Update 01

ముందుగా కథలోని పాత్రల పేర్లు చూద్దాం.

వీరేంద్ర - మన హీరో (ముద్దుగా వీరు అని పిలుస్తారు)

విరాజిత - మన హీరోయిన్

మోహిని - విరాజిత మరదలు (విరాజితకంటే 4 సంవత్సరాలు చిన్నది)

పూజిత - విరాజిత సొంత పిన్ని కూతురు (విరాజిత కంటే కొంచెం అందంగా ఉంటుందని కొంచెం పొగరు ఎక్కువ)

మిగతా పేర్లు మరియూ పాత్రలు సందర్భాన్ని, సమయాన్ని బట్టి వస్తాయి.

ఇక కథలోకి వస్తే మన హీరో, హీరోయిన్ హైదరాబాద్‌లోని ఒక software companyలో ఉద్యోగం చేస్తూ ఉంటారు. ఇద్దరూ ఒక రెండు సంవత్సరాలుగా కొన్ని projects మీద ఒకే Teamలో కలిసి పని చేస్తూ ఉంటారు. ఒకరి గురించి మరొకరికి బాగా తెలుసు. మొదటిసారి కలిసి పనిచేసేప్పుడు teamలో ఒకడు చేసిన పనికి వీళ్ళిద్దర్ని team leader తిడతాడు , దాని గురించి ఇద్దరికి కొంచెం serious discussion జరిగి ఇద్దరూ resignation దాకా వెళ్తారు. Team leaderకు తరువాత తెలుస్తుంది, ఆ తప్పు చేసింది వీళ్ళిద్దరూ కాదని. వెంటనే వీళ్ళిద్దరిని పిలిపించి అసలు విషయం చెప్తాడు, కాని అప్పటికే వాళ్ళు HRలను కలిసి resign చేస్తున్నాం అని చెప్తారు.

ఇద్దరూ ఎందుకు resign చెయ్యాలి అనుకుంటారంటే, మన వల్ల ఒకరికి మంచి జరగకపోయినా పర్లేదు కాని చెడు జరగకూడదు అని ఎప్పుడూ అనుకుంటారు. అలాంటిది వాళ్ళవల్ల అవతలివారు జాబ్ పోతాదేమో అని ఒకరికి తెలియకుండా ఒకరు resign చెయ్యడానికి వెళ్తారు. వాళ్ళు ఎప్పుడైతే వేరు వేరు HRలను కలసి విషయం చెప్తారో అదే సమయానికి వాళ్ళ team leader వీళ్ళని పిలుస్తాడు. వీళ్ళు తమ team lead దగ్గరకు వెళ్ళేప్పటికి HRలు తనకు జరిగిన విషయం చెప్తారు. వీళ్ళు వచ్చాకా ఇద్దరినీ అడుగుతాడు, ఇద్దరూ ఎందుకు resign చెయ్యలని అనుకున్నారు అని. అప్పుడు ఇద్దరూ ఒకేసారి "నా వల్ల ఒకరికి మంచి జరగకపోయినా పర్లేదు కాని చెడు జరకూడదు అని" అందుకే నేను resign చెయ్యాలి అనుకున్నాను అని. అది విని team lead ఎంతో సంతోషానికి లోనవుతాడు, ఎందుకంటే తను కూడా అలగే ఆలోచిస్తాడు కాబట్టి. తనని తన స్నేహితులందరూ తిట్టేవారు, ఇంకా పాతకాలంలోలాగ వాడికి మంచి జరగాలి అని అలోచిస్తుంటాడని.

ఈ సంఘటన జరిగిన రోజు సాయంత్రం ఇద్దరూ లో కలుసుకుని మాట్లాడుకుంటు ఉంటారు. అప్పుడే ఇద్దరి అలోచనలు ఒకలాగే ఉన్నయని, ఇద్దరూ friends అవుతారు. అలా వాళ్ళ స్నేహం కాస్త కొన్ని నెలల్లోనే ప్రేమగా మారుతుంది. కానీ ఒకరికి ఒకరు చెప్పుకోలేరు. ఇలా ఒక రెండు సంవ్త్సరాలు ఒకరిని ఒకరు ఇష్టపడుతున్నట్టు చెప్పుకోకుండా అలా కాలం వెళ్ళదీస్తారు. అప్పుడే మోహిని విరాజిత దగ్గర ఉండడానికి వస్తుంది, తను అక్కడే ఉండి తన మాస్టర్ డిగ్రీ పూర్తి చెయ్యాలని అనుకుంటుంది. చిన్నప్పటినుండి ఏ చిన్న విషయమైనా చెప్పే విరాజిత కొన్ని నెలలుగా తనతో సరిగా మాట్లాడడంలేదు అలాగే ఏ విషయం చెప్పటంలేదు, పైగా కొంచెం తను వచ్చినందుకు ఇబ్బందిపడుతున్నట్టుగా అనిపిస్తుంది మోహినికి.

అదే విషయం గట్టిగా అడగ్గా విరాజిత ఆఫీస్‌లో మొదటి నెలలో జరిగిన incident నుంచి ఇప్పటివరకూ జరిగినందా చెబుతుంది. అలాగే తని వీరేంద్రని ప్రేమిస్తున్నానని, ఆ విషయం తనకి ఎలా చెప్పాలో తెలియటంలేదు అని, చెబితే ఇప్పటివరకు ఉన్న స్నేహం కూడా పోతుంది అని ఫీల్ అవుతుంది. ఇక్కడ ఇంకో విషయం కూడా చెబుతుంది, తను ఎందుకు వీరేంద్రని అంతగా ప్రెమిస్తోందో. ఎందుకంటే విరాజిత తండ్రి తను ఇంటర్ చదువుతున్నప్పుడు చనిపోయారు, తన తల్లి ఆ లోటు లేకుండా పెంచింది. కానీ తనకి తండ్రి చూపించే ప్రేమ వీరేంద్ర తన దగ్గర ఉన్నప్పుడు కలుగుతుంది అని చెబుతుంది.

విరాజిత ఈ విషయాలన్నీ తన దగ్గర దాచినందుకు ముందు బాధ పడినా, తరువాత చాలా సంతోషిస్తుంది. అలగే ముందు వీరేంద్రని చూడాలని మోహిని చెబుతుంది. విరాజిత సరే అని మోహినితో కలసి దగ్గరలో ఉన్న ఒక restaurantకు తీసుకెళ్తుంది, అది వాళ్ళ ఇద్దరికి కామన్ మీటింగ్ పాయింట్ అలాగే వాళ్ళు ఇద్దరూ ఆఫీస్లో కాకుండా ఒక చోట కలవాలంటే ఇదే వాళ్ళు ఇద్దరూ ఉండే ఏరియాలకు మద్యలో ఉంటుంది అందుకని అక్కడ కలుస్తారు. విరాజిత, మోహిని అక్కడకు వెళ్ళాక విరాజిత వీరెంద్రకు ఫోన్ చేసి వాళ్ళ కామన్ పాయింట్ ప్లేస్‌కు రమ్మటే వస్తాడు. అక్కడ వీరెంద్ర వచ్చేలోపు మోహిని విరాజితని మొహాన్ని మొత్తం తో కవర్ చేసుకోమని తన వెనుక టేబుల్‌లో కూర్చోమని చెప్పి, వీరెంద్ర వచ్చినప్పుడు తనకు చూపించి అవతలవైపుకు తిరిగిపొమ్మని చెబుతుంది.

వీరెంద్ర ఆ ప్లేసుకు రాగానే సంతోషం సినిమాలో శ్రియలాగ వీరెంద్రకు ప్రపోస్ చేస్తాది. అప్పుడు వీరెంద్ర తను ఒకరిని ఇష్టపడుతున్నట్టు చెబితే పేరు అడుగుతుంది మోహిని. వీరెంద్ర పేరు చెప్పేలోపు ఇదంతా వింటున్న విరాజిత చాలా కుమిలిపోతుంది, కానీ ఎప్పుడు అయితే తన పేరు చెబుతాడో అప్పుడు విరాజిత ఆనందానికి అవదులు లేకుండా పోతాయి.

అప్పుడే మోహిని మీరు చెప్పిన మనిషి ఈమేనా అని విరజితని వీళ్ళ టేబుల్ దగ్గరకు లాగుతుంది. వీరెంద్ర, విరాజిత ఇద్దరూ ఒక్కసారిగా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ లోకాన్ని మర్చిపోయి వాళ్ళ ప్రేమలో మునిగిపోతారు. అప్పుడు, మోహిని వాళ్ళని కదిపి మీ ప్రేమ కాసేపు ఆపితే ఏమన్నా తిందాం అంటాది. అప్పుడు అందరూ నవ్వుకుంటూ ఉండగా,

వీరెంద్ర: విరాజిత, ఈమె ఎవరు ఇంతకీ? నీకు ముందే తెలుసా అని అడుగుతాడు.

విరాజిత: ఈమే పేరు మోహిని, నా కసిన్ వరసకు మరదలు అవుతుంది. నా కంటే 4 సంవత్స్రాలు చిన్నది. ఇక్కడ నాతో ఉండి తన మాస్టర్స్ పూర్తి చేస్తానని వచ్చింది.

వీరేంద్ర: అయితే నాకు చెల్లెలు అవుతుంది. మోహిని నేను నిన్ను చెల్లెమ్మా అని పిలవచ్చా?

మోహిని: చెల్లెమ్మా! ఎంత బాగుంది పిలుపు. అలగే అన్నయ్యా. (మోహినికి అన్నయ్యలు ఎవరూ ఉండరు. తనకు కూడా ఒక అన్నయ్య ఉంటే ఎంత బాగుండును అని ఎప్పుడూ బాధ పడుతుంది.)

మోహిని రాక ముందు ఎప్పుడోగాని ఒకసారి (2 లెద 4 నెలలకు ఒకసారి) ఇద్దరూ కలసి సరదగా గడపడానికి వెళ్ళేవారు కాదు. వెళ్ళినా తప్పనిసరిగా వీళ్ళ కూడా వీళ్ళతోపాటు వెళ్ళేవాడు. ఇప్పుడు మొహిని వచ్చాక ముగ్గురూ(వీరెంద్ర, విరాజిత అలగే మోహిని) నెలకు ఒకటి లేదా రెండీ సార్లు సిటీ అవుట్ స్కట్స్‌కి వెళ్ళడం మొదలెట్టారు.

ఇలా సంతోషంగా ఉంటుండగా ఒక వ్యక్తి ఎంటర్ అయ్యారు.

-----------------

ఇక నుండి వీరేంద్ర పేరు వీరు అని, విరాజిత పేరు విరా అని కథలో వ్రాయబడుతుంది. గమనించగలరని మనవి. ఆ పేర్లు టైప్ చెసేప్పుడు తప్పులు వచ్చేస్తున్నయి. అందుకే అలా మారుస్తున్నాను.

వీరు, విరా అలాగే మోహిని కలిసి ఎంతో ఆనందంగా ఉంటుండగా, అనుకోకుండా ఒకరోజు విరాజిత పిన్ని కూతురు అయిన పూజిత వీరు, విరా వాళ్ళ ఆఫీసులో కొత్తగా జాయిన్ అవుతుంది. వచ్చిన రోజే వీరుని చూసి ఇష్టపడుతుంది, అదే విషయం వీరుతో ఒక వారం తరువాత చెబుతుంది. అనుకోకుండా వీరు ఒక్కడే cafeteriaలో ఉంటే వెళ్ళి కలిసి చెబుతుంది.

పూజ: వీరేంద్ర, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. చూడగానే ఎందుకో తెలియదుగాని నచ్చేసావు. ఇప్పటి వరకూ నాకు అందరూ ప్రపోస్ చేసేవాళ్ళు, కాని ఇప్పుడు నేను నా లైఫ్‌లో మొదటిసారిగా నీకే ప్రపోస్ చేస్తున్నాను.

వీరు: పూజిత, నేను 2 years నుండీ ఒకరిని ప్రేమిస్తున్నాను, తను కూడా నన్ను ప్రేమిస్తుంది. ఇద్దరం త్వరలో పెళ్ళి కూడా చేసుకుందాం అనుకుంటున్నాం.

పూజిత: నువ్వు ఒక అందగత్తెను మిస్‌చేసుకుంటున్నావు. (కొంచెం సీరియస్‌గా)

తను నా కంటే అందంగా ఉంటాదా? (కొంచెం బాధగా)

వీరు: తను నీ అంత అందంగా ఉండదు కాని అందంగా ఉంటాది.

పూజిత: అర్ధం కాలేదు (confusion lookతో )

వీరు: తను చూడడానికి అందంగా నీలాగ ఉండకపోవచ్చు, కానీ మనసు పరంగా మాత్రం నీ కంటే చాలా రెట్లు అందంగా ఉంటుంది.

పూజిత: సోరీ వీరేంద్ర. నాకు కొంచెం పొగరు అని అందరూ అంటే, నాకు పొగరు ఏమిటి అనుకునేదాన్ని కానీ ఇన్ని రోజులు ఎంత పొగరుగా అందరితో బిహేవ్‌చేసానో తలుచుకుంటే బాధగా ఉంది.

(పూజిత స్వతహాగా మంచిదే, కాని తన తల్లి తనని అలా పెంచింది. తన తల్లిని కొంచెం డబ్బులు ఉన్న వ్యక్తిని పెళ్ళి చేసుకునే సరికి కొంచెం డబ్బులు ఉన్నాయన్న గర్వం పెరిగి తోడబుట్టినవాళ్ళను కూడా సరిగ దగ్గరకు రానిచ్చేది కాదు. పూజితకి పూర్తిగా గర్వం, పొగరు లేవు కానీ, అప్పుడప్పుడూ అలా గర్వం ప్రదర్సిస్తుంటుంది అంతే.. సోది ఎక్కువ అవుతున్నట్టుంది, ఇక కథలోకి వెళదాం.)

పూజిత అలా అనేసరికి, పూజితతో

వీరు: పూజిత, నువ్వు స్వతహాగ మంచిదానివే అది నేను నువ్వు జాయిన్ అయిన రోజే గమనించా. కానీ ఎవరన్నా నువ్వు చెప్పినదానికి 'నో' అనిగాని, 'కాదు' అనిగాని చెబితే సహించలేవు. అప్పుడే నీలో దాగి ఉన్న పొగరు, గర్వం బయటకు వచ్చేస్తాయి.

పూజిత: ...ఏదో చెబుదాం అనుకుంటుంటే మద్యలో వీరు ఆపి తను చెప్పాలనుకున్నది చెబుతాడు.

వీరు: పూజిత నేను నిన్ను ప్రేమించలేను, కానీ నీతో స్నేహం చేస్తా, ఒక friend లాగ ఉంటా. ఎందుకంటే అది ఇప్పుడు చెప్పలేను, తరువాత సమయం వచ్చినప్పుడు చెబుతా. అంతవరకూ నన్ను ఏమీ అడగకు, నీకు ఎటువంటి సహాయం కావాలన్నా ఫీల్ అవ్వకుండా అడుగు.

"Please don't bring this incident in future. this will ruin our friendship. Be my best friend forever" అని చెప్పి

వీరు: "ఇక వెళదాం పద, ఇప్పటికే చాలా సమయం అయ్యింది మన work break time అయ్యి". తొందరగా వెళ్ళాలీ, లేదంటే టీంలీడ్, మేనేజర్, HR jobs పోతాయి.

పూజిత: వాళ్ళ jobs ఎందుకు పోతాయి? ( confusion lookతో)

వీరు: కొత్తగా వచ్చిన నీతో నేను project work చేయించకుండా cafeteriaలో ఉంటే CCTVలో చూసిన CEO HRని అడుగుతారు, HR మేనేజర్‌ని అడుగుతారు, మేనేజర్ టీంలీడ్‌ని అడుగుతారు, టీంలీడ్‌కి చెప్పటానికి సమాధానం లేదు. సో ముగ్గురి jobs పోతాయి. నా వల్ల ఒకరికి మంచి జరగకపోయినా పర్లేదు, ఒకరికి నష్టం జరగకూడదు.

ఫూజిత: నిజంగా పోతాయా? (చిన్నపిల్లలా అడుగుతుంది)

వీరు: జోక్ చేసా. పద అసలే చాలా సమయం అయింది వచ్చి. ఒక కప్పు కాఫీ తాగి గంట కూర్చున్నాడు అనుకుంటాడు బిల్లింగ్ కౌంటర్లో ఉన్న అతను (అని నవ్వుతూ చెబుతాడు.)

పూజిత విరాకి చెల్లెలు అవుతుంది అని వీరుకి విరా కొన్నిరోజుల ముందే చెబుతుంది, అలాగే పూజిత ఆఫీస్‌లో జాయిన్ అయిన రోజు విరా వీరూతో

విరా: వీరూ పూజితతో మన విషయం చెప్పకు, తనకు తెలిస్తే ఇంటిలో వాళ్ళ అమ్మ గోల గోల చేస్తాది అలాగే మన పెళ్ళి కూడా సజావుగా జరగనివ్వదు.

వీరు: నాకు అర్ధం అయ్యింది, నువ్వు ఏ మాత్రం కంగారు పడకు.

విరా: ఇంకొక విషయం, మనం ఆఫీస్‌లో తక్కువగా మాట్లాడుకుందాం, దానికి తెలిస్తే అదొక తలకాయనొప్పి. అంతగా ఎమన్నా ఉంటే మన casual spotకి వచ్చేయ్.

వీరు: సరే.

పూజిత వీరూకి ప్రపోస్ చేసే కొన్ని నిమిషాల ముందు

విరా: వీరూ పూజిత నిన్ను చూసే చూపులో ఏదో తేడా ఉంది. నాకు ఎందుకో అది నిన్ను ఇష్ట పడుతుంది అని నా ఫీలింగ్.

వీరు: (జోవియల్‌గా) తను ప్రపోస్ చేస్తే ఓకే చెప్పేస్తా, ఎలాగోలా తనని ఒప్పించి ముగ్గురం పెళ్ళి చేసుకుందాం. ఒకేనా?

విరా: అలా అయితే నీ కోసం తనని నీకు ఇచ్చేసి నేను నీ కౌగిలిలో నా శ్వాస వదిలేస్తా. (unconditional love వల్ల అలా అంటూ ఏడుస్తుంది)

వీరు: పిచ్చిదానా, నువ్వు లేక పోతే నేను ఉంటానా. నువ్వు లేవన్న మరుక్షణం నా శ్వాస అగిపోతాది గుర్తుంచుకో. నేను ఏదో సరదాకి అంటే ఇలా అంటావా. నా గురించి నీకు తెలియదా?

విరా: తెలుసు, కానీ ఎందుకో నువ్వు తనని ఇష్టపడతున్నావేమో అని అనిపించి అలా అన్నా. నీకు నచ్చింది నేను ఎప్పుడన్నా వద్దనలేదు కదా.

పూజిత మంచిగా మారడం జరిగిన కొన్ని నెలలకు వీరూ, విరా ఒక project పని మీద గోవా వెళతారు. ఎప్పుడు వీళ్ళు ఇద్దరూ వేరే placeకి project పని మీద వెళ్ళినా మోహిని కూడా వాళ్ళతో వెళుతుంది. కానీ, ఈ సారి ఒకరోజు తరువాత వేళుతుంది.​
Next page: Update 02