Chapter 42


సమయం రాత్రి 8 అవుతుంది.. ఊరి బయట .. నో నో .. అది ఒకప్పుడు.. ఇప్పుడిది బిజి గా ఉండే IT హబ్ .. పెద్ద బిల్డింగ్ ముందు .. రోడ్ పక్కన లాంగ్ స్కర్ట్ , లాంగ్ స్లీవ్ షర్ట్ , మెడలో స్కార్ఫ్ తో ఒక అందమైన అమ్మాయి క్యాబ్ కోసం వెయిటింగ్ .. టైం చూసుకుంటుంది .. బుక్ చేసి 10 నిమషాలు దాటినా , ఇంకా రావడం లేదు .. ఆప్ లో చూపిస్తోంది దగ్గరే ఉన్నట్టు .. కానీ రావడం లేదు. ముందుకు పడుతున్న జుట్టుని వెనక్కి తోసుకుంటూ , మాటి మాటికీ ఆప్ చూసుకుంటున్న ఆ అమ్మాయి .. అసహనంగా .. ఇంతలో అటుగా వెళ్తున్న ఒక కార్ ఆమెను దాటుకుంటూ ముందుకెళ్లి .. స్లో అయ్యి .. వెనక్కి వచ్చి ఆగుద్ది

అందులోంచి దిగుతాడు దగ్గర్లో పనిచేసే కుర్రోడు .. ఆమెను చూస్తూ "hi , are you waiting for someone ?" , అని అడిగితే .. ఆ అమ్మాయి తలెత్తి అతనిని చూసి .. "no i am waiting for cab " , అని అంటూ , మల్లి ఫోన్ చూసుకుంటుంది ..

"ఈ ఏరియా లో క్యాబ్ లు దొరకడం కష్టం కదా "

"actually బుక్ అయ్యే లానే ఉంది "

"if you want i can drop you "

"పర్లేదు సర్ .. i can manage "

"are you sure ?"

"yeah .. sure "

"ఇక్కడంత సేఫ్ కాదు .. కనీసం క్యాబ్ వచ్చేంత వరకు i will wait "

"హ్మ్మ్ .. ఓకే "

"ఓకే నో ప్రాబ్లెమ్ "

వాడు కార్ కి ఆనుకుని వెయిట్ చేస్తుంటాడు .. అదేమో ఆప్ చూసుకుంటుంది .. ఒకటి రెండు సార్లు ఆమె వైపు చూస్తాడు .. తనని చూస్తుందేమో అని .. లేదు .. సరే పీకేస్తుంది నాలిక .. సిగెరెట్ వెలిగిద్దామని ప్యాకెట్ తీస్తాడు .. ఆమె తననే చూస్తుంది సరికి .. సిగెరెట్ ప్యాకెట్ జేబు లో పెట్టుకుంటాడు ..

ఇంకో ఐదు నిముషాలు .. అక్వర్డ్ సైలెన్స్ .. క్యాబ్ రాలేదు

"i forgot to tell you .. నీ ప్రెసెంటేషన్ చాలా బాగుంది .. ఇంకొంచెం కష్టపడితే కోర్స్ పూర్తవుతుంది "

"ఓహ్ .. థాంక్ యు సర్ "

"project is going fine right ? when are you giving the party ?"

"yeah .. we will definitely plan one day "

"ఇంకా ఎంత సేపు చూపిస్తుంది ఆప్ ?"

"పక్కనే ఉన్నట్టు చూపిస్తుంది .. but he is not coming .. పర్లేదు సర్ .. మీరెళ్ళండి "

"నో నో .. నాకు వెయిట్ చేయడానికి ప్రాబ్లెమ్ కాదు .. మీకు లేట్ అవుతుందేమో అని అడిగా.. మీరుండేది గచ్చిబోలి కదా ? i can drop you .. you can come only if you dont have any problem "

"అలా ఎం లేదు సర్ .. పర్లేదు '

"sure ? please get in "

కార్ లోకి ఎక్కుద్ది ఆమె .. వాడు AC సెట్ చేస్తాడు ..

"థాంక్స్ అండి .. మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేస్తున్నా "

"హే .. ఇబ్బందేమీ లేదు .. ఛిల్ల్.. ప్లీజ్ ఫీల్ comfortable .. lets go ? "

"హ .. వెళ్దాం "

ఇద్దరి మధ్య మౌనం .. ఇళయరాజా సాంగ్స్ పెడతాడు ..

మాట రాని మౌనమిది .. మౌనవీణ గానమిది

"నా కాలేజ్ ఫ్రెండ్ వచ్చింది పూణే నుంచి .. అది ఉండేది సికింద్రాబాద్ లో .. అంత దూరం వెళ్లి కలవాలంటే కష్టం .. అందుకే దాని ఆఫీస్ లో కలిచేదానికి వచ్చా .. మీరేంటి ఇక్కడ .. మీ ఆఫీస్ కూడా దగ్గర్లొనేనా "

"ఓహ్ .. ఓకే .. ముందు మీరు మీరు అని పిలవడం ఆపేయ్ .. నువ్వు అనొచ్చు .. feel comfortable "

"హ్మ్మ్ .. అలాగే "

అది ఓపెన్ అప్ అయ్యి వాడితో కబుర్లలో పడుద్ది .. వాడు కూడా ఈ మధ్య ఇంత ఓపెన్ గా మాట్లాడడం .. ఇదే

ఇంతలో ఫోన్ .. వాడికి .. డాష్బోర్డ్ లో స్పీకర్

"ఏంట్రా .. ఎక్కడున్నావ్ .. ఆఫీస్ నుంచి ఇంటికెళ్ళావా లేక ఫ్రెండ్స్ అంటూ తిరుగుతున్నావా ? ఫ్రిజ్ లో బిర్యానీ ఉంది .. వేడి సెహెసుకుని తినెయ్ .. నేను రావడం లేట్ అవుతుంది .. బై డార్లింగ్ .. ప్చ్ ప్చ్ .. ఉమ్మ్ "

తుఫాన్ వచ్చినట్టు .. "ఏంటండీ అంత వియోలెంట్ గా ఉంది .. మీ ఆవిడా ?"

"తెలుస్తుంది కదా .. ఒక పక్క తిడుతూనే .. చివర్లో ముద్దులు .. అదేమో ఫ్రెండ్స్ తో సినిమాకి వెళ్లొచ్చు , నేను మాత్రం ఫ్రెండ్స్ తో తిరగగూడదు .. ఈ పెళ్లి అనే కాన్సెప్ట్ ని ఎవడు కనిపెట్టాడో .. వాణ్ణి చంపేయాలి కదా "

"అయ్యో .. అలా అంటారేంటండీ .. పెళ్లి అనేదే లేకపోతే .. మీ అబ్బాయలు .. ఒక దాంతో ఫ్లిర్టింగ్ . ఇంకో దాంతో డేటింగ్ .. ఇంకో దాంతో లవ్ .. ఫైనల్గా పెళ్లి ఇంకో దాంతో .. అందుకే పెళ్లి అనే బ్రేక్ ని కనిపెట్టారు "

"హ్మ్మ్ .. నువ్వు బానే పులిహోర కలుపుతున్నావ్ .. "

"హ్మ్మ్ .. మీ అంత కాదులెండి .. ఇల్లొచ్చింది .. ఆపండి "

కార్ ఆపితే .. అది దిగి నాలుగడులు వేసి .. ఆగి ఫోన్ లో ఎవరితోనే మాట్లాడుతూ .. అక్కడే నిలబడద్ది ..

వాడు కార్ దిగి "ఏంటండీ .. ఎనీ ప్రాబ్లెమ్ ?" , అని అంటే .. అది ఫోన్ పెట్టేస్తూ "అమ్మ గుడికెళ్లింది .. ఇంటి కీస్ లేవు " , అని అంటే ..

"తనొచ్చే వరకు i can give you company if you want "

"ఒద్దబ్బా .. ఇప్పటికే నీకు చాల లేట్ అయ్యింది "

"ఛిల్ల్ .. నాకు లేటేమి లేదు .. please get in "

ఓకే .. అంటూ కార్ ఎక్కుద్ది ..

జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన.. ఓ మైనా మైనా
కిలకిల నగవుల వలపులు చిలికిన.. ఓ మైనా మైనా

"ఓహ్ సారీ " అంటూ సాంగ్ మార్చబోతుంటే .. అది "its ok .. నేను కూడా ఇళయరాజా ఫ్యాన్ నే "

"అవును .. నువ్వేం తినలేదు కదా .. we will go to a restarent ?"

"మల్లి నీకెందుకు ఇబ్బంది "

"ఏయ్ .. అంత ఆలోచించవద్దు .. లెట్స్ గో "

కార్ స్టార్ట్ చేయబోతుంటే .. "కార్ లో వొద్దులే .. పక్కనే మంచి ప్లేస్ ఉంది .. నడుసు కుంటూ వెళ్దాం " , అని అనేసరికి .. వాడు ఓకే అంటాడు .. నడుసుకుంటూ వెళ్తారు .. పక్క వీధిలో ఉన్న దోస బండి .. వాడు ఇబ్బంది పడుతూ , చిన్న స్టూల్ మీద కూర్చుంటే .. అది "సారీ .. బాగుందా ?" , అని అంటే .. వాడు దోస తింటూ yeah అని అంటాడు ..

"నువ్విలాంటి ప్లేసులో తినవు కదా "

"ఎందుకు తినను ? నేనెక్కడినుంచో ఊడిపడలేదు కదా .. "

"అబ్బా .. అలా కాదు .. జనరల్ గా హైజీన్ అని అవాయిడ్ చేస్తారు కదా "

"కరెక్ట్ .. కాకపోతే .. ఆలా అనుకుంటే ఎక్కడ తినలేం .. నిజానికి ఇలాంటి ప్లేస్ లే నాకిష్టం .. మన ముందే వంట చేస్తారు కదా .. మెట్రో స్టేషన్స్ దగ్గర చిన్న చిన్న బళ్ళు వేసే పుల్లట్లు వేస్తారు కదా .. అవంటే నాకు ప్రాణం "

"రియల్లీ ? exactly .. నాక్కూడా భలే ఇష్టం "

తినేసి నడుసుకుంటూ వస్తుంటారు

"మీ అమ్మ ఫోన్ చేయలేదా ఇంకా ?"

"లేదు .. ఒక గేమ్ ఆడదామా ?"

"గేమా .. ఎం గేమ్ ?"

"నేనొక వర్డ్ చెబుతా .. దానికి రిలేటెడ్ గా నువ్వో వర్డ్ చెప్పాలి . ఓకే?"

"స్టడీస్ ?"

"బోరింగ్ "

"ఫుడ్ ?"

"పర్ఫెక్షన్ "

"మ్యూజిక్ ?"

"ఇళయరాజా "

"నైస్ "

"కదా .. "

"హ్యాపీనెస్ ?"

"ఈ క్షణం "

ఇంతలో దాని ఫోన్ మొగుద్ది

"బాధ ?"

"మా అమ్మ "

ఫోన్ లో తిడుతుంది అమ్మ పెద్దగా .. "ఒసేయ్ ఎక్కడున్నావే ? ఎంత సేపటినుంచి కాల్ చేస్తున్నా .. ఫోన్ లిఫ్ట్ చేయవు .. "

"వాట్ ? అమ్మ ఇంట్లోనే ఉందా ? గుడికెళ్లిందని చెప్పావ్ .. అంతా అబద్దమా ?"

ఆ అమ్మాయి మెలికలు తిరుగుతూ సారీ ఫేస్ పెడుద్ది ..

"ఇంతకీ నీ ప్రాజెక్ట్ ఎలా నడుస్తుంది ? మీ సర్ కి పార్టీ ఎప్పుడిస్తున్నావ్ ?"

"హ్మ్మ్ .. ఆయనొక ద్రోహి .. అయినా ఆయనకీ పార్టీ ఇవ్వాలంటే బ్యాంకు కి కన్నాలేయలేమో అనుకున్నా .. కానీ ఒక ప్లేట్ పుల్లట్లిస్తే సరిపోతుందని ఇప్పుడే తెలిసింది .. నవ్వుకుంటూ .. ముందుకెళ్తుంటే .. "its ok .. you can smoke " , అని అంటది ఆమె

ఉండేది పక్క స్ట్రీట్ అయినా పావు గంట నడుస్తారు .. స్లో గా .. కబుర్లు చెప్పుకుంటూ ..

ఇళ్లోస్తుంది .. ఆమెది .. వాడిది .. ఒకే లిఫ్ట్ లో .. ఒకే ఫ్లోర్ .. ఎదురెదురు ఫ్లాట్ లు .. గుడ్ నైట్ చెప్పుకుని లోపలకెళ్తారు .. ఆనంద్ .. పూనమ్ ..

స్నానం చేస్తూ .. పూనమ్ ఆలోచనల్లో పడుతుంది .. చాల హ్యాపీ గా ఉన్నా .. చాల రోజులతర్వాత ఆనంద్ లో మార్పు వచ్చింది .. మొదట్లో కోపమొచ్చింది .. ఇంట్లో అక్కలేదని డోర్ తెరిసి పెట్టె అవమానించాడు .. ఇందాక కూడా .. నన్ను అక్కడ చూసి , పరాయిదానిలా .. నీకిబ్బందిలేకుంటేనే చెప్పు డ్రాప్ చేస్తా అని అన్నాడు కానీ .. పద ఎక్కు కార్ అని అనలేదు .. ఇంటి కొచ్చాక .. అమ్మ గుడికెళ్లిందని అబద్దం చెబితే .. పర్లేదు .. మా ఇంట్లో ఉందువు రా అని పిలవలేదు .. అక్క సినిమా కి వెళ్లిందని .. అది ఇంట్లో లేదు కాబట్టి తనని ఇంట్లోకి ఆహ్వానించలేదు ..

అంత కోపమొచ్చినా .. నాతో సరదాగా కబుర్లు చెప్పాడు .. నాకిష్టమైన ఇళయరాజా సాంగ్స్ ప్లే చేసాడు .. ముఖ్యంగా.. నాతో పాటు రోడ్ సైడ్ బండి పుల్లట్లు తిన్నాడు .. ప్రాజెక్ట్ వర్క్ కి .. అదే .. ట్యూషన్ కి హెల్ప్ చేసినందుకు పార్టీ అడిగాడు .. ఆ మాత్రం చాలు . అనన్య జ్ఞాపకాల్లోంచి బయటికి రావాలి .. వస్తాడు ..

ఇక ఆనంద్ బెడ్ మీద పడుకుని ఆలోచనలో కి వెళ్తాడు

ఒకమ్మాయి ఒకబ్బాయి జీవితం లోకి ఎలా వస్తుందో ఊహించలేం .. ఎప్పటిదాకా ఉంటుందో, ఎలా వెళ్లిపోతుందో కూడా ఊహించలేం ..
ఇప్పటివరకు నా కళ్ళల్లో ఉన్న ఆనందం కల లా మారి కన్నీళ్లొస్తున్నాయ్ అనన్య ..

పెళ్లయ్యాక .. ఒక రోజు ..

"హ్మ్ .. వన్ హవర్ లేట్ .. నీకోసం పిచ్చిదానిలా వెయిట్ చేయాలా ?

"సారీ రా .. ట్రాఫిక్ వల్ల లేట్ అయింది "

"అబద్దం చెప్పావంటే మొఖం పగులుద్ది "

"ఎన్ని అబద్దాలు చెప్పినా .. అది మన మధ్య నిజం కోసమేగా .. పర్లేదులే "

"ఏముంది మన మధ్య ? నాక్కనిపించడం లేదే ?"

"కొంచెం ముందుకు రా .. "

"హ .. వచ్చాను.. నాకేం కనిపించడం లేదు "

"అదేంటి నాకనిపిస్తుందిగా .. నీకెందుకు కనిపించడం లేదు ?"

"ఏమో బాబు .. నాకేం కనిపించడం లేదు "

దాని కళ్ళల్లోకే చూస్తూ "ఆ దేవుడు అన్ని మాటలు మాట్లాడడానికి నోరిచ్చాడు ... నిజాన్ని చెప్పడానికి మాత్రమే కళ్ళు ఇచ్చాడు .. తెలుస్తుంది .. ఇప్పుడు నీ హార్ట్ బీట్ ని అడుగు .. నా లవ్ ఎంత నిజమో చెబుతుంది .. నీ ఒంట్లోని బ్లడ్ కూడా ఆ నిజాన్ని చెప్పడానికి ఏడుస్తున్నదనుకుంటా .. నీ కళ్ళు నిజాన్ని చూపిస్తున్నాయి "

ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొచ్చి .. బాల్కనీ లోకి వెళ్తాడు .. సిగరెట్ తో ..

జీవితాంతం కలిసుందామనుకున్న అమ్మాయి .. ఇదే మన మధ్య లాస్ట్ మీట్ అని అన్నప్పుడు .. కొట్టుకునే గుండె ఆగలేక ఏడుస్తుంది ..

"నా లైఫ్ కి సక్సెస్ కి పెద్ద గొడవయినట్టుంది .. అందుకే ఆ రెండు కలవడం లేదు "

"బావా .. నా లైఫ్ లో నా సక్సెస్ నువ్వే .. "

ఆ ఒక్క మాట తర్వాత ఇంకెప్పుడు బాధ పడకూడదు అని అనుకున్నా అనన్య .. నిజమే .. నా సక్సెస్ నువ్వే .. నా ఫెయిల్యూర్ కూడా .. ఫోన్ లో కాంటాక్ట్ డిలీట్ చేస్తూ .. కళ్ళు తుడుసుకుంటాడు ..

ఒద్దనగానే వదిలేయడానికి వస్తువు కాదు .. ప్రేమ .. వొద్దన్నా వెంటొస్తుంది .. కౌగిలిని గుర్తు చేస్తుంది .

జీవితం మొత్తం నా కళ్ళముందే ఉంటావనుకున్నా .. కానీ పర్లేదు .. నా కళ్ళల్లోనే దాచుకుంటా ..

కదిలించే ప్రతి కధ కన్నీళ్ళతోనే ప్రారంభవుతుంది ..

కరిగిపోయే కాలం తో పాటు విరిగిపోయే మనసులు ఎంత కలిపి ఉంచాలని ప్రయత్నం చేసినా చివరకి కన్నీళ్లే మిగుల్తాయి . నా లైఫ్ లోకి ఎందుకొచ్చావ్ .. నన్ను ఎందుకు ఏడిపిస్తున్నావ్ .. నీ ప్రపంచం నీకు ఉన్నప్పుడు నా ప్రపంచంలోకి ఎందుకు వచ్చావు .. నా ప్రేమ నీకు భారం అనిపిస్తుందా .. ఎందుకు దగ్గరయ్యావ్ .. ఎందుకు దూరమయ్యావ్ .. ప్రతి దానికి ఎక్సపైరీ డేట్ ఉన్నట్టే .. మన ప్రేమకి కూడా ఉందా ?

డోర్ బెల్ .. కళ్ళు తుడుసుకుని వెళ్తే .. విహారిక .. లోపలికొస్తూ .. "ఆనంద్ .. ఎందుకు నీ ఫోన్ పాస్వర్డ్ మార్చావు ? నాకు చెప్పలేదు కూడా " , అని అంటే .. వాడు డోర్ వేస్తూ .. "విహారికా .. ముందు నువ్వు రెస్ట్ తీసుకో .. చెబుతా .. " , అని అంటాడు .. "అంటే .. నా మీద నమ్మకం పోయిందా ? నీ ఫోన్ , నా ఫోన్ అనే తేడా లేకుండా ఇద్దరం షేర్ చేసుకున్నాం పస్స్వర్డ్స్ .. ఇప్పుడు ఇది నా ఫోన్ .. నీకు సంబంధం లేదు అన్నట్టు పాస్వర్డ్ మార్చుకున్నావ్ .. "

వాడు తలపట్టుకుని .. బెడ్ రూమ్ కెళ్ళి దుప్పటి కప్పుకుని పడుకుంటాడు .. కనీసం ప్రశాంతంగా బతికే వీలు కూడా లేదు .. అది బట్టలు మార్చుకుంటూ .. "చెప్పవేం ఆనంద్ ?"

"విహారికా .. నువ్వెక్కిడికెళ్ళి వస్తున్నావ్ ?"

"సినిమాకి అని చెప్పా కదా .. ఫ్రెండ్స్ తో "

"మరి నన్నెందుకు పిలవలేదు ?"

"మా ఫ్రెండ్స్ తో వెళ్తున్నా కదా .. నిన్నెలా పిలుస్తా "

"చూసావా విహారిక .. నన్ను పిలవకుండా ఫ్రెండ్స్ తో సినిమాకెళ్ళావ్ .. అది నీ లైఫ్ .. నేను నా ఫ్రెండ్స్ తో కలిసి మందుకొడతా నిన్ను పిలవకుండా .. అది నా లైఫ్ .. మనిద్దరం కలిసి ఆఫీస్ కి వెళ్తాము , సినేమాకి , షికార్లకి వెళ్దాం .. అది మన లైఫ్ .. అర్ధమయ్యిందనుకుంటా ? నాకంటూ ఒక లైఫ్ ఉంటుంది .. నా స్పేస్ నాకివ్వు .. నా ఫోన్ నాది .. నీ ఫోన్ నీది "

సైలెన్స్ .. లైట్ ఆపేసి మొగుడు పక్కన పడుకుంటూ "అర్ధమయ్యింది ఆనంద్ .. నా లైఫ్ నీ లైఫ్ అంతా కలిపి మన లైఫ్ అనుకున్నా .. నువ్వు ఇలా అడ్డుగోడలు వేస్తావనుకోలేదు .. సరే .. నీ ఇష్టం .. మరి నిన్న పూనమ్ ని ఎందుకు అవమానించావ్ ? నేను లేనని డోర్ తెరిసి .. చెప్పు .. కనీసం ఆ పిల్లకి సారీ కూడా చెప్పలేదు "

"సతాయించకు విహారిక .. అది నాకు దానికి మధ్య వ్యవహారం .. అయినా పెళ్లికాని అమ్మాయి తో నేనలా .. ఒంటరిగా ... ఆ రోజులు పోయాయి విహారిక .. ఇప్పుడా ధైర్యం లేదు .. సాహసం చేయలేను .. ఒకసారి దెబ్బతిన్నా .. ఇంకోసారి కూడానా ?"

అంటే అనన్య తో పోల్చుకుంటున్నాడా ? ఆ మ్యాటర్ లోకి వెళ్లకపోవడమే బెటర్ .. బహుశా .. ఆ విషయం వల్లే ఫోన్ పాస్వర్డ్ మార్చాడు .. అనన్య జ్ఞాపకాల్ని తుడిపేస్తున్నాడు .. ముందు ఇంట్లో గోడ మీద ఫోటోలు .. ఫోన్ లో ఫోటోలు .. ఇప్పుడు ఏకంగా కాంటాక్ట్ లిస్ట్ లోంచి కూడా ...

సైలెన్స్ .. "ఆనంద్ .. మనం భార్య భర్తలం .. నేనెప్పుడూ నిన్ను అనుమానించలేదు . నిన్ను సపోర్ట్ చేస్తూనే ఉన్నా .. ప్రతి విషయంలో .. పూనమ్ తో అలా బిహావ్ చేసి .. లేని అబద్దాన్ని నిజం చేయొద్దు .. ప్లీజ్ "

"సారీ ... నా ఇంటెన్షన్ కరెక్ట్ .. కానీ చేసిన విధానం మాత్రం రాంగ్ .. అందుకే సరిజేసుకున్నా .. దాంతో కలిసి పుల్లట్లు తిన్నా "

"ఏంటి ? పుల్లట్లా ? ఇంటరెస్టింగ్ .. ఏమైంది సర్ ? చెప్పండి "

"ఏముంది విహారికా .. IT Hub లో క్యాబ్ కోసం ఎదురుచూస్తున్న పూనమ్ ని చూసి కార్ ఆపి ఎక్కు డ్రాప్ చేస్తా అని అనకుండా .. అవమానించా .. నా కార్ పక్క సీట్లో ఉండాల్సిన నువ్వు నీ ఫ్రెండ్స్ తో సినిమా కి వెళ్ళావ్ .. మొత్తానికి ఇంటి దాక తెచ్చేక .. ఆంటీ గుడికెళ్లింది , కీస్ లేవు అని చెప్పినా .. మన ఇంటికి ఆహ్వానించలేదు .. ఎందుకంటే పెళ్ళాం సినిమాకెళ్లింది .. సరే ఏదో మాయ చేసి పుల్లట్లు తినిపించింది .. మమ్మీ గుడికెళ్లిందని అబద్దం చెప్పిన సంగతి నాకు తెలిసినా .. తెలివిగా మేనేజ్ చేసింది .. అది హ్యాపీ .. "

"వావ్ .. ఇంత కధ నడిసిందా ? మొత్తానికి మీలో ఆ పాత హుషారు కనిపిస్తుంది ఇన్నాళ్ళకి .. "

"విహారికా .. ఆ హుషారుకి బ్రేక్ వేసింది .. నా సిగెరెట్ ఫ్రెండ్ .. అదే నా బాల్కనీ ఫ్రెండ్ .. నీకు తెలుసు కదా ఎవరో .. అది చాలదన్నట్టు .. నువ్వు ఫోన్ లొల్లి తో ఇంకా బాధపెట్టావ్ "

మొగుడి మీద వాలిపోతూ "ఆనంద్ .. మనం ఎప్పటిలా హ్యాపీ గా ఉందాం .. సరే ఒప్పుకుంటా .. నీ ఫోన్ నీది .. నేను మీ పెర్సనల్ లైఫ్ లోకి అడుగు పెట్టను .. ఓకే ? కొత్తగా పెళ్లయ్యింది .. మొగుడితో పోవాల్సింది సినిమాకి .. ఫ్రెండ్స్ తో ఎందుకెళ్లా ? అర్ధం చేసుకో ఆనంద్ .. నీ బాధ నాది .. నా సుఖం నీది .. అప్పుడే వైవాహిక బంధం హ్యాపీ గా ఉంటుంది .. నువ్వు ఓకే అంటే .. రేపు నైట్ స్పెషల్ గా ప్లాన్ చేస్తా .. ఫస్ట్ నైట్ అంతగా కాకపోయినా .. సరేనా ?" , అని అంటుంటే .. అమాయకపు ముఖం .. కరిగిపోతాయి కష్టాలు .. ఆ ముఖంలోకి .. కళ్ళల్లోకి చూస్తుంటే .. కరిగిపోయే కాలంలో .. ఎక్కడో వదిలేసినా జ్ఞాపకాలని పదే పదే తలసుకుంటూ .. మనకోసమే జీవిస్తున్న మన తోటే లైఫ్ అనుకున్న ఆడదాన్ని దూరం పెట్టడం ఎంతవరకు సబబు

"విహారిక .. అలాగే .. నాకే సిగ్గుగా ఉంది .. నా పెళ్ళాం తన ఫ్రెండ్స్ తో సినిమాకెళ్లింది .. నేనేమో ఎదురింటి అమ్మాయితతో రోడ్ సైడ్ బండి పుల్లట్లు తింటూ .. ఇందాక అన్న మాటల్లో నిజం ఉంది .. అబద్దం ఉంది .. నా లైఫ్ వేరు .. నీ లైఫ్ వేరు .. మన లైఫ్ వేరు అని .. మనం ఎలా జీవించినా మన మనస్సాక్షికి సమాధానం చెప్పుకోవాలి .. ఏ తప్పూ చేయకూడదు .. "

విహారిక చాల హ్యాపీ గా ఉంది .. ఆనంద్ లో వస్తున్న మార్పు .. చాలు .. ఇది చాలు .. ఆనంద్ ని వాటేసుకుని నిద్రలోకి జారుకుంటుంది .. వాడు కూడా పెళ్ళాం కౌగిలిలో కరిగిపోతాడు

మరుసటి రోజు ట్యూషన్ టైం .. 7 అయ్యింది .. నిన్న పెళ్ళాం సినిమా ప్రోగ్రాం ఉందని క్యాన్సిల్ చేసాడు ..

జావా రూమ్ లో బెడ్ మీద ఆనంద్ .. చైర్ లో పూనమ్ .. మోకాళ్ళ వరకు ఉన్న పూల పూల గౌన్ .. స్లీవ్ లెస్ టాప్ .. నవ్వుకుంటాడు మనసులో .. రాత్రికి పెళ్ళాంతో స్పెషల్ షో .. ఆనంద్ నవ్వుకోవడం గమనించి "ఏమయ్యింది సర్ ? మాక్కూడా చెప్పొచ్చుగా ? , అని అంటే .. వాడు "నీకు చెప్పేది కాదులే .. పెళ్ళయితే అర్ధమవుతుంది " , అని నాలుక్కరుసుకుంటూ .. కవర్ చేసేదానికి .. "ఏది చెప్పు .. ఊప్స్ కాన్సెప్ట్స్ .. ఏమర్ధమైయింది నీకు ?"

"సర్ .. మొదిటిది పోలీ మోర్ఫిజం .. అంటే ఒకటే మెసెజ్ .. సందర్భాన్ని బట్టి రూపాంతరం చెందుతుంది .. మీరు చెప్పింది .. జంతువు ఎలా అరుస్తుంది ? పిల్లి మియావ్ మియావ్ అంటుంది .. కుక్క భౌ భౌ అంటుంది .. మేక మే మే అంటుంది .. నేను చెప్పే example ఏంటంటే .. సారీ .. ఏమననుకోకు .. ఇద్దరికీ వచ్చిన ఒకటే కష్టం .. అక్క నెల రోజుల్లో మర్చిపోయి .. మూవ్ అయ్యింది .. నువ్వేమో ఇంకా ఆ జ్ఞాపకాల్లోంచి బయటకు రావడం లేదు "

సైలెన్స్ .. ఆనంద్ కి కోపమొస్తుందేమో అని అనుకుంది .. అలా జరగలేదు .. హమ్మయ్య .. బతికిపోయా ..

"సర్ నెక్స్ట్ .. ఇన్హెరిటెన్స్ .. మీరు చెప్పిన example .. ఆనిమల్ బేస్ క్లాస్ .. డాగ్ , క్యాట్ .. derived classes .. నేను చెప్పేది .. అక్క లోని ఓర్పు , అనన్య లోని చిలిపితనం మీకొచ్చాయ్ .. సారీ .. "

ఈ సారి కూడా ఆనంద్ చిరాకు పడలేదు

"నెక్స్ట్ .. abstraction .. మీరు చెప్పింది ... వెహికల్ అనేది కార్ లేదా బోట్ , లేదా ఏరోప్లేన్ గా ఉండొచ్చు .. ఆనందం అనే abstract క్లాస్ నుంచి పెళ్లి , ప్రేమ , స్నేహం అనే బంధాలని సృష్టించొచ్చు .. "

"వావ్ .. చాల బాగా చెబుతున్నావ్ పూనమ్ .. నీకు కాన్సెప్ట్స్ బాగా అర్ధమయ్యాయి .. "

"నిజంగా ? i am happy .. ట్రీట్ ? పుల్లట్లు ?"

"అలాగే .. అక్క కూడా .. "

"sure .. మరి కుమార్ సంగతి ?"

"వాడి సంగతి అక్క చూసుకుంటుందిలే .. వాడేమన్నా చదువుతున్నాడా .. లేక ఆ బెంగుళూరు పాపతో చాటింగ్ చేస్తూ లైఫ్ వేస్ట్ చేసుకుంటున్నాడా ?"

"ఏమో ఆనంద్ .. లేట్ గా పడుకుంటాడు .. ఫోన్ పక్కనే ఉంటుంది .. ఇంతకు ముందు పాస్వర్డ్ షేర్ చేసాడు .. ఈ మధ్య పాస్వర్డ్ మార్చేశాడు "

సైలెన్స్ .. ఒక నిమషం

"పర్లేదు పూనమ్ .. ఎదిగే వయసు .. ఫ్రీడమ్ ఇవ్వాలి "

"అందుకే నేను కూడా అడగలేదు . అయినా ఆ బెంగుళూరు అమ్మాయిలకి ఈ హైదరాబాద్ అబ్బాయిలే కావాలా ?"

మల్లి సైలెన్స్ ..

"సారీ ఆనంద్ .. నా ఉద్దేశ్యం అది కాదు .. మన హైదరాబాద్ కూడా బాగా డెవలప్ అయ్యిది కదా .. కత్తుల్లాంటి అమ్మాయలు ఇక్కడకూడా ఉన్నారుగా .. "

"ఇక ట్యూషన్ అయిపొయింది ఈ రోజు పూనమ్ "

"ఏంటి సార్ .. ఈ రోజు ఇంత త్వరగా .. ఏంటి మ్యాటర్ ?"

"ఏమో కత్తుల్లాంటి అమ్మాయలు ఉన్నారన్నావుగా . వెళ్లి అక్కని అడుగు .. "

విహారిక కూడా త్వరగానే ట్యూషన్ అవగొట్టి బయటకొస్తుంది .. పూనమ్ కళ్ళల్లో చిలిపి ప్రశ్నలు .. అక్క మొఖంలో ఆనందం .. ఆనంద్ పరవర్తనలో మార్పు ... పుల్లట్ల దెబ్బ ? ఎనీవే .. వాళ్లిద్దరూ హ్యాపీ గ ఉంటె అదే చాలు

"ఏంటక్కా . అప్పుడే ఆపేసావ్ క్లాస్ " , అని కుమార్ అంటుంటే .. పూనమ్ వాణ్ణి లాక్కుంటూ పోతు "ఒరేయ్ మొద్దు .. నీ లవర్ రూమ్ మెట్ ని అడుగు .. విషయం తెలుస్తుంది రేపు .. గుడ్ నైట్ అక్కా .. గుడ్ నైట్ బావా .. సారీ .. ఆనంద్ "
Next page: Chapter 43
Previous page: Chapter 41