Update 74

బామ్మా బామ్మా ...... ఒంటరిగా నాకు భయమేస్తోంది - ఇక్కడ కూడా నా స్టూడెంట్ బుజ్జిహీరో ఉంటే బాగుండేది - తప్పు తప్పు ఇలా కోరుకోవడం తప్పు , తన బామ్మగారిని చూసుకోవాలికదా అంటూ లెంపలేసుకున్నారు దేవత .......
బామ్మా ....... వెళ్ళండి , నేను హోమ్ వర్క్ చేసుకుని .......
బామ్మ : భోజనం మాత్రం ఇక్కడే చెయ్యాలి , ఎంత ఆలస్యమైనా సరే రావాలి , ఆకలివేస్తే కాల్ చెయ్యి ఫుడ్ అక్కడికే పంపిస్తాను .
లేదు లేదు బామ్మా ...... , మీతో కలిసి తినాలని ఆశ ......
బామ్మ : అయితే మరీ మంచిది అంటూ నా నుదుటిపై ముద్దుపెట్టారు . బుజ్జితల్లీ ....... వస్తున్నాను అని లేచి లంచ్ బ్యాగ్ తీసుకుని కిందకువెళ్లి , నా దేవతను లోపలికి తీసుకెళ్లగానే బ్యాగు వేసుకుని కిందకుదిగి వెళ్లి ఔట్ హౌస్ చేరుకున్నాను .

బ్యాగుని బెడ్ పై ఉంచి ఫ్రెష్ గా స్నానం చేసి వేరే డ్రెస్ వేసుకుని , పెద్దమ్మ పేపర్ ముందు కూర్చున్నాను .
పెద్దమ్మా ...... అక్కయ్యకు చూపు వచ్చే మార్గం చూయించండి - చిన్నవాడినైనా ఎంత కష్టమైనా నేను చేస్తాను , నా దేవత మరియు బామ్మ కోరిక కూడా అదే అంటూ భక్తితో ప్రార్థించాను . మాకు అంటే అబ్బాయిలకు చూపు లేకపోతే ఎలాగోలా జీవనం కొనసాగిస్తాము కానీ అమ్మాయిలకు చాలా కష్టం - ఈరోజు జరిగినది మీరు చూసే ఉంటారు , ఈరోజే ఇలా జరిగిందంటే ఇన్నిరోజులూ ........ నో నో నో అలా ఇక ఎప్పటికీ జరుగకూడదు , అక్కయ్య చాలా చాలా మంచివారు - వారి బామ్మ కళ్ళు ఇస్తాను అన్నా వద్దు అని చెప్పారు అంటే అర్థమవుతోంది - మీకు చెప్పాల్సిన అవసరం లేదు , పెద్దమ్మా ....... please please అంటూ కన్నీళ్ళతో ప్రార్థించాను .
లేచి ఫ్రెండ్స్ కు కాల్ చేసి హోమ్ వర్క్ ఏమిటో తెలుసుకుని 8: 30 లోపు ఒక్క సబ్జెక్ట్ తప్ప అన్నీ పూర్తిచేసాను .
అదేసమయానికి ఫ్రెండ్స్ అందరూ వచ్చి హోమ్ వర్క్ మొదలుపెట్టారు . నేనూ అప్పుడే స్టార్ట్ చేసినట్లు వెళ్లి కూర్చుని అర గంటలో మిగిలిన సబ్జెక్ట్ కూడా పూర్తిచేసి , నా హోమ్ వర్క్ అయిపోయింది ఫ్రెండ్స్ గుడ్ నైట్ గుడ్ నైట్ - కాలేజ్ కు కలర్ డ్రెస్ తో వెళ్లడం వలన గ్రౌండ్ చుట్టూ రన్నింగ్ పనిష్మెంట్ వలన చాలా అలసిపోయాను వెళ్లి పడుకుంటాను అనిచెప్పి నీరసం నటిస్తూ ఔట్ హౌస్ చేరుకున్నాను .

బుక్స్ బ్యాగులో ఉంచేసి , లోపల నుండి గెళ్ళెం పెట్టేసి , ఔట్ హౌస్ వెనుక నుండి కాంపౌండ్ గోడను జంప్ చేసి నా దేవత ఇంటికి చేరుకున్నాను .
నాకోసమే ఎదురుచూస్తున్నట్లు గుమ్మంలో కూర్చున్న బామ్మ , ఆగమని చేతితో సైగచేసి పైకి వెళ్ళమని చూయించారు .
అంటే ఇంకా దేవతపడుకోలేదన్న మాట అంటూ నెమ్మదిగా మెయిన్ గేట్ తెరుచుకుని పైకివెళ్ళాను . పైన లైట్ వేసి డిన్నర్ కోసం దుప్పటిపై అంతా సెట్ చేసి ఉండటం చూసి ఆనందించాను .

బుజ్జితల్లీ ...... నేను పైన భోజనం చేస్తాను - నీకు నిద్ర వస్తే పడుకో అని కేకవేసి పైకివచ్చారు బామ్మ .......
బామ్మా ...... ఒంటరిగా భయపడి పైకి వచ్చేస్తేనూ ......
బామ్మ : నీ బుజ్జితల్లికి ప్రక్కనే ఉన్న ఈ బూత్ బంగ్లా అంటే మహా భయం , పైకి అస్సలు రాదు అని నవ్వుకున్నారు . ఈపాటికి అలసిపోయి పడుకునేది - నువ్వు పూర్తిచేసిన నవల కోసం ఇల్లంతా వెతికేస్తోంది , ఎంత వెతికినా దొరకదు కదా అని వడ్డించారు .
మీ బుజ్జితల్లికి కూడా తెలుసు బామ్మా ...... , కానీ ఎవరు కాంపిటీషన్ లో సబ్మిట్ చేశారో అర్థం కావడం లేదు - నేనే ...... మీకు కాల్ చేసి ఆ అడ్రస్ లో మీ బుజ్జితల్లి తరుపున సబ్మిట్ చెయ్యమని కాల్ చెయ్యబోయి ఆగిపోయాను - అంతదూరం మా బామ్మను ఒంటరిగా పంపించడం ఇష్టం లేక ...... , ఎవరోకానీ చివరి నిమిషంలో సబ్మిట్ చేసి దేవత టెన్షన్ మొత్తాన్ని పోగొట్టారు .
బామ్మ : ఎవరో ఏమిటి , నేనే ...... బుజ్జిహీరో , నువ్వే కదా నీ నెంబర్ నుండే కాల్ చేసి నవలను ఒక ఆడ్రెస్ లో నీ దేవత పేరు - కాలేజ్ తరుపున సబ్మిట్ చెయ్యమని చెప్పావు . వెంటనే నవల తీసుకుని ఇంటికి లాక్ చేసేంతలో ఒక కారు వచ్చి ఆగింది - మీ బుజ్జి మహేష్ పంపించాడని డ్రైవర్ డోర్ తీసి కూర్చోబెట్టుకుని ఆ ఆడ్రెస్ కు సేఫ్ గా తీసుకెళ్లి సేఫ్ గా ఇంట్లో వదిలి థాంక్స్ చెప్పేలోపు వెళ్ళిపోయాడు .
నేనా ...... అంటూ షాక్ లో ఉండిపోయాను .
బుజ్జిహీరో బుజ్జిహీరో .......
నేనసలు కాలే చెయ్యలేదు బామ్మా కావాలంటే చూడండి అంటూ మొబైల్ తీసి చూస్తే లంచ్ టైం రీసెంట్ కాల్స్ లో బామ్మ అని ఉంది - అంతే మరింత షాక్ ......
బామ్మ : చూశావా ....... ? .
నేనైతే అస్సలు చెయ్యలేదు బామ్మా - మిమ్మల్ని అంతదూరం పంపిస్తానా ...... ? .
బామ్మ : లేదు , అయితే ఎలా ...... ఆ ఆ ఖచ్చితంగా మన దైవం పెద్దమ్మే ఇదంతా చేసి ఉంటారు అంటూ సంతోషంతో ప్రార్థించారు .
అవును బామ్మా ...... పెద్దమ్మనే అంటూ కళ్ళు మూసుకుని మొక్కుకున్నాను - నవల సబ్మిట్ చెయ్యకపోతే దేవత కళ్ళల్లో కన్నీళ్లు ఆగేవి కావు , థాంక్యూ థాంక్యూ థాంక్యూ soooooo మచ్ పెద్దమ్మా ...... ఇప్పుడు హ్యాపీగా తింటాను - కానీ అక్కయ్య అంటూ లేచి బామ్మ ప్రక్కన చేరాను .
బామ్మ : నీ దేవత బాధపడితే నువ్వు బాధపడతావంటేనే ఇంత చేశారు - ఇక నువ్వు నీ దేవత నేను కూడా బాధపడతామంటే చూస్తూ ఊరుకుంటారా చెప్పు బుజ్జిహీరో ....... , పెద్దమ్మకు కాస్త సమయం ఇవ్వు అని ప్రాణంలా తినిపించారు .
అలాగే బామ్మా ....... , పెద్దమ్మా పెద్దమ్మా పెద్దమ్మా ...... అని ప్రార్థిస్తూనే తిన్నాను .

ఉదయం బస్టాప్ లో బస్సు ఎక్కిన క్షణం నుండీ అక్కయ్యను ఇంటివరకూ వదిలి చిరునవ్వులు పంచడం వరకూ దేవతతో జరిగిన చిలిపి మధురమైన అనుభూతులన్నింటినీ బామ్మ ఒడిలో వాలి నవ్వుతూ - సంతోషిస్తూ - సిగ్గుపడుతూ చెప్పాను .
బామ్మ : నీ దేవతతో అంతలా ఎంజాయ్ చేశావన్నమాట , చాలా చాలా సంతోషం బుజ్జిహీరో ...... , ఎన్ని దెబ్బలు 1 2 3 .......
బామ్మా బామ్మా బామ్మా ....... మీ బుజ్జితల్లిని కొట్టనని మాటిచ్చారు .
బామ్మ : ఇచ్చేసానా ..... ? , నిజంగానే ఇచ్చానా బుజ్జిహీరో ...... ? .
ఇంతకుముందే ప్రామిస్ చేశారు బామ్మా , మా మంచి బామ్మా ....... అని బుగ్గపై చేతితో ముద్దులుపెడుతూ నవ్వుకున్నాను . అమ్మో ...... 11 గంటలు అయ్యింది - కింద దేవత ఒంటరిగా ఉన్నారు వెళదాము బామ్మా .......
బామ్మ : లవ్ యు బుజ్జిహీరో ....... దేవత అంటే ప్రాణం కంటే ఎక్కువ అంటూ బుగ్గలను అందుకుని నుదుటిపై ముద్దుపెట్టారు . బుజ్జిహీరో ...... నేను పాత్రలన్నింటినీ శుభ్రం చేస్తాను అంతవరకూ నిద్రపోతున్న నీ దేవతను కనులారా తిలకిస్తూ ప్రక్కనే నీకోసం ఏర్పాటుచేసిన బెడ్ పై పడుకో .......
లవ్ యు sooooo మచ్ బామ్మా ...... అంటూ పాత్రలను ఎత్తుకుని చప్పుడు చెయ్యకుండా కిందకువచ్చి వంట గదిలో ఉంచాను .
బామ్మ : నా బుజ్జిహీరో బంగారం , వెళ్లు వెళ్లు నీ దేవత దగ్గరికి వెళ్లు అని ప్రాణంలా తోసేశారు .
నవ్వుకుని , దేవత గదిలోకి వెళ్ళాను .

హాయిగా నిద్రపోతున్న దేవతను చూడగానే నవ్వు వచ్చేస్తోంది - నవ్వు దేనికో ఈపాటికి మీకర్థమయ్యే ఉంటుంది .
Yes yes ...... దేవత నోటిలో బొటన వేలుని చప్పరిస్తూ పడుకుని ఉండటం చూస్తే ముచ్చటేస్తోంది . లవ్లీ లవ్లీ అంటూ నవ్వుతూనే నెమ్మదిగా దగ్గరకు వెళ్ళాను . బామ్మ చెప్పినట్లుగానే దేవత పడుకున్న మాస్టర్ బెడ్ ప్రక్కనే ఆనుకుని సింగిల్ బెడ్ ఉంది .
అమ్మో ....... దేవత ప్రక్కన పడుకోవడమా ఇంకేమైనా ఉందా అంటూ అతినెమ్మదిగా కాస్త దూరం లాగాను - క్రిక్ మని సౌండ్ రావడం దేవత డిస్టర్బ్ అయినట్లు కదలడంతో ఆగిపోయాను . Sorry sorry మేడం ......- పెద్దమ్మా ...... please ప్లీజ్ సౌండ్ రాకూడదు అని మొక్కుకుని అత్యంత నెమ్మదిగా లాగాను .
సౌండ్ రాకపోవడంతో పెద్దమ్మకు థాంక్స్ చెప్పి కొన్ని అడుగుల దూరం లాగేసి , దేవతను కనులారా తిలకిస్తూ , అప్పుడప్పుడూ దేవత వేలుని మరింతగా నోటిలోకి తీసుకోవడం చూసి ఎంజాయ్ చేస్తున్నాను .

ఉమ్మా ...... అంటూ నా తలపై ముద్దు - నీ దేవతను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నావా అంటూ ప్రక్కనే కూర్చున్నారు బామ్మ .
ష్ ష్ బామ్మా .......
బామ్మ : లవ్ యు బంగారూ ...... అంటూ రెండుచేతులతో చుట్టేసి నుదుటిపై ముద్దుపెట్టారు . బుజ్జిహీరో ....... ఉదయం మన ఇంటి దగ్గర మొదలెట్టి బస్సులో - కాలేజ్లో - మళ్లీ బస్సులో - ఇలా రాత్రి మన ఇంటిలో చూస్తూనే ఉన్నావు కదా బోర్ కొట్టడం లేదా అని గుసగుసలాడారు .
అదేంటో తెలియదు బామ్మా ...... మీరు చెప్పిన దగ్గరే కాకుండా రోజంతా 24 గంటలూ ...... చూస్తూనే ఉండాలనిపిస్తుంది . ఎంతసేపు ప్రాణంలా చూస్తే ఇక్కడ అంత సంతోషం కలుగుతోంది అంటూ గుండెలపై చేతినివేసుకున్నాను . నిద్రపోతే చూడలేకపోతాను అని నిద్రకూడా పొబుద్దికాదు .
బామ్మ : ఉమ్మా ఉమ్మా ...... నీకిష్టమైన నీ బామ్మ ఒడిలో పడుకుని నీ ఇష్టమైనంతవరకూ చూస్తూ పడుకో , ప్రాణంలా జోకొడతాను .
నిన్న కూడా అలాగే అని రాత్రంతా నిద్రపోకుండా జోకొడుతూనే ఉన్నారు , నో నో నో వెళ్లి దేవత ప్రక్కన పడుకోండి బామ్మా ........
బామ్మ : నా బంగారం ........ , నీకు ....... నీ దేవతను 24 గంటలూ ఎలా చూస్తూనే ఉండాలనిపిస్తుందో నాకు కూడా నా బుజ్జిహీరోను అలానే చూస్తూ ఉండాలని ఆశ - నివ్వేమో ...... నీ దేవతను బస్సులో కాలేజ్లో ఇంటిలో బానే చూస్తున్నావు ప్రాణంలా చూసుకుంటున్నావు , మరి నాకు అవకాశం లభించేది రాత్రికి మాత్రమే కదా ....... , అయినా మీరు కాలేజ్ కు వెళ్ళాక నాకేమి పని ఉంటుంది చెప్పు మధ్యాహ్నం వరకూ నిద్రపోయాను , నీ కాల్ రావడంతో లేచాను , రేపు కూడా అలాగే పడుకుంటానులే ...... , నీకొక రూల్ నాకొక రూలా ....... అంటూ బుంగమూతిపెట్టుకున్నారు .
నవ్వుకుని లవ్ యు లవ్ యు బామ్మా ....... , సరే నాకు ఇష్టమైన మా బామ్మ ఓడిలోనే పడుకుంటాను - మీకు నిద్ర రాగానే వెళ్లి పడుకోవాలి సరేనా .......
బామ్మ : సరే సరే అంటూ సంతోషంతో కేక వెయ్యబోయి నోటీకి చేతిని అడ్డుపెట్టుకుని హమ్మయ్యా అనుకున్నారు . లవ్ యు లవ్ యు బంగారూ అంటూ నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి పడుకో అన్నారు .

చెల్లి కావ్యకు చూపు రావాలి - చెల్లి కావ్యకు చూపు రావాలి అని నిద్రలోనే దేవత కలవరించడం చూసి ఇద్దరి కళ్ళల్లో చెమ్మ చేరింది .
ఇద్దరమూ మళ్లీ పెద్దమ్మను ప్రార్థించాము - పెద్దమ్మా ...... please ప్లీజ్ అక్కయ్యకు చూపును తెప్పించండి - దానికి ప్రతిఫలంగా ఏమైనా చేస్తాము .

బామ్మా ...... లైట్స్ ఆఫ్ చెయ్యండి , మీ బుజ్జితల్లి ఇబ్బందిపడుతున్నారు .
బామ్మ : మరి నీకు కనిపించదు కదా .......
పెద్దమ్మను తలుచుకుంటే X- ray కళ్ళు ఇస్తారు - ఎంత చీకటిలోనైనా ఎంత దూరంలో ఉన్నా క్లియర్ గా కనిపిస్తారు . బామ్మా ....... దేవత మరింత వెలుగులో కనిపిస్తున్నారు .
బామ్మ : నాకు కూడా నా బుజ్జిహీరో ........
అంటే మీరు కూడా పెద్దమ్మను ....... అంటూ నవ్వుకున్నాము సౌండ్ లేకుండా .....
దేవతను చూస్తూ చూస్తూనే హాయిగా నిద్రపోయాను .
***********

అలారం చప్పుడుకు దేవత మేల్కొని గుడ్ మార్నింగ్ బామ్మా ....... అంటూ కళ్ళు తిక్కుకుంటూ బాత్రూం వైపుకు వెళ్లిపోయారు నిన్నటిలానే ......
హమ్మయ్యా అని నవ్వుకుని లేచికూర్చున్నాను . నాకు జోకొడుతూనే గోడకు ఆనుకుని నిద్రపోతున్న బామ్మపై తియ్యనికోపం వచ్చింది - బామ్మా ...... అంటూ మురిసిపోతూ అతిజాగ్రత్తగా బెడ్ పై పడుకోబెట్టాను . నాకు జోకొడుతూ ఎప్పుడు నిద్రపోయారో ఏమో హాయిగా నిద్రపోండి అని దేవత కప్పుకున్న దుప్పటిని అందుకుని ఆఅహ్హ్ ...... అంటూ గుండెలపై హత్తుకుని నన్ను నేను మరిచిపోయాను . బామ్మ చలికి ముడుచుకోవడం చూసి మొట్టికాయ వేసుకుని బామ్మ భుజాలవరకూ కప్పి గుడ్ మార్నింగ్ బామ్మా అంటూ బుగ్గపై ముద్దుపెట్టాను .
గుడ్ మార్నింగ్ బుజ్జిహీరో ...... అంటూ నిద్రలోనే కలవరించారు బామ్మ .
నవ్వుకుని డోర్ తాళం తెరిచి , తలుపులు ముందుకువేసుకుని ఔట్ హౌస్ చేరుకున్నాను .

రోజూలానే ఫ్రెష్ అయ్యి కాలేజ్ డ్రెస్ వేసుకునేంతలో కాలింగ్ బెల్ మ్రోగింది . బామ్మ ....... టిఫిన్ పంపించారు అని పెదాలపై చిరునవ్వులతో ఓపెన్ చేసి క్యారెజీ అందుకుని తిన్నాను . క్యారెజీ శుభ్రం చేసి కాలేజ్ బ్యాగ్ మరియు శుభ్రం చేసిన క్యారీజీతోపాటు బయటకువచ్చాను .
మురళి కూడా అదేసమయానికి కాలేజ్ బ్యాగుతో బయటకు రావడం చూసి , మురళి సర్ ...... మీ పనిష్మెంట్ ఇంకా పూర్తికాలేదు కాలేజ్లో కలుద్దాము అని వెనుతిరిగిచూడకుండా బయటకువచ్చాను . నాకది పనిష్మెంట్ కాదు మురళీ అనుకుని నవ్వుకుంటూ దేవత ఇంటికి పరుగుతీసాను - దేవత ...... బామ్మను కౌగిలించుకుని వెళ్ళొస్తాను అంటూ హ్యాండ్ బ్యాగ్ - లంచ్ బ్యాగుతోపాటు మెయిన్ గేట్ వైపు నడిచారు , మధ్యమధ్యలో బుగ్గలను రుద్దుకుంటున్నారు .

దేవత కాస్తదూరం వెళ్లగానే , బామ్మ దగ్గరికి చేరి దేవతను కొట్టనని ప్రామిస్ చేసి కొట్టారు కదూ అని బుంగమూతిపెట్టుకునే నవ్వుతున్నాను - నేనంటే బామ్మకు ఎంత ప్రాణమో అర్థమయ్యి .......
బామ్మ : లేదు లేదు , నా బుజ్జి బంగారానికి ప్రామిస్ చేసి కొడతానా చెప్పు - బుగ్గలను గట్టిగా గిల్లేసాను అంతే .......
బామ్మా ........
బామ్మ : కొట్టనని ప్రామిస్ చేసాను కానీ గిళ్లను అని చెప్పలేదుకదా ....... - లేకపోతే నా బుజ్జిహీరోనే కొడుతుందా ...... ? అంటూ కౌగిలిలోకి తీసుకుని ముద్దుపెట్టారు .
నవ్వగానే , టిఫిన్ క్యారెజీ అందుకుని గుమ్మం ప్రక్కనే ఉంచిన లంచ్ బ్యాగ్ అందించారు .
అమ్మో ....... దేవత ఫాస్ట్ గా వెళ్లిపోతున్నారు అని బామ్మ బుగ్గపై ముద్దుపెట్టి , బై చెప్పి పరుగుతీసాను .
బామ్మ : జాగ్రత్త బంగారూ ...... బై ......

మెయిన్ గేట్ బయట లేడీ సెక్యూరిటీ ఆఫీసర్లు ...... దేవతతో మాట్లాడుతుండటం - ప్రక్కనే సెక్యూరిటీ అధికారి జీప్ చూసి , కంగారుపడుతూ మరింత వేగంగా దేవతను చేరుకున్నాను .
లేడీ సెక్యూరిటీ అధికారి : మేడం ...... నిన్న బస్సులో నలుగురిని కొట్టింది మీరేనా ..... ? .
జీప్ లో ఆటో డ్రైవర్ అంకుల్ కూడా ఉండటం చూసి , వారికేమైనా అయ్యిందా ...... ? , కొట్టింది నేనే నన్ను అరెస్ట్ చెయ్యండి అన్నాను .
దేవత : లేదు లేదు మేమే రక్తం వచ్చేలా కొట్టింది - చిన్నపిల్లాడు ఎలా కొడతాడు చెప్పండి - నన్ను తీసుకెళ్లండి ......
లేడీ సెక్యూరిటీ అధికారి : నో నో నో అలాంటిదేమీ లేదు , మా SI సర్ మీ ఇద్దరినీ పిలుచుకుని రమ్మన్నారు .
సెక్యూరిటీ అధికారి మేడం ....... , మేడం కు ఎటువంటి సంబంధం లేదు , అదిగో బస్ వస్తోంది - మేడం ...... మీరు కాలేజ్ కు వెళ్ళండి , నేను SI సర్ ను కలిసి అటునుండి ఆటే కాలేజ్ కు వచ్చేస్తాను .
దేవత : నో నో నో నేను వెళ్లను , సెక్యూరిటీ అధికారి మేడం ...... నేనూ వస్తాను పదండి అని జీప్ వైపు అడుగులువేశాము .
లేడీ సెక్యూరిటీ అధికారి : అరెస్ట్ కాదు మేడం - బాబూ ...... , మిమ్మల్ని జాగ్రత్తగా పిలుచుకురమ్మని SI గారు వారి సొంత కారుని పంపించారు , రండి అంటూ పిలుచుకునివెళ్లి జీప్ ప్రక్కనే ఉన్న కార్ డోర్స్ తెరిచారు .
ఆశ్చర్యపోతూనే ఒకరినొకరం చూసుకుని లగ్జరీ కారులో వెనుక ప్రక్కప్రక్కనే కూర్చున్నాము .
లేడీ సెక్యూరిటీ అధికారి : అంకుల్ ...... మీరుకూడా అంటూ పిలిచి ముందు సీట్లో కూర్చోబెట్టారు .
లేడీ సెక్యూరిటీ అధికారి స్వయంగా డ్రైవ్ చేస్తూ 20 నిమిషాలలో govt హాస్పిటల్ కు తీసుకెళ్లారు .

మేడం ....... హాస్పిటల్ కు అంటే , ఎముకలు విరిగేలా కొట్టేసినట్లున్నాము .
దేవత : వాళ్లకు ఆ శిక్ష పడాల్సిందే బుజ్జిహీరో ..... - you are a real బుజ్జిహీరో ....... లేకపోతే మీ అక్కయ్యను , నా చెల్లిని ఏడిపిస్తారా ? .
లేడీ సెక్యూరిటీ అధికారి : మేడం - బాబూ - అంకుల్ ....... లోపలికి రండి అని ఆరడుగుల ఎత్తున్న సెక్యూరిటీ అధికారి దగ్గరికి తీసుకెళ్లారు .
సెక్యూరిటీ అధికారి : ప్రౌడ్ ఆఫ్ యు మై బాయ్ - మేడం అంటూ నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి , దేవతకు నమస్కరించారు . ఇంత చిన్నవయసులో అంత ధైర్యం శభాష్ సెల్యూట్ చేస్తున్నాను . లేడీస్ తో కుమ్మించావట కదా హాట్సాఫ్ ....... , sorry నేనే స్వయంగా రావాల్సినది - మిస్ కావ్య అదే అదే మీ ఇద్దరి తోబుట్టువు దగ్గర ఉండాల్సి వచ్చింది.
అక్కయ్య - చెల్లి ....... అంటూ ఇద్దరమూ కంగారుపడ్డాము . సెక్యూరిటీ అధికారి సర్ - సర్ .... అక్కయ్యకు - చెల్లికి ఏమయ్యింది ...... ఎక్కడ ఉన్నారు అంటూ చుట్టూ చూస్తున్నాము .
సెక్యూరిటీ అధికారి : నో నో నో కంగారుపడాల్సిన అవసరమే లేదు - ఇది సంతోషించాల్సిన విషయం . మీ అక్కయ్య ...... ఆపరేషన్ రూంలో ఉంది .
ఆపరేషన్ రూమ్ అంటూ ఇద్దరి కళ్ళల్లో కన్నీళ్లు వచ్చేసాయి .
సెక్యూరిటీ అధికారి : sorry sorry ఇంత ప్రాణమా - అక్కడ కావ్యకూడా ఇంతే మీరొస్తేనే కానీ ఆపరేషన్ చేయించుకోను అంటోంది . ముందు మీ ముగ్గురినీ కలపాలి లేకపోతే గోదావరి పారేలా ఉంది అంటూ ఆపరేషన్ రూమ్ కు తీసుకెళ్లారు .
ఆతృతగా డోర్ తెరిచాను . బెడ్ పై అక్కయ్య చిరునవ్వులు చిందిస్తుండటం చూసి ప్రాణం లేచొచ్చింది . అక్కయ్యా - చెల్లీ ...... అంటూ ఆప్యాయంగా పిలిచి బెడ్ దగ్గరకు వెళ్ళాము .
అక్కయ్య : తమ్ముడూ - అక్కయ్యా ....... అంటూ చేతులు చాపడంతో అందుకుని ముద్దులుపెట్టాము . మా బుగ్గలను స్పృశించి , బామ్మా ...... చెప్పానుకదా నేను హాస్పిటల్లో ఉన్నానని తెలియగానే కన్నీళ్లు వచ్చేస్తాయని .......
బామ్మ : అవును బుజ్జితల్లీ ...... ,నువ్వంటే ఎంత ప్రాణమో ఆ కన్నీళ్లే చెబుతున్నాయి .
అక్కయ్య : లవ్ యూ తమ్ముడూ - లవ్ యు అక్కయ్యా .......
లవ్ యు అక్కయ్యా - చెల్లీ ........
అక్కయ్య : sorry తమ్ముడూ ....... , కాలేజ్ కు వెళ్లే మిమ్మల్ని ఒకసారి కలవాలనిపించి పిలిపించాను - కలిశాను మీరు వెళ్ళండి సాయంత్రమే ఆపరేషన్ చేయించుకుంటాను కాలేజ్ వదిలాక ........
అక్కయ్యా - బామ్మా ....... ఆపరేషన్ ? .

సెక్యూరిటీ అధికారి : నిన్న మీరు పట్టించిన వాళ్లపై ఎన్నో కేసులు ఉన్నాయి . వాళ్ళల్లో ఒకరి కళ్ళు తీయించి మీ అక్కయ్యకు పెట్టించాలని నేనే నిర్ణయం తీసుకున్నాను .
అలాంటి రౌడీ కళ్ళు ....... ? .
సెక్యూరిటీ అధికారి : మీ అక్కయ్య కూడా అంతటి దుర్మార్గుడివి వద్దే వద్దు అన్నారు . నిజమే ....... అందుకే ఈరోజే ఒక రాజకీయనాయకుడి బంధువుకు ...... చనిపోతూ కళ్ళు దానం చేసిన ఒక పుణ్యాత్ముడివి పెట్టబోతున్నారు - డాక్టర్ ను కలిసి వాడు కూడా దుర్మార్గుడే కాబట్టి ఎక్స్చేంజి చెయ్యమని రిక్వెస్ట్ చెయ్యడంతో ఒప్పుకున్నారు .
సంతోషంతో అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి వెళ్లి , సెక్యూరిటీ అధికారి సర్ కు నమస్కరించాను .
సెక్యూరిటీ అధికారి : నాకు కాదు బాబూ ....... , రాత్రి కలలో దేవతలా ఈ ఐడియా ఇచ్చారు వారికి చెప్పు .......
దేవతనా ....... ? , ఇంకెవరు పెద్దమ్మనే అంటూ కళ్ళుమూసుకుని మొక్కుకున్నాను - థాంక్యూ థాంక్యూ పెద్దమ్మా ...... అంటూ సంతోషంతో అక్కయ్య దగ్గరికి చేరాను . అక్కయ్యా ...... కళ్ళు రెడీగా ఉన్నప్పుడు సాయంత్రం వరకూ ఎందుకు wait చెయ్యడం ....... ? .
అక్కయ్య : నాకు చూపు రాగానే మొదటగా నా ప్రాణమైన తమ్ముడు - అక్కయ్యనే చూడాలి . ఆ కోరిక తీరడం కోసం ఎంతసేపైనా - ఎన్నిరోజులైనా wait చేస్తాను .
మేము కాలేజ్ కు వెళ్లాలనా ....... ? , మా మంచి అక్కయ్య - ఒక్కరోజు కాలేజ్ కు వెళ్లకపోతే ఏమీ అవ్వదు - మా అక్కయ్యకోసం ఒక్కరోజు ఏమిటి సంవత్సరమైనా కాలేజ్ కు వెళ్ళకుండా ప్రక్కనే ఉండిపోతాను .
దేవత : నేను మాత్రం , నా అందమైన చెల్లిని వదిలి వెళతానా చెప్పు - సెక్యూరిటీ అధికారి సర్ ........ వెంటనే ఆపరేషన్ కు ఏర్పాటుచేయ్యండి - మేమిద్దరం ఇక్కడే ఉంటాము .
బామ్మ : తల్లీ - బాబూ ....... అంటూ ఆనందబాస్పాలతో మొక్కారు .
బామ్మా ....... చెప్పాముకదా ఓన్లీ ఆశీర్వాదం అంటూ చెరొకవైపు హత్తుకున్నాము .

సెక్యూరిటీ అధికారి : డాక్టర్ మేడం ....... విన్నారుకదా , ఆపరేషన్ కు ఏర్పాటు చెయ్యండి .
డాక్టర్: ఎప్పుడో రెడీ సర్ ....... - మీరంతా బయటకు వెళితే .......
సెక్యూరిటీ అధికారి : sure ....... , ఆపరేషన్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాము అని బయటకు వెళ్లారు.

మరికొద్దిసేపట్లో మా అక్కయ్యకు చూపు వచ్చేస్తుంది - ప్రపంచాన్ని చూడబోతున్నారు అంటూ మా నవ్వులను విని , అక్కయ్య సంతోషంతో నవ్వుకుని , తమ్ముడూ - అక్కయ్యా ....... మిమ్మల్ని - బామ్మను చూడటం కోసం మాత్రమే అంటూ చేతులపై ముద్దులుపెట్టి , ఆపరేషన్ సమయంలో నొప్పి ఎక్కువగా వేస్తుందట .......
అక్కయ్యా ...... అంటూ చేతిని హత్తుకున్నాను కన్నీళ్ళతో ......
అక్కయ్య : కన్నీళ్లు వచ్చేసాయా ....... ? , నాకు తెలుసు - పూర్తిగా వినండి , మీరిద్దరూ ....... ఒకేసారి రెండుమూడు ముద్దులుపెడితే ఆపరేషన్ మొత్తం హాయిగా ఉంటుంది .
రెండు మూడు కాదు అక్కయ్యా ...... బోలెడన్ని ముద్దులుపెడతాము - అక్కయ్యా ........ సెక్యూరిటీ అధికారి సర్ కలలో కనిపించినది , కనక దుర్గమ్మ పంపించిన మన దైవం పెద్దమ్మ - నొప్పివేసిన ప్రతీసారీ పెద్దమ్మను తలుచుకోండి అంటూ ప్రాణమైన ముద్దులు బోలెడన్ని పెట్టాము . డాక్టర్ మేడం ....... నొప్పిలేకుండా ఆపరేషన్ చెయ్యండి .
డాక్టర్ మేడం : చిన్న సూది గుచ్చుకున్నట్లుగా కూడా తెలియదు బాబూ ....... - దైర్యంగా ఉండండి .
థాంక్యూ థాంక్యూ మేడం అంటూ అక్కయ్య నుదుటిపై - బుగ్గపై - చేతిపై ముద్దులుపెట్టి , అక్కయ్యా ....... డోర్ ప్రక్కనే ఉంటాము అనిచెప్పి బామ్మను పిలుచుకుని బయటకువచ్చాము .
దేవత ....... కళ్ళుమూసుకుని ప్రార్థిస్తున్నారు .

ఆపరేషన్ లైట్ వెలుగగానే దేవతతోపాటు పెద్దమ్మను ప్రార్థించాను అక్కయ్యకు ఏమాత్రం నొప్పి తెలియకూడదు అని ....... , ఈ విషయం తెలిస్తే బామ్మ కూడా సంతోషిస్తారని ఇక్కడున్న బామ్మకు ధైర్యం చెప్పి ప్రక్కనే కుర్చీలో కూర్చోబెట్టాను . దేవత ప్రక్కనే కూర్చుని చేతిని అందుకుని ధైర్యం చెబుతున్నారు . డోర్ కు ఉన్న చిన్నపాటి మిర్రర్లో ఆపరేషన్ జరుగుతుండటం చూసి , కాస్త ముందుకువెళ్లి బామ్మకు కాల్ చేసి విషయం చెప్పాను - మీరు ఉంటే మీ చిట్టి బుజ్జితల్లి మరింత సంతోషిస్తారు .
బామ్మ : చాలా సంతోషం బుజ్జిహీరో ....... , ఏ హాస్పిటల్ అన్నావు ? .
Govt హాస్పిటల్ బామ్మా ...... , అంతే కాల్ కట్ అయ్యింది . ఆపరేషన్ రూంలోకి మరొక డాక్టర్ మేడం వెళ్లడం చూసి బామ్మకు మళ్లీ కాల్ చెయ్యడం మరిచిపోయాను .

అర గంటలో బామ్మనే ఆపరేషన్ రూమ్ దగ్గరికి వచ్చారు .
బామ్మా - బుజ్జిహీరో ....... అంటూ ఒకరినొకరం చూసుకుని కేకలువెయ్యబోయి దేవత గుర్తుకువచ్చి ఆగిపోయి ముసిముసినవ్వులు నవ్వుకున్నాము .
బామ్మా ....... అంటూ దేవత వెళ్లి సంతోషంతో కౌగిలించుకున్నారు . బామ్మా ....... మరికొన్నిగంటల్లో చెల్లికి చూపు రాబోతోంది అనితీసుకెళ్లి చూయించారు .
అంతా సవ్యంగా జరగాలి అని బామ్మ మొక్కుకున్నారు .
దేవత : బామ్మా ....... చెల్లెలి బామ్మ అంటూ పరిచయం చేసారు .
బామ్మ : చెల్లీ ...... ఏమీ కంగారుపడకు , చిరునవ్వులు చిందిస్తూ బుజ్జితల్లి మనందరినీ చూస్తుంది , మనవైపు దైవం ఉన్నారు అంటూ నావైపు కన్నుకొట్టారు .
దేవత : బామ్మా ....... మీరు ? ఇక్కడికి ? .
బామ్మ : బుజ్జిహీరో కాల్ చేసాడు ? .
దేవత : నా స్టూడెంట్ మీకు కాల్ చెయ్యడం ఏమిటి ? .
బామ్మ : అదీ అదీ ...... , నీ స్టూడెంట్ బుజ్జిహీరో కాదు బుజ్జితల్లీ ...... , నా బంగారుకొండ బుజ్జిహీరో కాల్ చేసాడు . మిమ్మల్ని సెక్యూరిటీ ఆఫీసర్లు తీసుకెళ్లడం చూసి ఫాలో అయ్యి ఇక్కడి నుండే కాల్ చేసాడు - నేను రాగానే బై చెప్పేసి వెళ్ళిపోయాడు . అయినా నీ స్టూడెంట్ బుజ్జిహీరో కాల్ చేసినా తప్పేంటి - మేము రెండుమూడుసార్లు ఫోనులో మాట్లాడుకున్నాము - నిన్న ఆలస్యమైనా నిన్ను జాగ్రత్తగా తీసుకొచ్చాడు , ఆటోలో కలిశాను - hi బుజ్జిహీరో .......
హలో బామ్మా ....... అంటూ ప్రక్కనవెళ్లి నిలబడ్డాను . దేవత చూడకుండా హైఫై కొట్టుకుని నవ్వుకున్నాము .
**********

లంచ్ సమయానికి ఆపరేషన్ దిగ్విజయంగా పూర్తయినట్లు డాక్టర్స్ సంతోషంగా బయటకువచ్చి విషయం తెలిపారు - రెండు మూడు గంటల తరువాత బ్యాండేజస్ తొలగిస్తాము - అంతవరకూ మత్తులో ఉంటుంది - మత్తు ఇచ్చినా తమ్ముడూ , అక్కయ్యా , పెద్దమ్మా ...... అని నిరంతరంగా కలవరిస్తూనే ఉన్నారు - మామూలుగా అయితే ఆపరేషన్ అయిన వెంటనే ఎవ్వరినీ పేషెంట్ దగ్గరకు పంపించము కానీ మీ స్పర్శ కోసం ఆరాటపడుతోంది వెళ్ళండి - మీరెంత జాగ్రత్తగా చూసుకుంటారో మాకర్థమైపోయింది వెళ్ళండి వెళ్ళండి .
చాలా చాలా థాంక్స్ డాక్టర్ మేడమ్స్ - అతిపెద్ద గుడ్ న్యూస్ చెప్పారు అని అందరమూ సంతోషంతో చెప్పాము .
డాక్టర్స్ : మా డ్యూటీ మేము చేసాము . గంట తరువాత వచ్చి చూస్తాను - బ్యాండేజస్ మాత్రం టచ్ చెయ్యకండి .
లేదు లేదు డాక్టర్ మేడమ్స్ .......
డాక్టర్స్ : Ok అయితే వెళ్ళండి వెళ్ళండి , నర్స్ ఉంటుందిలే ...... , SI గారూ ...... అంటూ సంతోషంతో మాట్లాడుకుంటూ వెళ్లారు .

సంతోషం వేస్తున్నా సౌండ్స్ చెయ్యకుండా లోపలకు వెళ్ళాము .
బామ్మలు : బుజ్జితల్లీ - బుజ్జిహీరో ....... మిమ్మల్నే కలవరిస్తోంది మా చిట్టి తల్లి , ప్రక్కనే కూర్చుని ........ ఏమిచెయ్యాలో మీకు చెప్పాల్సిన అవసరం లేదులే .......
పెదాలపై చిరునవ్వులతో ఒకరొకరం చూసుకుని రెండువైపులా స్థూల్స్ వేసుకుని కూర్చున్నాము . అతి సున్నితంగా ప్రాణంలా చేతి వేళ్ళలో వేళ్ళను పెనవేశాము .
అక్కయ్య పెదాలపై సంతోషం , తమ్ముడూ - అక్కయ్యా ....... ఎక్కడ కూర్చున్నారు , నా ప్రక్కనే బెడ్ పై కూర్చోండి please please ........
నర్స్ వైపు చూసాము .......
నర్స్ : పర్లేదు కూర్చోండి - తను ఎంత సంతోషంగా ఉంటే కొత్తగా అమర్చిన కళ్ళు అంతగా తనతో బాండింగ్ అవుతాయి .
థాంక్స్ నర్స్ ....... అంటూ లేచి బెడ్ పై కూర్చుని అక్కయ్య చేతులపై ముద్దులుపెట్టాము .
అక్కయ్య : ఆఅహ్హ్ ...... హాయిగా ఉంది . తమ్ముడూ ...... నువ్వు చెప్పినట్లే మన దైవం పెద్దమ్మను తలుచుకున్నాను , అసలు చీమ చిటుక్కుమన్నంత నొప్పి కూడా కలగలేదు , లవ్ యు లవ్ యు లవ్ యు sooooo మచ్ తమ్ముడూ .......
దేవత : లవ్ యు లన్నీ నీ తమ్ముడికి మాత్రమే అన్నమాట .......
అక్కయ్య తియ్యదనంతో నవ్వుకుని , నా తమ్ముడికంటే మా అక్కయ్యకు ఒక లవ్ యు ఎక్కువ - అదే నా తమ్ముడికి కూడా ఇష్టం ........
అవును అవును అక్కయ్యా ...... అంటూ సిగ్గుపడుతున్నాను .
దేవత : అక్కాతమ్ముళ్ళు ఒక్కటైపోయారన్నమాట ...... , చెల్లీ ...... మరొక రెండు గంటల్లో మమ్మల్ని చూడబోతున్నావని డాక్టర్స్ చెప్పారు .
అక్కయ్య : యాహూ ........
దేవత : నీ తమ్ముడు కూడా ఇంతే సంతోషం కలిగితే టాప్ లేచిపోయేలా కేకవేస్తాడు అని అందరమూ నవ్వుకున్నాము .

అక్కయ్య బామ్మ : ఇలాంటి రోజు వస్తుందని ఊహించనేలేదు , నా బుజ్జితల్లి ఆనందాలను చూస్తుంటే ...... , ఇక ఈ జీవితానికి ఇది చాలు , ఇదంతా మీ వల్లనే బాబూ - తల్లీ ........
ఇక అక్కయ్య చిరునవ్వులే చిరునవ్వులు బామ్మా ........
అక్కయ్య : లవ్ యు తమ్ముడూ అంటూ మా చేతిపై ముద్దుపెట్టి , గుండెలపై హత్తుకుని పులకించిపోతున్నారు .

కొద్దిసేపటికి లేడీ సెక్యూరిటీ అధికారి వచ్చి , SI సర్ స్వయంగా వారి ఇంటి నుంచి మీకోసం లంచ్ తెప్పించారు తినండి అని అందించి వెళ్లిపోయారు .
నర్స్ అక్కయ్యా ...... , అక్కయ్యకు తినిపించవచ్చా ..... ? .
డాక్టర్స్ వచ్చి చెప్పేంతవరకూ ఏమీ తినిపించరాదు - తనకు ఆకలి కూడా వెయ్యదు ఎందుకంటే రెండు గ్లూకోజ్ బాటిల్స్ ఎక్కించారు .
అక్కయ్య : అవును తమ్ముడూ - అక్కయ్యా ...... నాకు ఆకలి వెయ్యడంలేదు మీరు తినండి , మీరు తింటే నేను తిన్నట్లే ........
అయితే ok అక్కయ్యా ....... , అక్కయ్యా ....... బామ్మను కాసేపు కూర్చోబెట్టనా ........ ? .
అక్కయ్య బామ్మ : వద్దు బాబూ ....... , చూడు అప్పుడే పెదాలు బుంగమూతి పెట్టుకుంది . ఇకనుండీ నేను అవసరమే లేదు తనకు ....... , చూసారా ...... చిరునవ్వు .
అందరమూ నవ్వుకున్నాము - అక్కయ్య ...... మా చేతులను మరింత గట్టిగా పట్టుకున్నారు . అక్కయ్యా ....... మీకోసం అక్కయ్య బామ్మగారు పరిగెత్తుకుంటూ వచ్చారు .
అక్కయ్య : బామ్మ మాటలేనా వినిపిస్తోంది ? , హలో బామ్మా .......
బామ్మ : అవును చిట్టి తల్లీ ....... కాసేపు హాయిగా రెస్ట్ తీసుకో .......
అక్కయ్య : తమ్ముడూ - అక్కయ్యా ...... మీ మీ ఎడమచేతులు నాకు ఇచ్చి మీరు కడుపునిండా భోజనం చెయ్యండి అని అందుకుని ముద్దులుపెట్టి ప్రాణంలా హత్తుకున్నారు .
బామ్మలు వడ్డించడమే కాదు , ప్లేట్స్ పట్టుకోవడానికి వీలు లేదు కదూ అంటూ తినిపించారు .
అక్కయ్యా ....... , మీరు మా చేతులను పట్టుకున్నందువలన బామ్మలే తినిపిస్తున్నారు , బామ్మల చేతిముద్దలు సో టేస్టీ .......
అక్కయ్య : Wow ....... అంటూ మళ్లీ ముద్దులుపెట్టి ఆనందిస్తోంది .

2 గంటలకు ఒకసారి 3 గంటలకు ఒకసారి డాక్టర్ మేడమ్స్ వచ్చారు .
డాక్టర్స్ వచ్చారని లేవబోతే అక్కయ్య ...... మరింత గట్టిగా పట్టుకోవడం చూసి , డాక్టర్స్ నవ్వుకుని పర్లేదు పర్లేదు తను ఎంత హ్యాపీ అయితే అంత మేలు అని చెక్ చేసి పర్ఫెక్ట్ , గంట తరువాత వచ్చి బ్యాండేజస్ వేరుచేస్తాము ఆ తరువాత సంబరాలు చేసుకోండి అనిచెప్పి వెళ్లారు .
థాంక్యూ soooo మచ్ డాక్టర్స్ ...... , అక్కయ్యా ...... ఇక గంటలో అంటూ సంతోషం పట్టలేక అక్కయ్య బుగ్గలపై ముద్దులుపెట్టాము .
అక్కయ్య : ప్చ్ ...... నా తమ్ముడిని - అక్కయ్యను చూడటానికి ఇంకా గంట వేచి చూడాలా ....... ? , టైం ట్రావెల్ ఉంటే బాగుండేది - క్షణంలో .......
లవ్ టు అక్కయ్యా - లవ్ టు చెల్లీ ........ అని ఆనందించాము .
అక్కయ్య : తమ్ముడు - అక్కయ్య ...... నాకిరువైపులా ఉండగా గంట గడిచిపోవడం ఎంతసేపు .......
అక్కయ్య బామ్మ : నా బంగారుతల్లికి చూపు అంటూ ఆనందబాస్పాలతో మురిసిపోతున్నారు .

బామ్మ : చిట్టితల్లీ ...... రాత్రంతా బుజ్జి హీ ...... మీ అక్కయ్య మీ అక్కయ్య నిద్రలోకూడా నా చెల్లికి చూపు రావాలి అని కలవరిస్తూనే ఉంది .
దేవత : నేను మాత్రమేనా ...... , మన బుజ్జిహీరో ఇంకెంత ప్రార్థించి ఉంటాడో - అక్కయ్య అంటే ఎంత ప్రాణమో కళ్ళల్లోనే తెలుస్తోంది .
లవ్ ....... థాంక్యూ మేడం ......
అక్కయ్య : తమ్ముడు - అక్కయ్య ....... నాకు దైవం పెద్దమ్మ ఇచ్చిన ప్రాణమైన వాళ్ళు , మీప్రార్థనల వల్లనే ఒక్క రోజులో చూడబోతున్నాను .
అక్కయ్యా ...... సెక్యూరిటీ అధికారి సర్ చెప్పారు , రాత్రే ఆపరేషన్ రెడీ అని ఎందుకు .......
ఆక్కయ్యలు : నా తమ్ముడు - అక్కయ్య ఇలా ప్రక్కన లేని చూపు ఎప్పటికీ నాకవసరం లేదు .
అదికాదు అక్కయ్యా .......
అక్కయ్య : ఇప్పుడేమైంది కొన్నిగంటలు ఆలస్యం అంతే , అప్పుడు చేయించుకుని ఉంటే డాక్టర్స్ - నర్స్ చెప్పినట్లు ఇంత ఆనందం కలిగేదా ...... ? .
బామ్మలు : నిజమే నిజమే బుజ్జితల్లీ - చిట్టితల్లీ .......
అక్కయ్య : తమ్ముడూ ...... నీకు బాధ కలిగించి ఉంటే .......
లేదు లేదు అక్కయ్యా ....... , మీ సంతోషమే మా సంతోషం - చూపు రాగానే మమ్మల్ని చూడాలి అన్నారు - ఇక్కడ ఇక్కడ ఎంత ఆనందం కలిగిందో అంటూ అక్కయ్య నుదుటిపై - బుగ్గపై - చేతిపై ముద్దులుపెట్టాను .
హవ్వా ....... లవ్ యు లవ్ యు లవ్ యు sooooo మచ్ తమ్ముడూ ...... అంటూ నవ్వుతూనే ఉన్నారు .
దేవత : బుజ్జిహీరో ....... , చెల్లికి ముద్దులుపెట్టే అవకాశమే ఇవ్వడం లేదు నువ్వు అంటూ నా చేతిని గిల్లేసారు .
స్స్స్ ........
అందరితోపాటు అక్కయ్య నవ్వుతోంది . నేను కిస్ చేస్తాను అక్కయ్యా అంటూ దేవత చేతిపై ముద్దులుపెట్టి ఆనందిస్తున్నారు .
అలా సంతోషమైన మాటల్లోనే గంట గడిచిపోయింది - డాక్టర్స్ కూడా వచ్చారు .

వెనుకే SI సర్ వచ్చారు .
దేవత : లంచ్ పంపించినందుకు థాంక్యూ సర్ .......
SI సర్ : కనీసం పరిచయం లేని అమ్మాయికోసం నిన్నటి నుండీ మీరు చేసినదానితో పోలిస్తే ....... , ఏదైనా జరగకముందే మీరు ప్రతిస్పందించిన తీరుకు నేను ఫిదా అయిపోయాను - బుజ్జిహీరో ...... నిజంగానే హీరో నువ్వు - తరువాత ఎప్పుడైనా మనం కలుద్దాము .
పరిచయం లేకపోవడం ఏమిటి సర్ , అక్కయ్య - బామ్మ ....... అంటూ అక్కయ్య చేతిని ప్రాణంలా హత్తుకున్నాను , అక్కయ్య కన్నీళ్లు చూడగానే నా హృదయం తల్లడిల్లిపోయింది .
SI సర్ : కొట్టేలా ఉన్నావు బుజ్జిహీరో ....... , sorry sorry .......
అందరూ డాక్టర్ మేడం కూడా నవ్వుకున్నారు .
అక్కయ్య : తమ్ముడూ ....... , నాకు వెంటనే నిన్ను - అక్కయ్యను చూడాలని ఉంది , డాక్టర్స్ ఆలస్యం చేస్తే నేనే బ్యాండేజస్ తీసేస్తాను .

డాక్టర్ మేడం : నో నో నో , అంతపని మాత్రం చెయ్యకు కావ్యా ...... , ఇంతసేపు ఆగావు మరొక్క 5 నిమిషాలు ఆగలేవా ...... ? .
అక్కయ్యా ...... 5 నిమిషాలే అంటూ లేవబోయాను .
డాక్టర్ మేడం : నో నో నో బుజ్జిహీరో గారూ ...... , నన్ను కొట్టేస్తుందేమో అలానే పట్టుకుని కూర్చో అని నవ్వుతూనే నర్స్ సహాయంతో కట్లు విప్పుతున్నారు నెమ్మదిగా ...... , కావ్యా ...... ప్లీజ్ ప్లీజ్ అతినెమ్మదిగా తెరవాలి , బుజ్జిహీరో - అవాంతికా ...... మీరు చెబితేనే వినేది .
అక్కయ్యా - చెల్లీ ...... మేమెక్కడికీ వెళ్లము , నెమ్మదిగా తెరవండి అని చేతులపై ముద్దులుపెట్టాము .
డాక్టర్ మేడం బ్యాండేజీ మొత్తం వేరుచేసి , ఒక లిక్విడ్ తో కనురెప్పలపై అతి జాగ్రత్తగా శుభ్రం చేసి , now కావ్యా ...... slowly open your eyes , నీకు ఇరువైపులా ...... నీ ప్రాణమైన ఇద్దరే ఉన్నారు - నీకు మొదటగా కనిపించేది వారే ........
అవును అక్కయ్యా - చెల్లీ ....... , నెమ్మదిగా నెమ్మదిగా ....... , చూడగానే ఉద్వేగానికి లోనై కన్నీళ్లు - ఆనందబాస్పాలు రప్పించకండి కళ్ళు నొప్పివేస్తాయి .
డాక్టర్ : బుజ్జిహీరో నువ్వు డాక్టర్ ఈ కూడా , నాకు రాని ఐడియా నీకు వచ్చింది , అవును కావ్యా ....... కొద్దిసేపు ఎలాంటి బావోద్వేగాలకూ లోను కాకూడదు ప్రమాదం - ఎంతైనా సంతోషపడు కానీ బాస్పాలు మాత్రం నో , బుజ్జిహీరో కూడా చెప్పాడు కదా వింటావులే ...... రెడీ 3 2 1 .......

స్లోలీ స్లోలీ ..... అక్కయ్యా - చెల్లీ .......
అక్కయ్య : నా తమ్ముడు - అక్కయ్య చెబితే వింటాను అని అతినెమ్మదిగా కళ్ళుతెరిచి చూసి , అంతులేని ఆనందంతో తమ్ముడూ - అక్కయ్యా ...... అంటూ ఇద్దరినీ హత్తుకున్నారు . తమ్ముడూ - అక్కయ్యా ...... చూసాను , నాకు బాగా కనిపిస్తోంది అంటూ మా ఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టి , కొన్ని క్షణాలపాటు మనసారా చూస్తున్నారు .
అక్కయ్యా ....... సో సో sooooo హ్యాపీ - బామ్మలను చూడండి .
అక్కయ్య : తరువాత చూస్తానులే అంటూ ఇద్దరినే చూస్తున్నారు .
బామ్మలిద్దరూ సంతోషంతో నవ్వుతున్నారు .
డాక్టర్ మేడం : బామ్మలనే తరువాత చూస్తాను అన్నది , ఇక మనల్ని చూడదులే SI గారూ , తరువాత వద్దాము పదండి .
డాక్టర్ మేడం - సెక్యూరిటీ అధికారి సర్ ......
డాక్టర్ మేడం : పర్లేదు పర్లేదు మీరు ఎంజాయ్ అంటూ నవ్వుతూ బయటకు వెళ్లారు .

అక్కయ్య : ఆఅహ్హ్హ్ ....... ఎంత ఆనందం కలుగుతోందో మాటల్లో చెప్పలేను తమ్ముడూ - అక్కయ్యా ...... లవ్ యు లవ్ యు సో మచ్ అంటూ మా బుగ్గలపై ముద్దులుపెట్టారు .
పెద్దమ్మా ...... అక్కయ్యను ఎలా చూడాలో అలా చూసేలా చేశారు - బామ్మగారు కూడా చాలా చాలా హ్యాపీ , థాంక్యూ థాంక్యూ sooooo మచ్ .
అక్కయ్య - దేవత : థాంక్యూ పెద్దమ్మా .......
అక్కయ్యా ...... బామ్మలు , మిమ్మల్ని కౌగిలించుకుని ఆనందించాలని తెగ ఆరాటపడిపోతున్నారు - ఆ తరువాత మీఇష్టం ......
అక్కయ్య : మీరిక్కడే ఉండాలి .......అలా అయితేనేనే ......
లవ్ యు అక్కయ్యా - చెల్లీ అంటూ ఒకేసారి ముద్దులుపెట్టాము .
అక్కయ్య తియ్యదనంతో నవ్వుకుని , బామ్మలూ ...... నాకు కనిపిస్తున్నారు అంటూ ప్రాణంలా హత్తుకున్నారు .
Next page: Update 75
Previous page: Update 73