Update 04

చిన్నా : అది వదినా, స్కానర్ సరిగ్గా పని చెయ్యలేదు అందుకే లె.. ట్... అయ్యింది..

లావణ్య : పదా వెళదాం.

లావణ్యని ఇంటి దెగ్గర దింపేసి, ఇంటికి వెళ్లి ఒక పది నిముషాలు కూర్చున్నా అంతే ఎమ్మటే లేచి రెస్టారెంట్ కి వెళ్లిపోయా.

అక్షిత : ఏంటి మళ్ళీ వచ్చావ్.

చిన్నా : ఐస్ క్రీం కావాలి, తీసుకురా ఇందాక తినడం మర్చిపోయా ఇంటికి వెళ్ళగానే గుర్తొచ్చి వచ్చేసాను

అక్షిత : అలా కూడా వస్తారా

చిన్నా : నేనొచ్చాగా

అక్షిత : సరే సరే ఉండు తెస్తా..

అని అటువైపు తిరిగి నవ్వుకుంటూ లోపలికి వెళ్ళి ఐదు నిమిషాలకి ఐస్ క్రీం తొ వచ్చి టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోతుంది.

చిన్నా : ఉండొచ్చుగా

అక్షిత : ఇలా తగులుకున్నావెంట్రా బాబు

చిన్నా : నీకు నచ్చలేదంటే చెప్పు ఇక జీవితంలో నీకు నా మొహం చూపించను.

అక్షిత : నచ్చలేదు

చిన్నా : ఓయి అలా మొహం మీదే చెప్పేస్తావా, ఎందుకు నచ్చలేదు.

అక్షిత : నచ్చలేదంటే నచ్చలేదు అంతే ఇక నీ మొహం నాకు చూపించకు

చిన్నా : ఏదో సినిమాలో డైలాగ్ బాగుందని వాడాను అంతే నిన్ను చూడకుండా నేను ఉండలేను.

అక్షిత : ఇది ఏ సినిమాలోది.. అయినా నన్ను చూసిందే ఇందాక అప్పుడే లవ్వు అని వెంటపడుతున్నావ్ కొంచెం ఓవర్ గా లేదు, బైట నీ ఏజ్ అమ్మాయిలు ఆంటీలు దొరుకుతారు వెళ్లి ట్రై చెయ్యి పో.

చిన్నా : అదే కదా నా బాధ కూడా ఒక అమ్మాయి వెంట పడతానని నా కలలో కూడా అనుకోలేదు, మరీ ఇలా కుక్కలాగ వెంటపడతానని అస్సలు అనుకోలేదు. అయినా ఎవరు చెప్పారు నీకు నిన్ను ఇప్పుడే చూసానని మనది ఈ జన్మలో ప్రేమ కాదు

అక్షిత : నాలుగోందల ఏళ్ల నాటిదా

చిన్నా : చెప్పేది విను.. ఆ జన్మలో నీది ఎక్కువ కులం నాది తక్కువ కులం అందుకే ఊరి జనాలు అందరూ కలిసి మనల్ని రాళ్ళతొ కొట్టి చంపేశారు.

అక్షిత : ఇదేదో అల్లరి నరేష్ సినిమా లాగుంది.. అయినా అబ్బాయి ఎప్పుడు తక్కువ కులంలో అమ్మాయి ఎప్పుడు ఎక్కువ కులంలోనే ఎందుకు పుడతారు.

చిన్నా : అది అంతే అప్పుడే కదా ఎమోషన్ వర్క్ అయ్యేది.

అక్షిత : నువ్వు చెప్పింది కధ అని నువ్వే ఒప్పుకున్నావ్.

చిన్నా : అబ్బా ప్లీజ్..

అక్షిత : నేను వెళ్ళాలి.. నీ వల్ల నాకు తిట్లు పడేలా ఉన్నాయి.

అని కిచెన్ లోపలికి వెళుతుంటే లేచి తన వెనకాలే వెళ్లాను.. అవుట్ సైడర్స్ నాట్ అల్లోడ్ అంటూ డోర్ మీద ఉన్న సైన్ మీద చేత్తో కొట్టి లోపలికి వెళ్ళింది.

అబ్బా అనుకుంటూ గుండె మీద చెయ్యి వేసుకుని వెనక్కి తిరిగాను.. ఓయి అనగానే అక్షిత వైపు చూసాను.

అక్షిత : బిల్లు కట్టిపో

చిన్నా : నీకోసం ఏదైనా చేస్తా.. నిన్ను మహారాణి కాదులే మనిషిలా చూస్తా ఏం కావాలన్నా కొనిస్తా.. ఎహె ఇవన్నీ కాదు బతికున్నంత వరకు నిన్నే ప్రేమిస్తా హా ఇది.. ప్రాణంలా చూసుకుం..

అక్షిత : చెప్పు మాటలు అన్ని మింగుతున్నావ్, నీ మీద నీకే కాంఫిడెన్స్ లేదు.

చిన్నా : నిజంగా నిన్ను చాలా బాగ చూసుకుంటా, ఏ లోటు రానివ్వను.

అక్షిత : సరే స్ట్రైట్ టు ద పాయింట్.. ఈ మూసుకులో గుద్దులాటలు ఎందుకు.. నువ్వు కూడా నాకు నచ్చావు, నాకు నీ పేరు కూడా తెలీదు కానీ నిన్ను చూడగానే నాకు అదే ఫీలింగ్ కలిగింది.. నువ్వు వెళ్ళిపోయాక మళ్ళీ రావాలని దేవుడికి దణ్ణం కూడా పెట్టుకున్నాను.. నిన్ను ఏమి అడగను నాకు అది కావాలి ఇది కావాలి అని ఏమి అడగను కళ్ళు మూసుకుని గుడ్డి దానిలా నిన్ను నమ్మి నీతో వస్తాను లైఫ్ లాంగ్ నాతోనే ఉంటావా ప్రామిస్ చెయ్యి.. అని చెయ్యి చాపింది.

నా నోట మాట రాలేదు పది రోజులు దాటితే నేను ఎక్కడుంటానో ఏ దేశంలో ఉంటానో అస్సలు ఉంటానో లేదో కూడా నాకు తెలీదు.. ఏం ఆలోచించకుండా మతి స్థిమితం లేని వాడిలా ఈ అమ్మాయి వెంట పడ్డాను.

అక్షిత : చెప్పు.. నేనో అనాధని నాకంటూ ఎవ్వరు లేరు కొన్ని పరిచయాలు తప్ప, నాకు నీ గురించి కూడా తెలీదు రేపు నువ్వు నన్ను మోసం చేసినా నేను చేసేదేమి లేదు.. నేను గొడవ పడే రకం కాదు నలుగురి ముందు నానా గొడవ చేసేదాన్ని కూడా కాదు.. నా నుంచి 100% నిజమైన ప్రేమ ఉంటుంది ఎందుకంటే నువ్వు నాతో కలిస్తే నాకొక ఫ్యామిలీ ఏర్పడుతుంది ఇక నేను అనాధని కాను. ఎన్నో ఏళ్లగా ఇలాంటి రోజు కోసం చూస్తున్నా.. నువ్వు అలవాటు అయ్యాక నీ మీద ఆశలు కోరికలు పెంచుకున్నాక నువ్వు నాకు దూరం అయితే తట్టుకునే శక్తి నాకు లేదు.. ఈ ఒక్క మాట చెప్పు జీవితాంతం నాకు తోడుగా ఉంటావా?

అప్పుడే ఒక చిన్న పాప రెస్టారెంట్ లోకి వస్తుంటే చూసాను తెల్ల గౌను, చేతిలో చిన్నది ఇండియా ఫ్లాగ్ పట్టుకుని గాల్లో అటు ఇటు తిప్పుతూ సంతోషంగా లోపలికి వస్తుంటే వెనక తన అమ్మ ఆ వెనుక నాన్న తన కాలేజ్ బ్యాగ్ మోసుకుంటూ తన పాప నవ్వుని చూస్తూ వస్తున్నాడు.. నాకు ఆ పాప చేతిలో ఉన్న జెండా మాత్రమె కనపడింది. అక్షిత వైపు తిరిగాను.

చిన్నా : సారీ ఇవ్వాళంతా మిమ్మల్ని ఇబ్బందిపెట్టాను రియల్లీ సారీ.. ఇక నేను మీకు కనిపించను అని చెప్పేసి తల దించుకుని బైటికి వచ్చేసాను. ఒక్కో అడుగు బైటికి వేస్తుంటే ఆ అడుగులో ఇంత వెయిట్ ఎప్పుడు అనుభవించలేదు కొత్తగా ఉంది.. నేరుగా ఇంటికి వెళ్లిపోయాను.

పడుకుందామని ట్రై చేసాను నిద్ర రాలేదు, అటు ఇటు దొల్లాను... అందరూ ఫస్ట్ లవ్ అంటారు ఇలాగే ఉంటుందేమో అందరికి.. అమ్మ అటు ఇటు తిరుగుతుంటే పిలిచాను.

పార్వతి : ఏంట్రా

చిన్నా : ఇలా రా

పార్వతి : పనిలో ఉన్నాను, చెప్పు

చిన్నా : ఎహె.. రా

పార్వతి : ఆ ఏంటి?

చిన్నా : కూర్చో

పార్వతి : ఏంట్రా నీ గోలా

చిన్నా : కూర్చోవె.. అని కూర్చోబెట్టి ఒళ్ళో తల పెట్టుకుని నడుముని గట్టిగా వాటేసుకుని కళ్ళు మూసుకున్నాను.. మూడు ఏళ్ల పైనే అయిపోయింది అమ్మని ఇంత దెగ్గరగా ఇలా పట్టుకోవడం.

పార్వతి : ఎంట్రోయ్ ఇది కొత్తగా

చిన్నా : ఏం మాట్లాడకుండా నన్ను నిద్ర పుచ్చు..

పార్వతి చిన్నగా తల నిమురుతూ ఇంకో చేత్తో వెన్ను నిమురుతుంటే చిన్నా నిద్రలోకి జారుకున్నాడు..

సతీష్ : అమ్మా.. అమ్మా.. ఎక్కడా

పార్వతి : ష్..

సతీష్ : వావ్.. ఏంటీ సప్రైస్..

పార్వతి : ఏమో.. వీడు నాతో ఇలా ఉండి చాలా ఏళ్ళు దాటిపోయింది.. అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది ఎందుకు వీడు అందరిలా లేడు అమ్మనైన నాకే దూరంగా ఉంటాడు, ఏమి చెప్పడు అన్ని దాస్తాడు..

సతీష్ : వాడంతేలే

రాజేంద్ర : పార్వతి టైం అవుతుంది వెళ్ళాలి, ఏం చేస్తున్నారు ఇక్కడా.. అబ్బో ఏంటీ వింతలు.

పార్వతి : వాడి మీద ఎప్పుడు ఏడుపే

రాజేంద్ర : సరే సరే రండి వెళదాం టైం అవుతుంది

పార్వతి : రాను

రాజేంద్ర : అది కాదే

పార్వతి : రాను ఏమైందో ఏమో ఇన్నేళ్లకి మళ్ళీ నా బిడ్డ ఇలా వచ్చాడు, పనులెమైనా ఉంటే మీరు చూసుకోండి లేదంటే ఆగండి.

రాజేంద్ర : సరే

సతీష్ : ఏంటి మా ఏడుస్తున్నావ్

రాజేంద్ర : మీ అమ్మ కొత్తగా ఏం ఏడవట్లేదు రోజు జరిగేదే ఇవ్వాళ నువ్వు చూస్తున్నావ్ అంతే

పార్వతి : ఎందుకు వీడికి ఇన్ని కష్టాలు, ఎందుకు అందరికీ దూరంగా ఉంటాడు.. ఎందుకు ఇంత రాయి గుండె వీడికి.. ఎవ్వరితో ఏమి పంచుకోడు అందరిని ఏదో బైట వాళ్ళని చూసినట్టు చూస్తాడు.. నా కొంగు వదిలి ఒక్క నిమిషం కూడా ఉండేవాడు కాదు ఇప్పుడేమో అస్సలు ఇంట్లోనే ఉండట్లేదు.. దేనికిదంతా

రాజేంద్ర : నేను వాడిని పొమ్మన్నానా ఏదో కోపంలో ఒక మాట జారాను దాన్ని పంతంగా తీసుకుని వాడే వెళ్ళిపోయాడు.

పార్వతి : రేపు పెళ్ళైతే ఆ అమ్మాయితో కూడా వీడు ఇలానే ప్రవర్తిస్తే ఎలాగ, నాకు భయంగా ఉంది.. మీరేం చేస్తారో నాకు తెలీదు వీడు ఇల్లు దాటడానికి వీల్లేదు.

సతీష్ లేచి బైటికి వచ్చి ఫోన్ తీసి అప్పటివరకు కాల్ లో ఉన్న లావణ్యతొ మాట్లాడాడు.

సతీష్ : విన్నావా

లావణ్య : హా.. మీ తమ్ముడు సరిగ్గా ఉంటే ఇంకే బాధ ఉండదు.

సతీష్ : చూద్దాం.

రాజేంద్ర కూడా పార్వతితొ మాట్లాడి చిన్న పిల్లాడిలా పడుకున్న తన చిన్న కొడుకుని చూసుకుని బైటికి వెళ్ళిపోయాడు.. పార్వతి మాత్రం అలానే కూర్చుండిపోయింది.. ఎదిగిన తన కొడుకు శరీరంలో మార్పులు, కండలు, ఒంటి మీద దెబ్బలు, మెడ మీద గాట్లు అన్ని తడుముతూ బాధ పడుతు ఆలోచిస్తుంది.

రాత్రికి మెలుకువ వచ్చి లేచాను చూస్తే ఇంకా అమ్మ ఒళ్ళోనే ఉన్నాను, కానీ అమ్మ నిద్ర పోయింది లేచి తనని నా ఒళ్ళో పడుకోబెట్టుకున్నాను.. అమ్మ మొహం అంత దెగ్గరగా చూడగానే చిన్నప్పటి ఆటలన్ని గుర్తొచ్చాయి.. ఈ పది రోజులు అమ్మతొ గడిపి మళ్ళీ తన నవ్వు చూడాలని అనుకున్నాను.. హ్మ్.. నీతో గడిపింది ఒక్క రోజైనా చాలా బాగుంది అక్షిత.. మిస్ యూ.

అక్షిత యధావిధిగా తన పనులు చేసుకుని రూంకి వచ్చి స్నానం చేసి మంచం ఎక్కింది.. ఇంతలో ఫోన్ వస్తే చూసి ఎత్తింది.

అక్షిత : హాయ్ అన్నా

వాసు : పడుకోలేదుగా డిస్టర్బ్ చేసానా

అక్షిత : లేదు అయినా నిద్ర రావట్లేదు

వాసు : ఎందుకో

అక్షిత : ఇవ్వాళ ఒకడు తగిలాడు, నన్ను బాగా డిస్టర్బ్ చేసాడు

వాసు : ఏమైంది?

అక్షిత : ప్రపోస్ చేసాడు.. లైఫ్ లాంగ్ నాతోనే ఉంటావా అని అడిగాను అంతే నా మొహం కూడా చూడకుండా వెళ్ళిపోయాడు.

వాసు : అలాంటి వెధవలు రోజుకి వంద మంది తగులుతారు.

అక్షిత : తెలుసు నాకు తగిలారు కూడా కానీ..

వాసు : నువ్వు ఇష్ట పడ్డావా

అక్షిత : హా.. ఇంకా నీ పద్మ ఎలా ఉంది

వాసు : పక్కనే ఉండి మన మాటలు వింటుంది.

అక్షిత : హాయ్ వదిన

పద్మ : హాయ్ అక్షిత, బాధ పడకు నీకు తగిన వాడు కచ్చితంగా నీ దెగ్గరికి వస్తాడు.

అక్షిత : అలాగే, తిన్నారా

పద్మ : ఎప్పుడో, నువ్వు?

అక్షిత : (అయ్యిందని అబద్ధం చెప్పేసింది)... ఇటు వైపు వస్తే నన్ను కలవకుండా వెళ్ళకండి

పద్మ : నేనూ అదే అడుగుతున్నా నిన్ను ఫోన్ లో చూడ్డమే కానీ ఒక్కసారి కూడా కలవలేదు.

అక్షిత : ఎందుకులె నాతొ ఎవ్వరికీ కుదరదు ఇలా దూరంగా అయినా మాట్లాడితే కొంత బాగుంది.. సరే ఉంటాను నిద్రొస్తుంది.. అని ఫోన్ పెట్టేసింది..

వాసు : బాగా బాధ పడుతున్నట్టుంది.

పద్మ : రేపు వెళ్లి కలుద్దాం, ఎవడో వాడు అక్షితని బాధ పెట్టాడు అలాంటి మంచి అమ్మాయి దొరకాలంటే రాసి పెట్టుండాలి..

వాసు : సరే పడుకో నేను అమ్మతొ మాట్లాడి వస్తా...​
Next page: Update 05
Previous page: Update 03