Update 01

ఈ కథ కేవలం ఊహించి రాసినదే ...

ఈ కథలో వుండే పాత్రలు. పాత్రధారులు .కేవలం కల్పితం మాత్రమే..ఎవర్ని ఉద్దేశించినవి కావు.

ఒకవేళ ఎవరి మనోభవాలు అయినా దెబ్బతిన్నట్లు అయితే మన్నించ మనవి..

కథ లో వుండే .. క్యారెక్టర్స్

..................................................................................................

రఘునాథయ్య(ముసలాయన) -రెబెల్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు..

రాజేంద్ర వర్మ - ముఖ్యమంత్రి(రెబెల్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు..)

అనుష్క - ముఖ్యమంత్రి భార్య....

రాజారవీంద్ర వర్మ - ముఖ్యమంత్రి కొడుకు..

అనసూయ - రెబెల్ పార్టీ లో ఒక కీలక మహిళా నేత

ఆనందరావు - ఉపముఖ్యమంత్రి

నయనతార-TV XXX రిపోర్టర్ and ఉపముఖ్యమంత్రి భార్య

వీరేంద్ర అగర్వాల్ -ప్రతిపక్ష నాయకుడు

కాజల్-వీరేంద్ర అగర్వాల్(ప్రతిపక్ష నాయకుడు) కుమార్తె

స్నేహ- సెక్యూరిటీ అధికారి ఆఫీసర్..

ఇంకా ఇవే కాకుండా సందర్భాన్ని బట్టి కొన్ని పాత్రలు కూడా వస్తాయి...

XXX TV రిపోర్టర్ నయనతార తెల్ల తెల్లవారగానే.. టీవీ ఛానల్ లో అందరికి ఫోన్ చేసి.. తోటి రిపోర్టర్స్ అందరిని అలెర్ట్ చేస్తూ..ఈ వార్త మనకే ముందు వచ్చింది..కమాన్ త్వరగా టెలికాస్ట్ చెయ్యండి..ఎవరూ ఊహించని వార్త..ఇలా జరుగుతుంది అని ఎవరూ అనుకుని వుండరు..

ఇది చాలా బాధాకరమైన విషయం....అంది..దాంతో ఒక్కసారిగా ఆ వార్త న్యూస్ ఛానల్ లో గుప్పుమంది

మరి కాసేపటి ఆ వార్త ఆ ఛానల్ లోనే కాకుండా అన్ని చానెల్స్ లో పాకిపోయింది..

బ్రేకింగ్ న్యూస్...బ్రేకింగ్ న్యూస్..నిన్న రాత్రి జరిగిన భారీ కారు ప్రమాదం లో..మన ప్రియతమ నాయకుడు..ముఖ్యమంత్రి గౌరవనీయులు రాజేంద్ర వర్మ గారు దుర్మరణం పాలయ్యారు...

అసలు ఈ కార్ ప్రమాదం ఎలా జరిగింది .

ఇది అసలు ప్రమాదం యేనా, లేదా ఇందులో ఏదన్నా కుట్ర దాగి వుందా.. అంటూ.. XXX ఛానల్ తో పాటు అన్ని టీవీ చానెల్స్ లో..క్షణం తీరిక లేకుండా..

వార్తలు దంచికొడుతున్నారు..

రాష్ట్రం అంతా అట్టుడుకుతోంది

ముఖ్యమంత్రి గారి అభిమానులు..అయన అనుచర వర్గం ఇంటి ముందు గుమి కూడి వున్నారు..

ముఖ్యమంత్రి భార్య అనుష్క..బుజం చుట్టూ చెర కొంగు చుట్టుకుని..దీనం గా ఏడుస్తూ కూర్చుంది..

ముఖ్యమంత్రి బాబాయ్. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు .రఘునాథయ్య అపుడే కార్ లో నుండి దిగి. ముఖ్యమంత్రి పార్థివ దేహానికి..పూల మాల వేసి..ఏడుస్తూ కూర్చున్న అనుష్క దగ్గరకి వెళ్లి ఓదారుస్తున్నాడు

తండ్రి మరణ వార్త తెలుసుకున్న ముఖ్యమంత్రి కొడుకు..రాజా..రామ్ వర్మ హుటాహుటిన..ఆస్ట్రేలియా నుండి. వచ్చాడు..

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. .ఆనందరావు. . .తదుపరి కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చూస్తున్నారు.

అప్పుడే పార్టీ లో కీలక మహిళా నేత అనసూయ.. తన అనుచర వర్గం అయిన 25 మంది ఎమ్మెల్యేలతో తో వచ్చి..

ముఖ్యమంత్రి పార్థివ మృతదేహానికి..పూల మాల వేసి ముఖ్యమంత్రి గురించి..కాసేపు ఉపన్యాసం దంచి..కాబోయే ముఖ్యమంత్రి తానే అన్న రేంజ్ లో..

కాసేపు హడావుడి చేసింది..

ప్రతిపక్ష నాయకుడు..ఇంకా సెంటర్ నుండి పెద్దలు ఇలా ..

ప్రముఖులందరి రాకపోకలు మధ్య..వేలాది అభిమానుల మధ్య రాజేంద్ర వర్మ అంతిమ వీడ్కోలు ప్రభుత్వ లాంఛనాలతో ఘనం గా జరిగింది...

...............................................................

రెండు రోజులయ్యాక.. పార్టీ నేతల మధ్య..తదుపరి నాయకుడు ఎవరు అన్న చర్చ మొదలయ్యింది..కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అని రచ్చ మొదలయ్యింది..

అందరూ..పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు రఘనాథయ్యని కానీ..ముఖ్యమంత్రి భార్య అనుష్కని ఉండమన్నారు..

అనుష్క..అందరికి నమస్కారం పెట్టి..తనకు రాజకీయాలు కొత్త..అసలే ఆడదాన్ని ఇన్నాళ్లు భర్తే సర్వస్వము అని బ్రతికా ఈ రొంపిలోకి నన్ను లాగొద్దు అని చెప్పింది..

పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు రఘునాథయ్య "తనకు వయసు అయిపోయింది ..తన వల్ల కాదు అని.. తన కొడుకు తరువాత కాబోయే ముఖ్యమంత్రి కోసం ఒక నలుగురు ఐదుగురు నాయకులని పరిశీలిస్తున్నాను తర్వాతి ముఖ్యమంత్రిని నా సహాయ సహకారం వంద శాతం ఉంటాయి" అన్నాడు..

ఇంకో పక్క..ప్రతిపక్షం నాయకుడు.వీరేంద్ర ..తన ఎమ్మెల్యే లతో అత్యవసర సమావేశం పెట్టాడు..

"అసలే బొటాబొటి మెజారిటీ ఉన్న ప్రభుత్వం.. ముఖ్యమంత్రి చనిపోయాడు...

ఆ తర్వాత సరైన నాయకుడు లేడు. హోమ్ మినిస్టర్.. ఉప ముఖ్యమంత్రి ..ఎవరికి అంత సీన్ లేదు ప్రజల్లో అంత పాపులారిటీ లేదు....

అధికార పక్షం లో ఉన్న ఎమ్మెల్యే లో కనీసం 20 మందికి మనం గాలం వేస్తే .వాళ్ళని మన వైపుకి తిప్పుకుని ఆ పీఠం మీద .నేనే కూర్చోవచ్చు" ..అని ఎమ్మెల్యే లతో చెప్పి అందరిని ఆ పనిలో వుండండి అన్నాడు

టీవీ చానెల్స్ లో రక రకాల డిబేట్స్ న్యూస్ వస్తున్నాయి..

కాబోయే ముఖ్యమంత్రి.... ఎవరు... ఎవరు ...అని..సౌమ్యుడు..అతి మంచి వాడు అయిన ఉప ముఖ్యమంత్రి ఆనందరావు అవుతాడా..లేక..

హోమ్ మినిస్టర్ అవుతాడా లేక మహిళా కోటా కింద పార్టీ పెట్టినప్పటి నుండి ఉన్న అనసూయ కి అవకాశం ఇస్తారా అని జోరుగా చర్చలు జరుగుతున్నాయి..

.........................

ఇంతలో ..పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు..రఘనాథయ్య పార్టీ ఎమ్మెల్యే లు అందరిని..పొద్దు పొద్దునే పార్టీ ఆఫీస్ లో సమావేశానికి రమ్మన్నాడు..

దాంతో అందరిలో ఉత్కంఠ నెలకొని వుంది..సమావేశానికి అందరూ హాజరు అయ్యారు.

సమావేశం మొదలు అయిన కాసేపటికి రఘునాథయ్య కాబోయే కొత్త ముఖ్యమంత్రిగా....చనిపోయిన రాజేంద్ర వర్మ కొడుకు రాజా రామ్ వర్మ ని ప్రకటిస్తున్నట్లు తీర్మానం చేసాడు...

రాజా రామ్ వర్మ పేరు ప్రకటించగానే రాజా..పక్క నుండి..వినయం గా చేతులు కట్టుకుని వచ్చి తాత పక్కన నిలబడ్డాడు..

పార్టీ నేతలు అందరిలో..గుస గుసలు మొదలయ్యాయి.."అదేంటి పెద్దాయన ఆలా ప్రకటించాడు..వున్నట్లుండి ఈ కుర్రాడి పేరు.. ఈ కుర్రాడికి అసలు అనుభవం ఏముంది మన రాష్ట్రం గురించి ఏం తెలుసు"..అనుకుంటున్నారు..

కానీ.పార్టీ ఎమ్మెల్యేలో మెజారిటీ వర్గం ఉప ముఖ్యమంత్రి... హోమ్ మంత్రి ఇలా .. ఒక్కొక్కరిగా లేచి..రాజా రామ్ వర్మకి మద్దతు తెలుపుతున్నారు..

ఆలా మద్దతు తెలపడానికి కారణం రాజా రామ్ వర్మ అంతకు ముందే తన కున్న నెట్ వర్క్ ద్వారా..

తనకున్న తెలివి తేటల ద్వారా ఏ మీడియా కంట పడకుండా అధికార పార్టీ లో ప్రతి ఒక్క ఎమ్మెల్యే ని ఆ ఎమ్మెల్యే అనుచర వర్గాన్ని కలిసి..వాళ్లలో తన తండ్రి సెంటిమెంట్ రాజేసి..ఒక్కొక్కడికి ఏమేమి కావాలో కనుక్కుని మొత్తం ఏర్పాట్లు చేసి కాబోయే ముఖ్యమంత్రిగా తనకి మద్దతు తెలిపేలా .వాతావరణం కలిపించుకున్నాడు..

కానీ..సమావేశం లో ఒక పక్క కూర్చున్న అనసూయ వర్గం ఆమెతో పాటు 25 మంది ఎమ్మెల్యేలు మాత్రం మద్దతు తెలపకుండా...

తీవ్రం గా వ్యతిరేకించారు..అక్కడ కుర్చీలుఅన్ని విరగొట్టి నానా రభస చేసారు..

అనసూయ కోపంగా కుర్చీన్న కుర్చీలో నుండి లేచి .."ఇన్నాళ్లు పార్టీ కోసం పని చేస్తే మీరు వారసత్వానికి విలువ ఇస్తారా..నేను నా తరుపు ఎమ్మెల్యేలు..రాజా రామ్ ఏ మాత్రం సపోర్ట్ ఇవ్వము రాజీనామా కి అయిన సిద్ధమే" అని. వెళ్ళిపోయింది. .

ఆమె వెనకే 20 మంది ఎమ్మెల్యేలు కూడా వెళ్లిపోయారు ఒక 5 గురు మాత్రం వెళ్లకుండా గమ్మున వున్నారు..

రఘునాథయ్య ఈ పరిణామాన్ని ఊహించలేదు.

ఒకవేళ..ఆ 20 మంది ఎమ్మెల్యే లని పార్టీ నుండి బహిష్కరిద్దాం అంటే ఇన్నాళ్లు కాపాడుకుంటున్న పార్టీ..అతలాకుతలం అయిపోతుంది..అన్న భయం తో ఆలోచిస్తున్నాడు

ఇలా మీటింగ్ జరుగుతుండగానే ఇంకో పక్క అన్ని మీడియా ఛానల్స్ లో రాష్ట్ర రాజకీయాలలో కొత్త పేరు..కాబోయే ముఖ్యమంత్రి గా రాజా రామ్ వర్మ ..

అసలు ఎవరు ఈ రాజా రామ్ వర్మ ఆస్ట్రేలియా ఏం చేసే వాడు . అసలు ముఖ్యమంత్రి పదవికి అర్హుడేనా ...

అసలు పార్టీ లో అందరూ అతన్ని సపోర్ట్ చేస్తున్నారా..కొన్ని వర్గాలు తీవ్రం గ వ్యతిరేకిస్తిన్నాయి అంటూ రక రకాల కథనాలతో హోరెత్తించాయి...

తదుపరి ముఖ్యమంత్రి అవుతాడా అవ్వడం అన్న చర్చ జోరుగా నడుస్తుంది..

పార్టీ కార్యాలయం అంత గందర గోళం గా వుంది.

అనసూయ వర్గం ఎమ్మెల్యేలు అందరూ సిటీ చివరన ఉన్న అనసూయ గెస్ట్ హౌస్ లో సమావేశ మయ్యారు...తరువాత తీసుకోబోయే నిర్ణయాల గురించి చర్చిస్తున్నారు..

"కొత్త ముఖ్యమంత్రిగా రాజా రామ్ వర్మ అవ్వడానికి వీలు లేదు . అనసూయ ని ముఖ్యమంత్రిగా ఉండాలి" అని తీర్మానించారు..

ప్రతి పక్ష నేత వీరేంద్ర అనసూయ వర్గం ఎమ్మెల్యేలకు గాలం వెయ్యడానికి ప్రయత్నిస్తున్నాడు.

అనసూయ వర్గం వాళ్ళు ప్రతిపక్షం నేత వీరేంద్ర కలిసి..గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్నారు అన్న ప్రచారం జోరుగా సాగుతుంది..

సాయంత్రం అయ్యింది..కాలానికి తగ్గట్లు జోరుగా వర్షం పడుతుంది..

అనసూయ గెస్ట్ హౌస్ లో తన వర్గ ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యింది.

తరువాత రోజు నుండి ఎలా నడుచుకోవాలో..చెపుతూ .."అందివచ్చిన అవకాశం వదులుకోకూడదు మనకి..ప్రతిపక్ష నాయకుడు..వీరేంద్ర కూడా సపోర్ట్ ఇస్తా అంటున్నాడు.. ఎవరూ ఏ వత్తిళ్ళకి తలొగ్గొద్దు" అని..హితబోధ చేస్తుంది..

ఇంతలో అనసూయ పీఏ వచ్చి.."మాడం మిమ్మల్ని కలవడానికి రాజా రామ్ వర్మ వచ్చారు..మీతో ఏదో మాట్లాడాలి అంట" అన్నాడు

"పీఏ వంక కోపం గా చూసి ఈ టైం లో నేను లేను అని చెప్పాలి కదా" అని కటువుగా చెప్పి.."లోపలకి రమ్మను" అంది..

రాజా తెల్లని ఖద్దరు చొక్కా..తెల్లని ఖద్దరు పంచె మీద అంతటి జోరు వర్షం లో అనసూయ గెస్ట్ హౌస్ లోకి వచ్చి..

కుర్చీల్లో కూర్చున్న ఎమ్మెల్యేలకు నమస్కారం పెట్టి..అనసూయ ముందు చేతులు కట్టుకుని "మీతో మాట్లాడాలి" అన్నాడు..

ఇంత వర్షం లో కూడా ఇక్కడికి వచ్చాడు అంటే వీడిలో ముఖ్యమంత్రి కావాలని కుతూహలం బలం గా వుంది అనుకుని..

"హ మాట్లాడు..ఏం చెపుతావ్ ఆ" అంది గర్వం గ కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని.

రాజా వినయం గా చూస్తూ.చాల పద్దతిగా అనసూయ కి నమస్కారం పెట్టి...

"అనసూయ గారు మీతో ఒక విషయం మాట్లాడాలి..అది మన పార్టీ దాని భవిష్యత్తు గురించి. ఇక్కడ ఉన్న పెద్దలు అందరి రాజకీయ జీవితం ఈ పార్టీ లోనే మొదలయ్యింది..ఇప్పుడు అందరూ వేరే పార్టీ తో..కలిస్తే.. ఇక్కడ రాజు లాగా బ్రతికినోళ్లే ఒకడి చెప్పు చేతల్లో బ్రతకాల్సి ఉంటుంది..ఆలోచించుకోండి ".అన్నాడు.

అనసూయ ముక్కు నులుముకుని.."చూడు బాబు పార్టీ భవిష్యత్తుకేమి బాధ లేదు..నువ్వు ఎంటర్ అయ్యాకే ఈ రొచ్చు మొదలయ్యింది..నిన్న మొన్నటి వరకు బాగానే వుంది..నువ్వు పార్టీ భవిష్యత్తు ఆలోచించడం మాని నీ భవిష్యత్తు సంగతి చూసుకుని ఇంతకు ముందు లా ఆస్ట్రేలియా వెళ్లి పోతే మంచిది..నేను కానీ ఉపముఖ్యమంత్రి కానీ..తదుపరి నాయకత్వం తీసుకుని..మీ పార్టీ లోనే కొనసాగుతాం" అంది..

రాజా ఏం మాట్లాడకుండా ..చుట్టు పక్కల ఉన్న ఎమ్మెల్యే ల మీద ఒక చూపు వేసి. "నేను ఈ పరిస్థితిల్లో ..వెళ్లడం ఏం బాగుండదు . .పార్టీ ..వంద ఏళ్ళు బ్రతికుండటం డాడ్ కల ..పార్టీ ని సెంటర్ లెవెల్ లోకి తీసుకుని వెళ్ళాలి అని అయన ఆశయం" అన్నాడు ..

"పార్టీ ని..వంద ఏళ్ళు కాపాడాలి అని మీ నాన్న ఒక్కడి కలే కాదు బాబు ఇక్కడ మా అందరిదీ..అందుకే.ఇన్నేళ్ల పాటు కష్టపడ్డాం ఇప్పుడు అవకాశం వచ్చింది..ఆ అవకాశాన్ని నువ్వు తన్నుకుని పోతుంటే చూస్తూ ఊరుకోము.అందుకే మా దారి మేము చేసుకుంటున్నాం…

అయినా నువ్వు లేత కుర్రాడివి ..రాజకీయం అంటే.మాటలు కాదు తట్టుకోలేవు..నలిగిపోతావ్..ఇక్కడ నిన్ను నలిపేస్తారు .నువ్వేదో ఆ ముసలాడు రఘునాథయ్య మాటలు విని..ఎగురుకుంటూ ముఖ్యమంత్రివి అవుదాం అనుకుంటున్నావు..ముఖ్యమంత్రి అయినా రాష్ట్రాన్ని పాలించడం అంటే ముళ్ల కిరీటం పెట్టుకుని తిరగడమే” అంది..

అవును లేత కుర్రడిని .. చదువుకున్న వాడిని ..ఆ రకంగా చుస్తే ..రాజకీయాల్లో సెట్ అవ్వను కానీ ..ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితిల్లో ..మీ టైపు రాజకీయాలు చెల్లవు అంటూ ఒక్కో ఎమ్మెల్యే వైపు కఠిన చూపు చూస్తూ.. అనసూయ గారు మన పార్టీ భవిష్యత్తు గురించి మీతో ఏకాంతంగా మాట్లాడాలి ..మాట్లాడాక నేను కూడా మీ నాయకత్వాన్ని ఆమోదిస్తా అన్నాడు ..

రాజా అనసూయ నాయకత్వాన్ని ఆమోదిస్తా అనగానే అక్కడ ఉన్న ఆ వర్గ ఎమ్మెల్యేలు ఒకరి మొహాలు చూసుకున్నారు..​
Next page: Update 02