Update 03

రమ్య మనసులో కీ రాజా రోజు రోజు మెల్లగా దూరిపోతున్నాడు కానీ రమ్య రాజా మనసులో ఎప్పుడో దూరి పోయింది దాంతో ఇద్దరు ఒకటే ప్రాజెక్ట్ పని మీద వాళ్ల కథ మీద చేస్తున్న పని కాబట్టి ఇద్దరు మరింత దెగ్గర అవ్వడం మొదలు పెట్టారు, అంతే కాకుండా ఇద్దరు తమ గతం లోని చేదు అనుభవాలు అన్నింటినీ మరిచి జీవితాన్ని కొత్త మలుపు తో కొత్త రంగుల తో వారి జీవితాలను గడుపుతున్నారు, అలా రాత్రి పగలు కష్ట పడి ఇష్ట పడి ఇద్దరు తమ ప్రేమ మొదలు కాకముందే మొదలైన తమ ప్రేమ ప్రయాణం కీ ఒక రూపం ఇచ్చారు దాంతో వారి మనసులో పడిన ప్రేమ బీజం మొలక ఏత్తింది, ఒక నెల రోజుల కష్టం తో రాజా ఆ గేమ్ తాలూకు మొదటి లెవల్ పూర్తి చేశాడు దాని అవతలి కంపెనీ కంటే ముందే రిలీస్ చేశారు, దాంతో రాజా చేసిన గేమ్ ట్రేడింగ్ లో నెంబర్ వన్ ప్లేస్ లో అందుకే ఒక పెద్ద పార్టీ ఏర్పాటు చేశారు వాళ్ల ఆఫీసు వాళ్లు.

ఒక పెద్ద రిసార్ట్ లో సక్సెస్ పార్టీ ఏర్పాటు చేశారు అందరూ పార్టీ ఎంజాయ్ చేస్తుంటే raja కళ్లు మాత్రం ఎవరి కోసమో అన్నట్లు మెయిన్ గేట్ వైపే చూస్తూ ఉన్నాయి అప్పుడు రామ్ రెండు గ్లాస్ లతో వచ్చి ఒకటి రాజా కీ ఇచ్చాడు కానీ రాజా వద్దు అన్నాడు

రామ్ : ఏమైంది రా

రాజా : రమ్య ఇంకా రాలేదు రా

రామ్ : అరే నాన్న వస్తుంది లే కానీ ఒక పెగ్ ఎయ్యి రా అని బలవంతం చేశాడు

రాజా : వద్దు రా నేను మానేసాను

రామ్ : ఇది ఎప్పటి నుంచో

రాజా : మొన్న బ్రేక్ అప్ అయ్యిన దెగ్గర నుంచి

రామ్ : ఎవడైనా బ్రేక్ అప్ అయితే మొదలు పెడతారు నువ్వు మానేస్తూన్నా అంటావ్ ఏంటి రా

రాజా : అది నీకు అర్థం కాదు పోయి పని చూసుకో

అప్పుడే రామ్ ఫోన్ కీ ఒక మెసేజ్ వస్తే పగల పడి నవ్వుతూ

రామ్ : ఇప్పుడు నువ్వు ఇది చూస్తే ఫుల్ బాటిల్ కూడా చాలదు రా నీకు

రాజా : ఏం మాట్లాడుతున్నావు రా

రామ్ : ఇదిగో చూడు నీ పాత లవర్ కీ ఇంకో రెండు గంటల లో పెళ్లి అని తన ఫోన్ కీ వచ్చిన మెసేజ్ చూపించాడు

కానీ అప్పుడే రమ్య దేవ కన్య లాగా చీర లో వచ్చి ఎదురుగా నిలిచే సరికి రాజా గుండె చప్పుడు లో లయ తప్పింది, కళ్ల ముందు రమ్య రూపం తప్ప మరొకరు కనిపించడం లేదు ఏది తన చెవులకు ఎక్కడం లేదు

రాజా : ఏంటి ఇంత లేట్

రమ్య : అది కాదు నాకూ నీ హెల్ప్ కావాలి చేస్తావా అని అడిగింది

రాజా : చేస్తాను కానీ ఏమీ అయింది అని అడిగాడు

రాజా మాట పూర్తి కాక ముందే రమ్య అతని చెయ్యి పట్టుకుని బయటికి లాకుని వెళ్లి

రమ్య : బైక్ తియ్యి నేను చెప్పిన అడ్రసు కీ పోనివ్వు

అలా రాజా రమ్య కలిసి ఒక ఫంక్షన్ హాల్ కీ వెళ్లారు అక్కడ ఒక పెళ్లి ఘనంగా జరుగుతోంది

రాజా : ఎవరి పెళ్లి ఇది అని అడిగాడు

రమ్య : నా పాత బాయ్ ఫ్రెండ్ ది నీకు దమ్ముంటే నా పెళ్లి అయ్యే లోపు ఒకడి నీ బాయ్ ఫ్రెండ్ చేసుకో అని ఛాలెంజ్ చేశాడు

రాజా : అంటే ఇప్పుడు నీకు నేను అదే బాయ్ ఫ్రెండ్ నా

రమ్య : ఫీల్ అవ్వదు ప్లీస్ హెల్ప్ చేయి

రాజా : యుద్ధం లోకి దిగ్గాక వెనకడుగు వేసేది లేదు పద అని ఇద్దరు లోపలికి వెళ్లారు

అక్కడ పెళ్లి కూతురు ప్లేస్ లో ఉన్న కీర్తి నీ చూసి షాక్ అయ్యాడు రాజా, అలాగే రాజా పక్కన ఉన్న రమ్య తనకన్న అందం గా ఉండటం తో కీర్తి ఈర్ష్య పడింది తను విసిరిన ఛాలెంజ్ లో గెలిచింది అని షాక్ అయ్యాడు కిరణ్.

కిరణ్ తనని చూస్తూన్నాడు అని అర్థం అయిన రమ్య తన కుడి చెయ్యి నీ రాజా ఎడమ చేత్తో మెల్లి వేసి పట్టుకోని లేపి ముద్దు పెట్టింది దానికి కిరణ్ రాజా ఒకేసారి షాక్ అయ్యారు ఆ తర్వాత రాజా మాత్రం ఆ పెదవి స్పర్శకు ఆనంద పడిపోయాడు, ఆ తర్వాత ఇద్దరూ ముందు వరుసలో కూర్చుని ఒకరి చెవిలో ఒకరు ఏదో ఏదో చెప్పుకొని నవ్వకుంటున్నారు, అది చూసిన కిరణ్, కీర్తి లో ఎక్కడో ఒక చిన్న అసూయ మొదలు అయ్యింది ఆ తర్వాత ఫోటో అప్పుడు రాజా రమ్య చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాగేసరికి రమ్య, కిరణ్, కీర్తి ముగ్గురు షాక్ అయ్యారు దాంతో రమ్య కొంచెం దగ్గరికి జరిగి రాజా భుజం పై వాలి నిలుచుంది, దాంతో కీర్తి కీ ఒళ్లు మండిపొయింది తనని అంత ప్రేమగా ఎప్పుడు దగ్గరికి తీసుకోలేదు రాజా, కీర్తి కంట్లో కిరణ్ కంట్లో అసూయ బెరుకు చూసేసరికి రాజా రమ్య ఇద్దరికి లోపల లోపల సంతోషంగా ఉంది, ఆ తర్వాత ఇద్దరూ అక్కడి నుంచి బయలుదేరి వెళుతున్న టైమ్ లో కీర్తి వాళ్ల అమ్మ వీళ్లని అప్పింది "బాబు మీరు ఎవరి తరుపున వచ్చారు" దానికి రాజా "నేను మీ అమ్మాయి కాలేజీ ఫ్రెండ్స్ ఆంటీ తను మీ అల్లుడు కాలేజీ ఫ్రెండ్స్" అని చెప్పాడు, "అవునా మంచిది మరి మీ ఇద్దరూ" అని అడిగింది దానికి రమ్య "ఆంటీ మేము వైఫ్ అండ్ హస్బండ్" అని రాజా కీ మళ్లీ షాక్ ఇచ్చింది రమ్య అది విన్న కీర్తి వాళ్ల అమ్మ" అనుకున్న చాలా చక్కగా ఉంది మీ జంట నిజంగా ఒకరి కోసం ఒకరు పుట్టినట్టు ఉన్నారు "అని చెప్పే సరికి దానికి రాజా మొహం లో ఒక చిరునవ్వు మెరిసింది అలా తన తల తిప్పి రమ్య వైపు చూశాడు రమ్య సిగ్గు తో కళ్లు కిందకు దించి అలాగే పక్కన ఉన్న అద్దం నుంచి రాజా నీ చూసింది.

ఆ తర్వాత ఇద్దరూ బైక్ పైన తిరిగి వెళుతుండగా తన కుడి వైపు ఉన్న అద్దం నుంచి రమ్య నీ ఓరకంట చూడటం మొదలు పెట్టాడు, రమ్య కూడా రాజా భుజం పై నుంచి తన ముందు ఉన్న అద్దం లో రాజా మొహం చూసి సిగ్గు పడుతుంది, సడన్ గా బైక్ ఆగిపోయింది ఎంత ట్రై చేసిన తిరిగి స్టార్ట్ చేసిన అది స్టార్ట్ అవ్వలేదు దాంతో రమ్య "అది స్టార్ట్ అయ్యేలా లేదు కాబ్ బుక్ చేస్తా ఆగ్గు" అని చెప్పింది కానీ తన ఫోన్ స్వీచ్ ఆఫ్ అయ్యింది దాంతో ఇద్దరు బైక్ నీ దొర్లిస్తూ నడచుకుంటు వెన్నల రేయి లో హాయిగా నడచుకుంటు వెళ్లుతున్నారు ఇద్దరి మధ్య దూరం నీ బైక్ పెంచుతుంటే ఇద్దరి మధ్య మాటల లేవు కానీ ఇద్దరి మనసులో మధ్య మాత్రం దూరం చెదిరి పోయింది, ఆ తర్వాత ఇద్దరూ అలా వెళుతూ ట్యాంక్ బంద్ మీద ఆగారు ఆ తర్వాత అక్కడ కనిపిస్తున్న చందమామ నీ చూస్తూ

రాజా : ఇన్ని రోజులు నాకూ అది ఒక్కటే అందం గా కనిపించేది కానీ ఈ రోజు దానికంటే అందం నువ్వు కనిపిస్తూన్నావూ

రమ్య : అవునా అంత అందం గా ఉన్నానా

రాజా : నమ్మవా అవసరం అయితే దాన్నే అడుగుదాం అని గట్టిగా "హే చందమామ నువ్వు అందం గా ఉన్నావా లేదా ఈ అమ్మాయి బాగుందా" అని అరిచాడు

రమ్య : హే దిగ్గు రా ఇంటికి వెళ్లదాం అని తీసుకొని వెళ్లింది

రాజా : చందమామ ఆన్సర్ విన్నవా

రమ్య : నాకూ దాని ఆన్సర్ అవసరం లేదు పద దగ్గరలో పెట్రోల్ బంకు ఉంది అని తీసుకొని వెళ్లింది

అలా ఇద్దరు కలిసి పెట్రోల్ కొట్టించుకోని ఇంటికి వెళ్లారు రాజా రమ్య నీ తన ఇంటి దెగ్గర దింపి లోపలికి వెళుతున్న రమ్య నీ పిలిచి "రేపు నీకు ఒక విషయం చెప్పాలి ఆఫీస్ లో చెప్తా" అని వెళ్లిపోయాడు రాజా దారి లో ముస్తున్న ఒక boquite షాప్ లోకి వెళ్లి ఒక 4 రంగుల రోజా పువ్వులు తో ఉన్న boquite తీసుకొని ఇంటికి వెళ్లాడు మరుసటి రోజు ఉదయం ఆఫీస్ కీ ఎంతో ఆశ గా వెళ్లాడు కానీ రమ్య ఇంకా రాలేదు అలా చూస్తూనే ఉన్నాడు కానీ రమ్య రాలేదు, మధ్యాహ్నం అయ్యింది సాయంత్రం అయ్యింది కానీ రమ్య జాడ ఎక్కడ కనిపించడం లేదు ఫోన్ మొగ్గుతున్న ఎవరూ ఎత్తడం లేదు దాంతో డైరెక్ట్ గా ఇంటికి వెళ్లాడు కానీ ఇళ్లు తాళం వేసి ఉంది.

ఆ రాత్రి రమ్య నీ వదిలిన తర్వాత రమ్య కూడా రాజా తన ప్రేమ విషయం చెప్తాడు అని అర్థం అయ్యి తన ఇంటికి వెళ్లింది కానీ అక్కడ అందరూ బిజీ బిజీగా ఉన్నారు సమన్లు సర్దుతు ఉన్నారు దానికి రమ్య "అచ్చన్ (మళయాళం లో నాన్న అని) ఎక్కడికి వెళ్లుతున్నారు" అని అడిగింది, "మొన్నె ఓనం కదా ఊరికి వెళ్లాలి అని పొద్దున ఫ్లయిట్ కూడా నువ్వే బుక్ చేశావు మరిచి పోయావా" అని అడిగాడు అప్పుడు గుర్తుకు వచ్చింది రమ్య కీ ఉదయం కొచ్చి కీ వెళ్లాలి అని ఆ తరువాత రోజు ఉదయం ఎయిర్ పోర్ట్ కీ వెళ్లాక గుర్తుకు వచ్చింది రమ్య కీ తన ఫోన్ మరిచి విషయం.

మరుసటి రోజు ఉదయం రమ్య గుడికి వెళ్లి పూజ చేయించి బయటకు వస్తూంటే తన ఎదురుగా ఉన్న ఒక వ్యక్తి నీ చూసి షాక్ అయ్యింది ఎందుకంటే అక్కడ ఉన్నది రాజా, తనని చూసిన వెంటనే పరిగెత్తుతూ వెళ్లి తన ముందు నిలబడింది అంతే "I love you" అని చెప్పాడు దానికి రాజా నీ గట్టిగా కౌగిలించుకున్ని తన అంగీకారం తెలిపింది రమ్య.

రమ్య, రాజా ఇద్దరు కలిసి వాళ్ల వికసించన ప్రేమ ఆనందం పులకరించి పోయారు అంతలో గుడి లో నుంచి బయటకు వస్తున్న విద్య "చేచి చేచి చేచి" అని రమ్య నీ పిలుస్తూ బయటికి వచ్చింది దాంతో రమ్య రాజా నీ పక్కకు తోసి "విద్య ఏంటి" అని పిలిచింది

విద్య : చేచి అచ్చన్ పిలుస్తూన్నారు

రమ్య : నేను వస్తాను నువ్వు వేళ్లు అని చెప్పి పంపింది

విద్య : లేదు అర్జంట్ రా (లోపలికి వెళ్లుతు రాజా నీ చూసి) హే మీరు రాజా కదా

రమ్య రాజా వైపు "హా రాజ్ నువ్వు ఏంటి సడన్ గా ఇక్కడ" అని అడిగింది రమ్య దాంతో రాజా "ఏమీ లేదు మన బాస్ కీ మనం చేసిన గేమ్ సెకండ్ లెవల్ కోసం ఏదైనా ఇండియన్ బ్యూటీ ప్లేస్ స్కెచ్ లు కావాలి అన్నాడు అందుకే ఇక్కడికి వచ్చాను మా ఫ్రెండ్ ఉండాలి కానీ వాడు ఎప్పుడో దుబాయ్ కి వెళ్ళాడు అంట అందుకే ఏమీ చేయాలో తెలియక ఇక్కడికి వచ్చాను" అని చెప్పాడు, దానికి రాజా యొక్క ఊహ శక్తి కీ రమ్య మనసులో జోహారు చెప్పింది అప్పుడే బయటకు వచ్చిన రమ్య వాళ్ల నాన్న రాజా నీ చూసి ఎవరూ అని అడిగారు, దాంతో రమ్య రాజా చెప్పిన కథను అలాగే వాళ్ల నాన్న కీ చెప్పింది ఆయన రాజా వాళ్ల ఇంటికి రమ్మని ఆహ్వానం ఇచ్చారు రాజా మరో మాట లేకుండా సరే అని రెడీ అయ్యాడు.

ఇంటికి వెళ్లిన తర్వాత రాజా కీ ఒకసారి గా షాక్ కొట్టినట్టు అయ్యింది ఇంటిలో నే ఒక కలరీపట్టు కోచింగ్ ఇన్స్టిట్యూట్ నడుపుతున్నారు వాళ్ల కుటుంబం అక్కడ ఉన్న ఒక్కోకడు హాలీవుడ్ విలన్ లా కండలు తిరిగి పొడుగ్గా ఉన్నారు సరిగా చెప్పాలి అంటే ప్రతి ఒక్కడు బైసన్ లా ఉన్నాడు, అందులో ఉన్న ఇద్దరు మాత్రం అందరి నీ ఓడిస్తున్నారు రమ్య నీ పిలిచి "ఎవరూ వాళ్లు ఇద్దరు" అని అడిగారు దాంతో రమ్య వాళ్ల నీ చూసి "నా కజిన్ బ్రదర్స్" అని చెప్పింది దాంతో రాజా వాళ్ల వైపు చూసి వెళ్లాడు తనకి ఒక రూమ్ ఇచ్చారు రాజా వెళ్లి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చేసరికి రమ్య వాళ్ల అన్న లు ఇద్దరూ లోపలికి వచ్చి రాజా ఎదురుగా నిల్చోని ఒక పంచ, కలర్ ఖదర్ ఇచ్చి "రెడీ అయ్యి కింద ఉన్న కార్ దగ్గరికీ రా " అని మళయాళం లో సిరియస్ గా చెప్పి వెళ్లి పోయారు "ఏమీ ఆతిథ్యం రా నాయనా మీ ఫేస్ లో నవ్వు లేదు రేపు నేను ఈ ఇంటికి అల్లుడు నీ అయినప్పుడు మీతో కాలు కడిగించుకుంటా" అని చెప్పి డ్రస్ వేసుకొని కిందకు వెళ్లాడు, రాజా అలా కేరళ స్టైల్ లో రెడీ అయి వస్తుంటే రమ్య సూపర్ అన్నట్లు చేత్తో ఒక సైగ చేసింది.

తరువాత తను ఎక్కబోతున్న కార్ డ్రైవర్ నీ పక్క కార్ దగ్గరికీ పంపి తన కార్ కీ రాజా వైపు విసిరింది దాంతో రాజా, రమ్య, విద్య ముగ్గురు ఒక కార్ లో బయలుదేరారు

రాజా : ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్లుతున్నాం

రమ్య : పక్కనే ఉన్న ఒక చిన్న ఊరు ఉంది మా ancestors కాలం నుంచి అక్కడే ఉన్నారు మా మామయ్య వాళ్లు అక్కడే ఉంటారు

రాజా : ఓహో అంటే ఇప్పుడు నేను చూసింది టీజర్ సినిమా ఇంకా ఉంది అన్నమాట

విద్య : అవును

రమ్య : హే సుమా ఇరు అది ఏమీ లేదు అక్కడ మాకు ఒక ల్యాండ్ ఉంది అది మా మామయ్య వాళ్లు తీసుకోవాలని ప్లాన్ లో ఉన్నారు, మేము మాత్రం అది గుడికి రాసి ఇద్దాం అనుకుంటున్నాము ఇప్పుడు దాని కోసం అక్కడ మా అన్నయ్య వాళ్లు మా బావ తో ఫైట్ చేయాలి

రాజా : 1:2 ఆ ఫైట్ లో న్యాయం లేదే

రమ్య : మా బావ కలరీపట్టు లో వరల్డ్ చాంపియన్

రాజా : మీ అన్న లు ఏమీ తక్కువ కాదు ఇద్దరు మా ఒంగోలు గిత్త లాగా ఉన్నారు

విద్య, రమ్య ఇద్దరు ఒకేసారి రాజా నీ కొట్టడం మొదలు పెట్టారు అలా ఒక అర గంట తరువాత వాళ్లు రమ్య వాళ్ల తాత వాళ్ల ఊరికి వెళ్లి చేరుకున్నారు అక్కడ రమ్య వాళ్ల నాన్న వాళ్ల మామయ్య వాళ్లు చాలా ఆవేశం గా మాట్లాడుతూ ఉండటం చూసిన రాజా అది పట్టించుకోవడం మానేసి రమ్య వాళ్లు గుడి ముందు వంటలు చేస్తుంటే తన చీర సింగారం నుంచి తన అందాలను తనివి తీర చూస్తూ ఉన్నాడు రాజా, అంతలో రానే వచ్చాడు తేజ రమ్య వాళ్ల బావ అతను రాగానే ఆవేశం గా మాటలు లేవు మాట్లాడు కొవ్వడాలు లేవు అన్నట్లు డైరెక్ట్ గా పందెం మొదలు పెట్టమన్నాడు దాంతో రమ్య వాళ్ల పెద్ద అన్న కేశవ్ బరిలోకి దిగాడు.

కేశవ్ నీ మొదటి రౌండ్ లోనే ఓడించి చాత్తి పైన కత్తి గాట్లు పెట్టి బయటకు తోసి రెండో వాడు కార్తి నీ లోపలికి పిలిచాడు కార్తి ముందుగానే భయపడి వెళ్లలేదు దాంతో తేజ పొగరు గా రమ్య వాళ్ల నాన్న తో "మామ నీ పొలం నీకు కావాలి అంటే నీ కూతురు నీ నాకూ ఇచ్చి నా కాలు కడిగి ఆ నీళ్లు నీ నెత్తి పైన పోసుకో" అని మళయాళం లో అంటూ హేళన చేశాడు ఇది అర్థం కాక రాజా విజిల్ వేసి సూపర్ అని అరిచాడు రమ్య వచ్చి జరిగింది చెప్పింది దాంతో రాజా నేను వెళ్లతా అని చెప్పాడు దానికి రమ్య వద్ధు అని వారిస్తున్న రాజా లోపలికి దిగాడు అంతే నాలుగు దెబ్బలు తిని కింద పడ్డాడు దానికి తేజ మళయాళం లో ఏదో తిట్టాడు దాంతో రాజా పైకి లేచి తనకు ఇచ్చిన కత్తి డాల్ లో డాల్ పట్టుకుని కత్తి కింద పడేసి ఆయుధం లేకుండా తేజ నీ కుక్కనీ కొట్టినట్టు కొట్టి ఒడించాడు.

ఇలా చేయడం తో రమ్య వాళ్ల నాన్న రాజా నీ చూసి కొంచెం ఇంప్రెస్ అయ్యాడు సాయంత్రం వాళ్లు తిరిగి కొచ్చి కీ వెళ్లారు అక్కడ రమ్య వాళ్ల పెద్ద నాన్న కీ ఒక రెస్టారెంట్ ఉంది అందులో అందరూ భోజనం చేస్తూన్నారు, అందులోనే ఒక బేకరి కూడా ఉంది అక్కడ ఒక ఆవిడ కౌంటర్ లో ఉన్న అతనితో ఏవి ఫ్రెష్ గా లేవు అని గొడవ చేసి బయటకు వెళ్లింది అందరూ ఆమె నీ తప్పు పడుతుంటే రాజా cc tv video లో ఆమె పర్స్ లో డబ్బులు లేక తన కొడుకు ఆశ పడింది ఇవ్వాలేక బాధ పడుతూంటే వాళ్లు అడిగిన ఐటం తీసుకొని అక్కడ ఉన్న సాంటా క్లాస్ వేషం వేసుకోని వెళ్లి ఆ పిల్లాడికి తిన్నడానికి ఇచ్చాడు ఇది చూసి మొత్తం రమ్య కుటుంబం అంత రాజా కీ ఇంప్రెస్ అయ్యారు.​
Next page: Update 04
Previous page: Update 02