Update 10

కాలేజీ మొదటిరోజు, అందరం గేట్ దెగ్గర బ్యాగ్స్ తో గౌతమ్ కోసం ఎదురు చూస్తున్నాం.

చిత్ర : ఏడి రా వీడు

భరత్ : ఏమో, ఎవడితో గొడవ పెట్టుకుంటున్నాడో మహానుభావుడు

స్వాతి : వీడితో ఇదో గోల అయిపోయింది రా

సీతారామ్ : అదిగో వస్తున్నాడు అనగానే అందరూ అటు చూసారు.

బస్సులో నుంచి దిగి కోపంగా నడుచుకుంటూ వస్తుంటే వెనకాల ముగ్గురు బస్సు దిగుతూ గౌతమ్ ని చూసి అయిపోయావ్ రా నువ్వు అని వేలు చూపిస్తూ కాలేజీ లోపలికి వెళ్లారు. ఫ్రెండ్స్ ని చూడగానే మామూలు అయిపోయి పదండ్రా వెళదాం అన్నాడు

సీతారామ్ : ఎవరు వాళ్ళు

గౌతమ్ : ఓహ్.. చూసావా.. సీనియర్స్ అట

భరత్ : వాళ్ళతో నువ్వెందుకు పెట్టుకున్నావ్

గౌతమ్ : అరె ప్రామిస్, నేను వాళ్ల జోలీ పోలేదు వాళ్ళే వచ్చారు.. రాగ్గింగ్ అని ఓవర్ చేస్తున్నారు.

చిత్ర : వాళ్ళేం అడిగారు

గౌతమ్ : రోబోలో రజినీకాంత్ లా నడవమన్నారు

స్వాతి : నువ్వేం చేసావ్

గౌతమ్ : అందులో ఒక టుంబు గాడున్నాడు, వాడిలా నడిచా అందరూ నవ్వారు

భరత్ : ఎందుకురా నీకు అవన్నీ

గౌతమ్ : లోపల మా ఇంటి పక్కన అమ్మాయి ఉంది, దాని ముందు ఎదవని కావాలా, అయినా రాగ్గింగ్ అంటే కాలేజీ లోపల చేసుకోమను బైట చేస్తే ఊరుకుంటామా

సీతారామ్ : ఆమ్మో.. ఫస్ట్ రోజే పెంట పెట్టాడుగా ఈడు.. పదండి.. ఏమవుద్దో ఏమో

గౌతమ్ : ఎందుకు రా భయపడ్తావ్, నేను చూసుకుంటా లే

క్లాస్ కి వెళ్లి కూర్చున్నాం అంతా బానే ఉంది, మధ్యాహ్నం లేచి కాంటీన్ కి వచ్చి కూర్చున్నాం సీనియర్స్ ఎనిమిది మంది వచ్చి రౌండప్ చేశారు. అందులో ఒకన్న గౌతమ్ గాడి కాలర్ పట్టుకున్నాడు, వీడు మాత్రం చేతిలో ఉన్న కర్రి పఫ్ అయిపోయేవరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు.. వాళ్ళకి కూడా ఇలాంటి క్రాక్ నా కొడుకు ఇప్పటివరకు తగల్లేదేమో ఆశ్చర్యపోయారు. అప్పుడే ఫాకాల్టీ వచ్చేసరికి ఏమనలేదు కానీ మాస్ వార్నింగ్ ఇచ్చి పోయారు.

చిత్ర : భయమేసింది రా

భరత్ : నాకు ఉచ్చ పడింది

గౌతమ్ : ఎహె తొక్క.. ఏం కాదు.. అవును మేము రేపు కాలేజీకి రావట్లేదు చెప్పాడా

స్వాతి : ఏం పని.. ఒక్కరోజు కాలేదు అప్పుడే బంక్ కొడతాం అంటున్నారు.. రేయి అని సీతారామ్ ని చూసింది.

సీతారామ్ : కటింగ్ కి వెళుతున్నాం

చిత్ర : అబ్బో..

గౌతమ్ : ఏంటే.. మీకంటే పార్టనర్స్.. లైఫ్ సెట్టు.. సీతారామ్ గాడికి స్వాతి ఉంది, నీకేమో భరత్ గాడు.. మరి నాకు.. అందుకే రేపటి నుంచి మంచి అమ్మాయి మీద ఫోకస్ చెయ్యాలి.. మీ ఇద్దరి కంటే మంచి ఫిగర్ ని పట్టాలి

చిత్ర : నిన్ను భరించాలంటే పై నుంచి దిగి రావాలి.. అయినా కటింగ్ చేపించుకుంటే పడిపోతారా

గౌతమ్ : బ్రాడ్ పిట్ కటింగ్ కొట్టిస్తున్నా

స్వాతి : మరి వాడు.. అని భరత్ ని చూసింది

భరత్ : నాది కోడిపుంజు కటింగ్

స్వాతి : మరి వీడిది.. అని సీతారామ్ ని చూసింది

సీతారామ్ : నాది మామూలే బంగారం

మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్లిపోయాం, ఆ తరువాత మూడు వారాల్లో ఇద్దరమ్మాయిలని మార్చాడు గౌతమ్.

చిత్ర : ఏమైంది రా.. మళ్ళీ బ్రేకప్ ఆ..!

గౌతమ్ : అస్సలు కలిస్తే కదా బ్రేకప్ అవ్వడానికి

చిత్ర : మొదటి అమ్మాయి ఏమైంది..?

గౌతమ్ : అందం ఉంది కానీ మంచితనం లేదు

చిత్ర : మరి రెండోది..?

గౌతమ్ : మంచితనం కూడా ఉంది కానీ అది బిల్డప్ కోసమే.. యాక్టింగ్ అంతే

స్వాతి : మరి ఎలాంటి అమ్మాయి కావాల్రా నీకు

గౌతమ్ : అది తెలుసుకోవడానికే వెతుకుతున్నాను అని లేచి వెళ్ళిపోతూ అస్సలు నేనెందుకు వెతుక్కోవాలి అని మళ్ళీ కూర్చుని ముచ్చట్లలో పడిపోయాడు.

మూడు నెలలు గడిచాయి, ఈ లోపు మా చేతికి ఫోన్లు వచ్చాయి, బండ్లు వచ్చాయి.. ఒక చేతిలో సిగరెట్ ఇంకో చేతిలో బీర్ బాటిల్ అప్పుడప్పుడు సీనియర్స్ తో గొడవలు.. మాస్ బంక్లు.. సినిమాలంటూ షికార్లంటూ లైఫ్ ని పిచ్చి పిచ్చిగా ఎంజాయి చేస్తున్నాం. అప్పుడు వచ్చింది మా లైఫ్ లోకి ఒక అమ్మాయి.. పేరు నిత్య.. మార్పుని ఒక్క గౌతమ్ లోనే కాదు మా అందరిలో తీసుకొచ్చింది.

ఒకరోజు మొదటి క్లాస్ వింటుండగా న్యూ జాయినీ అని తీసుకొచ్చారు. తెల్లని చుడిధార్, పొడుగు జడ, కళ్ళలో ఏదో వెలుగు నవ్వుతున్న తన మొహం చూసి క్లాస్ మొత్తం ఫ్లాట్ అయిపోయింది. మా అందరినీ చూసి నవ్వుతూనే చాక్ పీస్ తీసుకుని బోర్డు మీదకి వెళ్ళింది. అటు తిరిగి చక చకా రాసి మళ్ళీ ఇటు తిరిగి నవ్వింది. అందరం బోర్డు వైపు చూసాం

"నా పేరు నిత్య, నేను మాట్లాడలేను.. మీరు నా గురించి ఏమైనా అడగదలుచుకుంటే అడగండి ఇలా నా సమాధానం చెపుతాను" అని రాసింది.

ఎవ్వరు ఏమి మాట్లాడలేదు, తనే మళ్ళీ బోర్డు దెగ్గరికి వెళ్లి థాంక్యూ అని రాసి వెళ్లి బెంచిలో కూర్చుంది. ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు షేక్ హ్యాండ్ ఇచ్చారు.

కాంటీన్ లో

భరత్ : రేయి గౌతమ్, ఇవ్వాళ వచ్చిన ఆ కొత్త అమ్మాయిని చూసావా

గౌతమ్ : చూసాను.. సూపర్ ఉంది కదా

సీతారామ్ : మాములుగా ఉందా ఆ అమ్మాయి

స్వాతి : రేయి

భరత్ : కానీ మూగదిపాపం.. అంత అందం ఇచ్చిన దేవుడు ఎందుకు ఇలా చేసాడో..

చిత్ర : అన్ని ఇస్తే దేవుడు ఏదో ఒకటి దూరం చేస్తాడట

గౌతమ్ : ఏమో కావచ్చు అని లేచాడు

భారత్ : ఎక్కడికి

గౌతమ్ : క్లాస్ కే..

చిత్ర : ఉండు మేమూ వస్తున్నాం

గౌతమ్ : తొందరమి లేదు, మెల్లగానే రండి.. నేను పడుకోవడానికి వెళుతున్నా అని వెళ్ళిపోయాడు.

గౌతమ్ క్లాస్ లోకి వెళ్లేసరికి, ముగ్గురు పక్క క్లాస్ అబ్బాయిలు నిత్యని ఏడిపించడానికి ట్రై చేస్తుంటే నిత్య మాత్రం అస్సలు పట్టించుకోకుండా తన టిఫిన్ బాక్స్ తింటూ ఉంది. కోపంగా చూసాడు, వాళ్ళు పట్టించుకోలేదు. వేరే ఒక అబ్బాయి వాళ్ళని వారించేబోతే వద్దని చేత్తోనే చెప్పింది. ఇక గౌతమ్ కూడా ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. కొంతసేపటికి నిత్యని ఏడిపిస్తున్న ముగ్గురికీ ఓపిక నశించి వాళ్ళే వెళ్లిపోయారు. గౌతమ్ కి అది చూడగానే నవ్వు వచ్చింది. అలానే బెంచి మీద పడుకుని తను అన్నం తినే విధానం, అప్పుడప్పుడు చెవి కిందకి సర్దుతున్న తన ముంగురులని చూస్తూ ఉంటే తన స్నేహితులు వచ్చిన సంగతి కూడా పట్టించుకోలేదు. భరత్ మరియు సీతారామ్ జంటలు నిత్యని కళ్ళార్పకుండా చూస్తున్న గౌతమ్ ని చూసి నవ్వుకున్నారు.

ఆ తరువాత గౌతమ్ ఎప్పుడు కూడా నిత్య గురించి మాట్లాడడం కానీ తన గురించి ఆలోచించడం కానీ చెయ్యలేదు, ఎదురు పడితే చూసే వాడు అప్పుడప్పుడు తన గురించి వినేవాడు. రోజూ ఎవరో ఒకరు నిత్యకి ప్రపోజ్ చెయ్యడం తను భయపడి అక్కడి నుంచి పారిపోవడం నిత్యం జరుగుతూనే ఉండేవి.

సంవత్సరం గడిచింది, సీతారామ్ వల్ల కాలేజీ క్రికెట్ లో కప్ కూడా గెలుచుకుంది. నిత్య టాప్పర్ గా నిలిచింది. స్టేజి మీద మాట్లాడమని అడిగింది యాంకర్ దానికి నిత్య నొచ్చుకున్నా స్పోర్టివ్ గా తీసుకుని నవ్వి వెళ్ళిపోయింది. ఆ తరువాత డీన్ తనకి పెర్సనల్ గా పిలిచి సారీ చెప్పారు.

ఒకరోజు అందరు కాలేజీకి వస్తుంటే పార్కింగ్ దెగ్గర చెట్టు వెనక ఎవడో నిత్య చున్నీ పట్టుకుని లాగుతున్నాడు, అది చూడగానే సీతారామ్, భరత్ ఇద్దరు అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్లారు. కోపంలో వాడి గూబ గయ్యమనేలా పీకారు. చూస్తే సీనియర్.. వీళ్ళ బ్యాచ్ కి గౌతమ్ కి అస్సలు పడదు.. ఇప్పటికి మూడు సార్లు కొట్టుకున్నారు. వాడు కోపంగా చూసి పారిపోయాడు.

చిత్ర : భయంగా ఉందిరా.. గౌతమ్ కూడా లేడు.. వాడేడి

సీతారామ్ : ఏం కాదులే.. గౌతమ్ వాళ్ళ చెల్లిని చూడటానికి ఇంటికి వెళ్ళాడు రావడానికి ఓ రెండు రోజులు పడుతుందేమో

స్వాతి : ఇంటికి వెళ్ళిపోదాం, పదండి

భరత్ : ఎహె దా.. మరి అన్నిటికి భయపడాలా.. మనం ఏ తప్పు చెయ్యలేదు

స్వాతి : రేయి ఫైనల్ గా చెపుతున్నా.. ఇంటికి వెళుతున్నాం అంతే.. ఎల్లుండి గౌతమ్ వస్తాడు అప్పుడు వద్దాం.. అని వెనక్కి తిరిగింది. మీరు వస్తారా రారా అన్నట్టు

సీతారామ్ : అస్సలు నీకు మా మీద నమ్మకమే లేదు

స్వాతి : అవును లేదు, ఏమైనా అనుకో.. ఇంటికి వెళ్ళిపోదాం పదండి అని చెయ్యి పట్టుకుంది

భరత్ : సరే సరే.. పదండి.. ఈ గౌతమ్ గాడు హీరో అయిపోయాడు రా అని నవ్వాడు

చిత్ర : అలా కాదు రా.. వాడుంటే ఆ ధైర్యం వేరే.. మీ మీద చెయ్యి పడనివ్వడు.. పదండి వెళ్ళిపోదాం అని అనగానే అందరూ వెనక్కి తిరిగారు. అంతా విన్న నిత్య వాళ్ళకి థాంక్స్ చెపుదామని చూస్తే వాళ్ళు ఇటు తల దించుకుని కాలేజీ లోపలికి వెళ్ళిపోయింది.

రెండు రోజుల తరువాత అందరూ కాలేజీకి వెళ్లకుండా బస్టండ్ లో కుర్చున్నారు, గౌతమ్ వస్తూనే ఆరా తీసాడు. అంతా విని సరే పదండి అని లోపలికి వెళ్లారు. క్లాస్ లోకి వెళ్లకముందే పదిహేను మంది సీనియర్స్ కాపలా కూర్చున్నారు. ఒక్కసారిగా అందరూ మీద పడుతుంటే సీతారామ్ నిత్యని ఏడిపించిన వాడిని చూపించాడు.

గౌతమ్ వెంటనే ముగ్గురిని నెట్టేసి వాడి కాలర్ పట్టుకుని చెంప మీద ఆపకుండా మూడు సార్లు చరిచాడు, వచ్చిన సౌండ్ కి మీద పడుతున్న అందరూ ఆగిపోయారు.

గౌతమ్ : ఏడిపించాడని కొట్టాం అంతే.. నీకు సంబంధించిన ఆడవాళ్ల చున్నీ లాగితే నేను ఏమనుకోను, ఆడంగిని, కకోల్డ్ నా కొడుకుని అనుకుంటే వచ్చి నన్ను కొట్టు అని మెయిన్ లీడర్ సురేష్ ని చూసాడు. సురేష్ కోపంగా గౌతమ్ కాలర్ పట్టుకొగానే గౌతమ్ కూడా కాలర్ పట్టుకున్నాడు. గొడవ ముదురుతున్న టైంలోనే అక్కడికి HOD వచ్చి అందరినీ డీన్ దెగ్గరికి తీసుకెళ్లాడు.

డీన్ కోప్పడుతుంటే సీతారామ్ నిత్య పేరు చెప్పేసాడు, నిత్య ఆఫీస్ రూంలోకి వచ్చింది. భయం భయంగానే ఒకసారి గౌతమ్ వంక చూసి ఆగిపోయింది.

గౌతమ్ : సార్ ఈ అమ్మాయిని ఎందుకు పిలిపించారు, అస్సలు ఈ అమ్మాయికి గొడవకి సంబంధమే లేదు.. రేయి నువ్వు ఏడిపించింది ఈ అమ్మాయినేనా అని అడగ్గానే వాడు అందరినీ ఒకసారి చూసి కాదన్నాడు. ఇంకేంటి సర్.

డీన్ : నిత్యా ఇతను నిన్ను ఏడిపించాడా లేదా

నిత్య భయపడుతూనే గౌతమ్ వంక చూసింది, గౌతమ్ అడ్డంగా తల ఊపాడు. నిత్య డీన్ ని చూసి లేదని సైగ చేసింది. డీన్ వెళ్ళిపోమనగానే గౌతమ్ వంక చూసింది. గౌతమ్ తన వంక చూడట్లేదని అక్కడ నుంచి వెళ్ళిపోయింది.


గౌతమ్ : సార్.. మేము కూడా వెళ్లొచ్చా

డీన్ : సీనియర్స్ మీతో నేను తరవాత మాట్లాడతాను అనగానే వాళ్ళు వెళ్లిపోయారు. మీరు కూడా వెళ్ళండి అని సీతారామ్ వంక చూడగానే అందరూ వెళుతుంటే.. గౌతమ్ నువ్వు కాదు.. మీరు వెళ్ళండి.. అందరూ వెళ్లిపోయారు

గౌతమ్ : ఏంటి సర్..?

డీన్ : రేయి నువ్వొచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నా.. నీ వల్ల గొడవలు జరుగుతూనే ఉన్నాయి.. రౌడీ అనుకుంటున్నావా హీరో అనుకుంటున్నావా.. గట్టిగా తొక్కితే పాస్ అవ్వడానికి ఈ జన్మ సరిపోదు. పోనీలే అని వదిలేస్తున్నా ఇంకోసారి నువ్వు నా కంట పడ్డావో నేనేం చేస్తానో నాకే తెలీదు.. ఇదే లాస్ట్ వార్నింగ్.

గౌతమ్ ఏమి మాట్లాడలేదు, ఇద్దరు కొంచెంసేపు మౌనంగానే ఉన్నారు.

డీన్ : ఇక పో

గౌతమ్ ఏం మాట్లాడకుండా వెళ్లిపోయాడు, బైట తన ఫ్రెండ్స్ అక్కడే ఉన్నారు.

సీతారామ్ : ఏమన్నాడు రా

గౌతమ్ : నా వల్ల మీరు చెడిపోతున్నారట

చిత్ర : నిజమే కద రా

గౌతమ్ : అవునా.. అని వీపు మీద గుద్దడానికి ఎమ్మట పడ్డాడు.. చిత్ర వెనుక పరిగెడుతుంటే చెట్టు కింద నిత్య ఒక్కటే కూర్చుని ఆలోచించడం చూసి ఆగిపోయాడు. అది చూసి అందరూ ఆగిపోయారు.

చిత్ర : ఏంట్రా అయిపోయిందా స్టామినా

గౌతమ్ : వస్తున్నా పదండి

చిత్ర : ఏమైంది.. అని అడుగుతుంటే భరత్ వెనక నుంచి మాడు మీద పీకాడు ఒకటి

చిత్ర : అబ్బా ఏంట్రా

భరత్ : ఇంత దద్దివెంటే నువ్వు.. అని నిత్యని చూపించాడు

చిత్ర : చూడలేదు

స్వాతి : ఏంటి వాడు సీరియస్సా.. ఇందాక ఆఫీస్ లో కూడా ఆ అమ్మాయి పేరు రానివ్వలేదు

సీతారామ్ : ఏమో.. వాడు ఏది చెప్పి చేశాడు.. కానీ కొంచెం స్లో అయ్యాడు చూసావా.. డీన్ ని అస్సలు లెక్క చెయ్యడు.. కానీ నిత్య ఉన్నంతసేపు అస్సలు ఏం మాట్లాడలేదు.

చిత్ర : చూద్దాం

గౌతమ్ చెట్టు గద్దె కింద కూర్చున్న నిత్య పక్కకి వెళ్లి కూర్చున్నాడు.. నిత్య అయోమయంగా లేవబోతే అంతకు ముందే గౌతమ్ లేచి వెళ్ళబోయాడు. నిత్య పిలుద్దామని చెయ్యి ఎత్తింది కానీ గౌతమ్ వెనక్కి తిరిగి చూడలేదు. వెళ్ళిపోతూ గౌతమ్ ఒకసారి వెనక్కి చూసాడు. నిత్య ముందుకు నడిచింది.

గౌతమ్ : కాంటీన్.. అని చూసాడు.. కానీ నిత్య మౌనంగా క్లాస్ కి వెళ్లే మెట్లు ఎక్కుతూ గౌతమ్ వంక రావా అన్నట్టు చూసింది. అర్ధమైన గౌతమ్ పరిగెత్తాడు.

నిత్య నేరుగా లైబ్రరీకి వెళ్లి అక్కడ కూర్చుని తన పక్కనే ఉన్న చైర్ చూపించింది, గౌతమ్ కూర్చున్నాడు. వెంటనే నోట్స్ తీసి చివరి పేజీకి తిప్పి పెన్ తీసుకుని థాంక్స్ అని రాసింది. గౌతమ్ వెంటనే తన బ్యాగ్ తీసి అందులోని బుక్ తీసి ఇట్స్ ఓకే అని రాసి నిత్య ముందుకు నెట్టాడు.

వెంటనే నిత్య నేను వెళ్ళాలి అని రాసింది, గౌతమ్ తన పుస్తకంలో నాతో మాట్లాడటం ఇబ్బందిగా ఉందా అని రాసాడు..

నిత్య : లేదు, కానీ నాకివన్నీ నచ్చవు

గౌతమ్ : ఓకే అయితే, బై.. మా బ్యాచ్ తో ఫ్రెంషిప్ చేస్తావా..?

నిత్య : నేను ఆలోచించుకోవాలి

గౌతమ్ తన పుస్తకంలో గట్టిగా నవ్వినట్టు ఎమోజి గీసాడు, దానికి నిత్య కళ్ళు దించిన ఎమోజి గీసి, నేను అంతే అంత త్వరగా ఎవరితోనూ కలవలేను.. ఐయామ్ సారీ అని రాసింది.

గౌతమ్ వెంటనే పరవాలేదు, బై అని రాసింది నిత్యకి చూపించి తన బ్యాగ్ సర్దుకుని లేచి వెళ్ళిపోయాడు.

చిత్ర : రేయి ఏమంటుంది అమ్మాయి

గౌతమ్ : లేదు, నేను ఊరికే మాట్లాడాను.. తను భయపడుతుంది

భరత్ : అంతే కదా..

గౌతమ్ : మీ దెగ్గర దాచడానికి ఏముందిరా.. కానీ బాగుంది

స్వాతి : అంత బాగుందా

గౌతమ్ : తన పక్కన రెండు నిముషాలు కూర్చున్నా.. అదైతే బాగుంది అని బైటికి నడిచాడు

భరత్ : క్లాస్ ఇటు

గౌతమ్ : సినిమాకి వెళదాం

స్వాతి : నేను రాను.. అటెండన్స్ లేకపోతే మా ఇంట్లో తంతారు

చిత్ర : భరత్ నువ్వు..?

భరత్ : నేను కూడా రాను.. ఇంట్రెస్ట్ లేదు

చిత్ర : సరే.. గౌతమ్.. ఉండరా వస్తున్నా

సీతారామ్ : నేను కూడా అని పరిగెత్తాడు

ముగ్గురు గేట్ బైటికి వెళ్లి ఆగారు..

చిత్ర : ఏమైంది

గౌతమ్ : వెనక చూడు వస్తున్నారు

చిత్ర : మళ్ళీ ఏమైంది అని స్వాతిని చూసింది

స్వాతి : మీరు ముగ్గురు లేకుండా మేమిద్దరం ఏం చెయ్యాలి అక్కడా.. పదండి అని ముందుకు నడిచింది. నవ్వుకుంటూ సినిమాకి వెళ్లిపోయారు.

ఆ తరువాత రోజుల్లో నిత్య మరియు గౌతమ్ ఎప్పుడు ఎదురు పడ్డా నవ్వులు విసురుకునేవారు, అందరికీ కనిపించేలా హాయి బైలు చెప్పుకోకపోయినా ఒకరినొకరు కళ్ళతో పెదాల మీద వచ్చే నవ్వుతోనే పలకరించుకునేవారు.

ఒకరోజు క్లాస్ అయిపోయాక అందరూ వెళుతుంటే నిత్య మాత్రం ఒకసారి గౌతమ్ వంక చూసి అలానే కూర్చుని ఉంది. అది చూసిన గౌతమ్ కూడా అలానే కూర్చున్నాడు.

చిత్ర : ఏరా.. అంత నచ్చిందా కాలేజీ

గౌతమ్ : రేయి ఈ మట్టి బుర్రని లక్కేళ్లండ్రా ముందు.

భరత్ : దేవుడా నా పిల్లకి యాభై కిలోల అందం ఇచ్చావ్, పావుకిలో బుర్ర మాత్రం మర్చిపోయావే అని కళ్ళు మూసుకుని దణ్ణం పెట్టాడు.. చిత్ర భరత్ భుజం మీద గుద్ది బైటికి వెళ్ళిపోయింది.

అందరూ వెళ్లిపోయారు, క్లాస్ మొత్తం కాళి.. గౌతమ్ లేచి నిత్య చూస్తుండగానే నవ్వుతూ డస్టర్ తీసుకుని బోర్డు మొత్తం తుడిచి చాక్ పీస్ తీసుకుని ఏం ఆలోచించావ్ అని రాసాడు.

నిత్య లేచి అటు ఇటు చూసి బోర్డు దెగ్గరికి వచ్చి ఇంకా టైం ఉందిగా అని రాసి నవ్వింది. దానికి నవ్వుతూ ఓకే అని రాసాడు గౌతమ్.

నిత్య బై అని రాసి వెళ్లిపోతుంటే, గౌతమ్ వెంటనే డస్టర్ తో బోర్డు మొత్తం తుడిచి చాక్ పీస్ తో గబగబా రాసాడు.. మాట్లాడుకోవడానికి కావాల్సినంత కాళి ఉంది అని.. దానికి నిత్య ఆహా అన్నట్టు చూసి కానీ టైం లేదు కదా అని రాసింది.. గౌతమ్ ఇంకేం రాయలేదు అది చూసిన నిత్య నవ్వుకుని వెంటనే తన పుస్తకం తీసి పది ప్రశ్నలు రాసి తీసుకొమ్మని గౌతమ్ ని చూసింది.. గౌతమ్ అవి చదివి వెంటనే పెన్ తీసుకుని సమాధానాలు రాయబోతూ మళ్ళీ ఆగిపోయి ఆ వెంటనే తన బ్యాగ్ లోనుంచి తన పుస్తకం తీసి అందులో ఏదో రాసి నిత్యకి ఇచ్చాడు. నిత్య బుక్ తెరిచి చదువుతుంటే ఈ సారి నోరు తెరిచాడు.

గౌతమ్ : ఇప్పుడు కాదు అని నిత్య పుస్తకం తన బ్యాగ్ లో పెట్టుకున్నాడు. నిత్య కూడా గౌతమ్ బుక్ ని తన బ్యాగ్ లో పెట్టుకుని బైటికి నడిచింది.

గౌతమ్ వెనక నడుస్తూనే ఒకసారి వెనక ఊగుతున్న పొడుగు జడని చూసి అబ్బో ఆనుకుని మళ్ళీ తల తిప్పేసుకున్నాడు.​
Next page: Update 11
Previous page: Update 09