Update 11

ఆఫ్రికా దట్టమైన అడవుల్లో నివాసముండే చాలా మంది తెగల్లో మంధీ జాతి ఒకటి, ఆ అడవిలో ఉన్న పన్నెండు తెగలకి రక్షణ కల్పించే బాధ్యత ఈ మంధీ జాతి వాళ్ళది.

ఏ తెగకి ఆ తెగ, ఎవరికి వారు వారి జీవితాలు సాఫీగా సాగుతున్న రోజులవి, అందరూ చెట్లని వాళ్ళ స్థావరాలని పూలతో మిణుగురు పురుగులతో అలంకరించుకుంటున్నారు. ప్రతీ ఒక్కరి కళ్ళలో ఆనందం, ఈ రోజు ఆ తెగ నాయకుడిని ఎన్నుకునే రోజు.

అందరూ నిర్ణయించుకుని ఈ సారి ఏకగ్రీవంగా రక్షని ఎన్నుకుని తనకి తెగ బాధ్యతలు అప్పగించాలని పెద్దలు తీర్మానించారు, దీనికి కారణం లేకపోలేదు.. అక్కడున్న పన్నెండు తెగలు అంతకముందు ఎప్పుడు కొట్టుకునేవి, ఒకరంటే ఒకరికి పడేది కాదు కాని ఎప్పుడైతే విక్రమాదిత్య ఆ అడవిలో అడుగు పెట్టాడో అక్కడ వాళ్ళకి ఉన్న సమస్యలు పరిష్కరించి, ఒక్కొక్క తెగకి ఒక్కో బాధ్యతని అప్పగించి అందరినీ కలిసిమెలిసి ఉండేలా కొన్ని నిబంధనలు అమలు చేసి, తన కూతురుని ఈ మంధీ జాతికి అప్పగించి వెళ్ళిపోయాడు.

చిన్నప్పటి నుంచి అప్పుడప్పుడు తన తండ్రిని కలిసి తన తండ్రి జీవితంలో ఏమేమి జరుగుతున్నాయో తెలుసుకుంటూనే ఉంది, తనకున్న ఒకే ఒక ధ్యేయం తన తండ్రి విక్రమాదిత్య లేనప్పుడు తన కుటుంబాన్ని కాపాడే బాధ్యత తను తీసుకోవాలి. తన కుటుంబీకుల మంచి చెడ్డల గురించి తెలుసుకుంటూనే ఆ తెగ ప్రజలతో కలిసిపోయి శిక్షణ తీసుకుంటుంది.

రక్ష ఇప్పుడు పెద్దయింది అంతక ముందు అటు అక్కడున్న పక్క దేశపు మిలిటరీకి తెగ వాళ్ళకి జరిగిన యుద్ధంలో రక్ష అసామాన్య ప్రదర్శన కనబరిచింది. అప్పుడే అర్ధమైంది అక్కడున్న అందరికి రక్ష అందరిలాంటి మామూలు మనిషి కాదని. అదీ కాక యుద్ధంలో రక్ష చూపంతా అవతలి వాళ్ళని చంపడం మీద కంటే తన తెగ వాళ్ళని కాపాడుకోవడం మీదే ఎక్కువగా దృష్టి పెట్టింది, అందుకే రక్షని తెగ నాయకిగా అందరూ అంగీకరించారు.

అందుకే అందరూ సంతోషంగా ఉన్నారు, తమకి ఇష్టమైన వ్యక్తి తమ నాయకులు అవుతున్నారంటే అంతకంటే ఆనందం ఇంకెక్కడుంది, అందులో ఇప్పటి వరకు ఏ అమ్మాయిని ఒక తెగకి నాయకురాలిగా ఎన్నుకోలేదు. అక్కడున్న ప్రతీ ఒక్క అమ్మాయి కళ్ళలో గర్వం తాండవం చేస్తుంది.

తెగ నాయకుడు : రక్ష భాధారే (రక్ష ఎక్కడా)

తెగ నాయకుడి భార్య : మయి మధూభ గై ఉత్తి, ఫైషి భైషా (నా మాట ఎక్కడ వింటుంది, శిక్షణలో ఉంది)

తెగ నాయకుడు నవ్వి వెళ్ళిపోతూ.. ప్రచ్చసో భజర్ భళా బోస్ (సాయంత్రానికి సిద్ధంగా ఉండమని చెప్పు )

చుట్టు ఖాళీ స్థలం అక్కడ కొంత మంది ఆడపిల్లలు శిక్షణ తీసుకుంటున్నారు, ఆ పక్కనే ఉన్న మొత్తం ఎండుగడ్డి. దాని అవతల రక్ష తన గొడ్డలితో కుస్తీలు పడుతుంది ఇంతలో గన్ పేలిన శబ్దం విని అందరూ రక్ష వైపు పరిగెత్తారు. రక్ష కూడా గన్ పేలిన శబ్దం వైపు చూసింది. ఎవరో ఒక భార్య భర్త రక్ష వైపు పరిగెడుతుంటే వెనకాల ఉన్న ఐదుగురు సైనికుల్లో ఒకడు అతన్ని కాల్చేశాడు అయినా కూడా ఆమె తన పరుగుని ఆపలేదు.

భర్త చనిపోయాడని తెలిసినా సరే తన ఒక చేతిలో ఉన్న కొన్ని కాయితాలని ఇంకో చేతిలో ఉన్న నాలుగేళ్ల బిడ్డని సంకనేసుకుని పరిగెడుతూనే ఉంది. ఆ ఐదుగురు సైనికులు రక్షని, బాణాలు పట్టుకుని గురి పెట్టిన రక్ష మనుషులుని చూడగానే ఆగిపోయారు కాని అందులో ఒకడు పరిగెడుతున్న ఆవిడని గురిపెట్టి కాల్చేశాడు.

ఏమనుకుందో ఏమో భయంతో పరిగెడుతున్న ఆడదాన్ని వెనక నుంచి కాల్చడం రక్షకి నచ్చలేదు వెంటనే పక్కన ఉన్న అమ్మాయి చేతిలో ఉన్న బాణం తీసుకుని కాల్చిన వాడి కంట్లోకి గురిపెట్టి కొట్టింది అంతే వాడు పడిపోయాడు, అది చూసిన మిగతా నలుగురు అక్కడ నుంచి పారిపోయారు.

రక్ష మిగతా వాళ్ళు వెంటనే కింద పడ్డ ఆవిడ దెగ్గరికి వెళ్లారు, చిన్న పాప తన అమ్మని పట్టుకుని ఒకటే ఏడుపు.

రక్ష : ఎవరు మీరు ముందు పదండి అని లేపబోయింది కాని ఆమె రక్ష చెయ్యి కొట్టేసింది.

నేను బతకనని నాకు తెలుసు అంటూనే ఆమె తన చేతిలో ఉన్న ఒక ఫైల్ తీసి రక్షకి ఇచ్చింది, దాని మీద CLASSIFIED అని ఎర్రగా రాసి ఉంది.

నేను చెప్పేది వినండి రాబోయే రోజుల్లో మిమ్మల్ని అంతం చెయ్యడానికి గవర్నమెంట్ కుట్ర పన్నుతుంది. ఈ విషయం అందులో పని చేస్తున్న నా భర్తకి తెలిసి మిమ్మల్ని కాపాడాలని చాలా ప్రయత్నించారు అని కళ్లెమ్మటి నీళ్లతో తన భర్త పడిపోయిన చోటుని చూసింది, నేనొక జర్నలిస్ట్ ని ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగ పడుతుంది.. అని తన కూతురుని చూసుకుని పాప కళ్ళు తుడిచి ముద్దు పెట్టుకుని అలానే ఉండిపోవడంతో తను చనిపోయిందని రక్ష అర్ధం చేసుకుని ఆ పాపని ఎత్తుకుని ఆవిడ కళ్ళు మూసింది.

ఆ ఇద్దరి దంపతులని పూడ్చి వాళ్ళ సమాధుల మీద ఆ పాపతో పూలు పెట్టించి ప్రార్ధన చేపించింది. అప్పటికే జరిగిన విషయం అందరికి తెలియడంతో వెంటనే పన్నెండు తెగ నాయకుల అత్యవసర సమావేశం మొదలయ్యింది.

అందరూ చుట్టూ ఎవరి ఆసనం మీద వారు ఆసీనులయ్యారు, రక్ష వారందరి మధ్యలో పాపని ఎత్తుకుని నిలుచుంది. అది అక్కడున్న ఎవ్వరికి రుచించలేదు. పాప భయం భయంగా అందరినీ చూసి రక్షని గట్టిగా పట్టుకుంది. రక్ష పాప వెన్ను నిమిరింది నీకే భయం లేదని.

అందరూ వారి వారి ప్రశ్నలని రక్ష మీదకి సంధించగా అన్నిటికి జవాబులు చెప్పింది.. అంతా వివరించింది. అందరూ ఒక నిర్ణయానికి వచ్చారు కాని పాపని తిరిగి పంపించేయ్యమన్నారు దానికి రక్ష ఒప్పుకోలేదు.

రక్ష : నా జీవితంలో పెళ్లి లేదు, నేను ఎపుడో నిర్ణయించుకున్నాను కాని ఏ దురుద్దెశం లేకుండా తన తల్లి తండ్రులు మనకోసం వాళ్ళ ప్రాణాలని ఫణంగా పెట్టారు దానికి కృతజ్ఞతగా ఈ పాపని నేను దత్తత తీసుకుంటాను.

రక్ష నుంచి ఈ మాట వినగానే అందరూ లేచి నిలుచున్నారు, రక్ష మాటలు ఎవ్వరికి నచ్చలేదు అదే మొహం మీదే చెప్పేసారు, కాని రక్ష ససేమిరా అన్నట్టు కూర్చుంది ఇక లాభం లేక మా మాట కనక వినకపోతే నిన్ను నాయకురాలిగా నియమింపబోయేది లేదని తెల్చేశారు. రక్ష దానికి ఒప్పుకుంది. వాళ్ళు కూడా రక్ష ఇక మాట వినదని అర్ధమయ్యి తప్పక ఒప్పుకున్నారు కాని షరతులు పెట్టారు..

రక్ష ఈ క్షణం నుంచి ఆ తెగకి ఒక సైనికురాలు మాత్రమే ఎలాంటి విషయంలో జోక్యం చేసుకోడానికి వీల్లేదని, ఇక నుంచి మిగతా వాళ్ళకి శిక్షణ ఇవ్వడం మానుకోవాలని ఆదేశించారు దానికి రక్ష నవ్వుతూ తల వంచి తన అంగీకారం తెలిపింది. మంధీ తెగ నాయకుడు ఇదంతా చూసి బాధ పడ్డాడు కాని చేసేది ఏం లేదు, ఇది అందరి నిర్ణయం.

రక్ష అక్కడ నుంచి పాపని ఎత్తుకుని బైటికి వచ్చింది, నవ్వుతూ పాపని ఆడిస్తూ అక్కడ తన దెగ్గర శిక్షణ తీసుకునే అమ్మాయిలు ఏడుస్తూ కనిపించారు.. రేపటి నుంచి రక్ష తమకు శిక్షణ ఇవ్వదని తెలియగానే వాళ్ళకి ఏడుపు ఆగలేదు, రక్ష అందరినీ ఓదార్చి అక్కడ నుంచి పాపతో తన స్థావరానికి వచ్చింది.

రక్ష పాపని ఆడించి నిద్రపుచ్చింది, కొన్ని రోజులు పాపం ఆ బిడ్డ తన తల్లి తండ్రుల కోసం అల్లాడింది కాని రక్ష ప్రేమలో పడి త్వరగానే వాళ్ళని మర్చిపోయింది. పాపతో సావాసంలోనే ఇంకా తనకి నామకారణం చెయ్యలేదని తెలుసుకుని ఓ మంచి రోజున తనకి అక్షిత అని నామకారణం చేసింది.

సడన్ గా మెలుకువ వచ్చి లేచింది అక్షిత, పక్కనే ఉన్న చిరంజీవి కూడా లేచి అక్షిత మొహం చూసి మంచం దిగి వెళ్లి మంచినీళ్లు తెచ్చిచ్చాడు, తీసుకుని తాగింది.

చిన్నా : ఏమైంది.. పీడకలా?

అక్షిత : లేదు.. ఏం లేదు అని అటు తిరిగి పడుకుని కళ్ళు మూసుకుంది నిద్ర రాకపోయినా.. చిన్నా అక్షిత వీపు మీద ముద్దు పెట్టి కౌగిలించుకుని పడుకున్నాడు.

పార్వతి : హలో

చిన్నా : చెప్పవే

పార్వతి : ఎక్కడున్నావ్

చిన్నా : బార్లో

పార్వతి : నిన్ను నాన్న అర్జెంటుగా రమ్మంటున్నాడు

చిన్నా : ఏంటంటా

పార్వతి : ఏమో.. సీరియస్ గా ఉన్నాడు.. ముందు ఇంటికైతే రా

చిన్నా : సరే వస్తున్నా.. రేయి చూసుకో నేనెళుతున్నా అని ఇంకొకడికి చెప్పేసి ఇంటికి వచ్చాను.. అన్నయ్య కనిపించాడు.. ఏంటంటా అని అడిగాను

సతీష్ : నీకో సంబంధం వచ్చింది.. కోపంతో ఊగిపోతున్నాడు

చిన్నా : మంచి విషయమేగా దానికి ఊగిపోవడం దేనికి.. ఇంతకీ ఎవరు అమ్మాయి

సతీష్ : చుట్టాలమ్మాయే కోటి రూపాయలు కట్నం ఇస్తామన్నారంట.. బైట వాళ్ళకి ఇవ్వడం ఇష్టం లేదు అని చెప్పి నీ గురించి అడిగారట

చిన్నా : నాన్నకి లోపల పాపకార్న్ పేలినట్టుంది.. హాయి వదినా (వదిన నవ్వి వెళ్ళిపోయింది) లోలికి వెళ్లి హాల్లో కూర్చున్నాను. అమ్మ గారెలు తెచ్చి చేతికి ఇచ్చింది.. ఇప్పుడెందుకే ఇవి..

పార్వతి : అయితే లోపల పెట్టనా

చిన్నా : వద్దులే ఇటివ్వు

గడప దెగ్గర నుంచి వదిన నవ్వులు వినిపిస్తున్నాయి.

పార్వతి : ఆయన వచ్చేలోపే త్వరగా తిను.. లావణ్య కొంచెం వీడికి చట్నీ వెయ్యి

తింటూ కూర్చున్నాను నాన్న వచ్చిరాగానే కోపంగా చూసాడు. మళ్ళీ మొదలు..

రాజేంద్ర : క్వాలిఫై అయ్యావా

చిన్నా : ఏం క్వాలిఫై అవ్వాలి

పార్వతి : గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నా, ఈ సారి వస్తుందని చెప్పావు కదా

చిన్నా : రాలేదు

రాజేంద్ర : అస్సలు నువ్వు రాసావో లేదో అని డౌట్ నాకు.. సరే అవన్నీ వదిలేయ్యి షాప్ పెడుతున్నాను పెయింట్ కి సంబంధించినది.. రేపటి నుంచి ఇంట్లోనే ఉంటూ ఆ పనులు చూసుకో.. నీకో సంబంధం వచ్చింది షాప్ పెట్టుకునే పనుల్లో ఉన్నాడని చెప్పాను ఎవరు అడిగినా అదే చెప్పు

చిన్నా : నేను బార్లో పని చేస్తున్నాగా

రాజేంద్ర : అలా చెపితే పిల్లని ఎవ్వడు ఇవ్వడు.. ఇప్పుడు నీ పెళ్లి చెయ్యడానికే అవసరం లేకపోయినా ఆ షాప్ పెడుతున్నా బుద్ధిగా వ్యాపారం చేసుకో ఇంట్లోకి ఇంత తెచ్చివ్వు నీ పెళ్ళాం నీ పిల్లలు నీ జీవితం నువ్వు చూసుకుంటే చాలు.. ఒక తండ్రిగా నేను ఇదే కోరుకునేది.. ఇన్ని రోజులు ఏదేదో చేసావు.. చిన్నప్పటి నుంచి నా మాట ఒక్కసారి కూడా వినలేదు నువ్వు.. చేతగానివాడివైనా నా కొడుకువే.. ఏం చేసినా ఏం ఆలోచించినా మీ కోసమే అని అర్ధం చేసుకుంటే చాలు.

చిన్నా : నువ్వేం చెపుతున్నావో నాకు అర్ధం అవుతుంది.. నేను కూడా ఈ విషయమే మాట్లాడాలని వచ్చాను.

పార్వతి : ఏం మాట్లాడాలి

చిన్నా : నేనొక అమ్మాయిని ప్రేమించాను తననే పెళ్లి చేసుకోవాలని నిశ్చాయించుకున్నాను.. పెళ్లయ్యాక కూడా నేను ఇంట్లో ఉండదలుచుకోలేదు.. మేము వేరు కాపురం పెట్టుకోవాలని అనుకున్నాం. నువ్వు నా కోసం షాప్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు.. నా కాళ్ళ మీద నేను నిలబడగలను.. అంతగా ఎప్పుడైనా అవసరం అయితే డబ్బు సాయం చేస్తే చాలు

పార్వతి : రేయి లెగు అని కాలర్ పట్టుకుని లేపింది

చిన్నా లేచి నిలబడ్డాడు.. రాజేంద్ర సోఫాలో కూర్చున్నాడు తన కంట్లో నీళ్లు చూసాడు.

చిన్నా : అమ్మా...

అలానే కొడుకు కాలర్ పట్టుకుని పెద్ద కోడలు చూస్తుండగానే ఈడ్చుకెళ్లి గేట్ బైటికి నెట్టేసింది.

చిన్నా : మా..

పార్వతి : నువ్వు నీ జీవితం ఏమైనా చేసుకో.. నా ముప్పై ఏళ్ల కాపురంలో ఆయన కళ్ళలో తడి చేరడం ఎప్పుడు చూడలేదు, నీ వల్ల మొదటి సారి ఏడ్చాడు.. నీకు ఎంత చెప్పినా వేస్ట్ నేను కూడా నువ్వు ఏదోరోజు మారుతావులే అనుకున్నాను.. ఆయన కాదు ఇప్పుడు నేను చెపుతున్నాను విను.. ఇక నీకు ఈ ఇంటికి ఏ సంబంధం లేదు వెళ్ళిపో అని గేట్ వేసుకుని లోపలికి వెళ్ళిపోయింది.

ఇంటికొచ్చి కూర్చున్నాను, అక్షిత వచ్చి ఒళ్ళో కూర్చుంది.

అక్షిత : ఏమన్నారు.. పెళ్ళికి ఒప్పుకున్నారా

చిన్నా : హా అందరూ నాకు ఇష్టం అయినదే చెయ్యమన్నారు

అక్షిత : జోకా.. ఇప్పుడు నిజం చెప్పు

చిన్నా : ఇంట్లో నుంచి గెంటేసారు

అక్షిత : ఏం చేద్దామని

చిన్నా : ముందు పెళ్లి చేసుకుందాం.. ఆ తరవాత మిగతావి ఆలోచిద్దాం

అక్షిత : అన్ని ఆలోచించావా, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి ఇష్టం లేకుండా అవసరమా ఇదంతా.. మళ్ళీ నువ్వే బాధ పడతావ్.. ఎందుకు ఆ బార్లోనే పని చెయ్యాలని పట్టుపడుతున్నావ్.. పెయింట్ షాప్ అయితే ఏమైంది.. అది పని కాదా

చిన్నా : నీకు ఆల్రెడీ చెప్పాను మళ్ళీ చెపుతున్నాను.. నేను ఏం పని చేస్తానో అది నా ఇష్టం నెలకి జీతం ఇంట్లో ఇవ్వకపోతే అప్పుడు అడుగు.. ఇందులో నువ్వు మళ్ళీ తల దూర్చోద్దు.. నేను ఏ పని చెయ్యకుండా ఇంట్లో కూర్చున్నా నన్ను సాకే శక్తి, తెలివితేటలు నీకున్నాయి.. ఇంకేమైనా అడగాలా

అక్షిత : పెళ్ళికి అందరినీ పిలుద్దామా వద్దా

చిన్నా : నాకు ఇష్టం లేదు, నీకు కావాలంటే పిలుచుకో అమ్మ వాళ్ళని పిలుస్తాను అంతే

అక్షిత : నన్ను ఒకసారి అమ్మతో మాట్లాడనీ అని లోపలికి వెళ్ళింది.. హలో అమ్మా

సుబ్బు : నేను నాన్నని మాట్లాడుతున్నా బంగారం

అక్షిత : సుబ్బు ఒకసారి అమ్మకివ్వు

సుబ్బు : హ్మ్మ్.. ఏంటి అంతా ఓకేనా.. ఇదిగో ఇస్తున్నాను

రక్ష : హలో

అక్షిత : పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం, ఏమంటావ్

రక్ష : మంచి ఆలోచనే, చేసుకోండి

అక్షిత : అంటే నువ్వు రావా

రక్ష : నేనే కాదు, నీ పెళ్ళికి ఎవ్వరు రారని నాన్న ముందే చెప్పాడు.. అదే మంచిదని కూడా అన్నాడు.

అక్షిత : అదేంటి మా

రక్ష : ఆయన ఏమి చెప్పినా మన కోసమే.. అదే చెయ్యి.. ఒకసారి చిరంజీవి కివ్వు

అక్షిత లేచి ఫోన్ చిన్నా చేతిలో పెట్టింది.

చిన్నా : హలో

రక్ష : నీకు మా నాన్న చాలా ముఖ్యమైన విషయాలు చెప్పాడని నాకు చెప్పాడు, ఇక ఆయన నా ద్వారా నీకు చెప్పమంది.. నీ.. మీ.. పెళ్లి విషయంలో ఎవ్వరు లేకుండానే మీ పెళ్లి జరిగితే మంచిదని ఆయన చెప్పారు..

చిన్నా : అలాగే చేస్తాను

రక్ష : ఇంకేమి చెప్పను.. తన కోసం నువ్వు ఏమైనా చేస్తావని నాకు తెలుసు.. హ్యాపీ మారీడ్ లైఫ్.. నేను కూడా దెగ్గర్లో లేను బహుశా రాలేకపోవచ్చు

చిన్నా : అలాగే అని ఫోన్ అక్షితకి ఇవ్వగా లోపలికి వెళ్ళిపోయింది ఆ చెప్పవే అంటూ..

తెల్లారి అక్షితని తీసుకుని ఇంటికి వెళ్లాను, అందరూ ఇంట్లోనే ఉన్నారు. అక్షిత చెయ్యి పట్టుకుని లోపలికి వెళ్లి సోఫాలో కూర్చున్నాను.

రాజేంద్ర : చెప్పు

పార్వతి : ఎవరు ఆ అమ్మాయి

చిన్నా : తననే పెళ్లి చేసుకుంటున్నాను

పార్వతి : మంచిది.. ఏమ్మా.. ఏం నచ్చింది వీడిలో నీకు

అక్షిత : నమ్ముకున్న వాళ్ళ కోసం నిలబడతాడండీ.. రోజులో ఒక్కసారొ రెండు సార్లో నిజం చెపుతాడు.. మనం అంటే ఇష్టం ఉన్నా చూపించడు.. ఇక జాబ్ అంటే తను ఏం చేస్తాడో తన ఇష్టం.. తెలివితేటలయితే ఉన్నాయి.. నన్ను చూసుకోగలడన్న నమ్మకం ఉంది.. అని లేచి పార్వతి పక్కకి వెళ్లి తన చెవిలో అన్నిటికి మించి బాగా సుఖపెడతాడు.. ఇంకేం కావాలి అంటూ వచ్చి మళ్ళీ చిన్నా పక్కన కూర్చుంది.

పార్వతికి ఏం మాట్లాడాలో అర్ధంకాక అలా నిలుచుంది.. అక్షిత మాటలకి నవ్వొచ్చినా బైట పడలేదు. చిన్నా లేచి నిలుచున్నాడు.

చిన్నా : మధ్యాహ్నం గుళ్లో పెళ్లి చేసుకుంటున్నాను, చెప్పి వెళదాం అని వచ్చాను.

రాజేంద్ర : అలాగే

చిన్నా : సరే బై.. అని బైటికి నడిచాడు.. ఈ సారి అమ్మ కానీ అన్నయ్య కానీ ఆపడానికి రాలేదు.. బహుశా నేను పొగరు చూపిస్తున్నానని అనుకుంటున్నారేమో.. అక్షితని తీసుకుని బైటికి వచ్చేసాను.

పెద్దగా ఏర్పాట్లు ఏమి చేసుకోలేదు.. ఇంటికికి వెళ్లి స్నానం చేసి రెడీ అయ్యాము.. అక్షిత చీర కట్టుకుంది.. ఇద్దరం బైలుదేరి గుడికి వెళ్ళాం.

ఇటు పార్వతి చక్కగా తల స్నానం చేసి రెడీ అయ్యి బైటికి వచ్చింది..

పార్వతి : ఏంటండీ అలాగే ఉన్నారు.. వెళదాం పదండి

రాజేంద్ర : ఎక్కడికి

ఆ మాట విని పార్వతి చిన్నగా నడుచుకుంటూ వెళ్లి భర్త పక్కన మోకాళ్ళ మీద కూర్చుంది.

పార్వతి : ఏమండి.. ఎంతైనా మన కొడుకే కదా.. ఈ ఒక్కసారికి తగ్గి వెళదాం

రాజేంద్ర : వాడు పెళ్ళికి పిలవడానికి రాలేదు పార్వతి, అమ్మాయిని మనకి చూపించి పెళ్లి చేసుకుంటానని చెప్పి వెళ్ళటానికి మాత్రమే వచ్చాడు.. ఇద్దరు చెయ్యి పట్టుకుని ఇంట్లోకి వస్తున్నప్పుడే వాళ్ళని మనస్ఫూర్తిగా ఆశీర్వాదించాను.. కానీ నాకు విలువ లేని చోటుకి మనసు చంపుకుని వెళ్ళలేను.. నువ్వు వెళ్లి ఆశీర్వాదించి రా.. పెద్దొడికి చెప్పాను అని లోపలికి వెళ్ళిపోయాడ.

పార్వతి ఏడుస్తూనే గుడికి వెళ్ళింది.. పార్వతి గుళ్ళోకి వెళుతూ వెనక్కి తిరిగి చూసింది.. తన పెద్ద కొడుకు మాత్రం కారు దిగలేదు.

పార్వతి : రారా

సతీష్ : నేను రాను.. నువ్వెళ్లు అని కోపంగా చెప్పేసరికి పార్వతి లోపలికి వెళ్ళింది.

పార్వతి లోపలికి అడుగుపెట్టి చిన్నా వాళ్ళ దెగ్గరికి వెళ్లడం.. వెళ్లిన రెండు నిమిషాలకి చిన్నా అక్షిత మెడలో తాళి కట్టడం ఒకేసారి జరిగాయి.. చిన్నా వాళ్ళ అమ్మని చూసి లేచి నిలబడ్డాడు.. ఇద్దరు వెళ్లి పార్వతిని ఆశీర్వదించమని కాళ్లు పట్టుకున్నారు.. మనస్ఫూర్తిగా ఆశీర్వదించి అక్షింతలు వేసింది. అక్షితని చూసి తనకి జాగ్రత్తలు చెప్పి చిన్నా వైపు చూసింది.. చిన్నా ఇంట్లో వాళ్ళు వచ్చారేమోనని వెతుక్కుంటుంటే

పార్వతి : ఎవ్వరు రాలేదు.. చిన్నా మాట్లాడబోతే ఏడుస్తూ ఆపేసింది.. నువ్వు నన్ను ఎంత బాధ పెట్టావో అంతా నువ్వు అనుభవిస్తావు.. అప్పుడు తెలుస్తుంది నా బాధ.. ఏదో ఒకరోజు మా విలువ కూడా తెలుస్తుంది.. అని వేగంగా బైటికి వెళ్లిపోతుంటే చిన్నా పరిగెత్తుకుంటూ వెళ్లి వెనక నుంచి కౌగిలించుకుని లవ్ యు అన్నాడు.. పార్వతి విడిపించుకుని కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయింది.​
Previous page: Update 10