడ్డాడు .
CI : ఈ అపరాధంలో నా హస్తం కూడా ఉన్నందుకు మన్నించమని కోరుకుంటున్నాను - కానిస్టేబుల్స్ ...... ఇంకా జనాలు ఎందుకున్నారు క్లియర్ చెయ్యండి - ప్రక్కవాళ్ళు బాధపడుతుంటే చూసి ఎంజాయ్ చెయ్యడానికి పనులన్నీ మానుకుని వచ్చేస్తారు - ఇరుగుపొరుగువారు కదా హెల్ప్ చేద్దామని కానీ బాధను పంచుకుందామని కానీ చెయ్యరు - కళ్ళుమూసి తెరిచేలోపు ఉంటే లాఠీలు విరగ్గొట్టoడి .
కానిస్టేబుల్స్ : Yes సర్ ......
సినిమా అయిపోయాక ఇంకెందుకు ఉంటాము అంటూ వెళ్లిపోయారు .
ఎవరైతే సామానులన్నీ బయటకు విసిరేశారో వాళ్ళ చేతనే క్లీన్ చేయిస్తున్నారు .
సేట్ : CI గారూ ..... నాకిచ్చిన పని ఇంకా పూర్తవ్వలేదు వెళ్ళొస్తాను అనిచెప్పి వెళ్ళాడు .

అంటీ వాళ్ళు : ఇంటి పత్రాలను చూసి ఆనందిస్తున్నారు .
మొత్తానికి అంకుల్స్ సాధించారు అంటీలూ ..... అంటూ మెయిన్ గేట్ దగ్గరనుండే వారి ఆనందాలను చూసి మురిసిపోతున్నాను .
అంటీ వాళ్ళు : ఒక్కరోజులో ఇంతపెద్దమొత్తంలో డబ్బు ఎలా పంపించగలిగారో ఆశ్చర్యంగా ఉంది , జనాలలో నువ్వూ ఉన్నావన్నమాట ......
ఏమిచెయ్యాలో తెలియక - రౌడీల్లాంటి వాళ్ళను చూసి భయంతో దాక్కున్నాను అంటీలూ ......
మెయిన్ గేట్ దగ్గర సామానులను తీసుకుంటున్న ఇద్దరు ...... నామాటలకు షాక్ లో ఉండిపోయారు .
వెళ్ళండి వెళ్ళండి అంటూ చిన్నగా చెప్పాను .
భయంతో వెళ్లిపోయారు .
అంటీ వాళ్ళు : చూస్తే అలా అనిపించడం లేదే ......

అవును అంటీలూ ..... మీరు చాలా ధైర్యస్తులే , ఇంటిని కూల్చేస్తామని చెప్పినా ధైర్యంగా లోపలే ఉన్నారు .
అంటీలు : దైర్యంగానా ..... ? , భయంతో వణికిపోయి ఒకరినొకరు కౌగిలించుకుంటేనూ ......
ప్చ్ ...... ఆ కౌగిళ్ళల్లో నేనుంటే ఎంత బాగున్నో ......
అంటీలు : ఏంటీ .......
నథింగ్ నథింగ్ అంటీ ...... , ఇంటిని కూల్చేస్తారేమోనని ఏడ్చినట్లుగా ఉన్నారు - ఇల్లు దేవాలయంతో సమానం అనుకుంటాను .
అంటీలు : చాలా ఇష్టంతో మూడు కుటుంబాలూ కలిసి కట్టుకున్నది , నువ్వు చెప్పినట్లు మాకు దేవాలయమే ...... , మీ అక్క ..... మా తల్లులకు కూడా చాలా చాలా ఇష్టం , వాళ్ళు చేతికొచ్చినది ఈ ఇంటిలో గృహప్రవేశం చేసిన తరువాతనే .... , అయినా నీకెందుకు చెబుతున్నాము .
అడగకపోయినా మీరే చెబుతున్నారు అంటీలూ అంటూ నవ్వుకున్నాను - మీరు హ్యాపీ సో నేనూ హ్యాపీ ......
అంటీలు : తల్లులు వచ్చేలోపు ఇలా జరిగిందన్న ఆనవాళ్లే ఉండకూడదు - వారికి తెలిస్తే బాధపడతారు .
అలా జరగదులే అంటీలూ ...... CI సర్ స్వయంగా పని పూర్తి చేయిస్తారని అంటుంటే విన్నాను .
అంటీలు : నువ్వెంటీ ఈ సమయంలో ఇక్కడ కాలేజ్ కు వెళ్లలేదా ? .

మీ సహాయం కోసం వచ్చాను అంటీలూ ......
అంటీలు : అనుకున్నాము ఏదో ఒకటి ఉంటుందని , ఏంటి విషయం ......
టైం చూసుకుని థాంక్ గాడ్ , అంటీలూ ...... కొద్దిసేపు మీరు నాతోపాటు రావాలి .
అంటీలు : ఏంటీ ...... నీతో మాట్లాడటమే ఇష్టం లేదు - నువ్వంటేనే ఇష్టం లేదు నీతోపాటు బయటకు రావాలా , కుదరదంటే కుదరదు .
ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ అంటీలూ ...... ఈ ఒక్కసారికి ప్లీజ్ ప్లీజ్ ఆ తరువాత మీరేమి చెయ్యమన్నా చేస్తాను .
అంటీలు : లేదు లేదు లేదు ...... , ఏంటీ ఏమి చెయ్యమన్నా చేస్తావా ? .
ఏమైనా చేస్తాను అంటీలూ ...... చిన్న ఆశ .
అంటీలు : ఇక్కడ నుండి వెళ్లిపోవాలి .
కన్నీళ్లు .......
అంటీలు : వద్దు వద్దు వద్దు ..... , మన ఇంటి నుండి వెళ్ళిపొమ్మన్నప్పుడు ఇలానే కన్నీళ్లు వచ్చాయి , ఎవరికైనా ఇల్లు ఇల్లే కదా ...... , sorry sorry మహేష్ .....
లవ్ ...... థాంక్యూ థాంక్యూ సో మచ్ అంటీలూ ( మిమ్మల్ని వదిలి వెళ్లడం అంటే ఒక ప్రాణం ఆగిపోయినట్లే ) .
అంటీలు : గుసగుసలాడుకుని , ఇకనుండీ రోజూలా మమ్మల్ని డిస్టర్బ్ చెయ్యకూడదు మాతో మాట్లాడటానికి ప్రయత్నించకూడదు మరియు మా తల్లుల స్కూటీలలో వెళ్లకూడదు మొత్తంగా వాళ్ళ దగ్గరికి వెళ్లకూడదు మాట్లాడకూడదు కూడా , తల్లులకు ..... నువ్వంటే ఇష్టం వాళ్ళు మాట్లాడటానికి ప్రయత్నించినా నువ్వు ప్రక్కకు వెళ్లిపోవాలి .
కళ్ళల్లోనుండి ధారలా కారిపోతున్నాయి కన్నీళ్లు - సమయం గడిచిపోతోంది - అమ్మమ్మకు ..... దేవతలను తీసుకొస్తానని మాటిచ్చాను , కన్నీళ్లను తుడుచుకుని అంటీలూ ...... వేరే మార్గం లేదా ? .
అంటీలు : మహేష్ కళ్ళల్లో కన్నీళ్లు ...... మనమంటే అంత ఇష్టమా ? , లేదు లేదు నటన , అవును వేరే మార్గం లేదు .
తన్నుకొస్తున్న కన్నీళ్లను తుడుచుకుని సరే అంటీలూ ..... మీరు కోరినట్లుగానే ప్రవర్తిస్తాను అంటూ మళ్లీ కన్నీళ్లను తుడుచుకున్నాను .
అంటీలు : మహేష్ కన్నీళ్లను చూస్తుంటే కోరకూడనిది ఏమైనా కోరామా అంటూ ఫీల్ అవుతున్నారు , సరే పద మరి - తల్లులు వచ్చే సమయం వాళ్ళు వచ్చేలోపు వచ్చేయ్యాలి .
ఇలాకాదు అంటీలూ ...... శుభకార్యానికి వెళ్లే దేవతల్లా పట్టుచీరలలో ......
అంటీలు : పట్టుచీరలలో దేవతల్లా ..... నో నో నో ఆడిగావు ఒప్పుకున్నాము అంతే ఇలానే వస్తాము .
( మిమ్మల్ని ఎలా ఒప్పించాలో నాకు తెలియదా దేవతలూ ..... ) అయితే రోజులా కాకుండా మిమ్మల్ని కవ్విస్తాను - ఇక నేనంటే ఇష్టమైన అక్కయ్యలతో అయితే .....
అంటీలు : Ok ok ok అర్థమయ్యింది నువ్వు చెప్పినట్లుగానే చేస్తాము - నవ్వైతే మాట తప్పకూడదు .
హృదయంపై చేతినివేసుకున్నాను .
అంటీలు : ఇక్కడే wait చెయ్యి .....
ఎంతసేపు అంటీలూ ......
అంటీలు : మాకు మామూలుగా అంటేనే ఆలస్యం అవుతుంది ఇక పట్టుచీరలలో దేవతల్లా అన్నావుకదా ...... ఎంతసేపైనా అవ్వవచ్చు .
Understood understood అంటీలూ ..... టేక్ your own టైం , వెళ్ళండి వెళ్ళండి .
రెడీ అవ్వడం అంటే ఏంటో అనుకున్నాడు అంటూ నవ్వుకుంటూ వాళ్ళ వాళ్ళ ఇళ్ల లోపలికివెళ్లి డోర్ లాక్ చేసుకున్నారు .

యాహూ ...... పెద్దమ్మ సహాయం లేకుండానే ఒప్పించాను ఎంతైనా నువ్వు గ్రేట్ రా అంటూ హృదయంపై ముద్దుపెట్టుకున్నాను .
బుగ్గపై పంటిగాటు ......
స్స్స్ ..... లవ్ యు పెద్దమ్మా .....
(మనసులో
పెద్దమ్మ : జేసీబీ కు అడ్డుగా నిలబడి హీరోలా ఇంటిని సేవ్ చెయ్యడం మీ అంటీలు చూసి ఉంటే ఈజీగా ఒప్పుకునేవారు కదా ......
పెద్దమ్మ : కదా అంటూ నన్ను అడుగుతున్నారా ..... ? , అంతసేపూ అంటీ వాళ్ళను లోపలే ఉండేలా చేసింది ఎవరు ? .
లవ్ యు లవ్ యు ..... అయినా నేనేమి చేసినా నా ముద్దులకన్నయ్య కోసమే అంటూ ముద్దుపెట్టారు .
అయితే ok పెద్దమ్మా ......
పెద్దమ్మ : అవునూ ..... శాస్త్రం ప్రకారం ఐదుగురితో స్నానం చేయించాలని కదా అమ్మమ్మ అన్నది , అక్కడ నీ ప్రియమైన దేవత మేడమ్ ఇక్కడ ప్రియాతిప్రియమైన ముగ్గురు దేవతలు ...... మరి ఐదవ దేవత ఎవరు ? .
బదులివ్వకుండా ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నాను .
పెద్దమ్మ : బదులివ్వకుండా నవ్వుతావే కన్నయ్యా ..... నాకైతే కంగారు వచ్చేస్తోంది .
మళ్లీ బదులివ్వకుండా నవ్వుతూనే మొబైల్ తీసి , కొద్దిసేపట్లో వచ్చేస్తున్నాము అమ్మమ్మా అంటూ మెసేజ్ పెట్టాను .
పెద్దమ్మ : నలుగురే కదా కన్నయ్యా ..... , నవ్వడమే కాకుండా అమ్మమ్మకు మెసేజ్ కూడా పెట్టేశావు .
బై అమ్మమ్మా ..... చాలా పనులున్నాయి అంటూ నా హృదయంలోని పెద్దమ్మకు ముద్దుపెట్టి , CI సర్ దగ్గరకు వెళ్ళాను ) .

CI సర్ : బాబూ ...... సామానులన్నీ లిస్ట్ తీసుకున్నాను , డ్యామేజ్ చేసిన వాడితోనే అన్నింటినీ తెప్పిస్తున్నాను .
థాంక్యూ సర్ ...... , నేనూ దగ్గరుండి చూసుకోవాల్సింది కానీ ముఖ్యమైన చోటుకు వెళ్ళాలి .
CI సర్ : నేను చూసుకుంటాను బాబూ ......
థాంక్యూ సర్ ......

మొబైల్ రింగ్ అవ్వడంతో చూస్తే నా హృదయస్పందన బుజ్జిజానకి ..... , ఎస్క్యూస్ మీ సర్ అంటూ పెదాలపై తియ్యదనంతో చెట్టు నీడకు చేరాను .
ఎత్తి హలో అన్నాను .
బుజ్జిజానకి : హలో ఏంటి హలో ..... ఇంతసేపు ఎక్కడికి వెళ్లిపోయావు , నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను తొందరగా రా ......
అఅహ్హ్ ..... టచ్ చేసావు బుజ్జిజానకీ , మనసు - హృదయం పరవళ్లు తొక్కుతోంది అంటే నమ్ము లవ్ ..... థాంక్యూ సో మచ్ , మా అందమైన బుజ్జిజానకిని రెడీ చేయించడం కోసం ఏకంగా దివినుండి దిగివచ్చిన దేవతలనే వెంటబెట్టుకుని వస్తున్నాను , మరింత సమయం పట్టేలా ఉంది .
బుజ్జిజానకి : మరింత సమయమా ...... మహేష్ ......
నేనూ ఆ దేవతలను ఇదే విషయం అడిగాను , వారేమన్నారో తెలుసా ...... దివినుండి దిగివచ్చిన బుజ్జిదేవత బుజ్జిజానకిని రెడీ చెయ్యాలంటే మేమూ దేవతల్లా రెడీ అవ్వాలికదా అన్నారు .
బుజ్జిజానకి : పో మహేష్ సిగ్గేస్తోంది , నన్నూ టచ్ చేసావు తెలుసా ...... లవ్ యు .... థాంక్యూ సో సో మచ్ అంటూ ఎంజాయ్ చేస్తున్నట్లు నవ్వులు ......
నాకు తెలిసి అమ్మనే ఆ దేవతలను వారి బుజ్జిదేవత కోసం పంపిస్తున్నారేమో ......
బుజ్జిజానకి : నిజమా మహేష్ ...... , ఆనందబాస్పాలు ఆగడం లేదు మహేష్ , నువ్వు త్వరగా వచ్చెయ్యి ......
ఆ దేవతలు రెడీ అయిన మరుక్షణమే నీముందు ఉంటాము అంటూ సమయాన్ని మరిచిపోయాము సంతోషమైన మాటలలో ........

మహేష్ మహేష్ .......
వెనక్కు తిరిగి అలా కన్నార్పకుండా చూస్తుండిపోయాను , ఎరుపు రంగు పట్టుచీరతో వాసంతి అంటీ - గులాబీ రంగు చీరలో సునీత అంటీ - గ్రీన్ కలర్ పట్టుచీరలో కాంచన అంటీ ...... నిజంగానే దివినుండి దిగివచ్చిన దేవతల్లా ఉన్నారు .
హలో హలో మహేష్ అంటూ మొబైల్లో బుజ్జిజానకి - మహేష్ మహేష్ మహేష్ .... అంటూ మెయిన్ గేట్ దగ్గర ముగ్గురు అంటీల పిలుపులకు తేరుకున్నాను .
అంటీలను కన్నార్పకుండా హృదయమంతా నింపుకుంటూనే , బుజ్జిజానకీ ..... కొద్దిసేపట్లో వచ్చేస్తున్నాము లైన్లోనే ఉండు .......

లేడీ కానిస్టేబుల్స్ : బాబూ ..... నువ్వు మొబైల్లో మాట్లాడుతుంటే డిస్టర్బ్ చెయ్యడం ఇష్టం లేక CI సర్ మాకు చెప్పి వెళ్లారు , కొద్దిసేపట్లో కొత్త ఫర్నిచర్ తోపాటు వస్తారట - అందరినీ తీసుకెళ్లారు .
థాంక్యూ కానిస్టేబుల్స్ అనిచెప్పి టైం చూసి పర్ఫెక్ట్ అనుకుంటూ అంటీవాళ్ళ దగ్గరికి పరుగుతీసాను .
అంటీలు : ఏంటి అలా చూస్తున్నావు కొరుక్కుని తినేసేలా ......
అంతకంటే అదృష్టమా అంటీలూ ..... ఆ అదృష్టం ఎప్పుడో ఏమిటో ......
అంటీలు : ఏమిటీ .......
నథింగ్ నథింగ్ అంటీలూ ..... , పట్టుచీరలలో దివినుండి దిగివచ్చిన దేవతల్లా ఉన్నారు సో సో సో బ్యూటిఫుల్ , రెండు కళ్ళూ చాలడం లేదంటే నమ్మండి .
అంటీలు : ఇదిగో ఇవే తగ్గించుకుంటే మంచిది .
నాకున్నదే ఈకొద్దిపాటి సమయం , తరువాత ఎలాగో పొగడటం కుదరదు కదా .....
అంటీలు : కుదరదా .... ప్చ్ ప్చ్ ప్చ్ ......
అంటే మీకు ఇష్టమేనా ...... ? .
అంటీలు : నో నో నో ..... అయినా పొగడ్తలంటే ఏ అమ్మాయికి ఇష్టం లేదో చెప్పు ....
అఅహ్హ్ ...... యాహూ యాహూ అంటూ ఫీల్ అవుతున్నాను నవ్వుకుంటున్నాను .
అంటీలు : సందు దొరికితే చాలు రయ్యిన దూరిపోతావు , ఈ కొద్దిసేపే కదా తరువాత ఎలాగో కుదరదు , మాటిచ్చావు గుర్తుంది కదా , సరే పద మరి ......

Something is మిస్సింగ్ అంటీలూ ...... , పట్టుచీరలు ok - మా దేవతల్లాంటి అంటీల అందాలకు సరిపోయే మేకప్ ok ..... తెలిసినా అంటీల ద్వారానే చెప్పించాలని ఏదో మిస్సింగ్ మిస్సింగ్ ......
కాంచన అంటీ : ఒంటిపై నగలు మిస్సింగ్ ...... అంటూ బాధపడుతూ చెప్పారు .
వాసంతి - సునీత అంటీలు కూడా చిన్నగా బాధపడుతున్నారు .

వచ్చేసాను తీసుకొచ్చేసాను కొత్తవాటిలా ధగధగలాడేలా మార్చేసి తీసుకొచ్చేసాను - sorry sorry మేడమ్ ఆలస్యం అయ్యింది , తాకట్టు పెట్టిన నగల అమౌంట్ కూడా పంపించేశారు , మా చేతులు తాకి మలినం అయ్యాయని శుభ్రం చేయించిమరీ తీసుకొచ్చాను అంటూ పెద్ద బాక్స్ ను కానిస్టేబుల్స్ ద్వారా లోపలిపెట్టించి , మన్నించమని అన్నింటినీ చూసుకోమని చెప్పి వెళ్ళిపోయాడు సేట్ ......

మా దేవతల్లాంటి అంటీలకోసం సమయానికి నగలు కూడా వచ్చేసాయి , వెళ్లి చూసుకుని నగలతో పరిపూర్ణమైన దేవతలుగా మారిపోండి .
అంటీలు : మన నగలు మన నగలు తిరిగి మన దగ్గరకే వచ్చేసాయి - తల్లులు చాలా చాలా ఆనందిస్తారు అంటూ పట్టరాని ఆనందాలతో ఒకరినొకరు కౌగిలించుకొన్నారు , హలో హలో హలో మహేష్ ..... దేవతల్లాంటి ఈ అంటీల ప్రక్కన నువ్వుకూడా హీరోలా ఉండాలికదా , మేము నగలు అలంకరించుకుని వచ్చేలోపు నువ్వూ రెడీ అయ్యి వచ్చెయ్యి .
దేవతల్లాంటి నా అంటీల ప్రక్కన నేను హీరోలా ...... యాహూ యాహూ అంటూ సంతోషం పట్టలేక జంప్ చేస్తున్నాను .
అంటీలు : కొద్దిసేపేలే ఎంజాయ్ ఎంజాయ్ అని నవ్వుకుంటూ లోపలికివెళ్లారు .

పెద్దమ్మా....... డ్రెస్ అంటూ పరుగున ఇంట్లోకి నేరుగా బాత్రూమ్లోకివెళ్లి షవర్ కింద చకచకా తలంటు స్నానం చేసి టవల్ తో తుడుచుకుని బయటకు వచ్చిచూస్తే బెడ్ పై కొత్త డ్రెస్ ..... షర్ట్ మాత్రం నా హృదయస్పందన గిఫ్ట్ ఇచ్చినదే వేసుకుని నిమిషంలో రెడీ అయ్యి మెయిన్ గేట్ దగ్గరికి చేరుకున్నాను .
అదేసమయానికి నగలు ధరించి చిరునవ్వులు చిందిస్తూ బయటకువచ్చారు దేవతలు అవును దేవతలే .......
దేవతల అందాలకు ఫ్లాట్ అయిపోయినట్లు హృదయంపై చేతినివేసుకుని వెనక్కు పడిపోయాను .
మహేష్ మహేష్ ..... హమ్మయ్యా గేట్ ఉంది .
అవును గేట్ కు ఆనుకుని నిలబడిపోయాను .
అంటీలు : నవ్వుకుని , బానే రెడీ అయ్యావే .....
హీరోలా ఉన్నానా అంటీలూ ...... లవ్ ..... థాంక్యూ థాంక్యూ అంటూ మురిసిపోతున్నాను , మిమ్మల్ని అయితే జీవితాంతం ఇలా చూస్తుండమన్నా చూస్తూ ఉండిపోతాను .
అంటీలు : మొదలుపెట్టేసావా అంటూ నవ్వుకున్నారు , మురిసిపోయిందీ - పొగిడిందీ చాలుకానీ ఆటోని ఆపు వెళదాము , త్వరగా వెళ్లి వచ్చేయ్యాలి తల్లులు ఏక్షణమైనా రావచ్చు , ఎక్కడికి అనికూడా అడగకుండా స్ట్రేంజర్ తో వెళుతున్నాము .
స్ట్రేంజర్ నా ..... ? .
అంటీలు : మాట ప్రకారం రేపటి నుండి స్ట్రేంజర్ వే కదా అంటూ నవ్వుకున్నారు , అదిగో ఆటో వెళుతోంది ఆపు ......

దేవతలను ఆటోలోనా ..... నో నో నో ..... పెద్దమ్మా అన్నాను .
న్యూ రేంజ్ రోవర్ వచ్చి ఆగింది - ప్లీజ్ దేవతలూ ...... అంటూ డోర్ ఓపెన్ చేసాను .
అంటీలు : wow మాకోసమే అంటూ సంతోషంతో రేంజ్ రోవర్ దగ్గరికి వచ్చి ఆగిపోయారు , నువ్వు వేరే వెహికల్లో రావాలి .
ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ అంటీలూ ..... ఇంత అందమైన నా దేవతలను చూడకుండా ఒక్కక్షణం కూడా ఉండలేను బుద్ధిగా ముందు కూర్చుంటాను .
అంటీలు : రేపటి నుండి ఎలాగో కుదరదు కదా ok , తల్లులు వచ్చే టైం అయ్యింది నీతో ఆర్గ్యు చేస్తూ టైం వేస్ట్ చేయలేము పద అంటూ వెనుక సీట్లో ముగ్గురూ కూర్చున్నారు .
యాహూ యాహూ ..... లవ్ .... థాంక్యూ థాంక్యూ సో మచ్ దేవతలూ ...... అంటూ ముందుసీట్లో కూర్చుని , దేవతలూ ..... ఇంటి తాళాలు ఇవ్వండి ఫర్నిచర్ సర్దాలి కదా అంటూ అందుకుని లేడీ కానిస్టేబుల్స్ ఇచ్చి జాగ్రత్త అన్నాను , సిస్టర్ పోనివ్వండి అనిచెప్పి నా దేవతల వైపుకు తిరిగి కూర్చున్నాను .
అంటీలు : బుద్ధిగా కూర్చుంటాను అన్నావుకదా .......
బుద్ధిగా కూర్చుంటాను అన్నానుకానీ మీవైపుకు తిరిగి మిమ్మల్నే చూస్తూ కూర్చోను అనిచెప్పలేదు కదా దేవతలూ ..... అఅహ్హ్ రెండు కళ్ళూ చాలడం లేదు - హృదయమంతా నిండిపోయారు దేవతలూ .......
అంటీలు : అల్లరి పిల్లాడు అంటే అల్లరి పిల్లాడు , ఏమిచేసినా ఈరోజు వరకేలే అంటూ అందంగా కోప్పడుతున్నారు .

మొబైల్లో నవ్వులు వినిపించాయి , నా హృదయస్పందన లైన్లోనే ఉంది కదూ మరిచేపోయాను అంటూ నవ్వుకుంటూ అందుకుని , బుజ్జిజానకీ ......
బుజ్జిజానకి : మొత్తం విన్నాను మహేష్ ..... , బ్యూటిఫుల్ సో బ్యూటిఫుల్ ఎంజాయ్ ఎంజాయ్ ......
లవ్ ..... థాంక్యూ బుజ్జిజానకీ , నిమిషాలలో అక్కడ ఉంటాము .
బుజ్జిజానకి : Heartfully వెయిటింగ్ ...... , లైన్లోనే ఉంచు ......
లవ్ టు సరే బుజ్జిజానకీ అంటూ నవ్వుకున్నాను .

అంటీలు : అలా చూడకు మహేష్ సిగ్గేస్తోంది .
చూడకుండా ఉండలేను - గుండె కొట్టుకోవడం ఆగినా ఆగిపోతుంది - మీరంటే అంత ఇష్టం దానికి ......
అంటీలు : మొదలుపెట్టేసాడు ...... కానివ్వు కానివ్వు ఈ కొద్దిసేపు భరించాల్సిందే .......
అఅహ్హ్ ...... ఇంకో రెండు కళ్ళు ఉంటే బాగుండేది .
అంటీలు : నాలుగు వద్దా ? .
Yes yes మరొక నాలుగు కావాలి , అప్పుడు ఎంచక్కా ఒక్కొక్క దేవతను రెండేసి కళ్ళతో మనసారా చూసుకోవచ్చు .
అంటీలు : అల్లరి మాత్రం ఆపడు .

అంతలో మరొక కాల్ వచ్చినట్లు రింగ్ అయ్యింది , చూస్తే అక్కయ్య ...... , దేవతలూ అంటూ చూయించాను .
తల్లి అంటూ మొబైల్ ను లాక్కున్నారు , మనకు కాల్ చెయ్యలేదు కానీ ఈ అల్లరి పిల్లాడికి కాల్ చేశారు - అంత ఇష్టం వాళ్లకు .....
కాలేజ్ వదిలి ఉంటారు దేవతలూ ..... , నాకోసం కాలేజ్ దగ్గరకు చేరుకుని ఉంటారు అందుకే , వారిని ఇంటికి పంపిస్తారో మనం వెళ్ళేచోటకు రప్పించాలో మీఇష్టం ......
అంటీలు : ఇంటిదగ్గర ఎవరూ లేరుకదా , మనం వెళ్ళేచోటకే రమ్మందాము , మేమే చెబుతాము .
అడ్రస్ తెలియదు కానీ చెబుతారట , మీరు గనుక ఆన్సర్ చేస్తే మనం కలిసిపోయామని తెగ సంతోషిస్తారు మాట్లాడండి మాట్లాడండి .
అంటీలు : అలా జరగదు కానీ నువ్వే అడ్రస్ చెప్పు , మాట్లాడానని మాటిచ్చావు మెసేజ్ పంపు .....
రేపటి నుండి కదా దేవతలూ ......
అంటీలు : మాతో రేపటి నుండి - తల్లులతో ఈ క్షణం నుండే ...... , మాటిచ్చావు అంతే .
అలా మాటివ్వలేదే ......
అంటీలు : ఇచ్చావు అంతే , అలా అయితేనే నీతోపాటు వస్తాము లేకపోతే దిగి ఆటోలో వెళ్లిపోతాము .
మోసం దేవతలూ మోసం ...... అంటూ నవ్వుకున్నాను , విన్నావా బుజ్జిజానకీ .....
బుజ్జిజానకి నవ్వులు ........
కట్ చెయ్యి అక్కయ్యలకు లొకేషన్ పంపించాలి బై ..... , " అక్కయ్యలూ ..... నేను కాలేజ్లో లేను - కింద పంపే లొకేషన్ కు వచ్చెయ్యండి "
" అక్కడే ఉండు తమ్ముడూ వచ్చేస్తున్నాము "
దేవతలూ వచ్చేస్తున్నారు అంటూ చూయించాను .
అంటీలు : ఇంకెంత దూరం తీసుకెళతావు .
నాకైతే ఇలా నా దేవతలను చూస్తూ జీవితాంతం ప్రయాణించాలని ఉంది .
అంటీలు : వాట్ ..... ? .
దాదాపుగా విచ్చేసాము దేవతలూ ...... , దేవతలను కనుల నిండుగా చూస్తూనే 15 నిమిషాలలో బుజ్జిజానకి ఇంటి వీధిలో ఎంటర్ అయ్యాము .
Next page: Update 135
Previous page: Update 133