Update 60

లాంగ్ ఆన్ లో నిలబడి వార్మ్ అప్ చేస్తున్నాను . థాంక్యూ థాంక్యూ soooooo మచ్ పెద్దమ్మా ....... అలా కోరుకోగానే ఇలా తీర్చేశారు . నిజాయితీగా ఆడాలని అందరూ నిర్ణయించారు కాబట్టి నేను మ్యాచ్ గురించి ఏమైనా కోరుకున్నా తీర్చకండి - నా సొంత టాలెంట్ తో ఆడాలని ఆశపడుతున్నాను . బ్యాటింగ్ - బౌలింగ్ అవకాశం లభించినా లభించకపోయినా పర్లేదు ప్లేయింగ్ 11 లో అవకాశం లభించేలా చేశారు అధిచాలు అని గుండెలపై చేతినివేసుకుని ప్రార్థించాను .

సెక్యూరిటీ కెప్టెన్ మరియు మెయిన్ గేట్ సెక్యూరిటీ అన్న బ్యాటింగ్ కు వచ్చారు . 15 ఓవర్స్ మ్యాచ్ - అంపైర్ ప్లే అని సిగ్నల్ ఇవ్వడంతో గోవర్ధన్ కీపింగ్ - మురళి బాల్ అందుకున్నాడు .
ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ సిక్స్ ....... ఫోర్ - సింగిల్ - ఫోర్ - సింగిల్ - ఫోర్ , సో తొలి ఓవర్లోనే 20 పరుగులువచ్చాయి . ఏ బ్యాట్స్ మన్ కు లెంగ్త్ వెయ్యాలో , ఏ బ్యాట్స్ మన్ కు బ్యాట్ పిచ్ వెయ్యాలో కూడా తెలియకుండా కోపంతో బౌలింగ్ చేసాడు మురళి ........
ప్రతీ బాల్ ముందూ సైగలు చేస్తూనే చెప్పడానికి try చేసి మరింత కొప్పడతాడని నిరాశతో ఆగిపోయాను - ప్రతిఫలంగా తొలి ఓవర్ కే 20 పరుగులు కొట్టారు .
మురళికి ........ సెక్యూరిటీపై కోప్పడాలని ఉందికానీ నిజాయితీగా ఆడుతామని కమిట్ అయినందువలన ఏమీ చేయలేక వెళ్లి ఫ్రంట్ లో నిలబడ్డాడు - అందరిలో కంగారు మొదలయ్యింది .
సెకండ్ ఓవర్ నా ప్రక్కనే లాంగ్ ఆఫ్ లో నిలబడిన వినయ్ అందుకున్నాడు . తొలి బాల్ డాట్ ........
అంతే వినయ్ ....... సూపర్ అంటూ క్లాప్స్ కొట్టాను .
సింగిల్ - డాట్ - డబల్ - డాట్ - సింగిల్ ........ సెకండ్ ఓవర్లో కేవలం 4 రన్స్ మాత్రమే వచ్చాయి .
Thats it thats it వినయ్ అంటూ అభినందించడానికి తనవైపు వెళుతుంటే - వినయ్ ....... నాదగ్గరికివచ్చి థాంక్స్ మహేష్ , నువ్వు ...... ఫస్ట్ ఓవర్లో చేసిన సైగలుచూసి ఇద్దరికీ ఎలా బౌలింగ్ చెయ్యాలో తెలిసింది అని కౌగిలించుకున్నాడు .
నెక్స్ట్ ఓవర్ మురళి తీసుకున్నాడు - తొలి బంతికే మళ్లీ సిక్సర్ ........
వెంటనే వినయ్ వెళ్లి మహేష్ చెప్పినట్లుగా వెయ్యి అని వివరించాడు .
మురళి : వాడు చెప్పినట్లుగా నేను వినడం ఏంటి అని తనకిష్టమొచ్చినట్లుగా బౌలింగ్ చెయ్యడం వలన 16 రన్స్ ఇచ్చాడు .
ఫోర్త్ ఓవర్ వినయ్ అందుకుని నాదగ్గరకువచ్చాడు . మహేష్ ....... ఇలా అయితే స్కోర్ పెరిగిపోతుంది వికెట్ కావాలి ఎలా వెయ్యాలి అని అడిగాడు .
యార్కర్ స్లో బాల్ వెయ్యమనిచెప్పాను .
వినయ్ : కరెక్ట్ అని వేగంగా వచ్చి యార్కర్ వెయ్యబోయి ఫుల్ టాస్ పడటంతో బుల్లెట్ లా లాంగ్ ఆఫ్ లో సిక్స్ .......
మురళి : చూశావా ....... మహేష్ గాడు చెప్పినా ఫోర్ పోయింది - రేయ్ మహేష్ నువ్వు లాంగ్ ఆన్ వెళ్లు అని కోపంతో చెప్పడంతో వెళ్ళాను .
నెక్స్ట్ బాల్ కూడా యార్కర్ వెయ్యబోయి లో టాస్ పడటంతో అంతే బలంగా కొట్టాడు . లాంగ్ ఆన్ లో సిక్స్ వెళుతున్న బాల్ ను టైమింగ్ లో ఎగిరి సింగిల్ హ్యాండ్ తో క్యాచ్ పెట్టాను .
అంతే సెక్యురిటి - మా టీం మేట్స్ అందరూ షాక్ ....... రెండు క్షణాలు పిన్ డ్రాప్ సైలెంట్ - మహేష్ ....... ఔట్ అంటూ వినయ్ తోపాటు గ్రౌండ్ లో ఫీల్డింగ్ నిలబడిన ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఏకంగా ఎగిరి కిందపడేసి సంతోషాన్ని పంచుకున్నారు . ఆ ఓవర్లో రెండు సింగిల్స్ తో కలిపి 8 రన్స్ వచ్చాయి .
సెక్యూరిటీ కెప్టెన్ స్టడీగా ఆడటంతో ఫస్ట్ 5 ఓవర్స్ లో 60/1 రన్స్ వచ్చాయి .

వినయ్ : మురళి దగ్గరికివెళ్లి మహేష్ కు బౌలింగ్ ఇద్దాము . I think he is our best bowler .........
మురళి : నోవే వాడు extraa ప్లేయర్ మాత్రమే ........ , నేను కెప్టెన్ గా ఉండగా అది కుదరనే కుదరదు మళ్లీ ఈ టాపిక్ తీసుకురావద్దు అని మరొకరికి బౌలింగ్ ఇచ్చాడు .
వినయ్ ........ ప్రతీ బౌలర్ దగ్గరికీ వెళ్లి please ఫ్రెండ్స్ మహేష్ చెప్పినట్లుగా వెయ్యండి అని చెప్పాడు .
ఇద్దరు మాత్రమే మా మాటలను విన్నారు . 10 ఓవర్స్ ముగిసే సమయానికి 110/3 చేరుకుంది - సెక్యూరిటీ కెప్టెన్ మాత్రం వికెట్ కోల్పోకుండా ఆచితూచి ఆడాడు .
ఫైనల్ ఓవర్స్ మొదలవగానే హిట్టింగ్ స్టార్ట్ చెయ్యడంతో 11th ఓవర్లో 15 - 12th ఓవర్లో 18 - 13th ఓవర్లో 17 ఇలా వికెట్ కోల్పోకుండా రెచ్చిపోయారు .
వినయ్ చెబుతున్నా వినకుండా 14th ఓవర్ మురళి తీసుకున్నాడు ఆ ఓవర్లో ఏకంగా 22 రన్స్ రావడం 14 ఓవర్స్ ముగిసే సమయానికి 182/3 కు చేరుకుంది - సెక్యూరిటీ శిబిరంలో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి .
మురళికి కోపం అంతకంతకూ ఎక్కువై మనపై ఈ పనివాళ్లు గెలవడం ఏమిటి అని కంట్రోల్ చేసుకోలేక వికెట్లను కాళ్లతో కొట్టి నేను ఆడను అనిచెప్పి వెళ్ళిపోయాడు .
మురళీ మురళీ అని టీం మేట్స్ అందరూ ఎంత పిలిచినా పట్టించుకోకుండా వెనక్కు తిరిగిచూడకుండా వెళ్ళిపోయాడు .

ఇప్పుడెలా అని అందరూ ఒకదగ్గరికి చేరారు . ఏమి చేద్దాము ఏమి చేద్దాము .
గోవర్ధన్ - వినయ్ : మహేష్ చెప్పినట్లు ఓడిపోయినా పర్లేదు ఆడి ఓడదాము అని చేతులు కలిపారు .
మురళి గురించి తెలిసి సెక్యూరిటీ జట్టు డబ్బు గురించి టెన్షన్ పడుతోంది - ఇంట్లో ఖర్చులకు ఇవ్వాల్సిన డబ్బును బెట్ గా ఉంచాము అని .
వినయ్ : అంపైర్స్ మేము 10 మందితోనే ఆడుతాము .
సెక్యూరిటీ కెప్టెన్ : వినయ్ ....... మా టీం మేట్ ఒకరు ఫీల్డింగ్ చేస్తారు .
వినయ్ : మహేష్ ........ ok నా ? .
మంచిదే వినయ్ ........ ఇంటర్నేషనల్ క్రికెట్ లోనే ఇలా జరిగింది .
వినయ్ : ok సెక్యూరిటీ ........ , మహేష్ ఇప్పుడు కెప్టెన్ మురళి కాదు నేను , కాబట్టి ఫైనల్ ఓవర్ బౌలింగ్ నువ్వే , అంపైర్ ........ అంటూ బాల్ అందుకుని ఇచ్చాడు .

చక చకా ఫీల్డింగ్ మార్పులు చేసాను . ఓపెనింగ్ దిగి 90 పరుగులు చేసి సెంచరీ దిశగా వెళుతున్న సెక్యూరిటీ కెప్టెన్ స్ట్రైక్ లో ఉన్నాడు .
రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ అనిచెప్పి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి బుల్లెట్ లా యార్కర్ బాల్ వేసాను అంతే మిడిల్ వికెట్ ను వేగంగా తాకడంతో ఎగిరి కీపర్ గోవర్ధన్ చేతుల్లోకి చేరింది .
గోవర్ధన్ : క్లీన్ బౌల్డ్ అంటూ వికెట్ తోపాటు వచ్చి కౌగిలించుకున్నాడు . మేము వికెట్ పడిన అదికూడా కెప్టెన్ వికెట్ పడిన ఆనందంలో ఎంజాయ్ చేస్తున్నా కేకలువేస్తున్నా మైండ్ బ్లాక్ అయినట్లు సెక్యూరిటీ కెప్టెన్ వికెట్స్ వైపు అలా చూస్తూ ఉండిపోయాడు .
లెగ్ అంపైర్ వెళ్లి ఔట్ అని చెప్పేంతవరకూ కదలలేదు .
మహేష్ ....... the best యార్కర్ బాల్ , రియాక్ట్ అయ్యేలోపు బౌల్డ్ ..... , నైస్ బౌలింగ్ అనిచెప్పి సెంచరీ మిస్ అయినట్లు తలఊపుతూ వెళ్ళాడు .

వినయ్ ను పాయింట్ లో పెట్టి వికెట్స్ కు కాస్త దూరంగా లెంగ్త్ బాల్ వేసాను . న్యూ బ్యాట్స్ మన్ కట్ చెయ్యబోయి నేరుగా వినయ్ చేతుల్లోకి చేర్చాడు .
వినయ్ : మహేష్ ....... క్యాచ్ సరిగ్గా నా చేతుల్లోకే వచ్చింది అని సంతోషం పట్టలేక నామీదకు జంప్ చేసాడు .
ఫ్రెండ్స్ : హ్యాట్రిక్ హ్యాట్రిక్ ....... అని కేకలువేస్తున్నారు .
నెక్స్ట్ బాల్ కు వినయ్ ను స్లిప్ లో ఉంచి వేగంగా ఔట్ swinger వేసాను . వచ్చి రాగానే షాట్ కొట్టబోయి ఎడ్జ్ లో తాకి వినయ్ చేతుల్లోకి చేరుతున్న బాల్ ను కీపర్ గోవర్ధన్ డైవ్ వేసి పెట్టేసాడు . క్యాచ్ హ్యాట్రిక్ అంటూ హైఫై కొట్టుకునివచ్చి మహేష్ మహేష్ ........ అంటూ పైకెత్తి ఎంజాయ్ చేస్తున్నారు . మహేష్ ........ మ్యాచ్ ఓడిపోయినా పర్లేదు మాంచి కిక్కు ఇచ్చావు . నీకు ఫస్ట్ ఓవర్స్ ఇచ్చి ఉంటే ఈ స్కోర్ లో సగం కూడా వచ్చేది కాదేమో ప్చ్ .........

సెక్యూరిటీ టీం : ఏమి బౌలింగ్ చేస్తున్నాడు మహేష్ ........ సూపర్ అంతే , మురళి గాడి వలన ఆ పిల్లకాయ్ ఈగో వలన మహేష్ కు మొదట్లో బౌలింగ్ ఇవ్వలేదు కానీ ఇచ్చి ఉంటే మన 50 వేలు హుష్ కాకి అయిపోయేవి అని కాస్త భయపడుతూనే మాట్లాడుకున్నారు .
నెక్స్ట్ బాల్ సింగిల్ - డాట్ - ఫైనల్ బాల్ మళ్లీ లాంగ్ ఆన్ లో క్యాచ్ ........
ఔట్ ఔట్ అంటూ క్యాచ్ పట్టిన ఫ్రెండ్ పరుగునవచ్చి నామీదకు జంప్ చేసి , మహేష్ ........ ఈ గ్రౌండ్ లో పట్టిన మొదటి క్యాచ్ - థాంక్స్ టు యు ........ ఒక ఓవర్లో ఫోర్ మెయిన్ వికెట్స్ కేవలం ఒకే ఒక రన్ ....... అంటూ అందరూ కలిసి పైకెత్తి ఎంజాయ్ చేశారు .

అంపైర్ 184 టార్గెట్ అని అనౌన్స్ చెయ్యగానే ఒక్కసారిగా అందరిలో నిరుత్సాహం వచ్చేసింది . సైలెంట్ గా మా కిట్స్ బ్యాగ్స్ దగ్గరికి చేరుకున్నాము .
గోవర్ధన్ : ఫ్రెండ్స్ అంత స్కోర్ ను మనం ఎప్పుడూ చూడనేలేదు ఇక టార్గెట్ చెయ్యడం కూడానా ........ , మురళిలా తప్పించుకుని వెళ్లకుండా ఫేస్ చేసి ఓడిపోయి ఇంటికి వెళదాము - మన టార్గెట్ ఛేజ్ చెయ్యడం కాదు 15 ఓవర్స్ పూర్తిగా ఆడటం ok నా అని చేతులు కలిపారు .
సెక్యూరిటీ టీం వయసులను చూసి నాకు తోచినది చెప్పబోయి ఆగిపోయాను , వైస్ కెప్టెన్ స్పీచ్ కు అడ్డు వెళ్లకూడదు అని .......
ఇన్నింగ్స్ బ్రేక్ తరువాత అంపైర్స్ లెట్స్ స్టార్ట్ అని పిలవడంతో మా ఓపెనర్లు వినయ్ , రోహిత్ ఓటమి భయంతోనే వెళ్లారు .
తొలి ఓవర్ లోనే వికెట్ మరియు కేవలం నాలుగు పరుగులు మాత్రమే వచ్చాయి . వినయ్ ...... న్యూ బ్యాట్స్ మన్ దగ్గరికివెళ్లి మనకు స్కోర్ ముఖ్యం కాదు ఓవర్స్ పూర్తిచేయ్యడం ముఖ్యం వికెట్స్ కు అడ్డుగా నిలబడు ఆ తరువాత సింగిల్ తీస్తావో డబల్ తీస్తావో నీ ఇష్టం అన్నాడు .
అలా ఆడటం వలన 5 ఓవర్స్ కు స్కోర్ 30/2 . 6th ఓవర్ తొలి బంతికి రహీం ఔట్ అయ్యాడు .

గోవర్ధన్ : షిట్ షిట్ ఇలా అయితే 10 ఓవర్ లకు అలౌట్ అయిపోతామేమో అని బ్యాట్ అందుకోబోయి , మహేష్ ....... బౌలింగ్ మాత్రమేనా బ్యాటింగ్ కూడా చేస్తావా ....... ? . Please please ఎలాగైనా 15 ఓవర్లను మనం పూర్తిచేయాలి కనీసం ఆ సంతోషమైనా ........ , నీకు ఏ బ్యాట్ కావాలి ? .
థాంక్యూ థాంక్యూ గోవర్ధన్ అని కౌగిలించుకుని కిట్స్ లోనుండి రెండు మూడు బ్యాట్స్ అందుకుని చెక్ చేసి నన్ను సంతృప్తి పరిచిన బ్యాట్ సెలెక్ట్ చేసుకొని , బ్యాట్ పట్టుకున్న చేతిని తిప్పుకుంటూ వినయ్ దగ్గరికి చేరాను .
వినయ్ కూడా అదేవిషయం చెప్పాడు . ఈ మిగిలిన 5 బంతుల్లో వినయ్ - గోవర్ధన్ భయాలను పోగొట్టాలి అని మిడిల్ వికెట్ పొజిషన్ తీసుకుని నిలబడ్డాను .

సెక్యూరిటీ కెప్టెన్ వచ్చి సేమ్ బాల్ అని చెవిలో చెప్పినట్లు ఏ బ్యాట్స్ మన్ కైనా సులభంగా అర్థమైపోతుంది .
బౌలర్ వేగంగా వచ్చి లెంగ్త్ బాల్ వేసాడు . డివిలియర్స్ లా ఒక స్టెప్ వెనుకకు మూవ్మెంట్ తీసుకుని కొట్టగానే ఆఫ్ సైడ్ లో నీరసంగా కూర్చున్న గోవర్ధన్ చేతిలోకిపడింది .
గోవర్ధన్ : సిక్సర్ ....... ఫస్ట్ సిక్స్ అని చిరు సంతోషంతో బాల్ విసిరాడు .
సెక్యూరిటీ కెప్టెన్ మళ్లీ గుసగుసలాడటం ....... బౌలర్ వచ్చి యార్కర్ వెయ్యడం - ధోని హెలికాఫ్టర్ షాట్ తో లాంగ్ ఆన్ మీదుగా సిక్స్ ........
సిక్సర్ సిక్సర్ ....... అంటూ చిరు హుషారు వచ్చింది .
నెక్స్ట్ బాల్ డబల్ - ఫోర్ - చివరి బాల్ మళ్లీ సిక్స్ ......... ఆ ఓవర్లో వికెట్ పడినా 24 రన్స్ వచ్చాయి .
షాక్ లో వినయ్ - అంపైర్ డ్రింక్స్ అంటూ గోవర్ధన్ బాటిల్స్ తీసుకుని పరుగునవచ్చి కౌగిలించుకున్నాడు . మహేష్ ........ అల్రౌండర్ అని ముందే చెప్పొచ్చుకదా అనవసరంగా 3 వికెట్స్ కోల్పోయాము అని డ్రింక్స్ అందించాడు .
వినయ్ కు ఇవ్వు షాక్ లో ఉన్నాడు .
వినయ్ అందుకుని బాటిల్ మొత్తం ఖాళీ చేసేసాడు . మహేష్ ..........
కెప్టెన్ ......... స్కోర్ చూసి భయపడకూడదు - మన సత్తాకు మించి ఆడాలి అని దృడంగా అనుకోవాలి , మనిషి అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని మా అవ్వ ఎప్పుడూ చెబుతుండేవారు .
వినయ్ : నువ్వు చెప్పు మహేష్ ఎలా ఆడాలో ...... , భయపడకుండా ఆడతాను .
భయపడకుండా నీ ఆట నువ్వు ఆడు వినయ్ ....... , నెలరోజులు చూసాను కదా కొన్ని షాట్స్ భలే ఆడావు నువ్వు ......... - మరొక సీక్రెట్ చెప్పనా ....... సెక్యూరిటీ టీం లో ఎవ్వరూ బౌలర్లు లేరనుకుంటాను అందుకే కెప్టెన్ మరియు మరొకరే 3 - 3 ఓవర్స్ ఫినిష్ చేసేసారు - ఇక నాకు తెలిసీ మెయిన్ బౌలర్లు ఉండరు బాల్ ను చూసి బలంగా కొట్టేవి బలంగా కొట్టు , గుడ్ బాల్స్ కు రెస్పెక్ట్ ఇవ్వు , సింగిల్స్ డబుల్స్ రొటేట్ చెయ్యాలి ........
వినయ్ : థాంక్యూ మహేష్ ........ నా కెపాసిటీ ఏమిటో తెలియజేశావు అని ఉత్సాహంతో స్ట్రైక్ కు వెళ్ళాడు .

నేను చెప్పినట్లుగానే స్లో మీడియం ఫాస్ట్ బౌలర్ రావడం - బౌలింగ్ ప్రాక్టీస్ లేకపోవడంతో హాఫ్ పిచ్ వెయ్యగానే ......, వినయ్ ....... బలమంతా ఉపయోగించి లెగ్ సైడ్ బౌండరీ దాటి పడింది .
మా టీం మేట్స్ అంతా సిక్సర్ సిక్సర్ ....... అంటూ లేచి ఉత్సాహంతో కేకలువేస్తున్నారు . నెక్స్ట్ ఫోర్ - డబల్ - ఫోర్ - డబల్ - లాస్ట్ బాల్ బ్యాట్ పిచ్ రాగానే పెదాలపై చిరునవ్వుతో సులభంగా లాంగ్ ఆన్ లో సిక్స్ కొట్టాడు .
ఫీల్డింగ్ టీమ్ అంతా బాల్ ను చూస్తూ ఉండిపోయారు .
వినయ్ : మహేష్ ....... అంటూ పరుగునవచ్చి కౌగిలించుకున్నాడు .
ఈజి బౌలింగ్ అని నాకు ఒక్క బాల్ కూడా ఇవ్వలేదు కదూ వెల్ డన్ వైస్ కెప్టెన్ కాదు కాదు కెప్టెన్ అని హైఫై కొట్టుకున్నాము .
నెక్స్ట్ 3 ఓవర్స్ కూడా ప్రాక్టీస్ లేని బౌలర్స్ ను చెడుగుడు ఆడుకున్నాము . 10 ఓవర్స్ ముగిసే సమయానికి స్కోర్ 125/3 కు చేరింది .
వినయ్ : మహేష్ ........ 10 ఓవర్స్ కు వాళ్ళకంటే ఎక్కువే కొట్టాము అని ఆనందిస్తున్నాడు .

అంపైర్స్ డ్రింక్స్ బ్రేక్ ఇవ్వడంతో మా టీం మేట్స్ అందరూ సంతోషాలతో పరుగునవచ్చి కౌగిలించుకున్నారు . ఇలానే ఆడితే ఈజీగా గెలుస్తాము వినయ్ - మహేష్ ...... అని డ్రింక్స్ అందించారు .
సెక్యూరిటీ టీం లో కంగారు మొదలైనట్లు తెలుస్తోంది .

అంపైర్ పిలుపుకు మళ్లీ రంగంలోకి దిగాము . ఒకరు ఫోర్ ఓవర్స్ వెయ్యొచ్చు కాబట్టి సెక్యూరిటీ కెప్టెన్ బౌలింగ్ కు వచ్చాడు .
వినయ్ లో మళ్లీ కంగారు కనిపించడం చూసి చీర్ చేసాను .
నువ్వుండగా భయమేల మహేష్ అన్నట్లు తొలిబంతినే సిక్స్ కొట్టి బ్యాట్ ను పైకెత్తి సంబరాలు చేసుకున్నాడు .
ఏమిటా అని చూస్తే హాఫ్ సెంచరీ - ఫ్రెండ్స్ అందరూ లేచి హాఫ్ సెంచరీ హాఫ్ సెంచరీ ........ అని కేకలువేస్తున్నారు , వెళ్లి కౌగిలించుకుని అభినందించాను .
వినయ్ : మహేష్ ....... నా జీవితంలో నేను హాఫ్ సెంచరీ కొడతానని అనుకోలేదు - నీవల్లనే థాంక్యూ థాంక్యూ soooooo మచ్ అని కౌగిలించుకున్నాడు .
నీలో ఆ సత్తా ఉంది కెప్టెన్ ....... నీకే తెలియదు అంతే అని నవ్వుకున్నాము .

రేయ్ ........ నీ బౌలింగ్ లోనే కొడుతున్నారు , ఇలా అయితే ఈజీగా టార్గెట్ ఛేజ్ చేసేలా ఉన్నారు .
సెక్యూరిటీ కెప్టెన్ : అంతా మహేష్ వల్లనే , బ్యాటింగ్ రాని వాడితోకూడా హాఫ్ సెంచరీ కొట్టించి తనూ దగ్గరకు వచ్చేశాడు అని కోపంతో నెక్స్ట్ బాల్ వేసాడు - పర్ఫెక్ట్ యార్కర్ పడటంతో మిడిల్ వికెట్ రెండుగా విరిగిపోయింది ఆ వేగానికి ......
వినయ్ sorry చెప్పి నిరాశతో వెళ్ళాడు . వినయ్ స్థానంలో వచ్చిన గోవర్ధన్ నేరుగా నాదగ్గరికే వచ్చి మొటివ్ చెయ్యమన్నాడు .
నవ్వుకుని , నువ్వూ ....... వినయ్ లానే ఆడగలిగే సత్తా ఉంది go అండ్ ఎంజాయ్ క్రికెట్ ........ , నెక్స్ట్ బాల్ కచ్చితంగా యార్కర్ వస్తుంది స్కోర్ కొట్టకపోయినా పర్లేదు ok .......
గోవర్ధన్ : ok మహేష్ ....... అంటూ కాన్ఫిడెంట్ గా వెళ్లి యార్కర్ కు పూర్తిగా బ్యాట్ అడ్డుపెట్టి , బాల్ అందుకునిమరీ కీపర్ కు అందించాడు .
వినయ్ : thats it గోవర్ధన్ thats it .........
ఆ ఓవర్ మొత్తం ఆచితూచి ఆడి 10 రన్స్ సాధించాము . స్కోర్ 135/4 ..... ఫోర్ ఓవర్స్ లో 49 అవసరం .

గోవర్ధన్ ....... ఈ సెక్యూరిటీ బౌలింగ్ లోనే వినయ్ తనేంటో తెలుసుకున్నాడు .
గోవర్ధన్ : yes yes అంటూ స్ట్రైక్ కు వెళ్లి తొలి బాల్ ఫోర్ తో కలిపి ఏకంగా 16 రన్స్ స్కోర్ చేసి ఆనందం పట్టలేక డాన్స్ చెయ్యడం చూసి , మా టీం మెంబర్స్ ఎంజాయ్ చేస్తున్నారు .
సూపర్ గోవర్ధన్ అని ఛాతీలు గుద్దుకున్నాము .13th ఓవర్ మొదటి బంతికి ఫోర్ కొట్టగానే ఫ్రెండ్స్ అందరూ లేచి హాఫ్ సెంచరీ హాఫ్ సెంచరీ అని ఏరియా మొత్తం దద్దరిల్లిపోయేలా కేకలు వేయడంతో ........
గోవర్ధన్ వచ్చి కౌగిలించుకుని సంతోషాన్ని పంచుకున్నాడు .
ఆ ఓవర్లో కూడా 12 రన్స్ వచ్చాయి . 14th ఓవర్ మొత్తం గోవర్ధన్ ఆడి 4 - 2 - 2 - 0 - 4 - 2 ....... ఏకంగా 14 రన్స్ ....... add చేసాడు .

చివరి ఓవర్ లో కేవలం 7 రన్స్ మాత్రమే అవసరమవడంతో మా టీం మేట్స్ ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి .
కాల్ చేసి చెప్పినట్లు మురళి చిరునవ్వులు చిందిస్తూ పరుగునవచ్చాడు . ఫ్రెండ్స్ గెలవబోతున్నామా ........ ? .
ఫ్రెండ్స్ : అవును మురళీ ....... వినయ్ హాఫ్ సెంచరీ కొట్టాడు .
వినయ్ : మొత్తం క్రెడిట్ మహేష్ దే రా ....... , మాలో కాన్ఫిడెంట్ నింపి హాఫ్ సెంచరీతో ముందుండి నడిపిస్తున్నాడు అని ఒక్కొక్కరూ ఒక్కొక్కవిధంగా పొగడటం విని తట్టుకోలేకపోతున్నాడు - లోలోపలే ఉడికిపోతున్నాడు .

ఇక మ్యాచ్ పోయినట్లే అని ఒకదగ్గరకు చేరిన సెక్యూరిటీ టీంలో కంగారు భయాన్ని చూసి మా టీం కేరింతలు కొడుతున్నారు .
15th ఓవర్ ఫస్ట్ బాల్ టాస్ వేసినప్పటికీ సింగిల్ తీసి గోవర్ధన్ కు స్ట్రైక్ ఇచ్చాను .
గోవర్ధన్ : మహేష్ ....... నీకు చెప్పేటంతవాణ్ణి కాదు , టాస్ బాల్ సిక్స్ కొట్టచ్చుకదా.........
ఆ విన్నింగ్ షాట్ సిక్స్ నా ఫ్రెండ్ కొట్టి మ్యాచ్ ఫినిష్ చేస్తే మరింత ఆనందిస్తాను - ఫోర్స్ తప్ప సిక్సులు కొట్టనేలేదు నువ్వు అందుకే ........
గోవర్ధన్ : థాంక్యూ మహేష్ ....... , నా పవర్ అంతా ఉపయోగించి కొడతాను వీలుకాకపోతే సింగిల్ తీస్తాను నువ్వే ఫినిష్ చెయ్యాలి .
చిరునవ్వు నవ్వాను .
లెంగ్త్ బాల్ వెయ్యడంతో లాంగ్ ఆన్ ఫీల్డర్ దగ్గరికి వన్ పిచ్ చేరేలా కొట్టి మహేష్ మహేష్ ........ అంటూ పావు వంతు దూరం వచ్చేశాడు .
నో నో అంటూ బ్యాట్ పట్టుకుని కూర్చున్నాను . బాల్ కీపర్ ను చేరేంతలో క్రీజ్ చేరాడు . మహేష్ ........ ? .
నువ్వు కొడతావు - 15 ఓవర్స్ పూర్తిచేస్తే చాలు అన్నావు , ఇప్పుడు ఏకంగా విజయ తీరానికి ఒక్క సిక్స్ దూరంలో ఉన్నాము , భయం వదిలేసి కొట్టి గెలిపిస్తావో లేక .........
గోవర్ధన్ : నో నో నో ....... అంటూ కాన్ఫిడెంట్ గా వెళ్లి మిస్ హిట్ చేసి సింగిల్ తియ్యబోతే నేను కదలకుండా ఉండిపోయాను .
మా టీం లో కంగారు - ఫీల్డింగ్ టీం లో ఆశ్చర్యం .........
బౌలర్ ఫోర్త్ బాల్ వేయడానికి వస్తుంటే గోవర్ధన్ దేవుడిని ప్రార్థించి పెదాలపై చిరునవ్వుతో బాల్ ను చూసి ఫ్రంట్ వచ్చి లాంగ్ ఆఫ్ మీదుగా లాంగెస్ట్ సిక్స్ కొట్టి , గెంతులేస్తూ వచ్చి నామీదకు జంప్ చేసాడు .
మురళి తప్ప మా టీం అంతా పరుగునవచ్చి మా ఇద్దరినీ అమాంతం ఎత్తేసి సంబరాలు చేసుకున్నారు . 184 టార్గెట్ ను ఛేజ్ చేసాము థాంక్యూ థాంక్యూ మహేష్ నీవల్లనే ....... ఇక డబ్బులన్నీ మనవే ......

థాంక్స్ థాంక్స్ అంటూ ఎంజాయ్ చేస్తూనే ....... , సెక్యూరిటీ అన్నయ్యలవైపు చూసాను . నెల అంతా కష్టపడిన డబ్బు ఒడిపోయామని కన్నీళ్ళతో బాధపడుతున్నారు - వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ పిల్లలు - ప్రాణమైన వాళ్ళు కనిపించి హృదయం చలించిపోయింది - ఇలాంటి గెలుపునా నేను ఎంజాయ్ చేస్తున్నది అని నామీద నాకే కోపం వచ్చింది .
కిందకుదిగి మనసులోని మాటను మా కెప్టెన్ వినయ్ కు ఎలా చెప్పాలో అని బాధపడుతున్నాను .
వినయ్ వచ్చి మహేష్ ఏంటి అలా ఉన్నావు ఈ డబ్బంతా నీవల్లనే వచ్చింది - నెక్స్ట్ వీకెండ్ బయటకువెళ్లి ఎంజాయ్ చేద్దాము - మురళీ రారా .......

వినయ్ - గోవర్ధన్ - మురళీ సర్ - ఫ్రెండ్స్ ....... తప్పుగా మాట్లాడితే క్షమించండి , మనతో కాదు కాదు మీతో చాలానే డబ్బులు ఉన్నాయికదా ....... , పాపం మన సెక్యూరిటీ అన్నయ్యలు ...... ఇంటికి తీసుకెళ్ళాల్సిన డబ్బును మొత్తం ఓడిపోయారు - అలా ఆడటం కూడా తప్పే ...... - వాళ్ళ పిల్లల కాలేజ్ ఫీజ్ లు , ఫుడ్ , బాడుగ ....... ఇలా చాలా అవసరాలు ఈ డబ్బుపైనే ఆధారపడి ఉంటారు . కాబట్టి కాబట్టి ........ వాళ్ళ బెట్టింగ్ డబ్బును వెనక్కు తిరిగి ఇచ్చేస్తే ...... అని తలదించుకున్నాను .
అందరూ బాధపడుతున్న సెక్యూరిటీ వాళ్ళవైపు చూసి , ఒకరినొకరు చూసుకుని yes yes yes అని ఒక నిర్ణయానికి వచ్చారు . సెక్యూరిటీ అని పిలిచి మేము నిజాయితీతో మ్యాచ్ గెలిచాము ఈ డబ్బు కంటే ఆ సంతోషం చాలు మాకు ...... , మీ బెట్టింగ్ డబ్బుతోపాటు మా డబ్బుకూడా తీసుకోండి ....... , మహేష్ ....... నువ్వు చెప్పావు కాబట్టి నువ్వే ఇవ్వు .
నో నో నో వినయ్ ....... కెప్టెన్ ఎప్పుడూ ముందు ఉండాలి అని బోలెడన్ని థాంక్స్ లు చెప్పాను అందరికీ .........
మురళి : మ్యాచ్ మనం గెలిచి వాళ్లకు ఎందుకు డబ్బు ఇవ్వాలి .
గోవర్ధన్ : మురళీ ...... నువ్వు వెళ్లిపోకుండా మ్యాచ్ చూసి ఉంటే మాలానే ఎంత ఎంజాయ్ చేసేవాడివో తెలిసేది - ఆ సంతోషంతో పోలిస్తే ఈ డబ్బు నథింగ్ మేము ఇవ్వాలని నిర్ణయించుకున్నాము .
మురళి : నా డబ్బు నాకు ఇచ్చేసి మీఇష్టం .
వినయ్ ....... 10వేలు లెక్కపెట్టి ఇవ్వడంతో , మ్యాచ్ గెలిచాము మ్యాచ్ గెలిచాము అని కేకలువేస్తూ వెళ్ళిపోయాడు .
వినయ్ : సెక్యూరిటీ ....... తీసుకోండి అని అందించాడు . వాళ్ళ ముఖాలలో ఆనందం చూసి మహేష్ మళ్లీ కిక్కు ఇచ్చావు అని అమాంతం ఎత్తి సంతోషాలను పంచుకున్నారు .
పైనుండి సెక్యూరిటీ అన్నయ్యల ఆనందం చూసి ఆ క్షణం ఆ క్షణం ఎంత ఎంజాయ్ చేశానో మాటల్లో చెప్పలేను - నా దైవం పెద్దమ్మా ....... నేనూ ఒక మంచిపని చేసాను తెలుసా అని తియ్యదనపు గర్వంతో చెప్పి నవ్వుకున్నాను .
ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ........ అంటూ కిందకుదిగాను .
మహేష్ ....... ఈరోజులా ఎప్పుడూ శ్రమించలేదు చాలా ఆకలివేస్తోంది , ఇంట్లో నాన్ వెజ్ వండి ఉంటారు వెళ్లి కుమ్మేయ్యాలి అనిచెప్పి సంతోషంతో వెళ్లారు .

సెక్యూరిటీ అన్నయ్యలు : మహేష్ ....... ఈరోజు నువ్వు చేసిన సహాయం , సహాయం కాదు కొన్నిరోజుల మా కుటుంబాల సంతోషపు జీవితం - ఈ రుణం తీర్చుకోలేనిది అని ఉద్వేగానికి లోనౌతున్నారు .
అన్నయ్యలూ ....... మనమంతా ఒక్కటే - మన జీవితాల గురించి నాకూ తెలుసు - మన మధ్య ఈ రుణాలు ఎందుకు చెప్పండి - వెళ్ళండి వెళ్లి మీ ప్రియమైన వాళ్ళతోపాటు హాయిగా భోజనం చెయ్యండి - నాకు కూడా భలే ఆకలిగా ఉంది అని ఫ్రెండ్స్ దగ్గరికి పరుగుతీసాను .
సెక్యురిటి కెప్టెన్ : తమ్ముడూ మహేష్ ....... నీ బౌలింగ్ - బ్యాటింగ్ సూపర్ . అపొజిట్ ఆడటం వలన పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోయాము - ఈసారి వేరేవాళ్ళతో ఆడేటప్పుడు నీ allround ప్రదర్శనను చూస్తాము .
చిరునవ్వులతో ఫ్రెండ్స్ వెనుకే నడిచాను .

వినయ్ : బాగా అలసిపోయాము బిరియానీ తినేసి నిద్రపోవడమే , మరిచిపోకండి సాయంత్రం మినీ గ్రౌండ్ దగ్గర కలుద్దాము , లగాన్ ఆడుకుందాము - రేపు మళ్లీ కాలేజ్ కు వెళ్లాలి - ఫ్రెండ్స్ మీకూ కాలేజ్ నుండి మెసేజ్ వచ్చి ఉంటుంది మన ఇంగ్లీష్ సర్ డబల్ రిటైర్మెంట్ తీసుకుని వెళ్లిపోయారట - రేపు న్యూ ఇంగ్లీష్ టీచర్ రాబోతున్నారట ...... ఎవరో ఏమిటో అని ఎవరి ఇంటికి వాళ్ళు చేరుకున్నారు .
ఔట్ హౌస్ చేరుకుని , వొళ్ళంతా చెమటలు పట్టి ఉండటం వలన బట్టలన్నీ విప్పేసి షవర్ కింద నిలబడి చన్నీళ్ళతో స్నానం చేసి టవల్ చుట్టుకుని వచ్చేటప్పటికి , టేబుల్ పై భోజనం ఉంది - ఆకలి దంచేస్తోంది అని టవల్ పైననే కూర్చుని పాత్ర మూతను తీసిచూస్తే బిరియానీ ........ , సండే ....... మురళీ వాళ్ళు నాన్ వెజ్ చెయ్యారుకదా ........ అంటే పెద్దమ్మ , పెద్దమ్మా పెద్దమ్మా ....... అంటూ టవల్ పైననే బయరకువచ్చి చుట్టూ చూసాను ఎవ్వరూ లేరు , మెయిన్ గేట్ దగ్గరకువెళ్లి బయటకు తొంగిచూస్తే మధ్యాహ్నం ఎండకు రెండువైపులా దారిలో ఒక్కరూ లేరు - ఎవరైనా లోపలికి వచ్చారా అని సెక్యూరిటీని అడుగుదామంటే వాళ్ళూ భోజనానికి వెళ్లారుకదా ........ , చేసేదేమీ లేక నిరాశతో లోపలికివచ్చాను .
బిరియానీ - చికెన్ కబాబ్ చూడగానే నోరూరిపోతోంది - వెంటనే కూర్చుని టేస్ట్ చేసాను , మ్మ్మ్ ఆఅహ్హ్హ్ ....... సేమ్ టేస్ట్ అంటే పెద్దమ్మనే , థాంక్స్ పెద్దమ్మా ...... మేమంటే మీకు ఎంత ఇష్టం అని కుమ్మేస్తున్నాను .
ఇంతకీ ఉల్లిపాయలు - నిమ్మకాయ ఎక్కడ ? , రేయ్ ....... మహేష్ గా ప్రక్కనే బాక్స్ పెట్టుకుని ....... , పెద్దమ్మ ........ అవి లేకుండా తీసుకొస్తారా అని బాక్స్ ఓపెన్ చేసాను - వాటితోపాటు లెటర్ ఉంది .
" నా ప్రియాతిపియమైన బుజ్జి భక్తుడు ...... నా సహాయం లేకుండా మ్యాచ్ ను ఒంటి చేతితో గెలిపించి గర్వపు నవ్వుతో నవ్వినందుకు నేనే స్వయంగా బిరియానీ వండి తీసుకొచ్చాను ఎంజాయ్ "
" నా ప్రియాతిప్రియమైన భక్తుడు " ఈ మాట చాలు పెద్దమ్మా నా దైవమా ....... అని ఆనందబాస్పాలతో అతి మధురమైన బిరియానీని మోతాదుకంటే ఎక్కువగా తినేసి లేవడం వళ్ళకూడా కానట్లు బెడ్ పై వాలిపోయాను .

ఉదయం లా ఆలస్యం కాకుండా 4 గంటలకు ముందే మినీ గ్రౌండ్ లో ఉండాలి అని అలారం పెట్టడానికి మొబైల్ అందుకున్నాను .
వాట్సాప్ అప్ గుర్తుపై 99 ఉండటం చూసి , 99 మెసేజెస్ పంపించిన వారు ఎవరబ్బా అనిచూస్తే ........ పిక్స్ - అవ్వ , పిల్లలు వైజాగ్ ఎయిర్పోర్ట్ - తొలిసారి ఫ్లైట్ ఎక్కినప్పటి ఆనందాలు - ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో మరియు ఢిల్లీలో స్టే చేసిన 5 స్టార్ హోటల్ పిక్స్ ........ wow అనుకునేంతలో ఇండియా గేట్ దగ్గర తీసుకున్న పిక్స్ వస్తూనే ఉన్నాయి - అమితమైన ఆనందంతో చూస్తున్నాను . పెద్దమ్మ పెద్దమ్మ ....... పెద్దమ్మ ఏ ఒక్క ఫోటోలోనైనా ఉందేమో అని చూసి నిరాశ చెందాను - రేయ్ మహేష్ గా కొద్దిసేపటిముందు నీకోసం బిరియానీ తీసుకొచ్చిన పెద్దమ్మ ఈ పిక్స్ లలో ఎలా ఉంటారు అన్న జ్ఞానం కూడా లేదు అని మొట్టికాయ వేసుకుని నవ్వుకున్నాను . ఫీల్డింగ్ - హాఫ్ సెంచరీ కొట్టడం - ఫుల్ గా తినడం వలన మత్తుగా కళ్ళు మూతలుపడ్డాయి .
Next page: Update 61
Previous page: Update 59