Update 06

రోహిణి, ఆదిత్య నీ పొడిచిన దృశ్యం గుర్తుకు వచ్చి నిద్ర లేచి గట్టిగా అరిచింది, దాంతో ఆదిత్య రజిత ఇద్దరు కలిసి లోపలికి వెళ్లి చూశారు అక్కడ లైలా రోహిణి నీ ఓదార్చాలీ అని చూసింది, కానీ రోహిణి ఇంకా బాధగానే ఉంటే ఆదిత్య, లైలా నీ బయటకు వెళ్లమని చెప్పాడు, దాంతో రజిత, లైలా ఇద్దరు కలిసి బయటకు వెళ్లారు అప్పుడు ఆదిత్య బెడ్ మీద కూర్చుని ఉన్నాడు, అతని ఛాతీ మీద ఉన్న గాయం చూసి దాని తాకింది రోహిణి ఆమె స్పర్శ తగలగానే ఆదిత్య కీ చల్లని వెన్న పూసినట్టు అనిపించింది. దాంతో రోహిణి ఆదిత్య కీ దగ్గరగా జరిగి అతనికి ఛాతీ మీద ముద్దు పెట్టింది.

అలా రోహిణి పెదవి స్పర్శ తగలగానే ఆదిత్య కీ ఒక్కసారిగా నరాలు మొత్తం జివ్వుమని లాగాయి "మనం ఎప్పటికీ ఒకటిగా బ్రతికలేమా ఆది ఎందుకు ఎప్పుడు విధి మన తలరాత లో ఆడుకుంటుంది ప్రతి జన్మలో మనలో ఒకరు చావాల్సిందేనా" అని ఆది నీ గట్టిగా కౌగిలించుకున్ని ఏడుస్తూ చెప్పింది, దాంతో ఆదిత్య, రోహిణి నీ ఇంకా దగ్గరికి లాక్కుని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి "విధి లిఖితం దాని మనం మార్చలేము అది ఎలా రాసి ఉంటే మన జీవితం కూడా అలాగే సాగుతోంది కానీ సంకల్పం ఉన్న చోట విధి కూడా తల వంచక తప్పదు, నేను కూడా అలిసి పోయాను రోహిణి ఈ అమరత్వం తో ఎన్నో సాధించుకున్నాను కానీ నేను ఒంటరిని ప్రతి క్షణం గుర్తుకు వస్తుంటే నేను మాత్రం ఎందుకు ఈ జీవిత చెరసాలలో పడి మగ్గిఫోతున్నాను అని రోజు నరకం గా ఉంది, మనిషి కీ వంద సంవత్సరాల జీవితం అవసరం లేదు రోహిణి మనం ఈ క్షణం సంతోషంగా బ్రతికిన చాలు కానీ వంద సంవత్సరాల పైన అమరత్వం తో బ్రతకాలి అంటే అంతకు మించిన నరకం లేదు అమరత్వం వరం కాదు శాపం అది రుచి చూసిన వాడికే దాని బాధ తెలుస్తుంది, ఒక వేళ నేను ఈ నరకం నుంచి నీ చేతిలో విముక్తి పొందాలని రాసి ఉంటే నేను సంతోషంగా స్వీకరిస్తా" అని చెప్పాడు ఆదిత్య.

దాంతో రోహిణి, ఆదిత్య వైపు చూసి అతని పెదవి పైన గట్టిగా ముద్దు పెట్టింది, దాంతో ఆదిత్య కూడా రోహిణి నీ గట్టిగా కౌగిలించుకున్నాడు తన పెదవుల మధ్య రోహిణి పెదాలు పెట్టి పెదాలు జుర్రుకుంటు ఉన్నాడు, అలా ఫ్లయిట్ ల్యాండ్ అయ్యే వరకు ఇద్దరు పెదాలతో యుద్ధం చేసుకున్నారు.

ఆ తర్వాత ఫ్లయిట్ ల్యాండ్ అయిన తర్వాత కార్ లో వెళుతూ ఉండగా "మనం ఎక్కడికి వెళ్లాలి" అని అడిగింది రజిత, దాంతో రోహిణి కళ్లు మూసుకుని ఆలోచిస్తూ ఉంది అప్పుడు తనకు కొన్ని దృశ్యాలు కనిపించాయి "అపోలో టెంపుల్" అని చెప్పింది, దాంతో వాళ్లు అపోలో టెంపుల్ కీ వెళ్లారు అక్కడ మొత్తం శిధిలమైన ఆ కట్టడం నీ చూసి లైలా "ఏంటి ఇది టెంపుల్ అన్నారు ఇలా శిధిలం అయింది" అని అడిగింది, దానికి రజిత "ఇది అపోలో టెంపుల్ అంటే గ్రీకు వాళ్లు సూర్యుడిని అపోలో అని పిలుస్తారు అతని కోసం కట్టిన గుడి 6000bc లో ఇక్కడ రెండు పెద్ద రాజ్యాల మధ్య పెద్ద యుద్ధం జరిగింది, ఆ యుద్ధంలో ఈ గుడి శిధిలం అయ్యింది" అని చెప్పింది, అప్పుడు లైలా "హేయ్ ఇది Trojan war కదా మా కాలేజ్ లో ఈ యుద్ధం గురించి కథ ఉంది" అని చెప్పింది.

ఈ లోగా రోహిణి అస్తమిస్తున్న సూర్యుడి నీ చూస్తూ ఉండగా రెండు స్తంభాలు మాత్రం కలుస్తు ఒక పాయింట్ లో ఆగి ఉన్నాయి, దాంతో అదే స్పాట్ అని వెళ్లి చూస్తే అక్కడ రోహిణి అడుగు పడిన వెంటనే ఒక్కసారిగా భూమి కంపించింది అలా ఒక సొరంగం తెరుచుకుంది అలా లోపలికి వెళ్లి చూస్తే అక్కడ ఒక చనిపోయి ఎండిపోయిన చెట్టు ఉంది, ఆ చెట్టు దగ్గరికి వెళ్లి తన కళ్లు మూసుకుని తన చేతిని ఆ చెట్టుకు తాకించింది రోహిణి దాంతో ఆ చెట్టు కీ ఒక్కసారిగా ఆకులు పూసాయి, ఆ తర్వాత ఆ చెట్టు తన కొమ్మలు రెండు ముందుకు చాచి ఒక ఖడ్గం నీ తీసి అది రోహిణి కీ ఇచ్చి అది రాలి పోయింది.

ఆ తర్వాత అందరూ బయటకు వచ్చారు వాళ్లు బయటకు రాగానే పున్నమి చంద్రుడు ఎర్రని మిరప కాంతి లో ఉన్నాడు, అప్పుడే ఆదిత్య కీ ఎవ్వో అరుపులు వినిపిస్తున్నాయి ఏంటి అని తన telepathy ద్వారా చూస్తే తమ వైపు కొన్ని వందల Fayes లు పరిగెత్తుతూ వస్తున్నాయి, అప్పుడే వాళ్లకు ఎదురుగా షాజియా నడుస్తూ వస్తూ తన చేతిలో ఓంకార్ నీ ఈడుస్తూ వచ్చి విసిరి పడేసింది, దాంతో రజిత వెళ్లి ఓంకార్ నీ పరిశీలిస్తూ ఉంటే తన షర్ట్ లోపల ఉన్న కత్తి తీసి రజిత గుండెల్లో పోడిచి తనను కాలి తో కొట్టి, షాజియా వైపు తిరిగి ఒక మోకాలి పైన నిలబడి "అజ్ఞా మహారాణి" అని అన్నాడు, దాంతో షాజియా తన కత్తి తో గాలిలోకి చూపింది దాడి చేయండి అన్నట్టు సైగ చేసింది, అలా అప్పుడు Fayes నీ ఒక్కసారిగా దాడి చేశాయి ఆదిత్య మెరుపు లాగా వాటి మీద దాడి చేసి అందరినీ చంపుతు ఉన్నాడు, అలా ఉండగా రోహిణి కీ తన psychic పవర్స్ గురించి పూర్తి అవగాహన వచ్చి తన పవర్ తో Fayes మీద మెరుపు దాడి చేస్తుంది, ఆదిత్య నీ ఆపాలి షాజియా సైగ చేసింది దాంతో మాస్టర్ గాలిలో ఎగురుతు వచ్చి ఆదిత్య గొంతు నీ పట్టుకొని గాలిలోకి లేపి పట్టుకున్నాడు.

మిగిలిన Fayes అని రోహిణి నీ, లైలా నీ భందించారు అప్పుడు షాజియా తన కత్తి తో రోహిణి తల లేపి చూస్తూ "అచ్చం నా కూతురు పోలికలు నీలో కొట్టు వచ్చినట్టు తెలుస్తున్నాయ్, మీ అందరి రక్తం చల్ల బడటం, మీ భయం నాకూ తెలుస్తోంది, నిన్ను ఇప్పుడే చంపను నీ ప్రియుడిని చంపిన తరువాత నీ సంగతి చూస్తా" అని చెప్పి మాస్టర్ వైపు చూసి ఆది నీ చంపేయ్ అన్నట్టు సైగ చేసింది, అప్పుడు మాస్టర్ ఆది పీక పట్టుకొని విరచాలి అని చూశాడు.

అప్పుడే ఒక నీడ వేగంగా వచ్చి మాస్టర్ ఛాతీ మీద తన పంజా తో గట్టిగా దెబ్బ వేసి మాయం అయ్యింది, అది చూసిన షాజియా వెళ్లి మాస్టర్ నీ చూస్తే అతని ఛాతీ మీద లోతు గోళ తో ఏదో మృగం దాడి చేసినట్లు ఉంది, "వాడు వచ్చాడు వాడు వచ్చాడు అమ్మి నాకూ భయం వేస్తుంది" అని అన్నాడు, అప్పుడే షాజియా ఎవరూ తన కొడుకును భయపెట్టింది అని చూస్తే అక్కడ ఎదురుగా ఒక భారీ ఆకారం తన పంజా నుంచి కారుతున్న రక్తం తో చంద్రుడి నీ చూసి గట్టిగా ఊళ వేస్తూ నిలబడి ఉంది.

మాస్టర్ ఛాతీ మీద గాయం చేసిన శ్రీను గట్టిగా ఊళ వేశాడు అప్పుడు హటాత్తుగా ఆ చుట్టుపక్కల ఉన్న కొండల లో నుంచి తోడేలు ఒక్కసారిగా వచ్చి Fayes ల పైన దాడి చేశాయి, తన చుట్టూ ఏమీ జరుగుతుందో అర్థం కాక చుట్టూ చూస్తూ నిలబడింది షాజియా "మాస్టర్ ఎవరు వీడు ఎందుకు సంబంధం లేని చోట వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు" అని చిరాకు గా తన మీదకు వచ్చిన ఒక తోడేలు నీ తన కత్తి తో నరికి అడిగింది షాజియా, దానికి మాస్టర్ "వీడే అమ్మి నన్ను చంపింది నాకూ భయం వేస్తుంది అమ్మి" అని మాస్టర్ చెప్పిన వెంటనే వాడిని తన కత్తి తో వాడి తల నరికి "పిరికి పంద నాకూ ఎలా పుట్టావు రా" అని చెప్పి వాడికి అమర్చిన ఆది గుండెను బయటికి తీసింది షాజియా, మాస్టర్ కీ ఆది గుండె ను పెట్టడం వల్ల శ్రీను కొట్టిన పంజా దెబ్బ ఆదిత్య కీ కూడా తగిలింది రోహిణి ఆది కీ తగిలిన గాయం నీ పరిషిలిస్తూ ఉండగా, శ్రీను వాళ్ల దగ్గరికి వచ్చాడు "మీరు underground లోకి వెళ్లండి నేను వీళ్ల సంగతి చూసుకుంటాను" అని అన్నాడు శ్రీను, అప్పుడు అతని గొంతు విన్న రోహిణి అది ఇన్ని రోజులు పాటు తనను గైడ్ చేసిన గొంతు అదే అని గుర్తు పట్టింది "నువ్వే కదా ఇన్ని రోజులు నాతో మాట్లాడింది" అని అడిగింది రోహిణి, దానికి శ్రీను ఇప్పుడు చెప్పే టైమ్ లేదు ఆది నీ సేఫ్ గా తీసుకోని వెళ్లు" అని శ్రీను మాట పూర్తి కాక ముందే ఓంకార్ వచ్చి శ్రీను మీద పడ్డాడు, దాంతో శ్రీను, ఓంకార్ నీ కాలుతో కొట్టి వాడు గాలిలో ఉండగానే వాడి మెడ పట్టుకొని విరిచి పడేసి "స్నేహం లో ద్రోహం ఉండకుడదు రా ద్రోహి" అని అన్నాడు, ఈ లోగా రోహిణి ఎగురుతు వచ్చి శ్రీను కాలు దెగ్గర పడింది, చూస్తే షాజియా తన చేతిలో ఉన్న గుండె ను ఆదిత్య కీ పెట్టింది, ఆ గుండె ఆదిత్య కీ అమర్చిన వెంటనే అతని లోకి దుష్ట శక్తులు ఆవహించాయి "భయం తో ఉండే రాజు కంటే ధైర్యంగా అడుగు వేసే దళపతి చాలు ఆదిత్య నా దళపతి గా నీ పని నీ నువ్వు చెయ్యి" అని చెప్పింది.

దాంతో ఆదిత్య కళ్లు ఎర్రగా మారాయి, అతనికి రెక్కలు కూడా వచ్చాయి అతను అరిచిన అరుపుకీ అక్కడ ఉన్న రాళ్లు కూడా విరిగి ముక్కలు గాలిలోకి ఎగిరి అందరి మీద పడాయి, దాంతో అందరూ ఒక్కసారిగా పరుగులు పెట్టారు, దాంతో శ్రీను Werewolf లాగా మారి ఆ రాళ్లను బద్దలు కొట్టి లైలా నీ వెళ్లిపో అని చెప్పాడు, కానీ తను పోరాడుతాను అని చెప్పి Fayes లని చీల్చి చెండాడింది, దాంతో భయంకరమైన డ్రాకులా లాగా మారిన ఆదిత్య నీ చూసి రోహిణి ఏడుస్తూ ఉంది అప్పుడు శ్రీను, రోహిణి దగ్గరికి వచ్చి వాళ్లు కష్టపడ్డి కనిపెట్టిన ఖడ్గం నీ తీసుకోని వచ్చి "ఇదే విధి యొక్క చివరి మలుపు నువ్వు తనని ఇప్పుడు కాపాడాలని చూసిన కూడా నీ వల్ల కాదు అతను చెప్పింది గుర్తు ఉంది గా తనకు విముక్తి ఇవ్వు, వేరే ఎవరి చేతిలోనో బాధాకరం గా చనిపోవడం కంటే నీ చేతిలో అతను చస్తే కనీసం ప్రశాంతంగా కన్నుమూస్తాడు" అని చెప్పి రోహిణి కీ ఆ ఖడ్గం ఇచ్చి తన వైపు వస్తున్న షాజియా వైపు దూసుకొని వెళ్లాడు శ్రీను.

షాజియా తన కత్తి తో శ్రీను నీ చంపాలి అని చూసి అతని పైన కత్తి దూసింది అప్పుడే మరో వైపు నుంచి ఆదిత్య కూడా శ్రీను పైన దాడి చేశాడు దాంతో శ్రీను Werewolf లాగా మారి తన కుడి చేత్తో ఆదిత్య గొంతు పట్టుకుని తన మీద పడుతున్న షాజియా కత్తి కీ తన చెయ్యి అడ్డుగా పెట్టాడు, అది వెండి కత్తి కావడంతో శ్రీను కీ కాలింది, అప్పుడే రోహిణి తన శక్తి తో ఆదిత్య నీ వెనకు లాగేసిందీ ఒక చేత్తో కత్తి పట్టుకొని ఇంకో చేత్తో మెరుపులు పుట్టించి ఆదిత్య పైన వేసింది రోహిణి, దాంతో శ్రీను తన పిడికిలి బిగించి షాజియా నీ బలంగా ఒక్క గుద్దు గుద్దాడు, దాంతో షాజియా ఎగిరి వెళ్లి పడింది కానీ శ్రీను కీ ఇంకా చెయ్యి నొప్పి గా ఉంది అప్పుడే నెల మీద పాకుతు వచ్చిన రజిత, శ్రీను కాలు పట్టుకొని "సామ్రాట్ నీ గురించి శేషు చెప్పాడు మాకు సహాయం చేయడానికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది నన్ను విముక్తి చేసి నా శక్తులు కూడా తీసుకోని తనని ఒడించు" అని చెప్పింది రజిత, దాంతో శ్రీను కన్నీళ్లు ఆపుకొని రజిత నీ కొరికి తన శక్తులు లాక్కుని "సారీ" అని చెప్పి షాజియా మీదకు వెళ్లాడు, అలా షాజియా నీ మళ్లీ ఒక గుద్దు గుద్దితే షాజియా భూమిలో కీ రెండు అడుగుల లోతు లోకి దిగింది.

రోహిణి తన psychic పవర్ తో ఆదిత్య మనసులోకి వెళ్లి అతనికి తన మీద ఉన్న ప్రేమ ను అనుభూతి చెందింది, కానీ అతని మనసు కూడా నన్ను విముక్తుడిని చెయ్యి అని కొరికింది, దాంతో రోహిణి తన కళ్లు తెరిచి ఆదిత్య నీ తన శక్తి తో తన వైపుకు లాగి అతని గుండె లో కత్తి తో పొడిచింది అతని శరీరం కీ పగుళ్లు ఏర్పడ్డాయి, అప్పుడే శ్రీను చెయ్యి చాచ్చాడు దాంతో రోహిణి ఆ ఖడ్గం నీ శ్రీను కీ విసిరింది అప్పుడు షాజియా, శ్రీను మీదకు వస్తుంటే శ్రీను ఆ ఖడ్గం తో షాజియా గొంతు లో దూర్చి ఆమె తలను కత్తి తో పీకాడు, అది చూసిన రోహిణి తన పవర్ తో Fayes నీ అందరినీ మోకాలి పైన కూర్చోబేటింది.

తరువాత ఆదిత్య దగ్గరికి వెళ్లి చూస్తే "మనకు విధి ఏ జన్మలో రాసి లేదు రోహిణి నన్ను విముక్తి చేసినందుకు చాలా థాంక్స్" అని చెప్పి ఆదిత్య బూడిద గా మారి గాలిలో కలిసి పోయాడు.

షాజియా నీ చంపినా తరువాత శ్రీను, ఆదిత్య బాడీ నీ భుజానికి వేసుకొని తిరిగి న్యూయార్క్ కీ వెళ్ళాలి అని చెప్పాడు, ఆ తరువాత అందరు తిరిగి న్యూయార్క్ చేరుకున్నాక ఆదిత్య నీ దహనం చేసారు.

ఆ తరువాత శ్రీను రోహిణి తో మాట్లాడుతూ "నీ ప్రేమను నీ చేత్తో నాశనం చేయడం నిజంగా చాలా బాధగా ఉంటుంది అని నాకు తెలుసు కానీ విధి అనుసారం మనకు వేరే దారి లేదు రోహిణి" అని చెప్పాడు, అప్పుడు రోహిణి "అసలు ఎవ్వరు నువ్వు నాకు ఎందుకు ఎప్పుడు నీ గొంతు వినిపించేది" అని అడిగింది. దానికి శ్రీను "నా పేరు శ్రీయనివాస్ నేను ఒక werewolve నాకు ఈ మాస్టర్ కీ ఇంతకు ముందే ఒకసారి యుద్ధం జరిగింది, కానీ వాడిని నా మేనమామ భద్రపరిచి ఒక experiment చేసి వాడి నుంచి శక్తి తీసుకొని రష్యా వాళ్లకు ఆ పవర్ అమ్మి మొత్తం ప్రపంచాన్ని తన గుపెట్లో పెట్టుకోవాలి అని కళలు కన్నాడు, నేను దానికి బ్రేక్ వేసాను ఆ తరువాత నేను కొంచెం రీసెర్చ్ చేస్తే నాకు vampires లో ఇంకో తెగ కూడా ఉంది అని అది కూడా అతి పురాతన తెగ అని తెలిసింది, దాంతో రెండు సంవత్సరాలుగా అన్వేషిస్తే నాకు ఈజిప్ట్ లో ఒక బుక్ దొరికింది అదే blood keeper బుక్ దాంట్లోనే ఈ vampires కీ ఉన్న telepathy పవర్ నీ psychic పవర్ గా కూడా వాడొచ్చు అని తెలుసుకున్న, ఆ తరువాత ఆ psychic పవర్ ఉన్న వాళ్ళ కోసం నేను వెతికితే నాకు ఆ జపాన్ లో బుడ్డోడు దొరికాడు, వాడిని మాస్టర్ రెండో ప్రపంచ యుద్ధం లో వాడిని vampire గా మార్చాడు, దాంతో ఆ పిల్లాడు కూడా vampire గా ఉంటూ దానికి ఒక మందు కనిపెట్టాలి అని psychic పవర్స్ నీ బాగా అభివృద్ధి చేసుకున్నాడు, ఆలా వాడితో కలిసి బ్లడ్ కీపర్ వారసులు ఎవరు అని ఎంక్వయిరీ చేస్తే నీ గురించి తెలిసింది, ఆ తరువాత నినుమేము అన్వేషిస్తూ నీతో psychic లో కనెక్ట్ అయ్యి ఉన్నాం, అందుకే నీకు ప్రతి సరి నీ శక్తి నీకు తెలియాలి అని చెప్పి నిన్ను కొన్ని సార్లు భయపెట్ట కూడా దానికి సారి" అని చెప్పాడు శ్రీను .

"ఇప్పుదు ఆదిత్య లేడు నేను చనిపోవడం చూసి నా కోసం ప్రాణ త్యాగం చేసుకున్న గొప్ప ప్రేమికుడు, తరువాత ఈ నరకం నుంచి విముక్స్తి చెందండం కోసం నా చేతిలోనే ప్రాణాలు వదిలాడు, ఇంకా నాకు ఇక్కడ ఏమి పని నేను తిరిగి వెళ్లిపోతా" అని చెప్పింది రోహిణి.

దానికి శ్రీను "ఆదిత్య కీ ఇక్కడ చాలా పలుకుబడి ఉంది తనకు ఏమైనా జరిగితే నీకు ఈ ఆస్థి వారసత్వం చెందాలి అని వీలునామా రాసి ఇచ్చాడు, ఇక పైన ఈ ఆస్థి అంత నీ బాధ్యత, అతను ప్రారంభించిన పనులు అన్ని నువ్వు కొనసాగించు" అని చెప్పాడు శ్రీను, దానికి రోహిణి "నాకు ఇంత పెద్ద కంపెనీ నీ నడిపించే శక్తి లేదు శ్రీను, అనవసరంగా ఆదిత్య కష్టపడి నిర్మించుకున్న ఈ సామ్రాజ్యం నీ నేను పేకమేడ లాగా కూల్చి నాశనం చేస్తాను"అని బాధగా చెప్పింది రోహిణి, "రెండు రోజుల ముందు వరకు నీ శక్తి ఏంటో నీకే తెలియదు రోహిణి ఇప్పుడు కూడా నీ శక్తి నీ నమ్ము ప్రయాణం ఎప్పుడైనా ఒక్క అడుగు తోనే మొదలు అవుతుంది, కాబట్టి భయం వీడు ముందు అడుగు వెయ్యి నీతో పాటు నీ వెళ్ళమంది కార్మికులను ముందుకు నడిపించు, ఆడితే నీ కోసం తిరిగి వస్తాడు అప్పటి వరకు నీకు ఈ యవ్వనం మాసిపోదు" అని చెప్పి రోహిణి ఒక షాక్ హ్యాండ్ ఇచ్చి అక్కడి నుంచి తిరిగి ఇండియా కీ వెళ్ళాడు శ్రీను.

ఇండియా కీ తిరిగి వచ్చిన తరువాత స్వప్న,పద్దు ఇద్దరు కలిసి చేరి ఒక బెల్ట్ తో శ్రీను నీ కొడుతూ ఉన్నారు "నా కొడకా నీ పెళ్ళని నెలలు నిండి పాపం అది అవస్థలు పడుతుంటే నువ్వు ఎమ్మో ప్రపంచం పట్టుకొని పోతావా, రెండు సంవత్రసారాలా నుంచి మాట లేదు సమాచారం లేదు" అని చెప్పి కొడ్తూ ఉంటే, "అత్తమ్మ నా పేరు చెప్పి ఇంకో నాలుగు దెబ్బలు నీ పుట్టే మనవడు,మనవరాలు పేరు చెప్పి ఇంకో నాలుగు కొట్టు" అని అరుస్తూ ఉంది పద్దు, అప్పుడే స్వప్న కీ శ్రీను కీ మధ్య ఒక కత్తి వచ్చి పదినిది అది విసిరింది లీలా "పెద్దమ్మ అన్నయ ఏమి చేసిన ఒక కారణం ఉంటుంది కాబట్టి నన్ను దాటి వేళ్ళు" అని చెప్పింది.

దాంతో స్వప్న అలిసిపోయి సోఫా లో కూర్చొని ఉంటే శ్రీను మెల్లగా ఆమె దెగ్గరికి వెళ్లి "మై డియర్ మదర్ నేను వెళ్ళింది పెద్ద సమస్యనే అప్పడానికి దాని ఇప్పటికి అయితే ఆపాను చూడాలి మళ్లీ భవిష్యత్తులో ఇంక ఎలాంటి సమస్య ఉండదు అని అనుకుంటున్న" అని చెప్పి స్వప్న కాలు ఒత్తుతూ ఉన్నాడు, ఆ తరువాత పద్దు వచ్చి శ్రీను నీ చూస్తూ సోఫాలో పక్కనే కూర్చొని శ్రీను వైపు బిర్రుగా చూస్తూ కూర్చుంది, దాంతో శ్రీను వెళ్లి "ఓకే శ్రీమతి గారు క్షమించండి మనం ఎలాగో పరుగులు పెడుతున్నాం, కనీసం మన బిడ్డ అయ్యిన ఒక ప్రశాంతమైన సమాజం లో పెరగాలి అని అనుకుంటున్నా, దాని కోసమే ఇన్ని రోజులు నీకు ముఖ్యం అయినా సరే నేను నిన్ను వదిలి దూరంగా ఉండాల్సి వచ్చింది" అని చెప్పాడు, దాంతో పద్దు, శ్రీను నుదిటి పైన ముద్దు పెట్టి గట్టిగా కౌగిలించుకుంది.

(కొన్ని సంవత్సరాల తరువాత)

రోహిణి తన ఆఫీస్ నుంచి బయటకు వస్తుంటే ఒక కుర్రాడు చేతిలో పువ్వులు పట్టుకొని ఒక skateboard మీద వెళుతూ ఉంటే అతని చూసి అలాగే ఆగిపోయి ఉంది, అప్పుడు అతను పక్కకు చూస్తూ వచ్చి అనుకోకుండా రోహిణి కీ డాష్ ఇచ్చి ఇద్దరు కింద పడ్డారు అప్పుడు రోహిణి బాడీగార్డ్స్ వచ్చి వాడిని కొట్టాలి అని చూసి ఆగిపోయారు ఎందుకురా నాటే వాడు అచ్చం ఆదిత్య లాగే ఉన్నాడు, దాంతో అతని చూసి రోహిణి తన కార్డు ఇచ్చి కలవమని చెప్పింది.

పద్దు కీ శ్రీను ఒక కొడుకు, కూతురు పుట్టారు ట్విన్స్ కానీ వాళ్లలో ఒకరికి మాత్రమే పవర్స్ ఉన్నాయి అని తెలిసింది కానీ ఆ పవర్స్ ఉన్న ఆ ఒక్కరు ఎవరు అని ఇంక తెలియాల్సి ఉంది.

(The end ???)​
Previous page: Update 05
Previous article in the series 'పున్నమి': పున్నమి1 - 2