Update 05

అందరితో తన్నులు తిన్న తరువాత పదిహేను నెలలకి మళ్ళీ ఇంకో దెబ్బ పడింది, ఆ దెబ్బకి సుబ్బిగాడికి ఇటు ఊర్లో అటు సిటీలో మొహం చెల్లక ఎక్కడ ఉండాలో తెలీక బస్సు స్టేషన్ లో నిలబడ్డాడు. ఎదురుగా బెంగుళూరు బస్సు రెడీగా స్టార్ట్ అయ్యి ఉంది.

గంట కూర్చున్నాను జరిగినవన్ని గుర్తొచ్చాయి.. చిన్నప్పటి నుంచి అంతే అమ్మా నాన్న పోయారు, తాతయ్యకి నేనంటే ఇష్టం ఉన్నా ఏ కారణం చేతనో నన్ను దెగ్గరికి తీయలేక హాస్టల్లో వేసాడు. ఎంత మందిని ప్రేమించినా ఎంత మంది వెంట పడ్డా ఎవ్వరు నాకు దెగ్గర కాలేక పోయారు.

నేనేమి మదమెక్కి అమ్మాయిల వెంటపడను నాకంటూ ఎవరైనా తోడు దొరుకుతారేమో అన్న ఆశ అంతే అందులో కొంత మంది అమ్మాయిలు అస్సలు మనకి సెట్ అవ్వరు అనుకున్న వాళ్ళని నేను దూరం పెడితే మిగతా వాళ్ళు నన్ను దూరం పెట్టారు.

నాకంటూ ఇక్కడ ఉన్నది ఒక్క అరవింద్ గాడే, కానీ వాడు చాలా బలిసినోడు మనకి తిండికే దిక్కు లేదు, వాడు మాత్రం నన్ను ఎన్ని రోజులు భరిస్తాడు అందుకే ఇక్కడ నుంచి దూరంగా వెళ్లి బతుకుదామని నిర్ణయించుకున్నాను. కొత్తగా నాకంటూ ఒక గుర్తింపు వచ్చేదాక ఇక ఇక్కడ అడుగు పెట్టకూడదని గట్టిగా అనుకున్నాను.

కొంచెం చదువుంది ట్యూషన్స్ చెప్పుకునేందుకు అది సరిపోతుంది, అదీ కాకపోతే టాక్సీ నడుపుతాను, దానికంటే అంబులెన్సు ఇంకా ఈజీ ఎందుకంటే అరవింద్ కొనే కొత్త కొత్త కార్లలో వాడ్ని తిప్పేది నేనే.. నేను డ్రిఫ్ట్ చేస్తుంటే వాడికి పక్కన కూర్చుని ఎంజాయ్ చెయ్యడం ఇష్టం.. అంత బాగా నడుపుతాను కార్ ని.

కానీ ఇప్పుడు ఎక్కడికి వెళదామన్నా డబ్బులు సరిపోవు ఎలా అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ఒకమ్మాయి చుడిధార్ లో భుజానికి చిన్న బ్యాగ్ తొ టెన్షన్ గా ఫోన్ మాట్లాడుతూ నేరుగా బస్సు ముందుకు వచ్చి నిలబడి దిక్కులు చూస్తుంది.. ఎవరికోసమో ఏమో అని చూసాను కానీ పది నిమిషాలైనా ఎవ్వరు రాలేదు ఆ అమ్మాయి మోహంలో చెమటలు.. ఏదో టెన్షన్ లో ఉంది ఇంతలో ఒక జీప్ వచ్చింది అందులో నుంచి నలుగురు కత్తులతో దిగారు ఒక్కో బస్సు వెతుకుతుంటే ఆ అమ్మాయి అది చూసి బస్సు ఎక్కుతుంటే ఇంత అందమైన అమ్మాయికి ఎంత పెద్ద కష్టం అని తన దెగ్గరికి వెళ్ళాను.

సుభాష్ : ఏవండీ ఏమైనా ఇబ్బందా, ఇందాకటి నుంచి చూస్తున్నా టెన్షన్ పడుతున్నారు.

"అవునండి నేను బెంగుళూరు వెళ్ళాలి చాలా అర్జెంటు"

సుబ్బి : మరి మీ వెనక వాళ్లు ఎందుకు పడుతున్నారు..?

"నా కారుని వెంబడించారు, నేను తప్పించుకుని ఇక్కడికి వచ్చేసాను, వస్తున్నారు సాయానికి మా ఫ్రెండ్స్ రావాలి కానీ రాలేదు ఫోన్ ఎత్తట్లేదు వాళ్ళకి ఏమైనా జరిగేందేమో..." అని ఏడుస్తుంది.

సుబ్బి : కార్ పెట్టుకుని మరి ఇంకా ఎందుకండీ టెన్షన్..

"ఎంత స్పీడ్ గా వెళ్లినా వచ్చేస్తున్నారండి.." అని మా బస్సు వైపు వస్తున్న మనుషులని చూసి దూరంగా పరిగెత్తింది.. నేనూ తన వెనకే వెళ్ళాను.

సుబ్బి : మిమ్మల్ని సేఫ్ గా బెంగుళూరులో డ్రాప్ చేస్తాను కానీ నా దెగ్గర డబ్బులు లేవు.. కొంచెం ఈ జాబ్ నాకు ఇచ్చారంటే చేసి పెడతాను.

"ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను, పదండి అని నా చెయ్యి" పట్టుకుంది భయంగా

ఇక మనం ఆగుతామా, దొరక్క దొరక్క దొరికిన అమ్మాయి అది కూడా సాయం చెయ్యమని అడిగింది.. అంతే తన చెయ్యి పట్టుకుని తన కళ్ళలోకి చూసి.. మీ కారు ఎక్కడా అని అడిగాను.

"బైటే ఉంది కానీ వాళ్ల మనుషులు ఉన్నారు కదా"

సుబ్బి : రా చెప్తాను, అని అలానే తన చెయ్యి పట్టుకుని లాక్కేళుతూ బైటికి వచ్చాను... మీ కార్ ఎక్కడా

"అదిగో ఆ రెడ్ కలర్"

సుబ్బి : ఏంటి స్పోర్ట్స్ కార్ పెట్టుకుని భయపడుతున్నావా, ఇలాగైతే ఎలాగా రారా.. అని తీసుకెళ్లి కార్లో కూర్చోబెట్టి, ఎవ్వరు చూడకుండా అక్కడ ఆగి ఉన్న మిగతా సుమోల్లో గాలి తీసేసి గట్టిగా విజిల్ వేసాను.. వాళ్లు నన్ను ఆ అమ్మాయిని చూసి నా దెగ్గరికి వస్తుంటే బాయ్ అని చెయ్యి ఊపుతూ కార్ ఎక్కి స్టార్ట్ చేసాను..

ఆ అమ్మాయి నన్ను కొంచెం కోపంగా కొంచెం ఆశ్చర్యంగా చూసింది.. సీట్ బెల్ట్ పెట్టుకోండి.. భయపడకండి ఇలాంటి కార్, డీజిల్ కి డబ్బులు ఉన్నంత వరకు మనల్ని పట్టుకోడానికి ఈ దేశం అంతా ప్రయత్నించినా అది అవ్వని పని.. నన్ను నమ్మండి.. అని కారు స్టార్ట్ చేసి దంచి కొట్టాను..

ఇంతలో ఫోన్ వచ్చింది, ఆ అమ్మాయి ఎత్తి మాట్లాడుతూ "వస్తున్నాను నువ్వు జాగ్రత్త, అమ్మ వాళ్ళని భరత్ ఫ్లైట్ ఎక్కించాడు, చందు రాలేదు సలీమాని కూడా అమ్మ వాళ్ళతోనే పంపించాను వాళ్లు నాన్నకి దొరకరు.. హ్మ్.. అలాగే.. సరే" అని ఫోన్ పెట్టేసింది.

సుబ్బి : ఇంతకీ ప్రాబ్లెమ్ ఏంటండీ..?

"ఇప్పుడు నన్నేం అడగకండి, ప్లీజ్ త్వరగా పోనివ్వండి"

సుబ్బి : ఆవారా సినిమాలో తమన్నాది కూడా సేమ్ డైలాగ్, కొంపదీసి నేనే కార్తిక్ ఏమో.. వెంటనే బ్లుటూత్ కనెక్ట్ చేసి చిరు పాట పెట్టాను.

చిరు చిరు చినుకై కురిసావే.. మరు క్షణమున మారుగై పోయావే అని పాటతో పాటు పాడుతూ తనని చూసాను ఎవరైనా వెనక వస్తారేమో అని చూస్తుంది.. ఇంకా తన పేరు కూడా తెలుసుకోలేదు..

సుబ్బి : మీ పేరెంటండీ?

"మానస"

మానస ఎంత బాగుంది.. నా మనసంతా మానసతొ నిండిపోయింది.. సుభాష్ వెడ్స్ మానస.. ఎంత బాగుంది, ఎంత అందంగా ఉంది మనం ఎలాగో ఆవారానే కాబట్టి ఇద్దరికి సెట్ అవుతుందిలే.. అస్సలు మా ఇద్దరికి FLAMES రాస్తే ఏమొస్తుందో ఏమో.. మానసతొ మొదలయ్యే పాటలన్ని నా మెదడులోకి వచ్చేసాయి..

మనసా మళ్ళీ మళ్ళీ చూసా గిల్లి గిల్లి చూసాను జరిగింది నమ్మేశా..

మనసంతా నువ్వే, నా మానసంతా నువ్వే..

అరెరే మనసా, ఇదంతా నిజమా, ఇకపై మనమే, సగము సగమా....

దీని కంటే ఇది బెస్ట్.. తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో....

ఇంకోటి.. ఓ మనసా ఓ మనసా చెపితే వినవా నువ్వు.. అబ్బో ఇది సాడ్ సాంగ్ వద్దులే.. మనసా మన్నించమ్మా మార్గం మల్లించమ్మా.. ఛీ...

మనసంతా ముక్కలు చేసి పక్కకు వెళతావ్ ఎందుకు ఓ నేస్తం.. ఇది కూడా సాడ్ సాంగ్.. ఏంటి ఒక్కటి మంచిది రావట్లేదు..

మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా, నా మనస్సే ఇంకేదో కావాలందమ్మా.. నిన్నా మొన్నా.. ఈ వైనం నాలో..

మానస : మీ పేరేంటి?

సుబ్బి : ఆ.. ఏంటండీ??

మానస : మీ పేరు..

సుబ్బి : సుభాష్..

ఇంతలో వెనక నాలుగు సుమోలు.. హారన్ కొడుతూ గంధరగోలంగా నడుపుతున్నాడు వాడెవడో.. డ్రైవింగ్ రాకుండా రోడ్డు ఎక్కుతారు వెధవలు.. గేరు కారు మార్చి ముందుకు దూకించాను సారీ.. కారు గేరు మార్చి ముందుకు దూకించాను..

కారు వేగంగా వెళుతుంది వెనక ఫాలో అవుతున్న వాళ్ళని నా వేగంతో తొక్కేసాను, ఇక ఇలా కాదని హైవే మీద నుంచి ఊర్లోకి పోనించి నల్ల పంపు దెగ్గర ఆపాను.

మానస : ఏమైంది?

సుబ్బు : ఏంలేదు కారుని గుర్తు పట్టేస్తున్నారు అందుకే స్పెషల్ డిజైన్ చేద్దామని.

మానస : ఎం చేస్తావ్?

సుబ్బు : నువ్వు ఆవారా సినిమా చూడలేదా?

మానస : చూసాను.

సుబ్బు : అదే చేస్తున్న అని నీళ్లు మొత్తం కింద పోసి ఆ బురద కారు మీద చల్లాను.. ఎర్రటి కారుని బురద రంగులోకి మార్చి.. మానసని చూసాను.

మానస : నా కారు..

సుబ్బు : కారు కావాలా ప్రాణం కావాలా

మానస : నాకు నా విక్రమ్ కావాలి.

సుబ్బు : వాడెవడు?

మానస : ఓయి రెస్పెక్ట్.. నా లవర్.

సుబ్బు : లవరా... అంటే నీది లవ్ ప్రోబ్లమా?

మానస : అవును.. ఓయి ఏమైంది?

సుబ్బు : కళ్ళు తిరుగుతున్నాయి.. కొంచెం ఆ నీళ్లు ఇలా మొహం మీద పొయ్యి.

మానస కొన్ని నీళ్లు తీసుకుని సుబ్బిగాడి మొహం మీద కొట్టింది.. సుబ్బు లేచి నిరాశగా మానసని చూసాడు.

మానస : ఏమైంది?

సుబ్బు : ఎం లేదు అని కార్ ఎక్కి స్టార్ట్ చేసాడు..

మానస పక్కన కూర్చుంది కానీ, ఏదో అయ్యింది అని అనిపించింది సుబ్బిగాడి వైపు చూసి అడిగింది.

మానస : ఏమైంది ఇప్పటిదాకా బానే ఉన్నావ్, బాగా మాటలు చెప్పావ్ ఇప్పుడేమో సైలెంట్ గా ఉన్నావ్

సుబ్బు : నీకు లవర్ ఉన్నాడని ముందు చెప్పుంటే అస్సలు వచ్చేవాడిని కాదు నేను..

మానస : నవ్వి ఎందుకలాగా, కొంపదీసి నన్ను లవ్ కానీ చెయ్యట్లేదు కదా

సుబ్బు : ఇందాకటి వరకు చేసాను కానీ ఇక డ్రాప్, నిన్ను వదిలేసి ఇంకో అమ్మాయిని చూసుకుంటాను.

మానస : ఏంటి ఇంతలోపే నన్ను ఇష్టపడ్డావ్ మళ్ళీ అంతలోపే ఇంకో అమ్మాయిని వెతుక్కుంటా అంటున్నావు.. ఎలాగో చాలా దూరం వెళ్ళాలి నీ గురించి చెప్పు.

సుబ్బు : తల పైకి ఎత్తు....... Doooooooooomdeeeeeeeeeeemdaaaaaaaaamdamaaaaaal dishkiyaaam dozendozen dhoom3 dhruvaips.................. అయిపోయింది కథ తల దించు.. అది జరిగింది.

మానస : హహ... హహ.. భలే ఉన్నావే విచిత్రంగా.. అయితే మీ తాతయ్య వాళ్ల చేతిలో తన్నులు తిని ఇక అక్కడ ఉండకూడదని డిసైడ్ అయ్యావ్ అన్న మాట..

సుబ్బు : కాదు, అస్సలు కథ దాని తరువాతే మొదలయ్యింది.. ఒక అమ్మాయి నన్ను దారుణంగా మోసం చేసింది, నేను పుట్టినప్పటి నుంచి ఎప్పుడు ఏడ్చానొ నాకే గుర్తులేదు అలాంటిది నా కంట్లో నుంచి నీళ్లు తెప్పించింది.

మానస : ఎవరు?

సుబ్బు : శరణ్య.. నా మరదలు.

మానస : ఏమైంది?​
Next page: Update 06
Previous page: Update 04