Update 08

సుబ్బు : హలో మానస మేడం లొకేషన్ రీచ్డ్, మీ బాయ్ ఫ్రెండ్ కి ఫోన్ చేస్తే ఇక నేను నా పని చూసుకుంటా.

మానస : హలో విక్రమ్ ఎక్కడా... హా.. కనిపించింది.. సుబ్బు అదే లోపలికి పోనీ

సుబ్బు : అలాగే.. అని లోపలికి పోనిచ్చాను.. నలుగురు బైటే నిల్చున్నారు.. మానస వాళ్లేంటి ఇద్దరు ఒకేలా ఉన్నారు.

మానస : ఆ స్లిమ్ గా ఉన్నాడు చూడు తనే విక్రమ్, ఇంకొకతను ఆదిత్య

సుబ్బు : ఇద్దరు అన్న దమ్ములా

మానస : కాదు ఒకరికొకరికి మొన్నటి వరకు పరిచయం కూడా లేదు, రీసెంట్ గా ఫ్రెండ్స్ అయ్యారు.

సుబ్బు : ఆ అమ్మాయి ఎవరు?

మానస : ఏమో ఆదిత్య పక్కనే ఉందంటే తను అనురాధ అయ్యుంటుంది.. ఎంట్రోయ్ అప్పుడే మొదలు పెట్టావా

సుబ్బు : రా.. నా

మానస : సారీ సుభాష్, ఏదో చనువులో అలా వచ్చేసింది.

సుబ్బు : పర్లేదు లేండి మీరు జీతాలు ఇచ్చేవాళ్లు ఏమైనా అనొచ్చు సుబ్బు అని పిలు బాగుంది.

మానస : సర్లే ముందు కారు దిగుదాం, ఇంకోటి ఆ అమ్మాయిని గెలక్కు ఆదిత్య మరదలు ఇద్దరు ప్రాణానికి ప్రాణం. జాగ్రత్త.

సుబ్బు : ఆ సర్లే పదా

మానస వెళ్లి విక్రమ్ ని కౌగిలించుకుని, ఆదిత్యని పలకరించింది.

మానస : అనురాధ కదా

అను : అవును

మానస : మీరు కలిసిపోయినందుకు చాలా హ్యాపీగా ఉంది.

ఆదిత్య : మిమ్మల్ని నేను కలుపుతానులె

అను : మేమిద్దరం.. అనగానే మానస అను ఇద్దరు కౌగిలించుకున్నారు.

మానస : ఆ మర్చిపోయాను మీట్ సుబ్బు, ద బెస్ట్ డ్రైవర్ ఐ హావ్ ఎవర్ సీన్.. తను కనక లేకపోయ్యుంటే నేను అక్కడే లాక్ అయిపోయేదానిని.. సుబ్బు నేను చెప్పాగా విక్రమ్.

సుబ్బు : హై

విక్రమ్ : థాంక్స్ బ్రో, నిజంగా చాలా ఫాస్ట్ గా వచ్చేసారు.

మానస : మధ్యలో ఆగాము కూడా, గాల్లో వచ్చేసాం మా నాన్న మనుషులకి మా సైలెన్సర్ పొగ కూడా దొరికి ఉండదు.

సుబ్బు : జోక్ బాలేదు, కామెడీ పార్ట్ నాకు వదిలేయి

అందరూ నవ్వారు.

మానస : విక్రమ్ ఫుడ్ రెడీనా

విక్రమ్ : హా పదండి.

మానస : సుబ్బు రా

సుబ్బు : నేను బైలుదేరతాను

మానస : తిని వెల్దువులె రా

సుబ్బు : పర్లేదు నేను బైట కానిచ్చేస్తాను

మానస : పదండి వస్తున్నా...అని వెనక్కి తిరిగి.. మొహమాట పడకు నేను లేనా ఏంటి దా, అప్పుడెప్పుడో తిన్నాం.. అయినా ఇప్పుడు ఎక్కడికని వెళ్తావ్ కొన్ని రోజులు ఇక్కడే మాతో ఉండు. కొత్త ఊరు కొంచెం రిఫ్రెష్ అవ్వు.. ఆ తరువాత ఏం చెయ్యాలనుకుంటున్నావో అలోచించి నిర్ణయం తీసుకుందువు.. ఇంకేం మాట్లాడకు నీకు ఎవ్వరు లేరనుకుంటున్నావేమో నీ ఫ్రెండ్ అరవింద్, మీ మావయ్యతొ పాటు నేను కూడా నీ ఫ్రెండ్ నే... దా అని చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళింది.

సుబ్బుతొ పాటు ఆదిత్య, విక్రమ్ రాము అందరూ భోజనాలకి కూర్చుంటే మానస అనులు ఇద్దరు అందరికీ వడ్డించి వాళ్ళు కూడా కూర్చున్నారు, మానస సుబ్బుకి చికెన్ వడ్డించింది.

సుబ్బు : థాంక్స్

మానస : దేనికి

సుబ్బు : నీ స్నేహానికి

మానస : నేనే నీకు రుణపడి ఉన్నాను సుబ్బు, రిస్క్ అని తెలిసి కూడా ఒక్కదాన్ని ఉన్నానని నాకు తోడుగా ఇంత దూరం నన్ను సేఫ్ గా తీసుకొచ్చావ్.. నేనే నీకు థాంక్స్ చెప్పాలి.

అను : మానస ఒక్కటే కాదు నేను కూడా, రేపు మా వాళ్లు చేసింగ్ కి వస్తే మాకు కూడా హెల్ప్ చెయ్యాలి.

సుబ్బు : హహ.. (అమ్మాయిల వెనక పడే దెగ్గర నుంచి ఇప్పుడు బ్రోకర్ పనులు చేస్తున్నా)

మానస : రేయి బైటికి వినిపిస్తుంది..

ఇంతలో బైట ఏదో గొడవ గొడవగా అర్ధంకానీ భాషలో అరుస్తుంటే ఆదిత్య లేచాడు.. అందరూ ఆదిత్యని చూసారు.

ఆదిత్య : ప్రశాంతంగా అన్నం కూడా తిననివ్వట్లా, అర్ధంకాలా నా కొరియన్ బ్యాచ్ వచ్చారు.

విక్రమ్ కూడా లేచాడు, ఇద్దరు చేతులు కడుక్కుని లేచారు.

సుబ్బు : ఏమైంది

ఆదిత్య : అన్ని డోర్స్ లాక్ చేసి ఉన్నాయిగా, ఎవ్వరు బైటికి రాకండి.. జాగ్రత్త.

మానస : ఎవరో ఎటాక్ చెయ్యడానికి వచ్చారు..

సుబ్బు నేను వెళతాను అని లేచి చెయ్యి కడుక్కుని బైటికి వెళ్లి, ఎలా వెళ్ళాడో అలానే లోపలికి వచ్చి డోర్ లాక్ చేసి అందరితొ పాటు కూర్చుని మెలకుండా అన్నం తింటున్నాడు.

మానస : ఏమైంది?

సుబ్బు : వాళ్ళ దెగ్గర గొడ్డళ్లు ఉన్నాయి

మానస : (నవ్వుతూ) మరి ఓ పోటుగాడిలా పోయావ్

సుబ్బు : ఇంకొంచెం పులుసు పొయ్యి.

మానస నవ్వింది, అది చూసిన అనుకి కూడా మన సుబ్బిగాడి గురించి కొంచెం కొంచెం అర్ధం అవ్వసాగింది.. చిన్నగా నవ్వింది.

సుబ్బు : నవ్వకండి ఇట్స్ ఎ సీరియస్ మాటర్.. అక్కడ గొడ్డళ్లు పట్టుకుని చంపడానికి వస్తుంటే మీరేమో నవ్వుతారు.. నేనేదో చిన్న గొడవ తోపులటకె కదా అనుకున్నా.. వాడు నన్ను చూడగానే అసలోళ్ళని వదిలేసి నా మీదకి గొడ్డలి విసిరాడు వెంట్రుక వాసిలో తప్పిపోయింది.

మానస : వాళ్లు చూసుకుంటారులె.. ఇద్దరు మామూలోళ్లెం కాదు.

సుబ్బు : ఆ మిగిలిన కూర కూడా నాకు వేసేయ్ వాళ్లు బతికుంటే మళ్ళీ ఓండుకోవచ్చు.

మానస : సుబ్బు..

సుబ్బు : సరే సరే.. సారీ.

రాము : ఆదిత్య అన్న ఒక్క దెబ్బ కొడితే చాలు మళ్ళీ లేవరు.. నాకింకా గుర్తుంది.. విక్రమ్ అన్న కూడా అలానేనా వదినా అని మానసని చూసాడు.

మానస : నేను కూడా ఎప్పుడు చూడలేదు రాము..

రాము : చూద్దామా, ఇద్దరు కలిసి కొడితే ఎలా ఉంటుందో..

సుబ్బు : యాందిరా నువ్వు చూసేది, పిల్లోడివి పిల్లోడిలా ఉండు.. మీరు తినండి అక్కడ వాళ్లు నరుక్కుంటుంటే ఏందో సూస్తాడంట.. మీరు కూడా మెలకుండా తినండి.

అను మానసని చూసింది.. మానస నవ్వుతూ అనుని చూసి తరవాత చెప్తా అని సైగ చేసింది. సుబ్బు ఇంకా భయం భయంగానే కూర్చుని తింటున్నట్టు నటిస్తున్నాడు..

గొడవ తరువాత ఆదిత్య, విక్రమ్ ఇద్దరు రక్తపు మారకలతో లోపలికి వచ్చారు. కొంత సేపటికి అంతా సర్దు మణిగింది ఒక పక్క విక్రమ్ మానస, ఇంకోపక్క ఆదిత్య అనురాధ మాట్లాడుకుంటుంటే బైటికి వచ్చి నిలబడ్డాను అన్ని శవాలు చూడగానే అమ్మ గుర్తుకొచ్చింది నేను ఆఖరి సారి అమ్మని చూసింది రక్తపు మడుగులోనే.. కళ్ళేదుట రక్తం అంతా చూసేసరికి తల తిరిగినట్టు అయ్యింది, వాంతు చేసుకున్నాను. చెవులు మూసుకుని గట్టిగా కళ్ళు మూసుకున్నా వెనక నుంచి భుజం మీద చెయ్యి పడేసరికి కళ్ళు తెరిచి తల తిప్పి చూసాను.

మానస : ఓకే నా

సుబ్బు : బొటన వేలు పైకి ఎత్తి చూపించాను

మానస : ఉండు మంచినీళ్లు తీసుకొస్తా, అని లోపలికి వెళ్లి బాటిల్ తెచ్చింది అందుకుని తాగి తనని చూసాను.

సుబ్బు : నేను వెళతాను.

మానస : అది కా..

సుబ్బు : ఇక్కడే ఉంటాను.. కొన్ని రోజులు ఊరు చూస్తాను ఎందుకో ఒంటరిగా గడపాలని ఉంది. మళ్ళీ ఊరికి వెళ్లేముందు నిన్ను కలిసి వెళ్ళిపోతాను.

మానస : అలాగే ఒక్క నిమిషం. అని లోపలికి వెళ్లి రెండు నిమిషాలకి బైటికి వచ్చింది.

ఇదిగో కార్ నీ దెగ్గరే ఉంచుకో, అలాగే ఇందులో యాభై వేలు ఉన్నాయి మళ్ళీ ఏమైనా అవసరం పడితే కాల్ చెయ్యి.

సుబ్బు : అలాగే థాంక్స్.. ఇన్ని డబ్బులు

మానస : నీ సొంత అక్క ఇచ్చిందనుకో.. ఎప్పుడు నా దెగ్గర మొహమాట పడొద్దు.. ఇంకోమాట జాగ్రత్త.

నవ్వాను అంతే, వెనక్కి తిరిగి కార్ తీసి బైలుదేరాను.. దేశాటనకి..

•}÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷{•

Location : లోకల్ పార్టీ ఆఫీస్.. పార్టీ పేరు.. కెరటం.. పార్టీ గుర్తు పుస్తకం.

కారు ఆగగానే దిగి నేరుగా లోపలికి వెళ్ళింది శరణ్య.

యూనిఫామ్ లో ఉన్న శరణ్యని చూసి కొంత మంది బెదిరితే ఇంకొంత మంది ఎందుకోచ్చిన గొడవలే అనుకుని బైటికి వెళ్లిపోయారు. శరణ్యని చూసి కూర్చోమని సైగ చేసాడు శివరాం (మానస నాన్న)

శివరాం : సిటీకి కొత్తగా వచ్చారని విన్నాను, పరిచయం చేసుకుందామని పిలిపించాను.. ఎప్పటికైనా మా అవసరం మీకు మీ అవసరం మాకు ఉంటుంది. ముందే పరిచయాలు అయిపోతే ముందు ముందు ఎ మనస్పర్థలు రాకుండా ఉంటాయాని నా ఆలోచన.

శరణ్య : వచ్చిన ఈ నెలలో మీ గురించి వింటూనే ఉన్నాను. మీ ఫైల్ తోడితే చాలా విషయాలు తెలిసాయి.

శివరాం : సరే పాయింట్ కి వచ్చేస్తాను, ఎలాగో మీకు అన్ని తెలుసు కాబట్టి మీకెంత కావాలో అడగండి.

శరణ్య : నేనొక ips ని

శివరాం : అందుకే మిమ్మల్నే అడగమంటున్నాను.

శరణ్య : నాతో ఏమేమి చేయించబోతున్నారో చెపితే, దాన్ని బట్టి రేట్ ఫిక్స్ చేద్దాం.

శివరాం : మా ట్రక్కులని చెకపోస్ట్ నుంచి దాటించడం, గొడవలు అల్లర్లు జరిగితే చూసి చూడనట్టుగా వెళ్లిపోవడం ఇక అస్సలుది ఈ కలెక్టర్ ఉందే.. రేయి దాని పేరేంటి?

"శృతి అన్నా"

శివరాం : ఆ.. శృతి అది ఎప్పుడెప్పుడు మమ్మల్ని లోపలేయించుదామా అని గుంట నక్కలా ఎదురు చూస్తుంది దాని సంగతి నువ్వే చూసుకోవాలి.

శరణ్య : నేను తన కిందే పని చేస్తున్నాను, నీ ఫైల్ నాకు పంపించిందే ias శృతి.

శివరాం : అందుకే డైరెక్ట్ గా నిన్నే పిలిచాను.

శరణ్య : మీరెంతకి ఫిక్స్ అయ్యారో చెప్పండి.

శివరాం : నెలకి నలభై ఇస్తాను.. ఇంతక ముందు వాడికి ఇచ్చింది ముప్పై ఐదే..

శరణ్య : కానీ అప్పుడు మీ వెనకాల శృతి లేదనుకుంటా

శివరాం : అవును, అయితే మీరే చెప్పండి ఎంతకీ తెగ్గొడదాం?

శరణ్య : డెబ్భై చెయ్యండి.

శివరాం : నువ్వు జాయిన్ అయ్యింది మొన్నే, అప్పుడే అంత అత్యాశ పనికి రాదు.

శరణ్య : నా గురించి నేను ఆలోచిస్తాను ఇందులో చాలా రిస్క్ ఉంది, ఓకే అంటే చెప్పండి డీల్ క్లోస్ చేద్దాం. అని లేచింది.

శివరాం : సరే ఇస్తాను, కానీ దానికంటే ముందు నాకొక చిన్న పని చేసి పెట్టాలి.

శరణ్య : ఏంటి?

శివరాం : నాకు వీడు కావాలి. అని టేబుల్ మీద ఫోటో వేసాడు.

శరణ్య : (సుబ్బు..) వీడితో మీకేం పని?

శివరాం : నా కూతురిని లేవదీసుకుపోయాడు.

శరణ్య : ఏంటి వీడా?

శివరాం : అవును వీడే

శరణ్య : పట్టిస్తే ఏం చేస్తారు?

శివరాం : నీకనవసరం

శరణ్య : చంపను అంటేనే పట్టిస్తా

శివరాం : అలాగే, మాటిస్తున్నాను

శరణ్య రెండు నిముషాలు ఆలోచించింది, రిస్క్ అని తెలిసినా వచ్చే డబ్బు చూసుకుంటుంటే ఇంకేవి కనిపించటం లేదు.. డెబ్భై లక్షలు ఇంత పెద్ద ఆఫర్ మళ్ళీ తన జీవితంలోనే దొరకదు అని తనకి తెలుసు.. సుబ్బు గురించి రెండు నిమిషాలు అలోచించి అయినా చంపను అన్నాడు కదా.. వాడికి కూడా బుద్ది రావాలిలే ఇంక దేని జోలికి వెళ్ళడు.. అనుకొని శివరాం ని చూసి వెంటనే ఫోన్ తీసి సుబ్బుకి ఫోన్ చేసింది.

సుబ్బు : హలో

శరణ్య : సుబ్బు ఎలా ఉన్నావ్, ఒక్క ఫోన్ కూడా చెయ్యలేదు.

సుబ్బు : చెప్పు

శరణ్య : ఎక్కడున్నావ్?

సుబ్బు : బెంగుళూరులో

శరణ్య : నీతో కొంచెం పనుంది, నేనే వస్తాను ఎక్కడుంటావ్ నిన్ను ఎక్కడికి వచ్చి కలవను.

సుబ్బు : దేనికి, ఏం పని.

శరణ్య : నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. నేను పని మీద వస్తున్నాను. ఎక్కడికి రమ్మంటావో చెప్పు.

సుబ్బు : ఇక్కడ పాలస్ ఉంది వచ్చాక ఫోన్ చెయ్యి కలుద్దాం.

శరణ్య : అలాగే అని ఫోన్ పెట్టేసి శివరాం వైపు చూసింది.. రేపు మధ్యాహ్నం లోపు మీ ముందుంటాడు.. ఇక డబ్బు విషయానికి వస్తే నాకు అది ల్యాండ్ రూపంలో కావాలి రెండు నెలలకి ఒకసారి అయినా పరవాలేదు.. ల్యాండ్ పేపర్స్ హారిక అనే పేరు మీద రిజిస్టర్ చేపించండి.. కొంత అడ్వాన్స్ మాత్రం నేనొక అకౌంట్ నెంబర్ చెపుతాను దానికి పంపించండి.

శివరాం : థాంక్స్.. చాలా ఇంటెలిజెంట్ వి.. పైకి వస్తావ్.

శరణ్య నవ్వుతూ బైటికి వచ్చి కర్ణాటక డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫర్మ్ చేసింది.. అలానే కారు ఎక్కి కూర్చుని సుబ్బుకి సాయంత్రం ఐదు గంటలకల్లా పాలస్ దెగ్గరికి రమ్మని మెసేజ్ పెట్టింది.

సాయంత్రం ఐదు గంటలకి పాలస్ దెగ్గరికి వచ్చి రాగానే సుబ్బుని ఐదుగురు పో...లు చుట్టు ముట్టారు..

సుబ్బు : ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు?

"కారు దొంగలించినందుకు, ఇదే కారు కంప్లైంట్ వచ్చింది"

సుబ్బు : కానీ కార్ ఓనర్ నాకు తెలుసు, నేను ఫోన్ చేస్తాను అని మానసకి కాల్ చెయ్యగానే ఒకడు ఫోన్ లాక్కుని జేబులో పెట్టుకున్నాడు.

"మూసుకుని జీప్ ఎక్కితే నీకే మంచిది, (అప్పటికే మానస ఫోన్ ఎత్తింది) లేకపోతే రఫ్ గా హ్యాండిల్ చెయ్యాల్సి వస్తుంది.

సుబ్బు : అలాగే.. అని చేతికి బేడీలు తోడిహించుకున్నాడు.

జీప్ ఎక్కించి కూర్చోపెట్టక ఇందాక ఫోన్ తీసుకున్న వాడిని చూసి సైగ చేసాడు వాడు సుబ్బు జేబులో ఉన్న డబ్బు తీసుకుని వాడు తీసుకున్న ఫోన్ సుబ్బు చేతికి ఇచ్చాడు.. మానస ఇంకా కాల్లో నే ఉండటం చూసి జేబులో పెట్టుకున్నాడు.

ఇక్కడ మానసకి డౌట్ కొట్టి వెంటనే విక్రమ్ ని ఆదిత్య ని పిలిచింది.. నలుగురు ఫోన్ లో వినపడుతున్న మాటలు వింటున్నారు.

సుబ్బు : నేను ఏ కారు దొంగలించలేదు, అయినా ఎవరు మీకు కంప్లైంట్ చేసింది?

"నోరు ముయ్యి"

సుబ్బు : నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు, అదైనా చెప్పండి.

"హైదరాబాద్ స్టేషన్ కి షిఫ్ట్ చేస్తున్నాం.. నువ్వేం మాట్లాడాలనుకున్నా అక్కడ మాట్లాడుకో"

సుబ్బు వెంటనే కాల్ కట్ చేసి ఎవ్వరు చూడకుండా శరణ్యకి ఫోన్ చేసాడు లిఫ్ట్ చెయ్యలేదు.. మళ్ళీ చేసాడు.. వరసపెట్టి ఐదు సార్లు చేసినా లిఫ్ట్ చెయ్యలేదు.. మౌనంగా కూర్చున్నాడు.

±

±

మానస : ఇది మా నాన్న పని, మన వల్ల అనవసరంగా వాడు ఇరుక్కున్నాడు.. నాకు భయంగా ఉంది.. నవ్వించడం తప్ప వాడికేం తెలీదు ఏం చేస్తాడో ఏమో.. అని విక్రమ్ ని చూసింది.

విక్రమ్ : ఏడవకు, నేను వెళుతున్నాను..

ఆదిత్య : లేదు నీ ప్లేస్ లో నేను వెళతాను.

విక్రమ్ : ఏంటి?

ఆదిత్య : రేపే మీ పెళ్లి.. మానస మీ వాళ్లు నీకు ఎవరైనా సపోర్ట్ గా ఉంటే పిలుచుకో.. రేపు మీరు పెళ్లి చేసుకోండి అక్కడ సంగతి నేను చేసుకుంటాను. మానస మీ నాన్న మీద చెయ్యి చేసుకుంటే తప్పుగా అనుకోవుగా?

మానస : కళ్ళు తుడుచుకుని అనుకోను అంది.

అను : వాడు జాగ్రత్త బావా

ఆదిత్య : వాడు వేసిన రెండు జోకులకి ఇంత ఫాలోయింగా.. ఏంటో ఇది.. జాగ్రత్తగా తీసుకొస్తా సరేనా.. నువ్వు జాగ్రత్త.. అవును మరి నీ ఎంగేజ్మెంట్..?

అను : ఇంకెక్కడ ఎంగేజ్మెంట్ నువ్వు నా పక్కన ఉండగా నన్ను టచ్ చేసే దమ్ము ఎవడికుంది మామా

ఆదిత్య : బావనే..

అను : ఆ అదేలే

మానస : సుబ్బు గాడు పూనాడేమో.. అను కూడా వాడిలాగే మాట్లాడుతుంది అని నవ్వింది.

నేను వెళుతున్నా, పెళ్లి టైంకి మీ నాన్నతొ సుబ్బు గాడితో తిరిగిస్తా.. అడ్వాన్స్ హ్యాపీ మారీడ్ లైఫ్.. అని ఆదిత్య బైటికి వెళుతుంటే.. విక్రమ్ పేరెంట్స్, సలీమా అందరూ లోపలికి వచ్చారు.. ఆదిత్య దెగ్గరికి రాబోతుంటే.. విక్రమ్ లోపల ఉన్నాడు వెళ్ళండి. అని చెప్పి ఎయిర్పోర్ట్ కి బైలుదేరాడు. కావ్య అయోమయంగా చూస్తుంటే విక్రమ్ ఎదురు వచ్చేసరికి షాక్ అయిపోయింది.​
Next page: Update 09
Previous page: Update 07