Update 82

దేవత : finished ? .
Yes మేడం అంటూ కళ్ళతోనే తెలిపాను .
దేవత : హాఫ్ టైం లోనే అంటూ ఆశ్చర్యపోతూనే వచ్చి , గ్రామర్ పార్ట్ ఒకసారి సరిచూసుకోవచ్చు కదా .......
అన్నీ exams మైండ్ తో రాశాను - నా దేవత exam .......
దేవత కోపంతో కొట్టబోతే .......
మా మేడం మేడం exam ...... మైండ్ తోపాటు మనసుపెట్టి రాశాను మేడం , చెక్ చేసుకునే అవసరమే లేదు ........
దేవత : చూద్దాము మనసుపెట్టి ఎలా రాసావో అంటూ నా ఆన్సర్ షీట్స్ అందుకుని , అడిగిన స్టూడెంట్స్ కు వైట్ షీట్స్ ఇస్తూనే 15 నిమిషాలపాటు మొత్తం చూసి , షాక్ తో వచ్చి స్టాండ్ అప్ అన్నారు .
లేచి నిలబడగానే షర్ట్ - ప్యాంటు జేబులు చెక్ చేశారు . మేడం గిలిగింతలు .......
దేవత : తెలుగు మీడియం నుండి వచ్చి ఇంత తక్కువ సమయంలో ఇంత పర్ఫెక్ట్ గా ఎలా ......
చెప్పానుకదా మేడం మీ exam అంటే మనసుపెట్టి రాశాను అని , నా ఫేవరేట్ - ప్రియమైన - ప్రాణమైన exam ...... - టీచ్ చేసినది ఎవరు నా దే ...... మా మేడం ......
దేవత : సిట్ డౌన్ అంటూ రెడ్ పెన్ తీసుకుని " 100 / 100 " వెరీ వెరీ వెరీ గుడ్ కీప్ ఇట్ అప్ అని మార్క్స్ వేసి గర్వపడుతూ వెళ్లారు .

జాహ్నవి ...... నా ఆన్సర్ షీట్ అందుకుని చూసి సూపర్ రా ......
థాంక్స్ ........
దేవత వల్లనే కాబట్టి లాంగ్ బెల్ కొట్టేంతవరకూ మురిసిపోతూనే ఉన్నారు . లాంగ్ బెల్ కొట్టగానే ...... స్టూడెంట్స్ this is ఇంపార్టెంట్ - సెక్యూరిటీ ఆఫీసర్ల రిక్వెస్ట్ మేరకు సేఫ్టీ దృష్ట్యా రేపటి నుండి monday వరకూ నో కాలేజ్ , మిగతా exams కూడా పోస్ట్ ఫోన్ చేయబడ్డాయి , మీ మీ పేరెంట్స్ తోపాటు సేఫ్ గా ఇంటికివెళ్లండి - మీ పేరెంట్స్ రాకపోతే కాలేజ్ బస్సెస్ ఎక్కండి సేఫ్ గా చేరుస్తారు .
స్టూడెంట్స్ అందరూ సంతోషంతో కేకలువేశారు .
దేవత నవ్వుతూనే ఆన్సర్ షీట్స్ కలెక్ట్ చేస్తున్నారు . మార్క్స్ అక్కయ్యకు చూయించడం కోసం మొబైల్ లో ఫోటో తీసుకున్నాను . క్లాస్మేట్స్ అందరూ బై బై చెప్పుకుని సంతోషంతో బయటకు వెళ్లిపోతున్నారు .
ఒక్కొక్కరి ఆన్సర్ షీట్ తీసుకుంటూ పదేపదే నావైపే చూస్తున్నారు దేవత - ఆ చూపులకు అర్థమే తెలియడం లేదు - అదిగో మళ్లీ మళ్లీ చూస్తున్నారు - పెద్దమ్మ సహాయం ........
మెసేజ్ : " ఇలాంటి వాటికి మాత్రం ఈ పెద్దమ్మ సహాయం కావాలికదూ ..... , ఏమిచేస్తాం హెల్ప్ చేస్తాము - బుజ్జిహీరో ...... నీ దేవత ఒంటరిగా వెళ్ళడానికి భయపడుతోంది , అలాగని నిన్ను తోడుగా రమ్మని అడగడానికి ఈగో అడ్డువస్తోంది , ఏమిచెయ్యాలో బుజ్జిహీరోకు చెప్పేంతదానిని కాదు - ఎంజాయ్ "
Yes yes థాంక్యూ థాంక్యూ పెద్దమ్మా ...... , దేవత దగ్గరికివెళ్లి మేడం మేడం ...... నాకు - చెల్లెళ్లకు ఒంటరిగా వెళ్ళడానికి భయం వేస్తోంది , మీతోపాటు రావచ్చా ..... ? .
దేవత ఈగో satisfy అయినట్లు లోలోపలే నవ్వుకుని , బుద్ధిగా ఉండాలి .
Yes yes మేడం .......
దేవత : నవ్వుతూనే ...... , ఇక్కడే ఉండు two మినిట్స్ అంటూ ఆన్సర్ షీట్స్ కలెక్ట్ చేసుకుంటున్నారు .

అంతలో మహేష్ ....... అంటూ గోవర్ధన్ పిలుపు వినిపించగానే , పరుగునవెళ్లి బయట పిల్లో వెనుక దాక్కున్నాను .
గోవర్ధన్ : మహేష్ మహేష్ ...... ఎక్కడికి వెళ్లిపోయావు ? , ఇంటికి కారులో వెళ్ళేవాళ్ళము కదా అని ఫ్రెండ్స్ తోపాటు వెళ్ళిపోయాడు .
చివరగా దేవత రెండుచేతులలో ఆన్సర్ షీట్స్ పట్టుకుని కంగారుపడుతూ బయటకువచ్చారు - నన్ను చూసి హమ్మయ్యా ...... వెంటనే కోపంతో ఎక్కడికి వెళ్లిపోయావు ? - ఎంత కంగారుపడ్డానో తెలుసా ? , చెప్పి అలా వెళ్ళిపోతే ఎలా ? , కొడదామంటే రెండు చేతులలో ఆన్సర్ షీట్స్ ఉన్నాయి .
పెదాలపై చిరునవ్వులతో మొత్తం అందుకున్నాను .
దేవత : టపటపా ...... వీపుపై కొట్టారు .
Sorry sorry మేడం ....... , గోవర్ధన్ - వినయ్ వాళ్లకు కనిపిస్తే నన్ను పిలుచుకునివెళ్లిపోతారు - మీకు మాటిచ్చాను అదే అదే మీరు సేఫ్ గా తీసుకెళతారు అనిచెప్పారు కదా అందుకే ఇక్కడికివచ్చి దాక్కున్నాను .
దేవత : ప్చ్ ...... ముందే చెప్పొచ్చుకదా కొట్టేదానిని కాదు .
తక్కువ దెబ్బలు తిన్నాను అని నేను బాధపడుతుంటే మీరు మరీనూ ....... - మరికొన్ని కొట్టొచ్చు మేడం .......
దేవత : నిన్నూ ...... నువ్వు మారవు పదా ...... , ఇంతకూ నీ చెల్లెళ్లు ఎక్కడ ? .
కంగారుపడాల్సిన అవసరమే లేదు మేడం - మనం వెళ్లేంతవరకూ క్లాస్లోనే ఉంటారు రండి ......
అన్నయ్యా అన్నయ్యా ......
Sorry చెల్లెళ్ళూ ...... నావల్లనే ఆలస్యం అయ్యింది , వెళదాము అంటూ దేవత ఆఫీస్ రూమ్ నుండి వచ్చేన్తవరకూ అక్కడే ఉండి కలిసి ఇంటికి బయలుదేరాము .

కాలేజ్ బయట తెల్లవారుఘామున వచ్చిన govt వెహికల్ ముందు సెక్యూరిటీ అధికారి నిలబడి సెల్యూట్ చేసాడు .
నో నో నో సర్ అంటూ దేవత వెనుక నడుస్తూ సైగచేసాను .
దేవత : వెనక్కుతిరిగి సెల్యూట్ చేస్తున్నది నీకా బుజ్జిహీరో .......
నాకు ..... సెక్యూరిటీ అధికారి ...... ఎందుకు సెల్యూట్ చేస్తారు మేడం - మన వెనకున్న పెద్ద సెక్యూరిటీ అధికారి కు అయి ఉంటుంది - మనం హ్యాపీగా నడుచుకుంటూ వెళదాము అంటూ సెక్యూరిటీ అధికారి సర్ కు అర్థమయ్యేలా మాట్లాడాను .
దేవత : అడుగుల దూరానికి బుజ్జిహీరోగారిని విమానంలో ఏమైనా తీసుకెళ్లాలా ఏమిటి ? .
జోక్ బాగుంది మేడం కానీ నవ్వే రాలేదు .......
చెల్లెళ్లు - తమ్ముడు ....... నవ్వుతున్నారు .
దేవత : బుజ్జిహీరో నిన్నూ .......
కమాన్ కమాన్ కొట్టండి ప్లీజ్ ప్లీజ్ మేడం ........
దేవత : ఇడియట్ ........
థాంక్యూ మేడం ........
చెల్లెళ్లు : అన్నయ్యా ...... మీ దేవత ఇడియట్ అని తిట్టారు పొగడలేదు .
నా దేవత తిట్టినా కొట్టినా సంతోషమే ....... చెల్లెళ్ళూ ఆఅహ్హ్హ్ హాయిగా ఉంది .
దేవత : ఇంత అల్లరివాడిని ఎక్కడా చూడనేలేదు అంటూ కోపం - నవ్వుతోనే సెక్యూరిటీ అధికారి అపార్ట్మెంట్స్ చేరుకున్నాము .
నా దేవతకు నేను స్పెషల్ అన్నమాట ....... , అక్కయ్యా ...... అంటూ పరుగునవెళ్లి కౌగిలిలోకి చేరాను .

అక్కయ్య : చెల్లెళ్ళూ ..... అంటూ అందరినీ కౌగిలిలోకి తీసుకుని , అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టారు .
దేవత : లవ్ యు చెల్లీ ...... , ఎంతసేపటి నుండి ఎదురుచూస్తున్నావు ? .
బామ్మ : చాలాసేపటి నుండీ బుజ్జితల్లీ ........
అక్కయ్య : నా ప్రాణమైన మీకోసం ఎదురుచూడటంలో మాధుర్యం ఉంది అక్కయ్యా ...... , అక్కయ్యా - చెల్లెళ్ళూ - తమ్ముడూ ...... కొద్దిసేపట్లో అటాక్స్ - టెర్రరిస్ట్స్ గురించి మీడియా ముందుకువస్తారని అన్నీ న్యూస్ ఛానళ్లలో ఫ్లాష్ న్యూస్ వేస్తున్నారు . మీ డాడీ గొప్పతనం గురించి రాష్ట్రం కాదు కాదు దేశమంతటా తెలియబోతోంది హాసినీ - విక్రమ్ ....... , మీ మమ్మీ అయితే ఫ్లాష్ న్యూస్ అని వచ్చినప్పటి నుండీ టీవీ కు హతుక్కుపోయారు - కనీసం ప్రక్కకు కూడా చూడటం లేదు .
అందరమూ నవ్వుకుని పైకి చేరుకున్నాము .

SI సర్ మేడం గుమ్మం వరకూ చిరునవ్వులు చిందిస్తూ పరుగునవచ్చి , వచ్చేసారా చెల్లెళ్ళూ - బుజ్జిదెయ్యాలూ ....... Its about to begin రండి రండి త్వరగా రండి అంటూ దేవత - అక్కయ్యను చెరొకవైపు కూర్చోబెట్టుకుని సోఫాలో కూర్చున్నారు - నేను సోఫా వెనుక నిలబడి సర్ రుణం తీర్చుకునే సమయం అంటూ అందరితోపాటు ఉత్సాహంగా చూస్తున్నాను .
హాసిని : అన్నయ్యా ....... చూసారా ? , మమ్మీకి వాళ్ళ చెల్లెళ్లు అంటేనే ఇష్టం - మనం ఇక్కడ కూర్చుందాము రండి అంటూ లాక్కునివెళ్ళిమరీ కూర్చోబెట్టుకున్నారు .
SI సర్ మేడం : అవునే బుజ్జిదెయ్యాలూ ...... నాకు , మా చెల్లెళ్లంటేనే ఇష్టం - మీకు ....... మీ అన్నయ్యలా .......
అందరమూ సంతోషంగా నవ్వుకున్నారు .

లైవ్ స్టార్ట్ అవ్వడంతో అందరమూ సైలెంట్ అయిపోయాము . సిటీలోని పరిస్థితుల గురించి సిటీ సెక్యూరిటీ అధికారి కమీషనర్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాము .
స్టేజీపై చాలామంది సెక్యూరిటీ ఆఫీసర్లు కూర్చున్నారు కానీ సర్ లేరు ఎక్కడా కనిపించకపోవడంతో చెల్లెళ్లు కూడా అదే విషయం అడిగారు మమ్మీ - అక్కయ్యలూ - అన్నయ్యా ....... అంటూ .......
మాదగ్గర సమాధానమే లేకపోయింది - SI సర్ మేడం ముఖంలో కాస్త ఆవేదన ......

కమిషనర్ : పదుల సంఖ్యలో తన ముందున్న మీడియా మైక్స్ లో మాట్లాడుతున్నారు - గత రెండు రోజులుగా సెక్యూరిటీ ఆఫీసర్లు సిటీ మొత్తం తిరుగుతుండటం - టెర్రరిస్ట్స్ - అటాక్స్ - బ్లాస్ట్స్ ....... గురించి జనాలు గుసగుసలాడుకోవడం మీరు చూస్తూనే ఉన్నారు , అవన్నీ నిజమే ...... ఈరోజు అయితే ప్రజలు బయటకు రావడానికి కూడా భయపడుతున్నారు - మరికొన్నిరోజులు కూడా భయంతో ఉండాల్సిందే ........
విలేఖరి : సర్ ...... ధైర్యం చెప్పాల్సింది పోయి మరింత భయపడుతున్నారు .
కమిషనర్ : పరిస్థితులు ఇంకా కంట్రోల్ లోకి రాలేదు .
మరొక విలేఖరి : పరిస్థితులు చక్కబడ్డాయి - టెర్రరిస్టులందరినీ పట్టుకున్నాము - ప్రజలు సేఫ్ గా తిరగొచ్చు అని పెట్రోలింగ్ లో ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్లు అనౌన్స్మెంట్ చేస్తున్నారు కదా సర్ .........
కమిషనర్ : అవునా అంటూ ప్రక్కనున్న సెక్యూరిటీ ఆఫీసర్లను అడుగుతున్నారు .
మరొక విలేఖరి : వారం రోజులనుండీ ఇంట్లోనే ఉండి బయటకువస్తే ఇలానే ఉంటుంది సర్ ......
కమిషనర్ : ఎవర్రా అది ........
విలేఖరి : అయితే నిజమేనన్నమాట అంటూ నవ్వుతున్నారు .
వేరొక విలేఖరి : సర్ ...... టెర్రరిస్ట్స్ బ్లాస్ట్స్ గురించి మాట్లాడుకుంటున్న వీడియో లీక్ అయ్యింది అది నిజమా ...... ఫేక్ ...... ? .
కమిషనర్ : నిజమే నిజమే ........
మరొక విలేఖరి : వారిని మన సిటీ సెక్యూరిటీ ఆఫీసర్లే తుదముట్టించారని అంతా అనుకుంటున్నారు - ఆ అటాక్ ను లీడ్ చేసిన సెక్యూరిటీ అధికారి హీరో ఎవరు సర్ ? .
కముషనర్ : ఇంకెవరు నేనే - ఆ వీడియో చూడగానే నేనే ధైర్యసాహసాలతో వెళ్లి అందరినీ చంపేసాను .

ఇక్కడ చూస్తున్నవారందరమూ షాక్ లో ఉండిపోయాము .
మేడం - అక్కయ్యా - అన్నయ్యా - మమ్మీ ...... అంటూ పిల్లలకే కోపం వచ్చేస్తోంది - SI సర్ మేడం కళ్ళల్లో కన్నీళ్ళతో మేడం గుండెలపైకి చేరిపోయారు .
దేవత : ఇది అన్యాయం - ప్రాణాలకు తెగించి టెర్రరిస్టులను చంపినది సర్ అయితే వీడు అని చెప్పుకుంటున్నాడు - సిగ్గుపడాలి ........
అక్కయ్య : అవును అక్కయ్యా ...... , నాకు వస్తున్న కోపానికి ........

విలేఖరి : సర్ ...... పొట్టవేసుకుని మీరు చేశారంటే ఎలా నమ్మగలం ......
మరొక విలేఖరి : అవును సర్ ...... , రెండు రోజులుగా బ్లాస్ట్స్ కు భయపడి వందమంది సెక్యూరిటీ ఆఫీసర్ల ప్రొటెక్షన్ లో ఇంటిలోనే దాక్కున్నారని మాదగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి .
కమిషనర్ : రేయ్ ఎవర్రా అది , కానిస్టేబుల్స్ ...... వాళ్ళను బయటకు లాగేయ్యండి - నేనే లీడ్ చేసినది , వాళ్లనే కాదు మీకు తెలియనిది మరొకటి చెబుతాను - టెర్రరిస్టు ల మరొక స్థావరమైన పోర్ట్ లోని షిప్ పైకి కూడా అటాక్ చేసి మరికొంతమంది టెర్రరిస్టులను అంతం చేసాము ఆ విషయం తెలుసా మీకు అంటూ బల్లగుద్దిచెప్పడంతో అందరూ సైలెంట్ అయిపోయి రాసుకుంటున్నారు . దారిలోకివచ్చారు ఇక క్రెడిట్ మొత్తం నాదే అన్నట్లు రాక్షసనవ్వుతో ఏమాత్రం సిగ్గుపడకుండా మాట్లాడుతున్నాడు .

SI సర్ మేడం బాధపడుతూ గదిలోకివెళ్లిపోవడం చూసి , తమ్ముడూ - బుజ్జిహీరో ....... అంటూ అక్కయ్య - బామ్మ , నావైపు కళ్ళల్లో చెమ్మతో చూస్తున్నారు .
పిల్లల కళ్ళల్లో కన్నీళ్లు .......
దేవత : మనదగ్గర ఉన్న వీడియోను మీడియాకు చూయించాలి అప్పుడు తిక్క కుదురుతుంది ఆ కమిషనర్ గాడికి అంటూ SI సర్ మేడం ను ఓదార్చడానికి వెళ్లారు .
కరెక్ట్ గా చెప్పారు మేడం - ఒకే ఒక నిమిషం అక్కయ్యా ....... అంటూ లేచి చివరగా ఉన్న వంటగదిదగ్గరకువెళ్ళాను - వెనుకే అక్కయ్యకూడా వచ్చారు .

అక్కయ్య : తమ్ముడూ ...... మీడియాకు పంపిస్తున్నావా ? .
లేదు అక్కయ్యా ...... , ఎవడైతే నా ప్రాణమైన వాళ్ళందరి కళ్ళల్లో కన్నీళ్లు తెప్పించాడో వాడి చేతనే సర్ కు sorry చెప్పించి నిజం అందరికీ తెలిసేలా చేస్తాను అంటూ మొబైల్ తీసాను .
అక్కయ్య : నా తమ్ముడు సూపర్ అంటూ బుగ్గపై చేతితో ముద్దుపెట్టారు - మరి కమీషనర్ నెంబర్ ఉందా తమ్ముడూ ...... ? .
లేదు అక్కయ్యా గూగుల్ చేద్దాము అని మొబైల్ తీసానోలేదో ...... , సెక్యూరిటీ అధికారి కమిషనర్ కు కాల్ వెళ్లిపోతోంది .
అక్కయ్య ఆశ్చర్యపోతుండటం చూసి , పెద్దమ్మకు థాంక్స్ చెబుతూ నవ్వుకున్నాను.

హలో కమిషనర్ ........
కమిషనర్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఉన్నారు తరువాత కాల్ చెయ్యి .
ఇప్పుడుకానీ కమిషనర్ మాట్లాడకపోతే సీట్ చిరిగిపోద్ది , లైఫ్ అండ్ డెత్ అని చెప్పి ఇవ్వండి - అక్కయ్యా ...... టీవీలో చూడండి .
టీవీలో వెనుక నిలబడిన సెక్యూరిటీ అధికారి మొబైల్ తోవచ్చి సర్ కాల్ .......
కమిషనర్ : తరవాత ...... , ఇప్పిప్పుడే మీడియా వాళ్ళు నమ్ముతున్నారు - కాల్ లో మాటలు వినిపిస్తున్నాయి .
అక్కయ్యకు మరింత కోపం వచ్చినట్లు మొబైల్ వైపు వార్నింగ్ ఇస్తున్నారు .
జరగబోయేది ఎంజాయ్ చెయ్యండి అక్కయ్యా .......
సెక్యూరిటీ అధికారి : సర్ ...... లైఫ్ మ్యాటర్ అర్జెంట్ అంటున్నారు .
కమిషనర్ : ఎస్క్యూస్ మీ మీడియా ...... , అర్జెంట్ కాల్ బహుశా CM or PM అభినందించడానికి కాల్ చేసి ఉంటారు అంతవరకూ అసిస్టెంట్ కమిషనర్ మాట్లాడతారు అని లేచి మొబైల్ అందుకుని వెనుకకువెళ్లాడు . హలో .......
ఒకరు ప్రాణాలకు తెగించి సిటీలో ఒక్క ప్రాణం పోకుండా చేస్తే , కమీషనర్ అన్న అహంకారంతో ఆ క్రెడిట్ మొత్తాన్ని నువ్వే తీసుకోవడానికి సిగ్గనిపించడం లేదూ .....
కమిషనర్ : రేయ్ ఎవర్రా నువ్వు అయిపోతావు .
నేను కాదు నువ్వు అయిపోతావు - రెస్పెక్ట్ కూడా ఇవ్వాలనిపించడం లేదు నీకు - నీతో మాట్లాడటం కూడా నాకిష్టం లేదు - వీడియో పంపిస్తున్నాను చూసి నిజం చెప్పి తప్పు ఒప్పుకుంటే కనీసం గౌరవం దక్కుతుంది లేకపోతే ఒక్క నొక్కు నొక్కానంటే స్టేట్ - సెంట్రల్ న్యూస్ చానల్స్ అన్నింటిలోనే అదే బ్రేకింగ్ న్యూస్ అవుతుంది - అప్పుడు నీ పరిస్థితి మరింత ఘోరం - 10 మినిట్స్ టైం బై బై ........

అక్కయ్య : 10 నిమిషాలు ఎందుకు ఇచ్చావు తమ్ముడూ అనవసరం కదా .......
వీడియో చూడాలికదా అక్కయ్యా ........
అక్కయ్య : అవునుకదా అంటూ మొట్టికాయవేసుకుని సిగ్గుపడుతూ నా వెనుకకుచేరి , వెనకనుండి చుట్టేసి నా బుజ్జి భుజం పై తలవాల్చారు .
అక్కయ్యతోపాటు నవ్వుకుని బుగ్గపై ముద్దుపెట్టాను .
అక్కయ్య : ఒక్కటేనా తమ్ముడూ అంటూ బుంగమూతిపెట్టుకున్నారు .
Sorry లవ్ యు లవ్ యు - మా అక్కయ్య పెదాలపై అలక పోయి చిరునవ్వులు పరిమళించడం వరకూ ముద్దులుపెడతాను ఉమ్మా ఉమ్మా ఉమ్మా ........
అక్కయ్య : ముద్దుముద్దుకీ లవ్ యు చెబుతూ ఎంజాయ్ చేస్తున్నారు . తమ్ముడూ ....... కమీషనర్ కు ముచ్చెమటలు పట్టినట్లున్నాయి వస్తున్నాడు వస్తున్నాడు .
అయితే SI సర్ మేడం గారిని - దేవతను పిలవండి అక్కయ్యా .......
అక్కయ్య : వెనకనుండి గట్టిగా హత్తుకుని బుగ్గపై ఘాడమైన ముద్దుపెట్టివదిలి , అక్కయ్యలూ అక్కయ్యలూ ....... అని సంతోషంతో కేకలువేస్తూ గదిలోకివెళ్లి చేతులుపట్టుకుని పిలుచుకునివచ్చారు .

కమిషనర్ ముఖంలో పశ్చాత్తాపం కనిపిస్తోంది , మీడియా మిత్రులకు - వైజాగ్ ప్రజలకు క్షమాపణలు చెబుతున్నాను , ఇప్పటివరకూ నేను చెప్పినదంతా అపద్దo - నిజానికి అటాక్స్ ను లీడ్ చేసి టెర్రరిస్టులందరినీ తుధముట్టించి ఒక్క ప్రాణం కూడా పోకుండా ఆపినది SI విశ్వ - నిజం ఏమిటో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది , కానిస్టేబుల్ ప్లే చెయ్యండి అంటూ మొబైల్లోని మెమోరీ కార్డ్ ఇచ్చి , మరొకసారి క్షమాపణలు చెప్పి వెళ్లిపోయారు .
దూరంగా వారికేమీ తెలియనట్లు పెదాలపై చిరునవ్వుతో డ్యూటీ చేస్తున్న SI విశ్వ సర్ వైపుకు తిరిగాయి .

మమ్మీ - అన్నయ్యా - మేడం - అక్కయ్యా ....... డాడీ డాడీ అంకుల్ అంటూ పిల్లలు కన్నీళ్లను తుడుచుకుని లేచిమరీ ఆనందిస్తున్నారు .
అంతలో వీడియో ప్లే అవ్వడం , ముందుగా ఇంటిలోపలనుండి ఫైరింగ్ స్టార్ట్ అవ్వడం - సోల్జర్ కు బుల్లెట్స్ తగలగానే SI సర్ ...... కోపంతో లోపలికి దూసుకువెళ్లడం చూసి అందరూ భయంతో గుసగుసలాడుతున్నారు - కొన్ని నిమిషాల ఫైరింగ్ తరువాత క్లియర్ క్లియర్ అంటూ ఆర్మీ మరియు సిటీ సెక్యూరిటీ ఆఫీసర్లతోపాటు ఒక టెర్రరిస్టును బయటకులాక్కునిరావడం చూసి హమ్మయ్యా అంటూ లేచిమరీ అందరూ చప్పట్లుకొడుతున్నారు SI సర్ విశ్వ సర్ ....... అంటూ సంతోషంతో కేకలువేస్తున్నారు .
ఆ వెంటనే పోర్ట్ లోని టెర్రరిస్ట్ షిప్ పై కోస్ట్ గార్డ్ బోట్స్ నుండి మరియు హెలికాఫ్టర్స్ నుండి అటాక్ చేస్తున్న దృశ్యాలు ప్లే అయ్యాయి .
మీడియా : ఇక్కడ కూడా విశ్వ సర్ ...... అంటూ ఉత్కంఠతో చూస్తున్నారు .

తమ్ముడూ - బుజ్జిహీరో ....... మాకు ఈ వీడియో చూయించలేదు అంటూ తియ్యనైనకోపాలతో చూస్తూనే ఎంజాయ్ చేస్తున్నారు .
నేనే షాక్ లో ఉంటేనూ ........ , వెంటనే మొబైల్లో చూస్తే మొత్తం వీడియో ఉంది , నేనెప్పుడు వెళ్ళాను దున్నపోతులా పడుకున్నాను కదా ....... , పెద్దమ్మా ...... ఇంకెవరు పెద్దమ్మనే థాంక్యూ థాంక్యూ soooooo మచ్ .
" విశ్వ సర్ : అందరి సహాయంతో టెర్రరిస్టులను అంతం చేసి , సోల్జర్స్ ...... వైజాగ్ లో మాత్రమే కాదు ఇండియా మొత్తం బ్లాస్ట్స్ ప్లాన్ చేశారు అక్కడున్న సమాచారాన్ని IB కు చేరవేర్చారు "
మీడియా : అంటే ఇక్కడే కాదు , దేశం మొత్తం బ్లాస్ట్స్ జరగకుండా చేసినది SI విశ్వ సర్ అన్నమాట అంటూ కమీషనర్ ముందు ఉంచిన మైక్స్ అన్నింటినీ తీసుకెళ్లి SI విశ్వ సర్ ముందు ఉంచారు .

అక్కయ్యా - అక్కయ్యా ....... ఇలానే కదా చూడాలని కోరుకున్నది అంటూ గర్వపడుతున్న SI సర్ మేడం బుగ్గలపై చెరొకముద్దుపెట్టారు దేవత - అక్కయ్య .....
దేవత - అక్కయ్య : చెల్లెళ్ళూ - తమ్ముడూ ....... ఎంజాయ్ చేస్తున్నారా ..... ? .
డాడీ డాడీ అంకుల్ ....... అంటూ చప్పట్లతో గెంతులేస్తున్నారు .

మీడియా : సర్ ....... ప్రాణాలకు తెగించి దేశం గర్వించదగ్గది చేసి ఇలా దూరంగా ఉండిపోయారు ఏమీ ఎరుగనట్లు - టీవీలో చూస్తుంటేనే గగుర్పాటుకు లోనయ్యాము , మీరు బయటకు వచ్చేన్తవరకూ గుండెలు ఆగిపోయాయి తెలుసా ...... ? .
SI సర్ : నా డ్యూటీ నేను చేసాను అంతే , అది ప్రతీ సెక్యూరిటీ అధికారి - ఆర్మీ కర్తవ్యం , నేను ఒక్కడినే కాదు వందలమంది సెక్యూరిటీ ఆఫీసర్లు - సోల్జర్స్ వల్లనే ఇదంతా జరిగింది , మా పై ఆఫీసర్స్ ఆర్డర్స్ లేనిదే మేమేమి చేసి ఉండేవాళ్ళము కాదు , దేవుడి దయవలన ఒక్క సెక్యూరిటీ అధికారి - ఆర్మీ ప్రాణాలు పోలేదు , దేవుడు కాదు దేవుడు కాదు ...... నిజం చెప్పాలంటే ఈ క్రెడిట్ మొత్తం మాకు కాదు ఒక రియల్ హీరోకు చెందాలి అంటూ వెళ్లి పెన్ డ్రైవ్ కనెక్ట్ చేశారు - స్క్రీన్ పై భూత్ బంగ్లాలోని ఆయుధాలు , డబ్బు , కంప్యూటర్స్ పిక్స్ ప్లే అయ్యాయి . ప్రాణాలకు తెగించి ఈ టెర్రరిస్ట్ స్థావరాన్ని కనిపెట్టినది - టెర్రరిస్ట్స్ అటాక్స్ గురించి మాట్లాడిన వీడియో తీసి మాకు పంపించడం వల్లనే ఇప్పుడు మనం ఇలా సాఫీగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రశాంతంగా మాట్లాడుకోగలుగుతున్నాము లేకపోతే ఎలా ఉండేదో మీడియా అయిన మీకు , లైవ్ చూస్తున్న ప్రజలకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు దేశం మొత్తం లుంబినీ పార్క్ - గోకుల్ చాట్ దృశ్యాలు కనిపించి వేలల్లో ప్రాణనష్టం జరిగి దేశ ఆర్థికవ్యవస్థ .........
మీడియా : నో నో నో సర్ ...... , ఊహించుకుంటుంటేనే చెమటలు పట్టేస్తున్నాయి అంటూ తుడుచుకుంటున్నారు .
SI సర్ : ఇప్పుడు చెప్పండి మనల్ని రక్షించిన నిజమైన దేవుడు ఎవరు ? .
మీడియా : ఇన్ఫర్మేషన్ - వీడియోస్ పంపించిన రియల్ హీరో సర్ ....... , ఇంతకూ ఆ రియల్ హీరో కాదు కాదు దేవుడు ఎవరో మీకు తెలుసా సర్ .... ఎవరు సర్ ఎవరు సర్ ..... ఎక్కడ ఉన్నారు సర్ ప్లీజ్ ప్లీజ్ చెప్పండి సర్ ప్లీజ్ ప్లీజ్ .........

అక్కయ్య - బామ్మ ....... నావైపు చూసి గర్వపడుతున్నారు . అక్కయ్య వచ్చి ప్రాణమైన ముద్దుపెట్టి సైడ్ నుండి హత్తుకున్నారు - ఇంకెవరు ఆ దేవుడు ..... నా ముద్దులతమ్ముడు .
నో నో నో సర్ నో నో నో .......
SI సర్ : నాకు మరియు కొద్దిమంది సెక్యూరిటీ ఆఫీసర్లకు మాత్రమే తెలుసు - నాకుకూడా గర్వంగా మీ అందరిముందూ ఆ దేవుడి గురించి దేశప్రజలకు చెప్పాలని ఉంది - ఆ దేవుడు ...... మన ప్రెసిడెంట్ ను కలవడం చూడాలని ఉంది - కానీ చెప్పొద్దు సర్ అని మాట తీసుకున్నాడు , ఆ దేవుడి సేఫ్టీ దృష్ట్యా కూడా చెప్పడం కుదరదు , ప్లీజ్ ఫోర్స్ చెయ్యకండి , సిటీ మొత్తం సర్చింగ్ దృష్ట్యా నేనూ నేరుగా వెళ్లి కలవలేదు , సిటీ సేఫ్ అని తెలిసినవెంటనే వెళ్లి కలుస్తాను . ఒకటి మాత్రం చెప్పగలను సిటీ ..... టెర్రరిస్ట్స్ క్లియర్ ...... ప్రజలందరూ నిర్భయంగా బయటకు రావచ్చు - మీప్రాణాలకు ...... మా సెక్యూరిటీ ఆఫీసర్లు , ఆర్మీ అడ్డుగా నిలబడుతుంది - ఒక రెండురోజులు మాత్రం సర్చింగ్ దృష్ట్యా సెక్యూరిటీ ఆఫీసర్లకు సహకరించాల్సిందిగా మీడియాకు - ప్రజలకు విజ్ఞప్పి చేస్తున్నాము .
మీడియా : తప్పకుండా తప్పకుండా సర్ ...... , కానీ మీరుమాత్రం ఆ దేవుడిని ఎలాగైనా ఒప్పించి మీడియా ముందుకు తీసుకురావాలి , అతడిని ఏమాత్రం ఇబ్బందిపెట్టము ప్లీజ్ ప్లీజ్ సర్ .......
SI సర్ : తప్పుగా అనుకోకండి అదిమాత్రం నా చేతులలో లేదు , ఒప్పించడానికి మాత్రం నావంతు ట్రై చేస్తాను .
మీడియా : ఈ మాట అన్నారు చాలు సర్ , చెప్పాల్సినదంతా చెప్పేసారు కదా......
SI సర్ : Yes ........
మీడియా : రెడీ 3 2 1 ....... SI సర్ విశ్వ సర్ SI సర్ విశ్వ సర్ అంటూ సంతోషంతో కేకలువేస్తూ అమాంతం పైకెత్తి సంబరాలు చేసుకుంటున్నారు .

అధిచూసి మురిసిపోతున్న SI సర్ మేడం ను దేవత - ఆక్కయ్యలు ...... అమాంతం పైకెత్తేసి చుట్టూ తిప్పి సంతోషాలను పంచుకున్నారు .
పిల్లలు చుట్టూ చేరి గెంతులేస్తూ చప్పట్లుకొడుతున్నారు .
SI సర్ మేడం : చెల్లెళ్ళూ చెల్లెళ్ళూ అంటూ చిరునవ్వులు చిందిస్తూ కిందకుదిగారు . ఇలా ఎత్తాల్సినది నన్నూ - మీ సర్ ను కాదు మనందరినీ కాపాడిని ఆ దేవుడిని ...... ఎక్కడ ఉన్నారో ఏమిచేస్తున్నారో .......
అక్కయ్య : మీకు కూడా చెప్పలేదా అక్కయ్యా అంటూ నావైపు కన్నుకొట్టారు .
SI ఇంటికే రాలేదు ఇక ఆ విషయం నాకెలా తెలుస్తుంది చెల్లెళ్ళూ ...... , ఈరోజైనా వస్తే మొదట అదేవిషయం అడుగుతాను , చెప్పకపోతే ........
దేవత - అక్కయ్య : నైట్ ఫుడ్ - బెడ్ ఉండదు ........
పోండి చెల్లెళ్ళూ ....... అంటూఅందరితోపాటు నవ్వుకున్నారు SI సర్ మేడం .

ఇక్కడ SI సర్ మేడం - టీవీలో SI సర్ ...... సంతోషాలను చూసి గుండెలపై చేతినివేసుకున్నాను .
అక్కయ్య వచ్చి ఈ అక్కయ్య పెదాలపై చిరునవ్వులు చేర్చినందుకుగానూ , సర్ రుణం తీర్చేసుకున్నావు కదా తమ్ముడూ ...... అంటూ ఆనందబాస్పాలతో నన్ను గుండెలపైకి తీసుకున్నారు .
బామ్మ వచ్చి అక్కయ్య అంటే ఎంత ప్రాణమో నా బుజ్జిహీరోకు అంటూ మా ఇద్దరినీ కౌగిలించుకుని ఆనందించారు .
నేను దేవత ఆనందాలను చూసి ఎంజాయ్ చేస్తుండటం చూసి , తమ్ముడూ ...... ఈ దేవుడి క్రెడిట్ ఎవరికి ఇవ్వబోతున్నావో నాకు తెలుసులే ఉమ్మా ........
బామ్మ : నో నో నో ...... ఎవరికైనా ఇస్తే దెబ్బలుపడతాయి .
మీ ప్రియమైన బుజ్జితల్లికి - ప్రాణమైన చిట్టితల్లికి ఇస్తే ...... , ఇస్తే ఏమిటి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను - ప్రెసిడెంట్ ను కలిసే అవకాశం లభిస్తుందని SI సర్ చెప్పారుకదా , మన ప్రియమైన ప్రాణమైన దేవత - అక్కయ్య ....... ప్రెసిడెంట్ గారిని కలవడం టీవీలో ఈ రెండుకళ్ళతో చూడాలి , అప్పుడే నేను హ్యాపీ ........
అంతే ఇద్దరి కళ్ళల్లో బాస్పాలు .......
అక్కయ్య : నో నో నో ..... కావాలంటే నువ్వు - అక్కయ్య ......
బామ్మ : నో నో నో ....... నా బుజ్జిహీరో - చిట్టితల్లి అంతే ........
నేనైతే ఫిక్స్ అయిపోయాను , మీరెలా ...... మీ ప్రాణమైనవాళ్ళను అనుకుంటున్నారో - నేను ...... నా ప్రాణం కంటే ఎక్కువైనవాళ్లను అనుకుంటున్నాను , నేను చెప్పేదే జరిగేది ........
బామ్మ ...... తియ్యనైన కోపంతో ముద్దు - అక్కయ్య అయితే ఏకంగా బుగ్గపై కొరికేసి నవ్వుతున్నారు .
స్స్స్ స్స్స్ ........

దేవత : బుజ్జిహీరో ....... ఏమైంది ? .
అందమైన తుమ్మెద కుట్టింది మేడం .......
అక్కయ్య - బామ్మ ....... నవ్వుకుంటున్నారు .
దేవత : అవునా ఇంతకీ సరైన సమయానికి ఆ వీడియోలు పంపించిన దేవుడు ఎవరో ....... , ఆ సెక్యూరిటీ అధికారి కు తిక్క కుదిరింది .
బామ్మ : రామాయణం అంతా విని రాముడికి ..... సీత ఏమౌతుంది అన్నట్లుగా ఉంది బుజ్జితల్లీ ....... , మళ్లీ ఇంగ్లీష్ టీచర్ ........
దేవత : అర్థమైంది అర్థమైంది బామ్మా ......
బామ్మ : లేదు లేదు పిల్లలతో చెప్పిస్తాను చూడు ........ , పిల్లలూ ....... ఆ దేవుడు ఎవరో చెప్పండి .
చెల్లెళ్లు : నిన్న మీరుచెప్పిన మీ బుజ్జిహీరో బామ్మా .......
దేవత : అర్థమైంది అనిచెప్పానుకదా బామ్మా ....... అంటూ SI సర్ గుండెల్లో దాచుకుని సిగ్గుపడ్డారు .
SI సర్ మేడం : అయితే ఇక మా శ్రీవారిని కూడా అడిగే అవసరం లేదన్నమాట , బామ్మా బామ్మా ....... ఆ దేవుడు బుజ్జిదేవుడు ఎక్కడ ఉన్నారు ? - ఆయనగారికంటే ముందు మనం కలుద్దాము ప్లీజ్ ప్లీజ్ .........

బామ్మ : మీ శ్రీవారు ...... నిమిషానికోకసారి కాల్ చేస్తుండటంతో స్విచ్ ఆఫ్ చేసేస్తున్నాను అనిచెప్పాడు - ఆ క్షణం నుండీ ఎక్కడ ఉన్నాడో తెలియడం లేదు - మీ శ్రీవారు వచ్చాక ఆర్డర్ వెయ్యి సిటీ మొత్తం గాలించి అయినా నీ ముందు ఉంచుతారు - నో అంటే తెలుసుకదా ........
దేవత - అక్కయ్య : నో ఫుడ్ - నో బెడ్ ........
SI సర్ మేడం : సిగ్గుపడుతూ బామ్మ గుండెలపైకి చేరారు .
టీవీలో అయితే సర్ నినాదాలు ఇంకా మారుమ్రోగుతూనే ఉన్నాయి - ఏ న్యూస్ ఛానెల్ ఉంచినా సర్ గురించే చూయిస్తున్నారు - టాపర్ in the బ్యాచ్ అంటూ సర్ గురించి ప్రోగ్రామ్స్ కూడా చేసేస్తున్నారు .

సడెన్ గా హెడ్లైన్స్ ...... " కాసేపట్లో SI విశ్వ సర్ ను కలవబోతున్న హోమ్ మినిస్టర్ ....... " - ప్రమోషన్ గ్యారంటీ అంటున్న విశ్వాసనీయవర్గాలు ...... - కమీషనర్ గా చేస్తారా లేక ఏకంగా సెక్యూరిటీ అధికారి బాస్ గా ప్రమోట్ చేస్తారా ...... ? - డీజీపీ అనే వినిపిస్తున్నాయి - మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం చూస్తూనే ఉండండి ***** ***** .
పిల్లలకు కూడా అర్థమైనట్లు సంతోషంతో కౌగిలించుకుంటున్నారు .
దేవత - అక్కయ్య : అక్కయ్యా అక్కయ్యా ....... ఏ పోస్ట్ ఇష్టం మీకు , CI నా - DSP నా - SP నా - IG నా - DIG నా - DGP నా .........
SI సర్ మేడం : డీజీపీ - DIG - IG లాంటి పెద్ద పొజిషన్స్ అయితే వద్దే వద్దు .
దేవత - అక్కయ్య : ఎందుకు అక్కయ్యా ....... ? .
SI సర్ మేడం : పెద్ద పొజిషన్స్ అయితే రాజధానికి వెళ్లిపోవాలి .
హాసిని : మమ్మీ ...... ? .
SI సర్ మేడం : నాకు తెలుసు బుజ్జిదెయ్యాలూ ...... అదేవిషయం చెబుతున్నాను - వాళ్ళ అన్నయ్యను , ఆక్కయ్యలను , ఫ్రెండ్స్ ను వదిలి రారు - నేను కూడా నా ప్రియమైన చెల్లెళ్లను వదిలి వెళ్లనే వెళ్లను - మీ సర్ ను లవ్ మ్యారేజ్ చేసుకుని ఇంటి నుండి వచ్చేసాక ఇంత ప్రియమైనవాళ్ళు దొరికారు - ఇక వదులుకోలేను , మీ సర్ గురించి నాకు తెలుసు - నా మాటనే వారి మాట .......
దేవత - అక్కయ్య : లవ్ యు లవ్ యు అక్కయ్యా ...... , అయితే మరి సర్ కు కాల్ చేసి చెప్పండి .
SI సర్ మేడం : ఇక్కడే ఉండే పోస్ట్ తీసుకుంటే ok లేకపోతే ఆయానగారు మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది .
పిల్లలు : లవ్ యు మమ్మీ ...... అంటూ దేవత - అక్కయ్యను హత్తుకున్నారు .
SI సర్ మేడం : లవ్ యు మమ్మీ అని నన్ను కదా హత్తుకోవాల్సింది - నాకు తెలుసు మీకు ...... మీ అక్కయ్యలూ - అన్నయ్య అంటేనే ఇష్టం .......
పిల్లలు : Yes మమ్మీ .......
SI సర్ మేడం తియ్యనైన కోపంతో చూస్తున్నారు .

అందరితోపాటు బామ్మ నవ్వుతూనే , భోజనం చేద్దాము రండి రండి ........
హోమ్ మినిస్టర్ వచ్చి సర్ ను ప్రమోట్ చూసేంతవరకూ నో లంచ్ అని దేవత - అక్కయ్య , నో లంచ్ అని పిల్లలు ...... ఒకేసారి బదులిచ్చారు .
బామ్మ : అయితే నేనుకూడా అంటూ అందరితోపాటు సంతోషంతో టీవీ ముందు సోఫాలో కూర్చున్నారు .
అన్నయ్యా ...... ఎంతసేపని నిలబడతారు వచ్చి కూర్చోండి అని లాక్కెళ్లి తమతోపాటు కూర్చోబెట్టుకున్నారు .

" వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయిన హోమ్ మినిస్టర్ - స్వాగతం పలికిన కలెక్టర్ - మరికాసేపట్లో సిటీ స్టేట్ సెంట్రల్ హీరో విశ్వ సర్ ను కమిషనర్ ఆఫీస్ లో కలవబోతున్నారు - డీజీపీ నే పక్కా అని సమాచారం " అంటూ హెడ్లైన్స్ ........
నో ....... అని SI సర్ మేడం - నో అంటే నో ...... అని పిల్లలిద్దరూ ...... , అన్నయ్యా ....... మీకేమి ఇష్టమో చెప్పనేలేదు .
SI సర్ మేడం : పోయి పోయి మీ అన్నయ్యను ఆడిగారా సరిపోయింది - ఏమని బదులిస్తారో మా అందరికీ తెలుసు ....... " నా చెల్లీ - తమ్ముడికి ఏమిష్టమో నాకూ అదే ఇష్టం " అంతేకదా బుజ్జిహీరో .......
చిరునవ్వు నవ్వాను .
హాసిని - విక్రమ్ : లవ్ యు అన్నయ్యా .......

చెల్లీ ...... డాడీ ......
హోమ్ మినిస్టర్ - కలెక్టర్ గారు ...... విశ్వ సర్ ను కౌగిలించుకుని అభినందిస్తున్న విజువల్స్ ప్లే అవుతున్నాయి , 5 నిమిషాలు మాట్లాడి నేరుగా మీడియా ముందుకువచ్చారు .
మీడియా : మినిస్టర్ గారూ ...... ఏ పోస్ట్ ఇస్తున్నారు - డీజీపీ or IG .......
హోమ్ మినిస్టర్ : SI విశ్వ గురించి న్యూస్ లో చూడగానే CM గారు రావాల్సినది సెంట్రల్ డెలిగేట్స్ తో మీటింగ్స్ ఉండటం వలన నన్ను పంపించారు . ఇలాంటి హీరోను గౌరవించుకోవడం ప్రభుత్వానికి గర్వకారణం - హెడ్లైన్స్ నిజమే విశ్వ ను SI నుండి స్టేట్ డీజీపీ గా ప్రమోట్ చేయడానికే వచ్చాను .
నో నో నో అంటూ SI సర్ మేడం - పిల్లలు ప్రార్థిస్తున్నారు .
మీడియా మరియు అక్కడున్నవాళ్ళంతా విశ్వ సర్ విశ్వ సర్ డీజీపీ డీజీపీ ....... అంటూ దద్దరిల్లిపోయేలా నినాదాలు చేస్తున్నారు .
హోమ్ మినిస్టర్ : ఈ ఒక్కటీ చాలు విశ్వ ....... నిన్ను ఎక్కడికో చేర్చింది - కానీ మీ విశ్వ సర్ ...... డీజీపీ ని నిమ్మళంగా తిరస్కరించారు , తనకు ఈ సిటీని - మిమ్మల్నీ వదిలి మాదగ్గరకు రావాలని ఏమాత్రం ఇష్టం లేదు , తన కోరిక మేరకు సిటీ సెక్యూరిటీ అధికారి కమిషనర్ గా ప్రమోట్ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసాను అంటూ లెటర్ చూయించారు - ఈ క్షణం నుండీ వైజాగ్ సిటీ సెక్యూరిటీ అధికారి కమీషనర్ విశ్వ అని చెప్పడానికి గర్వపడుతున్నాము అంటూ సర్ చేతులుకలిపారు .
డాడీ డాడీ ...... ఉమ్మా ఉమ్మా .......
SI సర్ మేడం కాదు కాదు కమిషనర్ మేడం పెదాలపై చిరునవ్వులు .......
దేవత - అక్కయ్య : మిస్సెస్ కమిషనర్ గారూ ....... , మీ మనసు ...... సర్ కు బాగా తెలుసు - లేకపోతే ఏమిజరుగుతుందో కూడా తెలుసు తెలుసు ......
మిస్సెస్ కమిషనర్ : చెల్లెళ్ళూ ...... అంటూ సిగ్గుపడుతూ దేవత గుండెల్లో దాచుకున్నారు .

మీడియా - ప్రజలు : సిటీ కోసం ....... ఉన్నతమైన డీజీపీ పోస్ట్ నే వదులుకున్నారు గ్రేట్ సర్ ..... సెక్యూరిటీ అధికారి కమిషనర్ విశ్వ విశ్వ అంటూ టాప్ లేచిపోయేలా నినాదాలు చేస్తున్నారు .
హోమ్ మినిస్టర్ : మీడియా మిత్రులారా ....... , మీరు దేవుడిగా కొలుస్తున్న ఆ అజ్ఞాతవ్యక్తి కోసం రేపో ఎల్లుండో సీఎం గారే స్వయంగా వస్తున్నారు - అంతలోపు ఆ దేవుడిని ఒప్పించాలని మీ అందరి సమక్షంలో వైజాగ్ సిటీ కమిషనర్ విశ్వను కోరుతున్నాను .
Yes yes yes ...... అంటూ దద్దరిల్లిపోయింది .
హోమ్ మినిస్టర్ : మీతోపాటు సంబరాలు చేసుకోవాలని ఉంది కానీ ఈ అటాక్స్ గురించి డిస్కస్ చెయ్యడానికి సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఆఫీస్ నుండి అర్జెంట్ గా రమ్మని స్టేట్ హోమ్ మినిస్టర్స్ కు పిలుపు వచ్చింది , మరొకసారి కమిషనర్ విశ్వ ను అభినందించడానికి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారితోపాటు వస్తాను అనిచెప్పి సర్ ను మరొకసారి కౌగిలించుకుని చేతులుకలిపి వెళ్లారు .
సిటీ కమీషనర్ ఫస్ట్ డ్యూటీ గా హోమ్ మినిస్టర్ ను ఎయిర్పోర్ట్ వరకూ వదిలారు .
దారి పొడవునా దైర్యంగా బయటకువచ్చినవైజాగ్ సిటీ ప్రజలు సర్ వెహికల్ కు సెల్యూట్ చేశారు .
Next page: Update 83
Previous page: Update 81