Episode 63
అక్కడ ఆలా మన భరత్ గారు బాధ పడుతూ ఉంటె ఇక్కడ మన మేడం ఎందుకు బిందు ఇంటికి వెళ్లిందో తెలుసుకుందాం..
వనజ వెళ్ళాక ఆరోజు రాత్రి మేడం...
రూమ్ లో పడుకుని భరత్ గాడి గురించి ఆలోచిస్తూ ఉండగా, అప్పుడే బిందు గుర్తొచ్చింది. ఇది సాయంత్రం ఇచ్చిన రెస్పాన్స్ చూస్తే, దీనికి నేను భరత్ కలవడం ఇష్టం లేనట్లు ఉంది అని అనిపించింది. అలా అనిపించగానే, మరి రేపు పొద్దున్న పెళ్ళిలో వాడు నాతో మాట్లాడడానికి వస్తే, ఇది ఏమైనా ఆపుతుందా ? అని అనిపించింది. ఒకవేళ అసలు వాడు మాట్లాడడానికి రాక ముందే వాడిని తన్ని తిరిగి వెనక్కి పంపిస్తే ? అప్పుడెలా అని అనిపించింది. అంతే వెంటనే లేచి అటు ఇటు తిరుగుతూ ఆలోచించడం మొదలుపెట్టా. వాడు ముందే నాతో మాట్లాడడం లేదు. అలాంటిది ఇప్పుడు ఇది వెళ్లి రేపు పెళ్ళిలో వాడిని ఏదో ఒకటి అని నాతో పూర్తిగా మాట్లాడనివ్వకుండా చేస్తే అప్పుడు ఎలా అని అనిపించింది అంతే, వెంటనే దీని గురించి ఏదో ఒకటి చేయాలి అని అనిపించింది. పొద్దున్నే బిందు దగ్గరికి వెళ్లి ఏదో ఒకటి తేల్చుకుందాం అని అనుకుని రేపొద్దున బిందు తో ఎం చెప్పి కన్విన్స్ చేయాలో అని ఆలోచించడం మొదలు పెట్టింది..
అలా మేడం పొద్దున్న బిందు ఇంటికి వెళ్ళింది....
బిందు ఇంటికి వచ్చి తలుపు కొడుతుంటే, కాసేపటికి బిందు వచ్చి తలుపు తెరిచింది. నేను మాట్లాడేలోపే బిందు శ్ అంటూ సైలెంట్ గా ఉండమని సైగ చేసింది. నేను ఏమైంది అంటూ సైగ చేశా. బిందు హాల్ లోకి చూసి మల్లి నన్ను చూస్తూ కాసేపు ఇంటి వెనుక వెయిట్ చేయి నేను పిలుస్తా అని చిన్నగా చెప్తూ వెంటనే కాస్త గట్టిగా పాల డబ్బులు రేపు ఇస్తా, రేపు రా అంటూ తలుపు వేసేసింది. నేను కాస్త తికమక పడ్డా. ఏదో కారణమ్ ఉండబట్టే ఇలా చెప్తుంది లే అని బిందు ఇంటి వెనుక వైపుకు వేళ్ళ. అక్కడ కిచెన్ నుండి లోపలి వెళ్ళడానికి ఒక డోర్ ఉంది. అది ఓపెన్ లోనే ఉండడం తో లోపలి వెళ్ళా.
ఎం జరుగుతుంది అని అంత బిల్డ్ అప్ ఇచ్చింది ఇది అని అనుకుంటూ కిచెన్ నుండి హాల్ లోకి వెళ్ళా. అక్కడ మా అయన గొంతు వినిపించింది. అంతే ఎం జరుగుతుంది ఇక్కడా ? అని చాటుగా నిల్చుని వాళ్ళేం చేస్తున్నారో చూసా. బిందు, మా ఆయన ఇద్దరు సోఫా లో ఎదురు ఎదురుగా కూర్చుని మాట్లాడుకుంటూ కనిపించారు. మా అయన ఎం చేస్తున్నాడు ఇక్కడ అని చూసా.
సిద్దు నాన్న : చెప్పు బిందు అసలు భరత్ కు సంధ్య కు మధ్య ఎం జరుగుతుంది ?
బిందు : అన్నయ్య అసలు మీరు ఎం అనుకుంటున్నారో చెప్పలేదు. అసలు ఎం చూసి ఎం జరిగింది అని అనుకుంటున్నారో ముందు చెప్పండి అంది
సిద్దు నాన్న : హ్మ్మ్ అంటూ నిట్టూరుస్తూ చెప్పడం మొదలు పెట్టాడు..
సంధ్య ను కొన్ని రోజుల నుండి గమనిస్తున్న. తను ఏదో మధనపడుతూ ఉంది. అప్పట్లా లేదు. ఇది కేవలం భరత్ దూరం అయ్యాడు అందువల్లే లోన్లీ గా ఫీల్ అవుతూ ఇలా అయ్యింది అని అనుకోవడం లేదు. ఎందుకు అంటే వాళ్ళని చూసావ్ గా వాళ్ళు ఎంత క్లోస్ గా ఉండేవాళ్ళో. అప్పట్లో రెండు రోజులు ఊరు వెళ్తేనే తను వాడికి ఎన్ని సార్లు కాల్ చేసిందో ఎన్ని సార్లు తలుచుకుందో. ఒక వేళ నిజంగా భరత్ లేనందుకు అంత లోన్లీ గా ఫీల్ అయ్యే వున్నింటే తను ఇంతలోపు వాడిని ఇక్కడికి పిలిపించుకుని మల్లి సంతోషంగా ఉండేది. కానీ తను ఆ పని చేయడం లేదు. వాడు కూడా వెళ్లి నెలలు అయ్యింది. అసలు చిన్న ఫోన్ లేదు, ఒక మాట లేదు ఎం లేదు. అసలు వాళ్ళు ఉన్న క్లోస్ నెస్ కు వాళ్ళు ఇన్ని రోజులు మాట్లాడుకోకఉండడానికి అసలు సంబంధమే లేదు. ఏదో ఒకటి జరగకుండా ఇద్దరు ఎందుకు అసలు పూర్తిగా మాట్లాడుకోవడం మానేశారు. పోనీ నేను లేనప్పుడు మాట్లాడుకుంటున్నారు అని అనుకున్నా కూడా, ఏదో ఒక సందర్భం లో నాకు తను చెప్పేది. భరత్ గాడితో మాట్లాడాను ఇవ్వాళ అని. కానీ ఇన్ని రోజుల్లో ఎప్పుడు కూడా వాడి ప్రస్తావనే రాలేదు. అప్పట్లో ఏమో తను రోజూ వాడి గురించి చెప్పేది. నాకే విసుగు వచ్చేంతలా. కానీ ఇప్పుడు ఏమో అసలు వాడి పేరే ఎత్తడం లేదు. నిన్న నువ్వు చూసావా ? తన ముఖం లో ఈ మద్య ఎన్నడూ లేనిది, భరత్ గాడు వస్తున్నాడు అనే మాట వినగానే ఎంత వెలుగు వచ్చిందో ? నువ్వు కూడా గమనింఛావ్గా..
ఒకవేళ వాళ్ళిద్దరి మధ్య ఏమి జరగక పోయే ఉంటె, తను ఎందుకు అంతలా రియాక్ట్ అవుతుంది ? అదేదో భరత్ కోసం ఎన్నాళ్ళ నుండో వెయిట్ చేస్తున్న దానిలా ఎందుకు రియాక్షన్ ఇస్తుంది ? ముముల్గా వాళ్ళిద్దరి క్లోస్ నెస్ చూస్తే, వాళ్ళు వేరు వేరు ఊర్లో ఉన్నా కూడా రోజూ ఫోన్ లో మాట్లాడుకుంటారు లే అనే అనుకుంటారు. కానీ తనను చూస్తే అలా అనిపించడం లేదు. భరత్ కోసం వెయిట్ చేస్తుందేమో అన్నట్లుగా అనిపిస్తూ ఉంది. అంతగా ఒకవేళ వెయిట్ చేసే పాటైతే వెళ్లి డైరెక్ట్ గా కలవచ్చు కదా. ఎందుకు అలా చేయడం లేదు. రాత్రిళ్లు అయితే, వాడి రూమ్ లోకి వెళ్లి ఎందుకు నిద్ర పోతుంది. భరత్ గాడి షర్ట్ ను వాటేసుకుని ఎందుకు పడుకుంటుంది. అసలు ఎం జరుగుతుంది ? నాకేం క్లారిటీ లేదు, నువ్వే చెప్పాలి. నాకు నిజం తెలియాలి అంతే..
ఇదే నాకు తెలిసింది. ఇప్పుడు చెప్పు. అసలు ఎం అయ్యింది ?
భరత్ సంధ్య ఎందుకు మాట్లాడుకోవడం లేదు. ఎందుకు భరత్ పేరు ఎత్తగానే నిన్న సంధ్య ముఖం లో అంత ఆనందం వచ్చింది ? ఎం జరుగుతుంది ? చెప్పు అన్నాడు.
ఇదంతా వింటున్న నేను ఒక్కసారిగా గుండె ఆగినట్లు నిలబడ్డా.
కొంపదీసి ఈ బిందు గాని ఎం జరిగిందో చెప్పేస్తుందా ? అని అనుకున్నా. ముందే నన్ను భరత్ ను విడదీయాలని ఉంది తనకు ఇది ఇప్పుడు తనకు సువర్ణ అవకాశం. మా గురించి చెప్పేస్తే ఇక మమ్మల్ని ఎప్పుడు కలవకుండా చేయొచ్చు తను. ఈ అవకాశాన్ని ఎలా వాడుకుంటుంధో ఏమో తను అని అనుకుంటూ తన వంక చూసా. తను ఎం చెప్తుందా అని. మనసులో గట్టిగా ప్లీజ్ బిందు చెప్పకు ప్లీస్ అనుకుంటూ ఉన్నా.
ఇలా మేడం అనుకుంటూ ఉంటె అక్కడ బిందు ఇంకోలా ఆలోచిస్తూ ఉంది.
బిందు : (వామ్మో వీడెంటి ఇలా అడుగుతున్నాడు. ఇప్పుడు ఎం చెప్పాలో ఏంటో వీడికి అని అనుకుంటూ) అన్నయ్య, అది అంటూ ఏదో చెప్పబోయింది.
సిద్దు నాన్న : నిజం చెప్పు బిందు. కవర్ చేయాలనీ మాత్రం చూడకు. ఆలా కవర్ చేసిన స్టోరీ నే వినాలి అనుకుంటే సంధ్య నే ఈ విషయం అడిగేవాడిని. నీ దగ్గరికి వచ్చే వాడిని కూడా కాదు. అది అర్ధం చేసుకుని నిజం చెప్పు... అన్నాడు
మేడం కంగారుగా చూసింది
ఇక్కడ బిందు : (వీడేదో చేసేలా ఉన్నాడు ఈరోజు అని అనుకుంటూ) అయ్యో అన్నయ్య్య అంత మాట ఎందుకు లే అన్నయ్యా. నీ చెల్లెలిని నీకు నిజం చెప్పనా ? ఏంటి అంటూ నోరు విప్పింది...
నిజానికి సంధ్య భరత్ ల మధ్య అంటూ చెప్పుకుంటూ వస్తుండగానే.. ఇక్కడ మేడం ఒక పని చేసింది
గుండె వేగంగా కొట్టుకుంటూ ఉండగా పక్కన ఉన్న కత్తి తీసుకుంది. ఈ పని చేస్తుంది అని థానే అనుకోలేదు. పక్కన ఉన్న కత్తి తీసుకుని బిందు ముందుకు వెళ్ళింది. సిద్దు నాన్న బిందు వైపు తిరిగి ఉండడం వల్ల అతనికి మేడం కనిపించలేదు. మేడం అలా సడెన్ గా తన ముందుకు రాగానే ఒక్కసారిగా ఆశ్చర్య పోతూ అంతలోనే తేరుకుని ఏమీ జరగలేదు అన్నట్లుగా నటిస్తూ మేడం ను ఒర కంట చూసింది. చూస్తూ సిద్దు నాన్న తో మాట్లాడుతూనే ఏంటి వచ్చావ్ అన్నట్లుగా చూసింది. మేడం అది చూసి ఆయనకు నిజం చెప్పకు. చెప్తే చేయి కోసుకుంటాను అని కత్తి చేతి దగ్గర పెట్టుకుని బెదిరించింది. అంతే బిందు ఉఫ్ అనుకుంటూ తల దించుకుంది. సిద్దు నాన్న ఏమైంది తనకు అన్నట్లుగా చూసాడు. బిందు తల మీద చెయ్యి పెట్టుకుని ఇదొకటి మధ్యలో అని అనుకుంటూ ఇంకో
పక్క సిద్దు నాన్న ఏమైంది అంటుంటే తల పైకి ఎత్తుతూ ఎం లేదులే అన్నయ్యా అని కాస్త విసుగ్గా చెప్పేసి, మళ్ళీ అంతలోనే సిద్దు నాన్న కు తన ఎక్స్ప్రెషన్స్ అర్దం కాకుడదు అని మళ్ళీ మామూలుగానే చూస్తూ చెప్తున్నట్లు నటించింది. సిద్దు నాన్న కు ఎదో చెప్తూనే, అతని వెనుక ఉన్న మేడం తో మూసుకుని ఆ కత్తి పక్కన పెట్టు అన్నట్లు సైగ చేసింది. నిజంగా ఇలా బెదిరిస్తుంది అని మేడం కూడా అనుకోలేదు. ఇక ఇక్కడ బిందు ఎం సాకు చెపుదామా అని ఆలోచిస్తూ ఉండగా, సిద్దు నాన్న నువ్వు లెట్ చేసేకొద్ది అక్కడ ఇంకేదో పెద్ద విషయమే జరిగింది అని నేను అనుకోవాల్సి వస్తుంది బిందు. జరిగింది ఏదో త్వరగా చెప్పు అన్నాడు."