Update 19
చేపలకు ఫుడ్ వేస్తున్న బుజ్జాయిలు నా అడుగుల చప్పుడుకే అన్నయ్యా - అన్నయ్యా .......... అంటూ పరుగునవచ్చి నా గుండెలపైకి చేరిపోయి , అన్నయ్యా ......... ఘుమఘుమలాడే స్పెషల్ భోజనం తీసుకొచ్చాము రండి తిందాము అన్నారు .
గిఫ్ట్స్ గురించి ఏమీ మాట్లాడకపోవడంతో బుజ్జాయిలవైవు మార్చి మార్చి ఆశతో చూస్తున్నాను .
నా చూపుల అర్థం బుజ్జితల్లికి తెలిసిపోయినట్లు , అన్నయ్యా .......... మీరిచ్చిన గిఫ్ట్స్ తో లోపలికివెళ్లి అమ్మా ......... అంటూ చూయించాము . ఎవరిచ్చారో అమ్మకు అర్థమైపోయినట్లు , వెంటనే వంట గదిలోకివెళ్లి హాట్ బాక్స్ మరియు ప్లేట్ తీసుకొచ్చి మీ అన్నయ్యకు ఆకలివేస్తూ ఉంటుంది పాపం తీసుకెళ్లండి అని ఆత్రంగా మమ్మల్ని బయటకు పంపించేశారు .
పంపించేసారా ...........
అన్నయ్యా .......... పూలు ఐస్ క్రీమ్ చాక్లెట్ అందుకుని పంపించేశారులే - నాకు తెలిసి అమ్మ పూలను గుండెలపై హత్తుకుని అంతులేని ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు .
బుజ్జితల్లీ .......... మీరు చూడలేదు కదా - నా సంతోషం కోసం అలా చెబుతున్నారు అని ఫీల్ అయ్యాను .
బుజ్జితల్లి : అన్నయ్యా ......... మీరు ఇలా ఫీల్ అవుతారని ఎక్కడి నుండి ప్రత్యక్షము అయ్యారో పెద్దమ్మ కనిపించి , బుజ్జితల్లీ ........... మీ అమ్మ ఫీలింగ్స్ నేను మొబైల్లో రికార్డ్ చేస్తానులే - మీ అమ్మకు సిగ్గు - పాపం అలా లవ్లీ ఫ్లవర్స్ గిఫ్ట్ లా అందుకుని 7 సంవత్సరాలకు పైనే అయ్యిందికదా - ఒక్కసారిగా అందుకోగానే తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోయింది అని బుగ్గలపై ప్రాణమైన ముద్దులుపెట్టారు . సాయంత్రం ఆఫీస్ నుండి రాగానే చూయిస్తాను అన్నారు .
అవునా బుజ్జితల్లీ - బిస్వాస్ .........అంటూ ముద్దులవర్షం కురిపించి , సాయంత్రం వరకూ ఏంటి మరొక సంవత్సరం అయినా సంతోషంగా వేచిచూస్తాను అని ప్రాణంలా హత్తుకుని తిందాము అని సోఫాలో కూర్చున్నాము .
బుజ్జితల్లి హాట్ బాక్స్ నుండి వెజిటబుల్ రైస్ - కూర్మా వడ్డించుకుని తినిపించి ఎలా ఉంది అన్నయ్యా .............
దేవతే స్వయంగా అమృతం వండినట్లుగా ఉంది బుజ్జితల్లీ .......... అని ఇద్దరికీ బుజ్జి బుజ్జి ముద్దలు తినిపించాను .
మ్మ్మ్మ్మ్.......... అమృతం ఇలానే ఉంటుందా అన్నయ్యా ............
రాత్రి స్వీకరించిన అమృతపు ఊహల్లోకి వెళ్ళిపోయి , రేయ్ రేయ్ ........... తప్పు తప్పు అని సిగ్గుపడ్డాను .
అన్నయ్యా ........... డ్రై fruits అని రైస్ తోపాటు తినిపించింది .
ముందు మా బుజ్జాయిలు తినాలి బలం కోసం అని ఏరి ఏరి తినిపించాను .
బుజ్జితల్లీ - బిస్వాస్ .......... వెళ్లి అమ్మకు చెప్పిరండి ఆఫీస్ కు వెళదాము అని ముద్దులుపెట్టాను .
బుజ్జితల్లి : అన్నయ్యా ........... అటు నుండి ఆటే వెళ్లిపోండి అని అమ్మ ఆర్డర్ ........ డోర్ తెరవను అని చెప్పేసారు .
నాకైతే నవ్వు ఆగలేదు . లవ్ యు లవ్ యు అని ముద్దులుపెట్టి ఎత్తుకుని ఆఫీస్ కు బయలుదేరాము .
దారిలో చాక్లెట్ heaven దగ్గర కారుని ఆపాను .
బుజ్జితల్లి : అన్నయ్యా అన్నయ్యా ......... ఇక ఈరోజు తినడం మావల్లకాదు please please .......... ఎక్కడా ఆగకుండా ఆఫీస్ కు వెళ్లిపోదాము వెళ్లిపోదాము అని నన్ను దిగనీకుండా చేతులను బుజ్జి చేతులతో పట్టేసుకుని బుగ్గలపై ముద్దుల వర్షం కురిపించింది .
బుజ్జితల్లీ నీకు వద్దులే బిస్వాస్ కు తీసుకుందాము .
బిస్వాస్ : అన్నయ్యా ........ ఇటుచూడండి అని ఉబ్బిన పొట్టన చూయించడంతో ,
నవ్వుకుని ఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టి ఆఫీస్ చేరుకున్నాము .
వెంకట్ మొదలుకుని సర్ వరకూ లంచ్ గురించి అడిగి బుజ్జాయిలను నవ్వించారు .
రూంలోకి వెళ్ళగానే నా బుగ్గలపై తియ్యని ముద్దులుపెట్టి వెళ్లి సోఫాలో కూర్చుని కలర్ పెన్స్ తో డ్రాయింగ్స్ వేస్తున్నారు .
వెళ్లి ఇద్దరిముందు మోకాళ్లపై కూర్చుని బుజ్జాయిలూ ......... ఇంట్లో మీ అమ్మకు ముద్దులుపెడుతున్న డ్రాయింగ్ ...........
బుజ్జితల్లి : నేనూ బుజ్జిఅన్నయ్య కలిసి వేశాము అన్నయ్యా .......... , బయటకువెళ్లి ఫోటోలు తీసుకునే వీలు లేదుకదా ...........
కళ్ళల్లో చెమ్మతో లవ్ యు లవ్ యు soooo మచ్ బుజ్జాయిలూ ........... అంటూ ప్రాణం కంటే ఎక్కువగా కౌగిలించుకుని ముద్దులుపెట్టి , ఆకలివేసినా ఏమైనా కావాలన్నా ......... అడగండి .
లవ్ యు అన్నయ్యా - అన్నయ్యా .......... అంటూ చిరునవ్వులు చిందిస్తూ గట్టిగా ముద్దులుపెట్టారు .
పెదాలపై అంతులేని ఆనందంతో వెళ్లి వర్క్ లో మునిగిపోయాను .
3 గంటల సమయంలో మొబైల్ రింగ్ అవ్వడంతో చూస్తే స్టేషన్ అని ఉంది . వెంటనే ఎత్తాను .
అలర్ట్ అలర్ట్ .......... ఐదుగురు కాలేజ్ అమ్మాయిలు మిస్సింగ్ మిస్సింగ్ - ఉదయం కాలేజ్ కు వెళ్లిన అమ్మాయిలు లంచ్ కు ఇంటికి రాలేదని- కాల్స్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తోందని కంప్లైంట్స్ అల్ సెక్యూరిటీ అధికారి అలర్ట్ అలర్ట్ .......... సిటీ నుండి బయటకు వెళ్లే వాహనాలన్నింటినీ పూర్తిగా చెక్ చెయ్యండి .
నాకు .......... స్టేషన్ నుండి కాల్ - yes yes ......... వాడికి వచ్చే కాల్స్ నాకు కూడా వినిపిస్తాయి అని పెద్దమ్మ చెప్పారుకదూ ...........
మరొక కాల్ స్టేషన్ నుండే 10 మంది అమ్మాయిలు మిస్సింగ్ . మళ్లీ 10 నిమిషాలకు ******* కాలేజ్ నుండి అమ్మాయిలు మిస్సింగ్ - నిమిషానికి ఒక కంప్లైంట్ వస్తోంది - ఇప్పటివరకూ 25 మంది అమ్మాయిలు మిస్సింగ్ అలర్ట్ అలర్ట్ ........... సిటీ నుండి వెళుతున్న పెద్ద పెద్ద వెహికల్స్ అన్నింటినీ ఎక్కడికక్కడ ఆపేయ్యండి . సిటీ లోపల బయట ఉన్న బిల్డింగ్స్ అన్నింటినీ చెక్ చెయ్యండి .............అలా కాల్స్ మీద కాల్స్ గంటలో 50 మందికిపైనే సిటీలోని నలువైపులా ఉన్న కాలేజస్ నుండి మిస్సింగ్ అని నిమిషానికి ఒక కాల్ వస్తూనే ఉంది . సిటీలోని కాలేజస్ అన్నింటిదగ్గరా హై అలర్ట్ పెంచండి అని ఆర్డర్స్ .
ఇంతమంది అమ్మాయిలు మిస్సింగ్ ........... ఏమై ఉంటుంది - ఎలా జరిగి ఉంటుంది - కిడ్నప్ ........... ఎవరు చేసి ఉంటారు అని ముఖమంతా చెమటలు పట్టేసాయి .
అన్నయ్యా - అన్నయ్యా .......... చెమట పట్టింది అని బుజ్జి కర్చీఫ్ లతో తుడిచి , నిద్రవస్తోంది అన్నారు .
నా బంగారం అంటూ గుండెలపై హత్తుకుని సోఫాలో పడుకుంటారా లేక ఇంటికివెళదామా అని అడిగాను .
ఇక్కడ పడుకుంటాము అని గుండెలపై ముద్దులుపెట్టి నన్ను చుట్టేసి కళ్ళుమూసుకున్నారు .
లవ్ యు బుజ్జితల్లీ - లవ్ యు బిస్వాస్ ........ అంటూ లేచి నిలబడి అటూ ఇటూ తిరుగుతూ కురులపై ముద్దులుపెడుతూ జోకొట్టాను . క్షణాల్లో వెచ్చని బుజ్జిశ్వాసలను నా గుండెలపై వదులుతూ హాయిగా నిద్రపొయారు .
5 గంటల సమయంలో మొబైల్ రింగ్ అవ్వడంతో వెంటనే సైలెంట్ లో ఉంచేసాను . లేదు లేదు ............ తల్లీ - బిస్వాస్ అని ముద్దులుపెట్టాను , మొబైల్ అందుకొని సోఫాలో కూర్చున్నాను . చూస్తే స్టేషన్ నుండి కాకుండా పార్టనర్ నుండి కాల్ వస్తుండటం చూసి ఎత్తి చెవిదగ్గరపెట్టుకున్నాను .
గోవర్ధన్ .......... అమ్మాయిల మిస్సింగ్ గురించి మీవాళ్ళు .........
పార్టనర్ ......... నేనున్నానుకదా , అమ్మాయిలను గోడౌన్ లో బంధించండి - వైజాగ్ లో ఉన్న మొత్తం గూండాలూ రౌడీలను కాపలా ఉంచండి . రేపు ఉదయానికల్లా మొత్తం క్లియర్ అయిపోతుంది . దానికోసం నైట్ అన్నీ ఏర్పాట్లూ చేసాను . నేను మన గోడౌన్ కు వచ్చేన్తవరకూ కాల్స్ చెయ్యొద్దు అని కట్ చేసాడు .
ఇది వీడిపనా .......... , 50 మందికిపైగా అమ్మాయిలను ఏమిచెయ్యబోతున్నాడు - ఎలాగైనా ఏదో ఒకటి చేసి అందరినీ రక్షించాలి కానీ ఎలా ........... ఇలాంటి వాడి నుండి అమ్మాయిలనూ - నా బుజ్జాయిలనూ - నా దేవ .......... మేడం ను ఎలా కాపాడుకోవడం . ఆ గోడౌన్ ఎక్కడ ఉందో తెలిస్తే నా ప్రాణాలిచ్చయినా కాపాడి నేను చేసిన అతిపెద్ద తప్పుకు పాయశ్చిత్తం చేసుకుంటాను అని అమ్మవారిని ప్రార్థించాను .
వెంటనే పెద్దమ్మ నుండి లొకేషన్ రావడంతో , లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ పెద్దమ్మా .......... అని లేచి సైన్ ఔట్ చేసి సోఫాపై ఉన్న బ్యాగ్స్ తీసుకోబోయి బ్యాగ్స్ పై ఉన్న రెండు ఛార్ట్స్ చూసాను . ఏమి డ్రాయింగ్ వేశారు అని రోల్ చేసి చూసాను . మొదటి చార్ట్ లో బుజ్జాయిలిద్దరూ...... నా బుగ్గలపై ముద్దులు - రెండవ చార్ట్ లో బుజ్జాయిలిద్దరూ...... పెద్దమ్మ బుగ్గలపై ముద్దులు పెడుతున్న డ్రాయింగ్ చూసి ఆనందబాస్పాలు వాటంతట అవే కారసాగాయి .
లవ్ యు బుజ్జితల్లీ - లవ్ యు బిస్వాస్ అంటూ ముద్దులవర్షం కురిపించాను . బ్యాగ్స్ - ఛార్ట్స్ అందుకుని బయటకువచ్చి కారులో కూర్చున్నాను .
హాయిగా నిద్రపోతున్న బుజ్జాయిల కురులపై ముద్దులుపెట్టి ముగ్గురికీ కలిపి సీట్ బెల్ట్ పెట్టుకున్నాను . బుజ్జితల్లీ - బిస్వాస్ ............ వాడి పాపాలకు అంతులేకుండా పోతోంది . ఈరోజుతో వాడి నుండి మీకు మరియు వైజాగ్ కు ఇక ఎటువంటి ఆపద లేకుండా చేస్తాను - ఎలానో తెలియదు , ఒంటరినే అయినా ప్రాణాలకు తెగించాను - మీ ముగ్గురి సంతోషం చూడటమే నా చివరికోరిక అనిచెప్పి బుజ్జాయిలకు ముద్దులుపెడుతూనే అపార్ట్మెంట్ చేరుకున్నాను .
ఇంకా నిద్రపోతున్న బుజ్జాయిలను లేపడం ఇష్టం లేక రేపు మళ్లీ చూస్తానో లేనోనని కళ్ళల్లో చెమ్మతో ఉద్వేగానికి లోనౌతూ ప్రాణం కంటే ఎక్కువగా గుండెలపై హత్తుకుని ముద్దులుపెడుతూ కిందకు దిగాను .
అపార్ట్మెంట్ వాసులు గుమికూడి ఉండటం చూసి సెక్యూరిటీ అన్నను విషయం అడిగాను .
సెక్యూరిటీ : న్యూస్ తెలిసే ఉంటుంది సర్ , మన అపార్ట్మెంట్స్ నుండే 8 మంది అమ్మాయిలు మిస్సింగ్ . ఉదయం కాలేజ్ కు వెళ్లినవాళ్ళు లంచ్ కు రాకపోవడం - న్యూస్ లో మిస్సింగ్ న్యూస్ చూసి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ నో నెట్వర్క్ అని రావడంతో స్టేషన్ లో కంప్లైంట్ చెయ్యడంతో వివరాలు సేకరించడానికి సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చారు .
బుజ్జాయిలను ఎత్తుకునే అక్కడికి వెళ్ళాను . మిస్సింగ్ అయిన అమ్మాయిల పేరెంట్స్ బాధను చూసి హృదయం తరుక్కుపోయింది.
నా బుజ్జాయిలు - మేడం మరియు మీరు రేపు ఉదయం స్వేచ్ఛ - సంతోషపు సూర్యోదయం చూడాలి అని కన్నీళ్లను తుడుచుకుని paiki వెళ్లి దేవ ........ మేడం ఇంటి కాలింగ్ బెల్ నొక్కాను .
బ్యాగ్స్ మరియు ఛార్ట్స్ డోర్ ప్రక్కనే ఉంచాను . కాలింగ్ బెల్ కొట్టిన చాలాసేపటికి డోర్ తెరుచుకుని దేవ ......... మేడం ఎరుపు రంగులోకి మారిన కళ్ళతో మమ్మల్ని చూసి పెదాలపై నవ్వుతో బుజ్జితల్లీ - బిస్వాస్ .......... నిద్రపోతున్నారా అని అడిగారు.
మేడ......... మేడం are you ఆల్రైట్ కళ్ళు ఇప్పటివరకూ బాధపడినట్లు కన్నీళ్ళతో ............ అని బాధపడుతూ అడిగాను . లోపల కాలింగ్ బెల్ నొక్కేంతవరకూ ఏడుస్తూనే ఉన్నట్లు ఎవరికైనా తెలిసిపోతోంది - నా హృదయం చలించిపోయింది .
మేడం : నాకు అలవాటే కదా మహేష్ అంటూ గుసగుసలాడారు . ఏమీ లేదు మహేష్ ........... దుమ్ము కళ్ళల్లోకి పడటం వలన అలా - ఏమిటి వచ్చారు అని హృదయమంత బాధను లోలోపలే దాచేసుకొని పైకి నవ్వుతూ అడిగారు . బుజ్జాయిలు తమ ప్రాణం కంటే ఎక్కువైన దేవు ......... హాయిగా నిద్రపోతున్నారు అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి మురిసిపోతున్నారు .
గాడె ........... మేడం ........... బుజ్జాయిలను మీకు ఇచ్చివెళదామని వచ్చాను . ఉదయం మరియు మధ్యాహ్నం చదివి చదివి అలసిపోయి హాయిగా నిద్రపోతున్నారు.
కళ్ళల్లో ధారలా కన్నీళ్ళతో భయంతో వణుకుతూ పూర్తిగా వెనక్కువెళ్లిపోయి నో నో నో .......... మహేష్ , బుజ్జాయిలు మీదగ్గరే ఉండాలి అన్నారు మేడం .
మేడం ........... పనిమీద బయటకువెళుతున్నాను - రావడానికి ఎంతసేపు పడుతుందో తెలియదు అందుకే ...........
మేడం : వద్దు వద్దు మహేష్ గారూ .......... ఈరాత్రికి నా బుజ్జాయిలు కాదు కాదు మీ బుజ్జాయిలు మీదగ్గరే ఉండాలి please please please ............
అదికాదు మేడం .......... ఎలాచెప్పాలో అర్థం కావడం లేదు . ఒక అపాయానికి ఎదురు వెళుతున్నాను - నాదగ్గర ఉంటే నా ప్రాణమైన కాదు కాదు మీ ప్రాణమైన బుజ్జాయిలకు కూడా ప్రమాదం అని అందించబోయాను .
అంతే మేడం కన్నీళ్ళతో రెండుచేతులతో నమస్కరించారు . మహేష్ గారూ ........ ఇప్పటివరకూ చెప్పలేదు - మీరు మాకోసం , మీ బుజ్జాయిలకోసం వచ్చిన మా దేవుడు - దేవుడి దగ్గర ఉండి మన బుజ్జాయిలకు ప్రమాదం కలిగినా నాకు సంతోషమే - మా దేవుడికి రెండుచేతులతో నమస్కరిస్తున్నాను బుజ్జాయిలకు మీ దగ్గరే ఉంటూ ఏమిజరిగినా నాకు బాధ లేదు - బుజ్జాయిలను ఎలాచూసుకుంటారో నాకు తెలియదా please please .......... అంటూ హృదయం చలించిపోయేలా ప్రాధేయపడ్డారు .
మేడం ........... దండం పెడుతున్న చేతులను ఆపడానికి తాకాబోయి సెంటీమీటర్ దూరంలో ఆగిపోయాను , బుజ్జాయిలు నా ప్రాణం ప్రాణంలా చూసుకుంటాను - మీరు ..... నాదగ్గర ఏదో దాస్తున్నట్లున్నారు చెప్పండి అని అడిగాను . ఎందుకో మీరు బాధపడుతున్నట్లున్నారు .
మేడం : లేదు లేదు , అలాంటిదేమీ లేదు మహేష్ గారూ .......... అని కన్నీళ్లను తుడుచుకుని మీరు ఒప్పుకున్నారు అదే సంతోషం వెళ్ళండి అన్నారు .
మిమ్మల్ని ఇలాచూసి వెళ్లడం నాకు ఇష్టం లేదు అయినా తప్పదు వెళ్ళాలి - మేడం .......... ఏ అవసరం వచ్చినా కాల్ చెయ్యండి - మీ సేవకుడిలా నేను ఉన్నానని గుర్తుపెట్టుకోండి - బుజ్జాయిల గురించి ఏమాత్రం కంగారుపడకండి - బుజ్జాయిల కాలేజ్ బ్యాగ్స్ అక్కడ ఉన్నాయి అని కళ్ళల్లో చెమ్మతో వెనక్కు తిరిగి నడిచాను .
మహేష్ .......... అంటూ పరుగునవచ్చి నావెనుకనుండి చుట్టేసి నా ....... కాదు కాదు నీ బుజ్జాయిలను ఎలా చూసుకుంటారో నాకు చెప్పాల్సిన అవసరం లేదు . మీరు మా సేవకుడు కాదు మా దేవుడు - లవ్ యు ఫర్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ , లవ్ యు ఫర్ గిఫ్ట్స్ , లవ్ యు ఫర్ ఐస్ క్రీమ్స్ , లవ్ యు ఫర్ ఫొటోస్ వీడియోస్ , లవ్ యు ఫర్ లవ్ కేరింగ్ , లవ్ యు ఫర్ everything ............. , నీ దగ్గర గడిపినది అతి తక్కువ సమయమే అయినా జీవితాంతం గుర్తుండేలా చేశారు - మరొక జన్మ .......... అంటూనే ఏడుస్తూ నన్నువదిలి పరుగునవెళ్లి బ్యాగ్స్ అందుకుని లోపలికివెళ్లి డోర్ వేసేసుకున్నారు .
కళ్ళల్లో కన్నీళ్ళతో బుజ్జాయిలకు ప్రాణమైన ముద్దులుపెట్టి , అమ్మా .......... నాప్రాణాలు తీసుకునైనా దే ........ మేడం కన్నీళ్లను ఆనందబాస్పాలుగా మారేలా చెయ్యండి అని వాడిపై కోపంతో బయలుదేరాను .
బుజ్జాయిలను కారులో తిప్పడం ఇష్టం లేక నేరుగా ట్రావెల్స్ చేరుకుని వన్ నైట్ క్యార వ్యాన్ కావాలని అడిగాను .
సర్ ....... మాదగ్గర బస్సెస్ , మినీ బస్సెస్ , లగేజీ కంటైనర్స్ మరియు కార్స్ తప్ప క్యార వ్యాన్ లేదు అని బదులిచ్చారు .
నెక్స్ట్ ట్రావెల్ కు వెళ్లినా అదేవిషయం చెప్పారు - పట్టువిడవకుండా సిటీ లోని మొత్తం ట్రావెల్స్ తిరిగినా ఉపయోగం లేకపోయింది . చివరికి సిటీ బయట ఉన్న గ్యారేజీ వాళ్ళ దగ్గర ఉండవచ్చు అని చెప్పడంతో సిటీకి 5 km దూరంలో ఉన్న గ్యారేజ్ కు కూడా వెళ్ళాను .
సర్ ......... మాకు ఆర్డర్ ఇస్తే నెలరోజులలో మీకు కావాల్సినట్లుగా క్యార వ్యాన్ రెడీ చేస్తాము - ఇప్పటికిప్పుడు అంటే కుదరదు అనిచెప్పారు .
మినీ బస్ తీసుకోవచ్చు కానీ నా బుజ్జాయిలు టీవీ చూడాలి - ఆడుకోవడానికి ఆటవస్తువులు ఉండాలి - ఆకలేస్తే తినడానికి ఫ్రిడ్జ్ నిండా ఫుడ్ ఉండాలి - నిద్రవస్తే ఇలా హాయిగా పడుకోవడానికి బెడ్ ఉండాలి విత్ AC .......... కోరినవన్నీ ఉండాలంటే క్యార వ్యాన్ అయితేనే పర్ఫెక్ట్ ఇప్పుడెలా ............ సమయం 8 గంటలు అవుతోంది . సిటీ మొత్తం అమ్మాయిలకోసం సెక్యూరిటీ అధికారి పెట్రోలింగ్ జరుగుతోంది .
పెద్దమ్మా .......... మన బుజ్జాయిలకోసం క్యార వ్యాన్ ఎక్కడ దొరుకుతు .......... అనేంతలో ఎదురుగా బస్ పరిమాణంలో క్యార వ్యాన్ ప్రత్యక్షము అయ్యింది . అందులోనుండి పెద్దమ్మ దిగి , శ్రీవారూ ........... మన బుజ్జాయిలను ఉదయం నుండీ ఎత్తుకోలేదు ఇటు ఇవ్వు అని నా పెదాలపై తియ్యనిముద్దుపెట్టి ఎత్తుకున్నారు .
పెద్దమ్మ స్పర్శకే మ్మ్మ్........ అంటూ మూలిగి మరింత గట్టిగా చుట్టేసి , పెద్దమ్మా ......... వచ్చేసారా , మధ్యాహ్నం కూడా కనిపించలేదు అని బుగ్గలపై ముద్దులుపెట్టి మత్తుగా ఉన్నట్లు కళ్ళుమూసుకున్నారు .
పెద్దమ్మా ..........
పెద్దమ్మ : లవ్ యు లవ్ యు లవ్ యు శ్రీవారూ ........... , మొదటి ట్రావెల్స్ కు వెళ్లేముందు ఈ కోరిక కోరి ఉంటే అప్పుడే మీ ముందు ప్రత్యక్షము అయి ఉండేది . మీ అమ్మవారిలా నాకు ముందే మీ కోరికలను తీర్చే శక్తులు లేవు . కానీ ఒక్కసారి మనసులో కోరుకున్నావో అది ఏదైనా నేను తీర్చగలను - ఈ రెండు గంటలసేపూ ........ ఎప్పుడెప్పుడు కోరుకుంటావోనని ఆతృతతో ఎదురుచూస్తున్నానో తెలుసా .........అని నా గుండెలపైకి చేరారు - నా ప్రాణం కంటే ఎక్కువైన మీరు ఇబ్బందిపడుతుంటే ఎంత ..........
మీ కళ్ళను చూస్తుంటేనే అర్థమైపోయింది పెద్దమ్మా ........... , తప్పు నాదే లవ్ యు లవ్ యు ........... డ్రైవర్ ఎవరు అని అడిగాను .
పెద్దమ్మ : ఈ బస్ లో నా బుజ్జాయిలు - మా శ్రీవారూ - మా కావ్య తల్లికి తప్ప మరొకరికి స్థానం లేదు . ఇక మనతోనే ఉంటుంది - ఎక్కడికి తీసుకువెళ్లమంటే అక్కడికి తీసుకువెళుతుంది .
బుజ్జాయిలు మేల్కొన్నట్లు మా పెద్దమ్మకు మేమంటే ప్రాణం అంటూ ఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టి ఆనందించారు .
పెద్దమ్మ : లవ్ యు బుజ్జాయిలూ ......... , బుజ్జితల్లీ - బిస్వాస్ ........ లోపల ఎలా ఉందో చూడండి - మీకు నచ్చకపోతే చెప్పండి మీ అన్నయ్య మీకు నచ్చినట్లుగా మార్చేస్తారు - రెండు నిమిషాల్లో వచ్చి మిమ్మల్ని కాలేజ్ డ్రెస్ నుండి బుజ్జి ఏంజెల్స్ లా మారుస్తాను అని బుగ్గలపై ముద్దులుపెట్టి లోపలకు పంపించారు .
పెద్దమ్మా పెద్దమ్మా .......... మరింత ధైర్యం కోసం మరొక్కముద్దు .
పెద్దమ్మ : విజయం నా శ్రీవారిదే ......... , ఒక్కటేమిటి ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాను అని పాదాలను పైకెత్తి ప్చ్ ప్చ్ ప్చ్ ప్చ్ ........ ప్రేమ ముద్దులవర్షం కురిపించి నా గుండెలపైకి చేరిపోయారు .
బుజ్జాయిలు చూసినట్లు భలే భలే .......... అంటూ చిరునవ్వులు చిందిస్తూ చప్పట్లు కొట్టారు . అన్నయ్యా - పెద్దమ్మా ......... లోపల చిన్న ఇంటిలా సూపర్ గా ఉంది . Tv ఫ్రిడ్జ్ AC బోలెడన్ని ఆటవస్తువులు సోఫా బెడ్ ............. త్వరగా రండి రండి ........
లవ్ యు soooooo మచ్ పెద్దమ్మా .......... అని ముద్దుపెట్టాను .
పెద్దమ్మ : మా శ్రీవారు కోరిక కోరారు - మేము తీర్చాము .
అంతులేని ఆనందంతో పెద్దమ్మను అమాంతం రెండుచేతులతో ఎత్తుకుని పెదాలపై ముద్దులుపెడుతూనే ఎక్కి చుట్టూ చూసి ఆశ్చర్యపోయాను . బుజ్జితల్లీ - బిస్వాస్ సూపర్ ........... , ఈ గిఫ్ట్ ఇచ్చినందుకు మన పెద్దమ్మకు ఎన్ని ముద్దులైనా ఇవ్వవచ్చు.
పెద్దమ్మ : యాహూ .......... నేను ఎప్పుడో రెడీ అంటూ నా పెదాలవైపే చూస్తుండటం చూసి నవ్వుకుని ,
లవ్ యు పెద్దమ్మా ......... అంటూ మధురాతి మధురమైన ముద్దుపెట్టి , మన బుజ్జాయిలు మధ్యాహ్నం నుండీ ఏమీ తినలేదు పెద్దమ్మా .........
పెద్దమ్మ : ఆ విషయం ఇప్పుడా చెప్పేది అని నా గుండెలపై కొట్టి బుగ్గపై తియ్యని నొప్పికలిగేలా కొరికేసి కిందకుదిగి , బుజ్జాయిలు చప్పట్లు కొట్టడం చూసి ముసిముసినవ్వులతో బుజ్జాయిలూ రండి అని లోపలికి పిలుచుకొనివెళ్లారు . బుజ్జాయిలూ .......... లోపల మీ బట్టలు - మీ అన్నయ్య బట్టలూ మరియు మీ అమ్మ పెద్దమ్మ బట్టలు కూడా ఉన్నాయి .
బుజ్జాయిలు : అయితే ఇల్లులానే అన్నమాట పెద్దమ్మా .........
మొబైల్ రింగ్ అవ్వడంతో చూస్తే , గోవర్ధన్ గాడు పార్టనర్ కు కాల్ చేసాడు . పార్ట్నర్ ............ రెండు గంటల్లో వచ్చేస్తాను - ఏ తప్పూ జరగకూడదు నేను అనుకున్నట్లుగానే జరగాలి జాగ్రత్త - ఇంతకీ మనవాళ్ళు ఎంతమంది ఉన్నారు .
పార్టనర్ : దాదాపు పాతిక మంది దాకా ఉన్నారు - సిటీలోని రౌడీలందరినీ ఎవరో కిరాయికి పిలుచుకునివేళ్లడంతో ఉన్నవాళ్లనే గోడౌన్ చుట్టూ అలర్ట్ గా ఉంచాను .
గోవర్ధన్ గాడు నవ్వినట్లు అనిపించింది - ఏమీలేదు పార్ట్నర్ ......... మన లైఫ్స్ సెటిల్ అయిపోయే క్షణం దగ్గరలోనే ఉంది - ఉదయానికల్లా .......... మనం ముంబై లోరాజ్యమేలుతాను ......... అదే అదే రాజ్యమేలుతాము అని నవ్వుకున్నారు .
15 నిమిషాలలో పెద్దమ్మ బుజ్జాయిలను క్యూట్ గా రెడీ చేసి తీసుకొచ్చారు . చూసి టెన్షన్ మొత్తం మాయమైపోయింది . బుజ్జితల్లీ - బిస్వాస్ ......... అని పిలువగానే చిరునవ్వులు చిందిస్తూ పరుగునవచ్చి నా గుండెలపైకి చేరిపోయారు . బుజ్జాయిలూ ........... ఇక జీవితాంతం ఈ సంతోషం ఉండేలా ఈరాత్రికి చెయ్యబోతున్నాము పెద్దమ్మ ఆశీర్వాదంతో ...........
పెద్దమ్మ : శ్రీవారూ .......... మీరు మొత్తం చెయ్యబోతూ నాకు క్రెడిట్ ఇవ్వడం ఏమీ బాగోలేదు - నేను నీ వెనుక ఉంటాను అంతే అని ఫ్లైయింగ్ కిస్ వదిలి , బుజ్జితల్లీ - బిస్వాస్ ఏమి తింటారు చెప్పండి అని అడిగి , వారు కోరినది ప్లేట్ లో వడ్డించుకుని ఐస్ క్రీమ్ అన్నారు .
బుజ్జాయిలు : పెద్దమ్మా ......... మావల్ల కాదు ఉదయం నుండీ తింటూనే ఉన్నాము అంటూనే ఫ్రిడ్జ్ నుండి ఒక ఐస్ క్రీమ్ తీసుకొచ్చి పెద్దమ్మకు తినిపించారు .
పెద్దమ్మ : లవ్ యు లవ్ యు ......... మా బుజ్జాయిలకు నేనంటే ప్రాణం అని ముద్దులుపెట్టి , శ్రీవారూ తమరికి అని ప్రేమతో అడిగారు .
పెద్దమ్మా .......... ఎందుకో ఆకలిగా లేదు అన్నాను .
పెద్దమ్మ నవ్వుకుని వచ్చి నా నుదుటిపై ప్రాణంలా ముద్దుపెట్టి , మహేష్ ......... అంతా నువ్వు అనుకున్నట్లుగానే జరుగుతుంది అని బుజ్జితల్లివైపు సైగచెయ్యడంతో ,
కీర్తి తల్లి బుజ్జిచేతులతో నాకు తినిపించింది . మళ్లీ నా పెదాలపై చిరునవ్వు చిగురించింది .
బుజ్జితల్లిని ప్రాణంలా గుండెలపై హత్తుకుని , బుజ్జితల్లీ - పెద్దమ్మా ......... ఆఫీస్ నుండి బుజ్జాయిలను తల్లిదగ్గరకు చేర్చాలని ఇంటికివెళ్ళాను అని జరిగినదంతా వివరించాను . పెద్దమ్మా ........ వాడి వలన దేవ ....... మేడం కు అపాయం ఏమైనా .........
బుజ్జితల్లి : మా అన్నయ్య ....... అమ్మకు దేవుడితో సమానం అన్నమాట . రాత్రంతా మా అన్నయ్యతోనే ........ యహూ యాహూ ....... అని సంతోషంతో కేకలువేశారు .
పెద్దమ్మ : అవును బుజ్జితల్లీ ........ అని ప్రేమతో ముద్దకలిపి తినిపించారు . మహేష్ ........... ఏది జరిగినా అంతా మంచికే , నేను ఉండగా నీ దేవతపై ఈగనైనా వాలనిస్తానా ...........
లవ్ యు పెద్దమ్మా .......... , ఇప్పుడు తినిపించండి ఆ ....... అన్నాను .
బుజ్జాయిలు : అన్నయ్య నవ్వారు నవ్వారు అని నావొడిలో వెనక్కుతిరిగి ముద్దులుపెట్టారు . అమ్మకు.......... అన్నయ్య దేవుడితో సమానం - అన్నయ్యకు ...... అమ్మ దేవత ........... అని మురిసిపోతున్నారు .
బుజ్జితల్లి మాటలకు నాకు సిగ్గు ముంచుకొచ్చింది . తృప్తిగా తిన్న తరువాత సమయం చూసి పెద్దమ్మా .........
పెద్దమ్మ : ఆట నా శ్రీవారిది - మేము ప్రేక్షకులం మాత్రమే అని బుజ్జితల్లిని తనపై కూర్చోబెట్టుకుని ఆటవస్తువులను అందించారు .
మొబైల్ తీసి పెద్దమ్మ పంపించిన లోకేషన్ పై టచ్ చేయగానే సిటీమీదుగా సిటీకి మరొకవైపుకు చేరుకున్నాము . లొకేషన్ కు కాస్త దూరంలో మట్టి రోడ్ నుండి కాస్త లోపల వెహికల్ ఆగింది - బ్లాక్ క్యార వ్యాన్ కాబట్టి చీకటిలో కనిపించదు. ఒకవైపు బీచ్ మరొకవైపు తోట , తోటలోపల పెద్ద గోడౌన్ ఉన్నట్లు పెద్దమ్మ అందించిన బైనాకులర్ లో చూసాను . సముద్రంలో చాలాదూరంలో బిగ్గెస్ట్ షిప్ ఆగి ఉంది .