Update 01

(హైదరాబాద్ సెషన్స్ కోర్టు)

కోర్టు ప్రాంగణం మొత్తం హడావిడి గా ఉంది స్టూడెంట్స్ యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున ఆందోళనలు కోర్టు పునాదులు కదిలేంచేలా ఉన్నాయి కారణం ముందు రోజు హైదరాబాద్ సిటీ లోని ఒక కాలేజీ స్టూడెంట్స్ చేసిన స్ట్రైక్ ఇండియా లోని విద్యా పద్దతి నీ మార్చాలని వాళ్లు పోరాటం చేస్తున్నారు దాంతో ఆ కాలేజీ యూనియన్ నాయకులను సెక్యూరిటీ ఆఫీసర్లు అరెస్టు చేశారు పైగా వాళ్లు అంతా ఒకే కాలనీ కీ చెందిన విద్యార్థులు ఆ కాలేజీ కీ సంబంధించిన కొంతమంది టీచర్లు అందరూ కలిసి ఒక కాలనీ ఏర్పాటు చేసుకున్నారు, వాళ్ల పిల్లలు చదువుతున్న కాలేజీ సెంట్రల్ మినిస్టర్ దీ అతని మీద కేసు వేసి మరీ వాళ్లు ఈ పోరాటం మొదలు పెట్టారు ఇది తెలిసి వాళ్లను అరెస్ట్ చేయమని ఆ మినిస్టర్ లోకల్ సెక్యూరిటీ అధికారి డిపార్టమెంట్ కీ చెప్పాడు పైగా ఆ స్టూడెంట్స్ తరుపున ఏ లాయర్ నీ రాకుండా చూడాలని ఆర్డర్ ఇచ్చాడు దాంతో ఆ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన పడ్డారు, ఎవరికి ఏమీ చేయాలి అని తెలియడం లేదు దాంతో తమ పిల్లలు జైలు కీ వెళ్లతారు అని భయపడుతున్నారు అప్పుడు కోర్టు మొదలు అయ్యింది జడ్జి గారు కూడా వచ్చి హియరింగ్ మొదలు పెట్టారు కానీ స్టూడెంట్స్ తరుపున వాదించడానికి ఒక్క లాయర్ కూడా లేరు అందుకు వాళ్ళని జైలు కీ పంపాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పడం మొదలు పెట్టాడు "your honor ఎంతోమంది విద్యార్థులకు ఫీజు వసూలు చేయకుండా ఉచిత విద్య ఇస్తున్నారు మన గౌరవనీయులైన మినిస్టర్ పాండే గారు సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఆయన చేస్తున్న సేవలు పైగా ప్రతి రాష్ట్రంలోనూ ఆయన కళాశాల విద్యార్థులు ఉచిత విద్య పొందుతున్నారు అలాంటి మహా వ్యక్తి పైన పైగా ఎంతో మంది మేధావులను తయారు చేసిన మన విద్యా వ్యవస్థ నీ అవమానీస్తూ ఈ విద్యార్థులు చేసిన ఆందోళనలు వల్ల ఈ కళాశాల కీ ఉన్న reputation దెబ్బ తినింది కాబట్టి ఇలాంటి విప్లవ కాంక్షలు ప్రేరేపించేలా ఉన్న ఈ విద్యార్థుల చేష్టలు సమాజాన్ని తప్పుడు దోవ పట్టించే విధంగా ఉన్నాయి కాబట్టి వీరికి విధించే శిక్ష మిగిలిన వాళ్లకు గుణపాఠం కావాలి" అని చెప్పి తన వాదనను ముగించారు.

అప్పుడు జడ్జ్ గారు విద్యార్థుల వైపు చూసి "మీ తరుపున ఎవరైనా లాయర్ ఉన్నారా" అని అడిగారు అప్పుడు ఒక లాయర్ కోర్టు లోకి వచ్చి "yes your honor వీళ్ల తరుపున నేను వాదిస్తాను" అని చెప్పాడు అతని చూసి అందరూ షాక్ అయ్యారు ముఖ్యంగా ఆ విద్యార్థులు, వాళ్ల తల్లితండ్రులు ఎందుకంటే ఆ లాయర్ ఉండేది వాళ్ల కాలనీ లోనే అతని తో రోజు అందరికీ గొడవ ఎప్పుడు తాగుతూ ఉంటాడు ప్రతి చిన్న విషయానికి అందరితో గొడవ పడుతూ ఉంటాడు, ఒక పిచ్చోడు అని ఆ కాలనీ వాళ్లు అతని పట్టించుకోవడం మానేశారు ఇప్పుడు ఆ పిచ్చోడు లాయర్ అని తెలిసి షాక్ అయ్యారు అతని చూసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ "సిద్ధార్థ్ ఠాకూర్" అని ఆశ్చర్యంగా నోరు తెరిచి అలాగే చూస్తూ ఉండిపోయాడు అప్పుడు జడ్జ్ గారు proceed అన్నారు "Thank you your honor మన pp గారు చెప్పింది అక్షరాలా సత్యం ఈ విద్యార్థులు అంత విప్లవ భావాలు కలిగి సమాజం నీ తప్పు దోవ పట్టిస్తున్నారు" అని సిద్ధార్థ చెప్పగానే అందరూ ఈ పిచ్చోడు మనల్ని ముంచడానికే వచ్చాడు అని అనుకున్నారు.

"అవును కానీ వాళ్ళకి ఈ విప్లవ కాంక్షలు ఎక్కడి నుంచి మొదలు అయ్యాయి చిన్నప్పుడు మనకు స్వాతంత్య్రం తీసుకుని రావడానికి సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, ఇలా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు అని వీళ్లకి బోధించిన ఇదే విద్యా వ్యవస్థ వీళ్లలో ఈ విప్లవం రేపింది రోజుకో కొత్త వింత చూస్తున్న ఈ ప్రపంచంలో ఇంకా పాత పాచి పట్టిన ఆవకాయ పచ్చడి లాంటి సిలబస్ ప్రకారం చదువులు చెప్పి వాళ్ళని ర్యాంకుల కోసం machines లా పరిగెత్తిస్తున్న ఈ సమాజం ఈ విప్లవం రేపింది, పక్కింట్లోవాడు అబ్దుల్ కలాం అయితే నువ్వు కూడా అదే అవ్వాలి అని ఒత్తిడి చేసే ఈ తల్లితండ్రులు ఈ విప్లవం వాళ్లలో రేపింది, your honor మన law అనేది కొన్ని సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఒక శక్తివంతమైన వ్యవస్థ కానీ అదే వ్యవస్థ లో ఈ రోజు న్యాయం కంటే అవకతవకలు ఎక్కువ అయ్యాయి కానీ మనం దాని మార్చాలేం కానీ విద్యా వ్యవస్థ నీ మార్చోచు సిలబస్ ప్రతి 8 సంవత్సరాలకు ఒకసారి కాదు ప్రతి సంవత్సరం మార్చాలి ఇది ఏంటి ప్రతి సంవత్సరం మార్చడం ఏంటి పిచ్చి పట్టిందా వీడికి అనుకోవచ్చు నేను మొత్తం సిలబస్ మార్చాలని చెప్పడం లేదు కొత్త అంశాలను ప్రస్తుతం ఉన్న సిలబస్ తో జోడించి రూపొందించాలి పుట్టగొడుగులా పెరుగుతున్న ఈ లైసెన్స్ లేని గవర్నమెంట్ ఆమోదం కూడా సరిగ్గా లేని ర్యాంకుల కోసం ఫీజులు గుంజడం కోసం మాత్రమే ఉన్న ఇలాంటి కాలేజీలను మూసి విద్యార్థులకు మంచి భవిష్యత్తు మీద నమ్మకం కలిగేలా చూడాలని కోరుతున్నా" అని తన వాదనను ముగించాడు సిద్ధార్థ.

దాంతో జడ్జ్ గారు "లాయర్ సిద్ధార్థ నీ చాలా రోజుల తర్వాత చూడడం సంతోషంగా ఉంది ఆయన చెప్పిన విషయాలను కోర్టు స్వాగతిస్తుంది కానీ ఈ ప్రక్రియ ఒక్క రాత్రి లో జరిగేది కాదు కావున విద్యార్థుల సంఘం సమక్షంలో ప్రతి గవర్నమెంట్ ఆమోదం ఉన్న యూనివర్సిటీ లో ఈ విషయం పై విచారణ జరిపించాలని ఒక కమిటీ వేసి విచారణ జరిపించాలని కోర్టు ఆదేశం ఇస్తుంది అలాగే విద్యార్థుల తమ హక్కుల కోసం పోరాటం చేయడం లో ఎలాంటి తప్పు లేదు కానీ వాళ్లు చేసిన నిరసన వల్ల కొంత వరకు సామాన్య ప్రజలు ఇబ్బంది పడటం వల్ల వారిని మందలిస్తు 5 వేల రూపాయలు జరిమానా విధిస్తూ ఇది చివరి హెచ్చరిక గా ప్రకటిస్తూ వారిని విడుదల చేయడం జరిగింది court is adjourned" అని తీర్పు ఇచ్చారు, కోర్టు లో కేసు గెలిచిన తర్వాత విద్యార్థులు అంతా సిద్ధార్థ నీ తమ భుజాల పైన మోస్తూ కోర్టు బయటికి వచ్చారు ఇది అంత అందరి ఫోన్ లో Facebook లైవ్ లో పెట్టారు అప్పుడు ఆ video మొత్తం viral అయ్యింది.

ప్రధాన మంత్రి కార్యాలయం లోని చీఫ్ సెక్యూరిటీ సిబ్బంది ఆ video చూసి ప్రధాని చీఫ్ సెక్యూరిటీ కీ ఆ వీడియో చూపించారు అతను ఆ video నీ ప్రధాని పర్సనల్ సెక్రటరీ అయిన "మధు గుప్తా" దగ్గరికి వెళ్లారు అప్పటికే మధు పార్టీ హై కమాండ్ మీటింగ్ లో ప్రధాని తరుపున ఆ మీటింగ్ కి హాజరు అయ్యారు అక్కడ అందరూ తరువాత ప్రధాని అయితే నేను అవ్వాలి అంటే నేను అవ్వాలి అని కొట్టుకుంటూ ఉన్నారు ప్రధాని ఆరోగ్యం చాలా క్షీణించింది ఈవాళ, రేపు అన్నట్లు ఉంది ఆయన పరిస్థితి ఈ విషయాన్ని బయటకు రాకుండా చాలా జాగ్రత్త పడ్డారు పార్టీ నాయకులకు రాష్ట్రపతి కీ తప్ప ఈ విషయాన్ని ఎవరికి చెప్పలేదు అప్పుడే సెక్యూరిటీ ఆఫీసర్ ఆ video తీసుకుని వచ్చి మధు కీ చూపించారు దాంతో మధు మొహం లో ఒక్కసారిగా రంగులు మారాయి వెంటనే ఆ video నీ పార్టీ అధినేత కీ చూపించారు మధు అది చూసిన పార్టీ అధినేత సరే అని సైగ చేశారు దాంతో మధు సెక్యూరిటీ ఆఫీసర్ తో కలిసి హడావిడి గా హైదరాబాద్ చేరుకొని సిద్ధార్థ ఉంటున్న కాలనీ కీ వెళ్లారు అప్పుడు కాలనీ వాళ్లు అంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు అప్పుడు మధు లోపలికి వెళ్లి సిద్ధార్థ మందు తాగి పడిపోతే అలాగే ఎత్తుకొని వచ్చి కార్ లో వేసి తీసుకుని వెళ్లాడు అప్పుడు కాలనీ వాళ్లు అంతా సిద్ధార్థ ఇంట్లోకి వెళ్లి చూశారు అక్కడ గోడ మీద చాలా ఫొటోలు, సర్టిఫికేట్ లు ఉన్నాయి అందులో ఒక ఫోటో చూసి అందరూ షాక్ అయ్యారు అది మన ప్రధాని తో సిద్ధార్థ కలిసి దిగిన ఫోటో దాని కింద "Best father in the world" అని రాసి ఉంది.

సిద్ధార్థ ప్రధాని రమేష్ ఠాకూర్ కొడుకు అని తెలిసి అందరూ షాక్ అయ్యారు అప్పుడు ఒక అబ్బాయి గూగుల్ లో సిద్ధార్థ గురించి కోడితే కొన్ని వివరాలు వచ్చాయి "అందరూ ఇలా చూడండి సిద్ధార్థ NLU ఢిల్లీ నుంచి లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు ఆ తర్వాత కొన్ని రోజులు వాళ్ల నాన్న ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నపుడు ఫైనాన్షియల్ లా advisor గా ఉన్నాడు ఆ తర్వాత ఎప్పుడైతే రమేష్ గారు prime minister అయ్యారో సిద్ధార్థ నీ కూడా లోకల్ యూత్ లీడర్ నీ చేశారు ఆ తర్వాత సిద్ధార్థ vancross University Lindbergh లో చాలా మంది వరల్డ్ politicians పిల్లల తో పాటు తను కూడా politics గురించి డిగ్రీ పొందాడు అక్కడ గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు సిద్ధార్థ ఒక controversy లో ఇరుకున్నాడు ఆ తర్వాత తను ఎక్కడికో మాయం అయిపోయాడు" అని సిద్ధార్థ గురించి మొత్తం వివరాలు చెప్పాడు.

ఇది ఇలా ఉంటే మధు సిద్ధార్థ నీ chartered flight లో తిరిగి ఢిల్లీ తీసుకుని వెళుతున్నాడు అప్పుడు ఫ్లయిట్ లో తన బెడ్ మీద ఉన్న సిద్ధార్థ కీ మెలుకువ వచ్చింది అప్పుడు flight attendant వచ్చి "your juice sir" అని చెప్పింది దాంతో ఆమె గొంతు గుర్తు పట్టిన సిద్ధార్థ మత్తులోనే "థాంక్ యు జూలియట్" అని చెప్పాడు తరువాత సిద్ధార్థ కీ అనుమానం వచ్చి లేచి చూస్తే తన రెండు చేతులకు బేడీలు వేసి ఉన్నాయి అది చూసిన సిద్ధార్థ "సింగ్ జి నువ్వు బయట ఉన్నావు అని నాకూ తెలుసు వచ్చి handcuffs తీయి" అని కోపం గా అరిచాడు ఇది అంత బయట నుంచి వింటున్న సిద్ధార్థ బాడిగార్డ్ సింగ్ లోపలికి వెళ్లాలి అంటే భయపడుతున్నాడు, "రేయ్ వినోద్ నా కొడక నువ్వు కూడా ఉన్నావు అని నాకూ తెలుసు వచ్చి handcuffs తీయి రేయ్ వినోద్" అని అరిచాడు సిద్ధార్థ దాంతో వినోద్ కీ కోపం వచ్చి లోపలికి వెళ్లి సిద్ధార్థ నీ నాలుగు పీకి "మూసుకొని కూర్చో" అని అన్నాడు (వినోద్, సిద్ధార్థ ఇద్దరు చిన్నప్పటి నుండి ప్రాణ స్నేహితులు అంతేకాకుండా సిద్ధార్థ సెక్యూరిటీ వింగ్ లో వినోద్ చీఫ్) అప్పుడే లోపలికి వచ్చిన మధు నీ చూసిన సిద్ధార్థ "ఆల్ఫ్రెడ్ నేను ఎవరో తెలిసి కూడా ఇలా చేయడం తప్పు ఆల్ఫ్రెడ్" అని అన్నాడు (సిద్ధార్థ కీ బ్యాట్మాన్ అంటే చాలా ఇష్టం అందుకే మధు నీ చిన్నప్పటి నుంచి బ్యాట్మాన్ కీ అసిస్టెంట్ అయిన ఆల్ఫ్రెడ్ పేరుతోనే పిలుస్తాడు) "చూడు సిద్ధు నేను మీ నాన్న సెక్రటరీ మాత్రమే కాదు ఫ్రెండ్ నీ కూడా నా ఫ్రెండ్ చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు తన చివరి కోరిక నువ్వు తన ముందు ఉండాలి అని నేను నా స్నేహం కోసం చేస్తున్న నువ్వు ఇష్టం గా వచ్చిన ఎలా వచ్చిన నువ్వు నాతో రావాలి అంతే వినోద్ వాడు నీకు ఫ్రెండ్ అయ్యి ఉండవచ్చు కానీ తను నీ బాస్ show some bloody respect" అని చెప్పి వెళ్లిపోయాడు.

దాంతో సిద్ధార్థ ఆకలి వేస్తుంది అని చెప్తే వినోద్ జూలియట్ నీ టిఫిన్ తీసుకుని రమ్మని చెప్పి బయటకు వెళ్లాడు జూలియట్ వచ్చిన తర్వాత తనకు బెడ్ కింద ఒక బ్లాక్ బ్యాగ్ ఉంది దాని బాత్రూమ్ లో పెట్టామని చెప్పి జూలియట్ జడ లో క్లిప్ తీసి పక్కన పెట్టి టిఫిన్ తింటున్నట్టు నటిస్తూ జూలియట్ వెళ్లిపోవగానే తన handcuffs విడిపించుకొని తన బెడ్ కింద నుంచి కింద cargo లోకి వెళ్లి flight cargo door తెరిచి బాత్రూమ్ లో ఉన్న ప్యారాచూట్ తో కిందకి దూకి తప్పించుకున్నాడు సిద్ధార్థ అప్పుడు cargo door తెరుచుకోని ఉండటం తో మధు కీ అర్థం అయ్యింది వాడు తప్పించుకున్నాడు అని అప్పుడు రాడార్ ప్రకారం వాళ్లు హర్యానా బార్డర్ లో ఉన్నారు అంటే తను కచ్చితంగా ఫరీదాబాద్, గురుగ్రామ్ జిల్లాలో ఎక్కడో ఒక చోట ఉంటాడు అని మధు కీ అర్థం అయ్యింది దాంతో వాళ్లు ఢిల్లీ లో ఫ్లయిట్ ల్యాండ్ చేసి గురుగ్రామ్, ఫరీదాబాద్ సెక్యూరిటీ అధికారి ఫోర్స్ మొత్తం నీ సిద్ధార్థ వెనుక పంపారు కానీ సిద్ధార్థ అంబాలా లో ల్యాండ్ అయ్యాడు అక్కడి నుంచి కాశ్మీర్ వెళ్లాలి అని ప్లాన్ చేశాడు సిద్ధార్థ.

ఇది ఇలా ఉంటే పాకిస్తాన్ foreign affairs మినిస్టర్ సోఫియా తహసిల్ టేబుల్ మీద సిద్ధార్థ మళ్లీ కనిపించడం ఉన్న video గురించి ఒక ఫైల్ ఉంది అది చూసిన సోఫియా సిద్ధార్థ ఫోటో మీద రెడ్ పెన్ తో సర్కిల్ గీసింది ఇక్కడ ఢిల్లీ లో రమేష్ ఠాకుర్ ఉన్న హాస్పిటల్ లో సడన్ గా బాంబ్ బ్లాస్ట్ జరిగి మొత్తం హాస్పిటల్ నేలమట్టం అయ్యింది దాంతో అందరూ ఒక్కసారిగా షాక్ కీ గురి అయ్యారు దాంతో మధు, వినోద్ సిద్ధార్థ గురించి పక్కన పెట్టి రమేష్ ఉన్న హాస్పిటల్ దగ్గరికి వెళ్లి ఎంక్వయిరీ మొదలు పెట్టారు రమేష్ చనిపోవడం న్యూస్ లో చూసిన సిద్ధార్థ కీ సంతోషం తో కాలు నేల మీద నిలబడలేదు అప్పుడే కొంతమంది సెక్యూరిటీ ఆఫీసర్లు సిద్ధార్థ నీ అరెస్ట్ చేశారు తనని అంబాలా నుంచి ఫరీదాబాద్ మధ్యలో ఉన్న అడవి దారిలో తీసుకొని వెళ్లుతున్నారు అప్పుడే ఆ సెక్యూరిటీ అధికారి ఇన్స్పెక్టర్ కీ ఒక ఫోన్ వచ్చింది దాంతో జీప్ ఆపి సిద్ధార్థ నీ ఎన్కౌంటర్ చేయడానికి ప్రయత్నం చేశారు కానీ సిద్ధార్థ అందరినీ కొట్టి తనను ఎందుకు చంపాలీ, ఆ అవసరం ఎవరికి ఉంది అని అనుకున్నాడు దాంతో ఆ ఇన్స్పెక్టర్ ఫోన్ లో వచ్చిన నెంబర్ చూస్తే ప్రైవేట్ నెంబర్ దాంతో ఏమీ క్లూ దొరకలేదు ఇంక సిద్ధార్థ కీ ఒకటే దారి కనిపించింది.

దాంతో మరుసటి రోజు ఉదయం రమేష్ సంతాప సభ నిర్వహించారు అప్పుడు రాష్ట్రపతి, రమేష్ పార్టీ అధ్యక్షుడు కూడా ఉన్నారు అప్పుడు కొత్త తాత్కాలిక ప్రధాని ఎవరిని పెట్టాలని ఇద్దరు చర్చించుకుంటున్నారు అప్పుడే సిద్ధార్థ అక్కడికి వచ్చి అందరి ముందు తన తండ్రి చావు కీ ఎవరూ దిగులు పడవద్దు అని చెప్పారు తన తండ్రి స్థానంలో ఈ దేశం కోసం తను పాటుపడతాననీ మాట ఇచ్చి తనని కొత్త ప్రధానిగా ఎన్నుకోవాలి తన హై కమాండ్ కు చెప్పాడు అప్పటికే తను కోనేసిన కొంతమంది మినిస్టర్ లు సిద్ధార్థ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.

సిద్ధార్థ సంతాప సభ నుంచి డైరెక్ట్ గా ప్రధాని ఇంటికి వెళ్లి అక్కడ ఉన్న తన తండ్రి, తను కలిసి దిగిన ఫోటోలు అన్ని తీసి విసిరేశాడు ఆ తర్వాత వాటిని ఇంట్లో ఉన్న మందు బాటిల్స్ అని ఆ ఫోటోలు పైన పగల గొట్టి తగలబెట్టాడు అప్పుడే వచ్చిన మధు, వినోద్ అది చూసి మధు ఆవేశం గా సిద్ధార్థ మీదకు వెళ్లి లాగి కొట్టాడు "బ్రతికి ఉన్నపుడు ఎలాగో మీ నాన్న కీ నువ్వు గౌరవం ఇవ్వలేదు కనీసం ఇప్పుడయినా గౌరవించురా" అని అరిచి చెప్పాడు, "అవి నా కళ్ల ముందు ఉంటే నాలో ఆవేశం పెరుగుతోంది కానీ ఇప్పుడు నేను చేయాల్సింది ఆవేశం తో కాదు ఆలోచన తో నాన్న చనిపోయిన తర్వాత నన్ను కూడా చంపాలి అని చూశారు మన వెనుక చాలా పెద్ద ప్రమాదం ఉంది అది ఏంటో తెలుసుకోవాలి అంటే నేను prime minister నీ కావాలి అందుకే మన పార్టీ లో ఇప్పటికే నలుగురు మినిస్టర్స్ నీ కొనేశా కానీ ఒకడికి foreign affairs, ఇంకొకడికి central home ministry కావాలి అన్నారు కానీ వాళ్లు ఎద్దవలు కాబట్టి వాళ్లు సీట్లు ఎక్కిన రెండు రోజుల్లో కుర్చీ దిగాలి మన దేశం ముందుకు నడవాలి ఇలాంటి వయసు అయిపోయి పదవుల కోసం ఎగబాకే తోడేలు కాదు కావాల్సింది మన పార్టీ గెలిచిన అన్ని రాష్ట్రాల్లో నిజాయితీ గా పని చేస్తున్న, ప్రజల మద్దతు ఉన్న యంగ్ లీడర్స్ అందరి లిస్ట్ తీయండి నేను ప్రధాన మంత్రి కాకపోయినా కనీసం వాళ్ల లో ఒకరైన అవ్వాలి అంతే కాకుండా ఇప్పుడు ఉన్న సెంట్రల్ కేబినెట్ లో ఉన్న మినిస్టర్ ల జాతకాలు అని నాకూ కావాలి వారం రోజుల్లో కాబోయే ప్రధాని నీ announce చేస్తారు కాబట్టి be quick" అని చెప్పాడు సిద్ధార్థ.

సిద్ధార్థ చెప్పింది విన్న తర్వాత మధు, వినోద్ అదే పనిలో ఉన్నారు కాకపోతే సిద్ధార్థ అసలు ప్లాన్ వీల్లకు తెలియదు వాళ్ల నాన్న స్విస్ బ్యాంకుల్లో దాచిన 15,000 కోట్లు లో 1,000 కోట్లు తన తండ్రి బినామీ అకౌంటు లోకి షేర్ చేసి మరుసటి రోజు ఉదయం ఒక ప్రెస్ మీట్ పెట్టాడు "పిల్లవగానే వచ్చిన అందరికీ నా కృతజ్ఞతలు మీ అందరికీ తెలిసిందే మా నాన్న మన ప్రియతమ నేత రమేష్ ఠాకూర్ గారు దారుణంగా హత్య చేయబడ్డారు దానికి సంబంధించిన విచారణ జరుగుతుందీ కాకపోతే ఆయన చావుకు ఎవరూ కారణం నాకూ తెలియదు కానీ ఆయనను చంపే అవసరం ఏంటో తెలిసింది" అని అంటూ తన బాగ్ లో నుంచి కొన్ని డాక్యుమెంట్స్ తీసి చూపించాడు సిద్ధార్థ "ఇవి ప్రతి రాష్ట్రంలో ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్స్ లో పేదవారికి ఉచిత వైద్య, ఆరోగ్య సమస్యలకు పరిష్కారం సూచిస్తు, వారి పూర్తి ఆరోగ్యం తో బయటకు వచ్చే వరకు వాళ్లకు కావాల్సిన కర్చు మొత్తం ఉచితంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించేలా ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ లో foreign equipment తో మెరుగైన వైద్యం కోసం ఒక వెయ్యి కోట్లు వరకూ sanction చేశారు ఇది కనుక జరిగితే ఇక్కడ ఉన్న మెడికల్ mafia కీ కష్టం అవుతుంది అని ప్రతిపక్షంలోనో, లేదా మిత్రపక్షంలోనే ఎవరో ఒకరు చేసి ఉండొచ్చు కానీ నా తండ్రి కొంచెం అనారోగ్యంతో బాధపడుతు హాస్పిటల్ లో ఉండటం వల్ల ఈ బిల్ కొంచెం ఆలస్యం అయ్యింది కాకపోతే ఈ రోజు ప్రజల ముందు నేను బిల్ నీ పాస్ చేస్తున్నా నాకూ తెలుసు నాకూ ఆ అధికారం లేదు అని కాకపోతే చట్ట సభల్లో ఈ బిల్ అంత తేలిక గా పాస్ అవ్వడం జరగదు అందుకే ప్రెస్ ముందు ఈ బిల్ గురించి ప్రజలకు తెలిసేలా చేశాను దీని కోసం మేము, facebook, twitter లో ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తున్నాం కాబట్టి మీ హక్కు నీ మీరే కాపాడుకోండి జై హింద్" అని ప్రెస్ మీట్ ముగించాడు సిద్ధార్థ.

ఇది అంత చూస్తున్న వినోద్, మధు తో "సార్ నిజంగా అంకుల్ చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు సార్" అని అన్నాడు దానికి మధు నవ్వుతూ "నీ బొంద వాడు ఫైనాన్షియల్ మినిస్టర్ advisor గా ఉన్నపుడు వాళ్ల నాన్న తో చెప్పిన ప్రపోజల్ అది అప్పుడు ఎవ్వరూ పట్టించుకోలేదు అందుకే ఇప్పుడు ఇమేజ్ కోసం వాళ్ల నాన్న సంతకం వాడే పెట్టి దాని approval చేయించి PM అవ్వాలి అని ప్లాన్ చేశాడు" అని సిద్ధార్థ మాస్టర్ ప్లాన్ చెప్పాడు దానికి వినోద్ "అమ్మ దొంగ నా కొడుక" అని మనసులో సిద్ధార్థ నీ తిట్టుకున్నాడు, ప్రెస్ మీట్ ముగుస్తుండగా "సార్ మీరు ఇప్పుడు ప్రధాని అవ్వాలి అని చెప్పి ఈ బిల్ బయటకు తీసుకొని వచ్చారు అని అనుకోవచ్చా" అని అడిగారు ఒక రిపోర్టర్ "సార్ నా దృష్టిలో యువత మాత్రమే ఇప్పుడు ముందడుగు వేయాలి అని నా ఆలోచన ఒక ఫైనాన్షియల్ మినిస్టర్ advisor, ఢిల్లీ యూత్ లీడర్ గా నాకున్న అనుభవం తక్కువ అది ఒప్పుకుంటా నేను కాకపోయినా ఎవరైనా యువ నాయకులు ప్రధాని అయిన నాకూ సమంజసమే" అని చెప్పాడు సిద్ధార్థ "ఇన్ని రోజులు మీరు ఎక్కడ ఉన్నారు" అని ఒక రిపోర్టర్ అడిగితే "ప్రజల మధ్య లో ఉండి ప్రజా సేవ నేర్చుకున్నాను" అని చెప్పాడు అంతలో ఒక రిపోర్టర్ "Linbergh లో మీతో పాటు ఆ రోజు మీ కాలేజీ వెనుక ఉన్న పార్క్ లో మీతో పాటు అర్ద నగ్నంగా ఫోటో లో దొరికిన అమ్మాయి ఎవరో ఇప్పుడయినా చెప్తరా సార్" అని అడిగాడు ఒక రిపోర్టర్ దాంతో సిద్ధార్థ మొహం లో నవ్వు మాయం అయ్యింది తన ముందు ప్రపంచం అంతా blank అయ్యింది అప్పుడు వినోద్, మధు సిద్ధార్థ నీ తీసుకొని కార్ దగ్గరికి వెళ్లారు అప్పుడు సడన్ గా సిద్ధార్థ కార్ మీద ఒకటే సారి బుల్లెట్ వర్షం కురిసింది దాంతో బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ పగిలి ఒక బుల్లెట్ సిద్ధార్థ కుడి చేతికి తగిలింది.

దాంతో వినోద్ మిగిలిన సెక్యూరిటీ వాళ్లు ఎదురు కాల్పులు చేశారు అప్పుడు సిద్ధార్థ నీ ఇంటికి తీసుకొని వెళ్లి ట్రీట్మెంట్ చేస్తున్నారు అప్పుడు పార్టీ అధినేత మధు కీ ఫోన్ చేసి రెండు రోజుల్లో సిద్ధార్థ ప్రమాణ స్వీకారం అని చెప్పారు అది విన్న మధు సిద్ధార్థ వైపు చూసి సక్సెస్ అని అన్నాడు దానికి సిద్ధార్థ నవ్వుతూ "రేయ్ వినోద్ మీ sniper కీ Olympic లో గోల్డ్ మెడల్ confirm" అని చెప్పాడు (ఆ ఎటాక్ అంతా సిద్ధార్థ ప్లాన్ తను ఆ హాస్పిటల్ బిల్ ప్రపోజల్ తెచ్చింది తన ఇమేజ్ క్లీన్ అని నిరూపించుకోవడం కోసం కానీ ఎవరైనా తన గతం గురించి గేలికితే మొత్తం smash అని అర్థం అయ్యి ఆ controversy నుంచి జానలను divert చేయడానికి ముందు ప్లాన్ ప్రకారమే తన మీద తనే ఎటాక్ చేయించాడు) రెండు రోజుల తరువాత సిద్ధార్థ ప్రమాణ స్వీకారం కోసం తనతో పాటు vancross University లో చదివిన ఇంగ్లండ్ యువరాజు విలియమ్స్, అతని భార్య డోనీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు కొడుకు ఆ దేశ ఫైనాన్స్ మినిస్టర్ మార్కిన్, పాకిస్తాన్ ప్రధాని కూతురు ఆ దేశ foreign affairs మినిస్టర్ సోఫియా తహసిల్ అందరూ వచ్చారు వీలు ఐదుగురు మంచి ఫ్రెండ్స్ సిద్ధార్థ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు తన మదిలో ఒకటే జ్ఞాపకం కదులుతుంది "నువ్వు మన దేశ ప్రధానిగా ప్రమాణం చేస్తున్నప్పుడు నేను మన జెండా రంగుల తో ఉన్న చీర కట్టుకుని వచ్చి ముందు వరుసలో కూర్చుని చప్పట్లు కొడుతూ నీకు flying kiss లు ఇస్తా" అని తన ప్రేయసి సంధ్య చెప్పిన మాట గుర్తుకు వచ్చి కంటి నుంచి కన్నీరు కారింది సిద్ధార్థ కీ.

ప్రమాణ స్వీకారం తరువాత సిద్ధార్థ కంట్లో నీరు చూసి మధు "మీ నాన్న గుర్తుకు వచ్చాడా మీ నాన్న కల నిను ఇలా చూడటం కానీ తను అనుకున్న స్థాయి కంటే ఇంకా పైకి ఎదిగావ్ అందుకు చాలా గర్వంగా ఉంది రా సారీ సార్" అని సిద్ధార్థ నీ తీసుకొని వెళ్లాడు బయట కార్ లో ఇంటికి వెళుతుండగా కార్ కిటికీ నుంచి చూస్తే సంధ్య మోకాలి పైన నిలబడి సిద్ధార్థ వైపు చూస్తూ చేతులు చాచి రా అని పిలిచినట్టు అనిపించింది దాంతో వెంటనే కార్ లో నుంచి దూకి పరుగున వెళ్లి సంధ్య నీ కౌగిలించుకోవాలి అని చూశాడు కానీ అది అంత తన భ్రమ అని తెలిసి కొంచెం దిగులు గా కార్ వైపు వెళుతు తిరిగి వెనకు చూశాడు అప్పుడు సంధ్య ఒక flying kiss ఇచ్చి మాయం అయిపోయింది ఆ తర్వాత సిద్ధార్థ కార్ కూర్చొని తన చేతికి సంధ్య పెట్టిన ఉంగరం చూస్తూ ఉండిపోయాడు ఇంటికి వెళ్లిన తర్వాత సంధ్య ఫోటో ఒకటి ఫ్రేమ్ చేయించి తన బెడ్రూమ్ లో పెట్టాడు సిద్ధార్థ, సంధ్య ఫోటో చూస్తూ అలాగే ఉండిపోయిన సిద్ధార్థ నీ వెనుక నుంచి hug చేసుకొని "సారీ రా" అని చెప్పి బయటకు వెళ్లాడు వినోద్ ఆ తర్వాత సాయంత్రానికి వినోద్, సింగ్ ఇద్దరు కలిసి భోజనం చేస్తూ ఉంటే సిద్ధార్థ వాళ్ళని లోపలికి పిలిచాడు దాంతో ఇద్దరు లోపలికి వెళితే సిద్ధార్థ సంధ్య ఫోటో వైపు చూస్తూ "నాకూ మూడు బీర్లు కావాలి" అని అన్నాడు దాంతో వినోద్ కీ, సింగ్ కీ ఆరి కాలి నుంచి వణుకు మొదలైంది దాంతో వినోద్ "స్ట్రాంగ్ ఆ లైట్ ఆ" అని అడిగాడు దానికి సిద్ధార్థ స్ట్రాంగ్ అన్నాడు దాంతో సింగ్ కీ పాంట్ లోనే పడిపోయింది.

సిద్ధార్థ ఎప్పుడైనా కోపం లో ఉన్న, బాధ లో ఉన్న బీర్ తాగాలీ అనుకుంటే అవతలి వాళ్లకు బ్యాండ్ మొగిపోతుంది వాడు తాగితే అవతల వాళ్ల బాడి కీ football కీ తేడా ఉండదు సిద్ధార్థ కీ దాంతో వేరే దారి లేక వినోద్, సింగ్ నీ పంపి బీర్ తెప్పించాడు దాంతో పాటు సిద్ధార్థ favorite ఫిష్ ఫ్రై కూడా తెప్పించాడు అప్పుడు సిద్ధార్థ బీర్ ఫిష్ ముందు పెట్టుకొని వాటి వైపే చూస్తూ ఉన్నాడు తరువాత వినోద్, సింగ్ వైపు చూశాడు సింగ్ కీ భయం తో హార్ట్ ఎటాక్ వచ్చేలా ఉంది అప్పుడే వంట అతను వచ్చి ఒక ఆమ్లెట్ పెట్టాడు అతని తాగుతావా అని అడిగాడు అతను మొహమాటం తో ఇప్పుడు వద్దు సార్ అన్నాడు, అయితే ఆమ్లెట్ తిను అన్నాడు దానికి వంటవాడు అది మీ కోసం సార్ అన్నాడు దొరికాడూ బకరా అనుకోని వినోద్ "అయితే దాంట్లో విషం కలిపావా" అని అన్నాడు దాంతో వంటవాడు లేదు సార్ అని తినడం మొదలు పెట్టాడు వాడు తినడం పూర్తి అయ్యే లోపు సిద్ధార్థ మూడు బీర్లు లేపేసాడు అప్పుడు తన ముందు ఉన్న వంటవాడిని పట్టుకుని "ఒరేయ్ నాన్న నువ్వు ఒక దేశం కీ ప్రధాని అయితే మాత్రం కన్న కొడుకు కీ అవార్డ్ ఇస్తుంటే రావా " అని లాగి కొట్టాడు దాంతో వినోద్, సింగ్ ఇద్దరు షో స్టార్ట్ అయ్యింది అని డోర్ వెనకు వెళ్లి దాకుని చూస్తున్నారు, "సార్ ఏంటి సార్ అలా కొట్టారు" అని అడిగాడు ఆ వంట అతను దాంతో సిద్ధార్థ మళ్లీ కొట్టి "ఒక అమ్మాయి నచ్చింది అని చెబితే అది మన కులం కాదు అంటావా" అని మళ్ళీ కొట్టాడు దాంతో వినోద్ టాపిక్ ఎక్కడికి వెళుతుందో అర్థం అయ్యింది దాంతో సిద్ధార్థ నీ బెడ్ కీ కట్టెసి handcuffs వేశాడు "నేను ప్రేమించిన అమ్మాయి మన కులం కాకపోతే చంపేస్తావా" అని ఆరిచాడు సిద్ధార్థ అది విన్న వినోద్ ఇంక ఎవరూ వినలేదు కదా అని చూసి డోర్ లాక్ చేసి వెళ్లిపోయాడు.

నిద్రలో ఉన్న సిద్ధార్థ కలలో తన గతం కదలడం మొదలు అయ్యింది.

(ఆరు సంవత్సరాల క్రితం Edinburgh)

తన సొంత చార్టర్డ్ ఫ్లయిట్ లో తన కొత్త కాలేజీ కోసం డిజైన్ చేసిన సూట్ లు చెక్ చేసుకుంటూ ఉన్నాడు సిద్ధార్థ అప్పుడు మధు వచ్చి "నీ styling అయిపోతే నీతో కొంచెం మాట్లాడాలి" అని అన్నాడు దాంతో సిద్ధార్థ "అయిపోయింది ఆల్ఫ్రెడ్ అయిన చిన్నప్పటి నుంచి చూస్తున్న నా కాలేజ్ లో కానీ, కాలేజీ లో కానీ మొదటి రోజు నీ స్పీచ్ లేనిదే మొదలు అవ్వదు కదా" అని తన సూట్ సరి చేసుకుని మధు వైపు చూశాడు, దాంతో మధు సిద్ధు సూట్ సరి చేస్తూ "ఇప్పుడు నువ్వు వెళ్లేది ప్రపంచంలోనే చాలా పేరు ఉన్న యూనివర్సిటీ ఇక్కడి నుంచి గ్లోబల్ లీడర్షిప్ లో certified అయిన వాళ్లు చాలా దేశాల్లో మంచి నాయకులు అయ్యారు కాబట్టి చదువు మాత్రమే కాకుండా ఇతర దేశ ప్రతినిధుల పిల్లల తో కొంచెం Diplomacy maintain చేయి అప్పుడు వాళ్ళు నీకు ఎక్కడో ఒకచోట ఉపయోగ పడతారు" అని చెప్పాడు ఆ తర్వాత ఫ్లయిట్ ల్యాండ్ అయ్యింది అందరూ యూనివర్సిటీ కీ బయలుదేరారు అప్పుడు మధు "ఇది నీ కొత్త సెక్యూరిటీ చీఫ్ details సింగ్ కూడా ఉంటాడు కానీ తన కంటే better person నీకోసం వస్తున్నాడు పైగా ఇంకొక విషయం ఇండియా లో ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ఏ ఎద్దవ పని చేయకుండా జాగ్రత్తగా ఉండు" అని చెప్పాడు వాళ్లు యూనివర్సిటీ కీ చేరుకోగానే అక్కడ మొత్తం అందరూ ప్రెస్ వాళ్లు గేట్ కీ అడ్డం గా ఉన్నారు అందరూ సిద్ధార్థ ఫ్యాషన్ సెన్స్ నీ బాగా మెచ్చుకున్నారు అప్పుడే ఫ్రాన్స్ యువరాణి డోని, తన అన్న మార్కిన్ ఇద్దరు వాళ్ల middle finger మీడియా వాళ్లకు చూపిస్తూ దిగారు వాళ్ళని చూసి సిద్ధార్థ గట్టిగా విజిల్ వేశాడు దానికి మధు, సిద్ధార్థ నీ క్యాంపస్ లోకి తీసుకొని వెళ్లి "ఏమీ చేస్తున్నావ్ be disciplined" అని అన్నాడు, "మనం చేయలేని పని ఎవడైనా చేస్తే encourage చేయాలి ఆల్ఫ్రెడ్" అని చెప్పి తన రూమ్ లోకి వెళ్ళాడు అప్పుడు మధు సింగ్ "బాబు కొంచెం active జాగ్రత్త మీ చీఫ్ సాయంత్రానికి వస్తాడు కమాండో వినోద్ కుమార్" అని చెప్పాడు దానికి సింగ్ "గుప్తా జీ నన్ను ఇద్దరు పిచ్చోల మధ్య ఇరికించారు ఏంటి" అని అన్నాడు అప్పుడే పాకిస్తాన్ ప్రధాని యూసుఫ్ రజా తన కూతురు సోఫియా నీ తీసుకొని వచ్చారు వాళ్ళని చూసిన మధు వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళుతు సింగ్ నీ పిలిచి "ముఖ్యంగా బాబు సోఫియా దగ్గరికి వెళ్లకుండా చూసుకో అసలే మీడియా కళ్లు ఈ క్యాంపస్ చుట్టూ ఉన్నాయి" అని చెప్పి వెళ్లిపోయాడు.

సిద్ధార్థ ఎవరికి తెలియకుండా తన హాస్టల్ కిటికీ నుంచి బయటకు బెడ్ షీట్ తో తాడు కట్టి కిందకి వెళ్లి క్యాంపస్ బయట పార్క్ లోకి వెళ్ళాడు అక్కడ కర్ణాటక సంగీతం వినిపించింది దాంతో అలా వెళ్లి చూస్తే ఒక అమ్మాయి అచ్చు భారతీయ పడుచు పిల్ల ఆ సంగీతం కీ తన కాలి మువ్వల శబ్దం తో జత కట్టి మైమరచి నాట్యం చేస్తూ ఉంటే నెమలి పురి విప్పి నాట్యం ఆడినట్టు అలాగే మైమరచి చూస్తూ ఉండిపోయాడు ఇంతలో సింగ్ వచ్చి సిద్ధార్థ నీ బలవంతంగా లాకుని వెళ్లాడు అక్కడ రూమ్ లో అప్పటికే వినోద్ వచ్చి ఉన్నాడు తనని చూసి సిద్ధార్థ "రేయ్ బావ" అంటు గట్టిగా కౌగిలించుకున్నాడు కానీ వినోద్ సిద్ధార్థ నీ పక్కకు నెట్టి "సారీ సార్ I am your new security chief reporting" అని సెల్యూట్ చేశాడు వినోద్.​
Next page: Update 02