Episode 098


అప్పుడు చిన్నికృష్ణ కోపంగా మాట్లాడుతూ, వద్దు సుమతి వాడితో ఏమి చెప్పాల్సిన అవసరం లేదు. వాడిని రూమ్ లో నుంచి బయటికి పంపించెయ్. ఏ గాయాన్నైతే నువ్వు మర్చిపోయావో ఆ గాయాన్ని మళ్లీ మన జీవితాల్లోకి తిరిగి రానివ్వకు. నువ్వు ఏమీ చెప్పొద్దు సుమతి అని అన్నాడు. .... అప్పుడు సుమతి మాట్లాడుతూ, లేదు చిన్నికృష్ణ ఈరోజు కాదనకు. ఈ రోజు నువ్వు ఏమీ మాట్లాడకు. ఈరోజు నేను నా పిల్లలని మనస్ఫూర్తిగా కౌగలించుకుని కలుస్తాను. నాకు నా పిల్లలకి మధ్య నీకు మాట్లాడే హక్కు లేదు. అందరితోనూ అన్ని విషయాలు దాచి దాచి నేనింక అలిసిపోయాను. ముందు నీ నుంచి దాచాను. తర్వాత నా పిల్లల నుంచి దాచాను. ఇక నావల్ల కాదు అంటూ సుమతి నా చేయి పట్టుకొని మంచం మీద కూర్చోబెట్టింది. చిన్నికృష్ణ కోపంతో దూరంగానే నుంచున్నాడు. తర్వాత సుమతి చెప్పడం మొదలు పెట్టింది.

బాబు,, నేను చిన్నికృష్ణ సిటీలో పెళ్లి చేసుకున్నప్పుడు అంతా హడావుడిగా జరిగిపోవడంతో మేము చిన్నికృష్ణ తల్లిదండ్రులను పెళ్లికి పిలువలేదు. కానీ పెళ్లి జరిగిన 4-5 రోజుల తర్వాత మేము చిన్నికృష్ణ తల్లిదండ్రులను కలవడానికి గ్రామానికి వచ్చాము. కానీ అప్పుడే చిన్నికృష్ణ ఆఫీస్ నుంచి తనకు అర్జెంట్ కాల్ రావడంతో నన్ను వాళ్ళింట్లో వదిలి చిన్నికృష్ణ తిరిగి సిటీకి వెళ్లి పోయాడు. చిన్నికృష్ణ పని పూర్తి చేసుకొని తిరిగి ఎలాగూ వస్తాడని నేను మాత్రం గ్రామంలోని వాళ్ళింట్లో ఉండిపోయాను.

నేను చిన్నికృష్ణ తల్లిదండ్రులను కలిసినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. వాళ్లు కూడా నన్ను కలిసినందుకు చాలా సంతోషంగా ఉన్నారు. కానీ చిన్నికృష్ణ తండ్రి నన్ను తప్పుడు చూపులు చూసేవాడు. ఆ విషయం మా అత్తగారికి కూడా తెలుసు. కానీ పాపం ఆమె ఏమీ చేయలేక పోయేది. చిన్నికృష్ణ తండ్రి ఏదో ఒక వంకతో నాకు దగ్గరవ్వాలని ప్రయత్నించేవాడు. నేను ఎంత దూరంగా ఉన్నా నాకు దగ్గర అవ్వడానికి ఏదో ఒక సాకు వెతుక్కునే వాడు. అలా ఒకరోజు మందు మత్తులో నన్ను,,,,,,, అంటూ సుమతి ఏడవడం మొదలుపెట్టింది.

మా అత్తగారు కూడా ఏమీ చేయలేక పోయింది. నేను ఏడుస్తూ ఉంటే ఆమె నన్ను సముదాయిస్తూ ఈ విషయాన్ని చిన్నికృష్ణకు చెప్పొద్దని చెప్పింది. నేను కూడా చిన్నికృష్ణకి ఏమీ చెప్పకూడదు అని అనుకున్నాను. చిన్నికృష్ణ తిరిగివచ్చిన రెండు రోజుల తర్వాత మేము సిటీకి వెళ్ళిపోయాము. ఎందుకంటే నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను అని చిన్నికృష్ణకు చెప్పాను. అందుకు చిన్నికృష్ణ నన్ను తిరిగి సిటీకి తీసుకుని వెళ్ళిపోయాడు. సిటీకి వెళ్లిపోయిన తర్వాత కూడా చిన్ని కృష్ణతో నేను ఏమి చెప్పలేదు. అలా కాలం గడిచిన తర్వాత నాకు ఇద్దరు పిల్లలు కలిగారు. వారే నువ్వు, సోనియా. నాకు పిల్లలు చిన్నికృష్ణ ద్వారానే కలిగారు అని నేను అనుకున్నాను.

కానీ నా ఆలోచన పొరపాటు. తర్వాత కొన్ని సంవత్సరాలకు నేను మళ్ళీ గర్భవతిని అయ్యాను. అప్పుడు నేను ఇక ఆగలేక మొత్తం విషయాన్ని చిన్నికృష్ణకు చెప్పేసాను. అప్పుడు చిన్నికృష్ణ ఎలాగో ఒకలాగా D.N.A. టెస్ట్ చేయించడం ద్వారా మీరు నాకు చిన్ని కృష్ణకు కలిగిన సంతానం కాదని చిన్ని కృష్ణ తండ్రి వలన కలిగిన సంతానమని తెలిసింది. చిన్నికృష్ణకు కోపం వచ్చి మీ ఇద్దరిని గ్రామంలో ఉన్న తన తండ్రి దగ్గర వదిలి వచ్చేసాడు. నేను మాత్రం అలా జరగాలని కోరుకోలేదు. మీరు ఎలా పుట్టినా మీరు నా పిల్లలు. మీరు నాకు దూరం అవ్వాలని నేను కోరుకోలేదు. కానీ నా భర్త వలన నేను మీకు దూరం కాక తప్పలేదు.

సుమతి మాటలు విన్న తర్వాత నేను చిన్నికృష్ణ వైపు చూడగా అతను మాట్లాడుతూ, లేకుంటే మరి,, ఏం చేయాలి? నాది కాని సంతానాన్ని నేను నా దగ్గర ఎలా పెట్టుకోవాలి? నాకు తెలియనంత వరకు అంతా సవ్యంగానే ఉండేది. కానీ నా భార్యను నా తండ్రి రేప్ చేశాడు అని తెలిసిన తర్వాత అందుకు పర్యవసానంగా మీరు పుట్టారు అని తెలిసిన తర్వాత నేను తట్టుకోలేక పోయాను. ఎప్పుడు నేను మీ ఇద్దరిని చూసినా నాకు మా నాన్న నా భార్యను రేప్ చేస్తున్న దృశ్యమే నా కళ్ళముందు కదలాడేది. నాకు పిచ్చి పట్టినట్టు ఉండేది.

కోపంతో నా మనసంతా కకావికలం అయిపోయేది. నన్ను క్షమించు సన్నీ బాబు. నాకు మీరంటే ఎటువంటి ద్వేషం లేదు. మన మధ్య ఎటువంటి శత్రుత్వం లేదు. కానీ మీ ఇద్దరిని మా దగ్గరే ఉంచుకుంటే నేను సుమతిని మిమ్మల్ని చూసిన ప్రతిసారి ఆ కాళరాత్రిని గుర్తుకు తెచ్చుకొని బాధతో కుమిలిపోవాల్సి వచ్చేది. నేను కూడా సుమతితో పాటు ఆ బాధలో భాగస్వామిని అవ్వాల్సి వచ్చేది. నన్ను క్షమించు బాబు. కానీ నేను మిమ్మల్ని మా దగ్గర ఉంచుకోలేకపోయాను ఇకపై ఉంచుకోలేను కూడా అని అన్నాడు.

అప్పుడు వెనుకనుంచి సరిత మరియు సోనియా లోపలికి వచ్చి, వీరిద్దరిని నీ దగ్గర ఉంచుకోమని ఎవరు చెప్పారు? వీళ్ళు నా పిల్లలు నా దగ్గరే ఉంటారు అంటూ సరిత ఏడ్చుకుంటూ నా దగ్గరకు వచ్చి నన్ను మంచం మీద నుంచి లేపి నన్ను కౌగిలించుకుని, చూడు చిన్నికృష్ణ మీ ఇద్దరికీ ఈ పిల్లలను మీ దగ్గర ఉంచుకోవడం ఎంత కష్టమైన విషయమో నాకు తెలుసు. కానీ జరిగిన దాంట్లో ఈ పిల్లల తప్పేముంది. తప్పంతా, తను చేసిన తప్పుకు ఇప్పటికీ కూడా ఎటువంటి పశ్చాత్తాపంలేని సిగ్గులేని ఆ దుర్మార్గపు మనిషిది. ఇప్పుడు మీరు కావాలని అనుకున్నా ఈ పిల్లల్ని ఇద్దరిని నేను మీ దగ్గర ఉండనివ్వలేను. ఎందుకంటే వీళ్ళిద్దరూ నా ప్రాణం. నేను ఎప్పుడూ ఈ పిల్లల్ని నా పిల్లలు కారు అని అనుకోలేదు. నాకు విశాల్ మరియు శోభ ఎంతో సన్నీ మరియు సోనియా కూడా అంతే. నేను ఎల్లప్పుడూ వీళ్ళని నా సొంత బిడ్డల్లాగే ప్రేమించాను. మీకు నమ్మకం లేకపోతే వీళ్ళనే అడగండి అంటూ అమ్మ నాకు సోనియాకు ముద్దులు పెడుతూ ఏడుస్తూ అంది.

అప్పుడు సోనియా మాట్లాడుతూ, అమ్మ ఎందుకలా మనల్ని తక్కువ చేసుకున్నట్టు మాట్లాడతావు. మేము నీ పిల్లలము కాదని నువ్వు ఎప్పుడు మాకు చెప్పలేదు. మేము నీ సంతానం కాదని వేరొకరి సంతానమని మాకు ఏ ఒక్క క్షణం కూడా అనిపించకుండా మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకున్నావు. మమ్మల్ని నువ్వు మా కన్నతల్లి కంటే కూడా ఎక్కువగా చూసుకున్నావు. నువ్వు నన్ను సన్నీని ప్రేమించినంతగా మా అసలు తల్లి కూడా మమ్మల్ని ప్రేమించి ఉండేది కాదేమో. మాకు నువ్వు అసలు తల్లివి కాదు అని తెలిసిపోయిందని అందుచేత ఒక తల్లికి ఇవ్వవలసిన గౌరవం మేము నీకు ఇవ్వమని అనుకోవద్దు. నిజం చెప్పాలంటే ఇప్పుడు మా ఇద్దరికీ నీమీద మరింత ప్రేమ గౌరవం పెరిగింది. మేము నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేము అమ్మ అంటూ సోనియా అమ్మను కౌగిలించుకుంది. అమ్మ కూడా సోనియా మాటలు విని ఏడుస్తోంది.

అప్పుడు సుమతి మంచం మీద నుంచి లేచి మా దగ్గరకు వచ్చి, నువ్వు ఎప్పుడూ నా పిల్లలను పరాయి వాళ్ళగా భావించలేదని నాకు తెలుసు సరిత అక్క. వాళ్లకు ఒక్క క్షణం కూడా నీ పిల్లలు కారు అనే ఊహ కూడా కలగనివ్వలేదు. వాళ్లను నీ కడుపున పుట్టిన బిడ్డల్లాగే ప్రేమగా చూసుకున్నావు. వాళ్లను పెంచిన తల్లిలాగా ఎప్పుడు వ్యవహరించలేదు. ఈ విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను కావాలని అనుకున్నా నువ్వు చేసిన ఉపకారానికి బదులుగా నేను ఎప్పటికీ మూల్యం చెల్లించలేను.

నేను నా జీవితాంతం నీకు ఊడిగం చేసినా నువ్వు చేసిన ఉపకారానికి నీ రుణం తీర్చుకోలేను. నువ్వు నా పిల్లలని నీ సొంత బిడ్డల్లాగా ప్రేమించావు అంటూ సుమతి మా ఇద్దరి తలలపై చెయ్యి వేసి ప్రేమగా నిమిరి తన భర్త చిన్నికృష్ణ దగ్గరకు వెళ్లి అతనిని కౌగిలించుకుంది. ఆమె చిన్నికృష్ణని కౌగిలించుకొని మా వైపే చూస్తూ ఉంది. అప్పుడు నేను మరియు సోనియా సుమతిని ఒకసారి కలవడానికి ముందుకు వెళ్ళగా ఆమె తన తలను చిన్నికృష్ణ భుజానికి ఆనించి వెక్కి వెక్కి ఏడవసాగింది. ఆమెను అలా ఏడవడం చూసి మేం ఇద్దరం కూడా ఏడుస్తున్నాము.

ఆమె తన భర్తను కాదని ఏమి చేయలేదు అని మాకు తెలుసు. కాని ఒక తల్లి తన పిల్లలను కలుసుకోలేనంత దౌర్భాగ్యం ఏముంది. మేము ఇంతకాలంగా మా కన్నతల్లికి దూరంగా ఉన్నాము. కానీ ఇప్పుడు మా తల్లి దగ్గరగా ఉన్నప్పటికీ మాకు దూరమై నిస్సహాయురాలిగా మిగిలిపోయింది. కానీ ఆ తల్లి తన భర్త చేతిలో బందీ అయిపోయింది. అందుకే మేము తిరిగి సరితను కౌగిలించుకుని ఏడ్చాము. సరిత చెప్పింది నిజమే. ఆమె ఎప్పుడూ కూడా నాకు గానీ సోనియాకు గాని తను అసలు తల్లి కాదని కనీసం మాకు ఊహించుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు.

ఆమె ఎప్పుడూ మేము తన మారటి పిల్లలం అని ఒక్కసారి కూడా మా ముందు ప్రస్తావన తీసుకురాలేదు. కానీ మా ఇద్దరి కళ్ళల్లో మా అసలు తల్లిని చూసామన్న సంతోషం ఆమెను కలవలేక పోతున్నందుకు కలుగుతున్న బాధను సరిత చాలా బాగా అర్థం చేసుకుంది. అందుకే నన్ను సోనియాను ఆ రూమ్ లో నుంచి బయటకు తీసుకు వెళ్ళింది. సుమతి మాత్రం ఇంకా తన భర్తను కౌగిలించుకుని ఏడుస్తూ మేము బయటకు వెళుతున్నప్పుడు కూడా మా వైపు చూడలేదు.

మేము చిన్నికృష్ణ రూమ్ లో నుంచి బయటకు వచ్చేసరికి అక్కడ ఒక రూం బయట గీత, శోభ మరియు అశోక్ నిల్చుని ఉన్నారు. మరో రూమ్ బయట కవిత నిల్చుని ఉంది. వాళ్లంతా మమ్మల్ని చూస్తున్నారు. కానీ మేము ఎవరితో మాట్లాడదలుచుకోలేదు. మేము ముగ్గురం నేరుగా నా రూం లోకి వెళ్ళిపోయాము. నా రూమ్ లోకి వచ్చిన తర్వాత అమ్మ మంచం మీద పడుకొని మా ఇద్దర్నీ చెరో వైపు పడుకోమని చెప్పడంతో అమ్మకు ఒకవైపు సోనియా మరోవైపు నేను అమ్మను కౌగిలించుకొని పడుకున్నాము. అమ్మ సోనియా ఏడుస్తూ ఉన్నారు. నాకు కూడా కంట్లోంచి నీళ్లు ఆగడం లేదు. ఒకవైపు మేము మా తల్లిని విడిచి వచ్చేసాము. మరోవైపు అమ్మని పట్టుకొని ఏడుస్తున్నాము.

ఏ తల్లి ప్రేమ తక్కువదో ఏ తల్లి ప్రేమ ఎక్కువదో అర్థం కావడం లేదు. ఎంత కాదనుకున్నా అమ్మ అమ్మే కదా. మేము సరిత కడుపున పుట్టిన బిడ్డలం కాకపోయినా, ఆమె చనుబాలు తాగకపోయినా, ఆమె మా మీద చూపించిన ప్రేమ వాత్సల్యం ఆమె మమ్మల్ని గారాబం చేసిన తీరు ఎంత మాత్రం తక్కువ కాదు. అసలైన అమ్మ ప్రేమ అంటే ఏమిటో ఇవాళ నాకు తెలుస్తుంది. ఆమె ఒడిలో పడుకుంటే మనసుకు ప్రశాంతంగా ఉంది. మేమిద్దరం అలా అమ్మ ఒడిలో పడుకోగా అమ్మ మా ఇద్దరి తలపై చెయ్యి వేసి నిమురుతూ మా ఇద్దరి నుదిటిపై ముద్దులు పెడుతూ మమ్మల్ని ఊరుకోమని చెబుతుంది కానీ ఆమె మాత్రం ఏడుస్తూనే ఉంది. అమ్మ ఒడిలో మేమిద్దరం అలా గాఢ నిద్రలోకి జారుకున్నాము.

పొద్దున నిద్రలేచి చూసేసరికి మంచం మీద నేను ఒక్కడినే ఉన్నాను. రూమ్ లో నుంచి బయటకు వచ్చి చూడగా బంగ్లా ముందున్న ఖాళీ ప్రాంగణంలోకి మా కార్లు అన్నీ వచ్చి ఆగి ఉన్నాయి. అందరూ కార్లలో మా సామాన్లు అంతా సర్దుతున్నారు. వెంటనే బాత్రూంలో దూరి తొందరగా తయారై నేను కూడా బయటకు వచ్చాను. అక్కడ నాన్న, అత్తయ్య మరియు సూరజ్ ల కార్లు ఉన్నాయి కానీ చిన్నికృష్ణ కారు మాత్రం లేదు. అప్పుడు సోనియా నా దగ్గరకు వచ్చి, వాళ్ళు పొద్దున్నే తొందరగానే ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు అన్నయ్య అని చెప్పి నన్ను కౌగిలించుకుంది.

అప్పుడు గీత అత్తయ్య మా దగ్గరకు వచ్చి, బుజ్జి నువ్వు తొందరగా టిఫిన్ చెయ్యు మనం మన ఇంటికి బయలుదేరాలి. అందరూ టిఫిన్ చేసారు నువ్వు ఒక్కడివే మిగిలిపోయావు అని అంది. .... అత్తయ్య నాకు ఆకలిగా లేదు. నేను తయారయ్యే ఉన్నాను పదండి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నాకు ఇక్కడ ఉండాలని లేదు అని అన్నాను. .... కానీ బుజ్జి నువ్వు ఏమీ తినకుండా ఎలా? మనం చాలా దూరం వెళ్ళాలి కదా. కొద్దిగా అయినా తిను బుజ్జి. .... అత్తయ్య ప్లీజ్ నన్ను తినమని చెప్పద్దు. నాకు తినాలని లేదు అని అనగానే అత్తయ్య నా కళ్ళల్లోకి చూసి నా పరిస్థితిని అర్థం చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది.

తరువాత మేమంతా ఒకసారి రేఖ, మనోహర్ లను కలిసి అక్కడి నుంచి బయలుదేరాము. అమ్మతో కలిసి నాన్న తన కారులో, శోభతో కలిసి అత్తయ్య తన కారులో, సోనియా మరియు కవితలతో కలిసి నేను సూరజ్ కార్లో బయల్దేరాము. మేము ఎవరము ఏమీ మాట్లాడుకోవడం లేదు. అందరూ చమ్మగిల్లిన కళ్ళతో ఆ మట్టి రోడ్ల వంక చూస్తున్నాము. తర్వాత మేము రేఖ పాత ఇంటి దగ్గర ఆగాము. నాన్న తన కారును ఆ ఇంటికి కొంచెం ముందుకు తీసుకువెళ్లి ఆపారు. ఎందుకంటే నాన్నకు మామయ్యను కలవడం ఇష్టం లేదు. అమ్మ మాత్రం కారు దిగి ఇంటి దగ్గరకు వచ్చింది. నేను కూడా కారు దిగి అమ్మ దగ్గరకు వెళ్లాను. కానీ సోనియా మరియు కవిత మాత్రం కార్లోనే కూర్చున్నారు. నేను అమ్మ కలిసి ఇంటి డోర్ వద్దకు వెళ్ళాము. మా వెనుక అత్తయ్య మరియు శోభక్క కూడా వచ్చారు. మేము తలుపు కొట్టగానే సురేంద్ర మావయ్య వచ్చి తలుపు తీయగా మేమంతా లోపలికి వెళ్ళాము.

మమ్మల్ని చూసి మామయ్య ఏడుస్తూ అమ్మను కౌగిలించుకొని, నన్ను క్షమించు సరిత. నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయింది అని అన్నాడు. .... అరే! నువ్వు ఎందుకు అలా ఏడుస్తున్నావ్. నేను నిన్ను ఎప్పుడో క్షమించేశాను. మేమందరం కూడా క్షమించేసాము అంటూ అమ్మ శోభ మరియు గీత వైపు చూపిస్తూ, చాల్లే ఇక ఏడవడం ఆపి పద మన ఇంటికి వెళదాం నీ సామాను కూడా కార్లో సర్దేసాము అంటూ అమ్మ చుట్టూ చూసి విశాల్ అన్నయ్య కనబడకపోవడంతో, విశాల్ ఎక్కడ ఉన్నాడు సురేంద్ర అని అడిగింది. ....

అమ్మ అలా అడగగానే మామయ్య తలదించుకుని, వాడు విదేశాలకు వెళ్లిపోయాడు సరిత. వాడిని క్షమించమని అడిగాను. వాడిని వెళ్ళకుండా ఆపడానికి చాలా ప్రయత్నించాను కానీ వాడు ఆగలేదు. వాడు నన్ను క్షమించాను అని చెప్పాడు కానీ నా మాట వినకుండా వెళ్ళిపోయాడు. వెళ్తూ వెళ్తూ ఇక మీదట వీటన్నిటికీ దూరంగా ఉండదలచుకున్నాను అని చెప్పి వెళ్ళిపోయాడు. నేను వాడిని ఆపడానికి చాలా ప్రయత్నించాను సరిత అంటూ మామయ్య బోరున ఏడుస్తూ, నేను చాలా ప్రయత్నించాను సరిత కానీ వాడు ఆగలేదు. నన్ను క్షమించు సరిత. నన్ను క్షమించు అని అన్నాడు.

అరే ముందు నువ్వు ఏడవడం ఆపు. నేను చెప్పాను కదా మేమంతా నిన్ను క్షమించేశాం అని. పద ఇక మనం ఇంటికి వెళదాం అని అంది అమ్మ. .... లేదు నేను ఇంటికి రాను సరిత. అశోక్ నన్ను క్షమించనంత వరకు నేను ఇంటికి రాలేను. .... అశోక్ కూడా నిన్ను క్షమించేశాడు సురేంద్ర పద ఇక ఇంటికి వెళదాం. .... లేదు సరిత అశోక్ నన్ను క్షమించలేదు అని నాకు తెలుసు. నన్ను క్షమించే వాడైతే ఇప్పుడు ఇంటి బయట ఉండేవాడు కాదు. లోపలికి వచ్చి నాతో మాట్లాడేవాడు. నన్ను అంత తొందరగా క్షమించలేడని నాకు తెలుసు. నేను చేసిన ఇంత పెద్ద తప్పుకు ఎవరు మాత్రం క్షమించగలరు.

నేను అశోక్ కి అతని కుటుంబానికి మీ అందరికీ చాలా పెద్ద ద్రోహం చేశాను. నా కుటుంబానికి జరిగిన దానికి నేను మీకు మీ కుటుంబానికి శిక్ష పడేలా చేశాను. వీటన్నిటికీ అశోక్ నన్ను ఎప్పటికీ క్షమించలేడు. .... లేదు సురేంద్ర నువ్వు చేసిన దాన్ని నేను అర్థం చేసుకోగలను. నీకు జరిగింది మంచిది కాదు. అలాగే నువ్వు చేసింది కూడా మంచిది కాదు. నువ్వు ప్రతీకారం అనే పిచ్చిలో పడి అదంతా చేసావు. ఆ సమయంలో నువ్వు ఏం చేస్తున్నావో నీకే తెలియలేదు. కానీ ఇప్పుడు నువ్వు నీ తప్పు తెలుసుకున్నావు. అందుకు నిన్ను శిక్షించాల్సిన అవసరం లేదు. మేమంతా నిన్ను క్షమించేసాము. ఇక మొండి చెయ్యకుండా ఇంటికి వెళ్దాం పద అని అంది అమ్మ.

లేదు సరిత ప్లీజ్ నన్ను బలవంతం పెట్టకు. మీరంతా నన్ను క్షమించారు కానీ అశోక్ ఇంకా నన్ను క్షమించలేదు. ఏ రోజైతే అశోక్ నన్ను క్షమిస్తాడో ఆరోజు నేను తిరిగి వస్తాను. ఇప్పుడు రాలేను ప్లీజ్ సరిత. అశోక్ కోపం తగ్గే వరకూ కొద్ది రోజులు నన్ను ఇక్కడే ఉండనివ్వు. అన్ని సద్దుమణిగాక నేను తిరిగి ఇంటికి వస్తాను. కానీ ఇప్పుడు వద్దు. .... కానీ ఇక్కడ నువ్వు ఎలా ఉండగలవు అని అడిగింది అమ్మ. .... నేను ఉంటాను సరిత. ఇక్కడ కాకపోయినా నేను రేఖ ఇంటి దగ్గరకు వెళ్లిపోతాను. అక్కడ ఏదో ఒక పని చేసుకొని కాలం గడిపేస్తాను.

అయినా నన్ను క్షమించడానికి అశోక్ కి కూడా కొంచెం టైం పడుతుంది. అలాగే నాకు కూడా అశోక్ ముందుకు రావడానికి కొంత సమయం పడుతుంది. అలాగే అశోక్ తో మాట్లాడడానికి నాకు కొంచెం ధైర్యం కూడా కావాలి. .... కానీ సురేంద్ర నువ్వు,,,,,,, అంటూ మాట్లాడుతూ ఉండగా మావయ్య అమ్మను మాట్లాడకుండా ఆపేశాడు. దాంతో అమ్మ, అత్తయ్య మరియు శోభ బయటకు నడిచారు. అప్పుడే ఇంతకుముందు మోటార్ బాగు చేయించడానికి బయలుదేరి ఈ ఇంటికి వచ్చినప్పుడు నేను చూసిన ఫోటో నా కంట పడింది. ఆ ఫోటో నాకు బాగా తెలిసిన ఫోటోలా అనిపించింది. అందులో ముగ్గురు వ్యక్తులను నేను గుర్తుపట్టగలను. కానీ మరో ఇద్దరిని మాత్రం గుర్తు పట్టలేక పోయాను.

మావయ్య మాతో రాలేదు కానీ మేమంతా అక్కడినుంచి బయలుదేరాము. దారిలో నేనేమీ మాట్లాడలేదు అలాగే కవిత మరియు సోనియా కూడా ఏం మాట్లాడలేదు. అందరి కళ్ళు చెమ్మగిల్లి మనసంతా దిగులుతో నిండిపోయి ఉంది. ఒకరికి తన ప్రేమ గురించి దిగులుగా ఉంటే, మరొకరికి తన బంధాలను గుర్తించడంలో దిగులుగా ఉంటే, మరొకరికి తన తల్లి గురించి తన తల్లి నుండి విడిపోయాను అన్న దిగులు ఉంది. కానీ ఈ రోజు ఒక్క విషయం మాత్రం స్పష్టంగా తెలిసింది. మా నాన్న మా అమ్మ వాళ్ళ చిన్నాన్న గారిని అంటే చిన్నికృష్ణ తండ్రిని ఎందుకు ద్వేషిస్తారో స్పష్టంగా తెలిసింది. ఎందుకంటే చిన్నికృష్ణ తండ్రి యొక్క దుర్మార్గపు పనులు నాన్నకు తెలుసు. మేము పెళ్లి చూసి ఎంజాయ్ చేయడానికి వెళ్ళాము కాని తిరిగి వచ్చేటప్పుడు మాత్రం ఏడుస్తూ దిగులు పడుతూ వస్తున్నాము. ఇంటికి వచ్చేటప్పటికీ సాయంత్రం అయింది. మేము ఇంటికి చేరుకొని చూసేసరికి ఇంటి ముందు???

ఇంటికి చేరుకునే సరికి సాయంత్రం అయ్యింది. మేము ఇంటికి చేరుకునే సరికి ఇంటిముందు చాలా సెక్యూరిటీ ఆఫీసర్ వాహనాలు కనిపించాయి. అక్కడ కొంతమంది ప్రెస్ రిపోర్టర్ లు మరియు చుట్టుపక్కల ఉన్నవాళ్లు అంతా గుమిగూడారు. నేను కారు ఆపి వెంటనే ఇంటి వద్దకు పరిగెత్తాను. నా వెనుక మిగిలిన వాళ్లంతా వచ్చారు. దగ్గరకు వెళ్లి చూసేసరికి ఇంటి ముందు నేలపై అంతా రక్తం మడుగులు కనబడ్డాయి. అమ్మ మరియు మిగిలిన వాళ్ళంతా అది చూసి భయపడ్డారు. నేను లోపలికి వెళ్లడానికి ప్రయత్నించగా ఒక సెక్యూరిటీ అధికారి నన్ను లోపలికి వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నాడు. అప్పుడే నాకు ఖాన్ భాయ్ కనిపించగా నేను అతనిని పిలిచేసరికి అతను నన్ను లోపలికి పంపించమని నన్ను అడ్డుకున్న సెక్యూరిటీ ఆఫీసర్కు చెప్పారు. నేను వెంటనే లోపలికి వెళ్ళి, ఖాన్ భాయ్ ఇదంతా ఏం జరిగింది? ఎలా జరిగింది? ఈ రక్తం అంతా ఎవరిది? అంటూ చాలా ఆందోళన చెందుతూ అడిగాను.

ఖాన్ భాయ్ మాట్లాడుతూ, నన్ను క్షమించు సన్నీ. మీ ఇంటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అని నీకు మాటిచ్చాను. కానీ మాట నిలబెట్టుకోలేక పోయాను అని అన్నారు. .... మీరు అనేది ఏమిటి ఖాన్ బాయ్. మా ఇంట్లో ఏం జరిగింది? చెప్పండి. .... అప్పుడు ఖాన్ భాయ్ తనతోపాటు ఇంట్లోకి రమ్మని చెప్పగా నేను అతనితో పాటు ఇంట్లోకి వెళ్లాను. ఇంట్లో పరిస్థితి చూసి నేను షాక్ కు గురయ్యాను. ఇంట్లో అంతా చిందరవందరగా ఉంది. ఇంట్లో మొత్తం సామాను చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. కిచెన్ లో కూడా అన్ని వస్తువులు చెల్లాచెదురయ్యాయి. ఇంట్లో ప్రతి రూమ్ పరిస్థితి కూడా అలాగే ఉంది. నేను పరిగెత్తుకుంటూ పైకి వెళ్లాను. నా వెనకే ఖాన్ భాయ్ కూడా పైకి వచ్చారు. పైన పరిస్థితి కూడా సేమ్ టు సేమ్. ... ఇదంతా ఎలా జరిగింది? ఎవరు చేశారు? అని నేను అడుగుదామని అనుకునేసరికి ఖాన్ భాయ్ మాట్లాడుతూ, నన్ను క్షమించు సన్నీ. అమిత్ మరియు వాడి బాబు తాలూకా మనుషుల దగ్గర్నుంచి మీ ఇంట్లోని వస్తువులను కాపాడలేకపోయాను అని అన్నారు.

నాకు అమిత్ మరియు వాడి బాబు పై చాలా కోపం వచ్చింది. ఈ మధ్య కాలంలో నాకు జరుగుతున్న విషయాలు అన్నింటి గురించి నా మనసులో బాధతో కూడుకున్న కోపం రగులుతోంది. ఈ సమయంలో అమిత్ గాని వాడి బాబు గాని నా ముందు ఉండి ఉంటే క్షణకాలంలో వాళ్లని షూట్ చేసి పడేసే వాడిని. అప్పుడే నా చూపు కింద పడి ఉన్న మా రూమ్ లోని అల్మరా పై పడింది. దాని తలుపులు విరగ్గొట్టి ఉన్నాయి. అందులో ఉండాల్సిన బట్టలు పుస్తకాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. కానీ నాకు వాటి గురించి బాధ లేదు కానీ నా టెన్షన్ అంతా నేను ఊరు వెళ్ళినప్పుడు పట్టుకొని వెళ్ళకుండా ఉన్న నా లాప్టాప్ గురించే. ఎందుకంటే నేను దానిని ఇంట్లోనే వదిలేసాను. అందులోనే అమిత్ గాడికి వ్యతిరేకంగా ఉన్న సాక్షాలు మొత్తం ఉన్నాయి. నా టెన్షన్ గమనించిన ఖాన్ భాయ్, నువ్వు మరీ అంత ఎక్కువగా టెన్షన్ పడకు సన్నీ. నీ లాప్టాప్ కరణ్ దగ్గర సురక్షితంగా ఉంది అని అన్నారు. .... ఖాన్ భాయ్ ఆ మాట చెప్పగానే నాకు చాలా సంతోషం కలిగింది. కానీ ఆ ల్యాప్టాప్ కరణ్ దగ్గరకు ఎలా వెళ్ళింది అని కంగారు కలిగి, నా లాప్టాప్ కరణ్ దగ్గరా? కానీ ఎలా? అని ఖాన్ భాయ్ ని అడిగాను.

నువ్వు ఊరు వెళ్ళిన రోజు సాయంత్రం ఇక్కడ అంతా సరిగ్గా ఉందో లేదో అని చెక్ చేయడానికి నేను మీ ఇంటికి వచ్చాను. సరిగ్గా అదే సమయంలో కరణ్ నిన్ను కలవడానికి ఇక్కడకు వచ్చాడు. బహుశా నువ్వు ఊరు వెళ్తున్నట్టు కరణ్ కు చెప్పలేదు అనుకుంటా. నేను కరణ్ తో కలిసి మీ ఇంట్లోకి వచ్చి అంతా సవ్యంగా ఉందో లేదో అని చెక్ చేసుకున్నాను. అలా చెక్ చేస్తున్నప్పుడు నీ రూమ్ లో కరణ్ నీ కాలేజ్ బ్యాగ్ అందులో ల్యాప్టాప్ ఉండడం చూసి దానిని తనతో పాటు తీసుకొని వెళ్ళాడు అని అన్నారు ఖాన్ భాయ్. .... కానీ ఖాన్ భాయ్ నేను మీకు ఇంటి తాళాలు ఇవ్వలేదు కదా. మరెలా? .... అప్పుడు ఖాన్ బాయ్ నవ్వుతూ, సన్నీ నేను ఒక సెక్యూరిటీ ఆఫీసర్ వాడిని అని మర్చిపోయావా? అని అన్నారు. అలా ఖాన్ భాయ్ నవ్వడంతో నాకు కొంచెం టెన్షన్ తగ్గింది. కానీ వెంటనే ఖాన్ భాయ్ చెప్పిన మరో విషయం నాలోని టెన్షన్ ని మరింత పెంచింది.

లాప్టాప్ సురక్షితంగా ఉందిగానీ సన్నీ మనం మాత్రం సురక్షితంగా లేము. నిన్న రాత్రి మీ ఇంట్లో ఇద్దరు సెక్యూరిటీ ఆఫీసర్లు హత్య చేయబడ్డారు. వాళ్ళిద్దరూ నేను మీ ఇంటికి కాపలాగా పెట్టిన సెక్యూరిటీ ఆఫీసర్లు. నిన్న రాత్రి మీ ఇంట్లోకి కొంతమంది దుండగులు వచ్చి ఇద్దరు సెక్యూరిటీ ఆఫీసర్ వాళ్ళను చంపి మీ ఇంటిని ఇలా తయారు చేసి వెళ్ళారు. ఇప్పుడు నేను మీ ఇంట్లో సెక్యూరిటీ ఆఫీసర్ వాళ్ళు ఏం చేస్తున్నారు అన్న విషయాన్ని మీడియా నుంచి మా డిపార్ట్మెంట్ నుంచి దాచగలను. కానీ అమిత్ మరియు వాడి బాబు దగ్గర దాచలేము. ఇంతకుముందు వాళ్ళకు అనుమానంగా ఉండేది. కానీ ఇప్పుడు నువ్వు సెక్యూరిటీ ఆఫీసర్ వాళ్లతో కలిసిపోయావని వాళ్లకు కన్ఫర్మ్ అయిపోయింది. ఒకవేళ వాళ్లకు అనుమానం లేకపోయినా మీరంతా ఇక్కడ ఉండడం మంచిది కాదు. మీరు వేరే ఎక్కడైనా ఉండటం మంచిది. .... అదంతా సరేగాని ఇప్పుడు నేను మా వాళ్లతో ఏమని చెప్పాలి? ఇప్పుడు మేము అంతా ఎక్కడ ఉండాలి? మేము ఇప్పుడే ఊరు నుండి తిరిగి వచ్చాము. మళ్లీ తిరిగి ఊరు వెళ్ళలేము అని అన్నాను.

ఎక్కడ ఉండాలి అనే విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సన్నీ. గంగానగర్ లో నాకు ఒక ఇల్లు ఉంది. దాని గురించి నాకు తప్ప మరెవరికీ తెలియదు. ఇక్కడ నుంచి రెండు గంటల ప్రయాణం. ఈ కేసు సాల్వ్ అయ్యే వరకు మీరు కావాలంటే అక్కడ ఉండవచ్చు. .... అది సరే ఖాన్ భాయ్ కానీ ఇప్పుడు ఇంట్లో వాళ్లకి ఏమని చెప్పాలో అర్థం కావడం లేదు. .... మీ ఇంట్లో వాళ్లకి నిజం చెప్పేయ్ సన్నీ. వాళ్ల దగ్గర ఏది దాచవద్దు. మనకి ఇంట్లో వాళ్ళ కంటే కావలసినవారు ఇంకెవరు ఉంటారు. ....

ఖాన్ భాయ్ చెప్పింది నిజమే. ఇంట్లో వాళ్ళకి అంతా నిజం చెప్పడం మంచిది. అప్పుడే వాళ్ళు ఖాన్ భాయ్ ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటారు. నేను ఖాన్ భాయ్ తో కలసి ఇంట్లో నుంచి బయటకు వచ్చాను. అమ్మ ఖాన్ భాయ్ ని చూసి గుర్తు పట్టింది. ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి ఖాన్ భాయ్ ఇంటికి వచ్చినప్పుడు అమ్మ చూసింది. మేము ఇంట్లో వాళ్లని అందరిని కలిసేటప్పటికీ అందరూ చాలా కంగారుగా మొహాలు వెలసిపోయి ఉన్నారు. తర్వాత నేను అందరికీ నిజం చెప్పాను. అమిత్ గురించి, వాడి బాబు గురించి, ఆ సి డి ల గురించి అంత వివరంగా చెప్పాను.

నాన్న చాలా గాభరాగా ఉన్నారు. అందుకే కొంచెం కోపంతో, నువ్వు ఇలాంటి విషయాలలో తలదూర్చాల్సిన అవసరం ఏమొచ్చింది? చూడు నీ వల్ల ఇప్పుడు ఏమైందో? ఇప్పుడు మన అందరికీ అపాయం పొంచి ఉంది. నీ చెల్లికి, నీ అమ్మకి, నీ అత్తయ్యకి నీ అక్కకి అందరికీ ప్రమాదమే. ఎందుకిలా చేశావు సన్నీ? మనకి ఏమి అవసరం ఉంది చెప్పు? .... నాన్న ఎవరో ఒకరు ముందడుగు వేయాలి కదా. కరణ్ వాళ్ళ అక్కతో వాళ్ళు చేసిన దుర్మార్గపు పనిని నేను సహించలేక పోయాను. వాళ్ళ వలన మా కాలేజీలో ఇద్దరు అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకున్నారు. అందులో ఒకరు ఖాన్ భాయ్ చెల్లెలు.

నేను మొదలుపెట్టిన ఫైట్ కి ఖాన్ భాయ్ తోడుగా నిలిచారు. అయినా నేను ఈ ఫైట్ ఎందుకు చేయకూడదు? వాళ్ళ వలన మరో అమ్మాయి ఆత్మహత్య చేసుకునే వరకు తమాషా చూస్తూ కూర్చోవాలా? ఒకవేళ ఆ అమ్మాయిల స్థానంలో శోభక్క గాని సోనియా గాని ఉంటే అప్పుడు కూడా మీరు నన్ను ఈ విషయాలన్నింటిని నుంచి దూరంగా ఉండమని చెబుతారా? ప్లీజ్ నాన్న మీరు ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళండి. అతి కష్టం మీద నన్ను ఇంతలా ప్రేమించే కుటుంబం నాకు దొరికింది. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నా కుటుంబానికి అపాయం కలగనివ్వను. ప్లీజ్ నాన్నా నా మాటను మన్నించండి.

నా మాట విని నాన్న మౌనంగా ఉండిపోయారు. కానీ కొంచెం కంగారు పడుతూ, కానీ సన్నీ నీకేమైనా అయితే? వాళ్లు చాలా ప్రమాదకరమైన వాళ్లని నీకు తెలుసు కదా. వాళ్ళు ఇద్దరు సెక్యూరిటీ ఆఫీసర్ వాళ్ళను చంపగలిగినప్పుడు మనమెంత. వాళ్ల ముందు నువ్వెంత? .... నాన్న నన్ను నేను రక్షించుకోగలను. అలాగే మీ అందరిని రక్షించుకోగలను. కానీ నేను రిస్కు తీసుకోవాలని అనుకోవట్లేదు. అందుకే ప్లీజ్ మీరంతా గంగానగర్ లోని ఖాన్ భాయ్ ఇంటికి వెళ్ళండి. ఇక్కడ నేను అన్ని పరిస్థితులు చక్కదిద్దే వరకు మీరు కొద్దిరోజులపాటు అక్కడే ఉండవలసి ఉంటుంది. ....

అందరూ నా మాటను ఒప్పుకున్నారు. కానీ సోనియా మాట్లాడుతూ, నేను ఎక్కడికి వెళ్ళను. 2-3 రోజులలో కాలేజీ స్టార్ట్ అవుతుంది. నేను అంత దూరం వెళ్ళను. నేను కవిత వాళ్ళ ఇంట్లో ఉండిపోతాను అని అంది. .... కానీ తల్లి సన్నీ ఎందుకు చెప్తున్నాడో నువ్వు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు. ఇక్కడ ఉండడం చాలా ప్రమాదకరం. నువ్వు కూడా మాతో పాటు వచ్చేయ్ ప్లీజ్ అలా మొండికెయ్యకు అని అంది అమ్మ. .... లేదమ్మా నేను రాను. మీరు వెళ్ళండి. నా సేఫ్టీ నేను చూసుకోగలను అని సోనియా అనడంతో అమ్మ సోనియాకు నచ్చ చెప్పడానికి చాలా ప్రయత్నించినప్పటికీ సోనియా వినడం లేదు.

అమ్మ మీరు వెళ్ళండి. సోనియాను నేను చూసుకుంటాను. ఈరోజు నుంచి దాని బాధ్యత నాది అని నేను అనడంతో అమ్మ నాన్న నా మాటను అర్థం చేసుకున్నారు. అప్పుడు నేను వాళ్లను ఖాన్ భాయ్ తో వెళ్లమని చెప్పగా వాళ్లంతా ఖాన్ భాయ్ తో వెళ్లారు. కానీ సోనియా మాత్రం వాళ్లతో వెళ్లలేదు. సోనియా కవిత ఇంటికి వెళ్లాలని అనుకుంది. ఖాన్ భాయ్ మరియు మిగిలిన ఇంటి సభ్యులు అందరూ వెళ్లిన తర్వాత సోనియా నా దగ్గరకు వచ్చి, ఇంత జరుగుతున్నా నువ్వు నాతో ఎందుకు చెప్పలేదు సన్నీ అని అడిగింది. ....

నేను చెబుదామని అనుకున్నాను కానీ నిన్ను మిగిలిన వారందరినీ ఈ డేంజర్ నుంచి దూరంగా ఉంచాలని అనుకున్నాను. .... ఇందులో డేంజర్ ఏముంది. ఇంత దుర్మార్గం పనులు చేస్తున్నవారికి శిక్ష పడేలా చేస్తున్నావు. నువ్వు చేస్తున్నది చాలా మంచి పని. అటువంటప్పుడు ఇంట్లో వాళ్ళు అందరికీ కాకపోయినా నాకైనా చెప్పచ్చు కదా. నేను కూడా ఏదైనా హెల్ప్ చేసి ఉండేదాన్ని కదా. అయినా ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. ఒకవేళ నేను ఏదైనా హెల్ప్ చేయగలను అని అనుకుంటే నాతో చెప్పు సన్నీ. ఈ పనిలో నేను నీకు తోడుగా ఉండాలని అనుకుంటున్నాను అని అంది సోనియా.

లేదు సోనియా ఈ విషయంలో నిన్ను నేను ఇన్వాల్వ్ చేయలేను. నేను నిన్ను ప్రమాదంలో ఉంచలేను. అయినా నువ్వు నాకు హెల్ప్ చేయాలి అనుకుంటే మాత్రం ప్లీజ్,, కవిత ఇంట్లో నుంచి బయటకు రావద్దు. కాలేజీకి కూడా వెళ్ళద్దు. ఒకవేళ వెళ్ళవలసిన అవసరం వచ్చినా నాకు కాల్ చేసి వెళ్ళు. నేను తోడు లేకుండా మీరిద్దరూ ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టడానికి వీల్లేదు. .... కానీ సన్నీ నేను కూడా నీకు హెల్ప్,,,,,,, అంటూ సోనియా మాట్లాడబోతుండగా నేను సోనియాను ఇంకేమి మాట్లాడవద్దు అని చెప్పి, చాలు ఇక ఈ విషయంలో నేను ఏమీ మాట్లాడదలుచుకోలేదు. నువ్వు కవిత ఇంటికి పద నేను కూడా మీతో పాటు వస్తాను అని చెప్పగా, సోనియా మరియు కవిత వెళ్లి సూరజ్ కార్ లో కూర్చున్నారు. కవిత మరియు సోనియా సూరజ్ కారులోనూ వారి వెనుక నేను అత్తయ్య కారులోనూ అక్కడ నుంచి బయలు దేరాము.

చాలా దూరం నుంచి ప్రయాణం చేసి రావడం వల్ల మరియు ఇంటికి చేరుకోగానే అనుకోని సంఘటనలు ఎదురు కావడం వల్ల కవిత ఇంటికి చేరుకునే సరికి మేము చాలా బాగా అలిసిపోయాము. కవిత ఇంట్లో సూరజ్ మరియు కామిని వదిన కూడా మా ఇంటి దగ్గర జరిగిన సంఘటన టీవీలో చూసి చాలా కంగారు పడ్డారు. మేము కవిత ఇంటికి చేరుకోగానే వాళ్లు అదే విషయం నాతో మాట్లాడాలని అనుకున్నా నేను బాగా అలిసిపోయి ఉండటంతో వారితో ఆ విషయం ఏమీ మాట్లాడకుండా భోజనం చేసి ఖాళీగా ఉన్న సూరజ్ తల్లిదండ్రుల రూమ్లో పడుకోవడానికి వెళ్ళిపోయాను.

కానీ మా ఇంట్లో ఇద్దరు సెక్యూరిటీ ఆఫీసర్ల హత్య జరగడం. నా ఫ్యామిలీకి ప్రమాదం పొంచి ఉండడం ఇలాంటి విషయాలు పదే పదే గుర్తుకు వచ్చి నాకు నిద్ర పట్టకుండా చేస్తుంది. నేను అలా మంచం మీద పడుకొని ఇప్పుడు ఏం చేయాలి? ఎటువంటి ప్లాన్ తో ముందుకు వెళ్లాలి అని ఆలోచిస్తున్నాను. ఇంతకుముందు వేసుకున్న ప్లాన్ ప్రకారం ఇక మీద ముందుకు వెళ్లడం కుదరదు. ఎందుకంటే ఇప్పుడు అమిత్ మరియు వాడి బాబుకి నా మీద అనుమానం వచ్చింది. వాళ్లకు నా మీద అనుమానం వచ్చిందా లేదా అనే విషయం కన్ఫామ్ గా తెలియనంత వరకు ఏమీ చెయ్యడం కుదరదు. ఇదంతా ఆలోచిస్తుంటే నా తలంతా భారంగా మారిపోతుంది. సరిగ్గా అప్పుడే నాకు కరణ్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది.
Next page: Episode 099
Previous page: Episode 097