Episode 065


పొద్దున లేచి నేను టిఫిన్ చేసి కాలేజీకి బయలుదేరాను. నేను కాలేజీకి వెళుతూ ఉండడంతో ఆంటీకి మళ్లీ నీరసం ఆవహించింది. నిజానికి నాకు కూడా కాలేజీకి వెళ్లాలని లేదు. కానీ ఆంటీ నా కోసం తపించిపోవడం చూస్తుంటే నాకు భలే సరదాగా ఉంది. మరోవైపు నా పరిస్థితి కూడా అంతే అనుకోండి,,,,,,, ఈరోజు కూడా కాలేజీ చాలా ఖాళీగా కనబడింది. బయట పార్కుల్లో అయితే ఎవరూ లేరు. ఉన్న కొద్ది మంది స్టూడెంట్స్ కూడా క్లాస్ లోకి వెళ్ళిపోయి ఉంటారు. క్యాంటీన్ పరిస్థితి కూడా అంతే. ఎవరో 3-4 బోర్ కొట్టే మొహాలు తప్ప క్యాంటీన్ మొత్తం ఖాళీగా ఉంది. నేను కూడా బోర్ ఫీల్ అవుతూ వెళ్లి క్యాంటీన్ లాస్ట్ బెంచ్ లో కూర్చుని తాగటానికి కాఫీ ఆర్డర్ చేశాను. కాఫీ కోసం వెయిట్ చేస్తూ టైంపాస్ చేస్తుండగా, ఇదిగో నీ కాఫీ అంటూ ఒక తీయని స్వరం వినపడగానే అప్పటిదాకా నేను ఫీల్ అవుతున్న బోర్ మొత్తం ఒకేసారి ఎగిరిపోయింది.

నేను తల ఎత్తి పైకి చూడగా ఎదురుగా కవిత చేతిలో కాఫీ కప్పుతో చిరునవ్వు చిందిస్తూ అందమైన అమాయకమైన మొహంతో నన్నే చూస్తూ ఉంది. తన చిరునవ్వు ఎంత తీయగా ఉందంటే కాఫీలో పంచదార కలపకపోయినా ఆమె నవ్వు చూస్తూ కాఫీ తాగేయొచ్చు అన్నంత తియ్యగా ఉంది. .... మీరు క్యాంటీన్లో ఎప్పటి నుంచి పని చేయడం మొదలుపెట్టారు యజమానురాలుగారు అని అన్నాను. .... నా మాటలకు కవిత సంతోషించినప్పటికీ తన వేలిని పెదాలపై పెట్టుకొని ష్..ష్... కామ్ గా ఉండు. ఇది కాలేజీ ఇక్కడ అలాంటి మాటలు మాట్లాడకు అన్నట్టు నాకు సైగ చేసి చెప్పింది. కానీ కాఫీ కప్పు మాత్రం ఇంకా తన చేతిలోనే ఉంది. .... కాఫీ కప్ టేబుల్ మీద పెట్టండి యజమానురాలుగారు లేదంటే మీరు అలసిపోతారు. అయినా కాఫీ తీసుకువచ్చే శ్రమ మీరు ఎందుకు తీసుకున్నారు. ఒక ఆర్డర్ వేసుంటే నేనే అక్కడకు వచ్చి తీసుకునే వాడిని కదా అంటూ నేను గట్టిగా నవ్వాను.

వెంటనే కవిత కాఫీ కప్పు టేబుల్ మీద పెట్టి నా ఎదురుగా కుర్చీలో కూర్చుంది. .... ఓయ్ బ్లాకీ నువ్వు మాటిమాటికీ నన్ను యజమానురాలు అని పిలవకు ఇది కాలేజీ అని అంది కవిత. .... నేను అలా అంటే తప్పేముంది. యజమానురాలు అనే కదా పిలిచాను. పని మనిషి అని పిలవలేదు కదా. .... ఓయ్ బ్లాకీ నిన్ను నోరు మూసుకొమని చెప్పానా? నేను ఏమి పని మనిషిని కాను, యజమానురాలినే. .... అందుకే నేను కూడా యజమానురాలుగారు అని పిలిచాను కవిత గారు. లేదంటే మీరు కాఫీ కప్పు తెచ్చినందుకు మిమ్మల్ని పని మనిషి అని పిలిచే వాడిని కదా. .... సరే సరే ఇక నువ్వు నోరు మూసుకొని ముందు ఈ విషయం చెప్పు, నువ్వు ఈరోజు కాలేజీకి వచ్చావ్ ఏంటి? ఇటువంటి సమయాల్లో నువ్వు ఎక్కువగా కాలేజీ బంక్ కొడుతుంటావు కదా.......

ఏం చేయమంటారు యజమానురాలుగారు, నేను బంక్ కొడితే నాకు తోడుగా కరణ్ ఉండేవాడు. కానీ వాడు ఎక్కడికో బయటకు వెళ్ళాడు. ఇప్పుడు నేను బంక్ కొట్టడానికి నాకు తోడు ఎవరు లేరు. .... ఏం నీకు గర్ల్ఫ్రెండ్స్ ఎవరూ లేరా? తనతో కలిసి బంక్ కొట్టొచ్చు కదా. .... గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఏ పిచ్చివాడు కాలేజీకి వస్తాడు యజమానురాలుగారు. .... చెప్పానా నన్ను యజమానురాలు అని పిలవద్దని, సరిగ్గా మాట్లాడు లేదంటే నేను వెళ్ళిపోతాను. .... సరే తల్లి అలా పిలువను, నువ్వు కోపగించుకోవద్దు. అది సరేగాని నువ్వేంటి ఈరోజు ఇలా క్యాంటీన్ కి వచ్చావ్. నువ్వు మరియు నీ హిట్లర్ ఫ్రెండ్ ఎప్పుడూ క్లాస్ రూమ్ లో నుంచి బయటకు రారు కదా. మరి నీ హిట్లర్ ఫ్రెండ్ ఎక్కడ? ఇప్పుడు తన ఆరోగ్యం ఎలా ఉంది. జ్వరం అది తగ్గిపోయిందా? .... నీ దగ్గర తన నెంబర్ ఉంది కదా నువ్వే అడిగి తెలుసు కోవచ్చు కదా. ఎంతైనా తను నీ చెల్లెలే కదా, తన ఆరోగ్యం ఎలా ఉంది అని తనని అడగొచ్చు కదా. ....

అడగొచ్చు కానీ నాకు అడగాలని లేదు. అందుకే నిన్ను అడుగుతున్నాను. నువ్వు చెప్పాలి అనుకుంటే చెప్పు లేదంటే నీ ఇష్టం. .... తనకి ఇప్పుడు బాగానే ఉంది. ఈరోజు కాలేజీకి కూడా వచ్చింది. తనని వెతుక్కుంటూనే నేను ఇక్కడికి వచ్చాను. తను ఎక్కడ ఉందో తెలియడం లేదు. .... తను కాలేజీకి వచ్చిందా? అంటే తన ఆరోగ్యం ఇప్పుడు పూర్తిగా బాగుందన్న మాట. అందుకే అమ్మ తనని కాలేజీకి పంపించి ఉంటుంది. లేదంటే అమ్మ అసలు పంపించదు. .... అవును సన్నీ నువ్వు చెప్పింది చాలా కరెక్ట్. తను ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉంది. కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్లిందో తెలియడం లేదు. అది సరేగాని ఈ విషయం చెప్పు, ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉంటున్నావు. ఎవరో ఫ్రెండ్ ఇంట్లో ఉంటున్నావని నాకు తెలిసింది. కానీ నాకు తెలిసి నీకు కరణ్ తప్ప మరి ఇంకెవరు ఫ్రెండ్స్ లేరు. .... ఉన్నారులే ఎవరో ఒక ఫ్రెండ్, ఇప్పుడు నేను వాడి దగ్గరే ఉంటున్నాను. వాడు నీకు తెలియదులే. అయినా నాకు కరణ్ తప్ప మరి ఇంకెవరు ఫ్రెండ్స్ లేరని నీకు ఎవరు చెప్పారు? నువ్వు కూడా నాకు ఫ్రెండ్ వే కదా. ......

అవును నేను ఫ్రెండ్ నే, నీకు మరియు సోనియాకు కూడా. కానీ నువ్వు మాత్రం కేవలం నాకు మాత్రమే ఫ్రెండ్ వి. సోనియాకు కాదు. అందుకే ఎప్పుడూ తనతో గొడవ పడుతూ ఉంటావు. అయినా నీకు తనంటే ఎందుకు అంత కోపం? .... కోపం కాదు కవిత, నిజానికి నేను తనమీద కోప్పడలేను. తనను జాగ్రత్తగా చూసుకోవడానికే నేను తనకు దూరంగా ఉంటున్నాను. .... దూరంగా ఉండి జాగ్రత్తగా చూసుకోవడమా, అదేం జాగ్రత్త? తన కంటే కూడా నీకే కోపం ఎక్కువ అని నాకు అనిపిస్తుంది. పైగా నువ్వు తనను హిట్లర్ అని పిలుస్తావు. నిజానికి ఆ పేరు నీకు పెట్టాలి. .... నువ్వు నన్ను ఏమన్నా పిలుచుకోవే పిచ్చిదానా. కానీ నిజంగానే నేను తనను జాగ్రత్తగా చూసుకుంటాను. అందుకే నేను తనకు దూరంగా ఉంటాను. తన ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి తన దగ్గరకు వస్తే మళ్లీ నన్ను కోపగించుకొని తన ఆరోగ్యం ఎక్కడ పాడు చేసుకుంటుందో అని నాకు భయంగా ఉంటుంది. నీకు తెలుసు కదా అసలే దానికి కోపం ముక్కు మీద ఉంటుంది. కేవలం దాని కోపం కారణంగానే నేను తనకు దూరంగా ఉంటాను. కానీ నేను ఎప్పుడూ తనను జాగ్రత్తగానే చూసుకుంటాను. ....

నాకు తెలుసు సన్నీ, నువ్వు రాత్రంతా పడుకోకుండా దానికి తడిగుడ్డ పెడుతూ ఒక్క క్షణం కూడా నిద్రపోలేదని ఆంటీ నాతో చెప్పారు. నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకునే ఫ్రెండ్స్ నీకు తక్కువే ఉన్నారు. మరి నువ్వు మీ ఇంట్లో అందరి కంటే ఎవరిని బాగా జాగ్రత్తగా చూసుకుంటావు. .... అదేం ప్రశ్న? నేను మా ఇంట్లో అందర్నీ జాగ్రత్తగానే చూసుకుంటాను. నా ఫ్రెండ్స్ ని కూడా బాగుండాలని కోరుకుంటాను. .... నాకు తెలుసు, కానీ నువ్వు మీ ఇంట్లో అందరికంటే ఎవరిని ఎక్కువగా జాగ్రత్తగా చూసుకోవాలి అని అనుకుంటావు. మీ అమ్మ, నాన్ననా? లేదా నీ తోబుట్టువుల నా? .... ఇదేం ప్రశ్న కవిత? ఒక అమ్మను తన పిల్లలందరిలోనూ ఎవరంటే ఎక్కువ ఇష్టం అని చెప్పమంటే ఆమెకు చెప్పడం చాలా కష్టం. అలాగే నాకు కూడా నా కుటుంబ సభ్యులందరిలో ఎవరు ఎక్కువ ఇష్టం అంటే చెప్పడం చాలా కష్టం. నాకు మా ఇంట్లో వాళ్ళందరూ ఇష్టమే. నేను అందరినీ జాగ్రత్తగా చూసుకుంటాను. ....

ఓయ్ బుద్దు, ప్రతి అమ్మ కూడా తన బిడ్డలలో ఎవరో ఒకరిని బాగా ముద్దు చేస్తూ ఉంటుంది. వారినే ఎప్పుడూ చంకనెత్తుకుంటూ ఉంటుంది. అందరి బిడ్డలను ఒకేలా ప్రేమిస్తుంది. కానీ ఒక బిడ్డపై మాత్రం అతి గారాబం చూపిస్తూ ఉంటుంది. నేను కూడా నిన్ను అలాగే అడుగుతున్నాను. నువ్వు ఎవరిని ఎక్కువగా జాగ్రత్తగా చూసుకుంటావు. .... ఓహో! అలా అంటావా, అలా అయితే ఇంకెవరు ఉంది కదా నీ మెంటల్ ఫ్రెండ్ దానినే ఎక్కువ జాగ్రత్తగా చూసుకుంటాను. ఎందుకంటే మేము ఇద్దరము చిన్నప్పట్నుంచి కలిసే పెరిగాము. కలిసి కాలేజ్ కి వెళ్ళాము, కలిసి ఆటలాడుకున్నాము. మా ఇద్దరిదీ ఒకటే రూమ్ కావడంతో తనతోనే ఎక్కువ కాలం గడిపాను. తను నన్ను బాగా అర్థం చేసుకుంటుంది. నేను కూడా తనను మరియు తన కోపాన్ని కూడా అర్థం చేసుకుంటాను. ఎప్పుడూ తను నవ్వుతూ తుళ్ళుతూ తన మొహంలో దిగులు అనేది కనిపించకుండా ఉంటుంది. అయినా తను దిగులుగా ఉంటే నేను చూడలేను. తను ఏడుస్తూ ఉంటే నేను చూడలేను.

తను ఏడిస్తే తన మొహాన్ని అదోలా పెడుతుంది అది అస్సలు చూడలేము. తన కంట్లో నీరు రావడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. మేమిద్దరము అన్న చెల్లెలు కంటే ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్న మంచి స్నేహితులం అని చెప్పవచ్చు. .... ఆహా! మరి అంత జాగ్రత్తగా చూసుకునే వాడివి దానితో ఎందుకు మాట్లాడటం మానేసావ్. అది ఎక్కువగా దిగులు పడదని నాకు కూడా తెలుసు. కానీ కొద్ది రోజులుగా అది చాలా దిగులుగా మరియు ఆందోళనగా కనబడుతుంది. నేను జోకులు వేసి దానిని నవ్వించినా, అది నవ్వడం లేదు. దానికి ఏమైందో అర్థం కావడం లేదు. దానిని నువ్వు ఏమైనా అన్నావా? .... ఆ మాట విన్న నాకు, కొంపతీసి సోనియా కవితకు నా గురించి అంతా చెప్పేసిందా ఏమిటి? అని మనసులో అనుకొని బయటకు మాత్రం సరదాగా జోక్ చేస్తూ, పాపం అది మాత్రం ఏం చేస్తుంది. నీ జోకులు అంత దరిద్రంగా ఉండి ఉంటాయి. బాగా నవ్వుతూ తిరుగుతున్న మనిషి కూడా నీ జోకులు విని దిగాలు పడిపోతారు అని నవ్వుతూ అన్నాను. .....

అబ్బా! వేళాకోళం ఆపు సన్నీ. నిజంగానే తను 2-3 రోజులుగా చాలా దిగులుగా ఉంది. ఇంతకుముందెప్పుడూ దానిని అంత దిగులుగా ఉండటం చూడలేదు. జ్వరం వచ్చిన దగ్గరనుంచి ఇంకా ఎక్కువ దిగులుగా కనబడుతుంది. ఆరోగ్యం బాగోలేదు కదా అందుకే అని అనుకున్నప్పటికీ, అంత దిగులుగా ఉండటం నేను ఎప్పుడూ చూడలేదు. ఆరోగ్యం బాగోక పోయినా ఎప్పుడూ సరదాగా నవ్వుతూ నవ్విస్తూ ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ఎందుకు దిగులుగా ఉన్నావు అని అడిగినా సరే, నాకేమీ కాలేదు బాగానే ఉన్నాను అని చెబుతోంది. .... అవును కవిత ఆరోగ్యం బాగోలేక పోవడం వల్ల అలా ఉండి ఉంటుంది. మిగిలిన విషయాలు ఏమి నాకు తెలియదు. మీ ఫ్రెండ్ కదా నీకే తెలియాలి. .... నాకేమీ తెలియదు సన్నీ. నువ్వే తనను బాగా అర్థం చేసుకోగలవు. నాకంటే కూడా తనకు నీతోనే స్నేహం ఎక్కువ. తనకు ఏమైందో నీకే బాగా తెలిసి ఉండాలి. ఒకవేళ తెలియకపోయినా ప్లీజ్ తనతో మాట్లాడి ఏమైందో కనుక్కో. నువ్వు ఎలాగైతే తన కళ్ళలో నీళ్ళు చూడలేవో, నేను కూడా తన మొహంలో దిగులు చూడలేను. ....

సరే తను ఎందుకు అంత దిగులుగా ఉందో నేను కనుక్కుంటాను. బహుశా తనకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్ వున్నాడేమో, వాడితో ఏమైనా గొడవపడి అలా దిగులుగా ఉందేమో? ..... నా మాట విని కవిత గట్టిగా నవ్వుతూ, బాయ్ ఫ్రెండా? అది సోనియాకి, ఎవడైనా దానితో మాట్లాడి బుర్ర పగలగొట్టించుకోవాలని అనుకుంటాడా? అయినా అది అబ్బాయిలు ఎవరితోనూ మాట్లాడదు. ఒకవేళ మాట్లాడితే నాకు కచ్చితంగా తెలుస్తుంది. .... బహుశా నీతో చెప్పి ఉండక పోవచ్చు కదా. నీకు ఈ విషయం తర్వాత చెప్పి సర్ ప్రైజ్ ఇద్దామని అనుకోవచ్చు కదా. .... ఓహ్ షిట్, నువ్వు సర్ప్రైజ్ అనగానే గుర్తుకు వచ్చింది. మీ ఇంట్లో నీకోసం ఒక సర్ప్రైజ్ ఎదురుచూస్తూ ఉంది. పక్కాగా ఇప్పుడు దాకా ఈ విషయం నీతో ఎవరు చెప్పి ఉండరు. అది ఏంటో నాకు తెలుసు. .... సర్ ప్రైజా? ఎలాంటి సర్ప్రైజ్? .... ఓయ్ బుద్ధు, సర్ప్రైజ్ ఏంటో ఎలా చెప్పను. నువ్వే ఇంటికి వెళ్లి చూసి తెలుసుకోవాలి. నేను చెప్పేస్తే అది సర్ప్రైజ్ ఎలా అవుతుంది. ....

కవిత అలా మాట్లాడుతూ ఉండగానే కోపంగా ఒక గంభీరమైన గొంతు వినబడింది. నేను భయంగానే తల ఎత్తి చూసాను. ఎందుకంటే ఆ గొంతు మరెవరో కాదు. నేను జీవితాంతం ఎక్కువగా భయపడే నా హిట్లర్ సోనియాది. .... సోనియా కొంచం కోపంగా మాట్లాడుతూ, నువ్వేంటి ఈ బ్లాకీ గాడితో కూర్చొని ఏం చేస్తున్నావ్ అని అడిగింది. నేను ముందు తల దించుకుని ఉన్నప్పటికీ తర్వాత తల ఎత్తి చూసేసరికి సోనియా నా వైపు కోపంగా గుర్రుగా చూస్తూ ఉంది. తను నా వైపు ఎంత కోపంగా చూస్తుంది అంటే చూపులతోనే నన్ను భూమిలో పాతేసేటట్టు చూస్తుంది. .... అబ్బే ఏమీ లేదు సోనియా, నేను నిన్ను వెతుక్కుంటూ ఇక్కడకు వచ్చాను. ఇక్కడ సన్నీ కనపడటంతో తనతోపాటు కూర్చున్నాను. .... ఇప్పుడు నేను కనబడ్డాను కదా, అయినా నేను పనికిమాలిన వాళ్ళలాగా క్యాంటీన్ లో కాకుండా లైబ్రరీలో ఉంటాను అని నీకు తెలుసు కదా. తొందరగా లేచి ఇక్కడి నుంచి పద అని అంది సోనియా. .... కవిత వెంటనే పైకి లేచి సోనియాతో కలిసి బయటకు వెళ్లి పోయింది.

నేను కొంచెం దైర్యం తెచ్చుకొని వాళ్ళ వైపు చూసే సరికి కవిత నన్ను చూసి నవ్వుతోంది. కానీ మా హిట్లర్ కళ్ళు మాత్రం శాశ్వతంగా ఎర్రగా మారిపోయినట్టు అనిపించింది. ఎప్పుడూ అంత కోపంగా ఉంటుంది మరి. తన కోపం చూస్తుంటే నాకు భయమేస్తుంది. కవితతో మాట్లాడుతూ ఉండడం వల్ల కాఫీ చల్లారిపోయింది. కానీ కొద్ది క్షణాలు సోనియా క్యాంటీన్ వాతావరణాన్ని వేడిగా మార్చడంతో, ఇప్పుడు నాకు కాఫీ కూడా వేడిగానే అనిపించింది. నేను కాఫీ తాగుతూ ఉండగా కవిత ఏదో సర్ప్రైజ్ వుందని చెప్పడం గుర్తుకు వచ్చింది. నేను వెంటనే సంతోషపడుతూ, ఒకవేళ నాన్న గాని నా కోసం కొత్త కారు కొన్నారా ఏంటి? ఎందుకంటే నాన్న నా కోసం కొత్త కారు కొంటాను అని ఇదివరకే మాటిచ్చారు. అదే విషయం గురించి ఆలోచిస్తూ సంతోషంగా కాఫీ తాగడం పూర్తిచేసి క్యాంటీన్ లో నుంచి బయటకు వెళుతూ ఉండగా, ఒక టీచర్ క్యాంటీన్ లోకి వచ్చి క్యాంటీన్ వాడిని మెడ పట్టుకుని బయటకు లాక్కొని వెళ్ళాడు. నేను కూడా ఏం జరుగుతుందో తెలుసుకోవాలని వాళ్ల వెనుకే వెళ్లాను. బయట ఒక మినీ బస్సు ఆగి ఉంది. ఆ బస్సు దగ్గర 10-12 మంది కుర్రాళ్ళు నిల్చుని ఉన్నారు. క్యాంటీన్ వాడిని కూడా వాళ్లందరితో కలిపి బస్సు ఎక్కించారు. అప్పుడు బస్సు దగ్గర నిల్చుని ఉన్న ప్రిన్సిపాల్ నన్ను పిలిచారు.

సన్నీ కొంచెం ఇటురా అని పిలిచారు ప్రిన్సిపాల్. నేను ప్రిన్సిపాల్ దగ్గరకు వెళ్లాను. .... నువ్వు కూడా కనబడడం చాలా మంచిది అయింది. నాతో పాటు పద, నీతో కొంచెం పని ఉంది. .... ఎక్కడకు వెళ్లాలి సార్. .... హాస్పిటల్ కి వెళ్ళాలి సన్నీ, నాతో పాటు పద. .... మీరు పదండి సార్, నేను నా బైక్ మీద మీ వెనక వస్తాను. .... సరే లేట్ చేయకుండా వెంటనే బయలుదేరు. .... సరే సార్ అంటూ నేను నా బైక్ దగ్గరకు వెళ్లి స్టార్ట్ చేసి బయల్దేరే వరకు ప్రిన్సిపాల్ తన కారులో అక్కడే వెయిట్ చేశారు. నేను కాలేజీ నుంచి బయటకు రాగానే మినీ బస్సు మరియు ప్రిన్సిపాల్ కారు నన్ను దాటుకొని ముందుకు వెళ్ళాయి. వెంటనే నేను నాకు తెలియకుండా ఏమైనా గందరగోళం జరిగిందా అని తెలుసుకోవడానికి ఖాన్ గారికి ఫోన్ చేశాను. .... నేను ఖాన్ గారితో మాట్లాడుతూ ఇప్పుడు కాలేజీలో జరిగిన విషయాన్ని అంతా చెప్పాను. ఖాన్ గారు మాట్లాడుతూ కంగారు పడవలసినది ఏమీ లేదని, ఇప్పుడు ఆయన కూడా అదే హాస్పిటల్ లో ఉన్నానని, తనతోపాటు సురేష్ మరియు అమిత్ వాళ్ల బాబులు కూడా హాస్పిటల్ లోనే ఉన్నారని నువ్వేమీ భయపడకుండా ఇక్కడికి వచ్చేయ్ అని చెప్పారు.

ఖాన్ గారితో మాట్లాడిన తర్వాత నాకు కొంచెం భయం తగ్గింది. ఇక ఎటువంటి సంశయం లేకుండా హాస్పిటల్ వైపు వెళ్లాను. నేను హాస్పిటల్ కు వెళుతూ ఉండగా నా ఫోన్ మోగింది. ఆ ఫోన్ కామిని వదిన దగ్గర నుంచి వస్తోంది. అప్పటి దాకా నేను సోనియా వలన మరియు ప్రిన్సిపాల్ వలన చాలా భయంతో ఉన్నాను. అటువంటి సమయంలో కామిని వదిన దగ్గర్నుంచి ఫోన్ రావడంతో నాకు సంతోషం అనిపించింది. .... హలో సన్నీ. .... హలో వదిన, నేను కొంచెం పని మీద బయటకు వచ్చాను. కొంచెం సేపట్లో ఫ్రీ అయిపోతాను. ఏదైనా పని ఉందా అని అడిగాను. .... పని ఉండబట్టే ఫోన్ చేశాను సన్నీ. .... ఏం పని వదిన చెప్పు. .... నీకు ఏమీ తెలియనట్టు, నాకు నీతో ఇంకేం పని ఉంటుంది చెప్పు. .... నాకేం తెలుసు, నీ అవసరం నీకే తెలియాలి అంటూ నవ్వుతూ అన్నాను. .... నవ్వు దుర్మార్గుడా,, నీ ఇష్టం వచ్చినట్టు నవ్వు, నేను ఇక్కడ నీకోసం పడిచస్తుంటే, నీకు నవ్వులాటగా ఉందా? ఒక్కసారి నా చేతికి దొరక్క పోతావా? అప్పుడు చెప్తా నీ పని. అంతకు అంత బదులు తీర్చుకుంటాను. .... సరే వదిన నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుందువులే, ఇంతకీ పని ఏంటో చెప్పు. .... ఇప్పుడు కాదు రేపు పొద్దున్న చెబుతాను. రేపు పొద్దున్న 10 గంటల తర్వాత ఇంటికి రా. .... రేపు పొద్దున్నే ఎందుకు? ఏదైనా విశేషం ఉందా? .... నువ్వు రేపు పొద్దున్న రా అప్పుడు చెబుతాను. .... సరే వదిన రేపు పొద్దున్న ఇంటికి వస్తాను అంటూ బాయ్ చెప్పగానే వదిన బాయ్ చెప్పి ఫోన్ కట్ చేసింది. నేను కూడా ఫోన్ నా పాకెట్లో పెట్టుకుని 15-20 నిముషాలలో హాస్పిటల్ కు చేరుకున్నాను.

నేను హాస్పిటల్ కు చేరుకునే సరికి ప్రిన్సిపాల్ కారు మరియు మినీ బస్సు అక్కడికి చేరుకొని ఉన్నాయి. మినీ బస్సులో ఉన్న మా కాలేజీ స్టూడెంట్స్ మరియు క్యాంటీన్ వాడిని సెక్యూరిటీ ఆఫీసర్లు హాస్పిటల్ లోకి తీసుకుని వెళుతున్నారు. మరోపక్క ఒక పెద్ద సెక్యూరిటీ అధికారి ఆఫీసర్ లా కనిపిస్తున్న వ్యక్తి ప్రిన్సిపాల్ తో మాట్లాడుతున్నాడు. అప్పుడే ప్రిన్సిపాల్ దృష్టి లోపలికి వస్తున్న నాపై పడింది. నన్ను చూసి ప్రేమగా మాట్లాడుతున్నట్టు వచ్చేసావా సన్నీ, ఇలా నా దగ్గరికి రా అని పిలిచాడు. వెంటనే నేను ప్రిన్సిపాల్ దగ్గరకు వెళ్లాను. నేను దగ్గరకు వెళ్లడంతో అప్పటిదాకా మాట్లాడుతున్న ఆ ఆఫీసర్ మాట్లాడటం ఆపేశాడు. .... అవును సార్ ఇప్పుడే వచ్చాను. నన్ను ఇక్కడకు ఎందుకు రమ్మన్నారు సార్. మన కాలేజీ కుర్రాళ్లు కూడా ఇక్కడే ఉన్నారు. ఇందాక నేను కాలేజీలో చూసిన బస్సు కూడా ఇక్కడికే వచ్చింది. అసలు విషయం ఏంటి సార్ అని అడిగాను. అప్పుడు అక్కడ ఉన్న సెక్యూరిటీ అధికారి ఆఫీసర్ తన సెక్యూరిటీ అధికారి స్టైల్ లో మాట్లాడుతూ, అంత తొందర ఎందుకు యంగ్ స్టర్, కొంచెం సేపు ఓపిక పడితే నీకే అంతా అర్థం అవుతుంది అని అన్నాడు. ....

ఏమీ లేదు సన్నీ, మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడిగి తెలుసుకోవడానికి నిన్ను ఇక్కడకు రమ్మన్నాను అని ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఉండగా ఆ ఆఫీసర్ లోపలికి పదండి అని అన్నాడు. ముందు ఆ ఆఫీసర్ నడుస్తుండగా అతని వెనుక ప్రిన్సిపాల్, ప్రిన్సిపాల్ వెనుక నేను నడుస్తూ లిఫ్ట్ లోకి చేరుకొని హాస్పిటల్ టాప్ ఫ్లోర్ లోకి వెళ్ళాము. అక్కడ ఉన్న ప్రైవేట్ రూమ్ లోకి వెళ్లి అక్కడ సీన్ చూసేసరికి నేను అవాక్కయిపోయాను. అక్కడ కనీసం 10-12 మంది సెక్యూరిటీ ఆఫీసర్లు, 10-12 మంది మా కాలేజీకి సంబంధించిన కుర్రాళ్ళు మరియు క్యాంటీన్ వాడు, మరికొంతమంది పూర్తిగా తెల్ల దుస్తులు ధరించిన వ్యక్తులు అక్కడ ఉన్నారు. బహుశా వాళ్లంతా పెద్ద పెద్ద రాజకీయ నాయకుల తాలూకా మనుషుల్లాగ కనిపించారు. అది ఒక చాలా పెద్ద హాలు. ఒక పక్కకు 6 బెడ్ లు ఉన్నాయి. వాటిమీద సురేష్ మరియు అతని ఫ్రెండ్స్ పూర్తిగా కట్లు కట్టి పడి ఉన్నారు. అందులో కొంతమంది పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వారిని అలా చూసి వీళ్లు చస్తే బాగున్ను అని మనసులో అనుకున్నాను. బహుశా మా కాలేజీకి సంబంధించిన వారు అంతా వాళ్లు చస్తే బాగున్ను అని కోరుకుని ఉంటారు.

అప్పుడు నా దృష్టి అక్కడే ఉన్న ఖాన్ గారి మీద పడింది. అతనిని చూడగానే నాకు కొంచెం రిలాక్స్ గా అనిపించింది. అంతేకాదు అతని పక్కనే రితిక నిల్చుని ఉండడం చూసి నా మనసుకు సంతోషం కలిగింది. ఎందుకంటే ఆ రూములో ఉన్న వ్యక్తులు అందరిలో వాళ్ళిద్దరు మాత్రమే నాకు తోడుగా ఉండే వ్యక్తులు. మిగిలిన వారందరికీ నేను పరాయి వ్యక్తినే. అక్కడ కొంతమంది డాక్టర్లు కూడా ఉన్నారు. వాళ్లు వారి పని చేసుకుంటున్నారు. కొంత సేపటికి వారు చేస్తున్న పని ముగించి ఒక పక్కన నిల్చున్నారు. అప్పుడు నేను కొంచెం ముందుకు జరిగి చూసేసరికి అక్కడ ఒక సోఫా ఉంది.

ఆ సోఫాపై అమిత్ తో పాటు అమిత్ మరియు సురేష్ ల బాబులు కూర్చున్నారు. వాళ్లతో పాటు మరి కొంత మంది వ్యక్తులు కూర్చొని ఉన్నారు. బహుశా వాళ్లంతా దెబ్బలు తగిలిన మిగిలిన కుర్రాళ్ల బాబులు అయి ఉంటారు. అప్పుడు ఒక డాక్టరు ముందుకు వచ్చి కొన్ని రిపోర్టులు వారికి చూపించి ఏదో మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోయారు. డాక్టర్లు బయటకి వెళ్లిపోవడంతో వెంటనే ఆ రూము తలుపులు మూసుకు పోయాయి. రాజకీయ నాయకులతో పాటు వచ్చిన బాడీగార్డ్స్ తలుపులు మూసేశారు. అప్పుడు సోఫాలో నుంచి అమిత్ గాడు లేచి ప్రిన్సిపాల్ మరియు నేను ఉన్న చోటికి వచ్చాడు. వాడు నా వైపు కొంచెం కోపంగా చూస్తున్నాడు. తర్వాత అమిత్ మరియు సురేష్ ల బాబులు పైకి లేచి వాళ్లు కూడా మా దగ్గరకు వచ్చారు. .... ఏం ప్రిన్సిపాల్ ఇదంతా ఎలా జరిగింది. నా కొడుకుని ఎవరు కొట్టారో చెప్పు అని అన్నాడు సురేష్ వాళ్ళ బాబు. ....

సార్ నేనేమీ చూడలేదు సార్. గొడవ జరుగుతున్న శబ్దం విని నేను బయటకు వచ్చి చూసేసరికి మొత్తం జరిగిపోయింది. మీ అబ్బాయిని ఎవరు కొట్టారో నేను చూడలేదు సార్ అని అన్నాడు ప్రిన్సిపాల్. .... నువ్వు చూడలేదు సరే, కాలేజీలో ఇంకెవరైనా చూసి ఉంటారు కదా. .... అవును సార్ వీళ్ళంతా చూశారు అంటూ బస్సులో తీసుకువచ్చిన కాలేజీ కుర్రాళ్లు అందరి వైపు చూపిస్తూ అన్నాడు ప్రిన్సిపాల్. .... ఆ కొట్టిన వారిని వీళ్లంతా చూశారా? .... నాకు అదంతా తెలియదు కానీ నేను ఆఫీస్ లో నుంచి బయటకు వచ్చి చూసేసరికి అక్కడ గుమిగూడిన వారిలో వీళ్లంతా ఉన్నారు సార్. కొట్టిన వ్యక్తులను వీళ్లంతా చూసే ఉంటారు. మొత్తం కాలేజీని ఇక్కడకు తీసుకు రాలేను కనుక నేను గుర్తు పెట్టుకున్న ఈ కొంతమందిని ఇక్కడకు తీసుకొని వచ్చాను సార్. సురేష్ మరియు అతని ఫ్రెండ్స్ ను అంబులెన్స్ లోకి ఎక్కించడానికి నేను పిలిచినప్పుడు వీళ్లు ఎవరు దగ్గరకు కూడా రాలేదు అని అన్నాడు ప్రిన్సిపాల్.

అమిత్ గాడు కోపంగా మాట్లాడుతూ, సురేష్ గాడికి హెల్ప్ చేయకూడనంత ధైర్యం వచ్చిందా వీళ్ళకి, అంటూ నా వైపు తిరిగి నా వైపు చెయ్యి చూపిస్తూ, వీడు ఇక్కడ ఎందుకు ఉన్నాడు సార్ అని ప్రిన్సిపాల్ ని అడిగాడు. .... అప్పుడు సురేష్ వాళ్ళ బాబు మాట్లాడుతూ, అమిత్ ఈ అబ్బాయి సురేష్ స్నేహితుడు. ఎవరు ముందుకు రాకపోయినా అతను మాత్రం ముందుకు వచ్చి వీళ్ళని అంబులెన్స్ లో ఎక్కించడానికి సహాయం చేశాడు. .... వీడా? అంటూ అమిత్ ఆశ్చర్యపోతూ, వీడు ఎప్పటినుంచి సురేష్ కు స్నేహితుడు అయ్యాడు. వీడితోనే ఇంతకుముందు 1-2 సార్లు మాకు గొడవ జరిగింది. బహుశా ఈసారి కూడా వీడే సురేష్ ను కొట్టి ఉంటాడు అని అన్నాడు అమిత్. .... లేదు బాబు నువ్వు పొరబడుతున్నావు, నిజంగానే సురేష్ కి హెల్ప్ చేశాడు. అని అన్నాడు ప్రిన్సిపాల్.

అప్పుడు అమిత్ వాళ్ళ బాబు నా దగ్గరకు వచ్చి, నువ్వు సురేష్ ను కొట్టావా? ఇంతకుముందు మా వాళ్లతో గొడవ పడ్డావా? అని అడిగాడు. .... అవును సార్ మా మధ్య గొడవ జరిగింది. ఎందుకంటే వీళ్ళంతా కలిసి ఒక అమాయకుడిని దారుణంగా కొట్టారు. అది చూడలేక నేను వాళ్ల మధ్యలోకి వెళ్ళవలసి వచ్చింది. ఆ అబ్బాయిని రక్షించడానికి నేను వీళ్ళను ఆపే ప్రయత్నం చేశాను. కానీ వీళ్ళు ఆగకుండా ముందు వాళ్లే నాతో గొడవ పెంచుకున్నారు. ఆ అబ్బాయిని రక్షించడానికి నేను కూడా వీళ్ళతో గొడవ పడాల్సి వచ్చింది. ఎంత కాదనుకున్నా నేను కూడా వీళ్లతో పాటు చదువుతున్న యువకుడినే కదా సార్ అని అన్నాను. .... ఎవరిని కొడుతున్నారు అమిత్ అని వాళ్ళ బాబు అడిగాడు. .... మా కాలేజీలో సుమిత్ అని ఒక వెధవ ఉన్నాడు డాడ్. వాడు నా ఎంగిలి మెతుకులు తింటూ నాకే ఎదురుతిరిగాడు. ....

ఇంతలో సురేష్ మంచం మీద నుంచి చిన్న గొంతుతో మాట్లాడుతూ, ఈసారి కూడా వాడితోనే గొడవ జరిగింది అమిత్ అని అన్నాడు. .... ఆ మాట వినగానే అమిత్ సురేష్ బెడ్ దగ్గరకు వెళ్లి, ఏంటి ఆ వెధవ మిమ్మల్ని ఇలా కొట్టాడా అని ఆశ్చర్యపోతూ అడిగాడు. .... లేదు అమిత్ వాడితో పాటు మరో పదిమంది కూడా ఉన్నారు. .... వెంటనే అమిత్ నా వైపు చేయి చూపిస్తూ వారిలో వీడు కూడా ఉన్నాడా? అని అడిగాడు. .... లేదు అమిత్, వారిలో సన్నీ లేడు, సన్నీ చుట్టుపక్కల ఎక్కడా కనిపించలేదు. వాళ్లందరూ వేరే వ్యక్తులు. వాళ్లంతా మన కాలేజీకి సంబంధించిన వ్యక్తులు కారని నాకు అనిపిస్తుంది అని అన్నాడు సురేష్. .... నువ్వు నిజమే చెబుతున్నావా? ఈ సన్నీ గాడు వాళ్లతో పాటు లేడా? అని కోపంగా అడిగాడు అమిత్.

లేదురా అమిత్, నేను నిజమే చెబుతున్నాను. వాళ్లంతా స్టూడెంట్స్ లాగా కనిపించినప్పటికీ వాళ్లు మమ్మల్ని కొట్టే విధానం చూస్తూ ఉంటే వాళ్లు పక్కాగా రౌడీలు అయి ఉంటారు. ఆ సుమిత్ గాడు బయటనుంచి కిరాయి గూండాలను తీసుకొని వచ్చి ఉంటాడు. .... ఆ ఎదవకి అంత ధైర్యమా? ఒక్కసారి కనబడితే చంపి పడేస్తా నా కొడుకుని అని కోపంతో ఊగిపోతూ అన్నాడు అమిత్. .... అప్పుడు అమిత్ గాడి బాబు నా దగ్గరకు వచ్చి, ఈ అబ్బాయి తప్పేమీ లేదు ఏ సి పి గారు, కానీ మిగిలిన ఈ ఎదవలు అంతా తప్పు చేశారు అని అన్నాడు. .... కానీ సార్ సురేష్ వీళ్ళందర్నీ చూసి ఆ గొడవపడిన వాళ్లలో వీళ్ళు ఎవరు లేరు అని చెప్పాడు కదా సార్. ....

గొడవపడిన వాళ్లలో వీలు లేకపోతేనేమి, సురేష్ మరియు అతని ఫ్రెండ్స్ ను అంబులెన్స్ లోకి ఎక్కించడానికి ఒక్కడు కూడా ముందుకు రాకుండా చాలా పెద్ద తప్పు చేశారు. వీళ్లకు శిక్షపడి తీరాలి అని అన్నాడు అమిత్ గాడి బాబు. .... అయితే వీళ్ళను ఏం చేయమంటారు సార్. .... పెద్దగా చేయడానికి ఏముంటుంది, 1-2 రోజులు లోపల వేసి సెక్యూరిటీ ఆఫీసర్ల విందుభోజనం రుచి చూపించండి అని అన్నాడు అమిత్ గాడి బాబు. .... ఆ మాట విని అందరి మొహాల్లో రంగు మారిపోయింది. కొంతమంది అయితే ఏడ్చే స్థితికి చేరుకున్నారు. క్యాంటీన్ వాడు అయితే అమిత్ గాడి బాబు కాళ్లపై పడి క్షమించమని వేడుకున్నాడు. ఇంతలో ఒక సెక్యూరిటీ ఆఫీసర్ ముందుకు వచ్చి వాడిని పక్కకు లాగేశాడు. .... ఇన్స్పెక్టర్ ఖాన్ వీళ్ళందర్నీ తీసుకువెళ్లి రెండు మూడు రోజులు లోపల వేసి బాగా సన్మానం చేసి తర్వాత వదిలేయండి అని అన్నాడు ఏసీపీ. ....

ఖాన్ గారు ముందుకు వచ్చి, వీళ్లందరినీ బండి ఎక్కించి సెక్యూరిటీ అధికారి స్టేషన్ కు తీసుకొని వెళ్ళండి అని కొంత మంది సెక్యూరిటీ ఆఫీసర్లకు చెప్పారు. అప్పుడు అక్కడున్న సెక్యూరిటీ ఆఫీసర్లు వాళ్ళందరినీ సెక్యూరిటీ అధికారి స్టేషన్ కు తీసుకు వెళ్లడానికి కిందికి తీసుకువెళ్లారు. క్యాంటీన్ కుర్రాడు మాత్రం ఇద్దరు సెక్యూరిటీ ఆఫీసర్లు అతన్ని పట్టుకున్నప్పటికీ రెండు చేతులు జోడించి ఏడుస్తూ అమిత్ గాడి బాబును విడిచిపెట్టమని వేడుకుంటున్నాడు. కానీ వాడు ఎంత బ్రతిమాలినా ఎవరూ పట్టించుకోలేదు. వాడిని కూడా సెక్యూరిటీ ఆఫీసర్లు కిందకు తీసుకుని వెళ్ళిపోయారు. అప్పుడు నేను ప్రిన్సిపాల్ వైపు చూసి, సార్ నేను ఇక వెళ్ళవచ్చా? అని అడగగా, ప్రిన్సిపాల్ అమిత్ గాడి బాబు వైపు చూశాడు. వాళ్లు నాకు వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు.

నేను అక్కడి నుంచి బయల్దేరి బయటకు వెళుతున్న ఖాన్ గారి వెనకకు చేరాను. ఖాన్ గారు లిఫ్ట్ ఎక్కగానే నేను కూడా అతని వెనకే లిఫ్ట్ లోకి దూరిపోయాను. నేను ఖాన్ గారితో మాట్లాడబోయేంతలో మూసుకుంటున్న లిఫ్ట్ డోర్స్ మధ్యలో ఒక అందమైన చెయ్యి అడ్డుపడి లిఫ్ట్ డోర్స్ మళ్లీ తెరుచుకున్నాయి. నేను వెంటనే ఎదురుగా చూడగా రితిక చిరునవ్వుతో అక్కడ నిల్చుని ఉంది. .... తన ముందే ఖాన్ గారితో మాట్లాడి ఉండి ఉంటే నాకు ఖాన్ గారు ముందే తెలుసు అని తనకి తెలిసిపోయి ఉండేది. నేను కొద్దిలో తప్పించుకున్నాను అని మనసులో అనుకున్నాను. కానీ ఆమె లిఫ్ట్ లోకి రాగానే నాకే పంచ్ పడింది. ఆమె లోపలికి రాగానే ఖాన్ గారిని హగ్ చేసుకోవడంతో నేను కళ్ళు పెద్దవి చేసుకొని అలా చూస్తూ ఉండిపోయాను. రితిక ఖాన్ గారిని హగ్ చేసుకోగానే ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. ఖాన్ బయ్యా అన్న ఆమె పిలుపు విని నాకు షాక్ తగిలినట్టు అయ్యి ఇదంతా ఏం జరుగుతుంది అని అనుకున్నాను. .... ఓసి పిచ్చిపిల్ల ఇంత కాలం తర్వాత కలుసుకున్నాము. నువ్వు ఏడుస్తూ నన్ను కలిస్తే ఎలా చెప్పు. ముందు ఆ ఏడుపు ఆపు అంటూ ఖాన్ గారు రితిక కన్నీళ్లు తుడిచారు. ....

మిమ్మల్ని కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఖాన్ బయ్యా. ఇవి బాధతో వస్తున్న కన్నీళ్లు కావు, మిమ్మల్ని కలిసినందుకు వస్తున్న ఆనందభాష్పాలు. నాకు అక్సా గుర్తుకు వచ్చి నప్పుడు మాత్రం బాధతో కన్నీళ్లు వస్తాయి అని అంది రితిక. .... అక్సా? ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే, ఆ,,,, గుర్తుకు వచ్చింది. అమిత్ మరియు వాడి ఫ్రెండ్స్ కలిసి చేసిన దురాగతానికి ఆత్మహత్య చేసుకున్న అమ్మాయి పేరు అక్సా, నేను ఆరోజు కరణ్ గాడి ఇంట్లో ఆ అమ్మాయి వీడియో చూపించేటప్పుడు రితిక చెప్పింది. ఆ అమ్మాయి పేరు అక్సా అని ఆమె తన స్నేహితురాలు అని కూడా చెప్పింది. అంటే ఖాన్ గారి చెల్లెలే ఈ అక్సా అయి ఉంటుంది. అందుకే రితిక ఖాన్ గారిని భయ్యా అని పిలుస్తుంది అని అనుకున్నాను. .... నాకు కూడా అక్సా చాలా గుర్తుకు వస్తుంది. కానీ ఆ సమయంలో నాకు నిరాశ గాని బాధ గాని కలగదు, పైగా నా కోపం రెట్టింపవుతుంది. ఎవరి వలన అయితే అక్సా ఆత్మహత్య చేసుకుందో వాళ్లందరినీ ఉరికంబం ఎక్కించే వరకూ నా కోపం చల్లారదు అని అన్నారు ఖాన్ గారు.

మీరు సరిగ్గా చెప్పారు ఖాన్ బయ్యా. అక్సా ఆత్మహత్యకు కారకులైనవారు ఎంతటి వారైనా సరే శిక్ష పడి తీరాల్సిందే. ఆ వెధవలకి ఉరిశిక్షే సరైన శిక్ష అంటూ కోపంగా అంది రితిక. .... సారీ ఖాన్ భయ్యా లోపల నాన్నగారు ఉండడంతో భయపడి మిమ్మల్ని కలవలేక పోయాను. అందుకే పరిగెత్తుకుంటూ మీ వెనకే లిఫ్ట్ లోకి వచ్చాను అని అంది రితిక. .... ఇందులో సారీ చెప్పడానికి ఏముంది. నేను అర్థం చేసుకోగలను అని అన్నారు ఖాన్ గారు. .... హలో సన్నీ. .... హాయ్ రితిక. .... మీ ఇద్దరూ ఒకరికి ఒకరు ముందే తెలుసా? .... అవును ఖాన్ బాయ్, ఆమె నా స్నేహితుడికి గర్ల్ ఫ్రెండ్ అంటూ నేను తొందరపడి చెప్పేసరికి, ఖాన్ గారు ఒకసారి రితిక వైపు చూసారు. వెంటనే రితిక కొంచెం భయపడి సిగ్గుపడుతుంది. .... అరే ఇందులో సిగ్గు పడడానికి ఏముంది, పిచ్చిపిల్ల. నువ్వు ఇప్పుడు పెద్దదానివి అయిపోయావు అన్న విషయం నాకు తెలుసు.

ఇంతలో లిఫ్ట్ డోర్ తెరుచుకుని మేము బయటకు వచ్చాము. ఖాన్ గారు ముందు నడుస్తూ ఉంటే నేను అతని వెనుక నడుస్తున్నాను. అప్పుడు వెనుకనుంచి రితిక నా చెయ్యి పట్టుకొని లాగుతూ, అలా ఎందుకు చెప్పావు. డైరెక్ట్ గా నేను నీ ఫ్రెండ్ అని చెప్పొచ్చు కదా. ఇప్పుడు చూడు ఖాన్ బయ్యా నన్ను ఎలా చూస్తున్నారో? అతనికి కోపం వచ్చి ఉంటుంది అని అంది రితిక. .... అయితే ఏమైంది. ఆయన నిన్ను ఏమీ అనలేదు కదా. ఆయన అడిగిన వెంటనే ఏం చెప్పాలో తోచక నోటికి వచ్చింది చెప్పేసాను. అయినా నేనేమీ తప్పుగా చెప్పలేదు కదా. అప్పటికి ఇంకా ఆమె నా చేతిని పట్టుకొని ఉండడంతో, నా చెయ్యి వదులు నేను ఖాన్ గారితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడవలసి ఉంది అని అన్నాను. .... ఏం మాట్లాడాలో నాతో చెప్పు నేను ఆయనకి చెబుతాను అని అంది. ....

ఏదో విషయంలే, నువ్వు ఇక్కడే ఉండు నేను మళ్ళీ వస్తాను అంటూ నా చేతిని విడిపించుకొని ఖాన్ గారి దగ్గరకు వెళ్లాను. ఆయన అప్పటికే జీప్ లో కూర్చొని ఉన్నారు. .... ఖాన్ భాయ్. .... చెప్పు సన్నీ. .... నేను పక్కనే బస్సులో ఉన్న మా కాలేజీ స్టూడెంట్స్ ను చూపిస్తూ , వీళ్లను ఏం చేస్తారు ఖాన్ భాయ్ అని అడిగాను. .... నేను ఏం చేస్తాను అని నువ్వు అనుకుంటున్నావు సన్నీ. .... మీరు వాళ్లను కొడతారా? .... లేదు సన్నీ, తప్పు చెయ్యని వాళ్లను నేను కొట్టను. కాకపోతే పై నుండి ఆర్డర్స్ వచ్చాయి కాబట్టి వాళ్లను రెండు మూడు రోజులు లోపల వెయ్యక తప్పదు. .... బాయ్ తప్పు చేయని వాళ్లను కొట్టను అని అంటున్నారు. అలాగే తప్పు చెయ్యని వాళ్లను లోపల వెయ్యడం కూడా అన్యాయం కదా. ....

నువ్వు చెప్పేది నిజమే సన్నీ. నువ్వు ఏం చెబుతున్నావో నాకు అర్థం అయింది. నువ్వేమీ కంగారు పడకు వాళ్లను ఒక రెండు గంటలు తర్వాత వదిలేస్తాను అని అన్నారు. ఆ మాట విని బస్సులో ఉన్న కుర్రాళ్లంతా నాకూ థాంక్స్ చెబుతున్నారు. క్యాంటిన్ కుర్రాడు అయితే ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. .... నేను స్టూడెంట్స్ ను ఉద్దేశించి మాట్లాడుతూ మీరంతా ఏమీ భయపడాల్సిన పనిలేదు. మిమ్మల్ని ఒక రెండు గంటలు తర్వాత వదిలేస్తానని ఖాన్ గారు చెప్పారు. పైనుంచి ఆర్డర్స్ ఉండడం వలన మిమ్మల్ని తీసుకుని వెళ్ళవలసి వస్తుంది. లేదంటే మిమ్మల్ని ఇప్పుడే ఇక్కడే వదిలేసేవారు అని అన్నాను. .... నేను వదిలేస్తాను కానీ రెండు మూడు రోజుల వరకు వీళ్ళు ఎవరూ కాలేజీకి రాకూడదు. ఏసీపీ గారు ఈరోజు మాత్రమే సెక్యూరిటీ అధికారి స్టేషన్ కు వస్తారు. కానీ మీ ప్రిన్సిపాల్ మాత్రం రోజు కాలేజీకి వచ్చి మిమ్మల్ని చూస్తాడు. ఆయన కానీ నా మీద ఫిర్యాదు చేస్తే నేను ఇబ్బందుల్లో పడతాను అని అన్నారు ఖాన్ గారు. ....

విన్నారు కదా మీరంతా, సెక్యూరిటీ అధికారి స్టేషన్ నుంచి తిన్నగా మీరు మీ ఇళ్లకు వెళ్ళిపొండి. రెండు మూడు రోజుల వరకు కాలేజీకి రావొద్దు. .... సరే సన్నీ బాయ్, నీకు చాలా చాలా థాంక్స్ అని అన్నారు వాళ్లంతా. .... తర్వాత ఖాన్ గారు జీపులో వెళ్ళిపోయారు. ఆ వెనుకే సెక్యూరిటీ అధికారి వ్యాన్ కూడా వెళ్ళిపోయింది. నేను నా బైక్ వైపు వెళుతూ ఉండగా మళ్లీ రితిక వెనుకనుండి నా చెయ్యి పట్టుకొని ఆపింది. .... ఓయ్ ఎక్కడికి వెళ్లి పోతున్నావు. నువ్వు ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇప్పుడు నువ్వు పారిపోతున్నావా? అని అడిగింది రితిక. .... ఓ సారీ, నేను మర్చిపోయాను. చెప్పు నాతో ఏం పని. .... ఏమీ లేదు నాకు కాఫీ తాగాలని ఉంది. కానీ నా దగ్గర డబ్బులు లేవు. .... నాతో పరాచికాలు ఎందుకు నీకు, అంత గొప్ప ఇంటి పిల్లవి నువ్వు కావాలంటే కాఫీ షాప్ నే కొనగలవు. కానీ నాతో డబ్బులు లేవని చెబుతున్నావు. .... నా పర్సు కారులో ఉండిపోయింది. కారు తాళాలు నాన్న దగ్గర ఉన్నాయి. నేను నాన్నతో కలిసి అన్నయ్యను చూడడానికి వచ్చాను అంటూ కొంచెం వయ్యారాలు పోతూ, ఇప్పుడు నువ్వు నాకు కాఫీ ఇప్పిస్తావా? లేదా నన్ను వెళ్లిపోమ్మంటావా? అని అంది రితిక.

ఆమె వెళ్ళిపోతూ ఉంటే నేను వెనుకనుంచి పిలిచాను. కానీ తను ఆగకపోవడంతో నేను ఆమె వెనకే వెళ్లాను. ఆమె నేరుగా కాఫీ షాప్ లోకి వెళ్లి కాఫీ ఆర్డర్ ఇచ్చింది. నేను ఆమె వెనక్కి వెళ్లి కౌంటర్ లో డబ్బు పే చేసి ఆమె వెనకే లోపలికి వెళ్ళాను. ఆమె లోపలికి వెళ్లి ఒక విండో పక్కన ఉన్న టేబుల్ దగ్గర కూర్చుంది. నేను కూడా వెళ్లి ఆమె దగ్గర కూర్చున్నాను. .... నీ ఫ్రెండ్ ఎక్కడ? ఈమధ్య కనబడడం లేదు. మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉంది అని అడిగింది. .... వాడు వాడి ఫ్రెండ్స్ తో కలిసి ఎక్కడికో బయటకు వెళ్ళాడు. .... ఫ్రెండ్స్ తో నా? నాకు తెలిసినంతవరకు నువ్వు తప్ప వాడికి ఫ్రెండ్స్ ఎవరూ లేరు. .... నాకు కూడా తెలియదు ఎవరితో వెళ్ళాడో, నాకు వాళ్ళ అమ్మ చెప్పింది. ....

సరే కానీ నీకు ఖాన్ భాయ్ ఎలా తెలుసు? అంటూ రితిక మాటిమాటికి కిటికీలో నుంచి బయటకి చూస్తుంది. .... ఖాన్ గారు సూరజ్ అన్న ఫ్రెండ్స్. నేను వాళ్ళ ఆఫీసు లోనే ఖాన్ గారిని కలిసాను. .... ఈ సూరజ్ అన్న ఎవరు? .... సూరజ్ కవిత వాళ్ళ అన్నయ్య. అతని ఆఫీసులోనే నేను ఖాన్ గారిని కలవడం జరిగింది. .... కవిత ఎవరు? ఓహో నీ గర్ల్ ఫ్రెండ్ కవితనా. .... గర్ల్ ఫ్రెండ్? నీకు ఎవరు చెప్పారు తను నా గర్ల్ ఫ్రెండ్ అని. నాకు తను కేవలం ఫ్రెండ్ మాత్రమే. నాకే కాదు నా చెల్లి సోనియాకు తను ఫ్రెండ్. మేము ముగ్గురం కలిసి ఒకే క్లాస్ లో చదువుతున్నాము. .... అయితే తను నీ గర్ల్ ఫ్రెండ్ కాదా? .... లేదు, తను నాకు ఒక మంచి ఫ్రెండ్ మాత్రమే. అయినా నీకు ఇన్ఫర్మేషన్ కోసం చెబుతున్నాను. నాకు ఎవరూ గర్ల్ ఫ్రెండ్స్ లేరు. నాకు గర్ల్ఫ్రెండ్స్ అవసరం కూడా లేదు. ....

నాకు తెలుసు నువ్వు అటువంటి అబ్బాయివి కాదని. నీ మంచితనాన్ని నేను ఇంతకుముందే చూసాను కదా. ఆరోజు కరణ్ ఇంట్లో నువ్వు కావాలనుకుంటే నన్ను ఏదైనా చేసే,,,,, అంటూ రితిక మాట్లాడుతూ ఉండగానే నేను ఆమె నోటికి అడ్డంగా చెయ్యి పెట్టి ఆమె మాట్లాడకుండా ఆపేశాను. .... జరిగిన తప్పులను మళ్లీమళ్లీ తలుచుకుంటే మనసుకు బాధ కలుగుతుంది. నువ్వు అంతలా గుర్తుకు తెచ్చుకోవాలి అనుకుంటే కరణ్ తో కలసి పంచుకున్న మంచి విషయాలను గుర్తుకు తెచ్చుకుంటే మనసుకు సంతోషంగా ఉంటుంది. చెడు జ్ఞాపకాలు మరియు చెడు విషయాలు పాతబడిపోయిన వాటిని మళ్లీ గుర్తుకు తెచ్చుకుంటే మానిపోయిన గాయాలను మళ్లీ రేపుకున్నట్టు అవుతుంది. అంతేకాకుండా అవి మనల్ని ఇంకా దహించి వేస్తాయి.

నా మాట విని రితిక మౌనంగా ఉండిపోయింది. కరణ్ నీ గురించి నిజమే చెప్పాడు. నువ్వు చాలా మంచి వాడివి. ఎప్పుడూ తను నీ గురించే మాట్లాడుతూ ఉంటాడు. .... కేవలం మంచి మాత్రమే చెప్పాడా? నా గురించి చెడ్డగా ఏమీ మాట్లాడలేదా? .... చెడ్డమాటలు ఉంటే కదా చెప్పుకోవడానికి. నాకు తెలిసినంతవరకు నీ దగ్గర చెడు విషయాలు కూడా ఉంటాయి అని నేను అనుకోవడం లేదు. ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా నీ గురించి మంచి మాటలే వినబడుతున్నాయి. ఈరోజు కళ్లారా చూడడం కూడా జరిగింది. .... చూడడం జరిగిందా? నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కాలేదు. .... అదే నువ్వు ఖాన్ బాయ్ తో తప్పు చేయని ఆ కుర్రాళ్లను వదిలేయమని చెప్పావు కదా. నేను అంతా విన్నాను. చూసాను కూడా. నువ్వు చాలా మంచి వాడివి సన్నీ. ....

అంత తొందరగా ఒక మనిషి గురించి ఒక నిర్ధారణకు రాకూడదు రితిక. నేను చేసే కొన్ని పనులు కరక్టే కావచ్చు. కానీ కుట్రలు కుతంత్రాలు చేసే ఎదవలు నివసిస్తున్న ఇదే సమాజంలో నేను కూడా ఉన్నాను కదా. అలాంటప్పుడు నేను మంచి వాడిని అని ఎలా అనుకుంటున్నావు. నాలో కొన్ని మంచి లక్షణాలు ఉన్న మాట వాస్తవమే. కానీ నువ్వు వాటిని మాత్రమే చూసి నేను మంచి వాడిని అని అనుకోవద్దు. .... నీలో చెడ్డ లక్షణాలు కూడా ఉంటాయని నేను అనుకోవట్లేదు సన్నీ. ఎందుకంటే ఎప్పుడు చూసినా నాకు నీలో మంచి విషయాలు మాత్రమే కనబడుతున్నాయి. .... ఆ తర్వాత మేము ఇద్దరమూ అవి ఇవి మాట్లాడుకుంటూ కాఫీ తాగడం పూర్తిచేసి, కాఫీ షాప్ లో నుంచి బయటకు వచ్చాము. నేను నా బైక్ వైపు వెళుతూ ఉంటే రితిక కూడా నాతో పాటే ఉంది. రితిక ఒక్కసారిగా ఓహ్ షిట్ అని అంది. .... ఏమైంది రితికా? .... నేను నీతో మాటల్లో పడి కారు ఎప్పుడు వెళ్ళిపోయిందో చూడలేదు. ఇప్పుడు నేను ఇంటికి ఎలా వెళ్లాలి. నా మొబైల్ మరియు పర్సు రెండు కార్లోనే ఉండిపోయాయి. .... ఏం పర్వాలేదు నేను నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. .... థాంక్స్ సన్నీ.

ఇందులో థాంక్స్ చెప్పడానికి ఏముంది రితిక. ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితుల్లో నేను ఉంటే నువ్వు నన్ను నీ కార్లో ఇంటి దగ్గర డ్రాప్ చేయవా ఏంటి? .... మేము బైక్ దగ్గరకు వెళ్లి నేను బైక్ స్టార్ట్ చేశాను. ఆమె ఫుల్ లెంగ్త్ సల్వార్ సూట్ వేసుకోవడం వల్ల రెండు కాళ్ళు ఒక వైపు పెట్టి సైడ్ కు కూర్చుంది. తను చాలా సింపుల్ గా ఉండే అమ్మాయి. తను వేసుకునే డ్రెస్సులు కూడా సాధారణంగానే ఉంటాయి. అప్పుడప్పుడు మాత్రమే జీన్స్ మరియు టాప్ వేస్తుంది. గొప్ప ఇంటి అమ్మాయి అన్న అహంభావం ఆమెలో ఏమాత్రం కనిపించదు. ఈ రోజుల్లో అమ్మాయిలు 50000 యాక్టివా మరియు 10000 సెల్ ఫోన్ చేతిలో పెట్టుకొని తామేదో మహారాణుల్లా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఆమె బండి మీద కూర్చోగానే నేను ఆమె ఇంటి వైపు పోనిచ్చాను. మేము దారిలో వెళుతూ ఏమీ మాట్లాడుకోలేదు. కాకపోతే ఆమె దారి చెబుతూ ఉంటే నేను బండి నడుపుతున్నాను.

ఆమె ఇల్లు ఒక పాష్ ఏరియాలో ఉంది. అక్కడంతా గొప్ప గొప్ప వారు ఉంటూ ఉంటారు. అక్కడ ఇళ్ళన్నీ చాలా పెద్దవిగా ఉన్నాయి. అక్కడ ఉన్న ఇళ్ళు చూస్తూ ఉంటే నాకు చాలా సరదాగా ఉంది. ఇంతలో ఆమె ఇల్లు వచ్చింది. ఆమె ఇంటిని చూడగానే నాకు షాక్ తగిలినట్టు అయింది. ఇంతవరకు నేను మా ఇల్లే పెద్దది అనుకునేవాడిని. కానీ ఆమె ఇంటి ముందు మా ఇల్లు అగ్గిపెట్టెలా అనిపించింది. నేను బండిని వాళ్ల ఇంటి గేటు ముందు ఆపగానే లోపలనుంచి గన్ మెన్ లు బయటకు వచ్చారు. .... లోపలికి వెళ్ళండి, ఇతను నా ఫ్రెండే అని రితిక చెప్పడంతో వాళ్లు లోపలికి వెళ్లిపోయారు. కానీ గేటు తెరిచి ఉంచి లోపల్నుంచి మా వైపే చూస్తూ ఉన్నారు. .... ఓకే రితిక ఇక నేను వెళ్తాను అని అన్నాను. .... అలా ఎలా వెళ్తావు, నువ్వు మొట్టమొదటిసారి మా ఇంటికి వచ్చావు. మొదటిసారి ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు బయటనుంచే తిరిగి వెళ్ళిపోతే అపశకునం, మంచిది కాదు అని అంటారు. .... నేను ఏదో మాట్లాడబోయే అంతలో లోపలనుంచి రితిక వాళ్ల నాన్న బయటకు వస్తూ, అవును బాబు అది చెప్పేది నిజమే. మొదటి సారి ఇంటికి వచ్చినప్పుడు ఇలా బయట నుంచి వెళ్లిపోవడం మంచిది కాదు. లోపలికి రా అని పిలిచారు.

అతను అలా పిలవడంతో నేను లోపలకు వెళ్లడానికి సిద్ధమయ్యాను. రితిక వాళ్ళ నాన్న సిగ్నల్ ఇవ్వగానే ఒక వ్యక్తి లోపల్నుంచి వచ్చి నా బండి తీసుకొని లోపల పెట్టాడు. నేను వాళ్లిద్దరితో కలసి లోపలికి వెళ్ళాను. వాళ్ళు నన్ను ఇంట్లోకి తీసుకొని వెళ్లకుండా బయట గార్డెన్ లో పెద్ద గొడుగు కింద కూర్చున్నాము. ..... చెప్పు బాబు ఏం తీసుకుంటావు టీ, లేదా కాఫీ . .... అబ్బే ఇప్పుడు ఏమీ వద్దు సార్. ఇప్పుడే నేను కాఫీ తాగి వచ్చాను అని అనడంతో రితిక నావైపు చూసి సిగ్నల్ ఇవ్వడంతో అతనితో ఏమీ చెప్పకూడదు అని నాకు అర్థం అయింది. .... సరే అయితే జ్యూస్ తాగుదాం, ఏమ్మా రితిక .... అవును డాడీ నేను ఇప్పుడే జ్యూస్ తీసుకుని వస్తాను. ....

నువ్వెందుకు అమ్మ వెళ్లడం ఎవరికైనా చెప్పు. మీ ఫ్రెండ్ వచ్చాడు కదా నువ్వు ఇక్కడే కూర్చుని అతనితో మాట్లాడు. అయినా నువ్వు హాస్పిటల్లో ఎక్కడా కనిపించలేదు ఎక్కడికి వెళ్ళిపోయావు. నీ మొబైల్ మరియు పర్సు కూడా కార్ లోనే ఉండి పోయాయి. నేను చాలా కంగారు పడ్డాను. .... ఏమీ లేదు డాడీ, హాస్పిటల్లో నా ఫ్రెండు ఒక ఆమె కనిపించింది. ఆమెతో మాట్లాడుతూ ఉండిపోయాను. బయటకు వచ్చి చూసేసరికి మీరు వెళ్లిపోయారు. అప్పుడు సన్నీ కనపడితే, నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు. .... నీకు సన్నీ ఎలా తెలుసు? అని వాళ్ళ నాన్న అడగడంతో రితిక నేను మౌనంగా ఉండిపోయాము. తర్వాత రితిక మాట్లాడుతూ, తను నా ఫ్రెండ్ శోభ వాళ్ళ బ్రదర్ డాడీ అని అంది. ....

సరేనమ్మా, అవును బాబు నువ్వు హాస్పటల్లో మాట్లాడుతున్నప్పుడు నీకు సురేష్ తో ఎటువంటి గొడవ లేదని చెప్పావు. కానీ తర్వాత అమిత్ మరియు సురేష్ ఆ వెధవ సుమిత్ గాడిని కొడుతుంటే నువ్వు వీళ్ళతో ఎందుకు గొడవ పడ్డావు. .... సార్ నేనేమి వాళ్లతో గొడవ పడలేదు. నేను అమిత్ మరియు సురేష్ లను ఆపే ప్రయత్నం మాత్రమే చేశాను. ఎందుకంటే వాళ్లు కొడుతున్న వాడికి ఆల్ రెడీ చెయ్యి విరిగిపోయి చాలా వీక్ గా ఉన్నాడు. .... అవును నాకు కూడా తెలుసు వాడి చెయ్యి మా వాళ్లే విరగ్గొట్టారు అని కొంచెం గర్వంగా చెప్పాడు సురేష్ వాళ్ళ బాబు. .... అవును సార్ ఆ విషయం నాకు కూడా తెలుసు. అందుకే వాళ్లు వాడి రెండో చెయ్యిని కూడా విరగ్గొట్టేస్తారేమోనని నేను వాళ్లను ఆపడానికి ప్రయత్నం చేశాను. .... విరగ్గొడితే మాత్రం ఏమవుతుంది. నువ్వెందుకు వాళ్ళ మధ్యలో ఇన్వాల్వ్ అయ్యావు. ఆ సుమిత్ గాడు నీకేమైనా బంధువా?......

నాకు వాడికి ఏ బంధుత్వము లేదు. కాకపోతే వాడు కూడా మా కాలేజీ వాడే కదా. వాడి ప్లేసులో మరెవరు ఉన్నా, అమిత్ మరియు సురేష్ ప్లేస్ లో ఇంకొకరు ఉన్నా నేను అదే పని చేసేవాడిని. అయినా నేనేమి ముందుగా ఫైట్ చేయడం స్టార్ట్ చేయలేదు. నేను ఆపడానికి మాత్రమే ప్రయత్నం చేశాను. కానీ మీ వాళ్లు నన్ను కొట్టడం మొదలు పెట్టారు. నేను ఎప్పుడూ నా వైపు నుంచి ఫైట్ స్టార్ట్ చెయ్యను. కానీ నా వరకు వస్తే వెనక్కి ఏమాత్రం తగ్గను. నేను కూడా కుర్రాడినే కదా సార్. నాలోన ఉడుకు రక్తం ఉంటుంది అంటూ నేను కొంచెం పొగరుగా చెబుతూ ఉంటే సురేష్ వాళ్ళ బాబు నా వైపు తీక్షణంగా చూస్తున్నాడు. నేను రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎవరైనా పోకిరి వెదవలు రాళ్లతో కుక్కని కొట్టిన సరే నాకు వెంటనే అదే రాయితో వాడి తల పగలగొట్టాలని అనిపిస్తుంది. పేదవాళ్లు, అమాయకులు మరియు నిస్సహాయులు వీళ్ళపై ఎవరైనా తమ జులుం ప్రదర్శిస్తే నేను చూస్తూ ఊరుకోలేను. ....

సరే ఇదిగో జ్యూస్ తాగి నీ ఉడుకు రక్తాన్ని కొంచెం చల్లార్చుకో అంటూ నా వైపు జ్యూస్ ఉన్న గ్లాస్ అందించాడు. నాకు అప్పటికే కోపం బాగా పెరిగిపోయి ఉండడంతో నేను ఆ గ్లాసందుకుని ఒకేసారి మొత్తం జ్యూస్ తాగేశాను. మరోవైపు సురేష్ వాళ్ళ బాబు కూడా ఒకేసారి జ్యూస్ మొత్తం తాగేసి, వయసులో ఉన్నప్పుడు ఉత్సాహం మరియు ఉడుకు రక్తం అవసరమే బాబు. కాకపోతే ఒక్క విషయం గుర్తు పెట్టుకో, అగ్గితో ఆటలు ఆడేటప్పుడు కొంచెం దూరంగా ఉండడం అవసరం. కాదని దాని దగ్గరకు వెళితే మాడి మసైపోతావ్ అని చెప్పి సురేష్ వాళ్ళ బాబు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నేను కూడా అక్కడ నుంచి బయలుదేరి బయటకు వెళ్తున్న నన్ను రితిక ఆపే ప్రయత్నం చెయ్యలేదు. ఎందుకంటే నేను కూడా కోపంగా ఉన్నాను అని ఆమెకు అర్థమయింది. నేను కోపంగా ఉంటే ఏమవుతుందో ఆమె కరణ్ ఇంట్లో ఆల్రెడీ చూసింది. అందుకే నన్ను ఆపే ప్రయత్నం చేయకుండా బాయ్ సన్నీ అని చెప్పింది. నేను కూడా ఆమెకు బాయ్ చెప్పి అక్కడి నుంచి నా బండి మీద కరణ్ ఇంటికి బయలుదేరాను.
Next page: Episode 066
Previous page: Episode 064