Chapter 05


ఆనంద్ పెళ్లిచూపులు ఫెయిల్ అయ్యాక ఫ్రెండ్స్ తో కలిసి మందుకొడుతూ మర్చిపోయేదానికి ట్రై చేస్తూ .. ప్రేమలో పడేదానికి రెడీ అవుతాడు .. ఒకసారి ఫ్రెండ్ రూమ్ కి బైక్ లో వెళ్తుంటే వీధి చివర్లో ఒక అందమైన అమ్మాయి తన ఫ్రెండ్ తో గుళ్ళోంచి వస్తూ కనిపిస్తుంది .. ట్రెడిషనల్ డ్రెస్ లో సూపర్ గా ఉంది .. లంగా వోణి .. ఏ అమ్మాయి అయినా కత్తిలా ఉంటది .. కానీ మ్యాటర్ అది కాదు .. అది చూపించిన మంచి తనం .. గుడ్డి బిచ్చగాణ్ణి రోడ్డు దాటించడం .. ఫాలో అవుదామంటే బాగోదనిపించి ఆగిపోయాడు

రెండు రోజుల తర్వాత మల్లి కనిపించింది ఆ పిల్ల .. ఈ సారి జిమ్ లో .. అప్పుడు లంగా వోణి .. ఇప్పుడు జిం వెర్ .. కత్తిలా ఉంది .. మగాళ్లందరి దృష్టి దానిమీదే .. ఇంకాస్త ఎక్కువసేపు చేస్తారు మగాళ్లందరూ ఆ రోజు జిమ్ .. మాట్లాడదామంటే పెద్ద లైన్ ఉంటది కదా .. మనకన్నా పోటుగాళ్ళు చాల మంది ఉన్నారు

ఒకరోజు మధిర మామ తో వాడి బైక్ మీద వెళ్తుంటే .. మధ్యలో ఆపి .. వాడు దమ్ము కొట్టేదానికి పక్కకెళ్తూ .. బైక్ ని పట్టుకోమంటాడు .. ఇంతలో .. వెనక ఒకమ్మాయి .. ఫ్రెండ్ తో .. కంగారుగా ... "హ .. వచ్చేస్తున్నానే .. మానేజ్ చేయి మేనేజర్ ని .. ఆల్రెడీ కుపిడో బుక్ చేశా .. వచ్చేస్తా వెంటనే " , అని తొందర తొందర గా వాడి బండి దగ్గరకొచ్చి .. లొకేషన్ రీచ్డ్ అన్న మెసేజ్ చూసుకుని .. "క్యూపిడోనా ?" , అని వాడి వైపు చూసేసరికి .. తలెత్తి చూసిన ఆనంద్ స్టన్ అవుతాడు .. ఆ అమ్మాయే .. "హ ... క్యూపిడోనే.. ఎక్కండి ఎక్కండి " , అని అబద్దం చెబుతాడు

ఆ పిల్ల 9849 అని అనేసరికి .. వాడు "హ .. పూర్తి ఫోన్ నంబర్ చెప్పండి " , అని ఆ అమ్మాయి వైపు చూస్తే .. అది "ఓటీపీ అండి .. అయినా యాప్ లో వేరే బైక్ నెంబర్ ఉంది " అని అనేసరికి .. వాడు తడుముకుంటూ "అంటే ఇది నా ఫ్రెండ్ బైక్ అండి .. నా బైక్ సర్వీసింగ్ కి ఇచ్చా .. మీరేం భయపడకండి .. మిమ్మల్ని సేఫ్ గా తీసుకెళ్తా " ,అని అన్నాక .. ఆ అమ్మాయి వాడి బైక్ ఎక్కుద్ది ... వాడు బండి స్టార్ట్ చేసి స్లో గా వెళ్తుంటే .. అది టెన్షన్ తో "కొంచెం స్పీడ్ గా వెళ్తారా ? నాకు మీటింగ్ ఉంది " , అని అంటది

ఇప్పుడు లొకేషన్ ఎలా .. "మీది మాదాపూర్ అయ్యప్ప సొసైటీ కదా " , అని అంటే .. అది "కాదు కాదు ... అది తప్పు చెబుతుంది .. హైటెక్ సిటీ మైండ్ స్పేస్ .. టైం లేదు .. లొకేషన్ చెబుతా .. పోనియ్యండి " , అని అనేసరికి .. వాడు నవ్వుకుంటూ స్పీడ్ పెంచుతాడు .. ఏముందిరా .. మిర్రర్ లో చూస్తుంటే .. తనేమో ఫోన్ తో బిజి .. మల్లి టెన్షన్ ఆ అమ్మాయికి "ఏంటి ... కుపిడో కాల్ వస్తుంది " , అని అనగానే వాడు .. "అది ఆన్సర్ చేయొద్దు .. ఆన్లైన్ లో పే చేయమని రిక్వెస్ట్ చేస్తారు .. నాకు కాష్ ఇచ్చేయండి పర్లేదు .. ప్లీజ్ " , అని అద్దంలో దాన్ని చూస్తుంటే .. అది అయిష్టంగా ఓకే అంటది

"అవును .. మీరిక్కడే ఉంటారండీ ? సాఫ్ట్ వేరా ?"

"కొంచెం ఫాస్ట్ గా వెళ్తారా .. నాకు టైం లేదు "

"యా .. స్యూర్ "

అలా అమ్మాయితో పులిహోర కలుపుతూ పోనిస్తాడు .. మైండ్ స్పేస్ గేట్ దగ్గర ఆపుతాడు .. అది దిగి

"ఎంత చూపిస్తుంది "

"మీకెంత చూపిస్తుంది ?"

"రైడ్ స్టార్ట్ చేసే ముందు 75 చూపించింది "

"అంతే ఇచ్చేయండి "

డబ్బులు ఇచ్చి వెళ్తుంటే

"excuse me ?"

"రేటింగా .. ఇస్తాలే 5 స్టార్ "

"అయ్యో కాదండి .. మీరు ఈవెనింగ్ కూడా క్యూపిడోనే బుక్ చేసుకుంటారా "

"హమ్ ... ఎందుకు "

"ఈవెనింగ్ నేను ఇదే ఏరియా లో ఉంటా .. నా నంబర్ ఇస్తా .. కాల్ చేయండి "

అది ఆలోచిస్తుంటే

"మేడం .. అంటే .. నాక్కూడా రైడ్స్ దొరకడం కష్టం .. అందుకే "

అది సరే అంటది

రూముకెళ్ళి ఫ్రెండ్స్ తో బాతాఖానీ కొట్టి .. సాయంత్రానికి ఫ్రెండ్ తో మల్లి మైండ్ స్పేస్ దగ్గర్లో వెయిట్ చేస్తుంటే .. వాడి ఫ్రెండ్ ఎందుకాపేవురా అని అడిగితే .. జరిగింది చెబుతాడు .. వాడి ఫ్రెండ్ "ఒరేయ్ మావా .. ఆ అమ్మాయి యాప్ లో బుక్ చేసుకోకుండా నీకెందుకే డైరెక్ట్ గా ఫోన్ చేస్తదిరా ?", అని అనేసరికి వాడు అసలు నిజం చెబుతాడు .. ఆ అమ్మాయికి డిస్కౌంట్ ఇస్తా అని చెప్పా ..

"మావా .. ఆ అమ్మాయి పిసినారితనాన్ని వాడుకుంటున్నావా ?"

ఇంతలోనే ఆ అమ్మాయి నుంచి ఫోన్ ... ఇంకో రెండు నిముషాల్లో బైక్ వెనక .. ఇందాక వచ్చిన దారే .. అది ఫోన్ లో మెసేజ్ లు చెక్ చేసుకుంటా ఉంటె .. మనోడు స్టార్ట్ చేస్తాడు పులిహోర కలపడం

"మేడం .. మీరు ఇదే కంపెనీ లో వర్క్ చేస్తున్నారా .. మీ పేరేంటి మేడం ?"

"అన్నా .. "

వాడి గుండె జారీ పోయి వెనక్కి చూస్తే .. అది ఫోన్ లో ఎవరితోనో.. హమ్మయ్య ..

"అన్నా .. రేపటికన్నా వచ్చేస్తుందా స్కూటీ "

"రేపా .. కష్టం మేడం .. ఇంకా నాలుగైదు రోజులు పడుతుంది రిపేర్ అవడానికి "

"అన్ని రోజులా .. త్వరగా ఇవ్వడానికి ట్రై చేయండి "

"సరే మేడం "

బండి నడుపుతూ ఆ పిల్లనే చూస్తుంటాడు ..

ఇంతలో అది దిగాల్సిన ప్లేస్ వచ్చేస్తుంది .. హాస్టల్ .. బైక్ దిగుతూ .. "ఇందాక 75 కదా .. ఇప్పుడు కూడా అంతే ఇస్తా " , అని ఆ అమ్మాయి అనేసరికి వాడు ఓకే అంటాడు .. అది డబ్బులిచ్చి అక్కడే నిలబడితే వాడు అదోలా చూస్తున్నాడు .. "హలో .. నువ్వు నాకు చేంజ్ 5 రూపాయలు ఇవ్వాలి ", అని అనేసరికి .. వాడు చేంజ్ ఇచ్చేసరికి .. అది వెళ్తుంటే ... "మేడం రేపు కూడా ఉదయం అదే టైం కి రమ్మంటారా ?" , అని అనేసరికి .. అది వెనక్కితిరిగి ఎందుకు అని అంటే

"అంటే .. ఇందాక మీరు మెకానిక్ తో మాట్లాడం విన్నా .. స్కూటీ రెడీ అయ్యేదానికి 4 రోజులు పడుతుంది కదా .. నాది కూడా ఇదే ఏరియా .. మార్నింగ్ రైడ్స్ ఏమి ఉండవు "

"మరి అమౌంట్ ?"

"మీ ఇష్టం .. ఎంతివ్వాలనుకుంటే అంత .. ఏమి లేనిదానికన్నా బెటర్ కదా "

"అయితే ఓకే .. మార్నింగ్ 9 కి వచ్చెయ్ .. ఇక్కడికే "

ఆ పిల్ల ని అలా బైక్ మీద ఎక్కించుకుని ఆఫీస్ కి తీసుకెళ్లడం .. మధ్యలో పులిహోర కలపడం ..

సాయంత్రం వచ్చేటప్పుడు అమ్మాయి డల్ గా ఉంటె .. "ఏంటి మేడం డల్ గా ఉన్నారు " , అని అంటే .. అది తలూపుతూ "ఏదో .. ఆఫీస్ టెన్షన్స్ " అని అనేసరికి .. వాడు పక్కనే మంచి టీ సెంటర్ దగ్గర ఆపి ఆ అమ్మాయికి కప్పు టీ తెస్తే .. థాంక్స్ అంటూ టీ తాగి "చాల బాగుంది .. థాంక్స్ " ,అని అంటది

పేరు చెప్పింది .. విహారిక ..

సాయంత్రం ఫోన్ చేసింది .. "హ మేడం స్టార్ట్ అవ్వమంటారా ?" , అని అంటే .. అది "లేదండి .. నాకు మీటింగ్ ఉంది .. ఎంత టైం పడుతుందో తెలియదు .. " , అని నసుగుతుంటే ... వాడు "పర్లేదు మేడం .. నేనెటు ఖాళీయే .. అక్కడకొచ్చి వెయిట్ చేస్తా .. " , అని అనేసరికి .. అది ఓకే అంటది

అనుకున్నట్టే కొంచెం లేట్ గా అక్కడకి వెళ్తాడు సాయంత్రం .. ఎంత టైం అయినా ఫోన్ లేదు .. తానే ఫోన్ చేస్తాడు .. నో రిప్లై .. 10 నిముషాల తర్వాత మల్లి ఫోన్ .. నో రిప్లై .. టైం 9 అవుతుంది ...

మీటింగ్ అయ్యేక ఫోన్ చూసుకుంటే ఎన్నో మిస్డ్ కాల్స్ .. కంగారుగా బయటకొచ్చి .. ఆనంద్ తో "సారీ సారీ .. మీటింగ్ కదా ... ఫోన్ సైలెంట్ లో ఉంది .. చూసుకోలేదు .. అయినా మీరు వెళ్లిపోవాల్సింది కదా " , అని విహారిక అనేసరికి .. వాడు "ఈ టైం లో మీకు క్యాబ్స్ దొరకడం కష్టం కదా .. అందుకే " , అని అనేసరికి .. విహారిక మొఖంలో వెలుగు "థాంక్స్ అండి " ,అని అంటది

ఇంతలో రూమ్ మెట్ నుంచి ఫోన్ .. "ఏంట్రా లేట్ అయ్యింది .. సరే నీ దగ్గర కీ ఉందిగా .. నేను పడుకుంటున్న .. ఫ్రిడ్జ్ లో దోస పిండి ఉంది .. నువ్వేసుకుని తిను "

అది విన్నది .. బైక్ లో వెళ్తుంటే .. మధ్య లో ఆపమంటాది .. "ఇక్కడ మంచి దోశలు దొరుకుతాయి .. తిందామా మనము " ..

వాడికి నమ్మబుద్ది కావడం లేదు .. "మనమా "

"అవును .. ఎటు మీరు రూమ్ కెళ్ళి దోసలేసుకోవాలి కదా .. ఇక్కడ చాల బాగుంటాయి .. అందుకే "

వాడు బండి ఆపి .. వెళ్లి దోశలు తెస్తాడు .. ప్లేట్లో .. ఇద్దరూ బండికి ఆనుకుని తింటుంటే .. విహారిక వాడితో ఫ్రీ గా మాట్లాడుతూ

"ఇది మీకు ఫుల్ టైం జాబా ?"

"హ .. ఇదే ఇదే "

"ఎం చదువుకున్నారు "

"బి టెక్ కంప్యూటర్స్ "

"మరి ఈ జాబు ఏంటి ?"

"అంటే నాకు చిన్నప్పటి నుండి ట్రావెలింగ్ అంటే ఇష్టమండి "

అది వాడి వైపు అదోలా చూస్తే

"అంటే .. బ్యాక్ లాగ్స్ ఉన్నాయ్ .. అందుకే "

"ఇదికూడా తక్కువేం కాదులెండి .. మీరు ఇందులోనే కంటిన్యూ అవుతామనుకుంటున్నారా ?"

"అంటే .. మీ లాంటి సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ ని చూసినప్పుడు అనిపిస్తుంది .. మనం కూడా బాగా చదువుకోవాల్సిందని "

"మీరు మరీ అంత ఫీల్ అవద్దు .. సాఫ్ట్ వేర్ మీరనుకున్నంత హాయ్ గా ఉండదు.. ప్రెజర్ తో చంపేస్తారు .. వర్క్ లో నరకమే "

"మీకెవరి మీదో బాగా పగ ఉన్నట్టుంది "

"అది .. మా మేనేజర్ గాడు .. వాడి ప్రపోసల్ ని రిజెక్ట్ చేసానని .. నా మీద కసి వాడికి "

"మరి అలాంటప్పుడు కంపెనీ మారొచ్చుగా "

"లేదండి .. ఈ కంపెనీ లో మంచి సాలరీ ఇచ్చారు .. మంచి పోసిషన్ కూడా .. కానీ వాడితోనే "

"వాడంటే బాగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు "

"హా .. వెర్రి నా డాష్ గాడు .. ఉడతలు పట్టుకునే వాడు .. దొంగ నా కొడుకు .. సోంబేరి నా కొడుకు "

ఇద్దరు హాయ్ గా నవ్వేసుకుంటారు .. మేనేజర్ ని తిట్టుకుంటూ .. "దోస చాల బాగుంది విహారిక "

పేరు పెట్టి పిలిచేసరికి అది తెలెత్తి చూస్తది .. వాడు సారీ అని అంటే .. అది పర్లేదు అని అన్నాక వాడికి చాల హ్యాపీ గా ఉంది

రాత్రి బాగా నిద్ర పడుద్ది వాడికి .. నెక్స్ట్ డే ఆ అమ్మాయి ని స్కూటీ లో చూసిన ఫ్రెండ్ ఫోన్ చేసి చెబుతాడు .. "ఒరేయ్ మామా .. ఆ అమ్మాయి బండి రిపేర్ అయినా కూడా నీతో వస్తుందంటే .. మామా .. నువ్వు లక్కీ రా " , అని అనేసరికి వాడు ఎగిరిగంతేస్తాడు

ఉదయం 9 గంటలకి లొకేషన్ కి వెళ్తే .. వచ్చి బండి ఎక్కింది .. వాడికి పట్టలేని సంతోషం .. "ఏంటండీ .. మీ స్కూటీ ఇంకా రెడీ కాలేదా " .. "హ .. లేదండి .. ఇంకో రెండు రోజులు పడుతుంది "

వాడికి గాల్లో తేలుతున్నట్టుంది

సాయంత్రం వచ్చేటప్పుడు .. కలిసి టీ తాగడం .. మధ్య మధ్య మేనేజర్ గాని బండ బూతులు తిట్టడం .. నవ్వుకుంటూ జోకులు వేసుకోవడం .. ఒక రోజయితే నేరుగా ఇంటికి కాక .. అలా దుర్గం చెరువు కేబిల్ బ్రిడ్జి మీద తిప్పమనడం .. సరదాగా సాగిపోతుంది

ఒకరోజు రాత్రి 10 గంటలకి మెసేజ్ .. వచ్చి పిక్ అప్ చేసుకోమని .. ఈ టైం లో ఏంటి ఈ పిల్ల .. డౌటుతో తాను చెప్పిన లొకేషన్ కి వెళ్తే .. ఇదేదో కొత్త లొకేషన్ .. బయట విహారిక ని చూసి .. దాని వాలకం చూసి అనుమానంగా "బాగా తాగినట్టున్నావ్ " , అని అంటే .. అది "అవును .. అమ్మాయల పార్టీ .. రేపేటు వీకెండ్ కదా .. పద .. పోనియ్ " , అని బండెక్కుద్ది .. వాడు మల్లి "తాగావా " ,అని అంటే .. దానికి గుద్దలో కాలి .. బండి దిగి

"ఆనంద్ .. ఎం తాగితే బండెక్కిచ్చుకోవా ... అయినా నీ డొక్కు బండొక్కటే కాదుగా .. నేను ఆటో లోనో .. క్యాబ్ లోనో వెళ్తా .. నువ్వుకూడా మా మేనేజర్ లా టార్చెర్ పెడుతున్నావ్ .. నువ్వేదో స్పెషల్ అనుకుని .. " వాగుతూనే ఉంది

వాడు నవ్వుతు దాన్నే చూస్తుంటే .. "చూడు ఆనంద్ .. ఇంత జరిగినా ఒక్క సారీ అన్నా చెప్పావా " , అని కోపముగా అంటుంటే .. "మేడం సారీ .. వచ్చి బండెక్కండి " , అని అంటే . అది బండెక్కి .. తూలుతూ ముందుకు వాలి వాణ్ణి గట్టిగా వాటేసుకుంటది ..

జాగ్రత్తగా దాన్ని రూమ్ దగ్గర దింపి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోతాడు

నెక్స్ట్ డే ఆఫీస్ లేకపోయినా 9 గంటలకి రమ్మంటది .. కాఫీ షాప్ కి .. "రాత్రి ఏమి జరిగింది ఆనంద్ .. తాగి నేనేమన్నా అల్లరి చేసానా ?" , అని విహారిక అంటే .. వాడు నవ్వుతు "పెద్దగా ఏమి లేదు .. మీ మేనేజర్ కి ఫోన్ చేసి తిట్టావ్ .. నా బైక్ ని రెండు సార్లు కొట్టావ్ .. పోతు పోతు నాకో హగ్ ఇచ్చావ్ " ..

"చ్చ .. నువేమన్నా అనుకున్నావా "

"విహారిక .. నేనేమన్నా అనుకునే వాణ్ణి అయితే నువ్వు నన్ను అసలు పిలిచేదానివి కాదు "

కాఫీ రెడీ అని కౌంటర్ దగ్గరకెళ్తాడు ఆనంద్ .. ఇంతలో వాడికి ఫోన్ .. ఫోన్ అక్కడే ఉంది .. ఫోన్ లేపేలా వద్దా అని చూస్తే .. H R అని ఉంది .. ఫోన్ పిక్ చేసి "ఇది ఆనంద్ ఫోన్ " , అని చెబుతున్నా వినకుండా అటు నుంచి ఏవో మాటలు .. ఫోన్ పెట్టేసాక .. ఆనంద్ వస్తాడు ట్రే తో

"కంగ్రాట్స్ ఆనంద్ .. బెస్ట్ ఎంప్లొయీ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చింది నీకు " , దాని మాటల్లో వెటకారం

వాడి మొఖంలో నెత్తురు చుక్క లేదు .. కుపిడో డ్రైవర్ ని అని అబద్దం చెప్పాడు కదా

"విహారిక , అదే చెబుదామని ట్రై చేస్తున్నా "

"భలే మోసం చేసావ్ ఆనంద్ .. ఒక్క రోజు కాదు రెండు రోజులు కాదు .. 10 డేస్ నుంచి "

"విహారిక చెప్పేది విను .. నిన్ను మోసం చేయాలనీ కాదు .. "

వినకుండా వెళ్లిపోతున్న విహారికతో "విహారిక .. i love you "

అది వెనక్కి తిరిగి "నాకు తెలుసు ఆనంద్ .. కానీ ఇదంతా తెలిసాక నువ్వేదో ప్లాన్ చేసి లవ్ చేసినట్టుంది "

"ప్లాన్ ఏంటి విహారిక .. నాకు నువ్వెప్పటినుంచో తెలుసు .. గుళ్లో .. జిమ్ లో .. ఎప్పుడు మాట్లాడే ఛాన్స్ రాలేదు .. ఈ లోగ .. బైక్ దగ్గరకొచ్చి రైడ్ అడిగావు .. "

"ఛాన్స్ దొరికింది కదా అని చీప్ గా అబద్దం చెప్పి దగ్గరయ్యావ్ "

"అవన్నీ చేశా .. ఒప్పుకుంటున్నా .. కానీ ఎందుకు చేసానో చెప్పనీయ్ "

"అబద్దాలతో స్టార్ట్ అయిన ఏ రేలషన్ ఎక్కువ కాలం ఉండదు "

ఆ తర్వాత ఆనంద్ చాల సార్లు మెసేజ్ లు పెడతాడు .. కాల్ చేస్తాడు .. దేనికి రిప్లై లేదు ..

ఒకరోజు ఆఫీస్ లో సాయంత్రం విహారిక ఫ్రెండ్ క్లాస్ పీకుద్ది

"ఒసేయ్ .. నువ్వు ఆనంద్ అబద్ధమాడి దగ్గరయ్యాడు అని వాణ్ణి దూరం పెట్టావ్ .. వాడిది అబద్దమైతే .. మరి నీది ? స్కూటీ రిపేర్ అయినా వాడి బండిమీదెక్కావ్ .. అబద్దాలు చెప్పి దొంగ ప్యాకేజీ లు చెప్పుకునే ఈ రోజుల్లో .. వాడు తనని తాను తక్కువ చేసి చెప్పుకున్నాడు .. నాకెందుకో మీది నిజమైన ప్రేమ అని అనిపిస్తుంది " , అని అంటది

ఆలోచనల్లో పడుద్ది విహారిక .. ఇద్దరు కింద పార్కింగ్ లాట్ కి వస్తే .. బైక్ తో ఆనంద్ .. వాణ్ణి చూసి అవాయిడ్ చేయాలనీ ట్రై చేస్తుంటే .. దాని ఫ్రెండ్ "మూసుకొని వెల్లవే " , అని తిడితే ... అది మొఖం మాడ్చుకుని వాడి బైక్ వైపు వస్తూ .. "చేసిందంతా చేసి ఎలా నిలబడ్డాడో చూడు అమాయకుడిలా " , అని గొణుక్కుంటుంది

"ఎందుకిలా వెంటపడుతున్నావ్ ఆనంద్ .. వదిలేయ్ "

"విహారికా .. నాది నిజమైన ప్రేమ .. నమ్ము "

"చెప్పు .. నీది నిజమైన లవ్ అని .. ఒక్క కారణం చెప్పు "

"ఒక్కటి కాదు .. నాలుగు చెబుతా .. నువ్వు నా పర్సనల్ లైఫ్ చూసో , ప్రొఫెషనల్ లైఫ్ చూసో లవ్ చేయలేదు .. నా క్యారెక్టర్ చూసి లవ్ చేసావ్ .. అది నాకు చాలా నచ్చింది .. మనము ఏది మాట్లాడుకున్నా గంటలు గంటలు మాట్లాడుకునే వాళ్ళం .. ఈ లెవెల్ కనెక్షన్ .. వేరే అమ్మాయితో ఛాన్స్ లేదు .. నాది జులాయిగా తిరిగే మనస్తత్వం .. నీ పిసినారి తనంతో బాగా బాలెన్సు అవుద్ది .. ఇక ఫైనల్ గా .. నువ్వు మరి ముద్దుగా ఉంటావ్ విహారిక .. గుళ్లో అయినా .. జిమ్ లో అయినా .. ఆఫీస్ లో అయినా .. కాఫీ షాప్ లో అయినా .. "

"నీకు నేను బైక్ విషయంలో అబద్దం చెప్పానని ముందే తెలుసు కదా "

"హుమ్ "

"మరేందుకు ఎప్పుడూ అడగలేదు "

"ఎందుకంటే .. దాని వెనకున్న ఉద్దేశ్యం కూడా నాకు తెలుసు విహారికా "

విహారిక మెలికలు తిరుగుతూ .. 8976.. అని అంటది ..

"హ ?"

"ఓటీపీ అండి "

"మేడం .. మేడం .. రండి మేడం "

బండెక్కి

"లవ్ యు ఆనంద్"

"లవ్ యు టూ విహారిక "
Next page: Chapter 06
Previous page: Chapter 04