Chapter 41


ఆఫీస్ కాంటీన్ కి వెళ్తూ ఫోన్ లో చిరాకుగా విహారిక ఫ్రెండ్ తో ..

ఫ్రెండ్ : (చిరాకుగా ) ఇప్పుడు ప్రాజెక్ట్ మీటింగ్ అంట .. అంత సడన్ గా చెప్తే ఎలాగేనే ?

విహారిక : అదేనే .. అసలు చెబితే అర్ధమవ్వాలి కదా .. ముందా క్లయింట్ గాడిని చంపేయాలి

కాంటీన్ లో ఖాళీగా ఉన్న చైర్ లో కూర్చుంటూ వెయిటర్ కి సిగ్నల్ ఇస్తుంది తాను ఎప్పుడు తినే శాండ్విచ్ కావాలని ..

విహారిక : అసలు వన్ డే డెడ్ లైన్ ఏంటే (కోపంగా )

ఫ్రెండ్ : ఏంటోనే

విహారిక : కామెడీ గా ఉందా వాడికి .. కొంచెమైనా బుద్ది ఉండాలి కదా ..

ఫ్రెండ్ : అవునే

విహారిక : అయినా ఇలాంటి పెద్ద ప్రాజెక్ట్స్ కి కనీసం ఒక వారం ముందన్నా చెప్పాలి (అక్కడ ఆల్రెడీ టేబిల్ మీద ఉన్న శాండ్విచ్ తింటూ ) ఇప్పుడికిప్పుడు చెబితే ? i want perfect అంటా మల్లి

ఫ్రెండ్ లైన్ కట్ అవుతుంది .. ఫోన్ పెట్టేసి చూస్తే .. ఎదురుగా ఎవరో అబ్బాయి ఆల్రెడీ కూర్చుని లాప్టాప్ చూసుకుంటూ ఉంటాడు

తలెత్తి చూస్తే .. స్మార్ట్ గానే ఉన్నాడు .. వాడు కూడా తననే చూస్తున్నాడు .. తన ఫ్రస్ట్రేషన్ కి నవ్వుకుంటూ

అతన్ని చూసేక కొంచెం ఫ్రస్ట్రేషన్ తగ్గించుకుని ఫ్రెండ్ కి మల్లి కాల్ చేస్తుంది

అతను లాప్టాప్ చూసుకుంటున్నాడు

ఫ్రెండ్ : లైన్ కట్ అయ్యిందే

విహారిక : హుమ్

ఫ్రెండ్ : ఏంటే అలా మాట్లాడుతున్నావ్ .. అంతా ఓకేనా

విహారిక : హా .. నేను అదే అనుకున్నా

ఫ్రెండ్ : ఎక్కడున్నావ్ ?

విహారిక : పక్కనే .. కాంటీన్ లో

ఫ్రెండ్ : హే .. చుట్టుపక్కల ఎవరన్నా ఉన్నారా ?

విహారిక : హా .. ఆ సినిమానే

ఫ్రెండ్ : సినేమానా ? నీ ముందెవరన్న ఉన్నారా ఏంటి ?

విహారిక : హుమ్

ఫ్రెండ్ : ఇంత కష్టపడుతున్నావంటే ? కొంపదీసి అబ్బాయా ?

విహారిక : అవ్వును

ఫ్రెండ్ : చూడ్డానికెలా ఉన్నాడు .. బానే ఉన్నాడా ?

విహారిక : నువ్వు పెట్టెయ్యవే .. నేను తర్వాత చేస్తా

ఫోన్ పెట్టేసి .. జుట్టు సవరించుకుంటూ .. సిగ్గు పడుతూ లేసి వెళ్తుంటే

అబ్బాయి : excuse me .. మీ ఆర్డర్ తినకుండానే వెళ్తున్నారు

విహారిక : తిన్నా కదా

అబ్బాయి : అది మీ ఆర్డర్ కాదు

విహారిక : నా ఆర్డర్ కాదా ? అది నా ఫేవరెట్ శాండ్విచ్ .. నేనెప్పుడొచ్చినా ఆ శాండ్విచ్ నే ఆర్డర్ చేస్తా

ఇంతలో వెయిటర్ శాండ్విచ్ తో వచ్చి విహారిక ముందు ఉంచుతాడు "madam .. your order "

విహారిక : ఓహ్ .. థాంక్ యు (మెలికలు తిరుగుతూ )

ఆ అబ్బాయి వంక ఇబ్బంది గా చూస్తూ .. జుట్టు సర్దుకుంటూ .. మెలికలు తిరుగుతుంది .. షిట్ ..

విహారిక : i am sorry .. ఇది మీ శాండ్విచ్ అనుకోలేదు .. please have this sandwich

అబ్బాయి : హే ఛిల్ల్ .. its ok .. మీరెవరి మీదో బాగా కోపంగా ఉన్నట్టున్నారు .. అందుకే i didnt want to disturb you

విహారిక : అదొక వేస్ట్ గాడి గురించి లెండి

అబ్బాయి : if i may ask .. అసలేమైంది ?

విహారిక : హ్మ్ .. ఎలా చెప్పాలి .. i cant tell any information about the project .. బట్ సిట్యుయేషన్ ఏంటంటే .. i am the team lead for this project .. ప్రాసెస్ ప్రకారం ఏ క్లయింట్ అయినా మినిమమ్ టైమిస్తాడు ఏ ప్రాజెక్ట్ కైనా .. కానీ వీడేదో పెద్ద తోపు క్లయింట్ అంట .. we need to complete as soon as possible .. యాక్టుల్ గా రేపెనంట .. అందర్నీ నైట్ పని చేసి కంప్లీట్ చేయమని మా బాస్ ఆర్డర్ .. ఈ విషయం నేను మా టీం లో వాళ్ళకి చెప్పి నేను బ్యాడ్ అవ్వాలా ? నేను బ్యాడ్ అవడం పక్కనపెడితే .. వాళ్ళు మాత్రం ఎలా చేస్తారు .. i am sorry .. ఇదంతా మీకెందుకు చెబుతున్నానో నాకర్ధం కావడం లేదు .. i am confused .. stressed .. irritated .. చ్చ

అబ్బాయి : ఓ .. కూల్ డౌన్ .. చిన్నప్పుడు కాలేజ్ కి వెళ్ళారా ?

విహారిక : హా .. అదేం ప్రశ్న అండి .. కాలేజ్ కి వెళ్లకుండా ఎలా ఉంటా

అబ్బాయి : i know i know its a lame question .. ఎందుకడిగానో కూడా తెలియదు .. అది పక్కన పెడితే .. నేను ఏమి చెబుతామనుకుంటున్నానంటే .. చిన్నప్పుడు .. కాలేజ్ కి వెళ్ళినప్పుడు .. రేపు హోమ్ వర్క్ చేయకపోతే , చంపేస్తా అన్న రేంజ్ లో తిట్టిన టీచర్స్ ఉన్నారా ?

విహారిక : ఎందుకు లేరు .. బోలెడు మంది .. అసలు ఒక్కరోజు కూడా హోమ్ వర్క్ కంప్లీట్ చేయలేదు తెలుసా .. కామెడి ఏంటంటే .. టీచర్ హోమ్ వర్క్ చేసినోళ్లని హ్యాండ్ రైజ్ చేయమంటే ... కాన్ఫిడెంట్ గా రైజ్ చేసేదాన్ని (నవ్వుతూ )

అబ్బాయి : అవునా

విహారిక : కానీ ఒక రోజు ఒక టీచర్ ... నన్ను పిలిసి show me your home work అన్నారు .. అంతే .. ఏడవడం స్టార్ట్ చేశా .. దెబ్బకి వదిలేసింది

అబ్బాయి : అమ్మాయలకి చాల లక్కీ .. మీరెడిస్తే వదిలేస్తారు .. అదే మమ్మల్నయితే .. ఏడ్చే దాక కొట్టేది మా మేడం

విహారిక : (నవ్వుతూ) .. అయినా సడెన్ గా ఇవన్నీ ఎందుకు గుర్తుకు తెచ్చారు

అబ్బాయి : సారీ .. ఎమన్నా .. రాంగ్ గా ఫీల్ అయ్యారా ?

విహారిక : నో నో .. మీరిదంతా గుర్తుకు చేయడం వల్ల కాలేజ్ లో చేసిన అల్లరి పనులు గుర్తుకొస్తున్నాయి

అబ్బాయి : సో ..ఈ టాపిక్స్ తీయడానికి .. రెండు కారణాలు .. ఒకటి మిమ్మల్ని కొంచెం డైవర్ట్ చేద్దామని .. thats done .. రెండోది .. ఈ టాపిక్స్ అన్నిటికి ఆ ఏజ్ లో చాల భయపడే వాళ్ళం . ఇంటర్ లో ఈ వీకెండ్ లో ఈ ఎక్సమ్ అయితే చాలు , లైఫ్ లో ఇంకేం అక్కర్లేదు అని అనుకునే వాళ్ళం .. ఇప్పుడవన్నీ ఆలోచిస్తే .. its just a memory .. brings smile on our face .. నాకెందుకో మీరు అప్పుడు ఆ problems ని ఎలా చూసేవాళ్ళో .. ఇప్పుడీ ప్రాబ్లెమ్ ని అలా చూస్తున్నారు

విహారిక : అలా అని చెప్పి .. ప్రాజెక్ట్ లో సీరియస్ నెస్ లేకుండా ఉండలేం కదా

అబ్బాయి :ofcourse stay serious .. అలా అని dont get stressed out .. మీరు నిజంగా సీరియస్ గా ఉంటె చిన్నప్పుడు హోమ్ వర్క్ చేయకుండా ఎలా మేనేజ్ చేసారో , అలాగే you will figure out something .. అంతేగాని ఆలోచిస్తూ కూర్చుంటే .. స్ట్రెస్ తప్ప ఏముండదు .. dont over think , calm down , give 100%, thats it

విహారిక ఆలోచనలో పడుతుంది .. ఒక నిమషం అయ్యేక దాని మొఖంలో రిలీఫ్

విహారిక : ( నవ్వుతు ) థాంక్స్ అండి .. it really helped me a lot

అబ్బాయి : ఇంతకీ .. మిమ్మల్ని అంతగా ఫ్రాస్ట్రేట్ చేసిన కంపెనీ పేరేంటి

విహారిక : సైబర్ సోలుషన్స్

అబ్బాయి :ఓహ్ ఓకే .. (లాప్టాప్ లో దూరిపోతాడు మల్లి )

విహారిక : once again thank you so much

అబ్బాయి : థాంక్స్ ఓకే .. మరి నా ట్రీట్ ?

విహారిక : have my sandwich .. take it

అబ్బాయి : నా శాండ్విచ్ ని నన్నడక్కుండా తినేసి .. నేను హెల్ప్ చేసినందుకు ట్రీట్ అడిగితే , నాకివ్వాల్సిన శాండ్విచ్ నాకే ఇస్తూ ఇదే ట్రీట్ అంటారా ?

విహారిక : అయ్యో .. అదేమీ కాదండి .. సారీ

అబ్బాయి : జస్ట్ కిడ్డింగ్

ఇంతలో ఫోన్ మొగుద్ది

ఓ సీతా వదలనిక తోడౌతా
రోజంతా వెలుగులిడు నీడౌతా

దారై నడిపేనే చేతి గీత
చేయి విడువక సాగుతా

విహారిక ఫోన్ లేపితే .. అవతల నుంచి .. "సర్ .. మీటింగ్ కి అందరు రెడీ .. మీరొస్తున్నారా ?"

విహారిక : హలో .. ఎవరికీ చేయబోయి ఎవరికీ చేసారు ?

అబ్బాయి : excuse me .. అది నా ఫోన్

విహారిక : కాదు .. ఇది నా మొబైల్ ..

ఫోన్ చూసుకుని తన తప్పు తెలుసుని .. ఫోన్ ఆ అబ్బాయికిస్తది సారీ చెబుతూ

అబ్బాయి : హా చెప్పండి

(సర్ .. మీటింగ్ స్టార్ట్ అయ్యింది .. వస్తున్నారా ?)

అబ్బాయి : నేనిప్పుడే ఈ మీటింగ్ క్యాన్సిల్ చేశా .. ప్రాజెక్ట్ డెడ్ లైన్ కూడా పొడిగిస్తున్నా .. నేను డైరెక్ట్ గా టీం లీడ్ తో మాట్లాడతా .. ఓకే

ఫోన్ పెట్టేసి.. విహారికతో ఆ అబ్బాయి "మీది కూడా ఇదే రింగ్ టోనా .. నాకు చాల ఇష్టం ఈ పాట

విహారిక ఆశ్చర్యపోతూ "నా క్లయింట్ మీరేనా ?"

అబ్బాయి : ( బిగ్గరగా నవ్వుతూ ) i am sorry to laugh .. ఆ రోజు మీరు మీ టీచర్ కి ఏమి ఎక్స్ప్రెషన్ ఇచ్చారో సేమ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు ఇప్పుడు కూడా

విహారిక : ఓకే .. మీరేనా .. నా క్లయింట్

అబ్బాయి : అవును

విహారిక : సారీ సర్ .. i didnt mean any thing

అబ్బాయి : its ok .. ఒకవేళ నేను అదే చేసుంటే i deserve it

విహారిక : అదే చేసుంటే అంటే ?

అబ్బాయి : అసలు నేను ఈ ప్రాజెక్ట్ కి ఇచ్చిన టైం ఇది కాదు .. రెండు వారాల ముందే చెప్పా .. i dont know why .. but your manager has not informed you .. మీకు వన్ డే నే టైముందని చెప్పాడు .. ఆ విషయం నాకిప్పుడే తెలిసింది .. అందుకే నేను చేయగలిగింది నేను చేశా ..

విహారిక : ఓహ్ ఓకే .. once again so sorry sir

అబ్బాయి : its ok .. కొన్ని రోజులయ్యాక ఇది గుర్తొస్తే నవ్వుకోడానికి ఉంటుంది కదా .. also dont call me sir .. you can call me praveen

విహారిక : (సిగ్గుపడుతూ ) ప్రవీణ్ .. (మెలికలు తిరిగి పోతుంది )

రెండు నిమషాల సైలెన్స్ ..

వాడు లేసి వెళ్లిపోతుంటే

విహారిక : excuse me .. if you dont mind .. మీ నంబర్ ఇస్తారా ?

ప్రవీణ్ ఇచ్చిన లుక్ కి విహారిక "అదే సర్ .. ప్రాజెక్ట్ గురించి మాట్లాడేదానికే "

అబ్బాయి : సరే తీసుకోండి .. 99955xxxxx .. అది మీ క్లయింట్ నెంబర్

విహారిక : హా ?

అబ్బాయి : నా పర్సనల్ నెంబర్ కావాలంటే ముందు హోమ్ వర్క్ కంప్లీట్ చేయండి అప్పుడిస్తా

విహారిక : హహహ .. అలాగే .. మా క్లయింట్ ని అడిగానని చెప్పండి

ప్రవీణ్ నవ్వుతూ .. ఓకే .. అని అంటూ వెళ్ళిపోతాడు

వాణ్ణే చూస్తూ .. ఫోన్ లేపితే .. ఫ్రెండ్ "ఓయ్ .. ఎక్కడున్నావె .. మీటింగ్ కి టైం అయ్యింది.. రా "

"meeting is cancelled"

"నీకెలా తెలుసే ?"

"సర్ చెప్పారు "

"సారా ? "

సైలెన్స్

"హలో "
"హలొ "

ఆ రోజు ఆఫీస్ లో జరిగిన ఆ సంఘటనని విహారిక మొగుడికి చెబుతున్నా .. ఆనంద్ లో చలనం లేదు . ముక్తసరిగా ఉం కొడతాడు . పెళ్ళయ్యి దగ్గర దగ్గర నెల అవుతుంది , కొత్త జంట అని పేరుకే కానీ , మొగుడు పెళ్ళాల్లో కళ లేదు . ఆనంద్ ఇంకా అనన్య జ్ఞాపకాల్లోంచి బయటకి రాలేక పోతున్నాడు . అదే ధ్యాస .. అదే లోకం .. అక్కడికి విహారిక చాల జాగ్రత్తలు తీసుకుంది . బెడ్ రూమ్ లో ఉండే అక్క చెల్లెళ్ళ ఫోటో తీసేసింది . అనన్య తో ఆనంద్ ముందు మాట్లాడడం తగ్గించి , ఎక్కువగా చాటింగ్ చేస్తుంటది . విహారిక కి అనన్య విషయంలో దిగులు ఉన్నా , మెల్ల మెల్లగా తేరుకుంటుంది . అందుకే ఆఫీస్ లో కూడా సరదాగా ఉండడానికే ట్రై చేస్తుంది

ఆనంద్ విషయం మాత్రం దారుణం .. వర్జిన్ రెడ్డి లాంటోడు అర్జున్ రెడ్డి అయ్యాడు . పక్క ఇంట్లో ఉన్న పూనమ్ కానీ , పక్కలో ఉండే విహారిక కానీ ఆనంద్ లో మార్పు తేలేక పోతారు . తమ్ముడు కుమార్ కి పద్మ నుంచి విషయాలు తెలుస్తాయి అనన్య గురించి.. ఎందుకంటే అనన్య ఉండేది పద్మ ఫ్లాట్ లోనే కదా . అనన్య కి జాబ్ వచ్చినా , ఒంటరిగా ఉంటె బావ గుర్తొస్తుంటాడు .. అందుకే పద్మ దగ్గరే ఉంటుంది . హనీ మూన్ కి వెళ్ళేటప్పుడు అమ్మకి చెప్పిన అబద్దం నిజమయింది . జాబ్ కోసం బెంగుళూరు వెళ్తున్నా అని .. అదే నిజమైంది

విహారిక మొగుణ్ణి గోకాలని ఉంటున్నా , కావాలని ఆపుకుంటుంది . మొగుడికి ఎప్పుడు మూడొస్తే అప్పుడే . కొత్త జంట .. నిద్రే ఉండదు అని అంటారు .. కానీ రియాలిటీ వేరు . రోజు మర్చి రోజు కలిస్తే గ్రేట్ .. అంతకి ముందు ఆఫీస్ లో ఫ్రెండ్స్ తో బాగా సరదాగా ఉండేవాడు .. HR పాపా మీద జోకులేసేవాడు .. ఇప్పుడవన్నీ బంద్ . ఎదురింటి పూనమ్ తో కూడా పొడి పొడి గా మాట్లాడుతున్నాడు . ఇలా ఎంతకాలం ? ఏదొక వ్యాపకం ఉండాలి . ఆలోచిస్తాది .. ఒక ఐడియా ఉంది , బానే పని అవొచ్చు

పూనమ్ కి మెసేజ్ పెడుతుంది

"హాయ్ పూనమ్ "

"హయ్ అక్కా "

"కాలేజ్ విశేషాలు ఏంటి ?"

"ప్రాజెక్ట్ వర్క్ నడుస్తుంది .. అయినా ఈ టైం లో ఇంకా మేలుకునే ఉన్నావా ?"

"టైం 10 కూడా కాలేదు కదా పూనమ్ "

"నిజమే అక్కా .. అయినా ఈ టైం లో బిజి గా ఉంటారు కదా ?"

"ఎవరు ?"

"కొత్తగా పెళ్లయిన జంట "

ఒక నిమషం సైలెన్స్

"సారీ అక్క .. మీ పర్సనల్ విషయం గురించి మాట్లాడకూడదు "

"పూనమ్ .. నువ్వేమన్న పరాయిదానివా .. నా చెల్లెలాంటిదానివి "

"అవునక్క .. అనన్య బానే ఉందా ? ఈ మధ్య మెసేజ్ లేదు "

"అది జాబ్ ట్రయల్స్ లో బిజి "

"గుడ్ .. "

"నువ్వు కూడా జాబ్ కి ట్రై చేయొచ్చుగా .. మా ఆఫీస్ లో ఇంటర్న్ పొజిషన్స్ ఉన్నాయి .. రెస్యూమే పంపు "

"లేదక్కా .. ఇంటర్న్ గా చేయడం ఇష్టం లేదు . డిగ్రీ అయ్యాక ట్రై చేస్తా "

"సరే పూనమ్ .. కానీ దానిక్కూడా స్కిల్స్ ఉండాలి కదా "

"అందుకే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవుదామనుకుంటున్నా "

"ఐడియా మంచిదే పూనమ్ .. కాకపోతే సరైన ఇన్స్టిట్యూట్ లు తక్కువ .. ఒక పని చేద్దాం "

"చెప్పాక్కా .. "

"ఆనంద్ కి జావా బాగా వచ్చు .. ఆనంద్ రోజు ఒక గంట నీకు ట్యూషన్ లా చెప్పితే సరి పోతుంది "

"హ్మ్మ్ .. ఐడియా బానే ఉంది .. కుమార్ కూడా జాయిన్ అవుదామనుకుంటున్నాడు .. వాడికి పైథాన్ లో డౌట్లు ఉన్నాయ్ "

"పైథాన్ నేను కవర్ చేస్తా .. ఆనంద్ జావా కవర్ చేస్తాడు "

"ఓకే గ్రేట్ అక్కా .. థాంక్స్ అక్కా "

"పర్లేదు పూనమ్ .. ఎటు మేము ఖాళీనే కదా .. ఒక గంట మీకోసం స్పెండ్ చేయడం ఇబ్బంది కాదు "

"సారీ అక్కా .. మీ ప్రైవేట్ టైం ని వాడుతున్నాం .. అందులో కొత్తగా పెళ్లయిన జంట "

"పూనమ్ .. కొత్తగా పెళ్లయిన జంట లా కనిపిస్తున్నామా చెప్పు ?"

"నిజమే అక్క .. నేనే అడుగుతామనుకుంటున్నా .. ఆనంద్ ఇంతకు ముందులా యాక్టీవ్ గా లేడు "

"నీకు తెలిసిందే కదా పూనమ్ .. ఆఫీస్ లో కూడా అందరు అదే అడుగుతున్నారు .. కొంచెం మైండ్ డైవర్ట్ అవ్వాలి "

"హుమ్ .. చూద్దాం .. మరి ఆనంద్ కి ఓకేనా ? ట్యూషన్ చెప్పడం ?"

"నేను ఒప్పిస్తా .. రేపటినుంచే జాయిన్ అవ్వండి .. 7-8 PM "

"సరే అక్క .. గుడ్ నైట్ "

"గుడ్ నైట్ పూనమ్ "

మార్నింగ్ ట్యూషన్ సంగతి ఆనంద్ కి చెబితే వాడు ఓకే అంటాడు . ఆఫీస్ లో కూడా పెద్దగా వర్క్ ఉండడం లేదు . త్వరగానే వచ్చేస్తున్నారు ఇంటికి .

అనుకున్నట్టే 7 కి డోర్ బెల్ మోగింది . విహారిక ఓపెన్ చేస్తది . పూనమ్ , కుమార్ లోపలకొస్తారు . ఆనంద్ తో ఇంతకుముందులా ఫ్రీ గా ఉండలేకపోతున్నారు . అందుకే మాటలు తక్కువ .. "సరే .. ఇది జావా రూమ్, అది పైథాన్ రూమ్ " , అని విహారిక అనేసరికి నవ్వుతారు అందరు .. ఆనంద్ తప్ప ..

జీన్స్ , స్లీవ్ లెస్ టాప్ , దాని పైన ఇంకో లాంగ్ స్లీవ్ షర్ట్ .. పూనమ్ ఎప్పటిలా కత్తిలా ఉంది .. కాకపోతే ఎప్పుడు ఆ మూడో పీస్ లాంగ్ స్లీవ్స్ వేసుకునేది కాదు .. కాకపోతే ఈ మధ్య ఆనంద్ పడే పదే అనన్య లోకంలో ఉండేసరికి పూనమ్ కూడా కొంచెం రేసేర్వేడ్ గా ఉంటుంది . బెడ్ మీద ఆనంద్ .. చైర్ లో పూనమ్ .. ఒక పది నిముషాలు ఊప్స్ కాన్సెప్ట్స్ చెప్పి .. excersizes ఇచ్చి .. ఫోన్ లో మునిగిపోతాడు . ఆనంద్ చెప్పే విధానం నచ్చింది పూనమ్ కి . సింపుల్ కాన్సెప్ట్ నే examples తో బాగా చెబుతాడు .

పూనమ్ వర్క్ లో మునిగిపోయేక .. కొంచెం సేపటికి .. "అయిపోయిందా అనన్యా ?" , అని అంటాడు ఆనంద్ .. పూనమ్ తలెత్తి ఆనంద్ వైపు చూస్తే .. వాడికి అర్ధమయినట్టు లేదు తనని పూనమ్ అనబోయి అనన్య అన్న సంగతి .. "లేదు ఆనంద్ .. ఇంకో ఐదు నిముషాలు " ..

మల్లి వర్క్ లో మునిగిపోయింది పూనమ్ ..

పక్క రూమ్ లో సిట్యుయేషన్ డిఫరెంట్ . విహారిక చాల యాక్టీవ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కుమార్ కి .. నిజానికి విహారిక ఆఫీస్ లో తన బాస్ .. ఆల్రెడీ తెలుసు తాను ఎంత ఓపిగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుందో .. పైథాన్ చాల ఈజీ .. చాల కష్టం .. చెప్పేవాళ్ళని బట్టి ఉంటది . బెడ్ మీద కూర్చుని చెబుతున్న విహారిక .. కుమార్ చైర్ లో .. పైథాన్ సగం .. సోది ఇంకో సగం .. ఆఫీస్ లో సోది ని ఇంట్లో కంటిన్యూ చేస్తున్నారు . ఎటు ఆనంద్ ఏమి మాట్లాడం లేదు కదా అందుకే విహారిక కి కుమార్ కి ట్యూషన్ చెప్పడం బాగా నచ్చింది .

పూనమ్ ని అనన్య అని సంబోధించడం రెండో సారి .. ఈ సారి నోటీసు చేసి సారీ చెబుతాడు ఆనంద్ . ట్యూషన్ లో సీరియస్ నెస్ ..

రెండో రోజు కూడా ఇలానే సాగుద్ది . కాకపోతే అనన్య అని పిలవలేదు . మధ్య మధ్య పూనమ్ టాపిక్ డైవర్ట్ చేసినా , ఆనంద్ జావా వరకే పరిమితవుతాడు . పూనమ్ కి ఎన్నో విషయాలు చెప్పాలని ఉంది .. ముఖ్యంగా తన డాన్స్ పెర్ఫార్మన్స్ గురించి . మమ్మీ ని ఒప్పించి ప్రాక్టీస్ చేస్తున్న విషయం . ఆనంద్ ప్రోత్సాహంతోనే ఇదంతా జరిగిందని చెప్పాలని ఉన్నా ఆ ఛాన్స్ రావడం లేదు .. రెండు వారాల్లో లైవ్ పెర్ఫార్మన్స్ ఉంది . ఆ విషయమే చెబుతామని ఎన్నో సార్లు ట్రై చేసినా కుదర్లేదు ..

మూడో రోజు .. నాలుగో రోజు .. ట్యూషన్ సాఫి గా సాగుతుంది . ఒక రోజు ట్యూషన్ లో అనుకోకుండా చేయి తగులుద్ది .. సారీ చెబుతాడు ఆనంద్ .. పూనమ్ కి చాల కోపమొస్తుంది .. ముట్టుకున్నందుకే సారీ నా ? గట్టిగ చెప్పాలని ఉన్నా ఆనంద్ పరిస్థితి చూసి గమ్మునుంటుంది

నెక్స్ట్ డే .. 7 కల్లా పూనమ్ డోర్ కొడుతుంది .. డోర్ దగ్గరే ఆపి .. "పూనమ్ .. మెసేజ్ చూసుకోలేదా ? ఈ రోజు ట్యూషన్ కాన్సల్ .. విహారిక ఇంకా ఆఫీస్ లోనే ఉంది . క్లయింట్ మీటింగ్ " , అని ఆనంద్ అనేసరికి .. పూనమ్ అప్పుడు చూసుకుంటది మెసేజ్ .. "ఓహ్ .. సారీ .. చూసుకోలేదు ఆనంద్ .. can i come inside ?" , ఇలా పర్మిషన్ తీసుకుని లోపలకి రావాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు .. వాడు ఆలోచించి లోపలకు రమ్మంటాడు ..

డోర్ అలానే తెరిసి ఉంటాడు .. పూనమ్ కి అవమానం .. అంటే .. పెళ్ళాం లేకపోతె ఎవరు లోపలకి రాకూడదా ? అందులో తాను లోపల ఉన్నా అనుమానమేనా ?

సోఫా లో కూర్చుంటుంది . వాడు చైర్ లో .. ఆక్వర్డ్ .. ఏమి మాట్లాడాలో తెలుసు .. ఎలా మాట్లాడాలో తెలుసు .. కాకపోతే వినేవాళ్ళకి ఇంటరెస్ట్ లేకపోతే మనం ఏమి చెప్పినా సోది అవుతుంది . అలాగని చెప్పక పోతే ఇది ఇలానే కొనసాగుతుంది ..

"ఆనంద్ .. ఇలా చెబుతున్నానని ఏమి అనుకోవద్దు .. ఒకరి మీద అమితమైన ప్రేమ ఉండొచ్చు .. అలాగని నిన్ను ప్రేమించే నీ వాళ్ళని దూరం చేసుకోకు . ఏ తప్పూ చేయని అక్కకి ఎందుకీ శిక్షా ? సారీ .. హద్దులు మీరు మాట్లాడితే "

మౌనం .. ఆనంద్ నుంచి నో రెస్పాన్స్ .. పూనమ్ కూడా ఆనంద్ నుంచి రెస్పాన్స్ ఇన్ ఎక్ష్పెక్త్ చేయలేదు .. కనీసం ఆలోచిస్తే చాలు ..

ఇంకా ఎన్నో చెప్పాలని ఉన్నా చెప్పలేకపోతుంది ..

ఇంతలోనే విహారిక వస్తుంది .. బార్లా తెరిసిన డోర్ .. లోపలికొస్తే పూనమ్ .. "డోర్ వేయొచ్చుగా ఆనంద్ .. దోమలు వస్తాయని తెలుసుగా " , అని విహారిక అంటే .. ఆనంద్ మౌనం

పూనమ్ లేసి నిలబడుతూ "అక్కా .. తలుపులు తెరిస్తే వచ్చే దోమలు ఆల్ అవుట్ పెడితే పోతాయి .. కానీ అనుమానం ఎప్పుడైతే మన గుండె తలుపుల్ని ఛేదించి లోపలికొస్తుందో .. అదే ద్వారం నుండి ప్రేమ , నమ్మకం బయటకి వెళ్తాయి .. బంధాలు బీటలు వారతాయి " , అని చెప్పేసి వెళ్ళిపోద్ది .

అది అలా ఎందుకన్నదో ఊహించగలదు . ఆనంద్ ప్రవర్తన రోజు రోజుకి ఇబ్బందిగా మారిపోతుంది . వాడికి అనన్య మీద ప్రేమ ఉండొచ్చు .. కానీ పాపం పూనమ్ ఎం చేసింది ? ట్యూషన్ లో ముభావం .. ఇప్పుడు ఇలా డోర్ తెరిసి పెట్టి దాన్ని అవమానించాడు . పెళ్ళాం లేకపోతే ఇంట్లోకి ఏ ఆడపిల్లా రాకూడదా ? వచ్చినా తలుపు వేయాల్సిందేనా ? అయినా పూనమ్ ని కూడా పరాయి దాన్లా చూడడం తప్పు కదా .
Next page: Chapter 42
Previous page: Chapter 40