Update 15

ఆదివారం పోదున్నే చలిలో ఆరు గంటలకి మంజుల చెప్పిన చోట నిలుచుని ఉండటం చూసి మంజుల వెళ్లి నవ్వుతూనే పలకరించింది.

గౌతమ్ : పొద్దున్నే ఇంత చలిలో స్నానం చేసి వచ్చారా.. వామ్మో

మంజుల నవ్వి, కొన్ని సంవత్సరాలగా నేను ఇలానే ఉండాలి ఆనుకుని అలవరుచుకున్న అలవాట్లు అంటూ ముందుకు నడిచింది. ఇద్దరు అన్ని చూస్తూ ముందు ఈ చివర నుంచి ఆ చివరి వరకు ఒక రౌండ్ వేశారు.

ఆ తరువాత మంజుల కూరగాయలు ఏరుతుంటే చూస్తున్నాను, నా పిన్నిని ఆ కృష్ణ గాడు అంత ఈజీగా పడేసాడు, నాకేమో తనతో మాట్లాడాలంటేనే ఇబ్బందిగా ఉంది.. ఒక మనిషిని ఏమర్చడం అంటే చాలా సులభం కానీ ఇలా చెయ్యడానికి కూడా స్కిల్ ఉండాలి అనిపించింది, మంచిదేలే నేను మరీ అంత ఎదవని కాదని నాకు తెలిసింది.

మంజుల : అయిపోయింది.

డబ్బులు తీసి ఇచ్చాను.

మంజుల : కందగడ్డ తీసుకుంటావా

మంజుల : తీసుకో....ండి

ఆమె రెండు సంచులు పట్టుకుని నడుస్తూ వెళుతుంటే, చూస్తూ నడుస్తున్నాను.

గౌతమ్ : ఇటీవ్వండి అని ఒక సంచి తీసుకున్నాను.

మంజుల : పరవాలేదు అంటూనే మొహమాటంగా ఇచ్చింది

గౌతమ్ : (చాలా బరువుంది) మీది చాలా పెద్ద ఫ్యామిలీ అనుకుంటా

మంజుల : లేదు, మేము ముగ్గురమే

గౌతమ్ : అలాగా.. అయితే చుట్టాలు వచ్చారా

మంజుల : హహ.. ఇవన్నీ మాకే.. పుదీనా పచ్చడి చేస్తాను, కూరగాయలు ఒక పూట ఫ్రై అయితే ఇంకో పూట కూర, కంకులు కొన్ని ఉడకపెడతాను కొన్ని గారెలు చేస్తాను.. కందగడ్డ కూడా.. అలా అన్ని వారానికి సరిపోతాయి అంతే.. టమాటా నేను అన్నింట్లోకి వాడతాను అందుకే కొంచెం ఎక్కువగా తీసుకున్నా

గౌతమ్ : మీ వాళ్ళని మీరు బాగా చూసుకుంటున్నారు.. మీరు గ్రేట్

మంజుల : అయినా నాకు పెద్దగా పనులేముంటాయి గౌతమ్, మా వారికి నేను ఇలా ఉంటే ఇష్టం.. మా అబ్బాయే మాతో కలవడు.

గౌతమ్ : ఏ..?

మంజుల : ఏమో.. వాడు ఈ మధ్య అస్సలు కలవట్లేదు, మా మాట వినట్లేదు.. వయసుకి వచ్చాడుగా

గౌతమ్ : సార్ ఏం చేస్తారు

మంజుల : మా సార్ ప్రైవేట్ ఎంప్లాయి, సిస్టం వర్క్ అవి చేస్తారు

గౌతమ్ : మీ అబ్బాయి, స్కూలా

మంజుల : కాలేజ్

గౌతమ్ : కాలేజీకి వెళ్లేంత కొడుకు ఉన్నాడా మీకు..?

మంజుల : ఓయి అబ్బాయి, ఇవే వద్దు

గౌతమ్ : లేదాంటి.. నిజంగానే.. నిజంగా మీకు కాలేజీకి వెళ్లేంత కొడుకు ఉన్నాడా

మంజుల : ఉన్నాడు, డిగ్రీ చదువుతున్నాడు

గౌతమ్ : మరి మీ అబ్బాయిని తోడుగా రమ్మనొచ్చు కదా ఆంటీ

మంజుల : వాడు అంత బుద్ధిగా ఉంటే నాకెందుకు ఇన్ని తిప్పలు అని ఆటో కోసం చూసింది

గౌతమ్ : నేను డ్రాప్ చేస్తా రండి అని బండి వైపు నడిచాను, కాని ఆమె రాలేదు.. నేనే బండి తీసి తన దెగ్గరికి పోనించాను.. ఆంటీ ఇది ముందు పెడతాను ఇంకోటి మధ్యలో పెట్టండి, ఇది మీరు పట్టుకుని కూర్చోండి

మంజుల : పడిపోతామేమో.. వద్దులే అంది నెమ్మదిగా

గౌతమ్ : పది నిమిషాలు ఓర్చుకుంటే పోయే.. ఆటో వాడికి ఎందుకు యాభై దండగ.. రండి

మొత్తానికి నేను చెప్పినట్టే ఎక్కి కూర్చుంది. తను భుజం మీద తడుతూ దారి చెపుతుంటే తన ఇంటికి పోనిచ్చాను.. తెల్లారి చాలాసేపైంది ఇంటి ముందు వాళ్ల ఆయన కుర్చీలో కూర్చుని కాఫీ తాగుతున్నాడు. మమ్మల్ని చూడగానే ఎదురు వచ్చి మంజుల చేతిలో సంచి అందుకున్నాడు.

మంజుల : ఏవండీ నేను చెప్పానే గౌతమ్ అని.. తనే

గౌతమ్ : నమస్తే అంకుల్

ఉండు బాబు, కాఫీ తాగి వెల్దువు

గౌతమ్ : ఇంకా బ్రష్ చెయ్యలేదండి, నేను వెళతాను అని వచ్చేసా

ఇంకో రెండు వారాల్లో ఆంటీతొ బాగానే కలిపాను పులిహోర, నేనేసిన కుళ్ళు జోకుకి కూడా తను నవ్వింది, ఇక చిన్నగా మొదలెట్టాలి అనుకున్నాను. కూరగాయలు తీసుకుని బండి మీద ఇంటికి వెళుతున్నాం

మంజుల : మీ ఇంట్లో నువ్వు, మీ రాక్షసి పిన్ని ఇద్దరేనా ఉండేది అని నవ్వింది

గౌతమ్ : హహ.. అవును, నాన్న పని మీద ఊర్లు పట్టుకుని తిరుగుతుంటారు, అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. పిన్నిని రెండో పెళ్లి చేసుకున్నాడు, చెల్లి బైట హాస్టల్లో ఉంటూ చదువుతుంది.

అంతా వినగానే మంజుల ఏదో ఆలోచనల్లోకి వెళ్ళిపోయింది, చెల్లంటే నాకు ప్రాణం ఆంటీ అని బండి నడుపుతున్నాను.

మంజుల : మరి మీ పిన్ని

గౌతమ్ : చిన్నప్పుడు తనంటే ఇష్టం ఉండేది, కానీ తనెప్పుడు నన్ను దెగ్గరికి తీయలేదు, ఆమెకి నేనంటే ఇష్టం ఉండదు అని చెపుతుండగానే మంజుల వాళ్ళ ఇల్లు వచ్చేసింది.

మంజుల మౌనంగా బండి దిగి వెళ్ళిపోతూ వెనక్కి వచ్చింది.

మంజుల : గౌతమ్ నీ నెంబర్ ఇవ్వు అనగానే ఇచ్చాను.. ఇంటికి వచ్చాక ఎప్పుడెప్పుడు తను కాల్ చేస్తుందా అని వెయిట్ చేసాను కానీ తన నుంచి కాల్ రాలేదు.. అంజు దెగ్గరికి వెళ్ళిపోయాను.

అప్పుడే జాగ్గింగ్ కి వెళ్లి వచ్చినట్టుంది ఎక్సరసైజులు చేస్తుంది, నన్ను చూస్తే వచ్చి వాటేసుకుని ఇక ఆపేస్తుందని మెట్ల మీదె కూర్చుని చూస్తున్నాను, నన్ను చూసిందో ఏమో కొంతసేపటికే వచ్చి నా ఒళ్ళో వాలిపోయింది.

అంజు : రెండు వారాలు

గౌతమ్ : పని మీద బైటికి వెళ్ళా

అంజు : అబద్దం, నువ్వు ఇంట్లో ఉన్నావని నాకు అమ్మ చెప్తూనే ఉంది

గౌతమ్ : అదేం లేదు..

అంజు : నీగురించి నాకు తెలియడం నీకు ఇష్టం లేదు కదా, మాకు నీ గురించి సీతారామ్ అన్నయ్య చెప్పిన రోజు నుంచి నువ్వు ఇక్కడికి రాలేదు.

గౌతమ్ మౌనంగా ఉండిపోయాడు

అంజు : ఏడుస్తూనే అన్నయ్య ఒళ్ళో ఒదిగిపోయి అన్నయ్యా.. నాకెందుకు చెప్పలేదు, నీ బాధని నాతో ఎందుకు పంచుకోలేదు

గౌతమ్ : అప్పుడు నీ వయసు చిన్నది, ఇప్పుడు అవసరం లేకపోయింది.. అందుకే చెప్పలేదు.

అంజు : సరేలే కానీ.. నేను ఇవ్వాళ ఇడ్లీ చేస్తున్నా దా అని లేచి చెయ్యి పట్టుకుంది

గౌతమ్ : ఏంటి నువ్వు వంట చేస్తున్నావా..??

అంజు : అబ్బా రా అన్నయ్యా అని లాగింది, ఇద్దరు రూంలోకి వెళ్లారు

గౌతమ్ : ఏంటే ఇన్ని పుస్తకాలు, రూమంతా ఇలా ఉంది.. రెండు వారాలు నేను లేకపోతే ఇలా అయిపోయింది.. ఇన్ని పుస్తకాలు ఎప్పుడు చదువుతావే.. స్టవ్ సామాను ఇవన్నీ ఎక్కడివి..?

అంజు : సీతారామ్ అన్నయ్య కొనిచ్చాడు, డబ్బులు ఇచ్చేయి.. ఇంకోటి అని లేచింది

గౌతమ్ : ఏంటి..?

అంజు : నాకొక కంప్యూటర్ కావాలి, బైట దొరికేది కాదు. లిస్ట్ ఇస్తాను నాకు ఆ పార్ట్స్ కావాలి, కంప్యూటర్ నేనే తయారుచేసుకుంటాను.

గౌతమ్ : ఒహ్హ్.. సరే.. బంగారం ఇంతకీ ఇడ్లీలంటే తినే ఇడ్లీలేనా

అంజు : నువ్వు మరీ.. అస్సలు.. పోరా..

గౌతమ్ : చట్నీ..?

అంజు : చేశా ఎప్పుడో.. నువ్వు కూర్చో అలాగా

అంజు ఇడ్లీ చేసేలోపు రూంలో అంజు చదివే బుక్స్ చూసి ఆశ్చర్యపోతుంటే పిలిచి ఇద్దరికీ ఇడ్లీ పెట్టింది.

గౌతమ్ : పర్లేదే.. నిన్ను పెళ్లి చేసుకున్నోడు ఏడవడు, వాడు బతికేస్తాడు.

అంజు : నువ్వేగా.. అని గొణిగింది

గౌతమ్ : ఎమన్నావ్

అంజు : ఏమన్నా

గౌతమ్ : ఏదో అన్నావ్

అంజు : ఏం వినిపించింది నీకు

గౌతమ్ : వినిపిస్తే ఎందుకు అడుగుతా

అంజు : నీ గురించి కాదులే.. తిను.. ఇంతకీ బాగ చేసానా, చట్నీలో ఉప్పు సరిపోయిందా

గౌతమ్ : బాగున్నాయి.. అవును ఎగ్జామ్స్ ఎలా రాసావ్

అంజు : రెండే రాసాను.. కానీ చాలా బాగా రాసాను

గౌతమ్ : మరి మిగతావి

అంజు : బ్యాక్లాగ్స్.. తరవాత సెమ్ లో రాస్తా

గౌతమ్ : కాలేజీ ఎలా ఉంది, మీ ఫ్రెండ్ ఆ అమ్మాయి పేరేంటి

అంజు : ఏ ఫ్రెండు..

గౌతమ్ : అదే ఎప్పుడు నీతోనే ఉంటుందిగా

అంజు : ఏమో.. నాకెవ్వరు ఫ్రెండ్స్ లేరు

గౌతమ్ : దీని గురించి మనం మాట్లాడాలి

అంజు : సరే కానీ.. నేనెలా ఉన్నాను చెప్పు

గౌతమ్ : ఎలా ఉంటావ్.. నా చెల్లి లానే ఉన్నావ్

అంజు : అబ్బా.. అది కాదు, రోజు వర్క్అవుట్స్ చేస్తున్నా.. అప్పటికి ఇప్పటికి తేడా ఏమైనా ఉందా అని

గౌతమ్ : కొంచెం బక్క పడ్డావ్.. కొంచెం ఆక్టివ్ నెస్ పెరిగింది.

అంజు ఉన్నట్టుండి వెంటనే గౌతమ్ పక్కన ఉన్న ఫోన్ లాక్కుంది.

గౌతమ్ : ఏంటే.. మాములుగా తీసుకోవచ్చు కదా

అంజు : ఇందాకటి నుంచి తెగ మెసేజ్లు వస్తున్నాయి.. ఎవరీ మంజుల అంటూ ఓపెన్ చేసింది.

గౌతమ్ : ఏదిటివ్వు.. అని లాక్కుని తిరిగి మెసేజ్ చేస్తుంటే అంజు లేచి తొంగి చూడబోయింది, వెంటనే గౌతమ్ ఫోన్ అంజుకి కనిపించకుండా పక్కకి తిప్పాడు

అంజు : ఎవరు తను..?

గౌతమ్ : కేసుకి సంబంధించింది, అన్ని కావాలెంటే నీకు

అంజు :హాకింగ్ నేర్చుకుంటున్నా.. ఎక్కువ చేసావనుకో నీ ఫోన్ హాక్ చేసి పడేస్తా

గౌతమ్ : అబ్బో.. సరే వెళ్ళాలి.. మళ్ళీ వస్తా బై

అంజు : హా.. అమ్మకి నా ఇడ్లీ రుచి చూపి అని టిఫిన్ బాక్స్ ఇస్తే వెటకారంగా నవ్వుతూ తీసుకున్నాడు, అంజు పిర్ర మీద చరిచేసరికి చెల్లెలి వింత ప్రవర్తన చూసి కొంచెం ఆశ్చర్యపోతూ వెళ్ళిపోయాడు.

చెల్లెలి దెగ్గరి నుంచి బైటికి వచ్చి మంజులకి ఫోన్ చేసాను.

గౌతమ్ : హలో ఆంటీ

మంజుల : హా.. నేనే గౌతమ్

గౌతమ్ : ఓకే అంటీ నేను నెంబర్ సేవ్ చేసుకుంటా.. ఏం చేస్తున్నారు

మంజుల : ఏముంటుంది, మా సర్ ఆఫీస్ కి వెళ్లిపోయారు.. కాళీ.. తినేసి కూర్చున్నా.. కొంచెం ఆగితే సీరియల్స్ స్టార్ట్ అవుతాయి

గౌతమ్ : వామ్మో

మంజుల : మీ పిన్ని చుడదా ఏంటి సీరియల్స్

గౌతమ్ : ఏమో నాకు తెలీదు

మంజుల : అదేంటి ఒకే ఇంట్లో ఉంటారుగా..?

గౌతమ్ : తన రూంలో తనకి టీవీ ఉంది

మంజుల : నీకోటి చెప్పాలి గౌతమ్

గౌతమ్ : చెప్పండి ఆంటీ

మంజుల : ఇప్పుడు కాదు, వచ్చే వారం కలుస్తాం కదా అప్పుడు చెప్తాను

గౌతమ్ : ఓకే.. ఇంకా ఆంటీ

మంజుల : సరే ఉంటాను

గౌతమ్ : ఓకే బై అని పెట్టేసాడు.. ఛ.. ఇంకొంచెం ఏదో ఒకటి గెలకాల్సింది.. ఫ్లర్ట్ చెయ్యడం కూడా రావట్లేదు అని నన్ను నేనే తిట్టుకుంటూ ఇంటికి వచ్చేసా

లోపలికి వెళుతుంటే పిన్ని హాల్లోనే కూర్చుంది, తన పక్కన బాక్స్ పెట్టేసి లోపలికి వచ్చేసా.. రెండు నిమిషాలు ఆగి నా రూంలోకి వచ్చింది.

వాణి : ఇడ్లీ..?

గౌతమ్ : అంజు చేసింది, నీకోసం పంపింది.

వాణి : అంజు టిఫిన్ వండిందా.. అని నవ్వుకుంటూ అక్కడే కూర్చుని తింటుంటే చాలా బాగా అనిపించింది, మా అమ్మకి కూడా నేను ఏదైనా చేసి పెడితే ఇలానే ఫీల్ అయ్యేదేమో.. కనీసం నిత్య ఉన్నా బావుండు నా కోసం

వాణి తింటూ బాగా చేసింది అని చెప్పడానికి కొడుకు వంక చూసింది, ఏదో తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్న తన మొహం చూడగానే అర్ధమయ్యింది బాధ పడుతున్నాడని, ఎందుకో పట్టించుకోకుండా, జోక్యం చేసుకోకుండా ఉండలేకపోయింది.

వాణి : గౌతమ్

గౌతమ్ : హా..

వాణి : జాబ్ గురించి ఏమైనా ఆలోచించావా

గౌతమ్ : లేదు.. నా సంగతి నేను చూసుకుంటాను అని మౌనంగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. వాణి చిన్నబోయింది.

ఆ తరువాత రెండు రోజులకి ఒకసారి మంజులకి ఫోన్ చేసినా రెండు నిమిషాల కంటే ఎక్కువగా మాట్లాడలేదు, నా గురించి పిన్ని గురించి ఏదో మాట్లాడాలంది.. పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోయినా దాన్ని పడెయ్యాలంటే అది చెప్పే సొల్లు వినాలి కాబట్టి ఊ కొట్టాను. ఆదివారం రానే వచ్చింది.

గౌతమ్ : ఏంటాంటి.. ఏదో మాట్లాడాలన్నారు

మంజుల : చెపుతాను, అలా వెళుతూ మాట్లాడుకుందాం

గౌతమ్ : పదండి.. అని తన పక్కన నడిచాను

మంజుల : నాకు ఒక కొడుకు, కూతురు

గౌతమ్ : అదేంటి.. కొడుకే అన్నారు

మంజుల : అమ్మాయి నేను కనలేదు.. అచ్చు నువ్వు మీ పిన్ని ఎలాగో నేను నా కూతురు అలాగా

గౌతమ్ : ఓహో.. తను ఎలా ఉంటుంది మీతో

మంజుల : తను ఇప్పుడు లేదు అంది కళ్ళు తుడుచుకుంటూ

గౌతమ్ : అయ్యో.. ఎలా ఆంటీ

మంజుల : కాలేజీలో బాంబ్ బ్లాస్ట్ వల్ల చనిపోయింది

గౌతమ్ : నడుస్తున్న నడక ఆగిపోయింది.. తన పేరు..?

మంజుల : నిత్య

అంతే గౌతమ్ అడుగు ముందుకు పడలేదు, మంజుల వెనక్కి తిరిగి చూసింది ఏమైందంటూ

గౌతమ్ : నువ్వు నిత్య పిన్నివా.. అంటే కృష్ణ నిత్య తమ్ముడా

మంజుల : నీకు నా కొడుకు తెలుసా.. నిత్య గురించి నీకెలా...?

గౌతమ్ : నువ్వని తెలిసుంటే అస్సలు నీ మొహం కూడా చూసేవాణ్ని కాదు, ఇంకెప్పుడు నా జోలికి రాకు.. అని వెళ్లిపోతుంటే మంజుల గౌతమ్ దెగ్గరికి చేరింది.

మంజుల : ఎవరు నువ్వు..?

గౌతమ్ : నిత్య నా.. నా.. అని కళ్ళు తుడుచుకున్నాడు

మంజుల : అది నువ్వా.. గౌతమ్ నాకు రెండు నిమిషాలు మాట్లాడే అవకాశం ఇవ్వు.. ప్లీజ్

గౌతమ్ : ఏం చెప్తావ్..

మంజుల : నిత్య ఉన్నన్ని రోజులు తనని నేను పట్టించుకోలేదు, కానీ తను పోయిన తరువాతే తెలిసింది తను మమ్మల్ని ఎంతగా కావాలనుకుందో మా ప్రేమ కోసం ఎంత ఎదురు చూసిందో

గౌతమ్ ఆగిపోయాడు..

గౌతమ్ : ఒక్కరోజు కూడా మీరు తనని మీ కుటుంబంలో ఒకరిగా చూడలేదు, అనాధలా బతికింది తను

మంజుల : నా తప్పులన్నీ ఒప్పుకుంటున్నాను

గౌతమ్ : ఒప్పుకుని ఏం లాభం

మంజుల : అదే నీకు చెప్పాలనుకున్నాను గౌతమ్.. నిత్య వెళ్లిపోయాకే తెలిసోచ్చింది మాకు, ఇప్పుడు నువ్వు చూస్తున్నదంతా ఆ మార్పే.. తన డైరీ చదివాకే తెలిసింది తనెప్పుడు మమ్మల్ని ద్వేషించలేదు, మమ్మల్ని కుటుంబం అనుకంది. ఆ డైరీ చదువుతూ నేను ఎంత బాధ పడ్డానో నాకే తెలుసు.. ఏ ఒక్క రోజు కూడా నన్ను తిట్టుకోలేదు నన్ను అర్ధం చేసుకుంటూనే వచ్చింది. నిత్య వెళ్లిపోయిన దెగ్గర నుంచి మనసులో బాధ.. తన జ్ఞాపకాలు వదలకపోగా తనకి కొంచమైనా ప్రేమ పంచలేకపోయానే అన్న వేదన, నా తప్పులకి నేను చేసిన పనులకి నా మీద నాకే కోపం.. అప్పుడే అనుకున్నాను నిత్యలా బతకాలని.. ఇప్పుడు నువ్వు చూస్తున్నదంతా నిత్య ఎలా ఉంటుందో ఎలా ప్రవర్తిస్తుందో అలానే ఉండటానికి ప్రయత్నిస్తున్నాను

గౌతమ్ : కావొచ్చు.. నీకు నేను ఇంత త్వరగా దెగ్గర అవ్వడానికి ఇది కూడా ఒక కారణం ఏమో

మంజుల : నీ గురించి కూడా చదివాను.. నిన్ను ఎంతలా ప్రేమించిందో

గౌతమ్ : నాకు తెలుసు అని వెనక్కి తిరిగాడు

మంజుల : ఏడుస్తున్నావా.. అని భుజం మీద చెయ్యేసి తన వైపుకి తిప్పుకుంది.. గౌతమ్ కళ్ళ నుంచి ఆగకుండా కారుతున్న కన్నీరు చూసి తను కూడా ఏడ్చేసింది. ఇదే చెప్పాలనుకున్నాను గౌతమ్.. నువ్వు నీ పిన్ని గురించి చెప్తుంటే నన్ను నేను చూసుకున్నట్టు ఉంది.. తనని దెగ్గరికి తీసుకో గౌతమ్.. రేపెప్పుడైనా ఏ కారణం చేత అయినా నీకు దూరం అయినప్పుడు నాలా ఇలా బాధని అనుభవించకూడదనే చెపుతున్నాను.. నేను చేసిన తప్పుని మీ పిన్ని చేసేలా చెయ్యకు.. నిత్య అన్ని మనుసులోనే దాచుకుంది.. నాతో ఒక్కసారి తన మనుసు విప్పి మాట్లాడి ఉంటే ఎంత బాగుండునో.. నువ్వు కూడా అలా చెయ్యొద్దు గౌతమ్

గౌతమ్ మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.. ఇంట్లోకి వచ్చి డోర్ పెట్టేసుకుని నిత్య ఫోటో చూస్తూ తన జ్ఞాపకాలు నెమరేసుకుంటూ ఏడుస్తూనే నిద్ర పోయాడు.

లేచాక ఫోన్ చూస్తే మంజుల నుంచి పదుల సంఖ్యలో కాల్స్, రాజు నుంచి రెండు, అంజు నుంచి రెండు వచ్చాయి.. ఏడ్చి ఏడ్చి పడుకున్నా కదా మనసులో ఏదో కొంత భారం దిగినట్టు అనిపించింది. ముందు అంజుతో మాట్లాడాలి.

అంజు : ఏం చేస్తున్నావ్ రా

గౌతమ్ : ఇప్పుడే లేచా చెప్పు

అంజు : ఏం లేదు ఊరికే

గౌతమ్ : ఇవ్వాళ ఇంటికి రా.. లేదులే నేనే వస్తా

అంజు : అన్నా.. ఏమైంది.. ప్లీజ్ ఏమైనా ఉంటే నాకు చెప్పు.. వదిన గుర్తొచ్చిందా

గౌతమ్ ఏమి మాట్లాడలేదు

అంజు : ఛ.. నేనే పిచ్చి దాన్ని.. నీకు గుర్తుచేసాను.. నన్ను రమ్మంటావా

గౌతమ్ : నేనే వస్తాను.. కొంచెం తోడు కావాలి

అంజు : లైఫ్ లాంగ్ ఉంటా అన్నయ్యా.. రా నా దెగ్గరికి వచ్చేయి

గౌతమ్ : హా.. అని ఫోన్ పెట్టేసి రాజుకి చేసాను.

రాజు : లేవలేదా

గౌతమ్ : చెప్పు

రాజు : మీ నాన్న కోసం ఇద్దరినీ పంపించాను కదా.. ఇద్దరి డెడ్ బాడీస్ దొరికాయి.. టార్చర్ చేసి చంపారు.. ఇక్కడే ఉన్నాను.. డాగ్స్ ని పిలిపించా ట్రేస్ చెయ్యలేక పోతుంన్నాయి.. క్లూస్ కూడా దొరకలేదు

గౌతమ్ : వస్తున్నా

Next page: Update 16
Previous page: Update 14