Episode 13
అక్షిత : ఏంట్రా అలా ఉన్నావ్, అమ్మ వాళ్ళు గుర్తొచ్చారా
అంజి : ఇన్ని రోజులు ఎప్పుడు వాళ్ళని వదిలిపెట్టి ఉండలేదు పిన్ని
అక్షిత : ఏం కాదులే బంగారం, నేను లేనా ఏంటి.. ఇలారా అని నుదిటిమీద ముద్దు పెట్టుకుంది.
అంజి : ఇవ్వాళ సెలవే కదా పిన్ని, ఏంటి పొద్దున్నే లేచావ్
అక్షిత : ఊరికే మెలుకువ వచ్చేసింది, ఇంకా ఎలాగో లేచా కదా అని ఫ్రెష్ అయ్యాను.. ఇవ్వాళ ఏంటి ప్లాన్స్
అంజి : పిన్ని నీతో కొంచెం మాట్లాడాలి
అక్షిత : చెప్పురా
అంజి : అంటే నీ పర్సనల్ అడగనా
అక్షిత : అడుగురా
అంజి : అదీ నువ్వు ఎందుకు ఇంకా పెళ్లి చేసుకోలేదు
అక్షిత ఒక్క క్షణం ఆశ్చర్యంగా చూసి మళ్లి నెమ్మదించి నోరు విప్పింది
అక్షిత : ఎందుకు అలా అడిగావు
అంజి : చెప్పు పిన్ని.. ఎంత అందంగా ఉంటావు, ఫొటోస్ లో చూసాను అలాంటిది ఎందుకు ఇలా ఒంటరిగా మిగిలిపోయావు
అక్షిత : మొగుడు లేకపోతే ఒంటరి దాన్ని అయిపోతానా
అంజి : సిద్దు తాతయ్య సురేఖ అమ్మమ్మ.. అత్తయ్య అందరూ నిన్ను గుర్తు చేసుకుంటారు అందరం చాలా దెగ్గరగా ఉంటాం, ఆఖరికి చందు బాబాయి ఫామిలీ కూడా హాలిడేస్ కి ఇంటికి వచ్చి మళ్ళి ఆస్ట్రేలియా వెళ్ళిపోతారు, కానీ నువ్వు ఒక్కసారి కూడా ఇంటికి రాలేదు నేను పుట్టినప్పటి నుంచి నువ్వు ఒక్కసారి కూడా ఇంటికి వచ్చినట్టు గుర్తులేదు ఎందుకు
అక్షిత : ఒక్కటే ప్రశ్న అని ఇన్ని అడుగుతున్నావు
అంజి : చెప్పు పిన్ని ఏమైనా అయ్యిందా.. ఎందుకు సురేఖ అమ్మమ్మ నీతో మాట్లాడదు
అక్షిత : ఎందుకంటే తనకి చెప్పకుండా ఇంటి నుంచి వచ్చేసాను మళ్ళి ఇంటికి వెళ్ళలేదు, పెళ్లి కూడా చేసుకోలేదు అందుకు.. తన అన్న కొడుక్కి నన్ను ఇచ్చి చేస్తా అని మాట ఇచ్చింది కానీ నేను అస్సలు పెళ్లే చేసుకోనని చెప్పేసాను అందుకే నేనంటే కోపం.. అందరినుంచి దూరంగా వచ్చేసానని..
అంజి : మరి సిద్దు తాతయ్య నిన్ను ఏమి అనలేదా
అక్షిత : తాతయ్యకి చెప్పానులే.. ఆ తరవాత ఎన్ని చెప్పినా ఎంతమంది చెప్పినా నేను వినలేదు వాళ్ళందరూ నాతో విసిగిపోయారు.
అంజి : అంటే నువ్వు ఆ రోజు ఇంట్లో నుంచి వచ్చేసిన దెగ్గర నుంచి ఒక్కసారి కూడా ఇంటికి రాలేదా
అక్షిత : లేదు రాలేదు, అయినా ఆరోజు అంటున్నవ్ ఏ రోజో నీకెలా తెలుసు.. అన్ని తెలుసుకునే అడుగుతున్నావా
అంజి : లేదు పిన్ని అంతా తెలీదు కానీ ఒక్కొక్కళ్ళ దెగ్గర నుంచి ఒక్కొక్క వెర్షన్ విన్నాను. చాల డౌట్స్ ఉన్నాయి అందుకే
అక్షిత : ఇప్పుడు ఇవన్నీ తెలుసుకుని ఏం చేస్తావ్
అంజి : ప్లీజ్ పిన్ని
అక్షిత : సరే నేను మీ నాన్న ఒకే కాలేజీలో చదివేవాళ్ళం అక్కడ నాకు ఒకడు పరిచయం అయ్యాడు ఇద్దరం ప్రేమించుకున్నాం కానీ వాడికి ఉన్న కమిట్మెంట్స్ వల్ల నన్ను పెళ్లి చేసుకోవడం, ప్రేమించడం కుదరదు అన్నాడు ఇక నాకు అక్కడ ఉండాలని అనిపించలేదు అందుకే దూరంగా వచ్చేసాను.. ఆ తరవాత ఇక్కడ అలవాటు పడిపోయాను.
అంజి : నువ్వు ప్రేమించింది మా నాన్ననే కదా
అక్షిత : (హహ) అలా అని నేను చెప్పానా
అంజి : నాకు కొంత తెలుసని చెప్పానా, మీరు ఇద్దరు ప్రేమించుకున్నారని నాకు తెలుసు కానీ అమ్మ కోసం నిన్ను వదిలేసాడు కదా
అక్షిత : (కళ్ళు తుడుచుకుంది) ఎవరు చెప్పారు నీకిదంతా.. ఇవన్నీ ఎవ్వరికి తెలియని విషయాలు.. తెలిసిన వాళ్ళు బతికి లేరు.. సిద్దు తాతయ్య చెప్పాడా
అంజి : అమ్మ చెప్పింది
అక్షిత : (ఆశ్చర్యంగా లేచి కూర్చుంది) అమ్మా...! లావణ్యకి ఇదంతా..
అంజి : నాతో అమ్మ మీ కథ మొత్తం చెప్పాక నేను ఇలానే ఆశ్చర్యంగా అడిగాను
అక్షిత : ఏమంది
అంజి : నా దెగ్గర సర్టిఫికెట్స్ మాత్రమే లేవు.. నేను చదువుకున్నంత చదువు మీ అక్షిత పిన్ని, మీ నాన్న కూడా చదువుకోలేదు అంది.. నా కంటే అక్షిత చిన్నది.. బావ నా వయసు వాడు వీళ్లిద్దరి మధ్యలో ఏం జరుగుతుందో గమనించలేనంత పిచ్చి దాన్ని కాదు అని కూడా అంది.
అక్షిత : అంటే తనకి మొదటి నుంచి అన్ని తెలుసన్న మాట
అంజి : ఇప్పుడు నీకు డౌట్స్ మొదలయ్యాయా
అక్షిత మౌనంగా ఉండిపోయింది.. కానీ అక్కడ నుంచి లేచి వెళ్ళిపోయింది
అంజి మంచం మీద పడుకున్నాడు.. ఆ రోజు జరిగిన సన్నివేశం గుర్తు చేసుకున్నాడు.. పదో తరగతి అయిపోయాక ఇక చదువుకొనని మొండి పట్టిన రోజు
లావణ్య : అంజి ఇలా రా
అంజి : ఏంటి మా.. ఇక చదవనని చెప్పేసాను కదా, మళ్ళి ఏంటి
లావణ్య : ఇలా కూర్చో అని అంజి జుట్టు సర్ది తన ఒళ్ళో పడుకోబెట్టుకుంది.. నాన్న ఎక్కడా
అంజి : షాప్ కి వెళ్ళిపోయాడు.. అయినా ఎందుకు ఎప్పుడు ఆయన గురించే ఆలోచిస్తుంటావ్ ఆయన కూడా అంతే నేను షాప్ కి వెళ్లినా నీ గురించి అడుగుతాడు.. ఎప్పుడు డబ్బే కావాలి ఆయనకి. మనల్ని ఎప్పుడైనా బైటికి తీసుకెళ్లాడా ఏమైనా కొనిచ్చాడా ఏమైనా అంటే డబ్బులిస్తాడు కొనుక్కోమని.. నువ్వేమైనా అనుకో, నీకు కోపం వచ్చినా సరే అయనంటే నాకు ఇష్టం లేదు.. ఏ తండ్రి అయినా చదవను అంటే కనీసం ముందు కోప్పడతాడు కానీ ఈయనేమో నన్ను ఏమి అనలేదు.. నీ ఇష్టం అన్నాడు.. ఏం మనిషో ఏంటో
లావణ్య : ఇప్పుడు నీకు ఆయన ఎమ్మటే ఒప్పుకోవడం నచ్చలేదు అంతేనా, ఏదో గొడవ అవుద్ది గట్టిగా వాదించి నీ పంతం నెగ్గించుకోవాలనుకున్నావ్ కానీ నాన్న నీకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు అంతేనా అని నవ్వింది.
అంజి ఏం మాట్లాడలేదు
లావణ్య : అంజి... నీకో కథ చెపుతా వింటావా
అంజి : చెప్పు
ఒక ఊర్లో ఒక భార్య భర్త ఉండేవారు వాళ్ళకి ముగ్గురు సంతానం, ఒక అక్క ఇద్దరు తమ్ముళ్లు కలిసి మెలిసి ఉండేవాళ్ళు.. ఆ అక్కకి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండేది.. అదే తన లోకం కానీ ఇవన్నీ దూరం చేస్తూ తనకి పెళ్లి చేసేసారు.. తన మంచితనం ఓర్పుతో అటు ఎవ్వరు లేని తన భర్తని ఇటు తన కుటుంబాన్ని దెగ్గర చేసింది.
అంజి : అంత మంచి వాళ్ళు ఉంటారా
లావణ్య : ఎందుకలా అడిగావు
అంజి : మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్యకి పెళ్లి అయిన పదో రోజే పెళ్లి కూతురు అత్త మామలతో కలిసి ఉండను అని చెప్పిందట.. ఇంకా చాల మందిని చూసానులే
లావణ్య : అంత మంచిది కాబట్టే ఇప్పుడు నీకు కథలా చెపుతున్నాను
అంజి : తన పేరేంటి
లావణ్య : భారతి అదిగో ఆ ఫోటోలో ఉందే (అని గోడకి వేసిన ఫోటోని చూపించింది)
అంజి : నానమ్మా.....?
లావణ్య : అవును తన పక్కనే ఇంకో ఫోటో ఉందా
అంజి : అవును మధు అమ్మమ్మ
లావణ్య : తనే నానమ్మ బెస్ట్ ఫ్రెండ్
అంజి : ఓహ్.. అందుకే నీకు నాన్నకి పెళ్లి అయ్యింది
లావణ్య : నా పెళ్లి వీళ్ళందరూ అనుకున్నారు కాబట్టి అవ్వలేదు.. మీ నాన్న అనుకున్నాడు కాబట్టి అయ్యింది.. అని కళ్ళు తుడుచుకుంది.
అంజి : అమ్మా ఏమైంది.. సారీ మా.. నేను చదువుకోవాలి అంతే కదా చదువుకుంటాను.. ప్రామిస్
లావణ్య : అలా కాదు నాన్న.. నువ్వు ఎందుకు చదువుకోవాలో చెపుతాను.. దానితో పాటే నాకొక కోరిక ఉంది అది నువ్వే తీర్చాలి
అంజి : చెప్పు మా ఏంటా కోరిక
లావణ్య : మీ నాన్నని అక్షిత పిన్నికి ఇచ్చేద్దాం
అంజి : ఏంటి.. అర్ధం కాలేదు
లావణ్య : చెపుతాను విను, నానమ్మ తన బెస్ట్ ఫ్రెండ్ ని తన పెద్ద తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేసింది అంటే మా నాన్నకి, సిద్దు తాతయ్య ఏమో సురేఖ అమ్మమ్మని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆక్సిడెంట్లో మా నాన్న, మా అమ్మమ్మ వాళ్ళు, మీ తాతయ్య అంటే మీ డాడీ వాళ్ళ నాన్న అందరూ చనిపోయారు.. అప్పటికే మనకి కొంత ఆస్తి ఉన్నందువల్ల నానమ్మ తెలివిగా మమ్మల్ని చదివిస్తూ ఇంటిని ఒక్క చేత్తో నెత్తుకొచ్చింది.
అంజి : మరి అక్షిత పిన్ని?
లావణ్య : అందరం ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం, మీ అక్షిత పిన్ని మీ నాన్న భలే స్నేహంగా ఉండేవాళ్ళు కాని మీ నానమ్మ డాడీని హాస్టల్లో వేసింది
అంజి : ఎందుకు?
లావణ్య : మరి ఇంట్లో ఇద్దరు వరసైన ఆడ పిల్లలని పెట్టుకుని ఉంచుతారా
అంజి : మరి నన్ను తమ్ముణ్ణి ఇంట్లోనే ఉంచి చదివిస్తున్నారుగా
లావణ్య : మీరు ఏదైనా వెధవ వేషాలు వేస్తే వీపు చీరేయ్యడానికి మీ నాన్న ఉన్నారు, అప్పడు మీ నాన్నకి భయం చెప్పేవారు లేరులే
అంజి : నాన్న ఎంత లక్కీ మా
లావణ్య : అది లక్కీ కాదు నాన్నా శాపం
అంజి : ఏంటమ్మా నువ్వనేది
లావణ్య : అవునురా.. మీ నాన్న చదువు అయిపోయేసరికి మన దెగ్గర ఉన్న డబ్బులు అయిపోయాయి, అంతెందుకు మీ నాన్న IIT అల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ అలాంటిది మన ఇంటికి మగ తోడు లేకపోతే బాగోదని ఆయన డ్రీమ్స్ ని చంపుకుని మాములు కాలేజీలో జాయిన్ అయ్యాడు. మీరు కాలేజీలని సినిమాలు షికార్లు తిరుగుతుంటే మీ నాన్న కాలేజీతో పాటు పార్ట్ టైం జాబ్ చేసేవాడు. ఆఖరికి తను చేసే జాబ్ కూడా నచ్చేది కాదు కాని ఆశలు కోరికలు అన్ని చంపుకుని ఒక బానిసలా కష్టపడి మన ఇంటిని నిలబెట్టాడు.
ఇక అక్షిత పిన్నిని ప్రేమించాడు కాని మీ నానమ్మ నన్ను పెళ్లి చేసుకోమని మాట తీసుకుంది, అప్పుడే అక్షితని దూరం పెట్టేసాడు కాని ఒక్క క్షణం కూడా మీ పిన్నిని మర్చిపోలేదని నాకు తెలుసు.
అంజి : మరి అన్ని తెలిసి కూడా నువ్వు నాన్నని చేసుకున్నావ్
లావణ్య : అందులో నావంతు ఎంతుందో మీ నాన్న వంతు కూడా అంతే ఉంది. ఎక్కడికి వెళ్లినా రాత్రి పడుకునేముందు నా దెగ్గర వాళ్లిపోయేవాడు. నేము కూడా అంతే మీ నాన్న గుండె మీద పడుకోకపోతే నాకు నిద్ర పట్టేది కాదు.. అంతలా అలవాటు పడిపోయాను.. ఎక్కడున్నా ఆఖరికి అక్షిత దెగ్గర ఉన్నా కూడా నన్ను మర్చిపోయేవాడు కాదు అంతలా నన్ను ప్రేమించాడు అదే టైంలో మీ పిన్నిని కూడా ప్రేమించాడు.
అంజి : ఒకేసారి ఇద్దరిని ప్రేమించాడా ఎలాగే
లావణ్య : అదే మరి చిరంజీవి అంటే, కాని ఎంత బాధ పడ్డాడో. ఒక్కసారి ఊహించుకో ఇప్పుడు నువ్వు ప్రేమిస్తున్న సంధ్య నీ నుంచి దూరంగా అయితే నువ్వు ఎంత బాధ పడతావో
అంజి : మరి వాళ్ళని కలపడానికి నువ్వు ప్రయత్నించలేదా
లావణ్య : చెయ్యలేదు ఎందుకంటే మీ నాన్న అక్షితని వద్దనుకున్నాడు, అయితే దూరంగా పెట్టాలి లేదంటే దెగ్గరగా పెట్టాలి అటు ఇటు కాకుండా మీ పిన్ని జీవితంతో ఆడుకోవడం ఆయనకి ఇష్టం లేదు.
అంజి : ఒక మనిషి ఇలా ఎలా ఉండగలడు
లావణ్య : అది అంతే మీ నాన్నకి ఏడుపు వచ్చినప్పుడల్లా నా కౌగిలిలోకి దూరిపోతాడు, అప్పుడప్పుడు చూసే ఉంటావు. రోజు నేను మీ నాన్న మీద పడుకుంటే ఒక్కోరోజు తనే నా ఒళ్ళో పడుకునేవాడు గుర్తుందా
అంజి : అవును
లావణ్య : అలా వచ్చాడంటే బాధలో ఉన్నాడని అర్ధం
అంజి : సరే నీకోసం ఈ ఇంటి కోసం ఆయన ఇంత చేసాడు కాబట్టి, ఆయన కోసం నన్ను ఏం చెయ్యమంటావో చెప్పు
లావణ్య : మీ పిన్ని దెగ్గరికి వెళ్లి ఇద్దరినీ కలుసుకునేలా చెయ్యి
అంజి : మరి నువ్వు
లావణ్య : నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన గుండె మీదె కదరా ఉన్నది, ఆయన కోసం చిన్న త్యాగం చెయ్యలేనా
అంజి : పిన్నినే ఇక్కడికి తీసుకొచ్చేద్దాం అమ్మా
లావణ్య : లేదు నాన్న, ఆయన జీవితంలో అన్ని బాధలు, ఇబ్బందులు, ఏడుపులే.. మనం ఎవ్వరం లేకుండా వాళ్లిద్దరే.. ఉట్టి సంతోషం తప్ప ఇంకేమి ఉండకూడదు.. అయినా నాకు ఇద్దరు హీరోలని ఇచ్చాడు ఇంకేం కావాలి చెప్పు
అంజి : అయినా ఇప్పుడు ఈ వయసులో ప్రేమించి చేసేది ఏముందే
లావణ్య : రేయి ఏంట్రా వయసు అయిపోయిందని చులకనా.. మీ నాన్న స్టామినా ఏంటో నాకు తెలుసు, ఇంకా నన్ను చాలా ప్రేమగా జాగ్రత్తగా చూసుకుంటారు అదే మీ పిన్ని అయితేనా...
అంజి : అయితే.. (అని నవ్వుతూ లావణ్య ఒళ్ళోనుంచి లేచాడు ఆత్రంగా)
లావణ్య : చెప్పినవి తప్ప అన్ని కావాలి నీకు
అంజి : సరే సరే అయినా నీకు వాళ్ళిద్దరి గురించి ఇన్ని విషయాలు ఎలా తెలుసు
లావణ్య : అదా.. నేనేమో మీ నాన్న మీద పడుకునేదాన్ని. నేను పడుకున్నాననుకుని మీ నాన్న అక్షితకి ఫోన్ చేసేవాడు. తనేమో మీ నాన్న పడుకునేదాకా ముచ్చట్లు చెప్పేది అలా తెలుసు, మీ నాన్న నిద్రలోకి వెళ్లే టైంలో నేను కూడా ఇంకో ఇయర్ ఫోన్ చెవిలో పెట్టుకునేదాన్ని.. అప్పుడే తెలిసింది అక్షిత నాన్నని ఎంత ప్రేమించిందో అని
అంజి : ఎలా
లావణ్య : మీ నాన్న పడుకునేదాకా తనకి ధైర్యం వచ్చేలా ఒకలా మాట్లాడి, ఆయన నిద్రపోయాక తనలోని అస్సలు బాధని నిజాలని చెప్పుకునేది ఒక్కోరోజు తను ఏడుస్తుంటే నాకు కూడా ఏడుపు వచ్చేది కాని మీ నానమ్మ అమ్మమ్మ చనిపోయాక మాత్రం అక్షిత నుంచి ఒక్క ఫోన్ లేదు ఏం లేదు.. మీ నాన్న తనతో ఒక్కరోజు కూడా తనతో మాట్లాడలేదు
అంజి : ఎందుకు
లావణ్య : కారణం నేను ఒకటి అనుకుంటున్నాను కాని ఏదో కాదో తెలీదు.. అవన్నీ కాదు నువ్వు నాకు హెల్ప్ చేస్తావా లేదా
అంజి : ఓకే రేపే వెళతాను
లావణ్య : మీ నాన్నకి తెలిసిందంటే నన్నేమో కాని నిన్నైతే చంపేస్తాడు
అంజి : మరి ఎలాగా
లావణ్య : ఆయనకి తెలీకుండా మీ పిన్నితో మాట్లాడి ఒప్పించి ఆయనకి సప్రైజ్ ఇవ్వాలి. మనకోసం వెనక్కి తిరిగి చూస్తే మనం ఉండకూడదు అలా అక్షితతో లాక్ చెయ్యాలి
అంజి : ఇదంతా అయ్యే పనేనా
లావణ్య : అందుకే నువ్వు చదువుకో, జాబ్ అనో హయ్యర్ స్టడీస్ కనో ఏదో ఒకటి చేసి నిన్ను పిన్ని దెగ్గరికి పంపుతాను, అక్కడనుంచి కధ నువ్వే నడిపించాలి ఇక
అంజి : సరే నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను
లావణ్య : సరే కాదు అనుకున్నవి అనుకున్నట్టు జరగాలంటే నువ్వు చాలా కష్టపడాలి.
అంజి : ప్రామిస్ నీ కోసం నాన్న కోసం ఆమాత్రం చెయ్యలేనా నన్ను నమ్ము.. కాని నిజంగా నీకు బాధ లేదా మా
లావణ్య : లేదు నాన్న, వాళ్ళు పడ్డ బాధ ఏంటో నాకు తెలుసు.. మీ నాన్న ఎప్పుడు నాకు నాన్న లేని లోటు తెలియనివ్వలేదు.. నన్ను చిన్న పిల్లలా సాకుతూ వచ్చాడు ఇప్పుడు నన్ను చూసుకోడానికి నా కొడుకులు ఉన్నారు తన మిగిలిన జీవితం అయినా అక్షితతో గడపనిద్దాము
అంజి లేచి లావణ్యని ముద్దు పెట్టుకుని లోపలికి వెళ్ళాడు. కొంతసేపటికి సంధ్య లోపలి వచ్చింది. లోపలికి వస్తూనే అంజి మీద వాలిపోయింది.
సంధ్య : ఏంటీ అత్తయ్య ఎప్పుడు లేనిదీ నీకు క్లాస్ పీకుతుందీ..
అంజి : చెప్తాను ఫోన్ చేసి సంపత్ ని శృతిని కూడా రమ్మను అని ఫోన్ సంధ్య చేతికి ఇచ్చి ఒళ్ళోకి లాక్కుని గట్టిగా వాటేసుకుని మెడ కొరుకుతున్నాడు.
నలుగురు ఒకేరూంలో కూర్చుని ముచ్చట్లు పెట్టుకున్నారు. అంజి జరిగింది మొత్తం మిగిలిన ముగ్గురికి చెప్పాడు ఆ తరువాత నలుగురు ఇంట్లో ఉన్న ఒక్కొక్కరి దెగ్గరికి వెళ్లి చిరంజీవి గురించి తెలుసుకోవడం మొదలుపెట్టారు. అదే రోజు రాత్రికి తినేసి అందరూ మళ్ళి సమావేశం అయ్యారు. సంధ్య అయితే ఏడ్చేసింది.
అంజి : ఏమైంది సంధ్యా
సంధ్య : నేను అమ్మతో మాట్లాడాను.. నిజంగా మావయ్య ఎంత మంచివాడు మనకోసం చాలా చేసాడు.. తన కోడళ్ళు బైటికి వెళ్లి కష్టాలు పడకూడదని ఆయనకి ఇద్దరు కొడుకులే కావాలని రోజు దణ్ణం పెట్టుకునేవారట.. ఎన్ని ఇబ్బందులు వచ్చినా అందరిని దెగ్గర చేర్చుకున్నాడే తప్ప ఎప్పుడు ఎవ్వరిమీద విసుక్కునేవాడు కాదట .. అమ్మ కోసం చాలా గట్టిగా నిలబడ్డాడట. అందరిని తనే దెగ్గరుండీ చూసుకునేవాడట. ఇప్పుడు ఉన్న మావయ్య అస్సలు తన తమ్ముడే కాదని కన్నీళ్లు పెట్టుకుంది అమ్మ. తనతో ఎన్ని ముచ్చట్లు అయినా పెట్టేవాడట.. అమ్మకున్న బాధలన్ని దూరం చేసాడట.. అమ్మకి మనుసులో కూడా ఎప్పుడు ఒంటరిని అయిపోయానని భయం వెయ్యలేదట అంత ప్రేమగా చూసుకునేవాడట.
శృతి : అవును సిద్ధూ తాతయ్య కూడా అదే చెప్పాడు ఎన్ని సార్లు తను ఇంటిని తాతయ్య చూసుకుంటానని నచ్చ చెప్పాడట కానీ లావణ్య అత్తయ్య కోసం వాళ్ళ అమ్మకోసం మధు అమ్మమ్మ కోసం ఎన్ని చెప్పినా వినలేదట . వీళ్ళు ముగ్గురు మావయ్యని చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేరట.
సంపత్ : మరి ఎందుకు ఇప్పుడిలా ఎప్పుడు ఏదో లూజర్ లాగ ఉంటాడు, అందరికి ఇంత చేసాడు.. అందరికోసం ఎంత కష్టపడ్డాడు అయినా కానీ ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఏదో లోకంలో ఉంటాడు.
అంజి : నాన్న తన జీవితంలో ప్రేమించిన నలుగురులో ముగ్గురు దూరం అయిపోయారు.. ఇటు మధు అమ్మమ్మ అటు నానమ్మ ఇంకో వైపు అక్షిత పిన్ని.. ఎవరైనా ఇంకెలా ఉంటారు.
సంధ్య : అంజి నేను కూడా హెల్ప్ చేస్తాను, అత్తయ్య చెప్పినట్టు మావయ్యని అక్షిత అత్తయ్య దెగ్గరికి పంపించేద్దాం అప్పుడైనా మళ్ళి మాములుగా అయిపోతాడేమో
శృతి : నేను కూడా.. పొద్దున్న లేచి నన్ను చుడనిదే ఆయన రోజు మొదలుపెట్టడు.
సంపత్ : అన్నయ్యా చెప్పు ఏం చేద్దాం.. నాన్న సంతోషం కోసం ఏమైనా చేస్తాం
అంజి : ఇప్పుడు మనం ఏమి చెయ్యలేం కానీ నేను చదువుకుని, జాబ్ మీద ముందు అక్షిత పిన్నిని కలుసుకోవాలి.. పిన్ని ఇరవై సంవత్సరాలుగా ఇంటికి కూడా రాలేదంటే ఏంటీ అర్ధం ఇంకా తన మనసులో నాన్న ఉన్నాడనే కదా. తను ఎలా ఉంది తను కూడా నాన్న లాగే ఉందా ఇప్పుడు ఏం ఆలోచిస్తుంది.. ఒక వేళ నాన్నని మనం పిన్నితో కలిపితే వాళ్ళు ఇద్దరు మళ్ళి కలుసుకుంటారా లేదా అన్ని తెలుసుకోవాలి.. నేను ఈ రోజు నుంచి కష్టపడి చదువుతాను ఎలాగైనా అక్షిత పిన్నిని కలుసుకోవాలి.
సంపత్ : నేను చదువుకుంటూ నాన్నకి సాయంగా ఉంటాను ఆయనకి పని తగ్గిస్తాను
సంధ్య : నేను శృతి మావయ్యని బాధ పడకుండా సంతోషంగా ఉండేలా ప్రయత్నిస్తాం అని శృతిని చూసింది. శృతి కూడా అవునని తల ఊపింది.
నలుగురు ఒకరినొకరు కౌగలించుకుని అందరూ ఒకే జట్టుగా అయ్యి హైఫై ఇచ్చుకున్నారు. ఇంతలో అక్షిత మాటలు వినిపించి లేచి రూంలోనుంచి తొంగి చూసాడు.. తన పిన్ని ఫోన్లో మాట్లాడుతుంది.. పెద్దగా వినిపించకపోయినా అమ్ములు అని వినిపించగానే..పిన్ని అమ్మతో మాట్లాడుతుందని అర్ధమయ్యి మిగతా విషయాలు రేపు మాట్లాడొచ్చు అని వెళ్లి పడుకున్నాడు.
___________________________________
అక్షిత : అమ్ములు
లావణ్య : అక్షితా ఎలా ఉన్నావ్, వాడేమైనా ఇబ్బంది పెడుతున్నాడా
అక్షిత : నన్ను ఇబ్బందిపెట్టడమా జరిగే పనేనా అది
లావణ్య : (హహ) ఏం చేస్తున్నావ్
అక్షిత : అంజికి మన కథ చెప్పావా
లావణ్య : వాడు నీ కోసమే వచ్చాడు
అక్షిత : అయినా నీకు ఎలా తెలుసు, అయినా మేమే ఏమి చెయ్యలేకపోయాం.. విషయాలు అన్ని తెలిసి ఏమి చెయ్యలేని పరిస్థితి నీది..
లావణ్య : నేను చెప్పాను బావకి నా మాట వినలేదు..
అక్షిత : అమ్ములు.. ఇప్పుడు ఎందుకే ఇవన్నీ.. జరిగినవి చాలవా
లావణ్య : నువ్వు నా మాట వినలేదు అందుకే
అక్షిత : సరే మీ ఆయన్ని ఫోన్ చెయ్యమను మాట్లాడతాను
లావణ్య : అది జరగని పని
అక్షిత : ఎందుకు.. అది కూడా చెప్పు
లావణ్య : అమ్మా, అత్తయ్య చనిపోయినప్పుడు నువ్వు బావ పక్కన లేవు అందుకే నువ్వంటే కోపం
అక్షిత : హ్మ్మ్,.. అని కళ్ళు తుడుచుకుంది.
లావణ్య : బావని నేను అలా చూడలేకపోతున్నాను అక్షితా
అక్షిత : ఇప్పుడేమంటావ్
లావణ్య : నువ్వు ఇంటికిరా, మాట్లాడదాం
అక్షిత : హా వచ్చి వాడి పక్కలో పడుకోనా, అప్పుడే వాడు ఆ ఆలోచన కూడా చెయ్యలేదు నువ్వు ఇలాంటివి చేసి వాడితో తిట్టించుకుని ఆ తరవాత బాధ పడకు అమ్ములు..
లావణ్య : బావ సంగతి సరే మరి నువ్వు
అక్షిత : మనం ఇంతకముందే మాట్లాడుకున్నాం అయిపోయింది ఎన్ని సార్లు అడిగినా నా సమాధానం అదే, నేను ఒంటరి జీవితానికి అలవాటు పడ్డాను.. నా ఇంట్లోకి నా మనసులోకి నా ఒంటి మీదకి ఇంకెవ్వరిని నేను రానివ్వదలుచుకోలేదు.. నేను ఇలాగే ఉంటాను
లావణ్య : నేను చెప్పేది విను
అక్షిత : ఇంకా ఏముంది నువ్వు చెప్పడానికి, మొదటి సారి మా అమ్మ ఆ ఇంటికి అడుగు పెట్టక ముందే నలుగురు ప్రాణాలు పొయ్యాయి.. చిన్నా గాడు వంటరి వాడు అయిపోయాడు.. ఏ ముహుర్తాన మళ్ళీ నేను అడుగు పెట్టానో వాడి అమ్మతో పాటు అత్తయ్య కూడా పోయింది వాళ్ళతో పాటే వాడి సంతోషాలు అన్ని పోయాయి.. నేను మా అమ్మ జాతకం చూపించాను నాది చిన్నాది కూడా చూపించాను కష్టాలు బాధలు ఏడుపులు తప్ప ఇంకేమి ఉండవు.. ఇప్పుడు నీ ఇల్లు పిల్లా పాపలతో కళకళలాడుతుంది.. మళ్ళీ ఏం జరిగినా బాధ పడేది నా చిన్నా గాడే ఇంకెప్పుడు నాకు ఫోన్ చెయ్యొద్దు. ఏమైనా ఉంటె నీ మొగుడితో మాట్లాడుకో.. రేపు నీ కొడుకుని ఇండియా పంపిచేస్తున్నా అని కోపంగా ఫోన్ పెట్టేసి.. ఒక్కసారిగా ఎక్కిళ్ళు పెడుతూ ఏడుస్తూ సోఫాలో కూలబడింది.