Episode 101


సుమారు రాత్రి 8-9 గంటల సమయానికి నేను మా సిటీకి చేరుకున్నాను. కానీ మా ఇంట్లో ఇంకా సెక్యూరిటీ ఆఫీసర్లకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉండడంతో నేను మా ఇంటికి వెళ్లలేదు. సూరజ్ మరియు కామిని వదిన అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పే ఓపిక లేక కవిత ఇంటికి కూడా వెళ్ళలేదు. అందుకే ఇంటికి కొంచెం దూరంలో ఉన్న మాల్స్ ఉన్న రోడ్ లో కాలేజీకి దగ్గరగా ఉండేటట్టు ఒక హోటల్లో దిగి భోజనం చేసి బాగా అలిసిపోయి ఉండటంతో వెంటనే నిద్రపోయాను. పొద్దున్న లేచే సరికి నా ఫోన్ మోగుతోంది. .... ఫోన్ ఎత్తేసరికి అటు నుంచి కవిత మాట్లాడుతూ, హలో సన్నీ అని అంది. ....

హలో కవిత. .... ఎక్కడ ఉన్నావ్ సన్నీ. కరణ్ ఇంట్లో ఉన్నవా? .... లేదు నేను కరణ్ ఇంట్లో లేను. వేరే చోట ఉన్నాను. చెప్పు నువ్వేంటి ఇంత పొద్దున్నే ఫోన్ చేశావు. .... ఏం లేదు సన్నీ. ఈరోజు నుంచి కాలేజీ మొదలు అవుతుంది కదా. సోనియా కాలేజీకి వెళ్లాలని మొండికేస్తుంది. ఎంత చెప్పినా ఆగడం లేదు. అదే విషయం నీకు చెబుదామని,, .... సరే మీరిద్దరూ కలిసి కాలేజీకి వచ్చేయండి. నేను కూడా కాలేజీకి దగ్గరలోనే ఉన్నాను. మరో పది నిమిషాలలో కాలేజీలో ఉంటాను అని చెప్పగానే కవిత బాయ్ చెప్పి ఫోన్ కట్ చేసింది. నేను వెంటనే లేచి ఫ్రెష్ అయ్యి టిఫిన్ కాలేజీ క్యాంటీన్ లో చెయ్యొచ్చులే అని అనుకొని కాలేజీకి బయలుదేరాను.

చలికాలం కావడంతో నేను చెప్పగానే క్యాంటీన్ వాడు టేబుల్ ను బయట ఎండలో వేశాడు. నేను బయట ఎండలో టేబుల్ మీద కూర్చుని కాఫీ తాగుతూ శాండ్విచ్ తింటూ దాని రుచిని ఆస్వాదిస్తూ ఉండగా సురేష్ గాడు వచ్చి నా దగ్గర కూర్చుని, ఎలా ఉన్నావ్ సన్నీ. ఏంటి ఈ మధ్య బొత్తిగా కనబడడం మానేశావు. నీ ఫ్రెండ్ కరణ్ కూడా కనబడటం లేదు అని అడిగాడు. .... ఎలా కనబడతాము? కాలేజీ ఈ రోజే మొదలైంది కదా అంటూ నేను నవ్వుతూ జవాబిచ్చాను. .... అంటే నా ఉద్దేశ్యం అది కాదు సన్నీ. నిన్న నేను కరణ్ ఇంటికి వెళ్లేసరికి డోర్ లాక్ చేసి ఉంది. కరణ్ మరియు రితికలకు ఫోన్ ట్రై చేసినా ఫోన్లు స్విచాఫ్ చేసి ఉన్నాయి. వాళ్లు ఎక్కడికైనా టూర్ కి వెళ్ళారా? ....

నాకు తెలీదు సురేష్. బహుశా హనీమూన్ కి వెళ్ళారేమో? హనీమూన్ కి వెళ్తున్నామని నాకు గాని చెప్పి వెళ్తారా ఏంటి? అయినా నువ్వు వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్లావు? .... ఎందుకేమిటి? నా చెల్లెలిని కలవడానికి వెళ్లాను సన్నీ. వాళ్ల పెళ్లి రోజున నేను వాళ్ళతో సరిగా వ్యవహరించలేదు. అందుకు నేను వాళ్ళ ఇద్దరికీ క్షమాపణలు చెప్పాలని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. కానీ వాళ్ల ఇంట్లో ఎవరూ లేరు. .... నేను కూడా మా ఊరు వెళ్లి నిన్నే తిరిగి రావడంతో నాకు కూడా ఏమీ తెలీదు సురేష్. ఒకవేళ కరణ్ నుంచి నాకు ఏమైనా ఫోన్ వస్తే నీకు చెబుతానులే అని నేను అనగానే సురేష్ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోబోతుండగా అమిత్ అక్కడికి వచ్చాడు.

మీ ఇంటి దగ్గర జరిగిన విషయాన్ని విని నాకు చాలా బాధగా ఉంది సన్నీ. మీ ఇంట్లో దొంగలు పడ్డారంట కదా? ఇద్దరు సెక్యూరిటీ ఆఫీసర్ వాళ్ళను కూడా చంపేశారంట కదా? మీకేమి పెద్ద నష్టం వాటిల్లలేదు కదా? అని అన్నాడు అమిత్. వాడు ఆ మాట అడుగుతున్నప్పుడు వాడి మొహంలో చిన్న పైశాచిక ఆనందం కనపడింది. .... లేదు అమిత్ అంత పెద్ద నష్టం ఏమీ జరగలేదు. .... అయినా సెక్యూరిటీ ఆఫీసర్ వాళ్ళు మీ ఇంట్లో ఏం చేస్తున్నారు సన్నీ అంటూ కొంచెం అనుమానంగా అడిగాడు. .... సెక్యూరిటీ ఆఫీసర్ వాళ్ళు మా ఇంటి వైపు రౌండ్స్ వేస్తూ ఉంటే ఎవరో మా ఇంటి గోడ దూకటం చూసి వాళ్లు కూడా లోపలికి వెళ్లగా అప్పుడు దొంగలు వాళ్ళను కాల్చి చంపేశారు. కానీ వాళ్లు సెక్యూరిటీ ఆఫీసర్లను షూట్ చేస్తుంటే శబ్దం ఎందుకు రాలేదో నాకు అర్థం కావడం లేదు. బహుశా ఆ దొంగలు గన్స్ కి సైలెన్సర్ లు బిగించుకుని ఉంటారు. .... అప్పుడు సురేష్ మాట్లాడుతూ, అబ్బో,, ఈ మధ్య దొంగలు కూడా చాలా తెలివి మీరిపోయినట్టున్నారు అని అమిత్ తో కలసి నవ్వాడు.

తర్వాత వాళ్ళిద్దరూ కూడా నాతో పాటు కూర్చుని కాఫీ ఆర్డర్ చేసి కాఫీ తాగుతూ, ఆ రోజు కాలేజీలో నన్ను అంబులెన్స్ లో ఎక్కించడానికి ఏ ఒక్క నా కొడుకు ముందుకు రాకపోయినా నువ్వు వచ్చి హెల్ప్ చేసినందుకు నీకు చాలా థ్యాంక్స్ సన్నీ అని అన్నాడు సురేష్. .... ఇందులో థాంక్స్ చెప్పడానికి ఏముంది సురేష్. అయినా నేను నీకు హెల్ప్ చేయకుండా ఉండడానికి నీకు నాకు మధ్య ఏదైనా శత్రుత్వం ఉందా ఏంటి? నీ ప్లేస్ లో ఇంకెవరైనా ఉన్నా నేను అలాగే హెల్ప్ చేసే వాడిని అని అన్నాను. ....

సరిగ్గా చెప్పావు సన్నీ. మన మధ్య ఎటువంటి శత్రుత్వం లేదు. పైగా ఇప్పుడు మన మధ్య బంధుత్వం కూడా కలిసింది. నువ్వు నా బావ గారికి బెస్ట్ ఫ్రెండ్ వి అంటూ సురేష్ అమిత్ వైపు చూసి ఏదో సైగ చేశాడు. .... సురేష్ సైగ చేసిన వెంటనే అమిత్ మాట్లాడుతూ, ఆ రోజు మేము నీతో గొడవ పడినందుకు చాలా చాలా సారీ సన్నీ. శిరీష కరణ్ వాళ్ల అక్క అని నాకు తెలీదు. ఆ విషయం నాకు ముందే తెలిసి ఉంటే నేను ఆమెతో అలా బిహేవ్ చేసి ఉండేవాడిని కాదు అని అన్నాడు. వాళ్ళిద్దరూ నన్ను మెల్లగా దువ్వుతున్నారు అని నాకు అర్థమయింది. ఎంతైనా పాలిటిక్స్ తో సంబంధం ఉన్న వాళ్ళు కదా.

ఇట్స్ ఓకే అమిత్. నేను ఆ విషయాన్ని ఎప్పుడో మరిచిపోయాను అంటూ నేను కొంచెం నవ్వుతూ అన్నాను. తర్వాత మేము ముగ్గురము అవి ఇవి అంటూ కొంచెం సేపు మాట్లాడుకున్నాము. ఈరోజు వాళ్లు నాతో చాలా కూల్ గా మాట్లాడుతున్నారు. బహుశా వీళ్ళకి ఇప్పుడు నా మీద ఎటువంటి అనుమానం లేనట్టుంది. ఎందుకంటే వాళ్ళకి మా ఇంట్లో ఏమీ దొరకలేదు కదా. కానీ వీళ్ళు చాలా పెద్ద ఎదవలు. వీళ్లను అంత ఈజీగా నమ్మకూడదు. కానీ ఒక్క విషయంలో మాత్రం నాకు సంతోషంగా ఉంది. నిజంగానే వీళ్లకు నా మీద అనుమానం లేనట్లయితే నా ఫ్యామిలీకి వీళ్ళ నుంచి ప్రమాదం ఏమీ లేనట్టే. అప్పుడు అమిత్ మాట్లాడుతూ, ఇప్పుడు మనం మంచి ఫ్రెండ్స్ అయిపోయాం కదా నిన్ను ఒక విషయం అడగొచ్చా సన్నీ అని అన్నాడు. ....

ఆ,,ఆ,, ఒకటేమిటి రెండు అడుగు అమిత్ అని అన్నాను. .... సుమిత్ ఎక్కడ దాక్కున్నాడో నీకు తెలుసా? లేదంటే వాడి గురించి ఎవరైనా మాట్లాడుకుంటూ ఉంటే విన్నావా? అని అడిగాడు అమిత్. .... లేదు అమిత్ నాకు తెలియదు. నాకు తెలిసి ఉంటే నేను మీ నాన్నకి చెప్పి ఉండే వాడిని కదా. .... మరి నువ్వు మా నాన్నకు ఇచ్చిన సి డి లు నీకు ఎలా దొరికాయి? .... అవి నాకు సుమిత్ గాడి ఇంట్లో దొరికాయి. .... అంటే నీకు సుమిత్ గాడి ఇల్లు ఎక్కడ ఉందో తెలుసా? అంటూ అమిత్ నా వైపు అనుమానంగా చూస్తూ అడిగాడు. .... లేదు నాకు తెలీదు. కానీ వాడు మత్తు మందు కొనుక్కునే ఏరియాలో కొంతమంది ద్వారా వాడి ఇల్లు ఎక్కడ ఉందో నాకు తెలిసింది. అందుకే నేను వాడి ఇంటిని వెతుకుతూ వెళ్లగా అక్కడ నాకు ఈ సి డి లు దొరికాయి.

ఒకవేళ మీకు సుమిత్ గురించి ఏదైనా సమాచారం కావాలంటే మీరు కూడా ఆ మత్తు మందులు అమ్మే చోటుకి వెళితే ఏదైనా తెలియవచ్చు. అక్కడ వాడికి సంబంధించిన ఫ్రెండ్స్ లేదా ఎవరైనా తెలిసిన వారు ఉండొచ్చు కదా అని అన్నాను. నా మాట విని అమిత్ మరియు సురేష్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా కాఫీ తాగుతున్నారు. వాళ్ళిద్దరూ కాఫీ తాగడం పూర్తిచేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. వెళ్తూ వెళ్తూ అమిత్ క్యాంటీన్ వాడితో కోపంగా మాట్లాడుతూ, ఒరేయ్,, సన్నీ బిల్లు కూడా నా అకౌంట్లో వేసేయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు.

అమిత్ గాడి మాటలకి క్యాంటీన్ వాడికి కోపం వచ్చింది. నేను కూడా కాఫీ తాగడం పూర్తవడంతో లేచి కాంటీన్ వాడి దగ్గరకు వెళ్లగా, చూసావా బాబు అడుక్కుతినే నాకొడుకు వాడి బిల్లు ఇవ్వలేదు సరికదా నీ బిల్లు కూడా వాడి అకౌంట్లో వేసుకోమని ఎంత పొగరుగా చెబుతున్నాడో అని అన్నాడు. .... అప్పుడు నేను పర్సులో నుంచి కొంత డబ్బులు తీసి వాడికి ఇస్తూ, ఇదిగో ఈ డబ్బులు తీసుకో. నెల మొత్తం ఏదో ఒక కుక్కని ఊరికే మేపుతున్నానని అనుకొని నీ కోపం తగ్గించుకో అని అనగానే క్యాంటీన్ వాడు సంతోషించాడు.

క్యాంటీన్ వాడు మాట్లాడుతూ, కానీ బాబు నేను మీ దగ్గర డబ్బులు ఎలా తీసుకోగలను. అసలే నేను నీకు చాలా రుణపడి ఉన్నాను అని అన్నాడు. .... ఆ రుణం సంగతి పక్కన పెట్టు. ఇది నేను నీకు ఇస్తున్నది నీ క్యాంటిన్ బిల్లు కోసం. దీని దారి దీనిది దాని దారి దానిదే. ఇదిగో ఈ డబ్బులు తీసుకో లేకపోతే ఇక మీదట నీ క్యాంటీన్ లో మరెప్పుడూ కాఫీ తాగను అని అనడంతో వాడు మరేమీ మాట్లాడకుండా కామ్ గా డబ్బులు తీసుకున్నాడు. నేను తిరిగి వచ్చి టేబుల్ దగ్గర కూర్చున్నాను. ఎందుకంటే ఈ రోజు కాలేజీలో పెద్దగా చేయడానికి ఏముంది. ఇంతలో సోనియా మరియు కవిత కూడా కాలేజీకి వచ్చారు.

రెండు రోజుల నుంచి నువ్వు ఎక్కడ ఉన్నావు? ఇంటికి ఎందుకు రాలేదు? నీ కోసం నేను ఎంత కంగారుపడ్డానో తెలుసా? అంటూ సోనియా కోపంగా మాట్లాడుతూ వచ్చి నా దగ్గర కూర్చుంది. .... అది,, నేను వేరే ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాను అని అన్నాను. .... అబద్ధం చెప్పకు. నీకు కరణ్ తప్ప మరెవరూ ఫ్రెండ్స్ లేరు. కరణ్ వాళ్ళింటికి లాక్ చేసి ఉండడం మేము చూసాము. అయినా నువ్వు నా దగ్గర అబద్ధం చెప్పకు. అబద్ధం చెబితే నువ్వు నాకు దొరికిపోతావు అని నీకు బాగా తెలుసు. .... అమ్మా తల్లి! సరే సరే,, నేను ఫ్రెండ్ ఇంట్లో లేను. ఒక హోటల్ లో ఉన్నాను. ఇప్పుడు సంతోషమేనా? ....

ఇప్పుడు కవిత నామీద కోపంగా మాట్లాడుతూ, హోటల్ లో ఎందుకు? ఇంటికి రాలేవా? అది నీ ఇల్లు కాదా? హోటల్ లో ఎందుకు ఉండవలసి వచ్చింది? అని అంది. .... అమ్మా తల్లి నన్ను క్షమించండి. ఇద్దరు కలిసి ఈ పసివాడి ప్రాణం తీసేస్తారా ఏంటి? సూరజ్ అన్న మరియు కామిని వదిన అడిగే ప్రశ్నల నుంచి తప్పించుకోవడానికే నేను ఇంటికి రాలేదు. .... అవును సన్నీ నువ్వు చెప్పింది నిజమే. వాళ్ళు నన్ను కూడా ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగి నా బుర్ర తినేశారు. సరేగాని నువ్వు టిఫిన్ చేసావా లేదా? .... అవును నేను ఇప్పుడే టిఫిన్ తినేశాను. మీరు టీ గాని కాఫీ గాని తాగుతారా? .... థాంక్యూ సన్నీ మేము తాగము. మేము ఇంట్లోనే టిఫిన్ చేసి వచ్చాము.

అది సరేగాని బ్లాకీ టిఫిన్ తినడం పూర్తయింది కదా ఇక క్లాస్ కి వెళ్దామా? లేదంటే ఈ రోజంతా అక్కడే కూర్చుని కాలక్షేపం చేస్తావా? అని సోనియా నవ్వుతూ అడిగింది. అప్పుడు కవిత కూడా సోనియాతో పాటు నవ్వింది. .... లేదు నేనేమి క్లాస్ కి రాను మీరిద్దరూ వెళ్ళండి అని నేను అనడంతో సోనియా లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కానీ కవిత మాత్రం అక్కడే నా దగ్గర కూర్చుంది. .... ఏం నువ్వు వెళ్ళవా క్లాసుకి అని కవితను అడిగాను. .... వెళ్లాలి సన్నీ. కానీ నేను నీతో కొంచెం మాట్లాడాలి. అది,, నేను,, అది,, ....

నువ్వు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావో నాకు తెలుసు. ఇప్పుడు సోనియా కూడా నన్ను ప్రేమిస్తుంది కాబట్టి బహుశా నేను నిన్ను మర్చిపోతానేమో లేదా నేను నిన్ను ఇంతకుముందు నిన్ను ప్రేమించినట్టు ఇక మీదట కూడా ప్రేమిస్తానో లేదో అనే కదా నీ సందేహం. ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా విను. నేను సోనియాను ఎంతలా ప్రేమిస్తున్నానో నిన్ను కూడా అంతే గొప్పగా ప్రేమిస్తున్నాను. ఈ విషయంలో ముందు ముందు ఏం జరుగుతుందో అని నాకు కూడా అయోమయంగానే ఉంది. కానీ నేను మనసులో ఎటువంటి టెన్షన్ పెట్టుకోను. నువ్వు కూడా నీ మనసులో ఉన్న టెన్షన్ పక్కనపెట్టి ఏం జరగాలన్నది కాలానికీ వదిలేయ్. అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు నన్ను నమ్మితే చాలు.

నాకు నీ మీద చాలా నమ్మకం ఉంది సన్నీ. అయినా నాకు ఏమీ టెన్షన్ లేదు. కాకపోతే ఏం జరిగినా మంచే జరగాలని కోరుకుంటున్నాను. ఎవరికీ ఏ కారణంచేత దుఃఖం కలగకూడదు అని కోరుకుంటున్నాను. మనమిద్దరం చిన్ననాటి స్నేహితులం అని నీకు తెలుసు. ఏది ఏమైనా సరే మన మధ్య స్నేహం మాత్రం ఎప్పటికీ ఇలాగే ఉండాలి. ఓకే ఇక నేను వెళ్తాను. అదిగో చూడు సోనియా దూరంగా నుంచుని నా వైపు ఎలా గుర్రుగా చూస్తుందో అని కవిత అనేసరికి నేను వెనక్కి తిరిగి చూడగా సోనియా దూరంగా నిలుచుని మా వైపు చూస్తుంది.

కవిత అక్కడినుంచి వెళ్లబోతుండగా నాకు ఏమైందో తెలియదు కానీ నేను కూడా ఆమెతో పాటు లేచి ఆమె చెయ్యి పట్టుకున్నాను. కవిత కొంచెం భయపడుతూ, ఏం చేస్తున్నావ్ సన్నీ? నా చెయ్యి వదులు అందరూ చూస్తున్నారు. మనం కాలేజీలో ఉన్నామని మర్చిపోయావా ఏంటి? అని అంది. .... కాలేజీలో ఉన్నాను కాబట్టే చెయ్యి పట్టుకున్నాను. అదే మనం ఇద్దరం ఒంటరిగా ఉండి ఉంటే ఇంకేదో పట్టుకొనే వాడిని అని అన్నాను. .... నా మాటకి కవిత కొంచెం సిగ్గుపడి, వదులు బాబు, నాకు సిగ్గేస్తుంది. చూడు అందరూ మనల్ని చూస్తున్నారు. ప్లీజ్ సన్నీ నన్ను వదిలేయ్ అని అంది.

నీ బాయ్ ఫ్రెండ్ తో కలిసి నుంచుని అందరూ చూస్తున్నందుకు సిగ్గేస్తుందా? లేదా సోనియా చూస్తుందని సిగ్గేస్తుందా? .... అది,, నేను,, అది,, లేదు సన్నీ,, ... తను ఏమీ మాట్లాడలేక పోతుంది. అప్పుడు నేను ఆమెను దగ్గరకు లాక్కుని కౌగిలించుకున్నాను. సడన్ గా నేను చేసిన పనికి ఆమె కొంచెం బిత్తర చూపులు చూస్తోంది. .... చూడు నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ వి. ఈ విషయం అందరికీ తెలిస్తే మంచిదే కదా. మనం మాత్రం ఎంతకాలం ఇలా రహస్యంగా కలుసుకోవాలి. ఏదో ఒకరోజు తెలియవలసిందే కదా. అది ఈ రోజే ఎందుకు కాకూడదు? మన ఇద్దరి మధ్య ఏముందో అందరికీ తెలియనివ్వు అని అన్నాను. .... సరే బాబు , కానీ ఇప్పుడు నన్ను వదిలేయ్ క్లాస్ కి వెళ్ళాలి లేట్ అయిపోతుంది. నా వలన క్లాసు లేట్ అయితే సోనియా నా రక్తం తాగేస్తుంది. చూడు అది ఇంకా మన వైపే చూస్తుంది. ....

నేను వెనక్కి తిరిగి చూసేసరికి సోనియా చాలా సంతోషంగా ఉంది. అప్పుడు కవిత నా బుగ్గమీద ఒక ముద్దు పెట్టి అక్కడి నుంచి పరిగెత్తుకుని వెళుతూ, నువ్వు నా బాయ్ ఫ్రెండ్ గీయ్ ఫ్రెండ్ ఏమి కాదు బ్లాకీ. ఈ విషయం కలలో కూడా ఊహించుకోవద్దు అంటూ వెళ్ళిపోయింది. ఆమె మాట విని నేను నవ్వుతూ ఉండగా ఆమె సోనియా దగ్గరకు చేరుకుంది. ఇద్దరూ కలిసి సంతోషంగా నా వైపు చూసి నవ్వుతూ క్లాస్ కి వెళ్ళిపోయారు. నేను మాత్రం అక్కడే కూర్చుని టైంపాస్ చేస్తున్నాను. అప్పుడే నాకు ఖాన్ భాయ్ దగ్గరనుంచి ఫోన్ రాగా నేను ఆయనతో మాట్లాడాను. ఆయన నన్ను ఎవరినో కలవమని చెప్పడంతో నేను ఆ వ్యక్తిని కలవడానికి కాలేజీ నుంచి బయలుదేరాను.

నేను కార్ లో ఖాన్ బాయ్ చెప్పిన ప్లేస్ కి బయల్దేరాను. అది అమిత్ గాడి బాబుకి వ్యతిరేకంగా ఉండే లీడర్ పొలిటికల్ ఆఫీస్. అతను అమిత్ గాడి బాబుకి శత్రువు. సాధారణంగా అమిత్ గాడి బాబు గురించి రోజు పేపర్లో ఏదో ఒక చెడ్డ వార్త వస్తూనే ఉంటుంది. కానీ ఇంతవరకు ఈ లీడర్ గురించి ఎప్పుడూ ఒక్క చెడ్డ వార్త కూడా నేను పేపర్లో చూడలేదు. ఎప్పుడూ ఇతని గురించి మంచివాడు నిజాయితీపరుడు అందరికీ సహాయం చేసే వ్యక్తి అనే మంచి మాటలే వినపడ్డాయి.

బహుశా అందుకే మా శత్రువుని అతని శత్రువుతో చేతులు కలిపి ఎదుర్కోవాలని ఖాన్ భాయ్ నన్ను ఇక్కడికి పంపించి ఉంటారు. నేను అక్కడికి చేరుకొని ఖాన్ భాయ్ నాకు ఇచ్చిన ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసి ఒకామెతో మాట్లాడగా గేటు దగ్గర నిల్చున్న ఒక వ్యక్తి వచ్చి నన్ను లోపలికి తీసుకొని వెళ్ళాడు. నేను అతనితో లోపలికి వెళుతూ పరిసరాలను గమనిస్తూ ఉండగా అక్కడ కూడా చాలామంది బాడీగార్డ్స్ ఉండటం కనిపించింది. అప్పుడు నన్ను లోపలికి తీసుకొని వెళ్తున్న వ్యక్తి నన్ను ఒక ఆఫీస్ లోకి తీసుకొని వెళ్ళాడు.

తలుపు తెరుచుకోగానే ఒకామె లోపల కూర్చుని కనపడింది. ఆమె వయస్సు సుమారుగా 35-40 మధ్య ఉండొచ్చు. తెల్లగా ఉండి తన జుట్టు ముడివేసుకుని ఒక తెల్ల చీర కట్టుకొని చాలా సింపుల్ గా ఉంది. పెద్దగా మేకప్ ఏమి వేసుకోలేదు కానీ గులాబీ రంగు లిప్స్టిక్ మాత్రం పూసుకుంది. నేను లోపలికి వెళ్ళగానే ఆమె చైర్ లోంచి లేచి నాకు స్వాగతం పలికి కూర్చోమని మరో చైర్ చూపించింది. నేను ఆమె ఎదురుగా చైర్ లో కూర్చోగానే ఆమె కూడా తన చైర్ లో కూర్చుంది. ....

ఇన్స్పెక్టర్ ఖాన్ చెప్పిన సన్నీ మీరే అన్నమాట, నా పేరు మధు అని అంది. .... హలో మధు మేడం. అవునండి నేనే ఆ సన్నీని. ఖాన్ బాయ్ గారు పంపించారు. .... ఇన్స్పెక్టర్ ఖాన్ మీ అన్నయ్యా? అంటూ ఆమె కొంచెం ఆశ్చర్యంగా అడిగింది. .... లేదండి కానీ అంతకంటే తక్కువ కూడా ఏమీ కాదు. వాస్తవానికి మేమిద్దరం ఒకే దారిలో ప్రయాణిస్తున్నాము. మా ఇద్దరి గమ్యం కూడా ఒకటే. ఇద్దరం కలిసి ప్రయాణం చేస్తూ బాగా దగ్గరైపోయాము. మంచి స్నేహితులం అయిపోయాము లేదా మీరు చెప్పినట్టు అతను నాకు ఒక మంచి అన్నయ్య అని చెప్పవచ్చు.

అది చాలా మంచి విషయమే. సరే ఇక విషయానికి వద్దాం. మిస్టర్ వర్మని కుర్చీ నుంచి దించడానికి అతని పరువు మంట కలపడానికి కావలసిన బలమైన విషయం మీ దగ్గర ఏముంది? (మిస్టర్ వర్మ అంటే అమిత్ గాడి బాబు). .... మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కాలేదు. కుర్చీ ఏంటి? మట్టిలో కలపడం ఏంటి? .... అదే మీ దగ్గర మిస్టర్ వర్మకు వ్యతిరేకంగా ఏదో బలమైన వార్త ఉందని, అతనికి వ్యతిరేకంగా పోరాడటానికి మా హెల్ప్ కావాలని ఇన్స్పెక్టర్ ఖాన్ నాతో చెప్పారే. నువ్వు అతని మీద ఏదైనా కేసు పెట్టాలని అనుకుంటున్నావా?

వర్మ తన అధికారం మరియు డబ్బు ఉపయోగించి జడ్జీలను కొనేస్తాడని మీకు అనిపిస్తుంది అని ఆ విషయంలో మీకు మా సహాయం కావాలని ఇన్స్పెక్టర్ ఖాన్ నాకు ఫోన్ చేసి చెప్పారు. .... అవును మీరు చెప్పింది కరెక్టే. మాకు మీ సహాయం కావాలి. కానీ మా దగ్గర వర్మకు వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యం లేదు. అతని అబ్బాయి అమిత్ కు వ్యతిరేకంగా మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. ఖాన్ భాయ్ మీకు మొత్తం విషయం చెప్పి ఉంటారు కదా. .... లేదు ఖాన్ నాతో ఏమీ చెప్పలేదు. కేవలం మీరు వచ్చి నాతో విషయం మాట్లాడతారని మాత్రమే చెప్పారు. కానీ దీంతో ఆ వర్మ పదవి ఊడిపోయే ఛాన్స్ ఉందని మాత్రం చెప్పారు.

నాకు అదంతా ఏమీ తెలియదు మేడం. కానీ అతని కొడుకు వలన అతని పరువు పోతుంది అని కచ్చితంగా చెప్పగలను. ఇక పదవి పోవడం లాంటి విషయాలు నాకంటే మీకే బాగా తెలియాలి. .... సరే వర్మ కొడుకుకి వ్యతిరేకంగా మీ దగ్గర ఏం సాక్ష్యం ఉందో కొంచెం వివరంగా చెప్తే మాకు కూడా తెలుస్తుంది. .... సరే మేడం చెప్తాను. కొద్ది నెలల క్రితం కాలేజీలో ఇద్దరు అమ్మాయిలు ఆత్మహత్య చేసుకోవడం గురించి మీకు తెలిసే ఉంటుంది. నేను అదే కాలేజీకి చెందిన స్టూడెంట్ ని.

వర్మ కొడుకు కూడా అదే కాలేజీకి చెందినవాడు. ఆ అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకుని చనిపోవడానికి కారణం వర్మ కొడుకు అమిత్. కానీ వర్మ తన పవర్ ను ఉపయోగించి ప్రిన్సిపాల్ తో చేతులు కలిపి ఆ అమ్మాయిలు చదువులు చదవలేక ఆత్మహత్య చేసుకున్నట్టు చిత్రీకరించారు. ప్రిన్సిపాల్ వర్మకు చెంచా కావడంతో సెక్యూరిటీ ఆఫీసర్లు కూడా ఏమీ చేయలేకపోయారు. ఎందుకంటే వర్మ ఆ కాలేజీ ట్రస్ట్ కి ఫౌండర్ చైర్మన్. మా కాలేజీకి మరియు ప్రిన్సిపాల్ కి వర్మ చాలా డబ్బులు ఇచ్చి ఉన్నాడు.

ఆ అమ్మాయిలు చదువు విషయంలో ఆత్మహత్యలు చేసుకోలేదని, వర్మ కొడుకు అమిత్ పెట్టిన టార్చర్ వల్లనే వాళ్లు ఆత్మహత్యలు చేసుకున్నారని నిరూపించే బలమైన సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి. వర్మ కొడుకు తన స్నేహితులతో కలిసి ఆ అమ్మాయిలను రేప్ చేసినందువల్లనే వాళ్లు ఆత్మహత్యలు చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్లు చనిపోకపోతే ప్రతిరోజు రేప్ జరుగుతుందని వాళ్ళ భయం. అటువంటి దుర్భరమైన జీవితం జీవించే కంటే చనిపోవడమే మేలని ఆ అమ్మాయిలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ....

మధు మేడమ్ నేను చెప్పిన విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించి తర్వాత మాట్లాడుతూ, ఓహో,, అయితే వర్మ కొడుకే దోషి అని నిరూపించడానికి బలమైన సాక్ష్యాలు నీ దగ్గర ఏమున్నాయి. ఎందుకంటే వాళ్ళు చాలా పవర్ఫుల్ మనుషులు. వాళ్ళను ఎదుర్కొని యుద్ధం చేయాలంటే నీ దగ్గర ఒక దానిని మించిన మరొక ఆయుధం సిద్ధంగా ఉండాలి. .... మీరు సరిగ్గా చెప్పారు మేడం. వాళ్లు చాలా పవర్ఫుల్ మనుషులే. కానీ నా దగ్గర వాళ్లకు వ్యతిరేకంగా ఉన్న ఆయుధం వాళ్ళ పవర్ ని మట్టిలో కలిపేస్తుంది.

అంత బలమైన ఆయుధం నీ దగ్గర ఏముందో కొంచెం నాకు కూడా చూపించు. ఒక కాలేజీ స్టూడెంట్ ఎటువంటి బలమైన ఆయుధంతో ఈ యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడో మాకు కూడా తెలియాలి కదా. .... నా దగ్గర ఆ రేప్ కి సంబంధించిన వీడియోలు ఉన్నాయి మధు మేడం. ఇంకా వర్మ కొడుకు తన స్నేహితుడితో కలిసి తను చేసిన నేరం గురించి మాట్లాడుతున్న వీడియో కూడా ఉంది. .... నా మాట విని ఆమె నోరు తెరిచింది తెరిచినట్టే ఉండిపోయింది. ఆమె కొంచెం సేపు ఆలోచనలో పడిపోయి తర్వాత మాట్లాడుతూ, ఆ వీడియోలు ఎక్కడ ఉన్నాయి. నాకు చూపించు. నేను వెంటనే వెళ్లి మంత్రి గారికి చూపిస్తాను అంటూ ఆమె కొంచెం ఆత్రుత పడిపోతూ అడిగింది. .... అంత తొందర ఏమొచ్చింది మధు మేడమ్. అయినా నేను ఆ వీడియోలు మీకు చూపించగలను కానీ మీ చేతికి ఇవ్వలేను అని నేను కొంచెం సున్నితంగా తిరస్కరించడంతో ఆమెకు కోపం వచ్చి నా వైపు గుర్రుగా చూసింది. .... ఆ వీడియోలు మాకు ఎందుకు ఇవ్వలేవు. నీకు మా మీద ఏమైనా అనుమానం ఉందా?

లేదు మధు మేడం. నాకు మీ మీద ఎటువంటి నమ్మకం లేదు. ఎందుకంటే మీరు కూడా అదే కుళ్ళు రాజకీయాల్లో భాగస్వాములే కదా. మీ మంత్రిగారి మీద ఇప్పటి వరకు ఎటువంటి ఆరోపణలు లేవు అన్నది వాస్తవమే కానీ నేను మాత్రం మిమ్మల్ని పూర్తిగా నమ్మలేను. మీ రాజకీయ క్రీడలో ఒకరిమీద ఒకరు పగ తీర్చుకుంటారేమో కానీ అసలు దుర్మార్గులు చస్తారో లేదో మాత్రం తెలియదు. .... మరి అలాంటప్పుడు హెల్ప్ కోసం వేరే వాళ్ల దగ్గరకు వెళ్ళకుండా, మా మీద నమ్మకం లేనప్పుడు మా దగ్గరకు ఎందుకు వచ్చావు. .... ఖాన్ భాయ్ చెప్పారని నేను మీ దగ్గరకు వచ్చాను. అతనికి మీ మీద నమ్మకం ఉంది. లేదంటే నేను మీ దగ్గరకు వచ్చే వాడిని కాను.

అయినా నా దగ్గర ఉన్న సాక్ష్యాలను తీసుకొని నేను వేరే పార్టీ వారి వద్దకు వెళితే చాలా సంతోషంగా నాకు హెల్ప్ చేయడానికి సిద్ధపడతారు. ఎందుకంటే ఆ సాక్షాలతో అమిత్ గాడికి కచ్చితంగా శిక్ష పడుతుంది. అమిత్ గాడి వలన వర్మ పదవి కూడా ఊడిపోయే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది. దానివలన ఎదురు పార్టీ వారికి చాలా లాభం కలుగుతుంది. మీరు నాకు హెల్ప్ చేయకూడదు అనుకుంటే అది మీ ఇష్టం. ఓకే ఇక నేను బయలుదేరుతాను అనవసరంగా మీ టైం వేస్ట్ చేశాను మీతో పాటు నా టైం కూడా వేస్ట్ చేసుకున్నాను అంటూ కొంచెం పొగరుగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నట్టు కొంచెం నాటకం ఆడాను. నిజానికి నాకు వాళ్ళ హెల్ప్ చాలా అవసరం.

అరరే ఎక్కడికి వెళ్లిపోతున్నావు. నీ గురించి ఖాన్ చెప్పినట్టే ఉన్నావు. ఖాన్ నీ గురించి చెప్పింది అంతా నిజమో కాదో అని కొంచెం నీతో తమాషా చేశాను అంతే. ఖాన్ నీ గురించి కొంచెం ఎక్కువ చేసి చెప్పాడేమోనని అలా మాట్లాడాను అంతే. .... ఓహో,, మరైతే ఖాన్ భాయ్ నా గురించి చెప్పింది నిజమనుకుంటున్నారా లేదా అబద్ధం అనుకుంటున్నారా? .... ఖాన్ నీ గురించి చెప్పింది 100% కరెక్ట్. నేను నీతో తమాషా చేశాను సన్నీ. కానీ నీకు మా హెల్ప్ కావాలంటే మాత్రం నువ్వు మమ్మల్ని నమ్మి తీరాలి. ఈరోజుల్లో రాజకీయ నాయకులను నమ్మడం కష్టమే అని నాకు తెలుసు సన్నీ. కానీ అందరూ ఒకేలా ఉండరు కదా.

ఎలాగైతే నువ్వు అమిత్ కి శిక్ష పడేలా చేసి మీ కాలేజీ లోని అమ్మాయిలను రక్షించాలని అనుకుంటున్నావో అలాగే మేము కూడా తన పవర్ ను మిస్ యూజ్ చేస్తున్న వర్మను ఈ రాజకీయాల నుంచి దూరం చేయాలని చూస్తున్నాము. మన ఇద్దరి ఉద్దేశ్యము ఒకటే సన్నీ. నువ్వు ఆ వీడియోలు ఇవ్వకపోయినా నాకు చూపించగలవు కదా. .... మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తప్పకుండా చూపించగలను. .... ఇప్పుడు చూపించగలవా? .... ఆ వీడియోలు నా లాప్ టాప్ లో ఉన్నాయి. లాప్టాప్ కూడా నా దగ్గరే ఉంది. కానీ తొందరపడి ఆమెకు ఆ వీడియోలు చూపించకూడదు అని అనుకొని, ఆ వీడియోలు ఇప్పుడు మీకు చూపించలేను. ఎందుకంటే ఇప్పుడు అవి నా దగ్గర లేవు. వాటిని కొంచెం రహస్యంగా దాచి పెట్టాను. కానీ మరోసారి మీరు ఎప్పుడు అడిగినా నేను వాటిని మీకు చూపించగలను.

సరే అయితే ఇప్పుడు నువ్వు వెళ్ళు. నేను మంత్రి గారితో మాట్లాడిన తర్వాత నీకు చెబుతాను అంటూ ఆమె కుర్చీలోంచి లేచి నిలుచుంది. ఆమె నా వైపు చెయ్యి చాపగానే నేను కూడా నా చేతిని ముందుకు చాచి ఆమెతో కరచాలనం చేసి డోర్ వైపు నడిచాను. అప్పుడు ఆమె మాట్లాడుతూ, ఒక్క నిమిషం ఆగు సన్ని. నువ్వు ఇక్కడికి వచ్చి నాతో మాట్లాడిన విషయాలు అన్నీ ఖాన్ నాతో ఫోన్ లోనే చెప్పి ఉండొచ్చు కదా. నువ్వు సాక్ష్యాలు తీసుకొని వస్తావని నేను అనుకున్నాను. .... నేను సాక్షాలు చేతిలో పట్టుకుని తిరగను మధు మేడం. ఇకపోతే ఖాన్ భాయ్ మీతో మొత్తం విషయం చెప్పలేరు. ఎందుకంటే ఆ చనిపోయిన అమ్మాయిలలో ఒకరు ఖాన్ భాయ్ చెల్లెలు. .... నా మాట విన్న మధు ఏమీ మాట్లాడలేక నోరెళ్ళబెట్టింది. నేను డోర్ ఓపెన్ చేసుకొని ఆఫీస్ నుంచి బయటకు వచ్చాను. అక్కడి నుంచి కారులో బయలు దేరిన వెంటనే నాకు కవిత దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. నేను కవితతో మాట్లాడబోతుండగా ఫోన్లో వెనుకనుంచి సోనియా ఎవరితోనో ఆర్గ్యుమెంట్ చేస్తున్నట్టు గోలగోలగా వినిపిస్తుంది.

హలో సన్నీ ఎక్కడున్నావ్ నువ్వు? తొందరగా మీ ఇంటి దగ్గరికి వచ్చెయ్ అంటూ కొంచెం చిరాకు పడుతూ అంది కవిత. .... అంత చిరాగ్గా ఉన్నావ్ ఏంటి కవిత? వెనుక నుండి సోనియా మాటలు వినపడుతున్నాయి. ఎవరితోనైనా గొడవ పడుతుందా? .... ఎవరితోనూ లేదు కానీ ముందు నువ్వు తొందరగా మీ ఇంటి దగ్గరికి వచ్చెయ్ అంటూ కవిత ఫోన్ కట్ చేసింది. కవిత చిరాగ్గా మాట్లాడటంతో నేను కొంచెం కంగారు పడి వెంటనే వేగం పెంచి మా ఇంటికి బయలుదేరాను. ఇంటికి చేరుకుని చూసేసరికి సోనియా ఇంటికి కాపలాగా ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్లతో ఆర్గ్యుమెంట్ చేస్తుంది.

సోనియా ఇంట్లోకి వెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉంటే సెక్యూరిటీ ఆఫీసర్లు సోనియాను లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. నేను వెంటనే కారు దిగి సోనియా దగ్గరకు వెళ్లాను. .... ఇది మా ఇల్లు. మమ్మల్ని మా ఇంట్లోకి ఎందుకు వెళ్ళనివ్వడం లేదు అంటూ సోనియా సెక్యూరిటీ ఆఫీసర్ల మీద అరుస్తుంది. .... చూడండి మేడం ఇంకా ఇన్వెస్టిగేషన్ పూర్తవలేదు. మా పని పూర్తయ్యే వరకు మిమ్మల్ని లోపలికి అనుమతించ లేము. మాకు పైనుంచి ఆర్డర్లు ఉన్నాయి. మేము ఏమీ చేయలేము అని సెక్యూరిటీ ఆఫీసర్లు అంటున్నారు. కానీ సోనియా వాళ్ళ మాట వినడం లేదు. ఏం చేస్తాం సోనియా అంత మొండిది మరి.

అప్పుడు నేను ఖాన్ భాయ్ కి ఫోన్ చేసి అక్కడ నుంచి కొంచెం దూరంగా జరిగి ముందు నేను వెళ్లిన పని గురించి అక్కడ మాట్లాడిన మాటల గురించి వివరంగా చెప్పి తర్వాత సోనియా మరియు సెక్యూరిటీ ఆఫీసర్ల మధ్య జరుగుతున్న ఆర్గ్యుమెంట్ గురించి చెప్పాను. దాంతో ఖాన్ బాయ్ నా ఫోన్ ఆ సెక్యూరిటీ అధికారి వాళ్లకి ఇవ్వమని చెప్పారు. వాళ్లు ఖాన్ భాయ్ తో మాట్లాడిన తర్వాత మమ్మల్ని ఇంట్లోకి పంపించారు. ఖాన్ భాయ్ నాతో మాట్లాడుతూ ఇన్వెస్టిగేషన్ ప్రక్రియ పూర్తయిందని ఫోరెన్సిక్ నిపుణులు కూడా వాళ్లకు కావాల్సిన సమాచారాన్ని సేకరించడం పూర్తయిందని ఇప్పుడు మేము ఇంట్లోకి వెళ్లడానికి ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పారు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ మొత్తం ఎక్కువగా బయట రక్తం కారిన చోటే జరిగిందని లోపల వాళ్లకు ఎటువంటి సాక్ష్యాలు దొరకలేదని లోపల కేవలం దొంగతనం మాత్రమే జరిగినట్టు నిర్ధారణకు వచ్చారని నాతో చెప్పారు. మేము ముగ్గురం కలిసి ఇంట్లోకి వెళ్లాము.
Next page: Episode 102
Previous page: Episode 100