Update 139

( పెద్దమ్మా ..... అమ్మకూడానా ..... ? .
పెద్దమ్మ : నీ హృదయస్పందన దగ్గరకు వెళదాము అంటే మొదట నీదగ్గరకే నిన్నే చూడాలని లాక్కొచ్చింది .
థాంక్యూ థాంక్యూ అమ్మా ..... కానీ ప్లీజ్ ప్లీజ్ మీ ప్రాణం దగ్గరకువెళ్లి తనివితీరా చూసుకుని ఆశీర్వదించండి , అదే నాకూ సంతోషం ......
అమ్మ : నాకు తెలియదా మహేష్ ...... , ఏ అమ్మాయికీ కలుగని అదృష్టాన్ని కలిగించావు , స్వయానా ఐదుగురు దేవతలచే స్నానం చేయింపబడి ఆశీర్వాదాలు అందించావు , ఆ సంతోషాలన్నీ నీవల్లనే ......
అలాగే కానివ్వండి నావల్లనే ..... , ముందైతే మీ బంగారుతల్లి దగ్గరకువెళ్లండి , ఎంతో ఆశతో ఎదురుచూస్తోంది .
అమ్మ కళ్ళల్లో ఆనందబాస్పాలు ...... , మహేష్ ..... ఇలా ప్రతీరోజూ భువిపైకి వచ్చేలా ఏ ఒక్కరికీ అవకాశం లేదు కానీ నీవల్లనే కేవలం నీవల్లనే ..... ఖచ్చితంగా వస్తారు అమ్మకూచీ అంటూ మన అమ్మకూచీకి మాటిచ్చావు కదా అందుకే నాకీ అదృష్టం అంటూ ఆనందబాస్పాలు .......
పెద్దమ్మ : అవును కన్నయ్యా ...... , దేవలోకం నుండి అనుగ్రహం లభించింది అంటే నీవల్లనే ......
అవునా పెద్దమ్మా - అమ్మా ..... అయితే రోజూ రావచ్చన్నమాట , అంతకంటే ఆనందం మరొకటి ఉండదు అమ్మకూచీకి అంటూ అంతులేని ఆనందం ...... , అమ్మా ..... sorry sorry అమ్మకూచీ అన్నాను .
అమ్మ : నో నో నో ...... లవ్స్ ఇట్ .
పెద్దమ్మ : అవును కన్నయ్యా ...... , బుజ్జిజానకిని ..... అమ్మకూచీ అంటూ మొబైల్లో ఫస్ట్ టైం పిలిచినప్పుడే మీ అమ్మ పులకించిపోయారు , చాలా చాలా ఇష్టం ......
అమ్మ : నీ హృదయస్పందన ..... అమ్మకూచీనే కాదు మహేష్ కూచీ కూడానూ .....
అమ్మా అదీ అదీ .....
అమ్మ : లవ్స్ ఇట్ లవ్స్ ఇట్ ...... , నీ ప్రతీ పిలుపుకూ అక్కడ అమ్మకూచి పొందిన ఆనందాన్ని చూస్తూ ఎంత హాయిగా అనిపించిందో తెలుసా ...... , అన్ని సంతోషాలనూ ..... భద్రంగా దాచుకుంటున్నానులే అన్నింటికీ రుణం తీర్చుకుంటాను .
నో నో నో అమ్మా ...... , మీ పెదాలపై ఈ ఆనందపు నవ్వులు చాలు - అంతకుమించి ఇంకేమి కావాలి ......
అమ్మ : నీకు లేకపోవచ్చు నాకు ఉంది అంటూ సిగ్గుపడుతున్నారు పెద్దమ్మ గుండెలపై .......
అమ్మా ..... సిగ్గుపడుతున్నారా ? , ముచ్చటేస్తోంది తెలుసా ..... ? , ఇలాగే వెళ్లి మీ అమ్మకూచీని ఆశీర్వదించండి .
అమ్మ : మన అమ్మకూచీ ...... , నువ్వెలా అంటే అలా ..... ముందైతే మా దేవుడికి థాంక్స్ చెప్పుకోనివ్వు అంటూ నా బుగ్గపై ప్రాణమైన ముద్దుపెట్టారు .
థాంక్యూ అమ్మా ..... , అమ్మ ముద్దు అమ్మ ముద్దే ...... , ప్రక్కనే ఒకరున్నారు ముద్దులుపెట్టడమే గగనమైపోయింది - టైం వచ్చినప్పుడు రోజులైనా వదలను .....
పెద్దమ్మ నవ్వులు ...... , ఐదుగురు దేవతలలో ఎవరిని ఎక్కువగా తలుచుకుంటున్నావో అందరికీ తెలుసులే ......
అదీ అదీ ......
పెద్దమ్మ : తలుచుకునేది ఏమో ఒకరిని ముద్దులు అడిగేది మరొకరిని ......
సిగ్గుపడ్డాను ......
పెద్దమ్మ : లవ్ టు లవ్ టు కన్నయ్యా ..... , నీ దేవతల అంతులేని ప్రేమ పొందే క్షణం అతి తొందరలోనే ఉందిలే అంటూ నా పెదాలపై ముద్దుపెట్టారు .
మ్మ్ ...... నిజమా పెద్దమ్మా అంటూ దిండును గట్టిగా చుట్టేసి సైడ్ కు తిరిగిపడుకున్నాను ) .

కొద్దిసేపటికే ..... ( నేనిచ్చిన టెడ్డీ బేర్ ను హత్తుకుని హాయిగా నిద్రపోతున్న అమ్మకూచీ ముందు ప్రత్యక్షం అయ్యారు అమ్మ - పెద్దమ్మ ......
పెద్దమ్మ : ఫ్రెండ్ ..... ఆ గిఫ్ట్ ఎవరిచ్చారో తెలుసుకదా ? .
అమ్మ : తెలుసు తెలుసు ..... , మన ..... కాదు కాదు తన దేవుడు అంటే ఎంత ప్రేమనో చూస్తేనే అర్థమైపోతోంది .
పెద్దమ్మ : నీకోసమే ఎలా ఎదురుచూస్తోందో చూడు ......
అమ్మ : తల్లి పెదాలపై చిరునవ్వులు చూసి చెప్పండి .
పెద్దమ్మ : 50% అమ్మకోసం - 50 % మహేష్ కోసం ......
అమ్మ : కరెక్ట్ గా చెప్పారు ...... , తల్లీ ...... ఇన్ని సంవత్సరాలూ అమ్మకోసం ఎంత బాధపడ్డావో చూస్తూ నరకాన్ని అనుభవించాను , ఎప్పుడైతే మహేష్ ...... నీ జీవితంలోకి వచ్చాడో ఆ క్షణం నుండీ పొందిన ఆనందాలు ముఖ్యంగా ఈరోజు పొందిన ఆనందం ...... అంటూ ఆనందబాస్పాలతో నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువగా ముద్దుపెట్టారు - అమ్మ ప్రేమను మించిన దేవతల దీవెనలు అందించాడు - అంతకంటే ఒక తల్లికి సంతోషం ఏముంటుంది చెప్పు , బెడ్ పై కూర్చుని పెద్దమ్మను ప్రక్కనే కూర్చోబెట్టుకుని బుజ్జిజానకిని ఒడిలో పడుకోబెట్టుకుని ముద్దులతో జోకొడుతూ నిద్రపుచ్చారు - ఆశీర్వదించారు , తనివితీరా బుజ్జిజానకి ఆనందాలను చూసి పరవశించి , పెద్దమ్మా ..... ఇక మహేష్ దగ్గరికి వెళదాము .
పెద్దమ్మ : నవ్వుకుని , అప్పుడేనా అన్నారు .
అమ్మ : ఈ అమ్మకూచీని కంటికి రెప్పలా చూసుకోవడానికి దేవుడు మహేష్ ఉన్నాడు , మరి మహేష్ ను చూసుకోవాల్సింది మనమేకదా ..... అదే అదే దేవతలు కారుణించేంతవరకెలే .......
పెద్దమ్మ : సరిగ్గా చెప్పావు , అప్పుడు మనమేవరో కూడా గుర్తుండమేమో అంటూ నవ్వుకున్నారు .
అమ్మ : అమ్మకూచీ ...... ఇలానే సంతోషంగా ఉండాలి .
పెద్దమ్మ : ఫ్రెండ్ ...... విరహం తప్పదు .
అమ్మ : పెద్దమ్మా ......
పెద్దమ్మ : చాలా సంవత్సరాలే ఉంటుంది తప్పదు ఫ్రెండ్ .......
అమ్మ : నా మొగుడి వల్లనేనా ? .
పెద్దమ్మ : అవును ఫ్రెండ్ ...... , అమ్మకూచీ - మహేష్ ఇద్దరూ వారి వారి గమ్యాలను చేరుకున్నాక కలుస్తారు ఇక అప్పుడు వారిని వేరుచెయ్యడం ఎవ్వరి వల్లా కాదు , అంతవరకూ కంటికి రెప్పలా చూసుకోవడానికి నేనున్నాను కదా ......
అమ్మ : అమ్మకూచీని గుండెల్లో గూడు కట్టుకున్నాడు మహేష్ ......
పెద్దమ్మ : నేనేమీ చేయలేను ఫ్రెండ్ మన్నించు ......
అమ్మ : బుజ్జిజానకి నుదుటిపై ప్రాణమైన ముద్దులుపెట్టి , పెద్దమ్మా ..... వెంటనే తీసుకెళ్లండి .

మరుక్షణంలో నాముందు ఉన్నారు , మహేష్ అంటూ ప్రక్కన కూర్చుని నుదుటిపై - కురులపై ప్రాణం కంటే ఎక్కువగా స్పృశిస్తూ ముద్దులతో జోకొడుతున్నారు ) .
*******************

అమ్మా - పెద్దమ్మా ...... మళ్లీ వచ్చారా ? అంటూ సడెన్ గా బెడ్ పై లేచి కూర్చుని చుట్టూ చూసాను , అమ్మా - పెద్దమ్మా ..... మీరు మళ్లీ వచ్చారని తెలుసు , ఇదిగో నా నుదుటిపై - బుగ్గలపై అమ్మ ముద్దులు ...... , పెదాలపై పెద్దమ్మ ముద్దులు ...... ఇప్పటికీ తియ్యదనాన్ని పంచుతూనే ఉన్నాయి , అఅహ్హ్ ..... అంటూ దిండును ఘాడంగా హత్తుకుని ఫీల్ అవుతున్నాను .
బయట అటూ ఇటూ వెళుతున్న వెహికల్ సౌండ్స్ వినిపిస్తుండటంతో టైం ఎంత అయ్యిందబ్బా అంటూ మొబైల్ అందుకుని చూస్తే అప్పుడే 5:30 ...... , అవునులే అమ్మ - పెద్దమ్మ ముద్దులలో అలా గడిచిపోయి ఉంటుంది .
అక్కయ్యల నుండి మెసేజస్ ..... " తమ్ముడూ ..... నీ దేవతలు లేచి రెడీ అయ్యి చెల్లికోసం అన్నిరకాల టిఫిన్స్ రెడీ చేస్తున్నారు " .
అవునా ...... అయితే నేనూ రెడీ అయిపోతాను అంటూ నైట్ డ్రెస్ విప్పేసాను , బాత్రూమ్లోకివెళ్లి కాలకృత్యాలను తీర్చుకుని ఫ్రెష్ గా స్నానం చేసి కొత్త ప్యాంటు - షర్ట్ మాత్రం నిన్న చక్కగా హ్యాంగర్ కు తగిలించిన బుజ్జిజానకి గిఫ్ట్ నే వేసుకున్నాను , లవ్లీ షర్ట్ అమ్మకూచీ లవ్ యు సో మచ్ ......

మొబైల్ అందుకుని చూస్తే రాత్రే బోలెడన్ని ఫోటోలు వచ్చేసాయి , పరికిణీలో ముద్దొచ్చేస్తున్న బుజ్జిజానకిని మొబైల్ wallpaper గా ఉంచుకుని లవ్ యు అంటూ ముద్దుపెట్టాను .
లవ్ యు అమ్మకూచీ .... నీ అనుమతి - అమ్మ అనుమతి లేకుండా ముద్దుపెట్టాను , ఇంత ముద్దొచ్చేస్తుంటే ఏమి చెయ్యమంటావు మరి ......
బుగ్గపై ముద్దు మరియు పెద్దమ్మ నవ్వులు ...... , wait wait .... నవ్వులూ పెద్దమ్మవి కావు - ముద్దూ పెద్దమ్మది కాదు ..... కానీ ఎక్కడో ఆస్వాదించినట్లు తెలిసిపోతోంది , అమ్మ అమ్మ ..... అమ్మ ముద్దు - అమ్మ నవ్వులు ..... అంటే అమ్మ హ్యాపీ అన్నమాట , లవ్ ..... థాంక్యూ థాంక్యూ అమ్మా అంటూ మురిసిపోయాను , మీ సాక్షిగా అంటూ మొబైల్ స్క్రీన్ బుజ్జిజానకి బుగ్గపై ముద్దుపెట్టాను .
పెద్దమ్మా ..... డ్రాయింగ్ ఫైల్ & కలర్స్ .......
బెడ్ పై ప్రత్యక్షం అవ్వడంతో లవ్ యు అంటూ అందుకుని బయటకువెళ్ళాను .

దేవతల దర్శనం ...... , బుజ్జిజానకి దగ్గరకు త్వరగా వెళ్లడం కోసం అనుకుంటాను పైకీ కిందకూ - అటూ ఇటూ హడావిడిగా తిరుగుతున్నారు , దేవతల ముఖాలలో అందమైన ఉత్సాహం ...... అఅహ్హ్ రెండు కళ్ళూ చాలడం లేదనుకో , అమ్మకూచీ చూసుంటే ఎంత ఆనందించేదో ......
అంతలో ముగ్గురు దేవతలూ ..... త్వరగా త్వరగా అంటూ బయటకు రావడం , పట్టుచీర - నగలలో దివినుండి దిగివచ్చిన దేవతల్లా ఉండటంతో ...... సంతోషంలో ప్రామిస్ కూడా మరిచిపోయి గుడ్ మార్నింగ్ దేవతలూ బ్యూటిఫుల్ అంటూ విష్ చేసాను .
నీగురించి తెలుసు ..... నువ్వు మాటమీద నిలబడలేవు అన్నట్లు కోపాలతో చూస్తున్నారు దేవతలు ......

తమ్ముడు తమ్ముడు తమ్ముడు వచ్చాడా అంటూ అక్కయ్యలు వారి వారి ఇంటి బయటకువచ్చారు చిరునవ్వులు చిందిస్తూ ...... , గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ తమ్ముడూ ...... అంటూ చేతులు ఊపుతూ విష్ చేస్తూనే దేవతల దగ్గరకు చేరుకున్నారు .
దేవతల కోపం మరింత పెరిగింది .
అప్పటికిగానీ గుర్తురాలేదు , లవ్ ...... sorry sorry sorry దేవ ..... అంటీలూ మిమ్మల్ని దేవతలుగా చూడగానే ప్రామిస్ ఏమిటి నన్ను నేనే మరిచిపోయాను గుర్తుంది గుర్తుంది మన్నించండి అంటూ లెంపలేసుకుని తలదించి గుంజీలు తీస్తున్నాను .
తమ్ముడూ తమ్ముడూ తమ్ముడూ ...... నీ దేవతలు నవ్వుతున్నారు నవ్వుతున్నారు .......
ఆశతో చూడగానే దేవతలు అటువైపుకు తిరిగారు .
అక్కయ్యలు : తమ్ముడూ తమ్ముడూ ..... ఇంకా నవ్వుతూనే ఉన్నారు .
అంటీలు : కోప్పడుతుంటే నవ్వుతాము అంటున్నారేమిటి ? , నిన్న రాత్రి అంత జరిగాక అల్లరి పిల్లాడిని చూడనైనా చూస్తామా ? .
అక్కయ్యలు : అమ్మలూ ..... అసలు ఏమి జరిగిందంటే .....
నో నో నో అక్కయ్యలూ అంటూ వారించడంతో ఆగిపోయారు - ఫీల్ అవుతున్నారు .
అంటీలు : మాటిచ్చాడు - ప్రామిస్ చేసాడు ...... నిలబెట్టుకోమను లేకపోతే ఏమిజరుగుతుందో తెలుసులే ఆ అల్లరి పిల్లాడికి ......
అక్కయ్యలు : ఏమీ చెయ్యలేరు తమ్ముడూ ఎందుకంటే చెల్లి అంటే మాతో సమానం అయిపోయింది నీ దేవతలకు , చెల్లి దగ్గరకు వెళ్లకుండా చెల్లిని చూడకుండా చెల్లిని స్నానం చేయించి రెడీ చెయ్యకుండా ఉండలేరు ......
అంటీలు : ష్ ష్ ష్ తల్లులూ ..... , ఈ విషయం తెలిసిందంటే ఆ అల్లరి పిల్లాడి అల్లరికి అంతే ఉండదు , ఆ మాటతోనే కాస్త కంట్రోల్ లో ఉంటాడు .
అఅహ్హ్ ...... ( లవ్ యు లవ్ యు లవ్ యు దేవతలూ అంటూ వెనక్కు తలుపుపైకి వాలిపోయాను ) .
అంటీలు : ఫీల్ అవుతున్నాడు అంటే మన మాటలు విన్నాడా ..... ? , వింటే మాత్రం డేంజర్ ...... అమ్మో స్టవ్ పై వంటలు మీరూ లోపలికి రండి అంటూ నావైపుకు చూస్తున్న అక్కయ్యలను లాక్కుని లోపలికివెళ్లిపోయారు .

నా దేవతలకు ...... అక్కయ్యలతో సమానం అయిపోయిందన్నమాట అమ్మకూచీ , ఇంతకుమించిన ఆనందం మరొకటి ఏముంటుంది , అమ్మ ఎంత సంతోషిస్తున్నారో , పెద్దమ్మా ..... అమ్మ చూసారా ? .
చెరొక బుగ్గపై చెరొక ముద్దు ...... , అమ్మ చూసారు చూసారు అంటూ ఆనందించాను , తలుపు బయట చైర్ వేసుకుని కూర్చున్నాను , దేవతల దర్శనం కోసం పదేపదే చూస్తూ డ్రాయింగ్ ఫైల్ అందుకుని , పరికిణీలోని అమ్మకూచీ ఫోటోలను చూస్తూనే రాత్రి అమ్మ - పెద్దమ్మ ..... వారి అమ్మకూచీని ఆశీర్వదించిన - ఒడిలో పడుకోబెట్టుకుని జోకొట్టుట - ప్రాణంలా ముద్దులుపెట్టే అందమైన డ్రాయింగ్స్ ను గీస్తున్నాను , మధ్యమధ్యలో బయటకు వస్తున్న అక్కయ్యలను లోపలికి లాక్కెళ్లిపోతున్న దేవతలను చూసి మురిసిపోతూ నవ్వుకుంటున్నాను .

డ్రాయింగ్స్ బ్యూటిఫుల్ - కలర్ఫుల్ గా పూర్తవ్వడంతో పెదాలపై చిరునవ్వులు విరిసాయి .
అమ్మ గమనిస్తూనే ఉన్నట్లు నా బుగ్గపై ముద్దు ......
థాంక్యూ అమ్మా ......
సమయం 7 గంటలు అవుతుండగా ...... తల్లులూ అన్నీ రెడీ క్యారెజీ కూడా కట్టేసాము , ఆటోలను పిలిస్తే బుజ్జిజానకి దగ్గరకు వెళదాము , మీ కాలేజ్ బ్యాగ్స్ తీసుకోండి .
అక్కయ్యలు : తమ్ముడు ఏర్పాటుచేసిన రేంజ్ రోవర్ ఉండగా ఆటోలు ఎందుకమ్మలూ .......
అంటీలు : ఆ అల్లరి పిల్లాడు ఎక్కితే మేము ఎక్కము .
అసలు ఆ అల్లరి పిల్లాడు ఆర్రేంజ్ చేసిన కారులోనే ఎక్కలేదు అన్నందుకు చాలా ఆనందమే వేస్తోంది , అంటీలూ ..... నేను ఆటోలో వస్తాను .
అంటీలు : నువ్వెలా వస్తే మాకెందుకు ......
అక్కయ్యలు : ఓనర్ కారులోనుండి ఓనర్ నే తోసేసినట్లు ఉంది , తప్పే ..... తమ్ముడిపై కోపంతో మీరు తప్పు చేయకండి - దేవతలు తప్పు చెయ్యకూడదు , ఏమి మాట్లాడాము ..... ఏదైతే ఏమిలే అమ్ములు ఆలోచనలో పడ్డారు అదిచాలు .......
అంటీలు : బుద్ధిగా కూర్చోవాలి - మనవైపుకు తిరగనేకూడదు ......
అక్కయ్యలు : మీరెలా అంటే అలా అంటూ పెద్ద పెద్ద క్యారెజీలు అందుకుని కిందకువస్తుంటే మెయిన్ గేట్ దగ్గర అందుకుని కారులో వెనుక జాగ్రత్తగా ఉంచి , దేవతలకోసం డోర్స్ తెరిచాను , ఆటో ......

అంటీలు : అహహహ ..... ఏమి యాక్టింగ్ ఏమి యాక్టింగ్ , చెవులన్నీ మావైపే ఉంటాయి విన్నావుకదా బుద్ధిగా కూర్చో ......
అక్కయ్యలు : నవ్వుకుని , తమ్ముడూ తమ్ముడూ కూర్చో అంటూ ముందు డోర్ తెరిచి వెనుక దేవతలపై కూర్చున్నారు .
లోలోపలే నవ్వుకుని , బుద్ధిగా కూర్చున్నాను , పట్టుచీరలలో దేవతల సౌందర్యాలను చూడాలని ఉన్నా ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో నావల్ల కావడం లేదు .
అంతలో వాసంతి అక్కయ్య ..... we know we know అంటూ ముగ్గురు దేవతలు కనిపించేలా మిర్రర్ ను సెట్ చేసి , ఎంజాయ్ అంటూ చేతితో బుగ్గపై ముద్దుపెట్టింది .
దేవతలు చూసారేమోనని తెగ కంగారుపడిపోయాను .
దేవతలు ..... నావైపే గమనించకపోవడం చూసి హమ్మయ్యా అనుకున్నాను - నో మాటలు నో కిస్సెస్ అంటూ అక్కయ్యల వైపు సైగచేసాను మిర్రర్ లో ......
అక్కయ్యలు : నువ్వు మాట్లాడకూడదు అని ప్రామిస్ చేశావుకానీ , మేము మాట్లాడకూడదు అనికానీ - ముద్దులు పెట్టకూడదు అనికానీ లేదుకదా , పైగా నాన్నలకు ప్రాణంలా చూసుకుంటామని మాటిచ్చేసాము మాఇష్టం మేమేమైనా చేస్తాము , మాకు ..... అమ్మలూ - చెల్లీ - తమ్ముడు అందరి సంతోషం కావాలి అంటూ మెసేజ్ చేసి నవ్వుకుంటున్నారు .
చదివి వెంటనే డిలీట్ చేసేశాను ......
అక్కయ్యలు : డిలీట్ చేస్తే మాత్రం మేము ఆగుతామా ఏంటి అంటూ మిర్రర్ ద్వారా ముద్దులుపెడుతున్నారు .

తలదించుకున్నాను మధ్యమధ్యలో దేవతలవైపు చూస్తూ సిస్టర్ పోనివ్వండి అన్నాను .
అంటీలు : సిస్టర్ ..... మా బుజ్జిజానకి కోసం షాపింగ్ చెయ్యాలి దారిలో ఎక్కడైనా జ్యూవెలరీ షాప్ దగ్గర ఆపండి .
అక్కయ్యలు : చెల్లికి గిఫ్ట్స్ .... యాహూ లవ్ యు లవ్ యు లవ్ యు అమ్మలూ అంటూ నావైపు చూస్తూనే దేవతల బుగ్గలపై ముద్దులుపెట్టారు నీముద్దులు అంటూ సైగలుచేసి .....
సంతోషంతో జిళ్ళుమంది ......
అక్కయ్యలు నవ్వుకున్నారు , అమ్మలూ 7:15 అవుతోంది ఈసమయానికి ఏ షాప్ అయినా ఓపెన్ చేస్తారా ? .
అంటీలు : అవునుకదా ఇప్పుడెలా ? .

తలదించుకునే నేను మాట్లాడొచ్చా అంటీలూ ..... ? .
అంటీలు : అవసరమేలేదు , మా బుజ్జిజానకికి మధ్యాహ్నం వచ్చేటప్పుడు గిఫ్ట్స్ తీసుకెళతాములే .......
అక్కయ్యలు : తమ్ముడి వల్ల అవుతుందేమో అమ్మలూ ......
అంటీలు : ఇప్పుడు హెల్ప్ తీసుకుంటే అడ్వాంటేజ్ తీసుకుంటాడు .
అక్కయ్యలు : అవునవును అదిమాత్రం నిజం ఎందుకంటే మా అమ్మలూ రెడీ మూవీలో జెనీలియా కంటే అందంగా ఉంటారు ......
అంటీలు : పోండి తల్లులూ సిగ్గేస్తోంది .
నిజమే నిజమే అంటూ మిర్రర్ లో మెలికలుతిరుగుతున్న దేవతలను చూసి ఎంజాయ్ చేస్తున్నాను .
అంటీలు : ఆ అల్లరి పిల్లాడు .... మన మాటలన్నీ వినేస్తున్నాడు .
ఊహూ ఊహూ అంటూ రెండు చెవులనూ మూసుకున్నాను .
అక్కయ్యలు : హ్యాపీనా అమ్మలూ ...... , చెల్లికి గిఫ్ట్స్ తీసుకుని వేళదామే ......
అంటీలు : మా బంగారు బుజ్జిజానకి అర్థం చేసుకుంటుంది , ఈ అల్లరి పిల్లాడి సహాయం మాత్రం తీసుకోము అంతే ......
Sorry లవ్ యు లవ్ యు తమ్ముడూ అంటూ మిర్రర్ లో తెలియజేసారు .
ఉదయమే కావడం - ట్రాఫిక్ లేకపోవడంతో 15 నిమిషాలలో చేరుకున్నాము .

అదేసమయానికి కారులో పెద్దమ్మ - క్యాబ్ లోనుండి బాబుతో మేడమ్ దిగారు .
అక్కయ్యలు : బాబు బాబు బాబు అంటూ దేవతల బుగ్గలపై మరియు దేవతలు చూడకుండా నా బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టి పరుగునవెళ్లి ఎత్తుకుని ముద్దుచేస్తున్నారు .
పెద్దమ్మ - దేవతలు ..... వెళ్లి బాబును ముద్దుచేసి ఎత్తుకుని చివరికి అక్కయ్యలకు ఇచ్చి , ఒకరినొకరు కౌగిలించుకొన్నారు , అందరం ఒకేసారి చేరుకున్నాము అంటూ ఆనందిస్తున్నారు .
అక్కయ్యలు : బాబు ఎంత ముద్దొస్తున్నాడో అచ్చు తమ్ముడిలానే అంటూ బుగ్గలపై సున్నితంగా కొరికేస్తున్నారు .
మేడమ్ : బుజ్జి వయసులో ఇలానే ఉండేవాడేమో మహేష్ ......
అంటీలు : ష్ ష్ ష్ చెల్లీ ..... ఇంత చనువిస్తే నెత్తిన ఎక్కి కూర్చుంటాడు , ఆ అల్లరి పిల్లాడిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి .
అక్కయ్యలు : అమ్మలూ ..... మీరు దూరం ఉంచారుకదా అంటీకి ఎందుకు చెబుతున్నారు , తమ్ముడూ ...... ఎత్తుకోవాలని ఎంత ఆశపడుతున్నావో తెలుసు నీ చేతులు - కళ్ళు చూస్తే అర్థమైపోతోంది అంటూ అందించారు ......
నా బుగ్గపై ముద్దుపెట్టాడు .
అక్కయ్యలు : అమ్మో ..... ఇంతమందిమి ఎత్తుకున్నాము , మేమందరమూ ముద్దులుపెట్టాము తప్పితే ఎవ్వరికీ ముద్దుపెట్టలేదు , తమ్ముడు ఎత్తుకోగానే ముద్దుపెట్టాడు .
నవ్వుకుని పెద్దమ్మా అంటూ జేబులో చేతినిపెట్టి చాక్లెట్ తీసి బాబుకు అందించాను .
బుజ్జిబుజ్జినవ్వులతో ముద్దు ......
అక్కయ్యలు : అదిగో ముద్దు .......
అంటీలు : చాక్లెట్ ఇస్తే మనకూ ముద్దుపెట్టేవాడు అంటూ ఎత్తుకుని ముద్దుచేస్తున్నారు .
అక్కయ్యలు : లేదులేదమ్మా ..... చాక్లెట్ ఇవ్వకముందే ముద్దుపెట్టాడు , అంటీ - దేవతమ్మా ..... మీరు చూశారుకదా ......
మేడమ్ : అవునవును ......
పెద్దమ్మ : లేదు లేదు మీ అమ్ములు చెప్పినదే నిజం అంటూ నావైపు కన్నుకొట్టారు .
అక్కయ్యలు : నిన్నటి నుండీ మీరు అమ్మలకే సపోర్ట్ చేస్తున్నారు దేవతమ్మా ..... , చాక్లెట్ ఇవ్వకముందే ముద్దుపెట్టాడన్నది వాస్తవం ...... , కావాలంటే మేము చాక్లెట్ ఇచ్చినా ముద్దులుపెట్టడు చూడండి , తమ్ముడూ ..... ఒక్కటైనా చాక్లెట్ ఉందా ? .
నాలుగు ఉన్నాయని చెప్పండి మేడమ్ ......
అక్కయ్యలు : యాహూ యాహూ యాహూ ...... , ఇవ్వుమరి ......
మూడు ఉన్నాయని చెప్పానుకానీ , మీచేతులతో ఇప్పిస్తానని చెప్పలేదని చెప్పండి మేడమ్ ......
అక్కయ్యలు : మరి ఎవరితో ...... , అర్థమైంది అర్థమైంది నీ దేవతల చేతులతోనే ఇప్పించు , దేవతలూ దేవతలూ ...... దేవతలే సర్వస్వం అంటూ బుంగమూతితో నాచేతులపై గిల్లేసారు .
స్స్స్ స్స్స్ స్స్స్ ......
అంటీలు : తల్లులూ ......
అక్కయ్యలు : మేము గిళ్లకూడదని ఎక్కడా ప్రామిస్ చేయించలేదు కావాలంటే గుర్తుచేసుకోండి .
అంటీలు : ఆలోచనలో పడ్డారు .
అక్కయ్యలు : ఎంత ఆలోచించినా అదే నిజం ...... , ఇదిగో చాక్లెట్ లు ఇవ్వండి అంటూ నాచేతుల్లోనుండి అందుకుని దేవతలు - పెద్దమ్మకు ఇచ్చారు .
అంటీలు - పెద్దమ్మ : ముద్దులతో అందించారు .
దేవతలు - పెద్దమ్మకు ముద్దులుపెట్టాడు .
అక్కయ్యలు : అవును అమ్ములు చెప్పినట్లు చాక్లెట్ ఇస్తే ముద్దులుపెడుతున్నాడు కానీ తమ్ముడికి మాత్రం ముందే ముద్దుపెట్టాడు అంటీ చెప్పండి .
మేడమ్ : నవ్వే సమాధానం అయ్యింది , మీ అమ్మలకు మరింత కోపం తెప్పించడం అవసరమా తల్లులూ అంటూ అక్కయ్య చెవులలో గుసగుసలాడారు .

అక్కయ్యలు : నవ్వుకుని , అంటీ బాబు పేరు అడగలేదు .
మేడమ్ : మీరే చెప్పేస్తారు , మీకు - మీ చెల్లికి ప్రాణమైన పేరు ......
అంటీలు : మహేష్ అనిమాత్రం చెప్ప ......
అక్కయ్యలు : మహేష్ మహేష్ మహేష్ ..... అందుకేనా అచ్చు ఒకేలా ఉన్నారు అంటూ అందుకుని నావైపు చూస్తూ సున్నితంగా బాబు బుగ్గలపై కొరికేస్తున్నారు .
అంటీ : అందుకేనేమో ఎత్తుకోగానే ముద్దుపెట్టేసాడు - నా బంగారం ......
అక్కయ్యలు : బంగారం ఎవరు అంటీ ? , బాబా ? లేక తమ్ముడా ? .
మేడమ్ : ఇద్దరూ ఒక్కటే కదా ..... , మహేష్ - మహేష్ బంగారం అంటూ నావైపు సంతోషంతో చూస్తున్నారు .
అంటీలు : ఆ అల్లరి పిల్లాడిని పొగిడింది చాలు , ముందైతే మన బంగారపు బొమ్మ దగ్గరికి వెళదాము .

అంతలో ఇంటినుండి ఇరుగుపొరుగు ఆడవారు అనుకుంటాము ఇంట్లోనుండి బయటకువచ్చారు - మహిని పలకరిద్దామని వస్తే సోఫాలో కూర్చుంది కానీ కళ్ళే తెరవడం లేదు , తన ప్రాణమైన అంటీ - దేవతల్లాంటి అత్తయ్యలు - దేవతమ్మ - అక్కయ్యలు మరియు మరియు ఎవరో అబ్బాయి పేరు ఆ ఆ హీరో పేరు మహేష్ బాబు ..... వారు వస్తేనేకానీ కళ్ళుతెరిచి వాళ్లనే చూడాలని ఆశతో ఎదురుచూస్తోంది , 15 నిమిషాలు అయ్యింది వచ్చి వాళ్లెప్పుడు వస్తారో ఏమిటో తరువాత వద్దాము రండి అంటూ గుసగుసలాడుకుంటూ ఇరువైపులకూ వెళ్లిపోయారు .
అంటీ - దేవతలు - పెద్దమ్మ - అక్కయ్యలు ...... ఒక్కసారిగా నవ్వేశారు , sorry లవ్ యు లవ్ యు లవ్ యు బుజ్జిజానకీ - బుజ్జితల్లీ ...... అంటూ లోపలికి పరుగులుతీశారు , చివరన అక్కయ్యలు నా బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టి చెల్లీ చెల్లీ చెల్లీ ..... అంటూ బాబును ఎత్తుకుని వెళ్లారు .

అంటీ - అత్తయ్యలూ - దేవతమ్మా - అక్కయ్యలూ ...... వచ్చేసారా అంటూ కళ్ళుమూసుకునే గుమ్మం వరకూ వచ్చి , కళ్ళుతెరుస్తున్నాను అంటూ తెరిచి చిరునవ్వులు చిందిస్తూ అందరినీ మనసారా చూసుకుని గుండెలపైకి చేరింది .
లవ్ యు లవ్ యు బుజ్జిజానకీ - బుజ్జితల్లీ ...... ఆలస్యమయ్యింది అంటూ ప్రాణంలా కౌగిలించుకుని ముద్దుచేస్తున్నారు .
బుజ్జిజానకి : ఏమీ పర్లేదు , నా దేవతలకోసం ఎంతసేపైనా కళ్ళుమూసుకునే ఎదురుచూసేదానిని , ఎంత సంతోషంగా ఉందో తెలుసా దేవతలూ లవ్ యు లవ్ యు లవ్ యు సో మచ్ రండి రండి లోపలికి , అక్కయ్యలూ ..... గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ......
అమ్మమ్మ : దేవతలూ వచ్చేసారా ..... ? , రండి రండి లోపలికి అంటూ పిలుచుకునివెళ్లారు .
అక్కయ్యలు : గుడ్ మార్నింగ్ చెల్లీ ......
బుజ్జిజానకి : రేయ్ మహేష్ ..... వారం రోజులయ్యింది నిన్నుచూసి అంటూ మెయిన్ గేట్ దగ్గర ఉన్న నావైపుకు ప్రేమతో చూస్తోంది , నేనంటే ఇష్టమేలేదు నీకు రోజూ వస్తానని చెప్పి ఇలాచేస్తావా అంటూ ఆప్యాయంగా మొట్టికాయవేసి ఎత్తుకుని ముద్దుచేస్తోంది నావైపే చూస్తూ ....... , రేయ్ ..... ఐదు చాక్లెట్ లు ......
బుజ్జిజానకితోపాటు అక్కయ్యలకు ఒక్కొక్క చాక్లెట్ ఇచ్చాడు .
బుజ్జిజానకి : మన ఐదుగురికి ఐదు చాక్లెట్ లు అన్నమాట లవ్ యు అంటూ ముద్దుపెట్టింది .
అక్కయ్యలు : అక్కయ్యలూ ..... బాబుకు ముద్దులుపెట్టి , రేయ్ అన్నది ఎవరినో - మొట్టికాయ వేసినది ఎవరినో - ముద్దులు ఎవరికో - లవ్ యు ఎవరికో అర్థంవుతోందిలే చెల్లీ ...... మేమెల్లి అమ్మమ్మను పలకరిస్తామమ్మా అంటూ మూసిముసినవ్వులతో లోపలికివెళ్లారు .
Next page: Update 140
Previous page: Update 138