Episode 61
డిన్నర్ అయ్యేక పైకెళ్తారు .. టెరెస్ మీదకి .. ప్రశాంతమైన వాతావరణం .. అసలే చల్లగా ఉండే బెంగుళూర్ లో రాత్రుళ్ళు చాల రొమాంటిక్ గా ఉంటాయి కదా .. వెచ్చని వెన్నెల .. చక్కని చుక్కలు .. మధ్యలో అందరిని చల్లగా చూసే చంద మామ ..
(అశోక్ అంకుల్ భుజం మీద తలపెట్టి) పూజ : ఎంతో బాగుంది కదా అంకుల్ ఈ రాత్రి
అశోక్ : (పూజ తల నిమురుతూ) ప్రతి రాత్రి ఇలానే అందంగా ఉంటుంది .. పైనున్న చంద మామ చలవ వల్ల
శరణ్య : నాన్నా , చంద మామ రాత్రంతా బయటే ఉంటె పాపం పెళ్ళాం తో సంసారం ఎప్పుడు చేస్తాడు
అశోక్ : (కూతురి కి ఒక మొట్టికాయ ఇచ్చి) అలా స్వార్ధంతో పెళ్ళాంతో రాత్రుళ్ళు సంసారం చేస్తుంటే ప్రపంచమంతా అల్లాడిపోదూ
హారిక : అవునంకుల్ .. మనల్ని చల్లగా చూసుకుంటూ తన సంసారాన్ని పక్కన పెట్టాడు
వినోద్ : అందుకే పెళ్లి వద్దు అనేది .. అందరూ చంద్రుణ్ణి పొగుడుతారు .. రాత్రుళ్ళు చల్లగా చూసుకుంటాడని .. మరి పగలు తన పని తాను చేసుకునే సూర్యుణ్ణి అందరూ ఎందుకు తిడతారు ?.. మనిషి పెళ్లి , పెళ్ళాం అనే స్వార్ధంతో ఎన్నో చిక్కుల్లో ఇరుక్కుంటాడు
పూజ : అయితే పాపం చంద్రుడికి సంసారం అక్కర్లేదా ?
వినోద్ : పూజ బేబీ ... చక్కని చుక్కలు .. వేల వేల చుక్కలు తన చుట్టూ తిరుగుతూ తనకి లైన్ వేస్తుంటే .. చంద మామ కి పెళ్లి తో పనేంటే ? పెళ్ళాం , పెళ్లి లేకుండానే వేల వేల చక్కని చుక్కలతో భంచిక్ భంచిక్
(కొడుకు మీద ఒక మొట్టి కాయ వేసి) అనన్య : అందుకే ఆయన అందరికి మామ అయ్యాడు .. ఎవరైనా లైన్ వేసుకోవచ్చు ఆయనకీ
హారిక : స్వార్థం ఎవరిది ? ఎన్నో వేల చుక్కలు మనందరికీ వెన్నెల రూపంలో వెలుగుని పంచుతున్నా .. మనమంతా చంద్రుడికే క్రెడిట్ ఇస్తున్నాం .. పని చేసేది చక్కని చుక్కలు .. బీట్ వేసేది చంద మామ .. పేరు వచ్చేది చంద మామ కె .. అన్యాయం కదూ
వినోద్ హరికని వాటేసుకుంటూ "ఎన్నో వేల చుక్కలు ఉన్నా .. చంద్రుడు అందరి వాడే కదా .. ఎవరికీ పక్షపాతం చూపించలేదు .. ఎనీవే .. అందంగా పుట్టడం ఆ చక్కని చుక్కల తప్పు కాదు .. ఎవరికీ కమిట్ మెంట్ ఇవ్వని చంద్రుడి దీ తప్పు కాదు .. ఇండియా లో ఉన్నా అమెరికా లో ఉన్నా .. అందరిని సమానంగా చూసుకుంటాడు చంద మామ .. అదే ఆయన గ్రేట్ నెస్ " , అని అంటాడు
అనన్య కొడుకుని దగ్గరకి తీసుకుని
చంద్రుళ్ళో ఉండే కుందేలు కిందికొచ్చిందా
కిందికొచ్చి నీల మారిందా
తందానే తందానే
ఆనంద్ పూజ , హారిక ని దగ్గరకు తీసుకుని
చుక్కల్లో ఉండే జిగేలు నిన్ను మెచ్చిందా
నిన్ను మెచ్చి నీలో చేరిందా
తందానే తందానే
కట్ చేస్తే .. 2050 లో
ఇంటర్నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీ .. న్యూ యార్క్ లో .. దేశ విదేశాలనుంచి ఎంతో మంది స్టూడెంట్స్ వచ్చారు .. ప్రతిభ అంటే ఇండియా .. వినమ్రత అంటే ఇండియా .. ఎక్కువ మంది ఇండియన్ స్టూడెంట్సే
పార్టిసిపంట్ 1 (ఆస్ట్రేలియా నుంచి)
నా పేరు : పూజిత
అమ్మ పేరు : పూజ
నాన్న పేరు : xxx
పార్టిసిపంట్ 2 (అమెరికా నుంచి)
నా పేరు : పావని
అమ్మ పేరు : పల్లవి
నాన్న పేరు : xxx
పార్టిసిపంట్ 3 (కెనడా నుంచి)
నా పేరు : హారిణి
అమ్మ పేరు : హారిక
నాన్న పేరు : xxx
పార్టిసిపంట్ 4 (ఇండియా నుంచి)
నా పేరు : అరణ్య
అమ్మ పేరు : శరణ్య
నాన్న పేరు : శశి
టీవీ లో లైవ్ చూస్తున్న ఆనంద్ , అనన్య , కుమార్ , పద్మ , పూనమ్ .. వేరే చోట్లనుంచి ..
ఈ నలుగురిలో ఎవరు గెలిసినా మనమంతా గెలిచినట్టే .. ఆనంద్ కళ్ళల్లో తేమ .. అనన్య మొగుడి భుజం మీద వాలిపోతూ "అందానికి అందం .. తెలివి కి తెలివి .. అన్నిటికి మించి ఇండియా మీద విపరీతమైన ప్రేమ .. మన సంస్కృతి మీద ఎనలేని అభిమానం .. అంతా మీరిచ్చిన ట్రైనింగ్ వల్లే కదా .. రత్నాల్లాంటి పిల్లలు .. నాకెందుకో వాళ్ళందర్నీ చూడాలని ఉంది అశోక్ " , అని అంటే ... ఆయన "ఈ మధ్యనే మన షష్టిపూర్తి కి వచ్చారు .. మాటి మాటి కి వచ్చేదానికి వాళ్ళేమన్నా ఖాలీగా ఉన్నారా .. పెళ్లి పెటాకులు లేకుండా దేశాల వెంట తిరుగుతున్నాడు గా నీ పుత్ర రత్నం వాణ్ణి రమ్మను ముందు .. " , అని అంటాడు
మొగుణ్ణి తోసేస్తూ "మీకెప్పుడూ వాడంటే పడదు .. మీకు పుట్టలేదనేగా .. వాడే లేకపోతే ఇంతమంది మనవళ్లు మనవరాళ్లు ఎలా వచ్చేవాళ్ళు .. " , అని కసురుకుంటే
ఆయన పెళ్ళాన్ని దగ్గరకి తీసుకుని "అనన్య ... వాడు నాకు పుట్టాక పోయినా .. నా గుణగణాలతో పుట్టాడే .. పదిహేడేళ్ల క్రితం నేనేదో పెళ్లి కాని చంద్రుడు మీద మాట్లాడితే వాడు సీరియస్ గా తీసుకున్నాడు .. ఎనీవే ... ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది .. చూడు " , అని అంటాడు
స్పెల్లింగ్ బీ లో పాల్గొన్న ఆ నలుగురే కాక ఇంకా చాల దేశాల నుంచి కూడా వచ్చారు .. కాకపోతే ఆ నాలుగురకే కరతాళ ధ్వనులు ..
పోటీ రసవత్తరంగా సాగుతుంది .. చివరికి విన్నర్ ..... xxx
పోటీలో గెలుపు కాదు ముఖ్యం .. పాల్గొనడం ..
ప్రేమలో పెళ్లి కాదు ముఖ్యం .. ప్రేమగా చూసుకోవడమే ..
పెళ్లి అనేది గుదిబండ కాకూడదు .. మన స్వాతంత్య్రాన్ని కట్టిపడేయకూడదు
పెళ్లి అనేదానికి అర్ధమే మారిపోయింది .. 2030 లో .. 2040 లో .. 2050 లో ... కాలం గడిసె కొద్దీ పెళ్ళికి నిర్వచనం మారుతున్నా .. ప్రేమ లో ఉన్న మాధుర్యం ఇంకా ఇంకా పెరుగుతుంది .. పెళ్లి కాదు ముఖ్యం .. ప్రేమగా , బాధ్యతగా చూసుకోవడం .. ఎగతాళి చేసే తాళి అవసరమా ? ఒక దాని మేడలో ఉచ్చు .. దానికి తెలియకుండా ఇంకో డజన్ ఆడవాళ్ళతో రేలషన్ .. అవసరమా ? మనకి హైదరాబాద్ బిర్యానీ అంటే ఇష్టం .. అలాగని పెరుగన్నం ఇష్టం లేదని అనగలమా ? రసాలు ఊరే జిలేబి ... నోరూరించే చాకొలేట్ ఐస్ క్రీం .. అన్నీ ఇష్టమే కదా ..
మనకిష్టమైన వాళ్ళు ఒకరే ఉండాలని కోరుకోవడం ఎంతవరకు సబబు .. ప్రపంచం లో ఉండేది ఒకతె అంటే అది అమ్మే .. ఇద్దరు ముగ్గురు అమ్మలు ఉండరు .. ఉండేది ఒక అమ్మే .. అందరికీ ఒక అమ్మే .. కానీ ఒక అమ్మాయే ఉండాలి నీ జీవితంలో అని రూల్స్ పెట్టడం ఎంతవరకు సబబు ? మన ఇష్టం .. మన కెపాసిటీ .. ప్రేమ అనంతం .. ఎంత పంచినా కరగదు .. ఇంకా పుడుతూనే ఉంటుంది .. ప్రేమని పంచే దానికి , మనకిష్టమైన ముగ్గురు అమ్మాయలు ఉంటె తప్పా ?
అమ్మ ఒక్కతే .. ఫైన్
అమ్మాయి ఒక్కతే .. నాట్ ఫైన్
పెళ్ళాం ఒక్కతే .. డోంట్ కేర్
ఇదంతా ఒక సైడ్ వాదన .. 2030 లో వాదన .. ఇక్కడితో ఆపేద్దాం ..
కానీ 2050 లో కూడా ఇలాంటి వాదనే ఉంటుందా .. ఏమో .. తెలుసుకుందాం
ఈ కధకి మూల కధఅయిన పెళ్ళాం ఊరెళ్తే (లింక్ మొదటి పేజీ లో ఉంది) క్లైమాక్స్ రాసేటప్పుడు ఒక రచయితగా నేను చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యా .. ఆఖరి మూడు నాలుగు ఎపిసోడ్స్ చదివితే మీకే అర్ధమవుతుంది
ఇక ఈ సీక్వెల్ పెళ్ళాం కావాలి క్లైమాక్స్ ఎలా రాయాలా అని గత ఆరు నెలలు గ మధనపడుతున్నా .. ఎందుకంటే ఇందులో ఎండింగ్ అంటూ ఉండదు .. అలాగని ఎంతకాలం సాగదీస్తాం .. ఒక స్టేజి లో విసుగెత్తి చేతులెత్తేసా .. కానీ రాసిన ప్రతి కధకు ఏదొక ముగింపు అయితే ఉండాలి కదా .. అందుకే దీనికి ముగింపు ఇక్కడ చెప్పడం కష్టం
అందుకే సీక్వెల్ గా వీళ్ళ పిల్లల స్టోరీ తో ముడిపెట్టి ముగింపు పలకాలని అనుకున్నా .. పైన చెప్పిన ఆడపిల్లలే కాకా , ఇంకా మగ పిల్లలు కూడా ఉంటారు .. అనవసరమైన కేరక్టర్స్ ఉండవు .. 2000 లో స్టార్ట్ అయిన కథ , 2030 లో చెప్పుకున్నాం .. ఇక 2050 లో చెప్పుకోవాలి .. బేసిక్ ఎమోషన్స్ అవే ఉంటాయి కాకపోతే జనరేషన్ మారుతుంది .. పెళ్లి , ప్రేమ మీద రక రకాల వాదనలు , అభిప్రాయాలు ఉంటాయి .. అందుకే ఆనంద్ , అనన్య కేరక్టర్స్ కూడా ముఖ్యమే ఇందులో .. కాకపోతే వినోద్ పెళ్లి చుట్టూ తిరుగుతుంది
ఇక పల్లవి , వినోద్ మధ్య ఎపిసోడ్స్ లేవు అన్నారు కదా .. కావాలనే అక్కడితోనే కట్ చేశా .. సీక్వెల్ లో పల్లవి తన ప్రేమ కథని తన పిల్లలకి చెబుతుంది ..
******* ఈ వాదనకి ఇంతటితో విరామం *******
********** కొత్త వాదనతో కొత్త చోట కలుద్దాం *******
********* సమాప్తం *********