Update 02

ప్రమాణ స్వీకారం తరువాత సిద్ధార్థ కంట్లో నీరు చూసి మధు "మీ నాన్న గుర్తుకు వచ్చాడా మీ నాన్న కల నిను ఇలా చూడటం కానీ తను అనుకున్న స్థాయి కంటే ఇంకా పైకి ఎదిగావ్ అందుకు చాలా గర్వంగా ఉంది రా సారీ సార్" అని సిద్ధార్థ నీ తీసుకొని వెళ్లాడు బయట కార్ లో ఇంటికి వెళుతుండగా కార్ కిటికీ నుంచి చూస్తే సంధ్య మోకాలి పైన నిలబడి సిద్ధార్థ వైపు చూస్తూ చేతులు చాచి రా అని పిలిచినట్టు అనిపించింది దాంతో వెంటనే కార్ లో నుంచి దూకి పరుగున వెళ్లి సంధ్య నీ కౌగిలించుకోవాలి అని చూశాడు కానీ అది అంత తన భ్రమ అని తెలిసి కొంచెం దిగులు గా కార్ వైపు వెళుతు తిరిగి వెనకు చూశాడు అప్పుడు సంధ్య ఒక flying kiss ఇచ్చి మాయం అయిపోయింది ఆ తర్వాత సిద్ధార్థ కార్ కూర్చొని తన చేతికి సంధ్య పెట్టిన ఉంగరం చూస్తూ ఉండిపోయాడు ఇంటికి వెళ్లిన తర్వాత సంధ్య ఫోటో ఒకటి ఫ్రేమ్ చేయించి తన బెడ్రూమ్ లో పెట్టాడు సిద్ధార్థ, సంధ్య ఫోటో చూస్తూ అలాగే ఉండిపోయిన సిద్ధార్థ నీ వెనుక నుంచి hug చేసుకొని "సారీ రా" అని చెప్పి బయటకు వెళ్లాడు వినోద్ ఆ తర్వాత సాయంత్రానికి వినోద్, సింగ్ ఇద్దరు కలిసి భోజనం చేస్తూ ఉంటే సిద్ధార్థ వాళ్ళని లోపలికి పిలిచాడు దాంతో ఇద్దరు లోపలికి వెళితే సిద్ధార్థ సంధ్య ఫోటో వైపు చూస్తూ "నాకూ మూడు బీర్లు కావాలి" అని అన్నాడు దాంతో వినోద్ కీ, సింగ్ కీ ఆరి కాలి నుంచి వణుకు మొదలైంది దాంతో వినోద్ "స్ట్రాంగ్ ఆ లైట్ ఆ" అని అడిగాడు దానికి సిద్ధార్థ స్ట్రాంగ్ అన్నాడు దాంతో సింగ్ కీ పాంట్ లోనే పడిపోయింది.

సిద్ధార్థ ఎప్పుడైనా కోపం లో ఉన్న, బాధ లో ఉన్న బీర్ తాగాలీ అనుకుంటే అవతలి వాళ్లకు బ్యాండ్ మొగిపోతుంది వాడు తాగితే అవతల వాళ్ల బాడి కీ football కీ తేడా ఉండదు సిద్ధార్థ కీ దాంతో వేరే దారి లేక వినోద్, సింగ్ నీ పంపి బీర్ తెప్పించాడు దాంతో పాటు సిద్ధార్థ favorite ఫిష్ ఫ్రై కూడా తెప్పించాడు అప్పుడు సిద్ధార్థ బీర్ ఫిష్ ముందు పెట్టుకొని వాటి వైపే చూస్తూ ఉన్నాడు తరువాత వినోద్, సింగ్ వైపు చూశాడు సింగ్ కీ భయం తో హార్ట్ ఎటాక్ వచ్చేలా ఉంది అప్పుడే వంట అతను వచ్చి ఒక ఆమ్లెట్ పెట్టాడు అతని తాగుతావా అని అడిగాడు అతను మొహమాటం తో ఇప్పుడు వద్దు సార్ అన్నాడు, అయితే ఆమ్లెట్ తిను అన్నాడు దానికి వంటవాడు అది మీ కోసం సార్ అన్నాడు దొరికాడూ బకరా అనుకోని వినోద్ "అయితే దాంట్లో విషం కలిపావా" అని అన్నాడు దాంతో వంటవాడు లేదు సార్ అని తినడం మొదలు పెట్టాడు వాడు తినడం పూర్తి అయ్యే లోపు సిద్ధార్థ మూడు బీర్లు లేపేసాడు అప్పుడు తన ముందు ఉన్న వంటవాడిని పట్టుకుని "ఒరేయ్ నాన్న నువ్వు ఒక దేశం కీ ప్రధాని అయితే మాత్రం కన్న కొడుకు కీ అవార్డ్ ఇస్తుంటే రావా " అని లాగి కొట్టాడు దాంతో వినోద్, సింగ్ ఇద్దరు షో స్టార్ట్ అయ్యింది అని డోర్ వెనకు వెళ్లి దాకుని చూస్తున్నారు, "సార్ ఏంటి సార్ అలా కొట్టారు" అని అడిగాడు ఆ వంట అతను దాంతో సిద్ధార్థ మళ్లీ కొట్టి "ఒక అమ్మాయి నచ్చింది అని చెబితే అది మన కులం కాదు అంటావా" అని మళ్ళీ కొట్టాడు దాంతో వినోద్ టాపిక్ ఎక్కడికి వెళుతుందో అర్థం అయ్యింది దాంతో సిద్ధార్థ నీ బెడ్ కీ కట్టెసి handcuffs వేశాడు "నేను ప్రేమించిన అమ్మాయి మన కులం కాకపోతే చంపేస్తావా" అని ఆరిచాడు సిద్ధార్థ అది విన్న వినోద్ ఇంక ఎవరూ వినలేదు కదా అని చూసి డోర్ లాక్ చేసి వెళ్లిపోయాడు.

నిద్రలో ఉన్న సిద్ధార్థ కలలో తన గతం కదలడం మొదలు అయ్యింది.

(ఆరు సంవత్సరాల క్రితం Edinburgh)

తన సొంత చార్టర్డ్ ఫ్లయిట్ లో తన కొత్త కాలేజీ కోసం డిజైన్ చేసిన సూట్ లు చెక్ చేసుకుంటూ ఉన్నాడు సిద్ధార్థ అప్పుడు మధు వచ్చి "నీ styling అయిపోతే నీతో కొంచెం మాట్లాడాలి" అని అన్నాడు దాంతో సిద్ధార్థ "అయిపోయింది ఆల్ఫ్రెడ్ అయిన చిన్నప్పటి నుంచి చూస్తున్న నా కాలేజ్ లో కానీ, కాలేజీ లో కానీ మొదటి రోజు నీ స్పీచ్ లేనిదే మొదలు అవ్వదు కదా" అని తన సూట్ సరి చేసుకుని మధు వైపు చూశాడు, దాంతో మధు సిద్ధు సూట్ సరి చేస్తూ "ఇప్పుడు నువ్వు వెళ్లేది ప్రపంచంలోనే చాలా పేరు ఉన్న యూనివర్సిటీ ఇక్కడి నుంచి గ్లోబల్ లీడర్షిప్ లో certified అయిన వాళ్లు చాలా దేశాల్లో మంచి నాయకులు అయ్యారు కాబట్టి చదువు మాత్రమే కాకుండా ఇతర దేశ ప్రతినిధుల పిల్లల తో కొంచెం Diplomacy maintain చేయి అప్పుడు వాళ్ళు నీకు ఎక్కడో ఒకచోట ఉపయోగ పడతారు" అని చెప్పాడు ఆ తర్వాత ఫ్లయిట్ ల్యాండ్ అయ్యింది అందరూ యూనివర్సిటీ కీ బయలుదేరారు అప్పుడు మధు "ఇది నీ కొత్త సెక్యూరిటీ చీఫ్ details సింగ్ కూడా ఉంటాడు కానీ తన కంటే better person నీకోసం వస్తున్నాడు పైగా ఇంకొక విషయం ఇండియా లో ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ఏ ఎద్దవ పని చేయకుండా జాగ్రత్తగా ఉండు" అని చెప్పాడు వాళ్లు యూనివర్సిటీ కీ చేరుకోగానే అక్కడ మొత్తం అందరూ ప్రెస్ వాళ్లు గేట్ కీ అడ్డం గా ఉన్నారు అందరూ సిద్ధార్థ ఫ్యాషన్ సెన్స్ నీ బాగా మెచ్చుకున్నారు అప్పుడే ఫ్రాన్స్ యువరాణి డోని, తన అన్న మార్కిన్ ఇద్దరు వాళ్ల middle finger మీడియా వాళ్లకు చూపిస్తూ దిగారు వాళ్ళని చూసి సిద్ధార్థ గట్టిగా విజిల్ వేశాడు దానికి మధు, సిద్ధార్థ నీ క్యాంపస్ లోకి తీసుకొని వెళ్లి "ఏమీ చేస్తున్నావ్ be disciplined" అని అన్నాడు, "మనం చేయలేని పని ఎవడైనా చేస్తే encourage చేయాలి ఆల్ఫ్రెడ్" అని చెప్పి తన రూమ్ లోకి వెళ్ళాడు అప్పుడు మధు సింగ్ "బాబు కొంచెం active జాగ్రత్త మీ చీఫ్ సాయంత్రానికి వస్తాడు కమాండో వినోద్ కుమార్" అని చెప్పాడు దానికి సింగ్ "గుప్తా జీ నన్ను ఇద్దరు పిచ్చోల మధ్య ఇరికించారు ఏంటి" అని అన్నాడు అప్పుడే పాకిస్తాన్ ప్రధాని యూసుఫ్ రజా తన కూతురు సోఫియా నీ తీసుకొని వచ్చారు వాళ్ళని చూసిన మధు వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళుతు సింగ్ నీ పిలిచి "ముఖ్యంగా బాబు సోఫియా దగ్గరికి వెళ్లకుండా చూసుకో అసలే మీడియా కళ్లు ఈ క్యాంపస్ చుట్టూ ఉన్నాయి" అని చెప్పి వెళ్లిపోయాడు.

సిద్ధార్థ ఎవరికి తెలియకుండా తన హాస్టల్ కిటికీ నుంచి బయటకు బెడ్ షీట్ తో తాడు కట్టి కిందకి వెళ్లి క్యాంపస్ బయట పార్క్ లోకి వెళ్ళాడు అక్కడ కర్ణాటక సంగీతం వినిపించింది దాంతో అలా వెళ్లి చూస్తే ఒక అమ్మాయి అచ్చు భారతీయ పడుచు పిల్ల ఆ సంగీతం కీ తన కాలి మువ్వల శబ్దం తో జత కట్టి మైమరచి నాట్యం చేస్తూ ఉంటే నెమలి పురి విప్పి నాట్యం ఆడినట్టు అలాగే మైమరచి చూస్తూ ఉండిపోయాడు ఇంతలో సింగ్ వచ్చి సిద్ధార్థ నీ బలవంతంగా లాకుని వెళ్లాడు అక్కడ రూమ్ లో అప్పటికే వినోద్ వచ్చి ఉన్నాడు తనని చూసి సిద్ధార్థ "రేయ్ బావ" అంటు గట్టిగా కౌగిలించుకున్నాడు కానీ వినోద్ సిద్ధార్థ నీ పక్కకు నెట్టి "సారీ సార్ I am your new security chief reporting" అని సెల్యూట్ చేశాడు వినోద్.

వినోద్ అలా తనను పక్కకు తోసే సరికి సిద్ధార్థ కీ చాలా బాధ వేసింది తన చిన్ననాటి స్నేహితుడు అని ప్రేమ తో తనని కౌగిలించుకోవాలి అని చూస్తే తను ఏమో ఇలా రాజు, బంటు భేదాలు చూస్తున్నాడు దాంతో సిద్ధార్థ కీ కోపం వచ్చి తను సోఫా లో కూర్చుని తన కాలు ఎదురుగా ఉన్న టేబుల్ పైన పెట్టి వినోద్ వైపు చిటికె వేసి షూ తీయి అని అన్నాడు దానికి వినోద్ తన చెవిలో ఉన్న Bluetooth disconnect చేసి సిద్ధార్థ దగ్గరికి వచ్చి "నా కొడుకా షూ విప్పాలారా" అని సిద్ధార్థ నీ కొడుతూ ఉన్నాడు దానికి సిద్ధార్థ కూడా "పోనీలే ఫ్రెండ్ వీ కదా అని దగ్గరికి వస్తే పోస్ కొట్టింది ఎవడు రా" అని ఇద్దరు సోఫా లో పడి ఒకరినొకరు సరదాగా కొట్టుకున్నారు అప్పుడే ఎవరో తలుపు కోడితే సింగ్ వెళ్లి తలుపు తీశాడు అప్పుడు కాలేజీ Dean వచ్చి 5 నిమిషాలలో auditorium లోకి రమ్మని చెప్పి వెళ్లిపోయింది దాంతో సిద్ధార్థ తన డ్రస్ మార్చుకోని వచ్చాడు ఆ తర్వాత సింగ్, వినోద్ ఇద్దరు తనను auditorium వైపు తీసుకుని వెళుతుంటే సిద్ధార్థ, డోని, మార్కిన్ నీ చూసి వాళ్ల దగ్గరికి వెళ్లి (ఇక్కడ మన సౌకర్యం కోసం పక్క దేశం వాళ్ల తో కూడా తెలుగులో మాట్లాడిస్తున్న) "హలో మార్కిన్ & డోని మీరు ఇద్దరు ఇందాక చేసినది రియల్లీ చాలా బాగుంది నాకూ చాలా సార్లు అలాగే చేయాలి అనిపించింది కానీ మీకు తెలుసు కదా మా దేశం లో strict parenting అందుకే అలా చేయలేక పోయా కానీ మన ముగ్గురం కలిస్తే ఇలాంటి క్రేజీ స్టఫ్ చాలా చేయవచ్చు" అని తన చెయ్యి ముందుకు చాచి వాళ్ల స్నేహం కోరాడు సిద్ధార్థ దానికి ఇద్దరు చిరునవ్వు తో షేక్ హ్యాండ్ ఇచ్చి సిద్ధార్థ నీ కౌగిలించుకున్నారు.

దాంతో ముగ్గురు ఒక టీం అయ్యారు అలా ముగ్గురు కలిసి auditorium లోకి వెళ్లారు అప్పుడు అక్కడ మరి కొంతమంది దేశ ప్రతినిధుల పిల్లలను చూశాడు సిద్ధార్థ అందులో తనకు ఇంగ్లండ్ యువరాజు విలియమ్స్, పాకిస్తాన్ ప్రధాని కూతురు సోఫియా తప్ప మిగిలిన వారు ఎవరూ తెలియదు అప్పుడు డోని అడిగాడు మిగిలిన వాళ్ల గురించి దాంతో మిగిలిన వాళ్ల గురించి చెప్పింది అందులో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు ఆడాన్సి, డెనిస్ ఇద్దరు మొరాన్కో దేశం యొక్క యువరాజులు ఇంకో అమ్మాయి వాలెంటినా జర్మనీ ప్రెసిడెంట్ చెల్లి ఇలా తనకు కావాల్సిన వారీ గురించి తెలుసుకున్నాడు సిద్ధార్థ అలా Dean వచ్చి కాలేజీ చరిత్ర గురించి స్పీచ్ మొదలు పెట్టింది ఆ తర్వాత క్యాంపస్ టూర్ పెట్టారు అప్పుడు మార్కిన్, డోని ఇద్దరు సిద్ధార్థ తో ఈ బోర్ టూర్ ఎందుకు అలా పక్కకు వెళ్లదాం అని చెప్తే సిద్ధార్థ సింగ్, వినోద్ వైపు చూసి "వినోద్ నువ్వు మన రూమ్ లోకి వెళ్లి నా కెమెరా తీసుకొని రా" అని అన్నాడు దాంతో వినోద్ రూమ్ వైపు వెళ్లాడు సింగ్ కొంచెం భయస్తుడు కాబట్టి వాడిని బెదిరించి ముగ్గురు ఎస్కేప్ అయ్యారు అలా ముగ్గురు కలిసి కాలేజీ పైకి ఎక్కి అక్కడ sunset చూసి గట్టిగా అరిచారూ అప్పుడు మార్కిన్ "సిద్ధార్థ నువ్వు మాలో కలవాలి అంటే ఈ క్రేజీ సరిపోదు నిన్ను నువ్వు నిరూపించుకో" అని అన్నాడు దాంతో సిద్ధార్థ కాలేజీ పైన ఉన్న క్రాస్ వైపు చూసి దాని మీదకు ఎక్కి చేతులు వదిలేసి గట్టిగా అరిచి selfie తీసుకున్నాడు దానికి మార్కిన్, డోని కూడా గట్టిగా కేకలు వేసి సిద్ధార్థ నీ ప్రోత్సాహిస్తున్నారు అలా ఉండగా సడన్ గా సిద్ధార్థ కాలు స్లిప్ అయ్యి కింద పడిపోయాడు అప్పుడు వినోద్, సింగ్ ఇద్దరు పరిగెత్తుతూ వచ్చారు అంతలోనే ఒక అమ్మాయి కాలేజీ హోర్డింగ్ ఒకటి లాగి తీసుకుని వచ్చి సిద్ధార్థ కింద పడకుండా పట్టుకుంది ఆ తర్వాత ఆ అమ్మాయి సిద్ధార్థ నీ లాగి కొట్టింది అప్పుడు చూశాడు ఆ అమ్మాయిని తను ఇందాక పార్క్ లో ఉన్న అమ్మాయి ఆ అమ్మాయి సిద్ధార్థ నీ తీడుతున్న తనకు అవి ఏమీ ఎక్కడం లేదు ఆ అమ్మాయి తప్ప మిగిలిన ప్రపంచం మొత్తం బ్లాంక్ అయిపోయింది సిద్ధార్థ కీ ఆ తర్వాత ఆ అమ్మాయి నడుస్తూ వెళ్లుతుంటే తననే చూస్తూ ఉండిపోయాడు.

నిద్ర లో ఉన్న సిద్ధార్థ మీద నీళ్లు కొట్టి లేపాడు మధు దాంతో గతం నుంచి వాస్తవం లోకి వచ్చాడు "నిన్ను కలవడానికి ఢిల్లీ సిఎం వచ్చారు తొందరగా రా" అని చెప్పి వెళ్లాడు మధు అప్పుడు వినోద్ వచ్చి handcuffs తీసి సిద్ధార్థ నీ లేపాడు, సిద్ధార్థ ఫ్రెష్ అయ్యి ఢిల్లీ సిఎం దగ్గరికి వచ్చాడు ఆయన ఒక ఫ్లవర్ bouquet ఇస్తూ "కంగ్రాట్స్ సార్ మన దేశంలో ఇంత యువ నాయకుడిని చూస్తాను అని అనుకోలేదు" అని అన్నారు దానికి సిద్ధార్థ "థాంక్ యు సార్ కానీ నా ఇన్స్పిరేషన్ ఎప్పుడు మీరే మిమ్మల్ని చూసే నేను రాజకీయాల్లోకి వచ్చాను కాకపోతే తండ్రి కొడుకులు వేరు వేరు పార్టీ లో ఉంటే ప్రజలు ఏదో ఒకటి అనుకుంటారు అని నేను మీతో కలవడానికి కుదరలేదు" అని అన్నాడు సిద్ధార్థ అప్పుడు సిఎం మకరంద్ "అయ్యో పర్లేదు సార్ అయినా మీ నాన్న గారి తో నాది ప్రొఫెషనల్ rivalry కానీ ఏమీ పెద్ద గొడవలు లేవు కానీ ఆయన తీసుకున్న ఈ హాస్పిటల్ నిర్ణయం మాత్రం చాలా గొప్పది" అని అన్నారు దానికి సిద్ధార్థ నవ్వుతూ "సార్ మీ రాజకీయ అనుభవం నాకూ అవసరం అవుతుంది మీకు తెలుసు మా పార్టీ నాయకుల గురించి అందుకుని మిమ్మల్ని మీ పార్టీ లో చేరమని చెప్పడం లేదు నాకూ ఎప్పుడైనా అవసరం అనిపిస్తే మీ సహాయం కోరుతా " అని చెప్పి వినోద్ తో ఆ ఫైల్ తీసుకొని రమ్మని చెప్పి దాంట్లో తనతో పాటు ప్రమాణ స్వీకారం చేసిన "సెంట్రల్ హోమ్ మినిస్టర్, foreign affairs మినిస్టర్" ఇద్దరి జాతకాలు ఉన్నాయి అవి ఇచ్చి "ఈ ఆధారాలతో మీరు ఏమి చేయాలో చేయండి తరువాత ఏ సహాయం కావాలన్నా నేను చూసుకుంటా" అన్నాడు సిద్ధార్థ దాంతో మకరంద్ ఆ ఫైల్ తీసుకొని వెళ్లిపోయాడు "తొందర పడుతున్నావ్ సిద్ధు" అని అన్నాడు మధు దానికి సిద్ధార్థ ఒక నవ్వు నవ్వి వెళ్లిపోయాడు.

ఆ తర్వాత అందరూ pm ఆఫీసు కీ బయలుదేరారు అప్పుడు న్యూస్ లో "మన మాజీ ప్రధాన మంత్రి జీవితం లో ఒక చీకటి కోణం తదుపరి వివరాలు రాత్రి లైవ్ డిబేట్ లో చూడండి" ఒక న్యూస్ వచ్చింది దాంతో అందరూ షాక్ అయ్యారు (నిన్న రాత్రి సిద్ధార్థ తాగిన మత్తులో మాట్లాడిన వాగుడు గోడ చాట్టు నుంచి వాళ్ల పార్టీ కార్యకర్త ఒకడు విని తను pm కాలేక పోయాను అని బాధ పడుతున్న ఒక మినిస్టర్ కీ చెప్పాడు అతను మొత్తం ప్రెస్ కీ ఈ విషయాన్ని చెప్పాడు).

సిద్ధార్థ టివి లో న్యూస్ చూసిన వెంటనే ఆ రోజు తనకు ఉన్న ప్రోగ్రామ్స్ అన్ని కాన్సిల్ చేయమని చెప్పాడు ఆ తర్వాత ఇంట్లో ఉన్న cctv footage మొత్తం తీయమని చెప్పాడు దాంతో వినోద్, సింగ్ మొత్తం cctv footage లు తీశారు ఒకడు గోడ దూకి పారిపోయాడు అది చూసిన మధు "ఏమీ సెక్యూరిటీ చేస్తున్నారు రా అసలు వాళ్లు అంటే సరే వినోద్ నువ్వు కూడా ఇంత అజాగ్రత్తగా ఉంటే ఎలా అదృష్టం కొద్దీ సిద్ధు కీ ఏమీ కాలేదు కానీ రమేష్ కీ సంబంధించిన ఏదో information బయటికి వెళ్లింది అది ఏంటో, ఎవరు ఆ ఇన్ఫర్మేషన్ మీడియా కీ ఇచ్చాడు వాడే ఇచ్చాడ లేదా వాడి వెనుక ఎవరైనా ఉన్నారా మొత్తం ఇన్ఫర్మేషన్ నాకూ గంట లో కావాలి" అని చెప్పాడు మధు, దాంతో వినోద్, సింగ్ ఇద్దరు కలిసి ఆ రోజు రాత్రి ఎవరెవరు వచ్చారు గెస్ట్ లిస్ట్ మొత్తం తీశారు చూస్తే మీడియా వాళ్ళు 50 మంది ఉన్నారు వాళ్ల ఫోన్ నెంబర్లు రిజిస్ట్రేషన్ లో ఉంటాయి వాళ్ల ఫోన్ టాప్ చేయడానికి చూశారు అప్పుడే సిద్ధార్థ "రేయ్ బుద్ధి లేని సన్యాసులారా ఒక వేళ మీడియా వాడు చేసి ఉంటే వాడు మనతోనే డైరెక్ట్ బేరం పెట్టి ఉంటాడు ఆ cctv footage చూడండి వాడి డ్రస్ వాడి వాళ్లకం ఖచ్చితంగా వాడు పార్టీ కార్యకర్త అయ్యి ఉంటాడు ఆ లిస్ట్ తీయండి" అని అన్నాడు దాంతో వాళ్లు ఆ లిస్ట్ తీసి ఆ లిస్ట్ లో ఉన్న ఫోన్ నెంబర్లు అని చెక్ చేశారు అందులో సగం నంబర్స్ 10 గంటల తరువాత అక్కడి నుంచి వెళ్లిపోయాయి ఆ తర్వాత ఒక నెంబర్ 11 గంటల తరువాత ఆ ఏరియా నుంచి వెళ్లింది కాకపోతే ఈ నెంబర్ నుంచి ఒక ల్యాండ్ నెంబర్ కీ ఫోన్ వెళ్లింది ఆ నెంబర్ ఎవరిది అని చూస్తే అది ఫైనాన్స్ మినిస్టర్ శివం పాండే ఇంటి నెంబర్ అని తెలిసింది.

అప్పుడు మధు చెప్పాడు అతనే రమేష్ తరువాత pm అవ్వడానికి లిస్ట్ లో మొదటి వ్యక్తి తనే అని చెప్పాడు దాంతో అందరికీ scene అర్థం అయ్యింది అప్పుడే సిద్ధార్థ మధు కీ ఒక ఫైల్ ఇచ్చి దాని urgent గా పార్టీ అధ్యక్షుడు కీ చేర్చమని చెప్పాడు వినోద్ తో escort లేకుండా సింగ్ తో కలిసి వెనుక డోర్ నుంచి తన సొంత కార్ లో ముగ్గురు కలిసి ఆ న్యూస్ చానెల్ ceo ఫ్యామిలీ details అని కలెక్ట్ చేశారు ఆ ceo కీ ఒక కొడుకు, ఒక చెల్లి ఉంది అతని భార్య లేదు తన చానెల్ లో ఉన్న ఒక న్యూస్ రీడర్ తో affair ఉంది అని తెలిసింది దాంతో ఆ న్యూస్ రీడర్ ఒక షాపింగ్ మాల్ లో బ్యూటీ పార్ల్ లో ఉంది అని తెలుసుకున్నాడు, వాళ్ల చెల్లి కాలేజీ బంక్ కొట్టి ఒక pub లో ఉంది అని తెలుసుకుని సిద్ధార్థ, వినోద్ కీ ఒక ప్లాన్ చెప్పి తనని ఆ pub కీ పంపాడు ఆ తర్వాత శివం పాండే పర్సనల్ డాక్టర్ ఎవరో తెలుసుకొని వాడిని కిడ్నాప్ చేశారు ఆ తర్వాత శివం ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటే అతనికి ఆస్తమా ఉంది అని తెలుసుకున్నారు, ఆ డాక్టర్ కీ కోటి రూపాయలు ఇచ్చి మళ్లీ ఢిల్లీ లో కనిపించదు అని warning ఇచ్చి పంపాడు సిద్ధార్థ ఆ తర్వాత సింగ్ id card తీసుకొని సిద్ధార్థ శివం ఆఫీసు లోకి వెళ్లాడు అక్కడ శివం, సిద్ధార్థ నీ చూసి షాక్ అయ్యాడు "ఏంటి PM గారు ఒక ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి ఇంత రహస్యంగా వచ్చారు" అని వెటకారం గా అడిగాడు దానికి సిద్ధార్థ కూడా నవ్వి "ఏమీ చేయాలి సార్ మీరు సీనియర్స్ మా లాంటి పిల్ల రాజకీయ నాయకుల మీద అప్పుడే బ్రహ్మస్త్రం వదిలితే ఎలా సరే నాకూ అర్థం అయ్యింది మీరు pm అవ్వాలి అని ఆశ పడ్డారు నేను ఏదో తంత్రం వేసి అయ్యాను మీకు కోపం వచ్చింది elections కీ ఇంకా 3 సంవత్సరాల టైమ్ ఉంది నను ఈ సంవత్సరం pm గా ఉండనివ్వండి తరువాత ఏదో ఒక స్కామ్ చేసి దొరికి పోతా ఆ తర్వాత మళ్లీ రెండు సంవత్సరాల పాటు మీరే PM ఏమంటారు" అని అడిగాడు "మీ నాన్న నీ చంపినట్టు నిన్ను కూడా కుక్క నీ చంపినట్టు చంపి elections వచ్చేలా చేసి PM అవుతా నా కోడక" అని అన్నాడు అతని మాట పూర్తి కాక ముందే సింగ్ id card కీ ఉన్న వైర్ తో శివం మెడ చుట్టూ వేసి ఊపిరాడకుండ చేసి చంపేశాడు సిద్ధార్థ ఆ తర్వాత అక్కడ ఒక ఖాళీ inhaler పడేసి వెళ్లిపోయాడు.

గంట తర్వాత న్యూస్ లో రమేష్ గురించి చెప్పాలి అనుకున్న న్యూస్ చానెల్ లో తప్ప మిగిలిన అన్ని చానెల్స్ లో ఆ చానెల్ ceo చెల్లి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినట్లు న్యూస్ వస్తుంది దాంతో అందరూ రమేష్ గురించి మరిచి పోయారు, వినోద్ నీ పంపించి సిద్ధార్థ చేసిన ప్లాన్ ఇదే వినోద్ లోకల్ సెక్యూరిటీ అధికారి స్టేషన్ లో తనకు తెలిసిన ఒక ఆఫీసర్ తో ఒక ముక్కాలు కిలో డ్రగ్స్ తీసుకోని ఆ అమ్మాయి బాగ్ లో పెట్టి వాళ్లే అరెస్ట్ ప్లాన్ చేశారు ఆ తర్వాత ఆ విషయాన్ని వాళ్లే మీడియా కీ లీక్ చేశారు, దాంతో ఆ ceo డైరెక్ట్ గా వచ్చి సిద్ధార్థ కాలు పట్టుకున్నాడు ఆ మినిస్టర్ శివం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం సిద్ధార్థ ముందే కాల్చి పడేశాడు ఆ తర్వాత తన చెల్లి నీ ఒక ఫోన్ తో విడిపించాడు సిద్ధార్థ తరువాత ఆ అమ్మాయి నీ సింగ్ కీ ఇచ్చి పెళ్లి చేయమని చెప్పాడు మొత్తం పరువు పోయాక ఇంక ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది దాంతో అతను ఆ పెళ్ళి కీ ఒప్పుకున్నాడు, మధు ఇచ్చిన ఫైల్ చూసిన పార్టీ అధ్యక్షుడు "సరే ఇతను up లో ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇతని తీసుకుని వచ్చి ఫైనాన్స్ మినిస్టర్ చేయడం ఏంటి పైగా శివం ఉన్నాడు కదా" అన్నాడు అప్పుడే టివి లో శివం పాండే ఊపిరాడక మృతి చెందాడు అని న్యూస్ వచ్చింది దాంతో పార్టీ అధ్యక్షుడు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు ఆ తర్వాత తన ప్రపోజల్ పెట్టాడు ఎవరూ దానికి ఒప్పుకోలేదు అప్పుడు అందరి అకౌంటు లో 5 కోట్లు వచ్చాయి అప్పుడు మధు Skype కాల్ లో సిద్ధార్థ నీ చూపించాడు "నేను చెప్పిన అతనికి మినిస్టర్ పదవి ఇస్తున్నారు మీరు ఎవ్వరూ నోరు ఎత్తకుండా ఉండటానికి ఆ 5 కోట్లు అడ్వాన్స్ మాత్రమే" అని అన్నాడు సిద్ధార్థ దాంతో సగం మంది silent అయ్యారు కానీ కొంతమంది సీనియర్ నాయకులు మాత్రం వయసులో ఉన్న మినిస్టర్ లు సెంట్రల్ గవర్నమెంట్ లోకి వస్తే తమకు ముప్పు అని భయపడుతున్నారు.

ఇది అంత జరిగిన తరువాత సిద్ధార్థ laptop మూసి వేసి సోఫా లో కూర్చుని ఉంటే ఎదురుగా ఉయ్యాల లో సంధ్య ఊగుతు కోపం గా సిద్ధార్థ వైపు చూస్తూ "నీకు నేను న్యాయం గా రాజ్యపాలన చేయడం నేర్పితే నువ్వు హత్యలు చేస్తూ లంచాలు ఇస్తూ నిన్ను, జనాలను మోసం చేస్తున్నావ్" అని కోపంగా అరిచింది దాంతో సిద్ధార్థ తన దగ్గరికి వెళ్లే సరికి సంధ్య మాయం అయ్యింది ఆగి ఉన్న ఉయ్యాల నీ చూస్తూ అలాగే ఉన్నాడు అప్పుడే raw జాయింట్ సెక్రటరీ కబీర్ సిన్హా వచ్చారు ఆయన నీ కూర్చోమని చెప్పి విషయం ఏంటి అని అడిగాడు అప్పుడు కబీర్ "సార్ ఇది బెలూచిస్థాన్ నుంచి encryption అయిన ఒక ఫైల్ ఇందులో మాకు ఎమైన ఎటాక్ గురించి తెలుస్తుంది అని వెతికాం కానీ దాని కన్న shocking ఏంటి అంటే ఈ ఫైల్ మన పార్లమెంటు లోనే రిసీవ్ చేసుకున్నారు" అని చెప్పాడు దానికి సిద్ధార్థ what! అని అడిగాడు "సార్ ఈ మెసేజ్ quetta నుంచి వచ్చింది అది కూడా మన late PM అదే మీ నాన్నగారు చనిపోయిన రెండు రోజుల ముందు వాళ్లు ఒక హాస్పిటల్ నీ బ్లాస్ట్ చేయాలి అని ప్లాన్ చేశారు మీ నాన్న గారి మరణం వెనుక చాలా పెద్ద కుట్ర ఉందని అనుమానం గా ఉంది But don't worry sir my boys are on duty we will find soon" అని చెప్పి వెళ్లిపోయాడు కబీర్, ఇది అంత విన్న తర్వాత సిద్ధార్థ అందరినీ పిలిచి తను రెండు రోజుల్లో పాకిస్తాన్ పర్యటన కీ వెళ్లాలి ఏర్పాటు చేయమని" చెప్పాడు ఇది విని మధు ఏదో చెప్పాలని చూస్తే "As a PM it's my order" అని చెప్పాడు సిద్ధార్థ.

సిద్ధార్థ చెప్పింది విన్న తర్వాత మధు పాకిస్తాన్ లోని ఇండియన్ embassy కీ ఫోన్ చేసి రెండు రోజుల్లో ప్రధాని పాకిస్తాన్ పర్యటన లో ఉంటారు అక్కడ వారం పాటు జరిగే ఇండియా, పాకిస్తాన్ క్రికెట్ వన్ డే సిరీస్ నీ చూస్తారు అని చెప్పాడు దాంతో అందరూ ఏర్పాట్లు చేశారు అప్పుడే foreign affairs minister అయిన సొఫియా కీ సిద్ధార్థ పాకిస్తాన్ వస్తూన్నాడు అని తెలిసి చాలా సంతోషించింది తనని రిసీవ్ చేసుకుని ఆ తర్వాత తను రిటర్న్ వెళ్లే వరకు మొత్తం తనే దెగ్గర ఉండి చూసుకోవాలి అని డిసైడ్ అయ్యింది అప్పుడు ఇంటికి వెళ్లి కాలేజీ లో సిద్ధార్థ సంధ్య కోసం తెచ్చిన ఒక డ్రస్ తనకు తెలియకుండా సోఫియా కొట్టేసి దాచి పెట్టింది ఆ డ్రెస్ తీసుకొని అద్దం లో తనని తాను చూసుకోని మురిసిపోయింది తన stylist కీ చెప్పి ఆ డ్రస్ రెండు రోజుల్లో రెడీ చేయమని చెప్పింది సోఫియా ఆ తర్వాత కాలేజీ ఫొటోలు తీసి చూస్తూ మెల్లగా గతం లోకి జ్ఞాపకాలు అడుగులు వేశాయి.

(3 సంవత్సరాల క్రితం)

సిద్ధార్థ చేసిన పిచ్చి పనికి Dean పిలిచి warning ఇచ్చింది ఆ తర్వాత ఆ న్యూస్ మొత్తం viral అయ్యింది దాంతో రమేష్, మధు సిద్ధార్థ నీ నోటికి వచ్చినట్లు తిట్టారూ కానీ సిద్ధార్థ ఫోన్ mute లో పెట్టి మార్కిన్ తో Playstation లో గేమ్స్ ఆడుతూ ఉన్నాడు అప్పుడే సోఫియా వచ్చి తలుపు కొట్టింది వినోద్ వెళ్లి తలుపు తీశాడు అప్పుడు సోఫియా లోపలికి వచ్చింది తనని చూసి వినోద్ "మేడమ్ మీరు ఏంటి ఇక్కడ" అని అడిగాడు దానికి సోఫియా "సిద్ధార్థ" అని అడిగింది దాంతో వినోద్ తనని లోపలికి రానీచ్చి బయటకు వెళ్లి నిలబడాడు అప్పుడు సోఫియా బాడిగార్డ్ ఇలియాజ్ నీ చూసిన వినోద్ మొహం లో రంగులు మారాయి "మేజర్ సాబ్ ఎలా ఉన్నారు మీకు దిగాల్సిన బుల్లెట్ పాపం మీ ఫ్రెండ్ దిగింది కదా ఆ రోజు జాగ్రత్త ఈ ఫ్రెండ్ కీ ఏమీ దిగుదో చెప్పలేను" అని వెటకారం చేశాడు ఇలియాజ్ దానికి వినోద్ నవ్వుతూ "నా ఫ్రెండ్ బుల్లెట్ దిగితే నేను కాపాడుకోలేక పోయా జనాభ్ కానీ నా గన్ నుంచి మీ colonel తలకి తగిలిన బుల్లెట్ చూసి పారిపోయిన ఒక పిల్లి పిల్లను తీసుకొని వచ్చి prime minister కూతురు కీ సెక్యూరిటీ గా పెట్టారు చూడు అది మీ గవర్నమెంట్ తెలివి" అన్నాడు దానికి ఇలియాజ్ అక్కడి నుంచి తల దించుకోని వెళ్లిపోయాడు.

లోపల ఉన్న సోఫియా, సిద్ధార్థ తో "సిద్ధార్థ్ నాకూ నీ అంత ధైర్యం ఉంటే బాగుండు నాకూ కూడా ఇలాంటి క్రేజీ పనులు చేయాలి అని ఎప్పటి నుంచో ఆశ నను మీ టీం లో కలుపుకొండి ప్లీజ్" అని అడిగింది దానికి సిద్ధార్థ "సోఫి నువ్వు ఇలా నాతో కలిసి తిరుగుతూ మీడియా కీ కనుక దొరికితే నీకు నాకూ మీ నాన్న కు మా నాన్న కు రిస్క్ కానీ మనం కలిసి ఎంజాయ్ చేస్తే ఆ కిక్ వేరు అదే క్రేజీ గా ఉంటుంది కాకపోతే నువ్వు నా లాగా ఒక క్రేజీ పని చేసి నిన్ను నువ్వు నిరూపించుకో" అని అన్నాడు దానికి సోఫియా ఏదో ఆలోచిస్తూ ఉంటే "భయం వద్దు నేను ఏమీ నాలాగా చేయమని చెప్పను రాత్రి నేను, మార్కిన్, డోని, విలియమ్స్ అందరం రాత్రి సీక్రెట్ గా పార్టీ కీ వెళుతున్నాం నువ్వు నీ బాడిగార్డ్ కీ తెలియకుండా వస్తే చాలు" అని చెప్పాడు దానికి సోఫియా కూడా సరే అని చెప్పింది, రాత్రి 10 తరువాత అందరూ హాస్టల్ గోడ బయట డోని కార్ దెగ్గర సోఫియా కోసం ఎదురుచూస్తున్నారు అప్పుడు సోఫియా తన హాస్టల్ బాత్రూమ్ కిటికీ నుంచి బయటకు వచ్చింది అప్పుడు Ferrari 599 GTD కార్ చూసి ఆశ్చర్య పోయింది సోఫియా దాంతో నేను నడపోచ్చా అని అడిగింది దాంతో సిద్ధార్థ సైగ చేయడం తో డోని కార్ తాళం సోఫియా కీ ఇచ్చింది దాంతో సోఫియా మొదలు పెట్టడమే 80 kmph లో కార్ స్టార్ట్ చేసి ముందుకు వెళ్లింది తను వెళ్లే స్పీడ్ కీ టైర్ నుంచి పొగలు కూడా వస్తున్నాయి ఇలా కాలేజీ నుంచి స్టూడెంట్స్ బయటకు వచ్చారు అని తెలుసుకుని క్యాంపస్ చుట్టూ తిరుగుతున్న మీడియా వాళ్లు వీళ్లని వెంబడించారు దాంతో సోఫియా కార్ నీ ఇంకా స్పీడ్ గా పోనిచ్చి drift కొట్టి ఒక సందులో ఆగి హెడ్ లైట్ ఆపి మీడియా వాళ్ళు వెళ్లిపోగానే తను కార్ నీ pub వైపు పోనిచ్చింది.

అలా pub కీ వెళ్లగానే అందరూ సోఫియా నీ మెచ్చుకున్నారు అప్పుడు సిద్ధార్థ, సోఫియా నీ గట్టిగా కౌగిలించుకున్ని ముద్దు పెట్టాడు దాంతో సోఫియా లో మొదటి సారిగా ఏదో తెలియని ఫీలింగ్ మొదలు అయ్యింది అలాగే అందరూ pub లోకి వెళ్లారు అప్పుడు అక్కడ సిద్ధార్థ తనని కొట్టిన అమ్మాయి నీ చూశాడు నిన్న తనలో సంస్కృతి సంప్రదాయాలను చూశాడు కానీ ఇక్కడ తనలో ఉన్న hotness చూశాడు ఒక బ్లాక్ skrit వేసుకొని loose hair తో ultra modern అమ్మాయిల కు బ్రాండ్ అంబాసిడర్ గా కనిపించింది దాంతో సిద్ధార్థ రెండు డ్రింక్స్ తీసుకొని తన దగ్గరికి వెళ్ళాడు ఆ అమ్మాయి సిద్ధార్థ నీ చూసి ఏంటి అని సైగ చేసింది "well మీరు నాకూ చాలా బాగా నచ్చారు నిన్న మీలోని సంప్రదాయం నాలో ఇష్టం రేపింది కానీ ఈ రోజు మీలో hotness నాలో చిలిపి ఆశలు రేపింది ఈ డ్రింక్ తీసుకుంటే మీరు నన్ను క్షమించినట్టే" అని అన్నాడు సిద్ధార్థ దానికి ఆ అమ్మాయి లేచి సిద్ధార్థ చేతిలో ఉన్న గ్లాస్ లోని డ్రింక్ పారేసి ఖాళీ గ్లాస్ సిద్ధార్థ కీ ఇచ్చింది "నేను తాగను అండ్ నాకూ ఈ డ్రస్ లో ఎంత చిరాకుగా ఉందో నీకు తెలియదు ఏదో నా ఫ్రెండ్ బర్త్ డే పార్టీ కోసం వేసుకొని వచ్చా నీ డ్రింక్ పడేశా అని ఫీల్ అవ్వోదు నేను నిన్ను క్షమించా కాబట్టే పక్కన పోశా లేకపోతే నీ మొహం మీద పోసే దాని" అని చెప్పి వెళ్లిపోయింది దానికి సిద్ధార్థ నవ్వుతూ "హలో నీ పేరు చెప్పలేదు" అని అరిచాడు దానికి తను వెనకు తిరిగి ఒక నవ్వు నవ్వి వెళ్లిపోయింది.

మరుసటి రోజు ఉదయం మొదటి రోజు క్లాస్ కీ వెళ్లారు అందరూ అప్పుడు ఆ institute లోనే అతి strict అయిన ప్రొఫెసర్ వీళ్లకు క్లాస్ తీసుకున్నారు ఆయన క్లాస్ చెప్పిన తరువాత "మీకు అందరికీ గ్లోబల్ లీడర్ అయ్యే అర్హత కంటే ముందు కావాల్సింది diplomacy అంటే దౌత్యం మీ దేశం తో ఇంకో దేశ దౌత్య సంబంధాలు సరిగ్గా ఉంచగలిగినప్పుడు మీరు గొప్ప నాయకులు అవుతారు కాబట్టి మీ అందరి ఒక ప్రాజెక్ట్ వర్క్ అది నెలలో సబ్మిట్ చేయాలి మీకు ఇచ్చిన కవర్ లో మీతో పాటు మీరు project చేయాల్సిన మీ partner details కూడా ఉంటాయి now my assistant and your junior professor sandhya will guide you" అని చెప్పాడు అప్పుడు ఒక పదహారునాల అచ్చ తెలుగు అమ్మాయి క్లాస్ లోకి వచ్చి అందరికీ ప్రాజెక్ట్ ఫైల్ ఇచ్చింది తరువాత ప్రొఫెసర్ వెళ్లిపోయాడు అప్పుడు సంధ్య "మీ ప్రాజెక్టు నెల లోగా submit చెయ్యాలి ముఖ్యంగా మీ partners నీ మార్చే ప్రసక్తి లేదు keep that in your mind any doubts" అని అడిగింది సంధ్య అప్పుడు సిద్ధార్థ లేచి "మీ పేరు చెప్పలేదు" అని అడిగాడు దానికి సంధ్య "సంధ్య సంధ్య కాళింగరి" అని చెప్పి సిద్ధార్థ వైపు కొంటెగా చూస్తూ వెళ్లిపోయింది, అప్పుడే సోఫియా తన partner గా సిద్ధార్థ వచ్చాడు అని సంబరంగా వచ్చి సిద్ధార్థ పక్కన కూర్చుంది అప్పుడు సిద్ధార్థ సంధ్య వైపే చూస్తూ ఉంటే సోఫియా ఏంటి అని అడిగింది "అందమైన అమ్మాయి అందం చీర లోనే తెలుస్తుంది ఈ అమ్మాయి అందం రోజు రోజుకు పిచ్చి ఎక్కిస్తుంది" అని అన్నాడు సోఫియా ఇది గుర్తు చేసుకుంటూ ఉండగా తన సెక్యూరిటీ చీఫ్ వచ్చి "మేడమ్ ఫ్లయిట్ ల్యాండ్ అయింది" అని అన్నాడు దాంతో సోఫియా సిద్ధార్థ నీ రిసీవ్ చేసుకోడానికి వెళ్లింది అప్పుడు సిద్ధార్థ సోఫియా వేసుకున్న చీర చూసి షాక్ అయ్యాడు కానీ దానికంటే ఎక్కువ షాక్ అందులో సోఫియా అందం చూసి షాక్ అయ్యాడు.​
Next page: Update 03
Previous page: Update 01