Update 71

హాలో హలో mr అల్లరి మహేష్ గారూ ....... ఏంటి అలా చూస్తున్నారు ? అని చిటిక వేశారు దేవత .
మీరు చెప్పమంటే చెప్పాను కదా మేడం - మిమ్మల్ని చూస్తూనే ఉండిపోవాలని ఉంది , న్యూ సారీ లో దివినుండి ........
దేవత : చాలు చాలు ....... మనం ఇలా మాట్లాడుకుంటూనే ఉంటే మనల్ని లాస్ట్ స్టాప్ వరకూ తీసుకెళ్లిపోతుంది - నీకు వెళ్లాలని ఉంటే నువ్వు వెళ్లు , నాకు దారి వదిలితే నేను కిందకు దిగుతాను .
అప్పుడే కాలేజ్ కాలేజ్ కు వచ్చేసామా ? , ప్చ్ ...... అంటూ లేచి ప్రక్కకువచ్చి బ్యాగ్ - లంచ్ బ్యాగ్ అందుకున్నాను .
దేవత తమ వస్తువులను అందుకుని సీట్లోనుండి బయటకువచ్చి ముందుకు నడిచారు .
దేవత మైకంలో వెనుకే ఒక అడుగువేశానోలేదో .......
దేవత వెనక్కుతిరిగి ఆపి , మగవాళ్ళు అటువైపు అనిచెప్పి ముసిముసినవ్వులతో వెళ్ళికిందకుదిగారు .
నవ్వుకుని వెనుకకు పరుగునవెళ్లి కిందకుదిగి దేవత వెనుకే చేరి బ్యాక్ చూడగానే రాత్రి చూసిన ఊయలలాంటి ఒంపు గుర్తుకువచ్చి ఒక నిట్టూర్పు బయటకువచ్చింది.
దేవత ఆగి మహేష్ ...... ప్రక్కన నడువు అని ఆర్డర్ వెయ్యడంతో , దేవతతో సమానంగా నడిచాను .

దేవత : ఎందుకు ఆ సంతోషం ? .
నన్ను మగాడు అని గుర్తించినందుకు థాంక్స్ మేడం ........
దేవత : బస్ లో అన్నానని గుర్తుచేసుకుని , అనేశానా ? , ఇక ఇప్పటి నుండీ మగాడిగా అల్లరి చేస్తాడేమో ? .......
అవును మేడం అవును ...... మీరు మనసులో అనుకుని బయటకు మాట్లాడేస్తున్నారు .
దేవత : నాలుక కరుచుకుని , ముసిముసినవ్వులతో వడివడిగా ముందుకు నడిచారు .
థాంక్స్ మేడం నవ్వినందుకు - నవ్వితే మీరు .........
దేవత : దేవత - దివినుండి దిగివచ్చిన దేవతలా ఉంటాను , ఈరోజు ఏమిటి భయం లేకుండా పొగిడేస్తున్నావు ? - దెబ్బలు పడతాయి .
Yes yes ...... దెబ్బలకోసమే మేడం - మీ ప్రక్కన చేరి 45 నిమిషాలు అయ్యింది అయినా ఒక చెంప దెబ్బకూడా రుచిచూడలేదు అందుకే ........
దేవత : క్రేజీ స్టూడెంట్ - ఇక కొట్టనే కొట్టను మహేష్ ....... ఇక్కడ నిన్ను కొడుతున్నాను , అలాంటి దెబ్బలే బామ్మ నుండి తింటున్నాను . ఇష్టమైన దెబ్బలే కానీ మాక్సిమం కొట్టకుండా ఉండటానికి ట్రై చేస్తాను అదికూడా ఈ క్రేజీ స్టూడెంట్ అల్లరి చెయ్యకుండా ఉంటే ........
దేవతకు ఎలాగోలా తెలిసొచ్చింది - బామ్మనా మాజాకానా ....... - అయితే ఈరోజు నుండీ దేవత చేతిదెబ్బలు కూడా లేనట్లేనా ప్చ్ ....... - మేడం ...... లంచ్ బ్యాగ్ నాకివ్వండి పట్టుకునివస్తాను .
దేవత : నో నో నో ...... స్టూడెంట్స్ తో ఇలాంటివి చేయించరాదు .
మెయిన్ గేట్ చేరుకున్నాము .

అమ్మో ....... PET ఇక్కడే ఉన్నాడు . డ్రెస్ చూశారంటే ........
దేవత : Let me help you mahesh - PET తో నేను మాట్లాడుతాను రిక్వెస్ట్ చేస్తాను .
నో నో నో నెవర్ మేడం ...... , నా దృష్టిలో మీరు అంత ఎత్తులో ఉంటారు - మీరు ఆర్డర్ వేసే స్థాయిలో ఉండాలి కానీ ఎవ్వరినీ రిక్వెస్ట్ చెయ్యకూడదు - ఈ డ్రెస్ వేసుకోవడం కోసం పనిష్మెంట్ ను హ్యాపీగా ఆస్వాధిస్తాను .
దేవత : థాంక్యూ మహేష్ ....... టచ్ చేసావు , ఇలానే ఉండవచ్చు కదా అల్లరి చెయ్యకుండా ......
కాలేజ్లో అందరితో బుద్ధిగా ఉండాలనిపిస్తుంది కానీ మీతో మాత్రం అల్లరి అల్లరి చెయ్యాలనిపిస్తోంది దాని ద్వారా మీ కోపాన్ని పొంది దెబ్బలు తినాలని అనిపిస్తుంది.
దేవత : నువ్వు మారవు వెళ్లు వెళ్లి పనిష్మెంట్ అనుభవించు , అధిచూసి నేనూ ఎంజాయ్ చేస్తాను .
Yes yes yes ........ నాకు కావాల్సినది ఇదే థాంక్యూ sooooo మచ్ మేడం , క్లాస్ లో కలుద్దాము అని సంతోషంతో ఎగిరి గెంతులేస్తూ PET దగ్గరికివెళ్లి నేనే సరెండర్ అయ్యి ప్రేయర్ వైపు వెళుతున్న దేవతనే చూస్తున్నాను .
దేవత : ఒకవైపు నవ్వుతూనే మరొకవైపు కోపం చూయిస్తున్నారు .

PET : మహేష్ కదా ...... రీజన్ చెప్పు .
ఏమీ చెప్పకపోవడంతో ప్రేయర్ అయ్యేంతవరకూ గ్రౌండ్ చుట్టూ పరిగెత్తుతూనే ఉండాలి - ప్రేయర్ దగ్గరనుండి చూస్తూనే ఉంటాను , ఆగినట్లు తెలిసిందో క్లాసెస్ కు పంపించకుండా మరొక పనిష్మెంట్ ఇస్తాను .
నో నో నో సర్ ...... క్లాస్సెస్ చాలా ముఖ్యం ( దేవతను చూడకుండా ఉండటమా నావల్లకాదు ) , అస్సలు ఆగను అని ప్రేయర్ మొత్తం రౌండ్స్ వేసి చెమట - ఆయాసంతో వచ్చాను .
PET : నెక్స్ట్ టైం కాలేజ్ డ్రెస్ లోనే రావాలి - క్లాస్సెస్ ముఖ్యం అన్నావు గుడ్ వెళ్లి వాటర్ తాగు .

ఆయాసపడుతూ లంచ్ బ్యాగులోనుండి బాటిల్ అందుకోబోతే ........
నా ముందు బాటిల్ కనిపించింది . ఎవరని చూస్తే దేవత ...... అంతే చెమట - ఆయాసం హుష్ కాకి అయిపోయింది . మేడం ....... మీరు మీరు అంటూ ఆనందబాస్పాలతో సంతోషం పట్టలేక మాస్ స్టెప్పులు వేసాను .
దేవత నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ - sorry మహేష్ ....... పెద్ద పనిష్మెంట్ పడాలని నేనే కోరుకున్నాను - 20 నిమిషాలు పరిగెడుతూనే ఉన్నావు ఆగి రెస్ట్ తీసుకోవచ్చు కదా ........
ఆగితే క్లాస్సెస్ కు పంపించను అని PET చెప్పారు మేడం - ఇంకా పెద్ద పనిష్మెంట్ అయినా హ్యాపీగా ఆస్వాధిస్తాను కానీ క్లాస్సెస్ అంటే క్లాస్ చెప్పే మిమ్మల్ని చూడకుండా - మీకు కోపం తెప్పించకుండా ఉండగలనా చెప్పండి .
దేవత : ఫీల్ అయ్యి వచ్చాను చూడూ నాదీ తప్పు - త్వరగా నీళ్లు తాగి ఇవ్వు క్లాస్ బెల్ కొడతారు .
దేవత చూస్తుండగానే బాటిల్ ను ప్రాణంలా గుండెలపై హత్తుకుని , అతి సున్నితంగా మూత తెరిచాను .
దేవత : కోపం అంతకంతకూ పెరుగుతూనే ఉంది - మహేష్ ....... టచ్ చెయ్యకుండా తాగాలి .
ఊహూ ఊహూ ....... అంటూ టిప్ పై ముద్దుపెట్టిమరీ కరుచుకుని గట గటా తాగి థాంక్స్ మేడం అంటూ అందించాను .
దేవత : నీళ్లు తాగేంతవరకూ కంట్రోల్ చేసుకున్నట్లు చెంప చెళ్లుమనిపించి బాటిల్ - మూత అందుకుని కోపంతో లోపలికివెళ్లిపోయారు .
యాహూ ....... థాంక్యూ థాంక్యూ మేడం , ఈరోజు కనీసం మూడు దెబ్బలైనా తింటానని బామ్మకు మాటిచ్చాను - two to go ..... అంటూ దేవత వెనుకే క్లాస్ కు వెళ్ళాను - చెంపపై ఒకచేతితో రుద్దుకుంటూనే బుజ్జాయిలకు హైఫై కొట్టి వెనుక కూర్చున్నాను .

దేవత క్లాస్ లో ఉన్నప్పటికీ ....... , బుజ్జాయిలంతా నా చుట్టూ చేరి మహేష్ అన్నా మహేష్ అన్నా ఏమైంది చెంప ఎర్రగా అయ్యింది - అన్నయ్యా ...... చెంపపై వేళ్ళ గుర్తులుకూడా ఉన్నాయి , అంత గట్టిగా మిమ్మల్ని కొట్టినది ఎవరు అన్నయ్యా చెప్పు - అందరమూ వెళ్లి చుట్టూ చేరి మా పవర్ ఏమిటో చూయిస్తాము అని బుజ్జిబుజ్జికోపాలతో ముద్దుముద్దుగా మాట్లాడారు .
దేవత : షాక్ చెందినట్లు నోరుతెరిచి కంగారుపడుతున్నారు - please please చెప్పొద్దు చెప్పొద్దు అని పెదాలు కదిలించారు .
నవ్వుకుని , పిల్లలూ ...... ఎవరు కొట్టారంటే ఎవరు కొట్టారంటే ..... ok ok మీరు ఇంటిలో అల్లరి చేశారని మా అమ్మ కొడితే తిరిగి అమ్మను కొడతారా చెప్పండి .
బుజ్జాయిలు : నో ..... నో ..... అన్నయ్యా ,
అమ్మ కొడితే అప్పటికి ఏడుస్తాము కానీ మళ్లీ వెళ్లి అమ్మ గుండెలపైననే చేరతాము . అమ్మ ముద్దు - గోరుముద్ద - చేతి దెబ్బ అంత తియ్యగా ఉంటాయి . అలానే నన్ను కొట్టినది కూడా అలాంటి మనసు గల స్వర్గం నుండి దిగివచ్చిన దేవత - గంట నుండీ అల్లరి చేస్తున్నా సహించారు సహించారు చివరగా వల్లకాక ఇష్టంతో కొట్టారు.
దేవత : ఇష్టంతో కాదు కోపంతో కొట్టా ........ , అదే అదే ఆ స్వర్గం నుండి దిగివచ్చిన దేవత కోపంతో కొట్టినట్లున్నారు - మంచిపని చేసింది అని నవ్వుకున్నారు.
బుజ్జాయిలు : అన్నయ్యా ....... ఆ దేవత , మీకు అమ్మతో సమానం అన్నమాట .
ఉమ్మా ఉమ్మా ఉమ్మా ...... అంతకంటే ఎక్కువ అనాలి కానీ అమ్మకంటే స్వచ్చదనం లేదు - పిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు - మీరు చెబితే కరెక్టే
మా మాటలకు దేవత కళ్ళల్లో చెమ్మ , వెంటనే అటువైపుకు తిరిగి కంట్రోల్ చేసుకున్నారు . బుజ్జి స్టూడెంట్స్ ...... గుడ్ మార్నింగ్ ఇట్స్ అటెండెన్స్ టైం - మీ మీ ప్లేస్ లలో కూర్చోండి .
బుజ్జాయిలు : వెరీ గుడ్ మార్నింగ్ మేడం - గుడ్ మార్నింగ్ అన్నయ్యా అనిచెప్పివెళ్లి కూర్చున్నారు .

దేవత అటెండెన్స్ వేసి పిల్లలూ ....... క్లాస్ ఇక్కడ కంటిన్యూ చేద్దామా లేక ........
ఔట్ సైడ్ మిస్ ఔట్ సైడ్ మిస్ ఔట్ సైడ్ మిస్ ....... అంటూ కేకలువెయ్యడమే కాకుండా అందరూ లేచివెళ్లి దేవతను చుట్టేశారు .
దేవత చిరునవ్వులు చిందిస్తూ ok ok మా బజ్జు స్టూడెంట్స్ ఇష్టమే నా ఇష్టం అని బజ్జు బుజ్జి చేతులు అందుకుని ముద్దులుపెడుతుండటం చూసి మొబైల్ ను వీడియో మోడ్ లోకి మార్చేసాను .
నేనూ ఔట్ సైడ్ ఔట్ సైడ్ అంటూ వెళ్లి మోకాళ్లపైకూర్చుని దేవతను పాదాలను హత్తుకున్న బుజ్జాయిలను చేతులనూ విశాలంగా చేసి చుట్టేసాను .
పిల్లలు : ఆయ్ ఆయ్ ....... అన్నయ్యకూడా అంటూ మరింత ఆనందిస్తున్నారు .

దేవత చిరుకోపంతో హలో హలో ....... బ్యాక్ బ్యాక్ అని వేలితో - కళ్ళతో సైగలుచెయ్యడంతో ముసిముసినవ్వులతో లేచివెళ్లి దూరంగా నిలబడ్డాను .
దేవత : పిల్లలూ ....... మీకోరిక ప్రకారం ప్రకృతి ఒడిలోకి వెళదాము అని బుజ్జి బుజ్జి చేతులను అందుకుని కాలేజ్ బిల్డింగ్ మధ్యలోనున్న పూలమొక్కల దగ్గరికి తీసుకెళ్లారు .
మొబైల్ చేతుల్లోకి తీసుకుని బామ్మా ....... కనులారా మీ బుజ్జితల్లి సంతోషాలను తిలకించండి అంటూ వెనుకే వీడియో తీస్తూ నడిచాను .

పూలమొక్కల దగ్గరికి చేరుకునేసరికి అక్కడ అప్పటికే 1st & UKG పిల్లలు తమ తమ క్లాస్ టీచర్స్ తో సరదాసరదాగా ఆడుతూపాడుతూ క్లాస్ ఎంజాయ్ చేస్తున్నారు .
Other మేడమ్స్ : అవాంతికా మేడం ...... మీకోసమే వెయిటింగ్ - పిల్లల క్లాస్లోకి అడుగుపెట్టగానే అవంతిక మిస్ లానే మాకు ఔట్ సైడ్ టీచ్ చెయ్యండి అని అడిగారు .
దేవత : extremely sorry మేడం ........
Other మేడమ్స్ : నో నో నో ....... ఫస్ట్ కోపం వచ్చినా ఇక్కడికి వచ్చాక పిల్లలు అల్లరి చెయ్యకుండా ఉండటం చూసి చాలా సంతోషం వేసింది - ఇప్పుడు చెబుతున్నాము సంతోషంగా వచ్చామని - అలాగే ఇక్కడ క్లాస్ ఎలా చెబితే పిల్లలు హ్యాపీ గా నేర్చుకుంటారో అదికూడా చెబితే మరింత సంతోషం ........
దేవత : థాంక్స్ మేడమ్స్ ....... - ఎలా అని ఏమీ లేదు పిల్లలకు ఇష్టమైన ప్లే వే విధానంలో మనం వెళితే సరి ........
Other మేడమ్స్ : అంతేనా ...... , అయితే మనం కూడా పిల్లలం అయిపోవాలన్నమాట - ఎప్పటి నుండో ఆశ , ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనని లోలోపలే అణిచివేసుకున్నాము , ఇప్పుడు ఎంచక్కా మళ్లీ ఆ లైఫ్ ను ఎంజాయ్ చెయ్యవచ్చు థాంక్యూ థాంక్యూ sooooo మచ్ మేడం అంటూ సంతోషం పట్టలేక కౌగిలించుకున్నారు - వెనక్కుజరిగి అయ్యో sorry sorry మేడం ........
దేవత : సంతోషించి పర్లేదు పర్లేదు మేడమ్స్ ....... నాకూ ఫస్ట్ టైం ఇలానే అనిపించింది కానీ కౌగిలించుకోవడానికి - నా సంతోషాన్ని వ్యక్తపరచడానికి ఎవ్వరూ లేరు ప్చ్ ........
నేనుంటిని కదా మేడం - నేనేమీ ఫీల్ అయ్యేవాడిని కాదు అని దేవతకు వినిపించేలా గుసగుసలాడి నవ్వుకుంటున్నాను - దేవత చూసిన కోపపు చూపుకు భయం నటిస్తూ లెంపలేసుకోవడంతో దేవత పెదాలపై చిరునవ్వు చిగురించింది .
Other మేడమ్స్ : పిల్లలూ ...... మాకే ఎంతో సంతోషం వేసి అవంతిక మిస్ కు థాంక్స్ చెప్పాము - మీకు కూడా ....... అనేంతలో .......
మొత్తం మూడు క్లాస్ ల పిల్లలు మిస్ మిస్ మిస్ ....... అంటూ బుజ్జిబుజ్జిపరుగులతో వచ్చి దేవతను చుట్టేసి సంతోషాన్ని వ్యక్తం చేయడం చూడటానికి రెండు కళ్ళూ చాలడం లేదు - దేవతకు కనిపించకుండా చుట్టూ తిరుగుతూ వీడియోలో మొత్తం రికార్డ్ అయ్యేలా మాక్సిమం ట్రై చేసాను .
దేవత : ok ok ok బుజ్జి స్టూడెంట్స్ ...... ఇప్పటికే క్లాస్ 10 మినిట్స్ వృధా అయ్యింది . ఎలాగో నెక్స్ట్ క్లాస్సెస్ లో కలుస్తాము కదా మీ మీ places కు వెళ్ళండి.
Ok - అలాగే మిస్ అంటూ ముద్దుముద్దుగా రిప్లై ఇచ్చి వెళ్లి కూర్చున్నారు .
Other మేడమ్స్ : అవంతికా మేడం వచ్చిన కొద్దిరోజుల్లోనే పిల్లలందరి ఫేవరేట్ అయిపోయారు - చాలా సంతోషం . ఇక నుండీ ఇలాంటి పద్ధతులన్నీ ముందు మాకు చెప్పి మీరు proceed అవ్వాలి గుర్తుపెట్టుకోండి అని మరొకసారి చేతులుకలిపి వాళ్ళ వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్లి ప్లే వే పద్ధతిలోనే పిల్లలతోపాటు కలిసిపోయారు .

మేడం ....... నిన్నటివరకూ పిల్లలు - ఇప్పుడు ఏకంగా మీ తోటి మేడమ్స్ కూడా అంత ఎంజాయ్ చేస్తున్నారంటే కేవలం కేవలం మీరే కారణం .
దేవత లోలోపలే మురిసిపోతున్నా బయటకుమాత్రం చాలు చాలు బుజ్జిహీరో ...... పొగడటానికి రెడీగా ఉంటావు .
ఉన్నది ఉన్నట్లు చెబుతున్నా కోప్పడుతున్నారు ఈ ఈ ఈ ....... అంటూ ఏడుపు నటించాను .
దేవత : కొట్టినా ఏడవలేదు ఇప్పుడేంటి ...... అంత మాట అన్నానా ? , sorry sorry మహేష్ .......
నావైపే దీనంగా చూస్తున్న బుజ్జాయిలవైపు ఊరికే యాక్టింగ్ అంటూ కన్నుకొట్టాను .
బుజ్జాయిలు నవ్వడం చూసి సడెన్ గా నావైపుకు చూసారు . అంతే ఫీల్ అవుతున్న దేవత వెంటనే కోపంతో చూస్తూ భుజంపై గిల్లేసారు - నీ అల్లరి గురించి తెలిసికూడా అనవసరంగా ఫీల్ అయ్యాను .
మేడం మేడం ....... కొడతారు అనుకుంటే ఏకంగా గిల్లేసారు అని సంతోషంతో కేక వేసేంతలో ......
దేవత నా దేవత నా నోటిని చేతితో మూసేసి , ఇది కాలేజ్ ...... క్లాస్సెస్ డిస్టర్బ్ అవుతాయి అని బ్రతిమాలుతున్నారు .
దేవత చెయ్యి నా పెదాలపై తాకిన క్షణమే కేకవేయ్యడం మరిచిపోవడమే కాకుండా కరెంట్ షాక్ కొట్టినట్లు నన్ను నేనే మరిచిపోయి వెనుక పచ్చని గడ్డి నెలపైకి పడిపోయాను .
దేవత : నవ్వుకుని , నీకు ఇలానే జరగాలి , పడుకునే క్లాస్ విను ఇక డిస్టర్బ్ చెయ్యకు అని పిల్లలతో ఆడుతూపాడుతూ ఆడిస్తూ టీచ్ చేశారు .
నెక్స్ట్ క్లాస్ ఆ తరువాతి క్లాస్ కూడా అక్కడే ఉన్న పిల్లల క్లాస్సెస్ కాబట్టి అక్కడే మారి కంటిన్యూ చేశారు . తరువాత ఇంటర్వెల్ బెల్ మ్రోగడంతో దేవతతోపాటు స్టాఫ్రూమ్ వరకూ వెళ్లి బయటే ఆగిపోయాను .

దేవత బుక్స్ మరియు లంచ్ బ్యాగును వారి లాకర్లో ఉంచి లేడీ స్టాఫ్ తోపాటు కూర్చుని మాట్లాడుతూ చిరునవ్వులు చిందిస్తున్నారు - దేవతతో అందరూకలిసిపోవడం చూసి ఆనందం కలిగింది .
క్లాస్ బెల్ మ్రోగడంతో ఒక్కొక్కరుగా బయటకువచ్చి తమ తమ క్లాస్సెస్ వైపు వెళుతున్నారు . దేవత కూడా బయటకువచ్చి బుజ్జిహీరో గారు ఇక్కడే ఉన్నారెందుకు ....... ? అని మా క్లాస్ వైపు నడిచారు .
ఒక చెంప దెబ్బ - ఒక గిల్లుడు ........ ఇంకా ఒక దెబ్బ మిగిలి ఉందికదా మేడం ...... , ఆ దెబ్బ తినకుండా వెళితే మన ....... మా బామ్మ ఇంట్లోకి రానివ్వదు .
దేవత నుండి నవ్వులు - క్రేజీ మహేష్ ........ , బుజ్జిహీరో గారూ ...... ఫస్ట్ పీరియడ్ నుండీ అడగాలని అనుకుంటున్నాను నా దెబ్బను , మీ అమ్మగారి దెబ్బతో పోల్చావు - నేనంటే అంత ఇష్టమా ........
( అంతకుమించిన దేవత భువిపైననే కాదు విశ్వాలలోనే లేదు కాబట్టి అంత ఇష్టం - ప్రేమ - ప్రాణం ) ఓహ్ ....... ఆదా , పిల్లలు ..... నాపై ఉన్న ఇష్టంతో , వాళ్లకు ప్రియమైన మిమ్మల్ని ఎక్కడ కొడతారోనని అలా ఊరికే చెప్పాను .
దేవత కోపంతో కొట్టబోయి ........ , అయినా అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో తెలియకుండానే పెరిగినవాడికి ఆ ప్రేమ ఎలా ఉంటుందో ఎలా తెలుస్తుంది మేడం - నా మాటలకు కళ్ళల్లో చెమ్మతో అంటే నువ్వుకూడా ...... నాలానే ........
నాకైతే బాధలేదు మేడం ....... అమ్మ ప్రేమను మరిపించే ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునే బామ్మ .......
దేవత : నాకు కూడా ...... , లవ్ యు లవ్ యు soooooo మచ్ బామ్మా ...... అంటూ సంతోషంతో నాకు థాంక్స్ చెప్పారు .
Why మేడం ........
దేవత : మా బామ్మ అంటే నాకు ప్రాణం - నీవలన ...... మా మధ్యన మరింత మరింత ........ ఏమనిచెప్పను మాటలు రావడం లేదు .
నాకు బామ్మతోపాటు ఒక అందమైన దేవత ( నా ఎదురుగా ఉన్న దేవత ) మరియు దైవమైన పెద్దమ్మ కూడా ఉన్నారు .
దేవత : ప్చ్ ...... నాకు , బామ్మ ఒక్కరే .......
మేడం ....... అంటూ కోపంతో చూస్తున్నాను - అనుక్షణం మీవెనుకే తోకలా నేనున్నానుకదా ........
దేవత : నిజమే తోకలానే ఉంటున్నావు అని గట్టిగా నవ్వుకుని వెంటనే నోటిని మూసేసుకున్నారు .
మేడం మేడం .......ఇంతకుముందు కొట్టబోయి ఆగిపోయారు అని చెంప చూయించాను .
దేవత : నవ్వు ఆపుకోలేకపోతున్నారు - నిజమే అంటూ కొట్టబోయి చేతికున్న వాచ్ లో సమయం చూసి అమ్మో ...... నీవలన ఎప్పుడూ ఆలస్యమే అంటూ వడివడిగా మా క్లాస్రూం దగ్గరికి చేరుకుని బయటే ఆగిపోయారు . మహేష్ ....... నువ్వు లోపలికివెళ్లు - మా బామ్మ గుర్తుకువచ్చింది ఒంటరిగా ఉన్నారు కాల్ చేసి వస్తాను .
నన్ను ...... మీ తోక అన్నారుకదా , మిమ్మల్ని వదిలి తోక వెళుతుందా చెప్పండి .
దేవత : క్రేజీ మహేష్ అని నవ్వుతూనే బామ్మకు కాల్ చేసి మాట్లాడారు .
మేడం మేడం కట్ చెయ్యకండి మన ....... బామ్మతో నేనూ మాట్లాడుతాను .
దేవత : కాల్ చేసినది మీబామ్మకు కాదు మా బామ్మకు .......
బుజ్జితల్లీ బుజ్జితల్లీ ........
దేవత : హలో బామ్మా .......
బామ్మ : బామ్మ ఎవరికైనా బామ్మనే కదా ఇవ్వు మాట్లాడుతాను .
దేవత : వద్దు బామ్మా ...... చాలా అల్లరి పిల్లాడు .
బామ్మ : బుజ్జితల్లీ ........ , ఉదయం దెబ్బలు మరిచిపోయావా ? .
దేవత : అమ్మో ....... గుర్తుకొచ్చినప్పుడల్లా చుర్రుమంటోంది బామ్మా అని నా చేతికి మొబైల్ అందించి , రెండుచేతులతో బుగ్గలను రుద్దుకుంటూ లోపలికివెళ్లారు .

బామ్మతోపాటు నవ్వుతూ వెనుకే లోపలికివెళ్ళాను . క్లాస్మేట్స్ అంతా దేవతకు గుడ్ మార్నింగ్ చెప్పి కూర్చున్నారు .
దేవత బదులు వెరీ గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ అంటూ విష్ చేసి వెనుకవెళ్లి కూర్చోవడం చూసి క్లాస్ అంతా నవ్వులు విరిసాయి .
దేవత : సైలెంట్ - మహేష్ ....... మొదలెట్టేసావా నీ అల్లరి అని కోపంతో చూడటంతో , తలదించుకుని కూర్చున్నాను .
మా ఫ్రెండ్స్ నవ్వుకున్నారు .
బామ్మ : నా బుజ్జిహీరోపైనే కోప్పడుతుందా ఇదిగో ఇప్పుడే కాలేజ్ కు వచ్చి ........
ష్ ష్ ష్ బామ్మా బామ్మా ....... నాపై ఉన్న ప్రేమతో , అసలు మ్యాటర్ మరిచిపోయినట్లున్నారు - ఎంత కోప్పడితే అంత ప్రేమ కదా ....... అని మొబైల్లో గుసగుసలాడాను .
బామ్మ : అవునుకదా ........ లవ్ యు లవ్ యు ఎంజాయ్ అని నవ్వుకున్నారు .
బామ్మా ....... లైన్లోనే ఉంచుతాను మా టామ్ & జెర్రీ చిలిపిని విని ఆనందించండి .
బామ్మ : లవ్ యు ........

దేవత ....... నావైపు రావడం చూసి మొబైల్ తీసుకుంటారేమోనని అనుకున్నాను కానీ హోమ్ వర్క్ చూయించమన్నారు .
ఓహ్ yes మేడం ....... అంటూ అందించాను .
దేవత : All క్లాస్సెస్ హోమ్ వర్క్ ఫినిష్ చేసి ఉండటం చూసి , ఇలాంటి వాటిలో పర్ఫెక్ట్ గా ఉంటాడు నాతోమాత్రం అల్లరిచేస్తాడు అని బుక్ తో కొట్టబోతే ........
కమాన్ కమాన్ గో ఎహెడ్ మేడం - ఏమాత్రం ఆలోచించకండి , ఎక్కడ తలపైననే కదా అని లేచి చేతులుకట్టుకుని తలను దేవతవైపు వంచాను .
దేవత : క్రేజీ మహేష్ ....... అంటూ బుక్ టేబుల్ పై ఉంచి నవ్వుకుంటూ వెళ్ళిపోయి క్లాస్ స్టార్ట్ చేశారు .
కన్నార్పకుండా దేవతవైపే చూస్తుండటం చూసి కోప్పడుతూ - లోలోపలే నవ్వుకుంటూ నెక్స్ట్ రెండు క్లాస్ లు ఫినిష్ చేశారు .

లంచ్ బెల్ మ్రోగడంతో క్లాస్మేట్స్ అందరూ వాళ్ళ వాళ్ళ లంచ్ తీసుకుని గ్రౌండ్ కు పరుగులుతీశారు - మహేష్ మహేష్ ...... అందరమూ కలిసి తిందాము త్వరగా వచ్చెయ్యి అని వినయ్ చెప్పి వెళ్ళాడు . క్షణాలలో క్లాస్సెస్ - కారిడార్ నిర్మానుష్యం అయ్యాయి .
దేవత : బుజ్జిహీరోగారూ ....... మీ ఫ్రెండ్స్ పిలిచారుకదా వెళ్లు వెళ్లి భోజనం చెయ్యండి అని చెప్పారు .
మీతోపాటే ........
దేవత : what ? .
అదే తోకను కదా ........
దేవత : మొదట అన్నది నువ్వేకదా ...... , ఎనీవే sorry వెళ్లు వెళ్లి లంచ్ చెయ్యి .
మేడం నో ....... మీరు sorry చెప్పేరోజు ఎప్పటికీ రాకూడదు - మీ స్థానం అక్కడ అంటూ ఎవరెస్ట్ అంతకు చూయించాను .
దేవత : నిన్నూ ....... సందు దొరికితే చాలు , స్టార్ట్ చేసేస్తావు అని బుక్స్ - హ్యాండ్ బ్యాగ్ అందుకున్నారు .

అంతలో క్లాస్రూంలోకి హెడ్ మాస్టర్ కన్నింగ్ స్మైల్ తో వచ్చాడు . ఆ ...... మేడం అవంతికా ఇక్కడున్నారన్నమాట , కమాన్ కమాన్ ....... ఇప్పటికే ఆలస్యం అయ్యింది shall we go ........
దేవత : where సర్ ? .
హెడ్ : ఎక్కడికి ఏమిటి ....... , నిన్న వీలుకాదు ఇవాళ లంచ్ కు వెళదామని ప్లాన్ చేసుకున్నాము కదా ...... - ఫైవ్ స్టార్ హోటల్లో టేబుల్ బుక్ చేసాను మన ఇద్దరి కోసం , లంచ్ చేశాక మన ఇష్టం ....... - స్టూడెంట్ ...... వెళ్లు గ్రౌండ్కు వెళ్లి తిను .
నాకైతే పిచ్చ కోపం వచ్చేస్తోంది .
దేవత : Mind your words సర్ ...... , మీతో లంచ్ కు వస్తానని నేను చెప్పనేలేదే , నాకు రావడం ఏమాత్రం ఇష్టం లేదు . ఇదేవిషయాన్నే నిన్నకూడా చెప్పాను .
హెడ్ : స్టూడెంట్ ఇంకా ఇక్కడే ఉన్నావు - గెట్ ఔట్ .......
నేను వెళ్లను సర్ - క్లాస్ వర్క్ ఉంది చేసుకోవాలి .
హెడ్ : తరువాత చేసుకోవచ్చు వెళ్లు .......
నో సర్ ........
హెడ్ : what .... ? , నాకే ఎదురుచెబుతావా అని టేబుల్ పై ఉన్న బెత్తం తీసుకుని కొట్టడానికి వచ్చాడు .
దేవత : stop it సర్ - మహేష్ ...... I'll హ్యాండిల్ మైసెల్ఫ్ - please నువ్వు బయటకువెళ్లు ........
మేడం ....... , he is bad అని కళ్ళతోనే వ్యక్తపరిచాను .
దేవత : నేను హ్యాండిల్ చేస్తాను అని కళ్ళతోనే తెలపడంతో .......
ఇష్టం లేకపోయినా హెడ్ వైపు కోపంతో - దేవతకు జాగ్రత్త అనిచెప్పి బయటకువచ్చి కంగారుపడుతున్నాను ఏమిచెయ్యాలో తెలియక ........ - పెద్దమ్మను తలుచుకున్నాను .
మెసేజ్ : " నేను లేనూ ....... "

హెడ్ : నీకోసం వేలరూపాయలు ఖర్చుపెట్టి టేబుల్ రిజర్వ్ చేసాను , ఇప్పుడు నో అంటే వధులుతాను అనుకున్నావా ? .
సర్ ...... నాకిలాంటివన్నీ ఇష్టం లేదని నిన్ననే చెప్పాను .
హెడ్ : నాకు చాలా చాలా ఇష్టం - నువ్వు వచ్చిన తొలిరోజునే ఫిక్స్ అయిపోయాను నిన్ను ఎలాగైనా ...... ఇన్నిరోజులు ఎలా అగానో నాకే అర్థం కావడం లేదు అంటూ చెయ్యి అందుకునేంతలో .......
చెంప చెల్లుమనిపించబోయి సెంటీమీటర్ ముందు ఆగి , తాకడం కూడా ఇష్టం లేదు వెళ్లిపోండి ఇక్కడినుండి .
కానీ హెడ్ చెంప చెళ్లుమన్నట్లు సౌండ్ మరియు ఆ ఫోర్స్ దెబ్బకు గోడకు గుద్దుకుని అమ్మా అంటూ కేకవేస్తూ ధడేల్ మంటూ కిందపడ్డాడు .
దేవత చేతిని చూసుకుంటూ ఆశ్చర్యపోతుంటే నేనైతే షాక్ లో ఉండిపోయాను - అప్పుడు తెలిసింది పెద్దమ్మ ...... మమ్మల్ని కరుణించడానికి వచ్చిన నిజమైన దేవత అని - వెంటనే లెంపలేసుకున్నాను పెద్దమ్మా ...... ఏమైనా తప్పులు చేసిఉంటే క్షమించండి అని అక్కడికక్కడే గుంజీలు తీసాను .

లోపల హెడ్ : నన్నే కొడతావా ..... ? , ఈ క్షణమే నిన్ను తీసేస్తున్నాను గెట్ ఔట్ ఆఫ్ మై కాలేజ్
దేవత : నన్ను నియమించింది మేనేజ్మెంట్ ...... , ఏ రీజన్ లేకుండా నన్ను తీసేసే రైట్ మీకులేదు .
హెడ్ : అవును నిజమే ....... , నిన్ను వలలో వేసుకోవాలని ఇన్నిరోజులు ఎందుకు వేచిచూశానో తెలుసా ...... , నిన్ను ...... మేనేజ్మెంట్ అంత త్వరగా కాలేజ్ ఇంగ్లీష్ హెడ్ గా నియమించడానికి కారణం - ప్రతీ సంవత్సరం వైజాగ్ లోని కాలేజ్స్ అన్నీ ఒక కాంపిటీషన్ నిర్వహిస్తాయి , ప్రతీ కాలేజ్ తరుపున ఇంగ్లీష్ లిటరేచర్ లైక్ " classics - Adventure - tragedy - science - fiction - message oriented...... " నావెల్ సబ్మిట్ చెయ్యాలి . ఇంతకుముందున్న ఇంగ్లీష్ టీచర్స్ అంత సడెన్ గా ఎందుకు వెళ్లిపోయారనుకున్నావు - కాలేజ్ హిస్టరీలో ఇప్పటివరకూ ఆ కాంపిటీషన్ లో మన కాలేజ్ కు ఒక్కసారి కూడా బహుమతి కాదు కదా టాప్ 10 లోకూడా చోటు దక్కలేదు , ఆ ఒత్తిడి పెరగడంతో వెళ్లిపోయారు - అదేసమయానికి నీ resume మేనేజ్మెంట్ చూసి ముందూ వెనుకా ఆలోచించకుండా సెలెక్ట్ చేశారు . హెడ్ మాస్టర్ గారూ ....... సమయం లేదు కాబట్టి ఫస్ట్ ప్లేస్ - లాస్ట్ ప్లేస్ గురించి వదిలెయ్యండి జస్ట్ నావెల్ సబ్మిట్ చేసేలా చూసి మన కాలేజ్ పరువు పోకుండా చూసే బాధ్యత మీదే అని చెప్పారు . మీరు వచ్చినరోజునే ఆ విషయం చెబుదామనుకుని మిమ్మల్ని పిలిపించాను - మిమ్మల్ని చూడగానే మీ అందానికి ........ - ఈరోజే సాయంత్రం లోపు నావెల్ సబ్మిట్ చెయ్యాలి , చెయ్యకపోతే మేనేజ్మెంట్ వాళ్లే నిన్ను గెట్ ఔట్ అంటారు ఎలా ఉంది నా ప్లాన్ - నేను చెప్పినట్లు ఒప్పుకుంటే నా ఫ్రెండ్ రైటర్ , అక్కడి నుండి మీ పేరున నావెల్ సబ్మిట్ చేయిస్తాను . అన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి - మీ
జాబ్ మీకు ఉంటుంది , నా కోరిక ........
అంతే దేవత మరొకసారి కొట్టబోయి , ఇలాంటి మృగాన్ని తాకడం ఇష్టం లేనట్లు ఆగిపోయారు కానీ దెబ్బపడి ఎగిరి టేబుల్స్ పై పడటంతో విరిగిపోయి సందులో పది లబోదిబో మొత్తుకుని , అయినా తిక్క కుదరనట్లు కష్టంగా లేచి బాగా ఆలోచించుకో సాయంత్రం 4 గంటలవరకే నీకు సమయం - ప్రతీ కాలేజ్ మేనేజ్మెంట్ అక్కడే ఉంటుంది మన కాలేజ్ మేనేజ్మెంట్ కూడా ..... కనీసం నావెల్ సబ్మిట్ చెయ్యకపోతే అక్కడికక్కడే పరువు పోతుంది - కోపంతో నిన్ను అక్కడే పీకేస్తారు హబ్బా హమ్మా అని కుంటుకుంటూ వెళ్ళిపోతున్నాడు .
కోపం పట్టలేక ఒక్క తన్ను తన్నాలని దేవత బాధపడుతుండటం చూసి లోపలికివచ్చాను .
Next page: Update 72
Previous page: Update 70