Update 10

నాలుగు రోజులకి సుబ్బు తేరుకున్నాడు, రాత్రికి లేచి అటు ఇటు నడిచి సెట్ అయ్యి కూర్చుని ఆలోచిస్తూ కూర్చున్నాడు. తెల్లారి అరవింద్ వచ్చి సుబ్బుని చూసి ఆనందించి పని వాళ్ళతో కావాల్సిన ఫ్రూట్స్ నట్స్ అన్ని తెప్పించాడు.

సుబ్బు : దేనికిరా ఇదంతా

అరవింద్ : నీకే నీ టైం బాగుంది అనుభవించు, వారానికి సరిపడా ఉన్నాయి ఇంకేమైనా కావాలంటే ఫోన్ చెయ్యి నేను అలా ఆఫీస్ దాకా వెళ్ళొస్తా అని వెళ్ళిపోయాడు.

అరవింద్ సాయంత్రం ఇంటికి వచ్చి చూసేసరికి సుబ్బు గాడి రూంలో సుబ్బు లేడు పొద్దున తెప్పించిన ఫ్రూట్స్ లేవు.

అరవింద్ : మల్లయ్య.. మల్లయ్యా

మల్లయ్య : బాబుగారు

అరవింద్ : వీడేడి

మల్లయ్య : చిన్న బాబుగారు వద్దన్నా కూడా పళ్ళు మొత్తం తినేసారు అన్నం బదులు జూస్ చేపించుకుని తాగేసారయ్యా జిమ్ రూంలో ఉన్నారు.. పిలవమంటారా

అరవింద్ : లేదు నేనే వెళతాను, మీరు వెళ్ళండి.. అని చెప్పేసి జిమ్ రూంకి వెళ్ళాడు.. అక్కడ సుబ్బు ట్రెడ్ మిల్ మీద చిన్నగా నడుస్తున్నాడు.

సుబ్బు : హాయి రా

అరవింద్ : అస్సలు ఎం జరుగుతుంది ఇక్కడా

సుబ్బు : ఏమైంది రా

అరవింద్ : నువ్వే చెప్పాలి, పంది తిన్నట్టు వారానికి సరిపడే ఫుడ్డు మొత్తం ఒక్క రోజులోనే తినేశావంట..

సుబ్బు : అదా..ఈ నాలుగు రోజులు అస్సలు ఎం తినలేదు కదరా అందుకే బాలన్స్ చేసాను.. మళ్ళి తెప్పించు.. ఇక దొబ్బేయి.

అరవింద్ : అలాగే (అని వీడు నాకు అర్ధం కాడు అనుకుంటూ వెనక్కి తిరిగాడు)

సుబ్బు : ఇంకోటి.. కొంచెం జ్వరం వచ్చినట్టు అనిపిస్తుంది, డోలో - 650 ఒక రెండు తెప్పించు.

అరవింద్ : సరిగ్గా రెండే ఎందుకో..

సుబ్బు : అదా 650 + 650 రెండు కలిపితే 1350 బాగా పవర్ ఎక్కువ ఉంటుంది లే. ఒక టాబ్లెట్ జ్వరం రాకుండా ఆపుతుంది. మొదటి టాబ్లెట్ ఆపలేకపోతే రెండో టాబ్లెట్ ఆపుతుంది.

అరవింద్ : సుబ్బు... ఆ శివరాం గాడేమైనా తల మీద కొట్టాడా

సుబ్బు : జోకులు ఆపి చెప్పింది చెయ్యి అని మళ్ళి ట్రెడ్ మిల్ స్పీడ్ పెంచి నడవడం మొదలు పెట్టాడు.

అరవింద్ మాత్రం సుబ్బు గాడి తిక్క పనులకి అస్సలు ఐదు రోజులు ఇంటికి రావడమే మానేశాడు వచ్చినా సుబ్బు గాడిని తప్పించుకుని తిరిగేవాడు.. ఇక సుబ్బు అస్సలు ఇంట్లో నుంచి బైటికి కదలలేదు తినడం ఎక్సర్సైజులు చెయ్యడం మళ్ళి బాడీని ఇంతకు ముందు ఎలా ఉండేదో అదే షేప్ కి తీసుకొచ్చేసాడు. ఆరో రోజు పొద్దున్నే లేచి అరవింద్ ముందుకి వెళ్ళాడు.

అరవింద్ : ఏంట్రా

సుబ్బు : నాకు నీ ఫోర్డ్ మాస్టాంగ్ కావాలి

అరవింద్ : తీసుకెళ్ళు మళ్ళి అడగడం దేనికి

సుబ్బు : మళ్ళి తిరిగిరాదు అందుకని, వర్క్ షాప్ ఓపెన్ చేపించు పని ఉంది.

అరవింద్ : (సుబ్బు ఎప్పుడు ఇంత సూటిగా మాట్లాడలేదు అలాంటిది కళ్ళలోకి చూసి మాట్లాడడంతో లేచి నిలబడ్డాడు అనుమానంగా) కార్ బానే ఉందిగా

సుబ్బు : నెంబర్ ప్లేట్స్ తీసెయ్యాలి, రిపెయింట్ చెయ్యాలి టైర్లు కూడా ఇవి కాదు వేరే ఉన్నాయి.. మనకి పార్ట్స్ సప్లై చేసే విల్సన్ కి ఫోన్ చెయ్యి ఈ సారి ఇల్లీగల్ గా పార్ట్స్ కావాలని చెప్పు అని లోపలి వెళ్ళిపోయాడు.

అరవింద్ సుబ్బు వెనకే వెళ్లి : ఆ శివరాం గాడిని ఎం చేద్దామనుకుంటున్నావ్

సుబ్బు : చూస్తావుగా

అరవింద్ : వద్దురా నా మాట విను వాడి వెనుక చాలా పెద్ద తలలు ఉన్నాయి.

సుబ్బు : హెల్ప్ చేస్తావా నన్నే చూసుకోమంటావా, ఇప్పుడు ఎవ్వరు చెప్పినా వినే మూడ్ లో అస్సలు లేను అని లోపలికి వెళ్ళిపోయాడు.

+++++++++++++++++++++++

++++++++++++++++++++

+++++++++++++++++++++++

రెండు జంటలు వాసు దెగ్గర సెలవు తీసుకుని విక్రమాదిత్య గురించి తెలుసుకోవడానికి తన అమ్మ సంధ్య దెగ్గరికి వెళ్లేముందు కొంచెం రెస్ట్ తీసుకుని వెళదామని ఆగి రెండు రోజులు అక్కడే ఎంజాయి చేసిన తరువాత ప్రయాణానికి సిద్ధమయ్యారు. విక్రమ్ ఆదిత్యలు ఇద్దరు బండి మీద రెడీగా ఉన్నారు, అను కూడా బండి ఎక్కింది..

విక్రమ్ : మానస..

మానస : వస్తున్నా అమ్మ ఫోన్ చేసింది.. ఒక్క నిమిషం.

అను : నేరుగా సంధ్య గారి దెగ్గరికి వెళదాం, అస్సలు ఇప్పుడు తను ఎక్కడ ఉందొ ఎలా ఉందొ ఎలా తెలుసుకోవడం.

విక్రమ్ : ఇంటి అడ్రస్ తెలిసింది వెళ్లి చూస్తే కానీ తెలీదు.

ఇంతలో మానస లోపలి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చింది.

మానస : విక్రమ్... సమస్య

విక్రమ్ : ఏమైంది అనగానే అను బండి దిగింది ఆదిత్య బండి కీస్ తిప్పి ఆపేసాడు.

మానస : ఎవరో మా ఇంటి గోడలు బద్దలు కొట్టి ఇంటి నుంచి ఎలక్షన్ ఫండ్ డబ్బులు మొత్తం ఎత్తుకుపోయారట.. రెండు రోజుల్లో నాన్నని చంపేస్తామని లెటర్ పెట్టి వెళ్ళిపోయాడట

విక్రమ్ : మీ నాన్నకి కావాల్సిందేలే.. అయినా అంతా దొంగ డబ్బేగా.. పోతే పోయింది ఇక మీ నాన్నని కాపాడమని నన్ను అడక్కు నేను చెయ్యలేను నా వల్ల కాదు.

మానస : అది కాదు, ఇంటిని బద్దలు కొట్టుకుని వచ్చింది ఒక కారుతో

ఆదిత్య : అయితే

మానస : నాకెందుకో అది సుబ్బు అని అనుమానంగా ఉంది.

ఆదిత్య : వాడికంత సీన్ లేదు

ఇంతలో విక్రమ్ ఫోన్ లో న్యూస్ టైపు చెయ్యగానే ఫుటేజ్ లింక్ చూసి ఓపెన్ చేసాడు ఆదిత్యతో పాటు అందరూ విక్రమ్ పక్కన చేరి ఫోన్ చూసారు. ఇరవై సెకండ్స్ లో కార్ దూసుకుంటూ గేట్ బద్దలు కొట్టుకుని వెళ్లి బైటికి అదే స్పీడ్ లో రెవెర్స్ గేర్లో వచ్చేసింది..

మానస : అది సుబ్బు గాడి పనే

విక్రమ్ : అంత కచ్చితంగా ఎలా చెపుతున్నావ్

మానస : నాకు తెలుసు ఆ స్పీడ్ లో కార్ ని కర్వ్ లో అదీ రెవెర్స్ లో తిప్పడం వాడి వల్లే అవుతుంది. వాడి కార్ ఎక్కింది నేను వాడు ఎలా నడుపుతాడో నాకు తెలుసు. మా నాన్న నుంచి తప్పించుకునేటప్పుడు మా వెనుక ఏడు కార్లు వెనకపడ్డాయి కనీసం వాడి కళ్ళలో భయం కూడా చూడలేదు నేను.. అంత తెలివిగా అంత స్పీడ్ గా నడిపాడు.. నాకు భయంగా ఉంది వాడు మళ్ళి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నాడు. మా నాన్న కూడా మారిపోయాడు కదా ప్లీజ్ వెళదాం.

విక్రమ్ : పద.. అయినా సుబ్బు గాడు ఇంత మంచి డ్రైవరా

మానస : ఒకసారి వాడి కార్ ఎక్కి చూడు తెలుస్తుంది.. అని సుబ్బుకి కాల్ చేసింది కానీ నో రెస్పాన్స్

ఇటు పక్క సుబ్బు వాడి కారు విరిగిపోయిన పార్ట్స్ ని వెల్డింగ్ చేసి పెయింట్ మార్చి నల్ల రంగు వేసి కొత్త టైర్లు తొడిగాడు ఎల్లుండి హత్య చెయ్యాల్సిన శివరాంని ఎలా ప్లాన్ చేసి చంపాలా అని ఆలోచిస్తుండగా రింగ్ అవుతున్న ఫోన్ గురించి పట్టించుకోలేదు.

మానస : వాడు ఫోన్ ఎత్తట్లేదు

విక్రమ్ : అయినా రెండు రోజులన్నాడు కదా పోదాంలే చిన్నగా

మానస : జోకులుగా ఉందా నీకు, ఆదిత్య తన ఫ్రెండ్ అరవింద్ ఉన్నాడు కదా తనకి కాల్ చెయ్యి.

ఆదిత్య : రింగ్ అవుతుంది ఇదిగో..

అరవింద్ : హలో..

మానస : అరవింద్ నేను మానస, ఎం జరుగుతుంది అక్కడా సుబ్బు పనేనా

అరవింద్ : సుబ్బునే

మానస : ఎక్కడున్నాడు

అరవింద్ : నా ఇంట్లోనే ఉన్నాడు, ఎల్లుండి ప్రోగ్రాంకి రెడీ అవుతున్నాడు.

మానస : ఏంటి మా నాన్నని చంపుతుంటే నీకు అది ప్రోగ్రాంలా ఉందా అనగానే ఇటు విక్రమ్ తో పాటు ఆదిత్య కూడా నవ్వాడు.. మానస కోపంగా చూసి మేము వస్తున్నాం వాడిని అక్కడే ఉండమని చెప్పు.. అని ఫోన్ పెట్టేసింది.

నలుగురు హైదరాబాద్ బైలుదేరారు గంటన్నరలో చేరుకొని నేరుగా అరవింద్ ఇంటికి వెళ్లారు. ఇల్లు చూస్తూనే ఒక్కొక్కళ్ళకి కళ్ళు తిరిగినంత పని అయ్యింది.

అను : ఇది ఇల్లా ఏదైనా పాలస్సా ఎంత పెద్దది వావ్

మానస : మా నాన్న చెపితే ఏమో అనుకున్నాను కానీ ఈ అరవింద్ దెగ్గర చాలా డబ్బులున్నట్టున్నాయి, ఇంత పెద్ద ఇల్లా

విక్రమ్ : పోనీ మీ నాన్న సంబంధం తెచ్చాడు కదా అప్పుడే ఒప్పుకోవాల్సింది.

అను : మాడిపోయిన వాసన బాగా వస్తుందే

మానస : కదా అస్సలు ఎవరినైనా ఇంత పొగిడితే చాలు.. ఎంత కోపమో..

విక్రమ్ : నోరు మూసుకుని పదా

అరవింద్ ఎదురు వచ్చి అందరిని లోపలికి తీసుకెళ్లాడు అప్పటికే చీకటి పడింది. అందరూ లోపలికి వెళ్లి కూర్చున్నారు.

మానస : సుబ్బు ఎక్కడా

అరవింద్ : మీరు వస్తున్నారని తెలిసి వెళ్ళిపోయాడు.

మానస : (లేచి నిలబడి) మరి ఇప్పుడు ఎలాగా

అరవింద్ : మరేం పరవాలేదు మీ నాన్నని ఎప్పుడు చంపుతాడో నాకు తెలుసు

మానస : ఎప్పుడు

అరవింద్ : రేపు క్రికెట్ గ్రౌండ్ లో మీ నాన్న ఫ్రెండ్లీ పొలిటిషన్స్ క్రికెట్ మ్యాచ్ ఆడటానికి వెళుతున్నాడు అక్కడ గ్రౌండ్లోనే .. రేపు పదింటికి.

మానస : వెపన్స్ ఆ....!

అరవింద్ : లేదనుకుంటా కార్ ఎక్కించేస్తాడేమో

ఆదిత్య పుసుక్కున నవ్వాడు, అది చూసి విక్రమ్ కూడా నవ్వాడు..అరవింద్ కూడా నవ్వబోతుంటే మానస అందరిని కోపంగా చూసింది.

విక్రమ్ లేచి నిల్చొని : అరవింద్ రేపు మన సుబ్బు కార్ తో గుద్ది చంపుతాడా లేక ఆపి కార్ దిగి చంపుతాడా.. అంటే కార్ తో గుద్దితే బతికే అవకాశాలు ఉంటాయేమో చూసుకోమని నా మాటగా సుబ్బుకి చెప్పు.

అరవింద్ : నేనూ అదే చెప్పా బాంబు పెట్టి పేల్చేద్దాం లేకపోతే సుపారీ ఇద్దాం అని నా మాట వింటేగా అని నోరు జారీ తరువాత ఎం వాగాడో తెలుసుకుని మానసని చూసాడు.

విక్రమ్ ఆదిత్య నవ్వుతుంటే పక్కనే ఉన్న దిండు తీసి వాళ్ళ మీదకి విసిరింది.. కోపంగా

మానస : అయన ఒకప్పుడు చెడ్డవాడే కానీ ఆదిత్య దెబ్బకి అన్ని వదిలేసాడు, నా పెళ్లి అయ్యాక ఇంట్లోనే ఉంటున్నాడట. ఆయన మారిపోయాడంటే నమ్మరే

అరవింద్ : సుబ్బు గాడు అమ్మాయిల వెనకపడటం ఆపేసాను అనటం మీ నాన్న మంచివాడు అనటం ఈ రెండు జీర్ణించుకోలేని విషయాలు.

మానస : ఇప్పుడు మా నాన్నని కాపాడతారా లేదా

అరవింద్ : అవసరం లేదు వాడు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు

మానస : ఎవ్వరికి

అరవింద్ : శరణ్యకి, దమ్ముంటే కాపాడుకొమ్మని ఛాలెంజ్ చేసాడు.

ఆదిత్య : సుబ్బు గాడికి ఇంత ధైర్యమా.. అబ్బో.. అయితే చూడాస్లిందే

మానస : శరణ్య అంటే తన మరదలే కదా.. తను...

అరవింద్ : IPS శరణ్య మీ నాన్నతో చేతులు కలిపి వాడిని పట్టించింది.. తను కూడా తప్పుడు మార్గాల్లోనే వెళుతుంది. రేపు సుబ్బు ఎం చేస్తాడో ఏంటో చూడాలి.. ఏం ప్రసాదు

ప్రసాద్ : అవును సర్

మానస : సొంత బావనే ట్రాప్ చేసిందా, డబ్బు కోసం ఏమైనా చేస్తారా

అరవింద్ : ఈ నైట్ ఇక్కడే పడుకోండి పొద్దున్నే వెళ్లి ఆ మ్యాచ్ చూద్దురు మల్లయ్య ఏర్పాట్లు చూడు.. మీలో ఎవరైనా మందు వేస్తారా ఉంటె వచ్చేయండి. అనగానే ఆదిత్య లెచాడు.

అనురాధ : ఒరేయి మందు అంటే చాలు హుషారు వచ్చేస్తుంది.. కూర్చో

ఆదిత్య : ప్లీజ్ బంగారం.. ఈ ఒక్క రోజే

అరవింద్ : అన్ని ఇంపోర్టెడ్ మా ఫ్రెండ్ దుబాయ్ నుంచి పంపించాడు ఎప్పటినుంచో టేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు మీరు ఉండడం వల్ల అక్కషన్ కుదిరింది.. మీరు కావాలనుకున్నా మళ్ళీ ఇక్కడెక్కడా దొరకదు అనగానే విక్రమ్ కూడా లేచి నిలబడ్డాడు

మానస : విక్రమ్ ఏంటిది.. కూర్చో.. పరువు తీయ్యకు

విక్రమ్ : ఊరోళ్లం కదా.. ఎప్పుడైనా కొంచెం అంతే.. ఇంపోర్టెడ్ అంట మళ్ళి మళ్ళి మనం కొనుక్కోలేం ఒక్కసారి అలా వెళ్ళి ట్రై చేసి ఇలా వచ్చేస్తాను బంగారం.. ప్లీజ్ ప్లీజ్..

ఆదిత్య : అయినా అరవింద్ పరాయివాడా మన సుబ్బు ఫ్రెండ్ అంటే మన ఫ్రెండ్ పిలిచినప్పుడు వెళ్లకపోతే పెద్దింటివాళ్ళు ఫీల్ అవుతారు.. ఎం అరవింద్.

అరవింద్ నవ్వుతు : అవును.. మీరు కూడా రండి చిన్న బార్ రూమ్ ఉంది. ఆ పక్కనే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది కొంచెం సేపు రిలాక్స్ అవ్వండి.

అను : బైట ఒకటి ఉంది కదా

అరవింద్ : అది బైటిది.. ఇది ఇంట్లోది లేడీస్ కోసం మాత్రమే.. మీకు ఏ డిస్టర్బన్స్ ఉండదు.. ఏమైనా కావాలంటే ప్రియా ఉంది తను చూసుకుంటుంది.. ప్రియా ప్రియా

ప్రియా : అన్నయ

అరవింద్ : మేడం వాళ్ళని చూసుకో మేము అలా వెళ్లి వస్తాం.. ముందు ఏమైనా తినండి ఆ తరువాత ఎంజాయి చెయ్యండి.. ప్రసాద్ రావోయి నీకు సెపెరేట్ గా చెప్పాలా

ప్రసాద్ : సర్ నేను మీతో

అరవింద్ : గ్లాస్ లేవదా ఏంటి.. అని నవ్వాడు.. ప్రసాద్ కూడా వాళ్ళతో పాటే లోపలికి వెళ్ళాడు.

>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>

తెల్లారే మానస అందరినీ లేపింది.. తన నాన్నకి ఫోన్ చేద్దామని ఫోన్ తీసి మళ్ళీ ఆలోచిస్తూ కూర్చుంది. విక్రమ్ భుజం మీద చెయ్యి వేసి చూడటంతో మళ్ళీ ఫోన్ చేసింది.

మానస : హలో నాన్నా

శివరాం : ఇన్ని రోజులకి గాని నన్ను క్షమించలేక పోయావా, తప్పులన్నీ ఒప్పుకున్నానుగా

మానస : వాడు మీ కోసం వస్తున్నాడు.

శివరాం : తెలుసు, తప్పు నాదే తన అమ్మని తిట్టాను.. ఏడ్చాడు కానీ ఇంత సీరియస్ గా తీసుకుంటాడు అనుకోలేదు.. క్షమాపణలు చెపుతాను.

మానస : వాడు అస్సలు మమ్మల్ని కలవలేదు, కలవడు కూడా జాగ్రత్త. నేను వస్తున్నాను.

శివరాం : లేదు వద్దు నిన్నేమైనా చేస్తాద్లాడేమో

మానస : ఆ భయం అక్కర్లేదు, కానీ నాన్న నువ్వు నిజంగానే మారిపోయావా.. నిన్ను చులకనగా మాట్లాడుతుంటే చాలా బాధగా ఉంది, ఈ సారి తేడా వస్తే ఆదిత్య నుంచి నేను నిన్ను కాపాడలేను.

శివరాం : లేదమ్మా నేను మారిపోయాను, నాకు పని ఇచ్చే వాళ్ళ ఫోన్ కూడా ఎత్తడం లేదు.. అన్ని మానేసి ఇంట్లోనే ఉంటున్నాను.

మానస : మీరు గ్రౌండ్ కి వెళ్ళకండి

శివరాం : లేదు వెళతాను, ఒక వేళ ఆ అబ్బాయి అవకాశం ఇస్తే ఆ అబ్బాయికి క్షమాపణలు చెపుతాను.. నేను మళ్ళీ చేస్తాను అని ఫోన్ పెట్టేసాడు.

అందరూ గ్రౌండ్ కి వెళ్లారు శివరాం మ్యాచ్ లో పాల్గొనడానికి అందరితో పాటు గ్రౌండ్ లోకి అడుగు పెట్టాడు, చీఫ్ గెస్ట్ గా, IAS శృతి వచ్చింది. అప్పటికే శరణ్య చుట్టు వెహికల్స్ తో బందొబస్తుతో రెడీగా ఉంది, ఇంకో వైపు విక్రమ్ అలెర్ట్ గా ఉన్నాడు, ఆదిత్య మాత్రం తడిగుడ్డ ఏసుకుని చైర్ లో కూర్చుని పడుకున్నాడు.

విక్రమ్ : రేయి ఇప్పుడు పడుకున్నావేంటి

ఆదిత్య : నా వల్ల కాదు, సుబ్బు గాడు కామెడీ చేస్తాడు అని తెలుసు, కానీ వాడు సీరియస్ అయితే ఎలా ఆలోచిస్తాడో మనకేం తెలుసు, అంతగా నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడంటే వాడి జీవితంలో ఎంత కోల్పోయి ఉంటాడు, ఎన్నెన్ని చూసి ఉంటాడు.. మాములుగా అయితే బూతులు తిడితే తిరిగి తిట్టొ లేక కొట్టొ వదిలేస్తారు కానీ వాళ్ళ అమ్మని అనగానే ఒక మనిషిని చంపేంత కోపం వచ్చిందంటే వాడి సర్వసం వాడి ఎమోషన్ వాళ్ళ అమ్మే అయ్యుండాలి.. సారీ నేను వాడికి అడ్డు రాను... నా సలహా నువ్వు కూడా మెలకుండా కూర్చో.. అనగానే అప్పుడే అటు వచ్చిన మానస, అరవింద్ ఇద్దరు ఆ మాటలు విన్నారు.

విక్రమ్ : మానస అదేం లేదు..

మానస : ఆదిత్య నిజమే చెప్పాడేమో... అని కళ్ళలో నీళ్లు తెచ్చుకుంది.

ఇంతలో అరవింద్ మాట్లాడగానే అందరూ తన వైపు చూసారు.

అరవింద్ : అవును, నేను వాడిని కలిసింది వాళ్ళ అమ్మ నాన్న చనిపోయాకే.. మొదట్లో ఎప్పుడు ఒంటరిగా కూర్చునేవాడు నాలుగేళ్లు పట్టింది నాతో కాకుండా వాడు వేరే వాళ్ళతో మాట్లాడడానికి.. మొదట్లో ఎప్పుడు వాళ్ళ అమ్మనే గుర్తు చేసుకుంటూ ఉండేవాడు ఆ తరువాత మాత్రం అన్నిటికి నవ్వే వాడు. ఏమైందిరా అంటే హాస్పిటల్లో వాళ్ళ అమ్మ చివరి నిమిషంలో ఉన్నప్పుడు ఎప్పుడు నవ్వుతూనే ఉండాలని మాట తీసుకుందట.. మర్చిపోయా.. ఇన్నేళ్లు మా అమ్మ లేదన్న బాధలో అని చెప్పి ఆప్పటి నుంచి వాడికి ఆనందం వేసినా బాధ ఒచ్చినా ఏమైనా ఒక్కడే ఒంటరిగా కూర్చుని తన పర్సులో ఉన్న వాళ్ళ అమ్మ ఫోటో చూస్తూ కూర్చుంటాడు. అందుకే సుబ్బు అస్సలు ఎవ్వరి మాట వినట్లేదు ఆవేశంలో ఉన్నవాడైతే కొంత సేపటికి తగ్గిపోయి ఆగిపోతాడు కానీ వీడు అలా కాదు.

ఇంతలో ఆదిత్య కంటికి ఒక చిన్న పిల్లవాడు అన్ని కార్ల వెనుక ఏదో బూచక్రం ఆకారంలో ఉండే దాన్ని ప్రతీ కారుకి తగిలిస్తుండడం చూసి అటు వైపు పరిగెత్తాడు, అందరూ ఆదిత్య వైపు చూసేసరికి ఆదిత్య ఆ పిల్లవాడి చొక్కా గట్టిగా పట్టుకుని వాడి చేతిలో ఉన్న దాన్ని లాక్కున్నాడు అది మాగ్నెట్ లాఉంది మధ్యలో చిన్న లైట్.. అందరూ ఆదిత్య వైపు వెళ్లారు.

ఒక్క నిమిషానికి శరణ్య కూడా గుంపుగా ఉండడం గమనించి అటు వైపు వెళ్ళింది, ఈలోగా ఒక పెద్ద విజిల్ వినిపించే సరికి అందరూ అటువైపు చూసారు గ్రౌండ్ ఫెన్సింగ్ బైట ఒక నల్లటి కారు ముందు పెద్దగా రాడ్లతో బంపర్, చూస్తే అందులో సుబ్బు ఇంకా విజిల్ వేస్తూనే ఉన్నాడు. ఆదిత్య సుబ్బుని చూస్తూనే పట్టుకున్న పిల్లాడిని వదిలేసాడు, వాడు పారిపోగానే సుబ్బు విజిల్ ఆపేసి చేతిలోకి రిమోట్ తీసుకున్నాడు, అది చుసిన ఆదిత్యకి అర్ధం అయ్యి వెంటనే చేతిలో ఉన్న దాన్ని పక్కకి విసిరేసాడు అది ఆఖరి కారు కిందకి వెళ్లి పడింది. మానస సుబ్బునే చూస్తుంటే సుబ్బు రిమోట్ నొక్కేసాడు. అంతే.. అక్కడున్న ప్రతీ ఒక్క కారుకి కరెంటు షాక్ కొట్టినట్టు అద్దాలు పేలిపోయి సౌండ్స్ వచ్చాయి. వెంటనే సుబ్బు కారు నుంచి పెద్ద సౌండ్..​
Next page: Update 11
Previous page: Update 09