Episode 12


అంజి : హలో అమ్మా

లావణ్య : రేయి వెళ్ళావా.. పిన్నిని కలిసావా

అంజి : హా కలిసాను

లావణ్య : ఎలా ఉంది బాగుందా

అంజి : బాగుంది

లావణ్య : మా గురించి ఏమైనా అడిగిందా

అంజి : ఇప్పుడే కలిసింది తన ఇంటికి వెళుతున్నాం

లావణ్య : సరే వెళ్ళాక ఫోన్ చెయ్యి

అంజి : నాన్న

లావణ్య : పక్కనే ఉన్నాడు.. సరే నువ్వు అన్ని సర్దుకున్నాక ఫోన్ చెయ్యి

అంజి : అలాగే

అక్షిత : ఎవరు.. అమ్మా..?

అంజి : అవును పిన్ని

అక్షిత : అంజి టెన్షన్ లో వేళ్ళు పీసుక్కుంటుంటే చూసి నవ్వింది..

అంజి : ఏమైంది పిన్ని

అక్షిత : ఏం లేదు మీ అమ్మా నాన్న పోలికలు నీలో కనిపిస్తుంటే నవ్వొచ్చింది..

అంజి : వేళ్ళు పిసుక్కోవడం ఆపేసి.. ఓహ్.. ఇదా మా నాన్న కూడా ఇంతేనంట

అక్షిత : తమ్ముడు ఎలా ఉన్నాడు

అంజి : బానే ఉన్నాడు, ఇంజనీరింగ్ ఈ సంవత్సరం అయిపోద్ది

అక్షిత : తరవాత వాడు కూడా ఇక్కడికేనా

అంజి : లేదు వాడు రాడు

అక్షిత : హ్మ్మ్.. ఇదిగో అదే మనిల్లు.. అని కార్ పార్క్ చేసింది.. ఇంతలో అక్షితకి ఫోన్ వస్తే మాట్లాడుకుంటూ ఇంటి దెగ్గరికి వెళుతుంటే అంజి కార్ లోనుంచి లగ్గేజ్ బైటికి తీస్తున్నాడు.. హలో నాన్నా..

సిద్దు : వచ్చాడట కదా

అక్షిత : హా ఇందాకే కలిసాము, ఇప్పుడే ఇంటికి వచ్చాం

సిద్దు : వాడికి మొహమాటం ఎక్కువ

అక్షిత : హా.. గమనించాను మొత్తం వాళ్ళ నాన్నే కనిపిస్తున్నాడు.

సిద్దు : సరే అయితే మరి, ఉంటా

అక్షిత : అమ్మ ఎలా ఉంది

సిద్దు : బానే ఉంది

అక్షిత : ముసలిదానికి పంతం తగ్గించుకోమని చెప్పు, ఇంకెన్ని సంవత్సరాలు నాతో మాట్లాడకుండా ఉంటుందట.. సర్లే బై అని ఫోన్ పెట్టేసింది... ఏరా లోపలికిరా అక్కడే నిలబడ్డావే అనగానే అంజి లోపలికి వచ్చాడు.

అంజి : ఇల్లు బాగుంది పిన్ని

అక్షిత : నీట్ గా పెట్టడం ఎలాగో మీ అమ్మ దెగ్గరే నేర్చుకున్నాను లేరా

అంజి : హహ

అక్షిత : అదిగో ఆ రూం కాళీ నీకే, వెళ్లి ఫ్రెష్ అవ్వు. నేనీలోపు తినడానికి ఏమైనా చేస్తాను అనగానే అంజి లోపలికి వెళ్లి డోర్ కొంచెం దెగ్గరగా వేసి లగ్గేజ్ పక్కన పడేసి మంచం మీద కూలబడిపోయాడు.

అక్షిత తన రూంలోకి వెళ్లి అద్దం ముందు నిలుచుంది, కొంచెం లావు అయ్యింది. బట్టలు విప్పేసి ఫ్రెష్ అయ్యి టీ షర్ట్, షార్ట్ వేసుకుని కిచెన్ లోకెళ్ళి రైస్ కుక్కర్ ఆన్ చేసి హాల్లోకి వచ్చింది, అంజి సోఫాలో కూర్చున్నాడు.

అక్షిత : ఇంకేంట్రా విశేషాలు, అందరూ ఎలా ఉన్నారు అక్కడా

అంజి : బానే ఉన్నారు పిన్ని

అక్షిత : కొంచెం ఫ్రీగా ఉండరా పర్లేదు, బైటి దాన్ని కాదు

అంజి : మిమ్మల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం కదా పిన్ని, ఇంట్లో ఫోటో ల్లోనే చూసాను.

అక్షిత మౌనంగా నవ్వింది..

అంజి : జాబ్ ఓకే కదా పిన్ని

అక్షిత : ఆన్లైన్ ఇంటర్వ్యూ కూడా ఐపోయింది కదా మళ్ళీ మెయిల్ వస్తుంది, ఒక ఆఫ్లైన్ ఇంటర్వ్యూ నార్మల్ తరవాత జాబ్ అంతే అన్ని క్లియర్ చేసేసాను.

అంజి : థాంక్స్ పిన్ని

అక్షిత : చాల్లేరా, పద తిందాం అని లేచింది.

ఇద్దరు డైనింగ్ టేబుల్ మీద కూర్చుని తింటున్నారు..

అంజి : ఇంత పెద్ద ఇంట్లో నువ్వు ఒక్కదానివే ఉంటావా పిన్ని

అక్షిత : లేదురా నువ్వు వస్తున్నావని తీసుకున్నాను, అంతకముందు సింగల్ రూంలో ఉండేదాన్ని.. ఇంకా ఏమంటుంది అమ్మ.. మీ నాన్న ఏం చెప్పలేదా జాగ్రత్తలు

అంజి : లేదు పిన్ని ఏమి చెప్పలేదు, ఏం అవసరం లేదు అన్ని పిన్ని చూసుకుంటుంది నువ్వెళ్లు చాలు అంది అమ్మ.. నాన్న అస్సలు ఏమి మాట్లాడలేదు

అక్షిత : అదేంటి ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడుగా

అంజి : లేదు పిన్ని నాన్న అంతగా మాట్లాడడు అన్ని అమ్మే చూసుకుంటది.

అక్షిత : అంటే

అంజి : మా గురించి ఇంటి గురించి అమ్మే మొత్తం నడిపేది నాన్న ఒకటి బట్టల షాప్ పెట్టాడు కదా ఊరికే వెళ్లి కూర్చుంటాడు అంతే, అది కూడా తమ్ముడే చూసుకుంటున్నాడు.. అస్సలు ఏమి పట్టించుకోడు

అక్షిత : ఏ ఎందుకలా

అంజి : ఏమో ఆయన అంతే, ఎక్కువ పని చెయ్యట్లేదు అయితే ఇంట్లో రూంలో పడుకుంటాడు లేకపోతే షాప్ కెళ్ళి కూర్చుంటాడు, ఎక్కువగా ఎవ్వరితోనూ కలవడు.. అస్సలు బైటికి రాడు

అక్షిత : హ్మ్మ్.. ప్రణీత పిల్లలు సంధ్య శృతి ఎలా ఉన్నారు

అంజి : బానే ఉన్నారు

అక్షిత : ఏమైనా సంపాదించాడా మీ నాన్న

అంజి : హా పర్లేదు పిన్ని షాప్ సొంతదే, కొన్ని పొలాలు కొన్నాడు రేపు సంధ్యకి నాకు పెళ్ళైతే ఉండడానికి ఇల్లు, సంపత్ కి శృతికి ఓక ఇల్లు అలా ఉంచాడు

అక్షిత : అదేంట్రా వేరేగా ఉంటారా మీరు

అంజి : మాకు ఇష్టం లేదు కాని నాన్న పెళ్లి అయిపోయాక ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నాడు

అక్షిత : ఎందుకో

అంజి : తెలీదు

అక్షిత : మరి లావణ్య.. అదే అమ్మ ఏమి అనలేదా

అంజి : అమ్మా.. నాన్న ఏది చెపితే దానికి ఊ కొడుతుంది.. తనకి ఇష్టం లేదని నాకు తెలుసు కాని నాన్నని కాదని అమ్మ ఏ పని చెయ్యదు కదా

అక్షిత : ఇంకా ఇద్దరు అలానే ఉన్నారా

అంజి : ఆమ్మో వాళ్ళ ఓవర్ యాక్షన్ భరించలేము.. నాన్న అయితే అస్సలు అమ్మని ఎక్కడికి పంపించడు ఒంటరిగా. వాళ్ళు ఇద్దరు పక్కపక్కన కూర్చున్నారంటే ఇంక అస్సలు ఎవ్వరిని పట్టించుకోరు.. ఆ విషయంలో మాత్రం మా అమ్మ చాలా లక్కీ

అక్షిత : హ్మ్మ్.. సరే పడుకో పొద్దున్నే మాట్లాడుకుందాం అని లేచి తన రూంలోకి వెళ్ళింది..

అంజి లేచి లోపలికి వెళ్లి లావణ్యకి ఫోన్ చేసాడు

లావణ్య : ఏరా పిన్నితో మాట్లాడావా

అంజి : వచ్చింది ఇవ్వాలేగా, ఇంకా ఏమి మాట్లాడలేదు

లావణ్య : మా గురించి అడిగిందా

అంజి : హా.. మీ ఇద్దరు ఎలా ఉంటారు అని అడిగింది

లావణ్య : ఏం చెప్పావు

అంజి : ఉన్నదే చెప్పాను, మీ ఓవర్ ప్రేమ గురించి..

లావణ్య :చాల్లే.. సంబడం

అంజి : టైం చూసుకుని మాట్లాడతాలే

లావణ్య : ఇప్పటి వరకు అన్ని అనుకున్నట్టే జరిగాయి

అంజి : సరేలే సంధ్య ఎలా ఉంది

లావణ్య : అబ్బో.. అయ్యా ఇస్తున్నానయ్యా బాగా మాట్లాడుకో

అక్షిత తన గదిలోకి వచ్చి ఫోన్లో చిన్నా ఫోటోని చూస్తూ ఆలోచిస్తూ కూర్చుంది.. చిన్నాకి ఫోన్ చేసింది ఎప్పటిలానే గత ఇరవై సంవత్సరాలుగా అక్షిత నెంబర్ ని బ్లాక్ లో పెట్టేసాడు చిన్నా.. అయినా సరే గుర్తొచ్చినప్పుడల్లా ఒకసారి ఫోన్ చేస్తుంటుంది అక్షిత.

అంజి వచ్చిన పదిహేను రోజుల్లోనే బాగా కలిసిపోయాడు, తన పిన్ని చతురతతో కూడిన మాటలు అన్ని తెగ నచ్చాయి.. అంజి ప్రవర్తన వాడి అలవాట్లు ఆలోచనలు అన్ని కూడా చిన్నాకి చాలా దెగ్గరా ఉండటంతో అక్షిత కూడా చాలా దెగ్గర అయ్యింది.. నెల రోజుల్లో బాగా కలిసిపోయారు..

అక్షితతో బాగా చనువు పెరిగింది, ఇక తను వచ్చిన అస్సలు పని మొదలుపెట్టాడు అంజి.. అస్సలు అంజికి ఇలా తల్లి తండ్రులని ఇంట్లో ఇంకా పెళ్లి కాకుండానే భార్య అయిన సంధ్యని వదిలేసి రావడం అస్సలు ఇష్టం లేదు.

తన తల్లి లావణ్య కోరిక తీర్చడానికి వచ్చాడు, తన పదో తరగతి అయిపోయిన తరువాత అంజి ఇక చదవనని మొండికేసాడు తన తండ్రికి సాయంగా ఉంటానన్నాడు, అప్పటివరకు ఎప్పుడు పిల్లలకి మంచి చెడు అలవాట్లు మాత్రమే నేర్పే లావణ్య మొదటిసారి అంజిని పిలిచి మాట్లాడింది.

ఆ తరవాతే అంజి మళ్ళీ చదవడం మొదలుపెట్టాడు, కష్టపడి చదివి ఇప్పుడు ఇలా తన పిన్ని దెగ్గరికి వచ్చాడు. ఇంకా లావణ్య చెప్పిన మాటలు అంజి మెదడులోనే తిరుగుతున్నాయి అవి గుర్తుచేసుకున్నప్పుడల్లా తన తండ్రి మీద గౌరవం ప్రేమ ఇంకా ఇంకా పెరుగుతున్నాయి.
Next page: Episode 13
Previous page: Episode 11